Saturday, October 4, 2014

'ఈనాడు' మెషిన్ సెక్షన్ కార్మికుల సమ్మె బాట!

ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఈనాడు' లో మెషిన్ సెక్షన్ కార్మికులు శనివారం నాడు సమ్మె బాట పట్టారు. జీతాలు పెంచకుండా... తమను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేందుకు యాజమాన్యం కుతంత్రం పన్నుతోందని ఆరోపిస్తూ... కొన్ని యూనిట్లలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగినట్లు సమాచారం. నోటీసు గట్రా ఏమీ లేకపోయినా... పని చేయకుండా తమ నిరసన తెలుపుతున్నట్లు తెలిసింది. ఈ నెల రెండో తేదీన (గురువారం) ఒక మూడు యూనిట్లట్లో నిరసన గళం వినిపించిన కార్మికులు... దసరా పండగ సందర్భంగా ఆఫీసుకు శలవు కాబట్టి...మర్నాడైన (శనివారం) నాడు ఈ కార్యక్రమం చేపట్టారు. 

తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని, రేపు మీ గతి కూడా ఇంతేనని మిషన్ సెక్షన్ కార్మికులు 'ఈనాడు'లో వివిధ సెక్షన్ల ఉద్యోగులను అభ్యర్ధిస్తున్నారు. అయితే, మిగతా జనాల హక్కుల గురించి వీర విప్లవ సాహిత్యంలో కాపీ కొట్టిన పదాలతో అందమైన శీర్షికలు, లీడ్ లు రాసే జర్నలిస్టులు చాలా మంది అంటీ ముట్టకుండా ఉన్నారని సాయంత్రం వరకు వార్తలు వచ్చాయి. కానీ, కృష్ణా, గుంటూరు, విజయవాడ, కరీంనగర్ లలో ఉద్యోగులు కొందరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. 

తమ పని గంటలను ఎనిమిది నుంచి ఐదుకు తగ్గించిన యాజమాన్యం... అలవెన్సులపై కోత వేసిందని, కాంట్రాక్టు లేబర్ గా తమను మార్చేందుకు కుయుక్తులు పన్నుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ రోజుకు మెషిన్స్ ఆన్ చేయబోమని కార్మికులు ప్రకటించగా... వారితో యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. 

తెలుగు జర్నలిజం లో ఒక అద్భుతమైన సంచలనం గా చెప్పుకోదగ్గ 'ఈనాడు' లో పరిస్థితులు సత్వరం సద్దుమణిగి... ప్రజల పక్షాన పోరాడే పత్రికగా అది వెలుగొందాలని కోరుకుందాం. 

3 comments:

Krishna Gudelli said...

వరంగల్ జిల్లాలోని జనగామలొ మా ఇంటికి ఈనాడు పేపర్ 09:30 కి వచ్చింది.

Anonymous said...

Eenadu..samsthala pathaname dhyeyamgaa , karmikulani egadose thuchulalu idi karnapeyamga vundavachu.....'aa rendu patrikalu" antu vishapu navvulu navvina thraastula dushta santhathi ee renditi anachivetha vunnaraa......paathrikeyulaku ee kutra telusaa....

apple said...

తెలుగు మీడియా లో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నా మీకు ధన్యవాదాలు కాని మీరు ఎపుడు ఈనాడు ని మాత్రమే టార్గెట్ చేసినట్టు పోస్ట్ లు ఇస్తున్నారు కాని సాక్షి లో ఇంతకంటే ఎక్కువగానే దారుణాలు జరుగుతున్నాయి. యూనిట్స్ ని మెర్జ్ చేయడం కోసం ఏంటో మంది ఎంప్లాయిస్ జీవితాలతో ఆడుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ లో ఉంటె యూనిట్స్ అన్ని తీసేసి ఓన్లీ ప్రింటింగ్ సెంటర్స్ గ మార్చుతూ మొత్తం మీద 5 రీజినల్ సెంటర్స్ చేస్తున్నారు. ఆంధ్ర లో 3 రాజమండ్రి విజయవాడ తిరుపతి, తెలంగాణా లో హైదరాబాద్ వరంగల్. రీసెంట్ గ ఖమ్మం మరియు కరీంనగర్ యూనిట్ లను వరంగల్ లో కలిపేసారు. అంటే ఆ యూనిట్స్ లో ఉండే ఎంప్లాయిస్ అందరు కూడా ఉన్న పలం గ అక్కడికి వెళ్ళాల్సిందే పిల్లలు స్కూల్స్ తల్లి తండ్రులు సొంత ఇల్లు అన్ని వదిలి రెండు రోజులు టైం లో వెళ్ళాలని హుకుం జారి చేసారు అంటే కాక వాళ్ళకి నచని వాళ్ళని శ్రీకాకుళం తిరుపతి ఇలా ఎక్కడికో చాలా దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీని వలన చాల మంది రేసిగ్న్ చేసి రోడ్డున పడ్డారు ప్రొడక్షన్ వాళ్ళ టైం మార్చేసారు యూనిట్స్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు అన్ని కూడా పీకేసి లారీ కి ఎక్కించి తీస్కుకెల్లారు. wageboard ఇస్తారో లేదో తెలిదు గాని ఎంప్లాయిస్ ని మాత్రం నానా యాతలు పెడ్తూ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంట జరుగుతున్నా ఈ విషయాలు మీరు పోస్ట్ చేయకపోవడం అనుమానాస్పదం గ ఉంది ఈనాడు వాళ్ళు ఎంప్లాయిస్ ని తీసేసిన ప్రతి ఒక్కరికి 20 లక్షలకు తగ్గకుండా అమౌంట్ ఇచి పంపించారు వాళ్ళ సాలరి కూడా 25000 పైనే ఉన్నాయ్ సాక్షి లో ఇచే ఆరు ఏడూ వేలకు కూడా transfers చేస్తున్నారు wageboard ఇస్తారని ఎంతో ఆశతో ఉన్న ఎంప్లాయిస్ కి ఇది నిజంగా పెద్ద ప్రాబ్లం మే .

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి