ప్రసిద్ధ హిందీ టెలివిజన్ జర్నలిస్టు రోహిత్ సర్దానా (41) శుక్రవారం నాడు ఏప్రిల్ 30, 2021 న కోవిడ్ పై పోరాడుతూ తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.
వర్తమాన రాజకీయ, సామాజిక వ్యవహారాలపై ఆయన 'ఆజ్ తక్' ఛానల్ లో నిర్వహించే 'దంగల్' అనే కార్యక్రమానికి విశేషమైన ఆదరణ ఉంది. 2017 లో ఆజ్ తక్ లో చేరడానికి ముందు జీ న్యూస్ లో పనిచేశారు. అక్కడ రోహిత్ నిర్వహించిన చర్చా కార్యక్రమం "తాల్ థోక్ కే" కూడా విశేష ఆదరణ ఉండేది. 1979 సెప్టెంబర్ 22న జన్మించిన రోహిత్ బీ ఏ సైకాలజీ చదివాక... గురు జంభేశ్వర్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. 2003లో సహారా సమయ్ లో పనిచేసిన ఆయన 2004లో జీ న్యూస్ లో చేరి యాంకర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.
రోహిత్ ఈ-టీవీ నెట్ వర్క్ లో కూడా పనిచేశారని అంటున్నారు. భారత రాష్ట్రపతి ఇచ్చే గణేష్ విద్యార్థి పురస్కార్ ను 2018 లో రోహిత్ కు ప్రదానం చేసారు. ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి తో పాటు అనేక మంది ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
అయితే...రోహిత్ మృతి వార్తను ఆజ్ తక్ రోతగా టెలికాస్ట్ చేసింది. రోహిత్ సహచరులైన మహిళా యాంకర్లు బాధాతప్త హృదయంతో ఏడుస్తూ ఆ వార్తను, రోహిత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పంచుకోవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పై ఫోటో చూడండి వార్తలు చదివే ఆ అమ్మాయి ఎంత బాధతో ఏడుస్తున్నదో! చుట్టూ మరణాలతో, అసహాయతతో దేశం అంతా విషాదంలో ఉండగా ఎంతో ప్రజాదరణ ఉన్న ఈ ఛానెల్ ఇలా యాంకర్లను స్టూడియోలో ఏడిపించి జనాల గుండెలు పిండేయడం అస్సలు బాగోలేదు. ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉండేలా చేయడం మంచిది కాదు.
టీ ఆర్ పీ ని దృష్టిలో ఉంచుకుని ఈ పనిచేసి ఉంటే మాత్రం ఇది దారుణం.
6 comments:
అసలీయన ఎన్నడూ ప్రజలపక్షాన వహించింది లేదు. ఎప్పుడూ మోదీ చంకలు నాకడమే. తన కార్యక్రమానికి ఎవరైనా లేఖలు రాస్తే, రాసినవారి మతాన్నిబట్టి ఈయన పొగరుగానో లేకుంటే వారి అభిప్రాయాలు స్వాగతిస్తూనో సమాధానాలిచ్చేవాడు. ఈయన చనిపోవడం వాళ్ళకుటుంబానికేమైనా లోటేమోగానీ, దేశానికీ, ప్రజలకూ, నిష్పాక్షిక మీడియాకూమాత్రం కాదు. May his sould not rest in peace.
అలా మాట్లాడకూడదండీ. ఎవరి అభిప్రాయాలు వారివి. మీ అభిప్రాయాలకు దగ్గరగా లేనంతమాత్రాన దేశానికే కాదు అనరాదు. నిష్పాక్షిక మైన మీడియా ఒక గగనకుసుమం. కనీసం మరణాంతాని వైరాణి అనియైనా సానుభూతి చూపటం బాగుంటుంది. శ్రీరామచంద్రుడు రావణుడు మరణించిన పిదప వైరమూ తొలగిందని ఆన్నాడు. విభీషణుడు తటపటాయిస్తుంటే రావణుడికి నీవు కాదంటే నేనే అంత్యక్రియలు చేస్తానని అన్నాడు. అదీ సముదాచారం.
అదేమిటి మరి. నరకాసురుడు మరణించాడని దీపావళి చేసుకుంటాం, హోళిక మరణాన్ని పురస్కరించుకొని హోళీ ఆడుతాం, మహిషాసురుడు మరణించాడని దసరా చేసుకుంటాం. అలా చేసుకోగూడదాండీ?
You nailed it
నరకుడైనా ఐనా మహిషాసురుడు ఐనా సృష్టినియమాలనే పరిహసించి యావత్తు చరాఅచరప్రపంచానికే పీడ కలిగించారు. అటువంటి వారి పీడ తోలగిందని ప్రజలు సంతోషించటాన్నీ కేవలం మీఅభిప్రాయాలతో ఏకీభవించనంత మాత్రాన మీకు నచ్చని వారంతా దేశద్రోహులు అని ముద్రవేసి సంతోషం ప్రకటించటాన్నీ ఒకలాగ గ్రహించరాదు కదా!
పోనివ్వండి.
మీరొక్కసారి ఆయనగారి వీడియోలు చూడండి. ఆయన ప్రజాద్రోహి. ప్రభుత్వం విదిలించే డబ్బులకోసం, టీఆర్పీలకోసం జనాలమధ్య చిచ్చుపెట్టజూసిన ఘనుడాయన. ఇలాంటివాళ్ళు ఉండడంకంటే లేకుండడమే ప్రజలకు మంచిది. కొందరుపోతేనే మిగిలినవారు ప్రశాంతంగా ఉండగలరు.
'దంగేబాజీ'ల మీద నేను జాలిచూపించలేను. పోనివ్వండి..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి