ఈ మధ్యన తెలుగు టెలివిజన్ ఛానళ్లు చూస్తున్న వారు తప్పకుండా ఒక విషయాన్ని గమనించి ఉంటారు. ఉన్నట్టుండి మన ఛానళ్లన్నీ పోటీపడి బాల్ బాడ్మింటన్ పోటీలకు ప్రాముఖ్యమిచ్చాయి. కొన్ని ఛానళ్లయితే...ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేశాయి. మాటిమాటికీ ఈ ఆటకు సంబంధించిన స్క్రోల్స్ కూడా బాగానే ప్రసారమయ్యాయి. ఛానల్ కూడా కలిగి ఉన్న పత్రికలు బాల్ బాడ్మింటన్ కు ఉదారంగా కొంత స్పేస్ కేటాయించాయి, ఎన్నడూ లేని విధంగా. దీని వెనుక కొంత కథ ఉంది.
కేబుల్ నెట్ వర్క్ సామ్రాజ్యం రాజశేఖర్ అనే ఒక వ్యక్తి గుప్పిట్లో ఉంది. ఆయన ఒక వ్యక్తి కాదు, పెద్ద శక్తి. హాత్ వే కేబుల్ వ్యవహారాలు చూస్తారు కాబట్టి ఆయనకు హాత్ వే రాజశేఖర్ అని పేరుంది. ఈ ఛానళ్ల ఓనర్లు, ఎడిటర్లు, సీఈఓ లు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికైనా దడవరు గానీ, హా.రా. అంటే మాత్రం అందరికీ దడ, ఎక్కడ లేని భయం. ఆయన అనుగ్రహం కోసం తహతహలాడే మీడియా పరిశ్రమలో కోకొల్లలు. తాడెక్కేవాడిని తలదన్నే వాడు కూడా ఉంటాడనటానికి మన హా.రా. భాయ్ గొప్ప ఉదాహరణ. ఎంత తురుంఖాన్ ఎడిటర్లయినా...హా.రా. దగ్గర వినయ విధేలతో, భయభక్తులతో మెలుగుతారు. ఆయన ఫోన్లో మాట్టాడితే తమ జన్మ ధన్యమయినట్టు భావిస్తారు. జర్నలిస్టులు తప్ప ఈ ప్రపంచంలో వేరే మేధావులే ఉండరని నమ్మే ఎడిటర్ సార్లకు సైతం హా.రా. అంటే భయం, భక్తి, చిరాకు, కోపం, పగ, అసహ్యం. అయినా పైకి మాత్రం ఆయనంటే ప్రేమ నటించక తప్పని దిక్కుమాలిన దీన స్థితి.
హా.రా. వాళ్లింట్లో చిన్న ఫంక్షన్ జరిగినా...పనులన్నీ మానుకుని అత్యుత్తమమైన బహుమానాలు కొనుక్కొని వెళ్లి వస్తారు. ఆయన్ను ఖుషీ చేయడానికి వీలైన్నన్ని పనులు ఛానళ్ల యాజమాన్యాలు చేస్తుంటాయి.హా.రా. ఇంట్లో ఆ మధ్యన ఒక బర్త్ డే ఫంక్షన్ జరిగితే ముత్యాల హారాలు, బంగారు హారాలు పట్టుకుని ఛానళ్ల యజమానులు వాళ్లింటికి వెళ్లి క్యూ కట్టారట...ఛీ...ఛా..అనకుండా.
ఎందుకంటే...మన హా.రా. తలచుకుంటే...ఛానళ్ల తలరాత, గ్రహస్థితులు మారిపోతాయి. ఆయన వద్దనుకుంటే ఛానల్ నంబర్ మార్చి...అది సోదిలోకే లేకుండా చేయగలడు. ఆయన మీట తిప్పితే...టామ్ రేటింగ్ ఢామ్మని పడిపోతుంది. అప్పుడు వాణిజ్య ప్రకటనలు రావు. ఛానల్ దివాలా తీస్తుంది. అందుకే...ఛానళ్ల ఓనర్లు, ఎడిటర్లు, సీఈఓ లు హా.రా. అడుగులకు మడుగులొత్తక...జీ...హుజూర్ అనక తప్పని స్థితి. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన కోటీశ్వరుల్లో హా.రా.ఒకరు. మా ఇంటి పక్కన ఉన్న తాజ్ కృష్ణ లో రాత్రిపూట ఆయన తీరిగ్గ్గా దొరుకుతారని తెలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దామని ప్రయత్నం చేశా కానీ పని ఒత్తిడి వల్ల మానుకున్నా.
అలాంటి మన హా.రా.అన్నయ్య...ఆలిండియా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఉన్నారు. అనుకున్నదే తడవుగా ఆయన అద్భుతంగా...ఒక జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తున్నారు. ఆయన పోటీల నిర్వహణకు ముందే అన్ని ఛానళ్ల వారికీ సందేశం వచ్చింది...మరి ఈ పోటీల కవరేజి దిట్టంగా ఉండాలని.
రాజశేఖరా...మజాకా. అన్ని ఛానళ్లు అందుకే పోటీపడి ఆ ఆటకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి. హా.రా. ను ఖుషీ చేయడానికి ఛానళ్లకు ఇంతకాలానికి మహదవకాశం దొరికింది. ఇలా ఛానళ్ల మెడలు వంచి తొడలు విరిచి అనుకున్నది చేయిస్తున్న హా.రా. ఇప్పుడు నాకు హీరో లా కనిపిస్తున్నాడు. ఆయన కలకాలం ఇలాగే వర్ధిల్లాలనీ..."ఛానళ్లూ...అన్ని ఆటలకూ ఇంతే ప్రాధాన్యం ఇవ్వాలి... " అని ఆయన ఒక హుకుం జారీ చేసి పుణ్యం కట్టుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. ఒక మధ్యవర్తి ద్వారా త్వరలోనే ఆయన్ను కలిసి టేబుల్ టెన్నిస్ కు కూడా ఏదైనా చేయవయ్యా...మహానుభావా...అని అడగబోతున్నాను. జై...హా.రా.. జై....జై...హా.రా.
5 comments:
nenu vinnanu atanigurinchi . mi varnana nijame. radha krishna tana chanal kosam babuto phone cheyiste pattinchukoledata
"..ఒక మధ్యవర్తి ద్వారా త్వరలోనే ఆయన్ను కలిసి టేబుల్ టెన్నిస్ కు కూడా ఏదైనా చేయవయ్యా...మహానుభావా...అని అడగబోతున్నాను..."
Just get him elected to some association of TT as President or some such high sounding post. Then TT shall be shown everywhere!!!!!!!
j..o..u..r..n..a..l..i..s..m?
అదన్నమాట సంగతి. ఏమిటా ఎక్కడ చూసినా అందునా న్యూస్ చానల్స్‌లో బాల్ బాడ్మింటన్ కనిపిస్తుందేమిటా అని ఆశ్ఛర్యమేసింది. ఇప్పుడు అది తీరి పోయింది.
Why did he invite Chandrababu Naidu for the prize ceremony? Is he a party guy or one of Babu's many benamis?
ilantee kundaru undaali mari
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి