ఒక పక్క మహా టీవీ వారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.....తెలుగులో కొత్తగా రాబోయే నాలుగైదు ఛానళ్లకు సంబంధించిన హడావుడి జోరుగా సాగుతోంది. యాజమాన్యాల పట్ల, బాసుగాళ్ల పట్ల, జీతంరాళ్ల పట్ల అసంతృప్తి ఉన్న జర్నలిస్టులు కొందరు వీటిలో ఉద్యోగం దొరికితే బాగని ప్రయత్నాలు ప్రారంభించగా, వీటి నుంచి ఆఫర్లు వచ్చిన జర్నలిస్టులు పోవటమా మూసుకుని ఉన్నచోటనే ఉండటమా అన్న సందేహంతో సతమతమవుతున్నారు. రాబోయే ఛానళ్లు నాలుగు కాలాల పాటు ఉండేవేనా? ఊడ్చుకుపోయేవా? తెలుసుకుని చెప్పమని మిత్రులు నాకు ఫోన్లు చేస్తున్నారు. ముందుగా రాబోతున్న ఛానళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1) V 6 (Owned by Telangana leader G.Vinod and headed by Mr.Ankam Ravi)
2) Image (Owned by Image Hospitals and headed by Mr.Narasimha Rao)
3) Tulasi (Owned by Tulasi group and headed by Mr.Bhava Narayana)
4) ABC (Owned by Abhaya Gold + one NRI and headed by Mr.Kannababu)
2) Image (Owned by Image Hospitals and headed by Mr.Narasimha Rao)
3) Tulasi (Owned by Tulasi group and headed by Mr.Bhava Narayana)
4) ABC (Owned by Abhaya Gold + one NRI and headed by Mr.Kannababu)
ఇవికాక, మరో సంస్థ ఆధ్వర్యలో niche ఛానల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో హెచ్.ఎం టీవీ ప్రోగ్రాం హెడ్ గా పనిచేసి సుజాత గారు ఛానల్ కు నేతృత్వం వహిస్తున్నారని, అది వైద్యానికి సంబంధించిన ఛానల్ అని సమాచారం.
వీటిలో కాంగ్రెస్ ఎంపీ జీ వినోద్ గారికి సంబంధించిన ఛానల్ (V 6) లో మాత్రం పనులు చురుగ్గా జరుగుతున్నాయని నాకు తెలుసు. అక్కడ నియామకాలు పూర్తయ్యాయి. విజయవాడ కేంద్రంగా ఒక ఛానల్ రాబోతున్నదని, దానికి అంకబాబు అనే సీనియర్ జర్నలిస్టు అంకురార్పణ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని నేను గత ఫిబ్రవరిలోనే ఒక పోస్టు రాశాను. దానికి అంకబాబు గారు కూడా సమాధానమిచ్చారు. అది ఎట్టకేలకు రూపు దిద్దుకోబోతున్నది.
ఇకపోతే...ఈ ఛానళ్లలో చేరవచ్చా? అన్నది అశావహులైన జర్నలిస్టుల ముందున్న కీలక ప్రశ్న. దీనికి సంబంధించి నేను రెండు రోజులుగా పరిశోధన జరిపాను. వ్యక్తులను పట్టుకుని కాకుండా...నేరుగా యాజమాన్యంతో సంప్రదించి జర్నలిస్టులు పెద్ద పదవులకు వెళ్లడంలో తప్పు లేదు. రిస్క్ చేసినప్పుడే నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి. ముందుగా పెట్టుబడిదారులకు సంబంధించిన వివరాలు, వారి అజెండాలు తెలుసుకోకుండా తొందరపడకండి. ఇక్కడ చెప్పుకోక తప్పని దిక్కుమాలిన విషయం...కులం. దీని గురించి కూడా ఆలోచించుకుని ముందుకు సాగండి. విజయీభవ. ఇదిలా ఉండగా మహా టీవీ జర్నలిస్టులకు జీతాలు అందడంలేదని ఒక మిత్రుడు మెయిల్ పంపాడు. ఆ లేఖ దిగువ ఇస్తున్నాను. యాజమాన్యం వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ఈ బ్లాగ్ అభ్యర్ధిస్తున్నది.
మహా టీవీ ఉద్యోగి పంపిన మెయిలు
హయ్ రాము గారు
చాలా రోజుల నుండి మీ బ్లాగ్ ని ఫాలో అవుతున్నాను,..అందుకే మీకు ఈ మెయిల్ రాస్తున్నాను..మహాటివి ఉద్యోగుల ఆకలి కేకలు మీ దృష్టికి తీసుకువస్తున్నాను..గత మూడు నెలలుగా మహాటీవి యాజమాన్యం జీతాలు సరిగా ఇవ్వక ఉద్యోగస్తులను ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందో వారికే తెలియదు..జీతాలు ఇప్పుడు ఇస్తారో చెప్పరు..అందురు సంక్రాంతి పండుగ చే్సుకుంటే మేము మాత్రం టీవిల్లో అరిసెలు జంతికలు చూసి నోరు చప్పరించుకుని కాలం వెళ్ళదీస్తున్నాము..కొన్ని చానల్ సిబ్బంది ఈ వారంలో జనవరి జీతం కూడా తీసుకుంటుంటే మేము మాత్రం డిసెంబర్ నెల జీతం ఇంకా తీసుకోలేదు..కానీ వార్తల విషయంలో మాత్రం అందరి కంటే ముందు ఉండాలి..కానీ జీతాలు మాత్రం మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాము అనే పాలసీ.. జేబులో వంద ఉంటే ఎక్కడ అయిపోతాయో అని అపొలో దగ్గరకి వెళ్ళి పది రూపాయిలు ఇచ్చి నాలుగు అరటిపండ్లు తిని ఆకలి చంపుకుంటున్నాము..రూం రెంట్ కట్టలేక రాత్రి పూట ఇండ్లకు సరిగా వెళ్ళని ఉద్యోగస్తులు ఎందరో ఇది ఇలా ఉంటే జీతాలు ఇవ్వక పోగా కొత్త చానల్ అదేమి అంటే దానికేమి పెద్ద పెట్టుబడి పెట్టలేదు అంటారు ..అలానే సినిమా పంక్షన్ లి డబ్బులు ఇచ్చి మరీ కొంటున్నారు..మమల్నిమాత్రం పస్తులుంచుతున్నారు..కాబట్టి మా బాధను మీ బ్లాగ్ ద్వారా పంచుతారని ఆశిస్తున్నాను.

3 comments:
ఒక్క మహా ఛానల్ అనే కాదు..స్టూడియో న లో కూడా అదే పరిస్తితి..ప్రతి నెల 20 నా కానీ జిటలు ఇవ్వరు. ఇక్కడ నుంచి వలసలు మొదలయ్యాయి..కాకపోతే కొత్త ఛానల్ కి కాకుండా ఆల్రెడీ ఉన్న రెండో తరం చానల్స్ లోకే వెళ్తున్నారు..ప్రతిభ అనే anchor , inews లో జాయిన్ అయింది..మరో శ్రీ కూడా జాయిన్ అవబోతుందిట.. ఇక హెచ్ ఏం ఛానల్ పరిస్తితి రామ్ గారు చెప్పాలి..జీ 24 లో కూడా కొంతమంది ని ఇబ్బంది పెడుతూ..తెలంగాణా వాదులని మాత్రం బాగా మేపుతున్నట్లు తెల్సింది..ఐ న్యూస్ లో నరేంద్ర చౌదరి హయం మొదలైఐన తర్వాత టంచన్ గా జీతాలు పడుతున్నాయి.ట ...నిజమెంతో ?
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే..జీతాలు ఎంత తోన్చన్ గా పడుతున్నా...గొర్రె తోక జీతాలే ఇస్తూ ఉద్యోగులని మానసికంగా వేధిస్తున్నారని వినికిడి..కొత్త గా వాసుదేవన్ రావడంతో జీతాలు పెరిగాయత..ఐతే ఈ పెంపు అందరిలో నిరాస మిగిల్చింది..ఇక మరో మూడేళ్ళ దాకా జీతాలు పెరగవని dicide అయ్యారక్కడ employees ఇది నిజం....ఈ మధ్యే మొదలయ్యే కొత్త చానల్స్ ని బూచి గా చూపించి అన్నీ departments బాగా జీతాలు పెంచిన్చుకున్నారట..అయినా అక్కడ నుంచి వీ సిక్స్ కి వలసలు పెరుగుతూనే ఉన్నాయి...ముఖ్యం గా టెక్నికల్ టీం , గ్రాఫిక్స్ టీం ఓ రెండు మూడు రోజుల్లో తట్ట బుట్ట సర్డుకున్తున్నట్లు నిఖార్సైన సమాచారం.. కొన్ని రోజుల్లోనే అక్కడ డెస్క్ లో talented అని ఎవరైనా ఉంటే..వాళ్ళంతా ఖాలీ అవడం ఖాయం..తులసి, వీ సిక్స్ ఈ రెండు చానల్స్ ఇక్కడి డెస్క్ లో వాళ్ళపై , టెక్నికల్ టీం పై కన్నేసాయని తెలుస్తుంది...
ఇక అబన్ ఆంద్ర జ్యోతి ..ఎదిఅన చేయగల సత్తా ఉంది కూడా...దీని ranking ఎప్పుడూ అట్టడుగునే .ఈయన కూడా ఈ మధ్యే anniversiry ని పురస్కరించుకుని జీతాలు పెంచారు..ఇక్కడ కూడా ప్రతి నెల 12 నే పడేది.. ఎంత మంది కొత్త anchors మారిన rating మాత్రం మారని ఏకైక ఛానల్..ఇక్కడ వరకు salaries ఇబ్బంది లేదు..ఇక ఏకైక తెలంగాణా ఛానల్ లో జీతాలు తక్కువైన సరిగ్గానే ఇస్తున్నారని తెలుస్తోంది..
ABC ఛానల్ లో పని చేయాలంటే మీరు విజయవాడ లో ౧౨ వేలకి చేయాలి..అది ఇది అని ఏది లేదు..ఎ డిపార్టుమెంటు అయిన సరే..
V6 కూడా ANTEH..వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వరకు 20 .30 ..మిగత ఎవరిఅన 20 వేల లోపే
తులసి, ఇమేజ్. చానల్స్ దుకాణం ఇంకో రెండు నెలల వరకు ఖచితం గ తెరవరు..
ఇది మా దగ్గరున్న సమాచారం ...సో మీడియా మిత్రులు మీరెక్కడ సూట్ అవుతారో తెలుసుకోండి..
daya chesi andaru local channels ki jump ipondi ................hari z24 tirupathi stringer
స్టూడియో-న లో ఓ 12 మందిని తిసేసారట..ఎప్పటినుంచో ఆ ఛానల్ ని నమ్ముకుని బతుకు పోరాటం చేస్తుంటే..ఇలా ఉన్నట్లుండి తీసేయడం..ఎంత ఘోరం..మీడియా మిత్రులు ఎవరూ దిన్ని ఖండించకపోవడం దారుణం..ఈ ఛానల్ యాజమాన్యాల నీచమైన బుద్ధి ని విమర్సించని జర్నలిస్తులెవరికి..రేపటి నుంచి సమాజం లో చెడు ని విమర్శించే హక్కు లేదు..అనవసరం గా యాగీ చేసి..బిల్డ్ అప్ ఇవ్వొద్దని నా మనవి ..ముందు ఈ గురివింద మనస్తత్వాల నుంచి బయట పడి..జనం గురించి రాయండి..జనాన్ని ఉదహరించడం కాదు ముందు మనల్ని మనం ఉద్దరించుకుందాం..
regency సిరామిక్ ఫ్యాక్టరీ తగలబడి ..యజమాని ఎదుస్తున్నాడని కాదు..కార్మికుడు చనిపోయారని కాదు..ముందు మనవాళ్ళ సంగతేందో చూడండి ...........జర్నలిస్ట్ బతుకు కుక్క బతుకు అయిపోయిందని నేను అంటే, ఎవరూ చించుకోవద్దు..ఆ చించుకునే వాళ్ళని ఉన్నట్లుండి ఉద్యోగం నుంచి పికి పారేస్తే అప్పుడు తెలుస్తుంది..ఎవరూ పిలిచి ఉద్యోగం ఇస్తే వాళ్ళ దగ్గరకి వెళ్ళటం..వాళ్ళిష్టం వచినన్నాళ్ళు ఉన్చోకోవడం తర్వాత తరిమేయడం..ఛి ఛి...మురుగు కాల్వ పై సద్ది పునుగులు అమ్ముకోవడం నయం అన్పిస్తుంది..నా స్పందన మీకు నచ్చకపోతే ..వేయి దండాలు
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి