డియర్ ఫ్రెండ్స్,
ఇదొక విషాద ఘట్టం.
ఈ బ్లాగులో చాలా సార్లు నా ఫోన్ నంబర్ ఇచ్చాను. పలువురు నాతో ఫోన్ లో మాట్లాడారు. అయితే...ఈ ఉదయం మా అబ్బాయిని లాల్ బహదూర్ స్టేడియం కు తీసుకుపోయినప్పుడు నా మొబైల్ పోయింది. Nokia E-63 అది. March 2, 2011 నాడు మా పెళ్లి రోజు సందర్భంగా బైటికి డిన్నర్ కు తీసుకుపోయి....నా భార్య మా పిల్లలిద్దరికి కూడా తెలియకుండా నాకు ప్రేమతో ఇచ్చిన surprise gift అది.
ఇదొక విషాద ఘట్టం.
ఈ బ్లాగులో చాలా సార్లు నా ఫోన్ నంబర్ ఇచ్చాను. పలువురు నాతో ఫోన్ లో మాట్లాడారు. అయితే...ఈ ఉదయం మా అబ్బాయిని లాల్ బహదూర్ స్టేడియం కు తీసుకుపోయినప్పుడు నా మొబైల్ పోయింది. Nokia E-63 అది. March 2, 2011 నాడు మా పెళ్లి రోజు సందర్భంగా బైటికి డిన్నర్ కు తీసుకుపోయి....నా భార్య మా పిల్లలిద్దరికి కూడా తెలియకుండా నాకు ప్రేమతో ఇచ్చిన surprise gift అది.
దాన్ని నేను స్టేడియం కు తీసుకుపోలేదని, పోతూ పోతూ టీ వీ పక్కన పెట్టి పోయానని నా నమ్మకం. మరి ఆ తర్వాత ఒక పని మనిషి మాత్రమే ఇంట్లోకి వచ్చింది. నేను ఇరవై ఏళ్ళ కిందట నవీన్ నగర్ లో ఉన్నప్పుడు...మా పెళ్ళైన కొత్తల్లో మా ఇంట్లో మనిచేసిన ఆమె కాబట్టి...కొడుకులు చూడడం లేదన్న సానుభూతితో...నాలుగు డబ్బులు ఇవ్వవచ్చని హేమ ఆమెను పనిలో పెట్టింది. పొద్దున్న వచ్చి బైట ఊడ్చి, నీళ్ళు చల్లి పోతుంటూ వుంటుంది. నాతో కలిసి టీ తాగుతూ మాట్లాడుతుంది...రామయ్యా అంటూ. అలాంటి ఆమె నా ఫోన్ తీసుకుంటుందని నాకైతే అనిపించడం లేదు. కానీ...ఆమె credentials బాగా లేవని నాకీ మధ్యనే కాలనీలో కొందరు చెప్పారు. కాబట్టి....ఇప్పుడు నేను డైలమా లో పడ్డాను.
మీలో టెక్నాలజీ బాగా తెలిసిన వారు...ఫోన్ ను ట్రాక్ చేయడం లో అనుభవం ఉన్నవారు నాకు సహకరిస్తే...ఖైరతాబాద్ చౌరస్తా లో ఉన్న ఇరానీ కఫే లో మీరు తిన్నన్ని ఉస్మానియా బిస్కెట్స్ తినిపించి, తాగినన్ని టీలు తాగిస్తాను. మొదటివి ఇష్టం లేవు, రెండో పార్టు మాత్రమే రాత్రివేళ వేరే చోట కాస్త తీరిగ్గా స్వీకరిస్తామనే వారిని కూడా ఈ విషయంలో నిరుత్సాహ పరచవద్దని అబ్రకదబ్ర చెప్పాడు. పది వేల రూపాయల ఫోను మరి. పైగా ప్రియురాలి బహుమానం.
హేమ మాత్రం...గూగుల్ తిరుమల్ రెడ్డి గారికి ఫోన్ చేయమని పొద్దటి నుంచీ చంపుతున్నది. తిరుమల్ గారు గానీ...మరెవరైనా ఆదుకుంటామన్న నమ్మకం ఉంటే స్పందించండి. థాంక్స్.
14 comments:
IMEI నెంబర్ బ్లాక్ చేయించండి..అలానే..పోలీసు కంప్లైంట్ ఇస్తే..లాస్ట్ కాల్ ఎక్కడ నుంచి వెళ్ళింది.,.వగైరా వివరాలు అడిగి ,,మీ ఫోన్ మీకు వెనక్కు రావడం లో సాయపడతారు..కానీ ఫోన్ పోయింది అని చెప్పక..పనిమనిషి పై అనుమానం ఉందని తెలీని వ్యక్తి ని బాడ్ చేయడం బాగాలేదు..నిజంగా ఆమె తీస్తే..గట్టిగ కనుక్క్కోంది..ఓ వేళ ఆ ఫోన్ ఇంకెక్కడో పోయి ఉంటె..( ఇదంతా మీరు ఇక్కడ రాయడం వల్లనే చెప్పే అవకాసం మాకు కలిగిందనే విషయం గమనించండి) పని మనిషి అనగానే..దొంగలనే ఫీలింగ్ మీరు నిజం చేసిన వాళ్ళవుతారు..అలానే రేపటి నుంచి ఆమె మీ దగ్గర పని కంటిన్యూ చేసిన అదే అనుమానం చూపులతో చూస్తూనే ఉండాలిగా..అర్జెంటు గా నెంబర్ కి కాల్ చేయండి...కంప్లైంట్ ముఖ్యం..లేదంటే ఫోన్ ఏ ఏరియా లో ఉన్నా మీరు చేయగలిగిండెం ఉండదు..ఫోన్ పని చేయకుండా చేయడం తప్ప.....
MUNDU MI NUMBER IVVANDI IKKADA CALL CHESI TRY CHEDDAM
అయ్యా...నేను వున్నది వున్నట్టు రాసాను. ఈ జనరలైజేషన్ చేసి చంపకండి.
ఫోన్ నంబర్: 9553586111
annayya, meeru etuvanti tracking software install cheyyakapote kanukkovadam kashtam. disappoint chestunnaanani anukovaddu kaani tirigi raavadam kashtam.
For GSM Phones
1. Call up the "Customer Care" helpline of your airtime provider and ask them to deactivate the SIM.
2. Call up the police. Submit them the IMEI number of your phone (which you should have noted before the theft).
ur phone is already switched off..so..better to lodge a complaint as early as possible.
రాము గారు వొక చొప్పదంటు ప్రశ్న .
మీకు ఆ బహుమతి మీ ప్రియురాలు
మీ భార్య పిల్లలకి కూడా తెలీకుండా
ఇచ్చిందని రాసారు ? యిప్పుడు తెలిసి పోయిన్దికదా?
యిప్పుడు ఫోన్ పోయి ,గుట్టు రట్టయితే ఎలా ?
హ హ హ రాము గారు మీరు రాసింది మరొక్క సారి చదువు కొండి
నే అన్న అర్ధమే వస్తోంది . వొక్క కామ లేక పోవడం వల్లా?
వొక కామ మీ జీవితాన్నే మార్చేస్తుంది .
మా ఇంటావిడ నెక్లెస్ ఇంట్లో ఉన్నది ఉన్నట్టుగా పోయింది! ఏం చేస్తాం, ఎవరిని అనుమానించాలో తెలియదు. పని పిల్ల కిందటి 14 సంవత్సరాలుగా పని చేస్తోంది..
imei నంబర్‌ను cop@vsnl.netకు పంపి చూడండి.
http://www.namase.com/mobile-tips-tricks/how-to-track-lost-mobile.shtml/
మీ అందరికీ థాంక్స్.
రవి గారూ...మీరు భలే వారు సార్. నా భార్యే నా ప్రియురాలు. నా ప్రియురాలే నా భార్య. ఆమే నా జీవితాన్ని మార్చేసింది. సిమ్మొక లెక్కా...
అది ఆఫీసు వారిచ్చిన సిమ్ము. ఈ రోజు దాని వ్యవహారం చూస్తాను.
రాము
Ramu Gaaru try thissss
http://www.techcular.com/block-lost-mobile-imei-no/
If u Lose your Mobile,
Report to: cop@vsnl.net or 044 - 23452316.
They trace your mobile location even your mobile is switched off.
నాదీ దాదాపు మీలాంటి కేసే నండి. కాకపోతే మీ మొబైలు మీతో ఓ సంవత్సం పాటు ఉంది. నాది, కొన్న మొదటివారంలోనే ఆఫీసులో పోయింది. అది కూడా ఇ63.
పైన ఆత్రేయగారు చెప్పింది కూడా చేసాను ఫలితం మాత్రం లేదు. మీకు పోలీసుల్లో పరపతి ఉంటే, ఐ.ఎం.ఇ.ఐ. నంబరుతో ప్రయత్నించవచ్చు. ఏదేమైనా, పోలీసు కంప్లైంటు ఇవ్వటం మంచిది. ఎందుకంటే, మీ మొబైలు సంఘవిద్రోహుల చేతుల్లో పడితే, రేపు అనవసరమైన చీకాకులు లేకుండా ఉండొచ్చు.
Sir jee
పది రోజులుగా మీ బ్లాగు సందర్శించలేదు. మీ ఫోన్ పోయిన విషయం ఇప్పుడే చదివా. ఫోన్ బ్లాక్ చేయించే సాంకేతిక నైపుణ్యం నాకు లేదు. కాకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయించి నోకియా కంపెనీకి ఇచ్చి, అది మీ ఫోన్ అనేందుకు తగిన సాక్ష్యాలు (బిల్లు వగైరా) ఇస్తే వారు దాన్ని ట్రాక్ చేస్తారని మాత్రం తెలుసు. కాని ఇదంతా పోలీసు డిపార్ట్మెంట్ వారే చేయాల్సి ఉంటుంది మనం చేయడానికి ఏమి లేదు.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి