Wednesday, January 25, 2012

....ISJ ప్రింట్ జర్నలిజం ఇంగ్లిషు బ్యాచ్ లో చేరండి....

వ్యాపారం కొద్దిగా ముడిపడివున్న అంశానికైనా ఈ బ్లాగును వాడుకోవడం తప్పని సంకల్పం చెప్పుకున్నా గానీ పలువురికి ప్రయోజనం కలిగే అంశం కావడంతో ఈ పోస్టు రాస్తున్నాను. ఇది...ఇంగ్లిషు కాస్త వచ్చి తెలుగులో కుమిలిపోతున్న జర్నలిస్టులకు మేలు చేసే అంశమని భావిస్తున్నాను.

తెలుగులో ఉన్న చాలా మంది జర్నలిస్టులకు ఇంగ్లిషు బాగానే వస్తుంది. కానీ వారిలో కొరవడిన ఆత్మవిశ్వాసం వల్ల ఇంగ్లిషు జర్నలిజం వైపు చూడరు. నేను "ఈనాడు జర్నలిజం స్కూల్" లో చేరి...కీలకమైన జనరల్ డెస్క్ లో పనిచేశాను. అక్కడ ఇంగ్లిషు వార్తలను అనువదించాల్సి ఉండేది. ట్రాన్స్ లేషన్ అంటే...ఒక కాపీ చూసి మక్కీకి మక్కీగా అనువదించడం కాదు. కుప్పలు తెప్పలుగా వచ్చిన న్యూస్ ఏజెన్సీ కాపీలను చూసి, చదివి, అవసరమైన భాగాలను తీసుకుని, కుదించి అనువదించాలన్న మాట. అది నాకెంతో ఉపకరించింది. అలా మెరుగుపరుచుకున్న భాషా పటిమతో ఇంగ్లిషు జర్నలిజం వైపు వెళ్దామని నిర్ణయించుకుని హేమ (నా భార్య), మూర్తి (తమ్ముడు) ప్రోత్సాహంతో "ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం" కు వెళ్లి తర్వాత...'ది హిందూ'లో ఒక ఎనిమిదేళ్లు పనిచేశాను. నేను 'ఈనాడు'లో ఉన్నప్పుడు..."ఆంగ్లం కాదు కఠినం-ముఖ్యం నిత్య పఠనం" అన్న శీర్షికతో ఆ పత్రిక వారి 'సమీక్ష' పత్రికలో రాశాను. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. మినిమమ్ ఆంగ్ల ప్రవేశం ఉన్నవారు ఒక్క ఆరు నెలలు నేను చెప్పినట్టు కష్టపడితే వారిని మంచి ఇంగ్లిషు జర్నలిస్టుగా నేను చేయగలనని గట్టిగా నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే Indian School of Journalism  లో కొత్తగా PG Diploma in Print Journalism అనే కోర్సు ప్రారంభిస్తున్నాను. ఇది పూర్తిగా English medium course. కాల వ్యవధి ఏడు నెలలు.

తెలుగు జర్నలిజం లో పెద్దగా ఎదుగుదల లేదనీ, అక్కడి వ్యవహారం భావిలో కప్ప కన్నా ఘోరమనీ, కులం..భావాలు..తెలివితేటల పరంగా మనకు అక్కడ అనువైన వాతావరణం లేదని నమ్మేవారు ఈ అవకాశాన్ని వాడుకోండి...మీకు ఇష్టమైతే. సాధారణ విద్యార్థులతో పాటు తెలుగు జర్నలిజంలో ఐదారేళ్ల అనుభవం ఉన్న వారు ఈ కోర్సులో చేరవచ్చు. అయితే...ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రం వదులుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో బాగా అనుభవం ఉన్న వారు శిక్షణ ఇస్తారు. నేను నాకు తెలిసిన విషయాలను పంచుకుంటాను. మొదటి విడతగా ఇప్పటికే కొంత మందిని ఎంపిక చేశాము.

మీకు ఆసక్తి ఉన్నా...మీకు తెలిసిన వారి పిల్లలకు కోర్సు ఉపకరిస్తుందని మీరు భావించినా...ఫిబ్రవరి ఫస్టున ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో మేము నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. యువ జర్నలిస్టులకు ఇదొక మంచి అవకాశమని నేను అనుకుంటున్నాను. మా శిక్షణలో రాటుతేలిన వారికి ఇంగ్లిషు జర్నలిజంలో మంచి అవకాశాలు తప్పక ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆసక్తి గల యువ జర్నలిస్టులు మీ పెద్దలను, కుటుంబ సభ్యులను, సన్నిహితులను సలహా అడిగి...ఫిబ్రవరి ఫస్టున ఉదయం పదిన్నర కల్లా అణుపురం కాలనీలో ఉన్న మా ఆఫీసుకు రండి. స్పాట్ అడ్మిషన్ లో పాల్గొనండి. అయితే....కనీస స్థాయిలో ఇంగ్లిషు వచ్చిన వారే ఈ సాహసం చేయండి. మరిన్ని వివరాల కోసం హెచ్. ఎం టీవీ లో వచ్చే స్క్రోల్ చూడండి. ఆల్ ది బెస్ట్. 
Graphic courtesy:
armenianweekly.com

7 comments:

Anonymous said...

రామూ గారూ
ప్రస్తుతం జాబు చేస్తున్నవారు ఎందుకు మానాలి. ఉద్యోగం చేసేవారికి కూడా అనుకూలంగా ఉండేలా
ప్లాన్ చేస్తే బాగుండేది కదా..

Prashant said...

Mr.Ramu,is it lawful to use the term INDIAN to your institute and that too for a profit making institute...Iam not sure of the rules and regulations but can anyone use the terminology INDIAN or NATIONAL at their own will and wish...

Ramu S said...

అక్షర గారూ...
ఆరు నెలల తక్కువ వ్యవధిలో నేర్చుకోవాలంటే...వెనక ఎలాంటి చీకూచింతా ఉండకూడదు. ఉద్యోగం, చదువు వెలగబెట్టటం చాలా కష్టం. నైట్ షిఫ్ట్ చేసిన సబ్ ఎడిటర్ ను మర్నాడు ఉదయం క్లాసులో డీల్ చేయడం చాలా కష్టం. వారి బుర్ర కూడా పనిచేయదు. ఆసక్తిగల జర్నలిస్టులు దొరికితే వారికి వీలున్న టైంలో బోధించేలా ఒక కోర్సు చేయాలని ఉంది కానీ అది అసాధ్యమేమో అనిపిస్తోంది.

ప్రశాంత్ గారూ...
నిజమే, దీని మీద తర్జన భర్జన జరిగింది. నాకు ముందు హెడ్ గా ఉన్న రామానుజమ్ అనే పెద్ద జర్నిలిస్టు గారు ఆ పేరు ఖరారు చేసి లక్షల కొద్దీ ఖర్చు చేసి ప్రచారం చేశారు. నేను ఇప్పుడు దాన్ని మార్చలేను. అయినా...చాలా సంస్థలు ఇండియన్ అని వచ్చేలా పెట్టుకుంటున్నాయి...రూల్స్ బుక్ ఘోష ఎలా ఉన్నా...
రాము.

ddtv said...

journalism intrest unna NRI lu cheyatagga (online lantivi) course leu emaina unnaya sir?

Ramu S said...

ddtv...
I am planning to introduce a course soon.
Ramu

ddtv said...

thank you sir please let me know.

Pavan said...

నమస్కారం రాము గారు. మీ బ్లాగును ఎప్పుడు టంచంగ ఫాలొ అయ్యే నేను గత రెండు నెలలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఫాలొ అవలేకపొయాను. ఫలితంగ ఐఎస్జే నొటిఫికేషన్ చూడలేకపొయాను. సొ ఇప్పటికైనా ఐఎస్జే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లొ చేరే అవకాశం ఏమైనా వుంటె ఆ వివరాలను తెలుపగలరు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి