"సాక్షి" ఛానల్ నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు దాని యాజమాన్యం గట్టి చర్యలు తీసుకుంది. కార్యక్రమాల నాణ్యత పెంచి ఛానల్ ను జనరంజకంగా మార్చేందుకు, టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్ డీ టీవీ సహాయం తీసుకుంటోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక బృందం సాక్షి ని సంస్కరించే పనిలో నిమగ్నమై ఉంది.
రిపోర్టింగ్ కు మెరుగులు దిద్దేందుకు ఎన్ డీ టీవీ బృందం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా రిపోర్టర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్టోరీ నిడివి, అందులో ఉండాల్సిన ఎలిమెంట్లు, ప్రత్యేకతలు, కాపీ ప్రాధాన్యం వంటి అంశాలపై ఆ బృందం మెలకువలను నేర్పుతున్నది. జగన్, ఆయన రాజకీయ పోరాటం, సీ బీ ఐ దాడుల వంటి వ్యవహారాలు ఎలా ఉన్నా...ఛానల్ ను, పత్రికను బాగా తీర్చిదిద్దాలన్నది యాజమాన్యం లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి జగన్ మౌత్ పీసులుగా వీటిని వాడుకుంటూనే....ఎటుపోయి ఎటొచ్చినా భవిష్యత్తులో పనికొచ్చేలా వీటిని తీర్చిదిద్దాలని యాజమాన్యం భావిస్తున్నది. ఎన్ డీ టీవీకి భారీగా డబ్బు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.
గతంలో ఒక పోస్టులో మేము పేర్కొన్నట్లు...ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న దిలీప్ రెడ్డి సాక్షి ఛానల్ లో కీలకమైన పదవి అప్పగించారు. రామ్ రెడ్డి అన్నయ్య విషాదకర పరిస్థితుల్లో ఛానల్ వదిలి వెళ్లిపోకముందు, వెళ్లిపోయాక గాడితప్పిన వ్యవస్థను సరిచేసే పనిలో ఆయన ఉన్నారు. ఎడిటోరియల్ ను పటిష్ఠం చేసే పనిలో భాగంగా దిలీప్ రెడ్డి...వెంటనే తన మాజీ కలీగ్ గోవింద్ రెడ్డికి సాక్షి ఛానల్ లో మళ్లీ ఇన్ పుట్ బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ ఈనాడు లో కీలక బాధ్యతలు పోషించిన జర్నలిస్టులు. ఈనాడు సిటీ రిపోర్టింగ్ చేసిన గోవింద్ రెడ్డి...తర్వాత జీ టెలివిజన్ లో చేరారు. జీ ని వదిలిన తర్వాత సాక్షిలో చేరారు కానీ అప్పటి బాసు గారి చేతలకు, మాటలకు విసిగి మధ్యలోనే ఉద్యోగం మానేసి అగ్రిగోల్డ్ వారి ఛానల్ లో చేరారు. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేసిన గోవింద్ రెడ్డి...చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సొంత పనులు చూసుకుని మళ్లీ రంగప్రవేశం చేశారు. వీరిద్దరికీ మేలు జరగాలని ఆశిద్దాం.

4 comments:
first thy tried The Hindu journalisam school prnted matter[sylabus] to train their reporters[trainees]
Sirjee
ఎన్డీటీవీతో శిక్షణ కొత్తగా చేరినవారికేనా లేక అందరికా?
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
అందరికీ (అట) సార్.
ఏది సార్ అప్పట్లో లంచ్ అన్నారు. మళ్లీ మాటే లేదు.
రాము
@Ramu Sirjee
లంచ్ ఇంకా వేడిగానే ఉంది. మీ రాకే ఆలస్యం :)
Monday to Friday, afternoon 12:00-2:30 ముహూర్తం మీరే కన్ఫరం చేయండి సార్.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి