జర్నలిజంలో ఎందరికో ఆరాధ్య గురువైన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి ఎనభయ్యో జయంతి సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఈ ఉదయం ఘనంగా జరిగింది. ఆయన శిష్యులుగా గర్వంగా చెప్పుకునే దాదాపు ముప్ఫై మంది ఇందులో పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నామని చెప్పి కార్యక్రమం మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని చెప్పిన వారు ఒక పది మంది ఉండగా, మమ్మల్ని మంగళ వాయిద్యాలతో ఆహ్వానించలేదని అలిగి ఊళ్ళో ఉండి కూడా సభకు రాని సోదర సోదరీ మణులు కూడా ఉన్నారు. ఎవ్వరూ పిలవక పోయినా విషయం తెలిసి వచ్చిన వారి ఒక పది మంది ఉండడం విశేషం. ఎవరి చాయిస్ వారిది, ఎవరి బాధలు వారివి కాబట్టి మనం చెప్పేది ఏమీ లేదు.
కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మా బ్యాచుకు చెందిన విజయ్ కుమార్ (న్యూస్ ఎడిటర్- హెచ్.ఎం.టీ.వీ.) వ్యవహరించారు. ఆ ప్రోగ్రాం ఘనంగా జరగడానికి మిత్రుడు పీ.మధు, ఆయనకు చెందిన ధాత్రి కమ్యూనికేషన్ సిబ్బంది పడిన శ్రమ మరువలేనిది. ఈ కార్యక్రమంలో ఎన్నో విలువైన సూచనలు చేసిన మిత్రులకు అభినందనలు.
సారు కు సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేయాలని గట్టిగా సంకల్పించి గతంలో ఒక కమిటీ కూడా వేసిన సంగతి మీకు తెలిసిందే. మొత్తానికి ఒక ప్రోగ్రాం చేయడం ఆనందం కలిగించింది. ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను.
6 comments:
చక్కటి ప్రోగ్రాం నిర్వహించారండి.
రామూ గారు,
బూదరాజు గారి జయంతి సభ గురించి చదవగానే చాలా సంతోషమనిపించింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరపడానికి కృషి చేసిన మీఅందరికి నా అభినందనలు.
బూదరాజు గారి పుట్టినరోజైన మే 3, నా పుట్టినరోజు కూడా కావడం నా అదృష్టం. (ఆయన పుట్టినరోజు మే 3 అని నాకు జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు మీ బ్లాగ్ ద్వారానే తెలిసింది).
ఈ కార్యక్రమం వీడియో లింక్ ఉంటే దయచేసి బ్లాగ్ లో పెట్టండి.
అభినందనలతో,
శశిధర్ సంగరాజు.
నేను గతం లోకి వెళ్ళిపోయాను రాము గారు. పుర్వాశ్రమం లో అంటే నా డిగ్రీ అయ్యాక జర్నలిస్ట్ అయితే కెరీర్ దివ్యంగా వుంటుంది సమాజానికి ఎమన్నా చెయ్యొచ్చు అనే భ్రమలో ఉండి ఈనాడు గ్రూప్ లో ప్రకటనల విభాగం లో చేరాను. జర్నలిస్ట్ అవుదామని స్కూల్ పరీక్ష రాసి మొత్తానికి ఇంటర్వ్యూ కి వెళ్ళాను. రామోజీ రావు జిల్లా పేపర్ లు మొత్తం ౨౩ ముందు పెట్టుకొని తలకూడా ఎత్తలేదు. రమేష్ బాబు ఒక మాట కూడా మాట్లాడలేదు. బూదరాజు గారు రెండే ప్రశ్నలు వేసారు మీ డిగ్రీ లో తెలుగు పాఠాలు ఏమిటి అని. ఈనాడు లో శీర్షికల దగ్గరనుండి కరెంటు అఫైర్స్ వరకు అన్ని తయారై వేల్లాకాని ఈ ప్రశ్న ఎదురవుతుంది అని ఊహించలేదు. తరువాత మీ వూరు పక్కనుండి ఒక కాలువ వెళ్తుంది దాని పుట్టు పూర్వోత్తరాలు అడిగారు. ఇంకో షాక్!
ఇంక రామోజీ వారు థాంక్స్ అని ఒక మాట చెప్పడం నేను బాయకు వోచేసరికి రెడీ గా వారి బంట్రోతు మంచి నీళ్ళు అందించడం నేను ఆ సోమాజిగూడ ఈనాడు ఆఫీసు ౪ అంతస్తు నుండి కిందకు రావడానికి దారి తెలీక ఈనాడు ఆఫీసు అంత తిరగడం ఒక మరపురాని అనుభవం.
బూదరాజు గారు రాసే జర్నలిసం స్కూల్ మాగజైన్ లో కాంట్రిబ్యూటర్స్ కు పెట్టే చివాట్లు మాత్రం అదుర్స్! మొత్తానికి జర్నలిస్ట్ అవ్వాలనే నా కోరిక అదృష్టవసాత్తు తీరలేదు కాని బూదరాజు గారికి అభిమానిగా మిగిలి పోయా
మమ్మల్ని మంగళ వాయిద్యాలతో ఆహ్వానించలేదని అలిగి ఊళ్ళో ఉండి కూడా సభకు రాని సోదర సోదరీ మణులు కూడా......ఈ ఎదవ నస బ్యాచ్ ఎప్పుడూ ఉండేదే గానీ కార్యక్రమం చక్కగా నిర్వహించిన మీ అందరికీ నా అభినందనలు,ధన్యవాదాలు.
Gud programme. anduku sandeham ledu. kaani journalisum lo kottavaallu kuda add avuthunnaru kada varini kuda ilanti programmes ku ahwaninchavachhu kadaa? appude kada thelisedi asalu journalism ante emiti ani.. alochinchandi.
శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్న ఇప్పుడే మీ బ్లాగ్ చూడటం జరిగింది.
బూదరాజు గారికి నా మనః పూర్వక నమస్సులు
ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు.
నా లాంటి వారెందరికో ఎంతో ఉపయోగం ఈ బ్లాగ్.
బూదరాజు గారు రచించిన మంచి జర్నలిస్ట్ కావాలంటే అనే పుస్తకం నాకు ఎంతో ఉపయోగించింది.
MCj 1 st పూర్తి చేసుకున్న
నాకు రెండో సంవత్సరం లో కూడా ఇటువంటి వారి రచనలు ఉపయోగ పడతాయని ఆశిస్తున్నాను.
మణినాథ్ కోపల్లె
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి