Friday, May 18, 2012

'సాక్షి' మూతపడాలని అనుకోవడం ప్రమాదకరం


తెలుగు జర్నలిజం మున్నెన్నడూ లేని అవమానకరమైన ఫేజ్ లో ఉన్నది. వ్యాపార వృద్ధికో, రాజకీయ లబ్దికో వార్తా పత్రికలు, ఛానెల్స్ నిర్వహిస్తున్నారు. క్రాస్ కమర్షియలైజేషన్ అనేది భారత జర్నలిజానికి కొత్త కాకపోయినా, తెలుగు నాట మీడియా యజమానుల ధోరణి వెర్రితలలు వేస్తున్నది. పలు వ్యాపారాలతో పాటు ఒక పేపరో, చానలో ఉంటే....బాగుంటుందన్న ధోరణి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలలో పెరిగి జర్నలిజం పరమార్థం నీరుగారుతున్నది. ఈ క్రమం లో జర్నలిస్టుల పని విధానం.. జర్నలిస్టు ప్రొఫైల్ మారిపోయింది. 

ప్రకటనలకోసం పరితపించే యజమానిని సంతృప్తి పరిచే వారు...వృత్తి పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి లేకపోయినా అద్భుతమైన జర్నలిస్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు. జనాలకు ఎలాంటి బూతు, ఎలా చూపించాలో అధ్యయనం చేసి టీ.ఆర్.పీ.రేటింగ్స్ పెంచే వారు మంచి సీ.ఈ.ఓ.లుగా వెలిగి పోతున్నారు. ఉన్నట్టుండి వివాదాన్ని సృష్టించి దాన్ని రోజంతా వివిధ కోణాలలో చూపించే జర్నలిస్టులకు గిరాకీ పెరిగింది. జర్నలిస్టులు-సామాజిక బాధ్యత...అంటూ సత్తెకాలపు మాటలు మాట్లాడే జర్నలిస్టులు వృత్తిలో నలిగిపోతున్నారు. బాసులను తృప్తి పరచలేక, చావు తెలివితేటలతో ఎదిగిన జూనియర్ గాడి కింద పనిచేయలేక తమను తాము నిందించుకుంటూ అనారోగ్యంతో వీరు చీకిపోతున్నారు. 

దళిత ఉద్ధరణ, నైతిక జర్నలిజం కోసం పనిచేస్తున్నట్లు ఫోజుకొట్టే పండు ముసలి జర్నలిస్టులు ఇద్దరు ముగ్గురు తమ కుటుంబీకులకు, భజనపరులకు, అంతే వాసులైన సన్నాసులకు పెద్ద పీట వేస్తూ నికార్సైన జర్నలిస్టులను కించపరుస్తున్నారు. జర్నలిజం లో మంచి పేరున్న ఈ బాపతుగాళ్ళు యాజమాని తర్వాత యజమాని స్థాయికి వచ్చే సరికి రంగు, వాసన కోల్పోయి...తల పొగరు పెరిగి జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించడం మొదలుపెట్టారు.     కనీసం నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఆనక తాము పొందాలని అనుకునే....ప్రెస్ అకాడమీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యత్వం దిశగా పావులు కదుపుతూ జర్నలిజం ఆచరిస్తున్నారు. చావు తెలివితేటలు ఉన్న వారు దర్జాగా బతికే జర్నలిజం ఇప్పుడున్నది.

కుళ్ళిపోతున్న జర్నలిజం లో ఇవన్నీ ఒక పార్శ్వమైతే...ఇంకొక పెద్ద పార్శ్వం కులం. నిన్న మొన్నటి దాకా...తమ ఆధిపత్యంలో ఉన్న తెలుగు జర్నలిజం లోకి రెడ్డి రాజులు దూసుకు రావడాన్ని కమ్మ ఎడిటర్లు, యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా...ఆ వచ్చిన రెడ్డి రాజులు...కత్తులూ కటార్లతో వచ్చి...తమ దగ్గరి జర్నలిస్టులకు డబ్బు ఎరవేసి ఎగేసుకుపోయి తామూ జీతాలు పెంచి చావక తప్పని పరిస్థితి కల్పించారని కమ్మ యజమానులు నమ్ముతున్నారు. అది వారి కడుపు మంట. అప్పటిదాకా...'ఈనాడు' చెప్పింది వేదం గా వుండేది. 'సాక్షి' రాకతో తీరు మారింది. 'ఈనాడు' లో కథనాలను ఖండిస్తూ...వాటిలో కుతంత్రాన్ని దునుమాడుతూ 'సాక్షి' విరుచుకుపడడంతో తెలుగు జర్నలిజం స్వరూప స్వభావాలు మారిపోయాయి. అందుకే... నీతిని నిలబెట్టడమే  తమ విహిత కర్త్యవ్యమన్నట్లు రామోజీ, రాధాకృష్ణ ఇపుడు ఫోజు కొడుతున్నారు. 'ఈనాడు' విస్తరణకు కృషి చేసిన జర్నలిస్టులు దుర్భర జీవితాలు అనుభవించారు. స్వేదం, రక్తం...ఇత్యాదులన్నీ దానికోసం ధారపోసారు. అయినా వారికిచ్చిన జీతభత్యాలు స్వల్పం. 'ఈనాడు' ను అడ్డంపెట్టుకుని యాజమాన్యం వ్యాపార విస్తరణ చేసుకున్నది అనంతం. కమ్మ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని భూములు కారుచౌకగా కొట్టివేసిన సంగతి నిన్న మొన్నటిదే. 

రామోజీ గారు పెట్టిన జర్నలిజం పొగలో మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరై మరింత దాష్టీకంతో పుట్టుకొచ్చినది సాక్షి. అంత వరకూ సరైన ఫోరం లేక ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు అది వరప్రసాదం అయ్యింది. రామోజీ సూత్రాన్ని భిన్నంగా మరింత దారుణంగా అనుసరించారు వై.ఎస్.రాజశేఖర రెడ్డి. పెట్టుబడులు సందేహాస్పదం, అభ్యంతరకరం అయితే కావచ్చు గానీ....'సాక్షి' పుట్టుక నీడ్ ఆఫ్ ది అవర్. అది తక్షణావసరం. లేకపోతే...అధికారం పోయిందని కుళ్ళిపోతున్న కమ్మ సంఘం మరిన్ని అసత్యాలు పంచేది, జర్నలిజాన్ని మరింత పలుచన చేసేది. సాక్షి రాకతో అది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్రమత్తంగా ఉంది. ఇది ముమ్మాటికీ మంచిది. కాబట్టి సాక్షి మూతపడాలని కోరుకోవడం పిచ్చితనం. అంతా దొంగలే. వాళ్ళ మధ్య పంచాయితీ...మనలాంటి సామాన్యులకు మంచిదే. కాదంటారా?
(నోట్: ఈ వ్యాసంలో కులాల గురించి ప్రస్తావన తేక తప్పింది కాదు. దానికి క్షంతవ్యులం. ఈ రెండు కులాల మధ్య నలుగుతున్న ఇతర కులాల గురించి త్వరలో ఒక పోస్ట్ ఉంటుంది.)    

38 comments:

Anonymous said...

వాస్తవమే, కాని... 'ఈనాడు' జర్నలిస్టుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్న పరమార్థంతో మాత్రమే 'సాక్షి' కృష్ణ పరమాత్ముడిలా వుద్భవించలేదన్నది గ్రహించాలి. సమకాలీన వ్యాపార పోటీ సూత్రాలకనుగుణంగా అది అలా అయ్యింది. రెండు పోట్టేళ్ళు రక్తాలు కారేలా కొట్టుకున్నప్పుడు కొన్ని బక్క నక్కలు లాభ పడివుండవచ్చు.
అవినీతి చేసింది సాక్షి అయినా, ఈనాడైనా, ఆంధ్ర/తెలంగాణ జ్యోతి అయినా శూలారోహణం చేయిచాల్సిందే. శిక్షలో భాగంగా మూత పడాల్సివస్తే నిర్దాక్షిణ్యంగా మూతేసి కప్పెట్టాల్సిందే. ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వీళ్ళ (చవుకబారు) జర్నలిజంతో వుపయోగమా లేదా అన్నది మాత్రమే ప్రాతిపదికగా ఈ ప్రభుత్వ చర్యలు/దాడులను సమీక్షించాలని నా అభిప్రాయము.

Jai Gottimukkala said...

రాము గారూ, సాక్షి పుట్టుక "అప్పటి" నీడ్ ఆఫ్ ది అవర్ అయుండొచ్చు. ఇప్పుడు పరిస్తితి మారింది కదా. సాక్షి కొనసాగడం "ఈరోజు" నీడ్ ఆఫ్ ది అవర్ కాకపోవచ్చు.

navin said...

Ramu Garu,

I completely agree with u...
Both EENADU/TV9/AJ & SAKSHI are two sides of same coin....
We need both of them together or we don't need either of them.

Anonymous said...

కమ్మ వారికి నచ్చక పోవచ్చు కానీ సాక్షి రాజకీయాల్లో, పత్రిక రంగం లో మార్పు తీసుకు వచ్చింది . మీరే చెప్పినట్టు రెడ్డి రాజులూ దూసుకు రావడం కమ్మ రాజులకు మింగుడు పాడడం లేదు . ఈ రోజు రెడ్డి మీడియా గొంతు నొక్కితే కమ్మ మీడియా మౌనగా ఉంటే రేపు కమ్మ మీడియా అదే ప్రమాదం లో పడ వచ్చు . నేను కమ్మ కాదు రెడ్డి కాదు కానీ మీడియా ఏదో ఒక కులానికి పరిమితం కావద్దని పోటీ ఉండాలని కోరుకునే వాడిని ............

Mee Abhimani said...

Kamma prabhuthvam lo bhumulu kottesara? Journalist jathi ke avamanam nuvvu. Minimum research kooda cheyyava?

G.P.V.Prasad said...

కాదు అంటాను. ఎందుకంటే సాక్షి ఉంటే అబద్దాల భజన అంతే

Praveen Mandangi said...

అవినీతి చెయ్యడానికి ఏ కులంవాడైతే ఏమిటి? ఒక కమ్మవాడు తొమ్మిదేళ్ళలో చేసిన అవినీతిని ఒక రెడ్డి తన తండ్రి సహాయంతో ఐదున్నర ఏళ్ళలో చేసి చూపించాడు.

Dharma Gorja said...

valla madya panchayite mana lanti samanyulaku manchide ? Yes.

evaloution of sakshi was a need , its correct but the same need forced management to pull money in all the ways (legal , illegal) to attack opponents for which the whole issues going on now.

Sitaram said...

సర్ మంచి పోస్ట్ రాశారు. చట్ట ప్రకారమే కులం rigister ఐనప్పుడు క్షమించడం దేనికి సర్? పేరు వెనుక ముందు రెడ్డి, శర్మ ,రావు ,చౌదరి ,నాయుడు అని పెట్ట్కున్నప్పుడు లేని సోయే విమర్శించడానికి ఎలా అవకశం ఉంటుంది చెప్పండి. అసలు భారతీయ సమాజమే కుల పునాదుల మీద నిర్మితమైంది. పునాది గురించి మాట్లాడ కుండ ఉపరి తలం గురించి మాట్లడఓ అర్ధ సత్యమే. సర్ మీరు ఇలాగె continue...చేయండి. సత్యానికి మేలు చేసిన వారవుతారు......
yours student....
Mamatha Ashok

uttam said...

Raamu garu me visleshana bahundi. asalu vastavalanu chala takkuva maatalo cheparu. ramojirao, radhakrisna, jagan okka tanu mukkale. muguru tama astula kosam mediani upayoginchu kotunnaru. vichitram entate ramoji,Rklu taamu tappa migatavaru avineeti parulani cheppatam. marokka vishayam ento mandi journalistula raktam taggite eendu a staelo vundi.sakshi lekapote oktaraha vartalu matrame chadavaalsi vachedi.medialo 30 elluga vunna nirbandam saakhi rakato konta sadalindi. jagun pacchi avineeti parudu kavachu prajalu asalu vatavalanu bereeju vesukoneduku sakshi undali.
sakshi enduku avasaram anu konapudu neenu etival chadivina e quote gurtu ku vachindi.
DON'T BELIEVE EVERYTHING YOU
HEAR. THERE ARA ALWAYS 3 SIDES TO EVERY STORY. YOUR'S THEIRS AND TRUTH.

sndp said...

Sir,what ever you are said seems to be right but as per my knowledge
sakshi came for their own support ,
simply target opposition(tdp primarily) after that when he left the congress it started boosting of Congress,
Sakshi is blindly following eenadu/or any paper to support their supporters,no one will do any thing for any.
Here you have talked about journalists ,eenadu might have used those for cheap,if any other new paper gave high salary you will say same thing to sakshi also

Ravi said...

Ramu sir.. well Analysis... well said... what ever you mentioned is 100% correct. No firm should not be shutdown.. no one wish for that...

జయహొ said...

రాముగారు,
మంచి వ్యాసం రాశారు. ఈ రోజు సాక్షి పేపర్ అనేది ఉన్నా లేక పోయినా జగన్ పార్టి విస్తరణని, విజయాన్ని అది ప్రభావితం చేసే పరిస్థితిలో లేదు. ఆపేపర్ వలన అతనికి లభించే ప్రజాధరణ ఇల్లు కదలకుండా టి వి చూస్తు, బాతాఖాని కొట్టే ప్రజలకి సాక్షి పేపర్ టి.వి. అతనికి గల ప్రజాదరణ తెలియజేస్తుంది. ఆపేపర్ లేకపోతే ఇతర పేపర్ వాళ్లు చేసే ప్రచారం వలన, ఈ జగన్ కి అసలికి ప్రజామద్దతే లేదని మాట్లాడటం మొదలుపెట్టి ఉండేవారు. అటువంటి పబ్లిసిటి ని సాక్షి ఆపగలిగింది. ఇక సాక్షి లో జగన్ తన తప్పెట తాను కొట్టుకొంటాడని అందరికి తెలుసు. అవినమ్మిన వాళ్లు నమ్ముతారు లేకపోతే లేదు. ఆ సెక్షన్ వదలివేస్తే మిగవా పేపర్ బాగా ఉంట్టుంది. ఇక అందులో అదనంగా ఈనాడు లో ప్రచూరించిన వార్తలలో లోపాలను ఎండగేడుతూ, అధారాలాతో సహా రాస్తారు, ఆ రెండు వార్తలను చదివిన పాఠకులకు ఏది నిజమో అర్థమౌతుంది. నేట్ వలన ఇప్పుడందరు ఒక్క సేన్సేషనల్ వార్తలో ఎంత నిజమో తెలుసుకోవటానికి నేట్లో మూడు నాలుగు పేపర్లు, గ్రేట్ ఆంధ్రా లోని యం బి యస్ ప్రసాద్ కాలం, కొన్ని నమ్మకమైన బ్లాగులు చదువుతారు. ప్రజల చెవిలో అబ్బద్దాలు రాసి పువ్వులు పెట్టే రోజులు పోయాయి.


*అవినీతి చేసింది సాక్షి అయినా, ఈనాడైనా, ఆంధ్ర/తెలంగాణ జ్యోతి అయినా శూలారోహణం చేయిచాల్సిందే*
శంకర్,
పై మాటలు బ్లాగులలో ఎన్నైనా అనవచ్చు. వాస్తవమేమిటి అంటే ప్రస్తుతం సాక్షికి తప్ప మిగతా పేపర్లకి వచ్చిన నష్ట్టం ఏమీలేదు. అందువలన వారు నీతి నీజాయితిలే మాట్లాడుతారు. మొన్న కొంతమంది మీడీయా పెద్దలు డిమాండ్ చేసినట్లు, ఆరెండు పేపర్ వాళ్లు తమకి పెట్టుబడుల లెక్కలు చూపించి వారు ప్రొ యాక్టివ్ గా వారి నిజాయితిని నిరూపించు కోవచ్చుకదా!

pravasarajyam said...

సాక్షి పుట్టుక “అప్పటి” నీడ్ ఆఫ్ ది అవర్ అయుండొచ్చు. ఇప్పుడు పరిస్తితి మారింది కదా. సాక్షి కొనసాగడం “ఈరోజు” నీడ్ ఆఫ్ ది అవర్ కాకపోవచ్చు.
http://www.pravasarajyam.com/

Chinna said...

Well said Ramu Garu

Sasidhar said...

అవును, సాక్షి పత్రికను మూసేయాలనుకోవడం చాలా దారుణం. నెలాఖర్లో పాతపేపర్లవాడికి అమ్మేటప్పుడు ఈనాడు కన్నా సాక్షి ఎక్కువ తూకం వస్తుంది. ఆ పేపర్లో పాఠకులకు దొరికేదదొక్కటే..తూకం.

నేను తక్కువ ధరకు పేపర్ ఇస్తాను కాబట్టి అందరూ అదే ధరకు పేపర్లు అమ్మలంటూ మొదలైన సాక్షి ప్రస్థానం పురిట్లోనే పాచి కంపు కొట్టింది. ఆ పేపరొచ్చి పతనమవుతున్న జర్నలిజం విలువల్ని కాపాడింది అనడం ఎంతవరకు సబబో అందరూ ఆలోచించాలి.

~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.com

యధార్ధవాది said...

సాక్షి పుట్టాక జీతాలు పెరిగాయి. వాస్తవమే కానీ...దిగజారిపోతున్న జర్నలిస్టు జీవితాలను ఆదుకోడానికి సాక్షి పుట్టిందనడం మాత్రం అవాస్తవం. తమ అధికారాన్ని, తాము చేస్తున్న అక్రమాల నుంచి కాపాడుకోడానికి ఓ మీడియా ఉండాలన్న ఆలోచన...ఇప్పటి రాజకీయ వ్యాపారవేత్తలలో ప్రబలంగా కనిపిస్తోంది. లేకపోతే రియల్ ఎస్టేట్ రౌడీలు, ఆక్రమణదారులు ఎక్కువ జీతాలిచ్చి జర్నలిస్టులను తమ కంపెనీలలో చేర్చుకుంటున్నది జర్నలిస్టులను, జర్నలిజాన్ని రక్షించడానికి కానే కాదు. తమను, తమ వ్యాపారాలను కాపాడుకోడానికే. కమ్మరాజు గారి మీడియా ఫార్ములా బాగుందనుకున్న రెడ్డిరాజు కూడా అదే ఓ మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. దండుకున్న సొమ్మును జర్నలిస్టుకు కొంత బిచ్చంగా వేసి...చూశారా నేను జర్నలిజోద్ధరణ చేస్తున్నానంటూ పోజు కొడుతున్నారు.

Praveen Mandangi said...

జై గారు, సాక్షి అప్పట్లో కూడా "నీడ్ ఆఫ్ ది అవర్‌" కాదు. ఒకప్పుడు సాక్షి పత్రికలో రోజూ తెలంగాణాకి వ్యతిరేకంగా సమైక్యవాద వ్యాసాలు వ్రాయించేవాళ్ళు. ఆ పత్రికకి తెలంగాణాలో సర్క్యులేషన్ తగ్గిపోయిన తరువాత అందులో సమైక్యవాద వ్యాసాలు వ్రాయడం ఆపేశారు. ఒకవేళ పరకాలలో జగన్ అనుచరురాలు సురేఖ గెలిస్తే పరకాలలో టి‌ఆర్‌ఎస్ ఓడిపోయింది కనుక తెలంగాణావాదం బలంగా లేనట్టే అని చెప్పి సాక్షిలో సమైక్యవాద వ్యాసాలు వ్రాయడం మళ్ళీ మొదలుపెడతారు. తెలంగాణాలో మళ్ళీ ఆందోళనలు మొదలై ఆందోళనకారులు సాక్షి పత్రిక కాపీలని తగలబెడితే కొంత కాలం పాటు సాక్షి వాళ్ళు సమైక్యవాద వ్యాసాలు వ్రాయకుండా ఆందోళనలు తగ్గిన తరువాత మళ్ళీ మొదలుపెట్టొచ్చు అని అనుకుంటారు. సాక్షిని నమ్మితే అది పాముకి పాలు పోసి పెంచడమే అవుతుంది. పాము ఎప్పుడూ విషమే కక్కుతుంది కానీ తేనెలు ఒలకదు కదా.

sndp said...

sir i have posted a comment ,
but you have not approved?

sndp said...

sir why you are not approved my comment?

Jai Gottimukkala said...

@Praveen Mandangi: "అయుండొచ్చు" does not mean I agree. ఒకవేళ అప్పటి నీడ్ అయినా ఇప్పుడు కానక్కర్లేదు అనే నేను అన్నాను.

I, me, myself said...

The only downside about sakshi's business is.....its not run with a profit motive.....Jagan is least bothered whether sakshi makes profit or not.......this is dangerous as it may lead to widespread discrimination in the market.....like paying more to the journalists then what market pays and also selling at a lower price in the market as he is not looking at making profit.....

I dont have a problem with sakshi's articles or news as long as it is run with a profit motive.

Ramu S said...

sndp,
generally I don't delete or edit comments, though they pointed at me. would you send me the comment?
ramu

Jai Gottimukkala said...

@I, me, myself:

Many media businesses are not run with a true capitalist bent of mind (sales+ ad revenues-costs= profit).

In many cases, the primary motive is to influence public opinion. This is expected to result in indirect benefits (monetary & otherwise).

Enadu is a classical example. Establishing the paper's predominance enabled Ramoji Rao to help NTR win the 83 elections. The clout which resulted is much more than mere profits.

Unknown said...

Praveen Mandangi Garu,

current media one-sided news rasinanta kalam, there will be space for alternative. EENADU bari teginchindi kabatte aanadu sakshi ravalsi vachindi.... Situation has been the same even now...

This is the first time i'm hearing this allegation of sakshi Vs TG. even hard-core telanganites never made this comment on sakshi.
I never saw skewed approach on telangana by SAKSHI. I remember, he used to publish reports of various sections which are submitted to srikrishna report.... Infact, its ramoji who took pro-tg view for a while to save his properties in TG.

Please check your facts and views.

Praveen Mandangi said...

జగన్మోహనాసురుడు ఏదో సంఘ సేవకుడు అయినట్టు, అతని పత్రిక మూతపడితే సమాజానికి ఏదో నష్టం అయినట్టు మాట్లాడుతున్నారు.

యధార్ధవాది said...

ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు పోటీగా ఒకటి కాదు. వంద పత్రికలు రావాల్సిందే. రెండో కోణాన్ని ప్రపంచానికి అందించాల్సిందే . కానీ ఆ వచ్చే పేపర్ అవినీతి, అక్రమాల పునాదుల మీద నిలబడరాదు. దాని అధినేత అవినీతిని కప్పిపుచ్చడానికి ఆయుధం లేదా కవచం ఎంత మాత్రం కారాదు. ఏ పత్రిక కొనాలన్నది పాఠకుడికి ఎంత ఐచ్ఛికమో...ఒక పత్రిక తనదైన భావజాలాన్ని సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవడం వారి వారి యాజమాన్యాల ఇష్టం. కానీ అవినీతి, అక్రమాలకు సంబంధించిన సమర్ధనలు మాత్రం కచ్చితంగా అవాంఛనీయం. ఇప్పుడు జగన్ చేస్తున్నది జర్నలిజం సేవ కాదు. తన అవినీతి అక్రమాలకు జర్నలిజంతో చేయించుకుంటున్న సేవ. ఒక జర్నలిస్టుగా అవినీతి అక్రమాల పునాదుల మీద లేచిన సాక్షి అంతరించడాన్ని నేను స్వాగతిస్తాను. ఒక్క సాక్షే కాదు..నేను పనిచేస్తున్న సంస్థ అలాంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలినా...దాని మూసివేతను సమర్ధిస్తాను. కొద్దిమంది జర్నలిస్టుల జీవితాల కోసం వేలు లక్షల కోట్ల రూపాయల అక్రమాలకు నిలయమైన పత్రికను పత్రిక యాజమాన్యాన్ని రక్షించాలనుకోవడం మన దౌర్భాగ్యం.

MUDALVAN said...

vajpayi retirement tarvata bjp aada maga kaani party ayindi. ippudu indialo sonia gandhini edirinchagala magaadu okka JAGAN matrame
UPlo koduku gelichina soniani emi analeni paristhitilo mulayam unnadu. ye statelo ye partylo okka nayakudu soniani daani kojja koduku rahulni ane vaadu ledu

Praveen Mandangi said...

సాక్షి దిన పత్రిక మూతపడితే ఏమైనా నష్టమా? సంఘీ మిల్స్ లాభాలలో ఉన్నంత కాలం వార్త దిన పత్రిక కూడా లాభాలతో నడిచింది. సంఘీ మిల్స్ బ్యాంక్ అప్పుల వల్ల నష్టపోయిన తరువాత వార్త దిన పత్రిక నాలుగవ స్థానానికి పడిపోయింది. రేపు ప్రియా పచ్చళ్ళ కంపెనీ మూతపడినా ఈనాడు దిన పత్రిక ఏ అయిదో స్థానానికో పడిపోతుంది. జగన్‌కి చెందిన ఇతర కంపెనీలు మూతపడితే సాక్షి దిన పత్రిక పరిస్థితి కూడా అదే అవుతుంది.

Praveen Mandangi said...

సాక్షి చేసిన తెలివి తక్కువ పని ఈనాడు కూడా చేస్తే తెలంగాణాలో ఈనాడు సర్క్యులేషన్ కూడా పడిపోయి నమస్తే తెలంగాణా పత్రిక సర్క్యులేషన్ పెరిగిపోతుంది. రామోజీరావు ఈ విషయం తెలియనంత అమాయకుడు కాదు. రాజశేఖరరెడ్డి ఆస్తులతో పాటు రవీంద్రనాథరెడ్డి ఆస్తులు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. వాటి ధరలు తగ్గిపోకోడదనే జగన్ సాక్షి దిన పత్రికలో సమైక్యవాద వ్యాసాలు వ్రాయించేవాడు. కానీ దాని వల్ల సాక్షి పత్రిక సర్క్యులేషన్ తెలంగాణాలో తగ్గిపోయింది.

Ranku Mogudu said...

The nexus between politicians and business men existed since ages.

But these days politicians are doing all the jobs themselves.

Sakshi and Eenadu are the two faces of the same coin. Therefore Sakshi should exist just to make it easy for the public to understand what is going on. These days we cannot expect journalists to bring the truth. What these papers are doing is bringing the fight between the parties to our houses. We can simply see the fight and then decide whom to vote. Life would be very boring if there is no Sakshi or Eenadu :)

lplplplplp said...

Iam not agree with u

I, me, myself said...

@ Jai Gottimukkala

ya true.....but I dont think eenadu and AJ will run if they are making loses their motive is profit......but Sakshi's main motive is not profit at all....

NEELAKANTESWARA REDDY MADIREDDI-INFRASTRUCTURE SYSTEMS said...

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా చేయచ్చో... అది తప్పుకనతవరకు... ఎందుకు సాక్షి ఉండకూడదో అది ఉండకూదదనుకుంటారో చెప్పెతే మంచిది... వారే కనుక నిజమైన ప్రజాస్వామ్య వాదులు తప్పు కాని దానిని దేనిని వ్యతిరేకించారు!!!!!!!!!!!!!!!

Anonymous said...

I HAVE READ ALL COMMENTS, SOME BODY SAY RAMOJI RAO, AND RADHAKRISHAN FIRST ALL O LEARN RAMOJI AND RADHRAKRISHNA, AFTER YOU DISCUSS ABOUT JAGAN,, I WILL TEL SAKSHI IS NOT THERE NO ONE CAN REACH TRUETHNES,ABT THIS I AM SAYNG 100%TRUE,SO DNT DISCUSS, SEE
NOW I AM TEL ONE EXAMPLE:, NOW ENADU AND ANDHRAJYOTHI,STATE ALSONOT DIVIDED THAT TWO PAPER ALREADY DIVDED MAIN EDITION TELANGANA ONE EDITION, AND ANDRA ONE EDITION SO ALL ARE THINK WE ARE CHEAPTRICKS MENTALITY WAST PEOPLE IN AP, RAMOJI AND RADHA KRISHNA AND HIS HEAD CHANDRABABU,

Anonymous said...

పత్రిక విలువలు కాపాడుతాను అంటూనే సాక్షి తప్ప మిగిలినవి కమ్మ వారికీ అని సాక్షి రెడ్డి వారికీ ఎలా కులం ను తిసుకోరావడం ఎంత వరకు కరెక్ట్ అని ఆలోచించుకోండి ....

Unknown said...

Excellent Sir

raviL707 said...

asalu paper pettadam lo unna mukya uddesham lo jagan success ayyadu.. evaru enni vagina edchina ... tanu sadinchalsindi sadinchindi....

miglinavanni puluslu minuslu anthey....

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి