మన సమాజంలో నీతి, అవినీతి పై చర్చ పెడదోవ పట్టింది. ఈ చర్చను తెలివిగా గందరగోళ పరిచే మేధావులు, జర్నలిస్టులు ఎక్కువై పోయారు. 'సాక్షి'ది అవినీతి సొమ్ము...అని ఎవరైనా వాదిస్తే...మరి 'ఈనాడు' ది కాదా? అంటారు తప్ప...తప్పును తప్పుగా వాదించే వివేచన మంటలో కలిసి పోయింది. Absolute ethics అనే విషయాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
మార్గదర్శి మీద దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తే అది పత్రికా స్వేచ్ఛ మీద దాడి. 'సాక్షి' బ్యాకు ఖాతాలు నిలిపివేస్తే...అదీ పత్రికా స్వేచ్ఛ మీద దాడే. గడిచిన రెండేళ్లలో దాదాపు 1500 జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పోయాయి. అది ఏ కోవలోకీ రాని విషయం అయిపోయింది. ఈ రోజు 'సాక్షి' కి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న పైరవీకార్ జర్నలిస్టు నేతలు ఒక్క రోజైనా ఈ ఉద్యోగుల కోసం ధర్నా చేయలేదు కానీ ఇప్పుడు ప్రపంచం బద్దలవుతున్నట్లు హంగామా చేస్తున్నారు. పచ్చిగా చెప్పుకోవాలంటే....రెడ్డి జర్నలిస్టులు, కమ్మ జర్నలిస్టులు విడివిడిగా నడిపిస్తున్న వింత నాటకంలో పత్రికా స్వేచ్ఛ ముమ్మాటికీ ఒక సాకు మాత్రమే. అబద్ధాన్ని నిజమని నమ్మించే చానల్స్ రాజ్యమేలుతున్నంత కాలం, ఒక నలుగురు జర్నలిస్టు సంఘాల నేతలకు ఈ భూమి మీద నూకలు ఉన్నంత కాలం..... సత్యం సజీవ సమాధిలోనే ఉంటుంది. దీనిపై మన చర్చ ఒక వ్యర్ద వ్యవహారంగానే ఉంటుంది. ప్రస్తుత విషయానికి వస్తే...
జగన్ మోహన్ రెడ్డిది వాపో, బలుపో తెలియక జుట్టుపీక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను నియంత్రించలేక తప్పుల మీద తప్పులు చేస్తున్నది. A-1 గా ఉన్న జగన్ను అరెస్టు చేయకుండా...ఏవేవో తిక్కపనులు చేస్తూ పోతున్నది. అకౌంట్ల స్థంభన అనేది కచ్చితంగా రాజకీయ కోణంలో జరిగిందే. వై.ఎస్.ఆర్. నుంచి లబ్ది పొందిన పారిశ్రామికవేత్తలు ఆయన ఆదేశం మేరకో, ఆయన్ను ప్లీజ్ చేయడం కోసమో 'సాక్షి' లో పెట్టుబడులు పెట్టారనేది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. దాన్ని నిర్ధరించి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటే పర్వాలేదు గానీ కావాలని కంపు చేయాలని చూడడం పధ్ధతి కాదు. తదనంతరం....పత్రికా ప్రకటనలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఒక ఆర్డర్ వేయడం మాత్రం తెలివితక్కువ విషయం.
'ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ'పై చర్చ అంటూ కొందరు జర్నలిస్టులను పిలిచి జూబ్లీహాల్ లో రౌండ్ టేబుల్ చర్చ జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడం వల్ల లక్డీకాపూల్ లో ని స్పియర్ మింట్ సంధ్య హోటల్ లో ఒక చర్చ నిర్వహించారు. దానికి సీనియర్ ఎడిటర్ ఎ.బి.కె.ప్రసాద్, మరొకాయన సమన్వయకర్తగా వ్యవహరించారు. అందులో జర్నలిజాన్ని నమ్ముకున్న వారికన్నా అమ్ముకుంటున్న వారూ కొందరు ఉన్నారు. అవినీతి వ్యవస్థీకృతమైనది కాబట్టి...ఇక దాని గురించి మాట్టాడవద్దని నిస్సిగ్గుగా స్టూడియో చర్చల్లో వాదిస్తున్న ఒక దళారీ గొంతు బాగా వినిపించింది. ఆయనా ఆయన తాబేదార్లు ఎక్కడ చూసినా స్టూడియోల్లో దర్శనమిస్తూ ఇది కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడే నంటూ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఇందులో నా మాజీ సహచరుడు, ఇప్పుడు సాక్షిలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న జీవీడీ కృష్ణమోహన్ చక్కగా ప్రసంగించారు. మాది క్లీన్ మనీ అని ఏ ఛానలైనా చెప్పగలదా? అని ఆయన ప్రశ్నించారు. అది చాలా వాలిడ్ పాయింట్. విచిత్రమేమిటంటే...సీనియర్ మోస్ట్ జర్నలిస్టు వరదాచారి గారిని ఈ చర్చకు ఆహ్వానించకపోవడం.
ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్ నాన్న ఈనాడు ను, జ్యోతి ని ఇబ్బంది పెట్టినప్పుడు లేని 'పత్రికా స్వేచ్ఛ' ఇప్పుడు ఎలా చర్చకు వస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. జర్నలిస్టులు రాజకీయానికి, వృత్తికి తేడా గమనించకుండా....ప్రతి దాన్నీ పత్రికా స్వేచ్ఛ కిందకు లాక్కుంటే....'నాన్నా...పులి' వ్యవహారమై మన పవిత్రమైన వృత్తి మరింత నగుబాటు అవుతుంది.
28 comments:
అవినీతి డబ్బుతో పెట్టిన ఒక పత్రిక అకౌంట్లని బ్లాక్ చెయ్యడం పత్రిక స్వేచ్ఛని హరించడమా? అవినీతి వ్యవస్థలోనే నిజమైన స్వేచ్ఛ ఉందని నమ్మితే ఇక చట్టాలు ఎందుకు? రాజ్యాంగాన్ని తీసి పొయ్యిలో పడెయ్యొచ్చు.
క్లీన్ మనీ కాదని జీవీడీ ఒప్పుకున్నారు. కానీ తన యజమానిపై మాత్రం దాడి చేయద్దని వాదిస్తున్న చర్చా వేదికలో ఆయన కూడా పాల్గొన్నారు. ఒకప్పుడు దేశ, ప్రపంచ రాజకీయాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాసే కాలమిస్టుగా, జర్నలిస్టుగా (ఈనాడులో) జీవీడీకి పేరుండేది. ప్రస్తుతం ఆయన జగన్ ఓదార్పు యాత్రలకు ఉపన్యాసాలు రాస్తూ....ప్రచార సభల్లో జగన్ వెనకే ఉంటూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. అయ్యా రామోజీ ఫిలిం సిటీ వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది కదా...అలాంటి సంస్థపై మీరు దాడి చేయాలనడం ఎంతమాత్రం సబబని మావోయిస్టు ఆర్కేని ప్రశ్నించిన జీవీడీ...ఇప్పుడు జగన్ అక్రమాస్తులను ఎందుకు కొల్లగొట్టాలని చూస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టుగా ఇదీ ఆయన చేస్తున్నపని. ఎక్కడా క్లీన్ మనీ లేదన్న ఆయన మాటల వెనక తన యజమానినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న ఆక్రో్శం ఆయనలో కనిపించింది. పైగా ఆ డిస్కషన్లో కూర్చున్న వారంత నిత్యం జగన్ కు వంత పాడేవారే కానీ...ఎన్నడూ జగన్ అక్రమాలపై మాట్లాడిన వారు కాదు.పైగా సాక్షికి వ్యతిరేకంగా, నిజమైన జర్నలిజానికి నిర్వచించే వారిని అక్కడికి పిలుస్తారని ఆశించడం మీలాంటి వారి అత్యాశ. ఏ అవినీతి అక్రమాలు లేకుండానే జగన్ ను ఇలా వేధిస్తే అనుకోవచ్చు. కానీ...కుట్ర జరిగిందే సాక్షిలో పెట్టుబడుల విషయంలో అయినప్పుడు...ఈ కాకి గోల ఎందుకో అర్ధం కాదు. మొత్తం మీద వేలకోట్ల రాష్ట్రప్రజల సొమ్మును మింగినా ఫర్వాలేదు. కానీ...మా బతుకులు మాత్రం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈనాటి జర్నలిస్టు. వృత్తినిబద్ధత కోసం ఆస్తులు కోల్పోయి, అడుక్కుతినే పరిస్థితిని తెచ్చుకున్న జర్నలిస్టులకీ, ఆధునిక యుగపు జర్నలిస్టు ఎంతో తేడా కనిపిస్తోంది. జగన్ సంస్థ అవినీతి అక్రమాల మీద లేచిన ఆకాశహర్మ్యం అని అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు.నాకు తెలిసిన చాలామంది మిత్రులు భాయ్ వాడి దగ్గర చాలా డబ్బుంది. వాడిని వాడు(జగన్) కాపాడుకోడానికి మీడియాను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి...ఎక్కువ శాలరీ డిమాండ్ చేద్దాం. అవసరం వాడిది కాబట్టి చచ్చినట్టు ఇస్తాడని నాతో అన్నవారే దాదాపు ఓ పదిమంది ఉంటారు.ఇదీ జగన్ చేస్తున్న జర్నలిజం సేవ. సీబీఐ చేస్తున్నది కక్ష సాధింపే అనుకుందాం...అయినా సరే...దేశద్రోహం అయితే కాదు కదా. అవినీతిపై చర్యలు ఏదో ఒక రూపంలో ప్రారంభమైనందుకు సంతోషించాల్సింది పోయి...ఇంత గోల ఎందుకు? పత్రికా యాజమాన్యాల మీద దాడి అన్నప్పుడు...దీనిపై చర్చించాల్సింది పత్రికాధిపతులు లేదంటే చీఫ్ ఎడిటర్లు. కానీ ఒక ధనవంతుడైన పత్రికాధిపతి ఆధ్వర్యంలో సాగిన ఈ చర్చలో...ఆయన పోసే టీ నీళ్లకు, టీ టిఫిన్లకు, పికప్ డ్రాపింగ్ లకు సంతోషించి ఆయనకు ఏమాత్రం బాధకలగకుండా మాట్లాడిన ఇలాంటి తాబేదారులంతా పత్రికా స్వేచ్ఛ గురించి తీర్మానాలు చేస్తే...జనం పిచ్చివాళ్లయి చూడాలన్నమాట.
సాక్షి బ్యాంక్ అకౌంట్ల సీజ్ని తెలుగు దేశం తప్ప అన్ని పార్టీలు సమర్థించాయి. ఒక అవినీతిపరుడిపై ఇంత జాలి ఎందుకు? తప్పుడు కేసులలో ఇరుక్కున్న పేదవాళ్ళపై ఎవరూ జాలి చూపించరు కానీ జగన్ వెనుకాల ఉన్న డబ్బుని చూసే అతనిపై జాలి చూపిస్తున్నారు.
not at all
ఒక అవినీతి పుత్రిక అయిన పత్రికపై దర్యాప్తు సంస్థల చట్టబద్ధమైన దాడి, మరిన్ని దాడులు జరగాలి. పత్రికాస్వేచ్చకు బొచ్చెడు పత్రికలున్నాయి, ఇలాంటి అపద్ధాల పత్రికల స్వేచ్చతో ప్రజాస్వామ్యానికి పోయేదేమీ లేదు.
Praveen Garu,
if its proven in courts, if due course of law is taken, then nobody would have objected....
acting on press like this, based on allegations by CBI/eenadu/tdp is the cause of the debate...
please come out of ur prejudice that, sakshi is from corrupt money.. atleast for logical arguement sake.
Ram garu,
దాన్ని నిర్ధరించి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటే పర్వాలేదు గానీ కావాలని కంపు చేయాలని చూడడం పధ్ధతి కాదు.
--- i completely agree with u... here the aim is just to frighten and KILL SAKSHI.....
right way to go is.. investigating the fairness of 26 GOs, which CBI hasnt done sofar....
ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్ నాన్న ఈనాడు ను, జ్యోతి ని ఇబ్బంది పెట్టినప్పుడు లేని 'పత్రికా స్వేచ్ఛ' ఇప్పుడు ఎలా చర్చకు వస్తుందన్నది కూడా ఆలోచిచాల్సిన విషయమే.
----- as u said, if things are done in legally correct way.. nobody would have objected.....
in case of eenadu, there is never fight on eenadu.. its always legal actions on margadarsi & RFC, which even ramoji didnt challenge in court...
in case of AJ, its SC/ST attrocity case, which charged the editor and action is never aimed to KILL the press.
---
margadarshi pai case vunnappudu adhi eenadupai dhadi ani gaggolu pettadam marichara?
margadarshipai case pedithe adhi patrika swetchhapai dhadi ani nadu eenadu, tdp vanti parties gaggolu pettaledha? edhi anthe
ఈ లెక్కన, తారాచౌదరి అరెస్టు కూడా మహిళా సాధికారత మీద జరిగిన దాడిగా గుర్తించి ఆమెను తక్షణం విడుదల చేయాలి. జిల్లాకో బ్రాంచ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.com
/జిల్లాకో బ్రాంచ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను./
అంతేనా? మంత్రులు, MLAలు ఖాతాదారులుగా చేరి, బిల్స్ తమ ప్రజాసేవ పద్దుల్లో క్లైం చేసుకునే వెసులుబాటు కల్పించాలా? :D ;)
Sasidhar wrote:
>>>>>
ఈ లెక్కన, తారాచౌదరి అరెస్టు కూడా మహిళా సాధికారత మీద జరిగిన దాడిగా గుర్తించి ఆమెను తక్షణం విడుదల చేయాలి.
>>>>>
ఆ మాటకొస్తే కోస్తా ఆంధ్రలో ఉండే భోగం కులంవాళ్ళు కూడా తమ కులవృత్తి కారణంగానే ఆ పని చేస్తున్నారు కనుక భోగంవాళ్ళని అరెస్ట్ చేస్తే అది కులంపై దాడి అవుతుంది.
కోర్ట్ తీర్పు చెప్పకముందే CBI సేకరించిన ఆధారాలు చెల్లవు అని జగన్ అభిమానులు prejudice (ముందస్తు తీర్పు) ఇస్తున్నారు.
రామోజీ మార్గదర్శి illegal గ deposits collect చేసింది కాబట్టి Supreme court కూడా ఏమి అనలేదు. Supreme Court కూడా రామోజీ వ్యాపారాలలో తప్పు, పత్రిక స్వేచకు భంగం కాదు అంది.
సూర్య MD నూకారపు సూర్య ప్రకాష్ రావు , TDP MP కాండిడేట్ Cheque బౌన్సు కేసు లో అర్రెస్ట్ అయ్యాడు. అది సాక్షి కేసు ఒకటి ఎలా అవుతుంది?
YS Enadu మీద కామెంట్స్ చేసాడు కానీ కేసు పెట్టలేదు.
జగన్ మీడియా కేసులు పత్రిక స్వేచకు భంగం అనట్లేదు.
సాక్షి మీద కేసులు పత్రిక స్వేత్చకు భంగం.
చంద్రబాబు మంచి పనిమంతుడు. గొప్ప రాజకీయ క్రీడాకారుడు కూడా! పొలిటికల్ కారమ్ బోర్డు మీద స్ట్రైకరును ఎటుతిప్పికొడితే ఎటో ఉన్న రెడ్డో, దాని వెనుక బడ్డో ఎలా పాకెట్లో పడతాయో ఆయనకు భలేగా తెలుసు. పైగా బాబు పంచతంత్రంలోని దీర్ఘదర్శికి చదువు చెప్పగలిగినవాడు. ఇప్పటి తన పగవాడి డాడీలాగే నాయుడు కూడా చాలా ఏళ్లు రాజ్యమేలాడు. అనే్నళ్లూ ‘ఆ రెండు పత్రికలు’, ‘ఈ మూడు ముఠాలు’ అంటూ డైలాగులు కొడుతూ కూచోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలిసీతో ఏ క్షేత్రానికా క్షేత్రంలో పనికొచ్చే విత్తనాలను చల్లాడు. అవే ఇప్పుడు విరగపండి ఏ రంగానికారంగంలో అవసరానికి ఆదుకుంటున్నాయి.
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
మీరు ఫలానా కేసులో ఎగస్పార్టీకి మేలు చేశారు. కాబట్టి ఈ కేసులోనూ మాకు కీడే చేస్తారు. మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు కేసు తీసుకోకండి - అంటూ ఆ బాలుడు అడ్డదిడ్డంగా వాదిస్తూ తీరికూర్చుని జడ్జిలకు ఒళ్లు మండిస్తూంటే - ఈ గోపాలుడు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరిన బాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.
A nice article by Janardhan..
http://janardhanpen.blogspot.in/2012/05/blog-post_6269.html
అబ్బా ఎంత బాగా రాశారో రాము గారు...:-)
@Sasidhar : Absolutely true. దొంగల రాజ్యం లో ఎవరి మీద కేసు పెడితే ఎవడు వూరుకుంటాడు....చుట్టూ వున్నోళ్లూ దొంగలేగా ? అంటాడు. ఇక్కడ జరుగుతున్నది అదే...ఈనాడు ఒక దొంగ...సాక్షి గజ దొంగ...కాంగ్రెస్ ఒక కరప్ట్ పోలీసు..తెరాసా గజ దొంగ సాయం పొందిన పార్టీ...ఈ దొంగలందరి మధ్యలో అయోమయంగా...అమాయకంగా...మూర్ఖంగా మన జనాలు...ఇదీ సంగతి !
Sasidhar , సూపర్ !!! వందల మంది అమాయకులు చావు కి కారణమైన ఉగ్రవాదులకి ఉరి శిక్ష వద్దని మనవ హక్కులు సంఘాలు గోల చేస్తున్న ఈ రోజుల్లో సాక్షి పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడటం లో వింత ఏమి వుంది !!! నైతిక విలువలకు "విశ్వసనీయత" కు కొత్త అర్ధాలు ప్రవచించుకోవలసిన రోజులు ఇవి!!!
Sasidhar , సూపర్ !!! వందల మంది అమాయకులు చావు కి కారణమైన ఉగ్రవాదులకి ఉరి శిక్ష వద్దని మనవ హక్కులు సంఘాలు గోల చేస్తున్న ఈ రోజుల్లో సాక్షి పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడటం లో వింత ఏమి వుంది !!! నైతిక విలువలకు "విశ్వసనీయత" కు కొత్త అర్ధాలు ప్రవచించుకోవలసిన రోజులు ఇవి!!!
ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్ నాన్న ఈనాడు ను, జ్యోతి ని ఇబ్బంది పెట్టినప్పుడు లేని 'పత్రికా స్వేచ్ఛ' ఇప్పుడు ఎలా చర్చకు వస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. జర్నలిస్టులు రాజకీయానికి, వృత్తికి తేడా గమనించకుండా....ప్రతి దాన్నీ పత్రికా స్వేచ్ఛ కిందకు లాక్కుంటే....'నాన్నా...పులి' వ్యవహారమై మన పవిత్రమైన వృత్తి మరింత నగుబాటు అవుతుంది.
-- Ramu Garu, As I said earlier, there never was attack on EENADU.. its always on Margadarsi, which is supported in Supremecourt as well...
-- So far, attack on Jagan is never projected as attack on press..... its only now that sakshi accounts are freezed in very undemocratic procedure, i see it as issue.
chinna, unknown రామోజీ, చంద్రబాబు అవినీతిపరులు అని వుతికేస్తే, సాక్షి నలుపు తెలుపు కాదు, కానేరదు. ఇప్పుడు వీళ్ళ వాదనకు ఒగ్గి వదిలేస్తే రేపు ఈ వదిలివేతను సాకుగా చూపి వాళ్ళిద్దరూ బయట పడగలరు. ప్రతి పట్టుబడ్డ దొంగెదవ తాను గిల్లింది కొంతే నని ఇలా గిల్లేటోళ్ళు చాలా మందున్నారని అని వాదించడం మామూలే, అని ఏ 3ఏళ్ళ అనుభవం వున్న కుర్ర కానిస్టేబుల్ నడిగినా చెబుతాడు. :)
ఇవి కేసు, కేసును బట్టి చూడాల్సిన విషయాలు, అన్నీ కలిపి సామూహిక న్యాయం చేయడమంటే కుదిరేది కాదు. అలాంటి న్యాయశాస్త్రం ప్రపంచంలో ఎక్కడా అమలులోలేదనుకుంటా.
ఈ కేసు విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి. రామోజీ, చంద్రోజిలు పట్టుబడినపుడు బలంగా మొట్టే అవకాశం నీరుగార్చకండి.
అక్కవుంట్లు సీజ్ చెయడం పత్రికా స్వేచ్చ పై దాడి అంటున్నారు ..
మరి రేపొద్దున్న భాను ఆస్తులు/అక్కవుంట్లు సీజ్ చేస్తే అది రౌడీ స్వేచ్చ పై దాడి అంటారా ?
SNKR garu,
I never argued saying that.. babu also corruput ... etc...
I argued only on the point that.. all corrupted people should be brought to book but.. in proper legal procedure otherwise, there is no diff b/w human and animal justice.
Hi John Garu,
I am an ordinary AP citizen. not like you great persons.
are you support eenadu banks accounts block regard margadharsi Fraud . if court verdict come fine may be around 500 crs thats what i know ?
Regarding Sakshi Case I like to block sakshi accoutns once CBI complete the probe come with proofs. all I seen allegations from CBI which another surprise to me .
we all know its a political case why we are running behind jagan & SAKSHI . after this you think I am YSR follower . no probs for that
@sekhar reddy
/are you support eenadu banks accounts block regard margadharsi Fraud/
Criticizing jagan is not equal to supporting eenadu. Those tow are two different issues.
/I like to block sakshi accoutns once CBI complete the probe come with proofs. all I seen allegations from CBI which another surprise to me . /
So, you read all the documents CBI prepared ? Are you sure they are just allegations but not proofs ?!
/we all know its a political case why we are running behind jagan & SAKSHI/
Great..!
ఆరోపణల పై ఎంక్వయరీ జరుగుతోంది...ఈ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడానికి వాళ్ళకున్న కారణాలను కోర్టులో చూపిస్తారుగా...అనవసరం అనుకుంటే కోర్టు ఎలానూ సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూంది....వ్యాపారాలు చేసేప్పుడు..ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవు...వాటిని ఎదుర్కోవాలిసిందే...ఇంత సొమ్ముని ఎంజాయ్ చేస్తున్నపుడు...కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నపుడు చిరునవ్వులా??ఈ సొమ్మెక్కడిదీ అని ఎవరైనా నిలదీస్తే కళ్ళ నీళ్ళ పర్యంతమవడమా??ధీరులకు ఉండాల్సిన లక్షణం మాత్రం కాదు..జగన్ వర్గం పిరికి గా వ్యవహరిస్తోంది...
we all know its a political case why we are running behind jagan & SAKSHI ...
అంత మాత్రాన తప్పుడు పద్దతుల్లో సంపాదించిన సొమ్ములపై ఎంక్వైరీ చేయరా??ఎవడి బాబు సొమ్మని పదిహేను వేల ఎకరాలు ఎవడికో రాసి ఇచ్చేస్తారు...వాడు తిరిగి అబ్బాయి గారి కోటలో కోట్లు పెట్టడం....ఇదేమీ పైవేటు వ్యవహోరం కాదు...మళ్ళీ మరొకడు ఇలాంటి పనులు చేయకుండా ఈ వ్యవహోరాన్ని అంతు చూడాలిసిందే...
KVSV Garu,
/ఆరోపణల పై ఎంక్వయరీ జరుగుతోంది...ఈ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడానికి వాళ్ళకున్న కారణాలను కోర్టులో చూపిస్తారుగా...అనవసరం అనుకుంటే కోర్టు ఎలానూ సీబీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూంది./
- I guess.. it should be the other way around, when u r taking such extreme steps... You should take permission from court citing proper arguements... Here, things are happening in the reverse direction. Freezing accounts, making people panic .. all these things can prove to be disastrous for the company... later, if court says its wrong... isn't too late????
In this blog itself, I saw sakshi employees making enquiries abt jobs in other media houses... It's all the effect of CBI action, which "may or may not" be proved in court.
Case is running and both sides are making their argument.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి