Sunday, May 13, 2012

నిజ్జంగా వేమూరి రాధాకృష్ణ పత్తిత్తా?


'ఏది పత్రిక...ఏది స్వేచ్ఛ?' అన్న శీర్షికన వేమూరి రాధాకృష్ణ గారు నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక సంతకంతో కూడిన ఎడిటోరియల్ రాసారు. అందులో కొన్ని పాయింట్లు నాకు బాగా నచ్చాయి. స్వకులానికి చెందిన పార్టీ, నాయకుడు అర్జెంటుగా అధికారం లోకి రావాలని మరో కమ్మ ఎడిటర్ ఇన్ చీఫ్ తో పాటు కలలుకంటున్నవాడిగా రా.కృ.కు ముద్ర వున్నది కాబట్టి ఆయన చిత్తశుద్ధిని శంకించే అవకాశం ఉంది కానీ...సో కాల్డ్ జర్నలిస్టు నేతలు శ్రీనివాస రెడ్డి, దేవులపల్లి అమర్ ల మీద నిర్భయంగా రాసే దమ్మున్న వ్యక్తి రా.కృ. వారిద్దరిని కొట్టిన కొట్టుడుకు ప్రెస్ క్లబ్బుల్లో మందు బాటిళ్ళు చాలా ఎగిరిపోయి ఉంటాయి. 

నీతి పట్ల మనకు ఉన్న అభిప్రాయాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, మన రాజకీయ నేపథ్యాన్ని బట్టి ఈ ఎడిటోరియల్ మీద అభిప్రాయాలు ఉంటాయని నాకు బోధపడింది. రా.కృ. ఎడిటోరియల్ చదివిన మూడు విభిన్న కులాలకు చెందిన జర్నలిస్టులు నాతో ఫోన్లో మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. 
కమ్మ  జర్నలిస్టు: రామూ...రాధాకృష్ణ ఎడిటోరియల్ చదివావా? అదిరిపోయింది. శ్రీనివాస రెడ్డి, అమర్ లను కడిగి పారేశాడు. తప్పకుండా చదువు.
రెడ్డి  జర్నలిస్టు: రాధాకృష్ణ బతుకు ఎవరికి తెలియదు. చంద్రబాబు అండతో ఆయన ఏమి చేసిందీ అందరికీ తెలుసు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండానే ఆయన ఈ స్థాయికి ఎదిగాడా?
బ్రాహ్మణ జర్నలిస్టు: నీతి గురించి మాట్ల్డాలంటే కొంత అర్హత ఉండాలి. నీతి గురించి ఏ అర్హతతో రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు? వాడి బొంద. 
సెక్యులర్ జర్నలిస్టు: ఇదొక కుల పోరాటం. వై.ఎస్.ఆర్. హయాం లో పడిన ఇబ్బందుల తాలూకు కసిని రా.కృ.ఇలా తీర్చుకుంటున్నాడు. కాకపోతే....ఈ ఇద్దరు యూనియన్ నేతలను ఎదకట్టడం అభినందించాల్సిన విషయం. మీడియాను భ్రష్టు పట్టిస్తున్న కమ్మ కుల నేతల గురించి కూడా ఆయన రాస్తారేమో చూద్దాం.

అదీ సంగతి...ఈ నేపథ్యంలో అన్ని పత్రికలు, ఛానెల్స్ తమ పెట్టుబడులు, లాభ నష్టాల జాబితాలను స్వచ్ఛందంగా ప్రకటిస్తే బాగుంటుందేమో? మీరేమంటారు? 

17 comments:

Praveen Mandangi said...

మన దేశంలో పత్రిక నడపడం అనేది లాభదాయక వృత్తి కాదు. గిరీష్ సంఘీ సంఘీ బట్టల మిల్స్ నుంచి వచ్చిన డబ్బుతో పేపర్ పెట్టాడు. అతను బ్యాంక్‌లోన్ ఎగ్గొట్టాడని సంఘీ మిల్స్ ఆస్తులని బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అతని పేపర్‌కి నష్టాలు వస్తే మిల్స్ డబ్బులని పేపర్‌లో పెట్టి పేపర్ ఆదాయం పెంచడానికి అవ్వదు. రేపు ప్రియా పచ్చళ్ళ వ్యాపారానికి నష్టాలు వస్తే ఈనాడు పేపర్ కూడా ఇలాదే రిస్క్‌లో పడుతుంది. సాక్షి విషయానికి వస్తే అది ఆరంభం నుంచే దొంగ డబ్బుతో పెట్టిన పత్రిక. దొంగ డబ్బు లేకపోతే ఆ పత్రిక నడవదు. ఇక ఆంధ్ర జ్యోతి పెట్టడానికి రాధాకృష్ణకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు కానీ అతను కోస్తా ఆంధ్ర నుంచి వలస వెళ్ళి నిజామాబాద్ జిల్లాలో స్థిరపడిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడని మాత్రం తెలుసు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతనికి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అతనికే తెలియాలి.

Chinna said...

Can you tell me who the real owner of Andhra Jyothy is?
Rada Krishna salary was 8000/month and how could he start paper without Babu’s black Money?

Anonymous said...

ఒక చిన్న సందేహం. రాధకృష్ణ టి వి లో చేసే ఇంటర్వ్యూలు చూస్తుంటే ఆయన దగ్గర పెద్ద సత్తా ఉన్నట్టు అనిపించదు. కాని ఆయన రాసే వ్యాసాలు బాగుంటాయి. ఈ వ్యాసాలను ఆయనే రాస్తాడా లేక ఈ పాయింట్స్ మీద రాయి అని చెప్పి, ఇతర విలేఖరులతో రాయించి ఆయనపేరు వేసుకొంటాడా?

tarakam said...

మన సమాజం మొత్తం కులాల వారీగా విడిపోయిందనడానికి,వివిధ కులాల జర్నలిస్టులు మీతో ఫోన్లో మాట్లాడిన విషయాలే ఉదాహరణ.మన రాష్ట్రం అభివృధ్ధి పంధా నుంచి,ఉత్తరప్రదేష్,బీహార్ల లాగా తిరోగమన పథం లో పయనించడంలో మన నాయకుల పాత్ర ఎంత?మీడియా పాత్ర ఎంత?అనేది సమీక్షించాల్సిందే.ఈనాడు,ఆంధ్రజ్యోతి,సాక్షి పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో ఒక్కరైనా మీరువ్రాసిన ఏడు ప్రిన్సిపల్స్ లో ఒక్కదానినైనా పాటిస్తున్నారా?పై మూడు పత్రికల యజమానులు తమ మురికి గుడ్డలను ఉతుక్కోవడానికి(washing the dirty linen in public )తప్పితే ఒక వార్తాపత్రిక నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి ఏమన్నా పట్టించుకొంటున్నరా?మీలాంటివారికనైనా పూనుకొని సత్యమేవజయతే అమీర్ ఖాన్ ను స్పూర్తిగా తీసుకొని మన సామాజిక సమస్యలు,వాటి పరిష్కారాలమీద దృష్టి పెడితే బాగుంటుదని కోరుకుంటున్నా.

Praveen Mandangi said...

చిన్నా, ఆ మాటకొస్తే 1978లో రాజశేఖరరెడ్డి ఒక చిన్న పట్టణంలోని డాక్టర్. ఆ తరువాత అతను కోట్లకి ఎలా పడగలు ఎత్తాడు?

Anonymous said...

ఒక మనిషి గురించి ఇంత discussion అవసరమా ?....వేమూరి..!!! you really rocking in AP media

Chinna said...

Srinivas, U are right.

Praveen Mandangi said...

తారకం గారు, ఉత్తర్ ప్రదేశ్ & బీహార్‌లు అభివృద్ధి చెందకపోవడానికి కారణం కులం ఒక్కటే కాదు. ఆ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ చెయ్యించుకునేవాళ్ళు తక్కువ. ముస్లింలూ, కొంత మంది హిందువులు కూడా మతపరమైన కారణాల వల్ల కుటుంబ నియంత్రణ చెయ్యించుకోరు. కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడితే వోట్లు పడవనుకుని రాజకీయ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ఆ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ చెయ్యించుకునేవాళ్ళు ఎక్కువే. కానీ మన రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ విధానాలూ, పన్ను పోట్లు కూడా వెనుకబాటుతనానికి కారణమే.

Bullabbai said...

అనా, మీ నాయన గారి ఆరోగ్యం కుదుటపడిందా?

K V Ramana said...

Annayya
I know an incident where a stringer of a newspaper sat with a group of landgrabbers for "compromise"with another similar group. Things went out of control and the other group thrashed the stringer. He immediately filed a complaint that landgrabbers beat him since he was writing against the landgrabbing activities. Even this is seen as an attack on media. First of all that stringer tried to act as a court to settle dispute between two groups and when he was thrashed, it was shown as attack on media.
The case in Sakshi is similar to that. Why should journalists worry about investigation at all? I was told that a group of staffers from Sakshi wanted to move a motion in the High Court against the CBI action under Section 102 of CrPC fearing that their salaries would be stopped if bank accounts are frozen. Why are the employees looking at the source of salaries. Ethically, if you believe that there is no wrong, stay there and the management will pay you. If they can't pay you, there is nothing you can do about it but to quit. It is important to remember that the media or newspaper is different from the corporate entity owning the newspaper. As professional journalists we should not be looking at the corporate entity. No point in getting confused.

Padma said...

congress peddalaku dammunte eenadu, andhrajyothy accounts kuda freeze cheyyali. Ads apeyyali... vati meeda kuda boledu kesulunnai. Anni congress vallu nadipinche kesule...

maa godavari said...

http://currentnews.in/2012/05/10/20000-crore-hydropower-scam-in-sikkim-state-govt-complicit/

pl see this link

Raj said...

Excellent summary Ramu garu , you just exploded the naked face of media and interests of participants. This narration indicates neither the media owners nor media employees, who got very limited scope unfortunately to change anything they believe in, are really interested in society for collective agenda. The inner core interest of running a media is on caste based one and to retain political power there by.
Vemuri Radha krishna becoming an editor for a news paper itself indicates what happens if a political leader wants to paralyze the media with his own intentions. The art of hijacking media for political self interests roofed with the genesis of Sakshi to counter the existing media giants, who promote their respective promoter with either bloc or mafia money.
In summary hidden agendas with evil mentality are fighting among each other survival, lets hope they kill each other to blossom a new face of telugu media industry.

Anonymous said...

అందరూ ఒక తానులో ముక్కలే...అసలు ఈ చర్చ లన్నీ వృధా...satyavati gaaru ఇచ్చిన లింక్ చూడండి...ఇక ఆలోచించాల్సినది ఏమీ లేదు...ఈ దేశం లో పేపర్ పెట్టినా రాజకీయంలోకి వెళ్ళినా కులం పేరుతో మరోటి చేసినా డబ్బు సంపాదనే ద్యేయం..
కోటానుకోట్ల రూపాయలు సంపాదించాలన్న ఆశ.....ఈ దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు...బ్రష్టు పట్టి పోవడమే...బాబు తెర తీస్తే...దేముడు నాలుగు ఆకులు ఎక్కువ అంతే...ఈ అమర్నీ వాళ్ళని ఏమనాలి...కడుపుకు అన్నం తింటున్నారా వీళ్ళు...నవ్వి పోనేల నాకేటి సిగ్గు అన్నట్ట్లు వ్యవహరిస్తున్నరు...వీళ్ళా జర్నలిస్ట్ నాయకులు??వీళ్ళ పద్దతి చూస్తే అబద్దానికి నోరు పెద్ద్ద దన్న విషయం బోధపడుతుంది...
ముందుముందు మరెన్ని విని, కనాలో???
రామోజీ జులుం చూశాం...
బాబు పచ్చ పార్టీ వాళ్ళు...సైకిళ్ళ మీద తిరిగి..రాత్రికి రాత్రి కుబేరులై పోయిన సంగతి....చూశాం....
ఈ దేముడ్ని నెత్తి కెక్కించుకుంటే....చూసారుగా రాష్ట్రాన్ని మొత్తం ఐస్ ప్రూట్ లా చీకేశాడు....మన జగన్ బాబు..
మళ్ళీ ఈయన్ని సపోర్ట్ చేసే గుంపొకటి...
కాబట్టి...మనం మూసుకు కూర్చోడం బెటర్...అనవసరంగా బీపీ షుగర్ లు పెంచుకోకుండా...

Anonymous said...

అందరూ ఒక తానులో ముక్కలే...అసలు ఈ చర్చ లన్నీ వృధా...satyavati gaaru ఇచ్చిన లింక్ చూడండి...ఇక ఆలోచించాల్సినది ఏమీ లేదు...ఈ దేశం లో పేపర్ పెట్టినా రాజకీయంలోకి వెళ్ళినా కులం పేరుతో మరోటి చేసినా డబ్బు సంపాదనే ద్యేయం..
కోటానుకోట్ల రూపాయలు సంపాదించాలన్న ఆశ.....ఈ దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు...బ్రష్టు పట్టి పోవడమే...బాబు తెర తీస్తే...దేముడు నాలుగు ఆకులు ఎక్కువ అంతే...ఈ అమర్నీ వాళ్ళని ఏమనాలి...కడుపుకు అన్నం తింటున్నారా వీళ్ళు...నవ్వి పోనేల నాకేటి సిగ్గు అన్నట్ట్లు వ్యవహరిస్తున్నరు...వీళ్ళా జర్నలిస్ట్ నాయకులు??వీళ్ళ పద్దతి చూస్తే అబద్దానికి నోరు పెద్ద్ద దన్న విషయం బోధపడుతుంది...
ముందుముందు మరెన్ని విని, కనాలో???
రామోజీ జులుం చూశాం...
బాబు పచ్చ పార్టీ వాళ్ళు...సైకిళ్ళ మీద తిరిగి..రాత్రికి రాత్రి కుబేరులై పోయిన సంగతి....చూశాం....
ఈ దేముడ్ని నెత్తి కెక్కించుకుంటే....చూసారుగా రాష్ట్రాన్ని మొత్తం ఐస్ ప్రూట్ లా చీకేశాడు....మన జగన్ బాబు..
మళ్ళీ ఈయన్ని సపోర్ట్ చేసే గుంపొకటి...
కాబట్టి...మనం మూసుకు కూర్చోడం బెటర్...అనవసరంగా బీపీ షుగర్ లు పెంచుకోకుండా...

ORACLE DBA said...

KVSV...I Agree with you.!!!

Anonymous said...

@sssssssssss thank you ...meerayinaa naa gola ardham chesukunnaaru...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి