Saturday, October 13, 2012

ABC ఛానల్ పరిస్థితి ఏమిటి?

 సీనియర్ ఎడిటర్ భావ నారాయణ గారి ఆధ్వర్యంలో ABC అనే ఛానల్ వస్తుందని తెలియగానే...దానికి పెట్టుబడి ఎవరు పెడుతున్నారో కనుక్కోమని ఒకరిద్దరు మిత్రులు అర్థించారు. పనుల ఒత్తిడి వల్ల నేను ఆ ప్రయత్నం చేయలేదు. అప్పటికే కొందరు జర్నలిస్టులను భావనారాయణ గారు నియమించారని కూడా సమాచారం. ఈ లోపు...CID పోలీసులు మైనార్టీ కార్పోరేషన్ లో కుభాకోణాన్ని బైట పెట్టారు. దర్యాప్తు తర్వాత సీ ఐ డి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్.వీ.రమణ మూర్తి విడుదల చేసిన ప్రకటనలో ఈ పేరాగ్రాఫ్ ABC లో చేరిన, చేరాలనుకున్న జర్నలిస్టులను అగాథం లోకి నెట్టింది.
"  It was confessed by Sai Kumar that an amount of Rs. 8 crores was paid to launch a new TV Channel in the name of ABC TV towards which he had entered into a MoU with one Bhava Narayana and others who were earlier working with various channels. " అని అందులో పేర్కొన్నారు. 
భావ నారాయణ బృందం కేవలం ఈ దొంగ బ్యాచ్ మీద ఆధారపడి  ఛానల్ ఆలోచన చేసిందా...వీళ్ళు జైలుకు వెళ్ళినా వేరే వాళ్ళ సహకారంతో చానెల్ వస్తుందా అన్నవి తేలాల్సిన అంశాలు. 
సీ ఐ డీ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి వాళ్ళు (పోలీసోళ్ళు) భావనారాయణ గారితో ఇప్పటికే మాట్లాడి ఉండాలి. లేకపోతె...త్వరలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గానీ తెరవెనుక విషయాలు బైటికి రావు. 

పెట్టుబడులు పెట్టే వారి గురించి తెల్సుకోకుండా...డబ్బులు వస్తున్నాయి కదా...అని రెచ్చిపోతే...జర్నలిస్టులు తర్వాత ఇరుక్కుంటారు. ఈ విషయంలో నాకు ఒక వింత అనుభవం ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సలహా వల్ల  బైట పడ్డాను. లేకపోతె....గాలి జనార్ధన రెడ్డి గారి మాదిరిగా జైల్లో వుండే వాడినేమో!

ఈనాడు జర్నలిజం స్కూల్లో నాతొ పాటు చదువుకున్న ఒక సీమ పుత్రుడు చాలా రోజుల తర్వాత అప్పట్లో నాకు ఫోన్ చేసాడు. ఇప్పుడు జైల్లో ఉన్న ఒక ప్రముఖుడి దగ్గర ఆయన పనిచేసారు. నా బ్లాగు బాగుంటుందని...చాలా మంది చదువుతారని...తను కూడా ఇలాంటి మెటీరియల్ తో ఒక పత్రిక తెచ్చి మూసేసానని...ఆ పత్రికను మళ్ళీ  తేవడానికి పెట్టుబడి పెట్టడానికి తానూ సిద్ధంగా ఉన్నానని...చెప్పాడు. అది విని నాకు యమా ఊపు వచ్చింది. 
మీడియా మీద సీరియస్ గా పత్రిక తెచ్చి సమాజాన్ని అర్జెంటుగా ఉద్ధరించాలని నేను సీరియస్ గా ఆలోచిస్తున్న రోజులవి. వెంటనే...ఒక పత్రికలో పనిచేసి ఖాళీ గా ఉన్న ఒక మిత్రుడిని సంప్రదించి...ఆయనతో ఒక ప్రపోజల్ తయారు చేయించా. అప్పట్లో ఎన్  టీ  వీ నుంచి బైటికి వచ్చి ఖాళీగా ఉన్న హేమను కూడా అందులో ఇంవాల్వ్  చేయాలన్నది ప్లాన్. మొత్తం మీద....పెట్టుబడి పెడతానన్న మిత్రుడి గురించి ఆరా తీస్తే....ఆయన దగ్గర ఉన్నది క్లీన్ మనీ కాదని అర్థమయ్యింది. ఒక రెండు రోజులు నిద్ర మానేసి...ఏమిటి చేయడమని ఆలోచించాను. నీ పిచ్చి కాకపొతే...ఈ రోజుల్లో ఏ పెట్టుబడి దారుడి దగ్గరైనా...క్లీన్ మనీ ఉంటుందా? అన్న ఒక సన్నిహిత మిత్రుడి ప్రశ్న  నన్ను కన్వీన్స్ చేసింది. ఆఫీసు కోసం ఇల్లు కూడా వెతికాను. అడ్వాన్స్ ఇద్దామని, ఫర్నిచర్ సిద్ధంగా ఉందని మా పెట్టుబడి దారుడు చెబితే నమ్మాను. 

అయినా....మనసులో సందేహం వుండి ...నేను అభిమానించే ఒక పెద్ద మనిషి (సీనియర్ జర్నలిస్టు) దగ్గరకు వెళ్ళాను. పరిస్థితి వివరించాను. ఏమి చేయమంటారని అడిగాను. "అతన్ని నమ్మడానికి వీల్లేదు. అలాగని ఈ అవకాశం వదులుకోవడం కూడా చేయవద్దు. కొద్దిగా పెద్ద మొత్తాన్ని జాయింట్ అకౌంట్ లో వేయమను. అప్పుడు తేడా వస్తే....తర్వాత సంగతి తర్వాత చూడవచ్చు...," అని మా సారు అన్నారు. తనతో గొడవ వస్తే...ఏమిటన్న సందేహం వచ్చింది. సరే...దానికి సంబంధించి కూడా మనల్ను ఆరాధించే కండపుష్టి  వీరులు కొందరిని అలెర్ట్ చేసాను. 

ఇక్కడే నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడైతే...జాయింట్ అకౌంట్ అన్నానో...ఆ రోజు నుంచి మన పెట్టుబడిదారుడు నా ఫోన్ తీయడం మానేసాడు. ఒక పది సార్లు ప్రయత్నం చేసి...ఛీ...తనతో మనకు అనవసరమని వదిలేసాను. తర్వాత గాలి కుంభకోణం బైట పడడం...మన మిత్రుడి ఆచూకి తెలియకుండా పోవడం జరిగాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు.   

ఇలా...ఒక వారం పది రోజుల నా సమయాన్ని, నిద్రను, కలలను  ఖతం చేసింది...ఈ వ్యవహారం. అప్పుడు మళ్ళీ మా నాన్న చెప్పిన మాట గుర్తుకు వచ్చింది....పరిగెత్తి పాలు తాగడం కన్నా....హాయిగా నిలబడి నీళ్ళు తాగడం...ఉసేన్ బోల్టు లా పెరిగెత్తుతూ పాలు కిందా  మీదా పోసుకునే వారిని చూస్తూ...వీలయితే వద్దురా నాయనా...అని సూచిస్తూ  గడపడం అంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదని. 

భావ నారాయణ గారు కూడా ఈ సమస్య నుంచి బైటపడి...ఒక లక్షకో, లక్షన్నరకో ఏదో చానెల్ లో చేరి ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అది కష్టమైనా..జర్నలిస్టులు పెట్టుబడి గురించి కాస్త వాకబు చేసుకుని, డబ్బు కక్కుర్తికి పోకుండా కాస్త సురక్షిత చానెల్ లో పని చేయడం ఉత్తమం. 

8 comments:

katta jayaprakash said...

Now a days media has become best investment as one feels one can earn a lot through various fraudulent methods and that's why the criminal minded scamster of minority fina corpor has entered into the field.This is how people think of media as media is for easy money.

JP.

JE said...

హాయ్ గురు ...
మిరి thread పెట్టకముందే నేను మీకు రిప్లై ఇద్దామనుకున్నాను. భావాన్నారాయణ గారి ఆత్రం అయన కొంప మున్చిన్దనడం లో సందేహం లేదు ..
కానీ మీరు ఇప్పుడు ఆ గాలి పీయే జాయింట్ ఎకౌంటు లో వేస్తె మీరు ఓపెన్ చేసే వాళ్ళేనా ...కాకపోతే ఇక్కడ ఓ విషయం ఏంటంటే..
భావన్నారాయణ గారు ..దిన్ని ఎలా దేఅల్ చేస్తారనదే ముక్యం. జరిగిన విషయం లో భావన్నరయన్ కూడా తినే ఉంటాడు అని ఓ రాయి విసరడం చాల చాల
ఈజీ ....

కానీ అందులో ఎంత నిజం ఉండనదే చూడాలి. ఓ వ్యక్తి ఛానల్ పెడతాను అంటే..నీకు ఆ డబ్బు ఎక్కడిది అని అడిగే ధైర్యం ఎవరికీ
ఉంటుంది? అసలా భాద్యత ఎవరిదీ? ప్రభుత్వం ఎంక్వయిరీ చేయకుండా ఎందుకు లిస్సున్సు జారి చేస్తోంది? ఇక్క ద ముందు
abc ఛానల్ ఫస్ట్ లిస్సెంసీ అంకబాబు డి అయితే అయన వెనక ఉన్నది ఎవరు?> అయన ఎందుకు అమ్మడు?>ఇది ఆలోచించండి.

తులసి నుంచి బయటకి వచ్చాక త్వరగా ఏదో ఒక ఛానల్ తో బయటకు వచ్చి నేను 24 గంటల న్యూస్ ఛానల్ ఓపెన్ చేయగలను అనే
విషయాన్నీ ప్రొవె చేయడానికి భావన్నారాయణ గారు అత్ర పడ్డారంటే అర్ధం ఉంది ..కానీ ప్రోమోతెర్స్ విషయం తెలిసి కూడా
abc ని ప్రోమోతే చేస్తే తప్పు. ఓ వేల అయన కి ఈ స్కాం లో పాత్ర లేకపోతె..మనం ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ కూడా ఎంతో బాధ ని కలగా చేస్తాయి.

ఇక్కడ ఓ ఇంకో విషయం ..ఇప్పుడు ఉన్న చానల్స్ మాత్రం ఏ అన్యాయం చేయకుండానే రన్ అవుతున్నాయా ? కాకపోతే ముందే బయట పడేసరికి అతన్ని

blame చేస్తున్నారు ..సూర్యా పేపర్ సంగతేంటి...దాని ఓవ్నెర్ పేపర్ రన్ చేసిన 3 ఏళ్ళకి కదా అయన భాగోతం బయటపడి జైల్లో రెస్ట్ తిస్కుంది ..ఇక్కడ
నేను ఆ పేపర్ ని తప్పు పట్టడం లేదు. అక్రమర్కులకి మీడియా ముసుగు ..వర్షం లో గొడుగు లా ఎలా వాడుకుంటున్నారో అనేది నేను చెప్తోంది.

ఇప్ప్పుడు మల్లి చానల్స్ revolution ప్రారంభమైంది కదా ఎవరే సొమ్ము తో పెడుతున్నారో అడగగల ధైర్యం ఎవరికీ ఉంది? మంచి శాలరీ ఇస్తే చాలు
జాయిన్ అవుదాం అని అనుకోక జౌర్నలిస్త్స్ ఇక ఎం అనుకుంటారు రాము గారు?

Anonymous said...

@.పరిగెత్తి పాలు తాగడం కన్నా....హాయిగా నిలబడి నీళ్ళు తాగడం...ఉసేన్ బోల్టు లా పెరిగెత్తుతూ పాలు కిందా మీదా పోసుకునే వారిని చూస్తూ..

సొసైటీ నాశనమైపోడానికి ముఖ్య కారణం ఇదే...ఏదో చేసేయాలి రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోవాలి...సంచలనాలు సృష్టించేయాలి అనుకుని ..తప్పు దారుల్లోకి పోవడం.. లేదా దారి తప్పటం... ఆ ఆలోచనలు ఒక పట్టాన వదిలించుకోలేక పోవడం...ఇక్కడ మరో కోణం...

JE said...

అయ్యా దయచేసి అర్ధం చేస్కొండి..డబ్బు సంపాదించుకోవడానికి కాదు కాదు కాదు మీడియా లో కి వస్తుంది..

అక్రమంగా సంపాదించినా డబ్బుని దాచుకోవడానికి మీడియా లోకి వస్తున్నారు ..ఇది అర్ధం చేస్కొని రిప్లై ఇవ్వండి బాబు...

అల అక్రమార్కుల వలలో పడిన వ్యక్తుల్లో భావన్నారాయణ ఒకరని..అనుకుంటున్నారు...నేను ఇంతవరకు భావన్నారాయణ ని చూడలేదు.
జస్ట్ చెప్తున్నాను...నిజానిజాలు పోలీసులు తేలుస్తారు..లేదంటే వాళ్ళు కూడా స్కం లో తరిస్తారు.

JE said...

టీవీ 9 రాక్ steady గా వెళ్తోంది. tv 5 లో ఉద్యోగులు తడి బట్టేసుకుని పడుకున్తున్నర్త..ఇది మన మిత్రుడొకరు చెప్పిన మాటే..
సాక్షి లో మీసాల రామిరెడ్డి జాయిన్ అయ్యారట..బహుశా షర్మిల పదయత్రకి హైపే తిస్కురావడానికి తీస్కుని ఉంటారని టాక్.
ఎన్ని జరిగిన సాక్షి మీడియా కి వచ్చిన ముప్పేమీ ఉండదు. కాకపోతే రామ్ అతి ఉత్సాహం తో తన పాత పంధానే కొనసగిస్తారేమో

ఐ న్యూస్ ని కిరణ్ కుమార్ రెడ్డి take ఓవర్ చేసారని ఓ న్యూస్..నిజమెంతో నరేంద్ర కే తెలియాలి. HODs స్థాన బ్రంసం తప్పదేమో మరి. శాస్త్రి గారు always
సేఫ్..అయన మంచితనమే ఆయనకి రక్షా. ఇక మహా టీవీ batch సర్దుకుంటుందేమో చూడాలి..ఇప్పటికే v 6 లో కొంతమంది ట్రై చేస్తున్నారని వినికిడి.


టెన్ టీవీ లో అయోమయం నెలకొందట ...అరుణ్ సాగర్ మల్లి మంచన పడ్డాడు అని వార్తలు వస్తున్నాయి..ఇదెంత వరకు నిజమో కానీ
ఇంతవరకు స్టూడియో సెట్ అప్ దశలోనే ఇలా జరగడం కంమునిస్తులని కలవరపరుస్తుందిట. అలానే టీవీ 9 లో పని చేసి తెర పై
కన్పిస్తున్న పెద్దగ ప్రభావం చూపలేని జాకీర్ ను 10టీవీ యాజమాన్యం విపరీతం గ సతయిస్తుందని టాక్ ....

బహుశా దసరా తర్వాత జాకీర్ గారు టెన్ టీవీ లో జాయిన్ అవుతారేమో మరి..కానీ ఇలా రాయడం వల్ల ఆల్రెడీ విల్లు పని చేస్తున్న
కంపెనీ లో విల్లకి హాని చేసిన వాళ్ళం అవుతాం ..కానీ ఇదైతే నిజంగా విన్పిస్తున్న టాక్. cvr అదృష్టమో దురదృష్టమో కానీ అందులో పని చేస్తున్న
పెద్ద తలకాయలు అన్ని వేరే చానల్స్ లో వెతుక్కున్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్ళంతా ఒకటే సామజిక వర్గానికి చెందినా వారవడం తో

తులసి లో వీళ్ళ కి నో ఎంట్రీ ....టెన్ టీవీ, టీవీ 99 లే దిక్కు..కాకపోతే..existing చానల్స్ లో అయితే టీవీ 5, n టీవీ లో వీరికి అవకశం దొరకొచ్చు ...

జీ 24 లో నో అద్మిస్సిఒన్ బోర్డు ..ఉంది. కందుల గారికి ఓ గంట చర్చ కార్యక్రమం ఇచ్చారంటేనే చలసాని గారి పెద్ద మనసు తెలుస్తోంది..
బహుశా ఐ న్యూస్ ప్రభావం అయి ఉంటుంది ...మహా, స్టూడియో-n జోలి ఎవరు పోరు..abc దెబ్బకి అందరు సేఫ్ జోన్ వెతుక్కోవడం ఆరంభించారు.

ఈ మధ్య కొన్ని బ్లాగులు కొంతమందిని హీరోలుగ, కొంతమందిని జీరోలుగా చూపిద్దామని తెగ తపత్రయపడుతున్నాయి. అయితే విషయం ఏంటంటే..ఆ బ్లాగులు
ఎవరినైతే హీరోలుగా, సక్సెస్ ఫుల్ గ పెర్కొన్నాయో..ఆయ వ్యక్తులకి దగ్గరి వల్లే ఆ బ్లాగులని నిర్వహించడం శోచనీయం..బహుశా స్వకుచ మర్దనం అంటే ఇదేనేమో

అవి ఆంధ్రప్రదేశ్ ని 70 mm స్క్రీన్ మిద చూపిద్దాం అనే బ్లాగ్, ఎప్పటికప్పుడు తెలుగు న్యూస్ ని update చేస్తామనే బ్లాగ్ ఒకటి. ఇవి కాకా పోరు తెలంగాణా అని
ఇంకో బ్లాగ్ ఉంది కేవలం అయన ఏది అనుకుంటే అదే నిజమనే భ్రమ ...మిగిలిన్వల్లని అదే భ్రమ లో ఉంచే తాపత్రయం ఆ బ్లాగ్ సృష్టి కర్త డి. కనీసం ఈ బ్లాగుల
ఓవ్నెర్స్ కి కామెంట్స్ ని పబ్లిష్ చేద్దామని జ్ఞానం కూడా ఉండదు. నేను చెప్పేది సమంజసమైన కామెంట్స్ గురించి..తిట్టేవి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
నా బ్లాగ్ నా ఇష్టం అనుకుంటే...రేపు cyberabad పోలీసు స్టేషన్ లో పోలీసులు నా లాట్టి నా ఇష్టం అంటారు..తర్వాత పత్రిక స్వేచ అని గొంతు
చించుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే...యువర్ దేమోక్రాసి ఎండ్స్ వ్హెరె మై నోస్ బెగిన్స్ కదా

అన్వేషి said...

ఈ కధనాలన్నీ చూస్తుంటే, మంచివాళ్ళంటే ఎవరంటే -" చెడిపోవడానిక అవకాశం దొరకని వాళ్ళ" ని ఒక పెద్దాయన చెప్పిన మాట అక్షర సత్యమనిపిస్తోంది కదూ!

Ramu S said...

Anveshi garu,
You may be right.
Ramu

K V Ramana said...

Anna
I know the person who's mentioned in this post. I am in touch with him. The only difference is...you were careful in taking your decisions but our friend was not. He had big plans for himself and he wanted to use Gali platform to execute them. I also know some of his other plans which would have taken shape if YSR had not died in that accident. If YSR was alive, you would have taken a formal appointment to meet this friend. Anyways, he was in bad company and is equally tainted today. Fortunately, he was not arrested.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి