స్వతహాగా సాహిత్య అభిమాని, కథా రచయిత్రి అయిన మా అమ్మ 'రచ్చబండ' అనే పత్రికకు కొన్ని నెలలపాటు విలేకరిగా పనిచేసినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. కోస్తాలో తుపాను బాధితులకు సహాయం చేయడానికి పత్రిక తరఫున సత్తుపల్లి లో అనుకుంటా...కొందరు ఆర్ధిక స్థోమత ఉన్న వారిని సంప్రదిస్తే...వాళ్ళు ఆమెను ఆఫీసు బైట వెయిట్ చేయించారు. సహాయం చేయకుండానే పంపారు. ఆ రోజు ఆమె బాధపడడం సంగతి అలా ఉంచితే...సమాజానికి సహాయం చేయడానికి జర్నలిజం ఉపకరిస్తుందని నాకు అర్థమయ్యింది అప్పుడే. చిన్న పత్రికలో పనిచేసింది కాబట్టి అమ్మకు సహకారం అందలేదని...అదే పెద్ద పత్రిక అయితే...జనాలకు సహాయం చేయవచ్చని నేను అనుకున్నాను.
అలా...జర్నలిజం పట్ల కొద్దిగా మమకారం పెరిగి...ఈనాడు లో 1989 లో కంట్రిబ్యూటర్ గా చేరానుకొత్తగూడెంలో. పొద్దున్న కాలేజీకి పోవడం, సాయంత్రం క్రీడలు కవర్ చేయడం, రాత్రికి షటిల్ ఆడడం...ఇలా సాగింది మూడేళ్ళు. ఈ లోగా...డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఒక రోజు ఇంటి పక్క వాళ్లకు 'ఈనాడు' 'ది హిందూ' పత్రికలూ వచ్చాయి. నేను హిందూ పత్రిక తీసుకోబోయాను. తనకు ఇంగ్లిష్ బాగా వచ్చని ఫీలయ్యే వారి అబ్బాయి వచ్చి....విసురుగా 'హిందూ' గుంజుకుని...నువ్వు చదవదగిన పత్రిక ఇదంటూ...'ఈనాడు' చేతిలో పెట్టాడు. 'నీ యబ్బ...ఈ జీవితంలో కొన్ని రోజులైనా...హిందూ లో పనిచేస్తా....చూస్తుండు,' అని అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వుండడం లేదని ప్రధానమంత్రి 'నేషనల్ ప్రెస్ డే' సందర్భంగా ఈ రోజు మొత్తు కుంటే...మన జర్నలిజం నేపథ్యం గుర్తుకు వచ్చాయి. అందుకే ఈ పోస్టు. 1989 నాటికే....జర్నలిస్ట్ లు అంటే...సమాజంలో భలే గౌరవం ఉండేది. ప్రజలు ఇస్తున్న గౌరవం చూసి...మరింత బాధ్యతాయుతంగా ఉండాలని అనిపించేది. అదేదో మిషన్ అన్నట్లు పనిచేసేవాళ్ళం. ఈనాడు డెస్క్ లో పనిచేసినప్పుడు కూడా...అదే భావం వుండేది. మన టార్గెట్ లో భాగంగా...ది హిందూ లో రిపోర్టర్ గా 2001 లో చేరిన నాటికే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. "ఈ రోజు నుంచి నువ్వు ఒక సమాజ సేవకుడివి," అని అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ అప్పటి బ్యూరో చీఫ్ దాసు కేశవరావు గారు చెప్పడం రోజూ స్మరించుకునే వాడిని.
రాను రానూ జర్నలిజం ఒక వ్యాపారంగా మారింది. యాజమాన్యాలు పచ్చి లాభదాయక పరిశ్రమగా మార్చాయి. రాజకీయ లాభం పరమావధి అయ్యింది. ఈ పరిస్థితిలో చాలా మంది జర్నలిస్టులు ఆత్మ వంచన చేసుకుని వృత్తిలో ఉండాల్సి వస్తున్నది. వారిని తప్పు పట్టడం తప్పు. అన్ని రంగాలలో మాదిరిగా నీతి నియమాలు నానాటికీ దిగజారుతున్నా...పవిత్ర వృత్తిగా పేరున్న జర్నలిజం లో ఆ ధోరణి మరీ వెర్రి తలలు వేయడం బాధ కలిగిస్తుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం...20 ఏళ్ళు జర్నలిజం లో ఉండి, మచ్చ లేకుండా పనిచేసి ...సమాంతరంగా డిగ్రీలు సాధించి టీచింగ్ లోకి వచ్చి మంచి పని చేసామని అనిపిస్తుంది. వృత్తిలో ఉన్న రమేష్ లు, శర్మలు, నగేష్ లను చూసాక....వేగంగా వదిలేయాల్సిన వృత్తి ఇదని నాకు స్పష్ట మయ్యేది ఎప్పటికప్పుడు. సరే...ప్రస్తుతం జర్నలిజం లో ఉన్న మిత్రులకు మేలు జరగాలని కోరుకుంటూ ప్రెస్ డే శుభాకాంక్షలు.
రామోజీ రావు గారు మినీలు పెట్టకుండా ఉంటే...జర్నలిస్టులకు విద్యార్హతలు ఉండాలన్న నిబంధన వుంటే...ఇన్ని టీ వీ చానెల్స్ రాకుండా వుంటే....పరిస్థితి మరీ ఇంతగా దిగాజారేది కాదేమో!
నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం ఇలా ఉంది.

"A free and fair media has been an essential pillar of our democracy. Since our struggle for freedom, media has been guiding social change, informing readers of their rights and contributing to the nation-building process by spreading awareness.
As a country, we believe in complete independence of the media from external control. It is true that sometimes irresponsible journalism can have serious consequences for social harmony and public order, which the public authorities have an obligation to maintain, but censorship is no answer. It is for the members of the Fourth Estate themselves to collectively ensure that objectivity is promoted and sensationalism is curbed. It is for them to introspect how best they can serve our country and society and advance their well being."
6 comments:
Thanq Sir...
రాము గారూ,
మీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను. అయితే కొన్ని అభిప్రాయాలను అంగీకరించలేకపోతున్నాను. మొత్తం సమాజంలోనే భాగమయిన పత్రికల యాజమాన్యాలుగానీ, తదనుగుణంగా పాత్రికేయులుగానీ నీతివంతంగా ఉంటారనుకోవటం అత్యాశే. ఉండాలనుకోవటం తప్పుకాదుగానీ అది ఆసాధ్యం. జిల్లా పత్రికలు, బోలెడు చానళ్లు రావటం అభివ్రుద్ధి కదూ. దోమలు వస్తున్నాయని కిటికీలను పీకేయము కదా. తెరలు వేసుకుంటామని తెలియనిది కాదు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడితే అది చెప్పా పెట్టకుండా పారిపోతుందని గుర్తు చేస్తున్నాను అంతే.
శంకర్ మానపాటి...
మీరు పంపిన వ్యాఖ్యలో భాష నాగరికంగా లేకపోయినా...అందులో ఒక పాయింట్ వుందని వివరణ ఇస్తున్నాను.
అప్పట్లో పరిస్థితి పవిత్ర గంగా జలంలా ఉందని నేను అనడం లేదు. విలువలు క్షీణించాయని, క్షీణిస్తున్నాయని భావిస్తున్నాను. పరిస్థితుల నేపథ్యంలో అంతా జర్నలిజం వదిలేయాలని నేను అనడం లేదు. ఈ కంపు చూసి పారిపోకుండా...ఉన్నంతలో నీతిగా జర్నలిజం ఎలా చేయాలో నేర్పుతున్నాను. అందుకే టీచింగ్ లోకి వచ్చాను.
మీకు ఇంకా వివరణ కావాలంటే...ఖైరతాబాద్ రండి. నాగరికంగా మాట్లాడుకుందాం.
సి యు
రాము
A letter from a journalist..Ramu
సార్ నేనండీ గుర్తున్నానా?
నా మనసులో బాధ తట్టుకోలేక మీకో ఘాటు లేఖ రాసాను గుర్తున్నానా?
ఇప్పుడు సమస్య అది కాదు.
మీరు ‘‘రామోజీ రావు గారు మినీలు పెట్టకుండా ఉంటే...జర్నలిస్టులకు విద్యార్హతలు ఉండాలన్న నిబంధన వుంటే...ఇన్ని టీ వీ చానెల్స్ రాకుండా వుంటే....పరిస్థితి మరీ ఇంతగా దిగాజారేది కాదేమో!’’
అని బాధ పడ్డం చూసి నేను కూడా బాధ పడి మరీ ఈ ఉత్తరం రాస్తున్నాను.
మీ ఆవేదన ఒక యాంగిల్లో సరైందే.
అర్హతలేని వాళ్లును అందలం ఎక్కిస్తోంది మీడియా..
కొందరు పెద్దల మాటలను అనుసరించి చెబితే..
జర్నలిజం అనేది సూపర్ సీనియర్ టూ సీనియర్.. సీనియర్ టూ జూనియర్.. జూనియర్ టూ.. టూూూూ జూనియర్లకు నేర్పుతూ పోవాలి. అదొక పద్ధతి.
ఈ మాటలు ఆయన నా పక్కన చేరి అంటున్నప్పుడు నాకు అర్ధం కాలేదు.
అది నిజమేనని తర్వాత్తర్వాతగానీ తెలీలేదు. .
మీడియా అనేది ఇప్పటి రోజుల్లో ఎలా అయిపోయిందంటే.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా..
ఒక మేస్త్రీ ఆయన కింద కూలీలు.. అన్నట్టుగా తయారైంది.
ఆ మేస్త్రీ కన్నా తనదైన పనిలో అంతో ఇంతో పనితనం ఉండి వుంటుందేమో తెలియదుగానీ.. నయా మీడియా బాసులకు ఆ మాత్రం కూడా వుంటున్నట్టు కనిపించడం లేదు.
కొందరైతే నేరుగా.. ‘‘ఏం చేస్తావో నాకు తెలియదు.. ఇది జరిగిపోవాల్సిందేనని’’ ఒత్తిడి తెస్తున్నారు. అటు ఏది ఎలా చెయ్యాలోనన్న అవగాహనా లోపం.. ఇటు మీడియా వ్యాపారంగా మారడంతో తలెత్తిన దారుణమైన పరిస్థితులు.. ఎవరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి.
ఏడుపొక్కటే తక్కువ..
ప్రెజంట్ ఇదీ జర్నలిస్టు బతుకు చిత్రం
ఛానెళ్లు ఎక్కువయ్యే కొద్దీ విలువ పెరగాల్సింది.. తగ్గుతూ వస్తోంది.
మొదటగా మీడియాకు వచ్చే వాళ్లలో మీరు చెప్పిన క్వాలిఫైడ్లు రావడానికి వీలు లేని పరిస్థితి.
‘బిల్ గేటైజేషన్’ ఇంకా నడుస్తున్న రోజులివి. కనుక, అందరూ ఆయన వారసులై పోవాలని ఉవ్విళ్లూరుతుండటంతో..
మీరు ఆశించిన చదవరులు రావడం అసాధ్యం.
మిగిలింది..
జర్నలిజంలాంటి ఏదో ఒక ఇజంలో ఫెయిలై అక్కడ సరిగ్గా రాణించలేకో విసుగు చెంది వచ్చిన వారు రాణించడానికి ఇక్కడ అవకాశం బాగా ఎక్కువ.
అంటే ముఖ్యంగా నక్సలిస్టులో, కమ్యూనిస్టులో, సినిమా రచయితలుగా రాణించలేక అక్కడలాగే రాలిపోలేక.. ఇటు వైపు అడుగులు వేసిన వారు మాత్రమే మీరాశించిన కేటగిరిలోకి వచ్చే ఛాన్సుంది.
అంతో ఇంతో మూడు మంచి పదాలు అప్పుడప్పుడూ తళుక్కుమంటున్నాయంటే వారి చలవే. ఆరు అవగాహనతో కూడిన రచనలు వస్తున్నాయంటే అందువల్లే. .
‘‘5వేల రూపాయలతో జీవితం అది కూడా జర్నలిస్టు జీవితం ఏల స్టార్ట్ చేయవలె. ఏల అందుకోసం తల బాదుకోవలె.. క్లిక్ అవకపోతిమి పో ఎల బాధ పడవలె..’’ అన్న మీమాంశ బాగా చదువకున్న వారిలో అధికం. ఇదొక పిచ్చి. ఈ పిచ్చికి.. ఆశావహుడి పిచ్ కూడా జోడవ్వాలి. అప్పుడే నాలుగేళ్లు ఇక్కడ పనిచేయగలిగి.. నిలుస్తారు. లేకుంటే మరో ఫీల్డ్ ఎంచుకోక తప్పదు.
కనుక ఇందులో ఊరట నిచ్చే అంశమేంటంటే..
సాంకేతికత, ఆధునికత.. ఎక్సెట్రాలు.. రోజులు గడిచే కొద్దీ కామన్ పీపుల్ కు ఆయా ఫలాలు మరింత అందుబాటులోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. నవేడేస్ సెల్ ఫోన్ సిట్యవేషన్ చూడండీ.. డబ్బులా ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ’ అంటోంది. అలా మీడియాలో పనిచేసే అరుదైన అవకాశం.. టూూూూ సామాన్యులకొస్తోంది. ప్రతి ఒక్కరికీ ఛాన్స్ దక్కడంలో ఆనందం వెతుక్కుని మీరీ బాధను మరిచిపోతారని ఆశిస్తూ సెలవు.
ఇట్లు
ఆది
నేను కూడా గత నాలుగేళ్లుగా
మీరాశించినంత కాకున్నా
జర్నలిస్టుగా పనిచేస్తున్న ఓ ఆర్డినరీ ఫెలోని..
నా సూచన అర్ధం చేసుకుంటారని తలుస్తూ
సెలవు.
meeru cheppina vishayaalu 200% correct sir...
- bendalam krishna rao, srikakulam
Ramu, I fully agree with you that the quality of journalism came down drastically with the launch of district editions.
I firmly believe that, the zonal/constituency pages should be either abolished or minimised, as a first step. Those who don't know the ABCD of journalism became reporters (stingers) and sub-editors because of these zonal pages and those who just know the ABCD (including me) were elevated to higher positions.
If all the newspaper bosses come together and take a decision in this regard, it will be a great service to jounalism and the Telugu language.
- Vakkalanka Ramana
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి