Thursday, December 13, 2012

జీ 24 గంటల్లోకి జాకీర్, శివ ప్రసాద్

ఏదో ఊడపొడుస్తుందని అనుకున్న సీ  వీ ఆర్ ఛానల్ నుంచి రెండు పెద్ద తలకాయలు వేరే ఛానెల్ కు ఉడాయించాయి. ఆ ఛానెల్ లో చేరి బీభత్సం సృష్టిస్తారని అనుకున్న స్వప్న సాక్షి లోనే ఉండిపోయి...ఆ పని జగన్ ఛానెల్  లో చేస్తున్నారు. ఆమె చేసిన కొన్ని ఇంటర్వ్యూలు, స్టోరీలు చూస్తే 'you to...' అని అనిపించకమానదనేది వేరే విషయం. 

కొంత అజ్ఞాతవాసం తర్వాత సీ వీ ఆర్ ఛానెల్  లో చేరిన మూర్తి కొన్నాళ్ళకు...పాత గూడైన  ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి లో చేరారు.  ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన శివ ప్రసాద్ అనే ఇన్ పుట్ ఎడిటర్ పొడ గిట్టకనే మూర్తి వెళ్లిపోయారని అప్పట్లో పునకార్లు షికార్లు చేసాయి. ఆ టైం లోనే... అవకాశం  దొరికిన ప్రతి ఛానెల్  లో పనిచేసి చూద్దామన్న అలవాటు ఉన్నట్లు కనిపించే తెలంగాణా ఆణిముత్యం జకీర్ కూడా సీ వీ ఆర్ లో చేరారు.  

అలాంటి శివ ప్రసాద్, జకీర్ లు మొన్నీ మధ్యన జీ 24 గంటలు ఛానెల్  లో చేరారు. కాంగ్రెస్ లీడర్ బొత్స గారు  తన ఛానెల్ ను ఎన్నికల నాటికి బలీయమైన శక్తి గా మార్చే క్రమంలో ఈ నియామకాలు చేసారని అనుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ బీట్ చూసిన జర్నలిస్టులకు పెద్దపీట దొరుకుతున్నట్లు చెబుతున్నారు. 

జీ 24 గంటలు లో శైలేష్ రెడ్డి పరిస్థితి ఏమిటి? శివ ప్రసాద్ వెళ్ళిపోయిన దరిమిలా మూర్తిని సీ వీ ఆర్ వాళ్ళు మళ్ళీ పిలుస్తారా? అన్నవి తెలియాల్సి ఉంది. జంపింగ్ విషయంలో ఈ జర్నలిస్టుల కన్నా ఆ డాక్టర్లే నయమని సీ వీ ఆర్ యాజమాన్యం అనుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.  

10 టీ వీ లోగో ఆవిష్కరణ రేపు 

By the people, for the people, to the people...New is People...అని భావిస్తున్న 10 టీ వీ లోగో ఆవిష్కరణ శుక్రవారం (14) న జరుగుతున్నది. బాగ్ లింగం పల్లి లోని ఆర్ టీ సీ కళ్యాణ మంటపం లో సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పని చేస్తారని, 10 టీ వీ చైర్మన్ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని హేమ చెప్పింది. తను ఈ మధ్యనే ఆ ఛానెల్ లో చేరింది. ఈ సారి స్పోర్ట్స్, ఫీచర్స్ చేయాలని అని భావిస్తున్న ఆమెకు, 10 టీ వీ సిబ్బందికి అభినందనలు, శుభాకాంక్షలు. 

9 comments:

Ravi said...

By the people, for the people, to the people... News is people.... వింటానికి బాగానే ఉన్నాయి కానీ... అక్కడ అంత ఉందా అన్నదే ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న అనుమానం. from the TV9, from the khammam... అలా వచ్చిన వారికే అక్కడ పెద్దపీట. టీచర్ గా పనిచేసి ఆ తరువాత నాలుగేళ్లు TV9లో పనిచేసిన వ్యక్తి అక్కడ సెకండ్ సిఇవో(క్రియేటివ్ హెడ్). అరుణ్ సాగర్ తర్వాత అంతా ఆయనదే పెత్తనమట. ఛానల్ పై ప్రారంభంలో ఉన్న పాజిటివ్ టాక్ ఇప్పుడు లేదు. ఏదేమైనా కచ్చితమైన ప్రిన్సిపిల్స్ తో వస్తున్న ఛానల్ 10టీవీ. అయితే ఆచరణలో దాన్ని ఎంతవరకు అమలు చేస్తారో చూడాల్సిందే... ఆల్ ది బెస్ట్ టు హేమ గారు అండ్ TV0 టీమ్.... ఓ సారీ...10 టీవీ టీమ్.

Unknown said...

జకీర్ తెలంగాణవాడు కాదు. ఆంధ్రావాడు. నెల్లూరులో పుట్టి ఖమ్మంలో సెటిల్ అయ్యాడు. అతడిని తెలంగాణ ఆణిముత్యం అంటారేంటి?

Unknown said...

జకీర్ తెలంగాణవారు కాదు. ఆయన జన్మస్థలం నెల్లూరు. సెటిల్ అయింది ఖమ్మం కొత్తగూడం. తెలంగాణ ఆణిముత్యం అంటారేంటి? నెల్లూరు ఆణిముత్యం అనండి.

katta jayaprakash said...

Is there any use with aayarams and gayaarams to the channels?There is no commitment from either side and they are just roaming in the streets to catch the best opportunity but their career will be in doldrums with their rolling stone mind.
JP.

katta jayaprakash said...

Hearty congrats to Hema garu for getting into 10 TV.Hope she will be reflecting your mindset on media with commitment,ethics,proffessional and human values while discharging her duties.

JP.

Unknown said...

టీవీ టెన్ విషయంలో జనంలో నెగిటివ్ ఒపీనియన్ ఉంటే మీలో మాత్రం పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుంది మాస్టారూ. బహుశా.. పాజిటివ్ దిశగా ఏదో పాయింట్ లాగుతోండవచ్చు మీలో. అరుణ్ సాగర్ అంటే ఉన్న అభిమానమో, కమ్యూనిస్టులంటే వున్న కన్ సర్నో, లేక ప్రొఫెసర్ గారి మీదున్న గురుభావమో.. మొత్తానికి కొడుతోంది. మారు వేషంలో ఒకసారి కంపెనీ వెళ్లి రండి తెలుస్తుంది. దానికి తోడు రీసెంట్ గా వస్తున్న మీడియా యాజమాన్యాల తీరు తెన్నులు ఏమంత గౌరవంగా లేదు. అందునా.. కమ్యూనిస్టులు ఒకవైపు, అరుణ్ సాగర్ ఒక వైపు.. ప్రొఫెసర్ గారు ఒక వైపు.. ఇన్ని వేరియేషన్స్ వున్నాయి టెన్ లో. భావకవిత్వంతో అరుణ్ సాగర్ను ఒప్పించవచ్చనుకుంటే, కమ్యూనిస్టులు ఒప్పుకోరు. వీరిద్దరినీ సాటిస్ ఫై చేసామంటే ప్రొఫెసర్ గారు ఊరుకోరు. బైటివ్వడానికే రిపోర్టర్లను నానా తిప్పలు పెట్టే ఆయన్ను మెప్పించడం అంటే దాదాపు ఏ కార్ల్ మార్క్స్ నో లెనిన్నో ఒప్పించేయవచ్చు. క. ను. క. నాలాంటి వాళ్లం కొందరం మీ అభిప్రాయంతో ఏకీభవించ లేక పోవచ్చు. నా తరఫున అన్నీ మీరే వూహించేసుకుని ఇలా రాయడం తప్పని మీకనిపించినా నాకనిపించిన మాటలు రాస్తున్నాను. అర్ధం చేసుకోవలసిందిగా మనవి.,

TECH SUPP said...

They are offering Rs 7000/- for a senior reporting person (district staffer) who as came form "EENADU journalism", In these days who can work for this salary.

TECH SUPP said...

10TV is offering Rs 7000/- for a senior reporting person(district staffer) who came from "EENADU Journalism" and worked as Staffer for various news channels and also Sub-Editor for Various Print MEDIA, For the Package of Rs 25000/- P.M.
Now a days who can work as staffer for 7000 .........?

JE said...
This comment has been removed by a blog administrator.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి