ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చీర్ లీడర్ గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా యువతి Gabriella Pasqualotto తన బ్లాగులో...అమ్మాయిలతో దారుణంగా వ్యవహరించే క్రికెటర్ల గురించి రాసుకుని వివాదాస్పద యువతిగా ముద్ర పడి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బ్లాగులోనే సగటు భారతీయ పౌరుడి గురించి కూడా చక్కగా రాసింది.
"To the citizens, we are practically like walking porn! All eyes are on you all the time; it is complete voyeurism." (Voyeurism అంటే the practice of obtaining sexual gratification by looking at sexual objects or acts, especially secretively.)
దేశ రాజధానిలో రాత్రి వేళ మిత్రుడితో కలిసి బస్సు ఎక్కి మగ మృగాల దాడిలో తనవు పచ్చిపుండై...బతుకు ఛిద్రమై...మృత్యుపోరాటం చేసి తరలి రాని తీరాలకు తరలిపోయిన చిట్టితల్లికి అశ్రునివాళి, భాష్పాంజలి అర్పిస్తున్నప్పుడు గాబ్రియేల మాటలు గుర్తుకు వస్తున్నాయి. మగ మృగాల అఘాయిత్యానికి బలైన విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె తల్లి దండ్రులకు కుటుంబ సభ్యులకు ఆ దారుణాన్ని తట్టుకునే శక్తి లభించాలని ప్రార్దిస్తున్నాం. అమ్మా...మమ్మల్ని క్షమించు. ఈ పవిత్ర భారతావని, ఈ మట్టిలో పుట్టిన మేము, ఈ ప్రజల డబ్బుతో చదువుకున్న విద్యావంతులమని అనుకుంటున్న మేము, మా మీడియా....కోటి ఆశల అద్భుతమైన నీ జీవితాన్ని మొగ్గలోనే తుంచడాన్ని నిలువరించలేక పోయాం. సమష్టిగా మేము విఫలమయ్యాం. ఆ అపరాధ భావనతో మేము కుమిలిపోతున్నాo.
అర్థరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు నిజమైన స్వాత్రంత్ర్యం వచ్చినట్లని పెద్దాయన అన్న మాట ఎప్పటికి నిజమవుతుందో ఎవ్వరం చెప్పలేం. మహిళను అంగడి వస్తువుగా చూసే సంస్కృతి నరనరాన జీర్ణించుకున్న ఈ జాతిని బాగు చేయడం ఎవరి వల్ల అవుతుందో! అనుక్షణం వెకిలి చూపుల దాడికి గురవుతూ...మహిళకు రక్షణ లేని దుస్థితి దాపురించింది.
ఈ సంఘటనకు పోలీసులది బాధ్యత అన్నట్లు టీ వీ స్టూడియోలలో చెలరేగిపోతున్నారు. దానికన్నా ఎక్కువగా తప్పు పట్టాల్సింది....సృజనాత్మకత, కళారాధన పేరిట పచ్చి బూతును చూపిస్తున్న సినిమా రంగపు పెద్దలను. తప్పు....ఆడ పిల్లలను సెక్స్ వస్తువుగా చూపిస్తున్న నిర్మాతలది. కురచ దుస్తుల హీరోయిన్ బొడ్డు మీద పళ్ళూ పూలు పెట్టి చూపించి జనాలలో కైపు ఎక్కించే బడ్డు దర్శకులది. అంగాంగ వర్ణనతో సాహిత్యం సృష్టిస్తున్న రచయితలది, పాటల రచయితలది. పది ఎర్ర నోట్ల కోసం...శరీరాన్ని తాకట్టు పెట్టె బాధ్యతారహిత నటీమణులది. సమాజంపై పెను ప్రభావం చూపే శక్తిమంతమైన టీ వీ, సినిమాలలో అశ్లీలాన్ని ఆపలేకపోయిన సెన్సార్ బోర్డుది. అఘాయిత్యాలు జరిగాక ఆవేశంతో ఊగిపోతూ...చేష్టలుడిగి చూసే మహిళా సంఘాలది. సమాజం చంకనాకి పోతున్నా...పట్టించుకోకుండా..."లోకం తీరిది..." అనుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్న మేధావులది, సదాలోచన పరులది. అందరం సమష్టిగా సిగ్గు పడాల్సిన రోజిది.
క్షుద్ర వినోదం అందిస్తూ...దేశవనరులైన పౌరుల మెదళ్ళు చెడగొడుతూ...ఆడపిల్లల కుటుంబాలలో విషాదం నిపుతున్న... చచ్చు సినిమాలు తీస్తున్న సన్నాసులను రోడ్డు మీద బహిరంగంగా ఉరి తీస్తే....భవిష్యత్తులో అయినా రేపులను నిరోధించవచ్చని మా అబ్రకదబ్ర మాటలలో తప్పుందంటారా?
"జనం చూస్తున్నారు...మీము తెస్తున్నాం...." అన్న పిచ్చి వాదన ఇప్పటికైనా ఆపండ్రా నాయనా. ఇవ్వాళ చనిపోతూ మనల్ని సిగ్గుపడేలా చేసిన యువతి శవం సాక్షిగా దేశ నిర్మాణంలో, సంస్కృతి పరి రక్షణలో మీ పాత్ర ఒక్క సారి అవలోకిన్చుకోండి. ప్లీజ్.

3 comments:
రాం గారు, మీ ఆవేశం, ఆవేదన, కోట్లాది భారతీయులందరిది.. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులది, సోదరులది, ఈ విషయంలో సామాజిక చైతన్యం తేవడానికి చక్కటి కార్యాచరణ రూపొందించాల్సిన తరుణం ఇదే. మేధావులందరూ ఇప్పటికయినా గళం విప్పి ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువస్తే పరిస్తితి మారవచ్చు. ఎందుకంటే, సినిమా రంగం కన్నా దరిద్రులు రాజకీయాల్లో ఉన్నారు. అందుకే వ్యవస్త ఇలా తయారయింది.
మీ ఆవేదన అర్ధం చేసుకోతగినది. కానీ ఈ కంపులో నటీమణుల తో పాటు పొట్టి నికర్లూ, కురచ షర్ట్లూ వేసుకొనే జనాలకు వినోదం పంచే గాబ్రియేలా వంటి వరికి కూడా భాగం ఉంటుంది. చీర్ లీడర్స్ సుద్దులు చెప్పటం దెయ్యాలు వేదాలు చెప్పటం లాంటిది. చీర్ లీడర్ అమ్మాయిలని అన్ని దేశాలలోనూ కొంచెం అటూ ఇటు గా ఒకే దృష్టి తో చూస్తారు. (eye candy). అసలు ఆట మైదానం లో చీర్లీడర్లను ఎందుకు ఉపయోగిస్తున్నారు?
అందరికంటే ముందు తల్లిదండ్రులదే తప్పు.
ముఖ్యంగా మగపిల్లలని సరిగ్గా పెంచటం నేర్చుకోవాలి.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి