Sunday, February 17, 2013

ప్రజా ఛానెల్ 10-టీవీ ప్రసారాలకు సర్వం సిద్ధం

ఇన్నాళ్ళూ మీడియా బారెన్లో, పారిశ్రామికవేత్తలో, భూ కబ్జాదారులో టెలివిజన్ ఛానెల్స్ పెట్టారు. ఆర్ధిక లాభాలో, వ్యక్తిగత ప్రయోజనాలో, కుల ప్రయోజనాలో, కార్పోరేట్ లాభాలో, రాజకీయ ప్రయోజనాలో ధ్యేయంగా ఈ ఛానెల్స్ ఆపరేట్ చేస్తున్నాయి. 
ఏదో సొంత వ్యాపారాలు, తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడుకుంటూ సంసార పక్షంగా రామోజీ రావు గారు ఊరి బైటి నుంచి ఈ-టీ వీ వ్యాపారం సాగిస్తుండగా...నవ యువకుడు రవి ప్రకాష్ గారు నగరం నడిబొడ్డున ఆధునిక ఆలోచనలతో దూసుకుపోయి తెలుగు టీ వీ చానెల్  లో కాస్త మంచిని పంచి పలు పెడ ధోరణులకు శ్రీకారం చుట్టారన్న అపవాదు మూటగట్టుకున్నారు. 

ఆనక తెలుగు నేల మీద డబ్బున్న మారాజుల్లో ఒక సిద్ధాంతం బలపడింది. ఒక టీ వీ ఛానెల్ ఉంటే ఒక సెజ్ కొట్టేయవచ్చన్న సంకల్పం బలపడి దగాకోర్లు, బ్రోకర్లు, కబ్జాదార్లు రెచ్చిపోయి ఛానెల్స్ పెట్టే సాహసం చేశారు. ఇది జర్నలిస్టులకు మేలు చేసినా...జర్నలిజానికి చెప్పరాని చేటు చేసింది. ఈ క్రమంలో సమాజ హితాన్ని గాలికి వదిలి నెలకు ఒక లక్షో, లక్షన్నరో వస్తే చాలన్న గాలి జర్నలిస్టుల హవా మొదలయ్యింది. అలాగని...సదుద్దేశంతో రంగప్రవేశం చేసి చేతులు కాల్చుకున్న యాజమాన్యాలూ లేకపోలేదు. మొత్తంమీద ఈరోజున మీడియా అంటే...నెగిటివ్ ధోరణులు ప్రచారం చేసి పబ్బం గడుపుకునే యంత్రాంగం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడి, జర్నలిస్టుల పట్ల నీచమైన చులకన భావన ఏర్పడింది. జర్నలిస్టులు కనిపిస్తే జనం రాళ్లతో కొట్టే దారుణమైన పరిస్థితుల్లో ప్రజల సేవింగ్స్ నుంచి పుట్టుకొస్తున్నది 10 టీవీ. 

అంగన్ వాడీ వర్కర్లు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, టీచర్లు, వైద్యులు, న్యాయ వాదులు, రైతులు, వ్యవసాయ కార్మికులు...తాము కూడబెట్టుకున్న డబ్బుతో కోటి ఆశలతో ఈ ఛానల్ కు ధనబలం చేకూర్చారు.  
ఇది రాష్ట్రంలో మీడియా రంగంలో "మొదటి కో ఆపరేటివ్ వెంచర్" అని ఈ ఛానెల్ ఎం డీ కె.వేణుగోపాల్ ప్రకటించగా, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలన్న సంకల్పం పెట్టుకుని "న్యూస్ ఈజ్ పీపుల్" అన్న స్లోగన్ తో 'క్రిటికల్ అడ్వర్ టోరియల్" భావనతో పనిచేస్తామని ఈ ఛానెల్ చైర్మన్ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ స్పష్టం చేసారు. ఈ ఛానెల్ సామాజక ఉద్యమాలకు పెట్టుబడి కావాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆకాంక్షించారు. టీ వీ నైన్ అభ్యున్నతిలో ప్రముఖ పాత్ర వహించిన కవి, జర్నలిస్టు అరుణ్ సాగర్ దీనికి సీ ఈ ఓ గా వ్యవహరిస్తున్నారు. 

నిజానికి సీ పీ ఎం, దాని అనుబంధ సంఘాలు ఉద్యమ స్ఫూర్తితో ఈ ఛానల్ కోసం నిధులు సేకరించాయి. అధికంగా నల్గొండ, గుంటూరు లలో ఐదు కోట్ల రూపాయిలకు పైగా ప్రజల నుంచి సేకరించి, షేర్లు విడుదల చేసి సహకార రంగంలో దీన్ని నెలకొల్పుతున్నారు. ప్రజల పెట్టుబడి ఒక కోణం కాగా...వార్తల్లో, చర్చల్లో స్వచ్ఛత కోసం ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం ఈ ఛానెల్ ప్రత్యేకతగా నాకు అనిపించింది. 

ఖమ్మం జిల్లా వాళ్ళు, టీ వీ నైన్ బ్యాచు, కమ్యూనిస్టు నేపథ్యం గల వారికి ఛానెల్ లో పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో నిజానిజాలు తెలియవుగానీ...నిజానికి ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల యువకుల రక్తంలో సామాజిక, రాజకీయ  కారణాల రీత్యా జర్నలిజం ఉంటుంది. ప్రముఖ ఛానెల్ టీ వీ నైన్ నుంచి సత్తా ఉన్న వారిని తీసుకోవడం కూడా తప్పు కాదు. నిస్వార్ధంగా సమ సమాజం కోసం బతకాలనుకునే కమ్యూనిస్టులు జర్నలిజంలో రాణిస్తారు. అయితే...ప్రజల విశ్వాసం పెట్టుబడిగా వస్తున్న ఈ ఛానెల్ కేవలం కమ్యూనిస్టు సిద్ధాంత ప్రచారమే ధ్యేయంగా, ప్రజాశక్తి వార్తాపత్రికకు ఎలక్ట్రానిక్ రూపంగా వస్తే మాత్రం తప్పు. వీరి వెబ్ సైట్ 10tv.in లో మరికొన్ని వివరాలు, ఒకటి రెండు వీడియ క్లిప్స్ లభిస్తాయి.         

అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకున్న ఈ ఛానెల్ సంస్థాగతంగా ప్రసారాలు ఆరంభించింది. మార్చిలో పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు రాబోతున్నది. ఈ ఛానెల్ ను ఒక కేస్ స్టడీ గా అధ్యయనం చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్న వారిలో నేనూ ఒకడిని. లోగో ఆవిష్కరణ రోజున ముఖ్యమంత్రిలో చైర్మన్ ప్రొ.నాగేశ్వర్, సీ ఈ ఓ అరుణ్ సాగర్ ఈ పై చిత్రంలో ఉన్నారు. 
నోట్: అంతకు ముందు జీ టీ వీ, ఎన్ టీ వీ లలో పనిచేసిన హేమ (ఈ బ్లాగు ఎడిటర్లలో ఒకరు) 10 టీ వీ లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ...రాగ ద్వేషాలకు అతీతంగా ఈ పోస్టు రాసాను. దీనిపై మీ నిర్మాణాత్మక అభిప్రాయాలకు స్వాగతం.

16 comments:

suresh putta said...

I wish this channel a great success and should be a great relief to the viewers. Hope this will not become another member in the existing bunch of news channels.

durgeswara said...

ఇది కమ్యూనిశ్ట్ ల బాజా గామారకుండా ఉండాలని కోరుకుంటున్న మీలాంటి వారిది అత్యాశ కావచ్చు. చూస్తుండండి కాలం నిజాలను ఎలావెల్లడిస్తుందో !

suresh putta said...

All the best to the new channel. We wish it will not become part of routine junk news channels existing.

katta jayaprakash said...

A very good news.I am sure there will not be any Dunnapothus in this channel.For income the channel must concentrate on ads and sponsored programmes the entertainment in particular.But every one's concern is the mindset of the channel as there might be smell of communist ideology and might be a mirror image of Prajashakthi and Vishalsndra.If it does not come out of the web of communist ideology I am sure it will go the way of these two newspapers as archieves.Hope Ramu will advice the channel in this aspect as Hema garu joined it.

jp.

Ramu S said...

JP sir,
1)I was in Nalgonda on Wednesday to attend the funeral of a friend but I couldn't meet you.
2) This channel is a hope for media optimists but who cares our suggestions? They have lots of intellectuals, real and pseudo, to give it a direction.
I seriously believe that there is a possibility to do something good there.

kandu said...

sss

kandu said...

రాగ‌ద్వేషాల‌కు అతీతంగా అంటూ మీరాగాల‌న్నీ ఒలికించారు రాముసాబ్‌.. మాకు అర్దమైపోయింది ఇక‌నుంచి మీరు డ‌ప్పు ప‌ట్టుకుంటార‌ని..

Ramu S said...

Kandu garu,
Wait and watch. To the best of my ability, I'll be impartial. Instead of being partial, I'll close this blog.
ramu

green world said...

షేర్ కొన్నవారిలొ జర్నలిస్తులూ ఉన్నారు సర్. జనాలకు మేలు జరగాలి. అందుకు మా వంతు షేర్.
bhaskar, mahaa news, atp.

suresh said...

prajalaku nammakanga vundali..... rating kosam anni pracharam cheyavaddu... mukkyanga chedu prajalanu yekuvaga akarshistundi kabatti chedu janalaki avasarama ledu ani visleshenchi pracharam cheyandi...

Unknown said...

సార్....10TV అయిన 100వ టీవి అయిన ..ప్రస్తుతం జర్నలిజం నడుస్తుంది..స్వార్ధం పై నే...ఎక్కడో ఎవడోకడు ఎంతో కోంత ఇస్తాడని పని చేసే సీనియర్ జర్నలిస్ట్ లు...రేపే మాపో జీతం పెరుగుతుందని బ్రతికే జూనియర్లు...పార్టీ పేరుల కోసం నడిపే యాజమాన్యం మధ్య ...మీడియా నిజంగా బ్రోకర్ గా నే పనిచేస్తుంది...2014 తర్వతా 4 ,5 ఛానల్స్ మినహ ఏ ఛానల్ నడపలేరు...బాంబు పేలుడు పేలి జనం బాదపడుతుంటే ...బ్రేకింగ్ న్యూస్ దోరికిందని న్యూస్ ఛానల్స్ పండగ చేసుకుంటున్నాయి..మెత్తనికి ఇక భవిష్యత్తులో ...జనంలో నుంచి వచ్చే జర్నలిస్టులు ...జనాలు తరిమి పరిస్థితి ఏర్పడుతుందేమె...రాను రాను చానల్స్ సమాజం మంచి కోసం కాదు చెడు కోసమే ఎదురు చూస్తాయి...ఇది సత్యం..తధ్యం...

Unknown said...

సార్ ...10tv అయినా 100tv అయినా...ఛానల్స్ నడిచేది సమాజం కోసం కాదు..స్వార్ధం కోసమే...ఎవడొకడు ఎంతో కోంత ఇవ్వకపోతాడా అని ఎదురు చూసే సీనియర్లు ...రేపే మాపో జీతం పెంచకపోతారా అని చూసే జూనియర్లు ..పార్టీ ల కోసం బ్రతికే యాజమాన్యం..ఇది చెత్త తెలుగు మీడియా పరిస్థితి...మీడియా అని ఎవడోన్నాడోగాని నిజంగా బ్రోకర్ పనులు చేస్తుంది...బాంబు పేలుడు జనంతో బాదపడుతుంటే ..వీరు మాత్రం బ్రేకింగ్ న్యూస్ అంటు పండగ చేసుకుంటున్నాయి...సో భవిష్యత్తులో ఛానల్స్ సమాజంలో మంచి కన్నా చెడు జరగాలనే కోరుకుంటాయి..ఇది సత్యం..తధ్యం...

Unknown said...

దోపిడీ నెదురించే జనగానం
ప్రజలకిదో ప్రత్యామ్నాయం
నిజాలు నిగ్గుతేల్చే పదివిలువల పతాకం

సతీష్ కుమార్ చౌదరి రిపోర్టర్ 10టవి

Sowjanya said...

రాము గారూ నమస్తే,
మీరు శీర్షికలోనే ప్రజా ఛానెల్ అని సంబోధించడం చూస్తుంటేనే అర్థం అవుతుంది మీకు ఈ ఛానెల్ పట్ల ఏ దోరణితో ఉన్నారో.. ఛానెల్ వచ్చాక అటువంటి పదం వాడి ఉంటే బహుశా ప్రసారాలను ఆధారంగా మీరు ఆ అభిప్రాయానికి వచ్చారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడే మీరు ఆ అభిప్రాయానికి ఎలా వచ్చారనేది తెలియడంలేదు. ప్రజల నుంచి షేర్ల రూపంలో డబ్బులు వసూలు చేసినందుకు అలా అనుకుంటున్నారేమో.. కానీ ఆ షేర్లు పెట్టిన వారికి కనీస గౌరవమీస్తున్నారో లేదో ఒక్కసారి కనుక్కొండి.. దాదాపు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టించిన ఓ సిపిఎం నాయకుడు ఎంబిఎ చేసిన తన కూతురుకు మేనేజ్ మెంట్ సైడ్ ఏదైనా పోస్టు ఇవ్వాలని కోరితే పట్టించుకున్న పాపాన పోలేదట. అంతేందుకు నల్గొండ జిల్లా నుంచి షేర్లు బాగా వచ్చాయని మీరే రాశారు కదా.. మరి ఛానెల్ లో నల్గొండ జిల్లా ప్రాతినిధ్యం ఒకసారి కనుక్కొండి. టాలెంట్ ఉండాలి కదా అంటారేమో.. టాలెంట్ ఉన్న చాలామంది ఆ జిల్లా వాసులు వేరే ఛానెల్ లో తమ ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. పార్టీ మీద అభిమానంతో షేర్లు కూడా చేయించారు. కానీ వారికి కనీస గౌరవం లేదు.. పార్టీలో పలుకుబడి గల నాయకుల పైరవీలకే 10 టీవీలో పెద్ద పీట వేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి విభాగం హెడ్ ఖమ్మం వారే.. లేదంటే టీవీ9 నుంచి వచ్చిన వారే... టీవీ9 పైత్యం మరీ ఎక్కువగా ఉంది.. చివరకు టీవీ9 లో కేమేరామెన్ గా చేసిన వ్యక్తికి 10టీవీ లో సీనియర్ రిపోర్టర్ హోదా ఇచ్చి ఓ ప్రధాన పార్టీ బీట్ ఇచ్చారట. ఇక్కడే అర్థం అవుతుంది.. 10టీవీ లో ఎవరి ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారో.. ఛానెల్ అంటే అభిమానం ఉన్న చాలామంది నాయకులు అక్కడి వారి ఓవర్ యాక్షన్ చూశాక మనకెందుకులే అని సైలంట్ అయిపోతున్నారట... ఇక చివరిగా ఒకటే డౌట్... సామాజిక న్యాయం పేరుతో పిఆర్పీ పెట్టి ఇతర పార్టీలోని చెత్తను పోగేసుకొని దెబ్బతిన్న చిరంజీవికి... మీడియాలో పెడదోరణులను ప్రవేశపెట్టిన టీవీ9 బృందంతో దస్ కా దమ్ చూపిస్తామంటున్న సిపిఎం నాయకత్వానికి తేడా ఎంటో నాకు అర్థం కావడం లేదు.. అయినా డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని ఇతర ఛానెళ్ల నుంచి వచ్చిన వారు రేపటి నాడు ఛానెల్ కష్టాల్లో ఉంటే ఉంటారా.. అన్నది సగటు సిపిఎం కార్యకర్తను వేదిస్తోన్న ప్రశ్న..

Ravi said...

ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కొన్ని అపోహాలు ఉన్నాయి.. ప్రతి ఒక్కరి దాంట్లో అంగీకరించే నిజాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం అందరూ అంగీకరించాల్సిన విషయం ఏమిటంటే మొదట్లో ఛానల్ పై ఉన్న ఆశలు ఇప్పటికే చాలా తగ్గాయి. అది కేవలం అక్కడి వారి వ్యవహారాల మూలంగానే. ఇంకో విషయం ఏమిటంటే అన్నీ ఛానళ్ల లాగానే అక్కడ ... వ్యవహారాలు మొదలయ్యాయట. మొన్ననే ఓ మిత్రుడు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక మహిళా ఉద్యోగికి స్థానచలనం కూడా అయిందట. పాపం, ఉన్నత స్థానంలో ఉన్న మగాడిని ఏమీ అనలేక ఉద్యోగినిపై చర్య తీసుకున్నారట. ఎంత వామపక్ష భావాజలం ఉన్నవారైనా చేతల్లోకి వచ్చేసరికి వారూ మిగతా వారిలాగే ప్రవర్తించడం కొత్తేమీకాదు కదా!..

Unknown said...

TV9..TV9..TV9..TV9 aslemundandi TV9 low? ippudu TV9 brastupattindi
10 tv kuda ante!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి