అప్పటికప్పుడు అనుకుని శనివారం రాత్రి మేము తిరుపతి బయలు దేరాము బస్సులో. ఆదివారం ఉదయం నాలుగు గంటలయ్యింది. బస్సు ఎక్కడకు చేరిందో తెలియదు కానీ, నాకు మెలకువ వచ్చింది. ఒక ముగ్గురు యువకులు బస్సు ఎక్కారు. వారిలో ఒకరి దగ్గర ఒక బకెట్ ఉంది. ఎందుకో నేను నా సీటు లో కూర్చొనే బకెట్ లో ఏమి ఉందో తొంగి చూసాను. ఒక పెద్ద వేట కొడవలి, నాలుగైదు కత్తులు, రెండు పెద్ద స్క్రూ డ్రైవర్స్ కనిపించాయి. అప్పటి దాకా గుర్రుపెట్టి నిద్రపోయిన నాలోని జర్నలిస్టు ఒక్క సారిగా జూలు విదిల్చి నిద్రలేచాడు.
ముగ్గురిలో ఇద్దరు నా వెనక సీట్లో సెటిల్ అయ్యారు. ఆ బకెట్ పక్కన పెట్టుకున్నారు. ఎందుకో కానీ ముగ్గురూ నా వైపు గుచ్చి గుచ్చి చూసారు. అందులో ఒకరి కళ్ళలో నేను అప్రయత్నంగా కళ్ళు పెట్టి చూసాను. నా మనసు కీడు శంకించింది. ఇది ఎప్పుడూ తప్పుడు సంకేతాలు ఇవ్వదు. ఏమి మాట్లాడుకుంటారోనని చెవుల సైజు పెంచి విన్నాను. అది హిందీ భాషే కానీ, హైదరాబాద్ హిందీ లాగా లేదు. గుంటూరు సాయిబుల హిందీ లాగా ఉంది కానీ అందులో తెలుగు పదాలు లేవు. మొబైల్ ఫోన్ బైటికి తీశాను. సంభాషణ రికార్డ్ చేయాలని, వీలయితే వారి ఫొటోస్ తీయాలన్న ఉబలాటం పెరిగింది. వచ్చే పోలిస్ స్టేషన్ దగ్గర బస్సు ఆపించి వారిని తనిఖీ చేయించాలని కూడా అనిపించింది. నాకు తెలిసిన ఒక ఐ పీ ఎస్ అధికారికి ఫోన్ చేసి సహాయం అడగాలని అనుకున్నాను కానీ తియ్యగా మాట్లాడే ఆ సారు ఇలాంటి మాట సహాయం చేసే రకం కాదని అనిపించి ఊరుకున్నాను.
ఒక వేళ ముగ్గురూ కలిసి బస్సు దోపిడీ చేస్తే నేను ఎలా స్పందించాలో ఒక ప్లాన్ వేసాను కానీ దాని ప్రకారం రక్తపాతం తప్పేట్లు లేదు. అయినా అదొక అనుభవం అనిపించింది. నన్ను పొడిచినా సరే అందులో ఒక్కడినైనా పట్టుకోవాలని నిశ్చయించాను. ఈ స్టోరీ కి 'ఈనాడు' ఏమి శీర్షిక ఇస్తుందో, అసలీ వార్త వాళ్ళు వేస్తారో చెత్తబుట్టలో వేస్తారో అన్న చెత్త ఊహ కూడా వచ్చింది.
ఇలా ఒక గంట పాటు నా బుర్ర వాయువేగంతో చావు ఆలోచనలు చేస్తుండగానే వాళ్ళు ముగ్గురూ లేచారు. ఇప్పుడు ఏదో జరగబోతున్నది. పౌరులే తమను తాము రక్షించుకోవాలి, తప్పదు మరి. ఇక నేను ఆగలేకపోయాను. చాలా కరుకైన గొంతుతో... "తూ లోగ్ కిదర్ జానా?" అని అడిగాను... ఫోన్ ను వీడియో మోడ్ లోకి తెచ్చి చాలా విసురుగా. వాళ్ళలో ఒకడు ఏదో ఊరి పేరు చెప్పి నేరుగా డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు. బస్సు ఆగింది ఒకస్టాప్ లో. నేను అలర్ట్ అయ్యాను. వాళ్ళు కత్తులు తీయగానే పైనున్న ఒక స్ట్రాంగ్ బాగ్ వాళ్ళ మీదకు విసిరి గొడవ చేసి నిద్రపోతున్న జనాలను లేపాలన్నది పథకంలో మొదటి మెట్టు. ఇంతలో బస్సు ఆగింది, ముగ్గురూ దిగారు. నేను వాళ్ళను వాళ్ళ బకెట్ ను చిత్రీకరించాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ క్లిప్ చూస్తే కటిక చీకటి, బ్లూ బకెట్ తప్ప ఏమీ రాలేదు. ఈ ఎవ్వారం వల్ల ఒక రెండు గంటల నిద్ర దొబ్బింది.
తొక్కలో నిద్రదేముంది... చెన్ యింగ్ సాహస కృత్యం తో పోలిస్తే? ఈ నెల ఇరవై న సిచువాన్ ప్రావిన్స్ లో యాన్ అనే ప్రాంతంలో ఈ చైనా టీ వీ రిపోర్టర్ పెళ్లి. మేకప్, పెళ్లి దుస్తుల ధారణ జరిగాయి. ఇంతలో అక్కడ భూకంపం వచ్చింది. చెన్ ఇంగ్ లో రిపోర్టర్ కార్యోన్ముఖు రాలయ్యింది. పెళ్ళీ గిళ్ళీ పక్కన పెట్టి గొట్టం (లోగో) అందుకుని కెమెరా మెన్ తో వీధిలోకి పరుగు పెట్టింది. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన, ఇల్లు కూలిపోయి బీభత్సం జరిగిన ఈ ఘటనను ఆమె రిపోర్టర్ చేసింది. తర్వాతనే పెళ్లి తంతు కానిచ్చింది. ఈ జర్నలిజం బతికి ఉందంటే రామ్ లు, చెన్ యింగ్ (పై ఫోటో) ల వల్లనే అంటే కాస్త అతి అవుతుంది కదా!
(టైం మాగజీన్ సౌజన్యంతో)

1 comments:
ha..ha...
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి