Saturday, June 14, 2014

మీడియాపై కే సీ ఆర్... ఫైర్ సమంజసమేనా?

జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారంలో దొర్లిన అపశృతులను చాలా టెలివిజన్ చానెళ్ళు ఘోరంగా అపహాస్యం చేసాయి. నిజంగానే పలువురు ఎం ఎల్ ఏ లకు ప్రమాణం లో ఉన్న పదాలు పలకడం రాలేదు. కొందరు తడబాటుతో, మరికొందరు పొరపాటుతో ప్రమాణం చేసారు.

ఒక మహిళా సభ్యురాలు... గొంతు ఎండి పోయి... ఇబ్బంది పడి... 'భయమేస్తంది...సార్.." అని అసెంబ్లీ సిబ్బందికి చెప్పడం చూసాం. ఒకళ్ళు, ఇద్దరు కాకుండా... చాలా మంది పదాలను సరిగా పలకలేకపోవడం చూసే వారికి కూడా ఇబ్బంది కలిగించింది. ఈ తడబాట్లను ఘోరంగా పరిహసిస్తూ... ముందుగా వ్యంగ్య కార్యక్రమం ప్రసారం చేసింది.....వీ 6 ఛానెల్. వాళ్ళు తప్పుగా చదివిన అంశాన్ని పదేపదే చూపిస్తూ... అపహాస్యం చేసారు. ఈ కార్యక్రమం కోసం వాడిన పదజాలం చాలా అభ్యంతరకరం అని అప్పుడే అనిపించింది. 

ఆ తర్వాత 6 టీవీ లో, తర్వాత టీవీ 9 లో ఇదే తరహా కార్యక్రమాలు వచ్చాయి. మరి కొన్ని ఛానెల్స్ కూడా సభ్యుల తడబాటు మీద ప్రత్యేక వ్యంగ్య కార్యక్రమం చేయడమో, ఈ అంశం మీద వార్తల్లో ఒక బిట్ వేయడమో చేసాయి. ప్రమాణం సందర్భంగా నీళ్ళు నమలడం, తప్పులు పలకడం... అటు పక్క ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ స్వీకారం లో కూడా జరిగింది. చాలా మంది తప్పుగా ఉచ్ఛరించిన కఠిన పదాలు ఉన్న ఒక వాక్యాన్ని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఏకంగా చదవకుండా వదిలివేశారని ఒక ఛానెల్ సాక్ష్యంతో సహా చూపించింది. 
నిజాన్ని నిజంగా చూపిస్తే అంత ఇబ్బంది ఉండదు. దానికి సొంత పైత్యం జోడించి... మసాలా వేస్తేనే తప్పు అవుతుంది. ఉన్నదానికి, లేనిదానికి రాద్ధాంతం చేయడం, సంచలనం కోసం దిగజారుడు జర్నలిజానికి పాల్పడడం తెలుగు టీవీ ఛానెల్స్ కు కొత్త కాదు. చావనీలే... ఈ మీడియా మీద రాయి వేస్తే మలినం మనల్నే అంతుకుంటుందని రాజకీయనేతలు ఊరుకుంటారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ ప్రోగ్రాం ప్రసారం చేసిన టీవీ 9 ను పట్టుకున్నారు. దాని మీదా, తెలంగాణా ఉద్యమకారులు అంతగా ప్రేమించని 'ఆంధ్రజ్యోతి' పత్రిక మీద ఆయన చర్యలకు ఉపక్రమించారు. 

ఈ నేపథ్యంలో... మీడియా మీద దాడి చేస్తున్న నేతగా కే సీ ఆర్ మీద ముద్రవేసే అవకాశం ఉంది. అయినా సరే.. మీడియాకు నిజాయితీ తో ముకుతాడు వేయాలని (అంటే నియంత్రించాలని) జనం కోరుకుంటున్నట్లు మాకు అనిపిస్తున్నది. మీకేమి అనిపిస్తున్నదో మాకు రాయండి.   

15 comments:

I, me, myself said...

Even if 99% people feel its good to regulate media even then it should not be regulated. Tomorrow majority might feel private people might not own news channels or newspapers, hence what majority feels should not be criteria in all the matters. If media resort to false and cheap propaganda they will loose credibility.

Saahitya Abhimaani said...

నేషనల్ మీడియా వాళ్ళు (అంటే సి ఎన్ ఎన్ ఐ బి ఎన్, ఎన్ డి టి వి వంటివి అన్న మాట ) మోడీ గెలుస్తాడని వాళ్ళకు అనుమానం రాంగానే కొందరూ, గెలిచిన తరువాత దాదాపు అందరూ ప్లేటు మార్చేసి, వళ్ళు దగ్గిర పెట్టుకుని తమ తమ పూర్వపు విష ప్రచారాలకు స్వస్థి చెప్పి, వారి వారికి ఉందనుకుంటున్న "పత్రికా స్వతంత్రాన్ని" చూపించుకోవటానికి (పవర్లో ఉన్నవాళ్ళకు చంచాగిరి చేసే స్వతంత్రం) పోటీపడ్డట్టుగా, మన తెలుగు మీడియా కూడా కొంతలో కొంత వాళ్ళనుంచి నేర్చుకుని ఉండాల్సింది. అదేదో సినిమాలో భాను ప్రియ అన్నట్టుగా "అర్ధం చేసుకోరూ".

మంత్రులూ వాళ్ళ ప్రమాణ స్వీకారలప్పుడు జరిగే గందరగోళాలు చూపించి వినోదం కలిగించిన సంగతి అలా ఉంచి, ఘనత వహించిన ఒకానొక రౌడి ముఖ్య మంత్రి పుత్ర రత్నం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒకానొక పార్టీ వాళ్ళు పెట్టిన సభలో జాతీయ గీతాన్ని పాడలేక ఒక్కళ్ళకీ సరిగ్గా రాక నానా గందరగోళపడి ఎలాగోలా అయ్యిందనిపించినప్పుడు ఈ మీడియా ఇంత అల్లరీ చేసిందా మరి. నా కంట పడలేదు మరి! ఇంకా నయం ఆ పుత్ర రత్నం ఆంధ్ర ప్రదేష్ (ఇంకా ముక్కలవ్వటానికి రెడీ అవుతున్న ఆంధ్ర ప్రదేష్ కు) మొదటి ముఖ్య మంత్రి అవ్వలేదు.

సెలెక్టివ్‌గా ప్రచారాలు చెయ్యటం ఈనాటి మీడియాకు అలవాటుగా మారటమే కాకుండా అదే ఏదో స్వతంత్రం అనుకునే దుర్దశకు వచ్చేసిందని నా అభిప్రాయం.

Unknown said...

ఇదే అంశం మీద నేను వేరే సైట్ లో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఇక్కడ కూడా యథాతథంగా టపా చేస్తున్నాను :

పత్రికాస్వేచ్ఛ అనేది పత్రికల సృష్టే తప్ప రాజ్యాంగంలో అసలా మాటే వాడలేదు. రాజ్యాంగంలో ఆర్టికిల్ 19 (a) కింద విడిపౌరుల వ్యక్తిగత వాక్స్వాతంత్ర్యం మాత్రమే అనుమతించబడింది. కాలక్రమేణా ఈ వాస్తవం మరుగున పడి, పత్రికాస్వాతంత్ర్యం, మీడియాస్వేచ్ఛ లాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ కాన్సెప్టులు వీరవిహారం చేయడం మొదలుపెట్టాయి. ఈ కాన్సెప్టులతో సమస్యేంటంటే - ఈ పత్రికలూ, మీడియా అనేవాటికి వాస్తవంగా ప్రజాస్వామ్యంతో సంబంధమే లేదు. వాటికసలు ప్రజాస్వామ్యమే అవసరం లేదు. అవి పక్కా ప్రైవేట్ వ్యాపారసంస్థలే తప్ప రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కానేకావు. అవి తమను తాము ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అని వ్యవహరించుకోవడం పెద్ద జోక్. అది తమకు తాము కట్టబెట్టుకున్న హోదా మాత్రమే. నిజానికి అవి కొన్ని శక్తిమంతమైన సంఘాలూ, పార్టీలకి చెందినవి. మళ్ళీ అవన్నీ కొందరు కుబేరుల జేబుసంస్థలే. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కొందరు వెన్నెముకలేని బలహీనుల్ని పోగేసి అడపా దడపా రోడ్డుమీదికొచ్చి గలాటా చేసేవే. దీని వల్ల విడిపౌరుడికి ప్రసాదించబడిన వాక్స్వాతంత్ర్యం కాస్తా ఈ గుంపుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వీటి ముందు అతను నిస్సహాయుడైపోయాడు. ఇవన్నీ కలిసి తమ అసత్య ప్రచారం/ అర్ధసత్యాల ప్రచార/ వక్రభాష్యాల ద్వారా ఒక మామూలు వ్యక్తి యొక్క, లేదా కొందరు బలహీన వ్యక్తుల యొక్క పౌరహక్కుల్నీ, మానవహక్కుల్నీ కాలరాయడానికి వ్యవస్థని ప్రేరేపించగలవు. ప్రస్తుతం ఈ ప్రైవేట్ మీడియా అనేది ఓ పెద్ద బ్లాక్ మెయిలింగ్ మాఫియా నెట్వర్కు కూడా. దీన్నంతా ఏకమొత్తంగా నిషేధించినా మనకి (సామాన్యప్రజలకి) వచ్చిన నష్టమేమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు తమ సంస్థల ద్వారా మనమీద రోజూ డిష్ ఔట్ చేసే చెత్తంతా మనకి నిజంగా అవసరం లేదు. ఆ చెత్త కోసం మనమేమీ పడిచచ్చిపోవడమూ లేదు.

ది ఆంధ్రా హ్యూమనిస్ట్ said...

Media has become the most unruly field where they are kings unto theselves, a law unto themselves. They are enjoying a kind of supreme power without responsibility. ఈరోజు మీడియా చేతుల్లో వాళ్ళ స్థాయికి మించిన పవర్ ఉంది. ఎంత పవరంటే వాళ్లీరోజు ఒక పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేయగలరు. లేదా రెండురాష్ట్రాల్ని కలపగలరు. రెండుదేశాల్ని యుద్ధానికి పురిగొల్పగలరు. నిందితుల్ని విచారణ లేకుండా ఎన్ కౌంటర్ చేసిపారెయ్యమని తమ వ్యాసాల ద్వారా సాక్షాత్తూ ప్రభుత్వానికే హుకుంలు జారీచేయగలరు. Today, media is a parellel government. ప్రజలు బందిపోట్ల కన్నా, రాజకీయనాయకుల కన్నా, పోలీసుల కన్నా మీడియా మనుషులకే ఎక్కువ భయపడుతున్నారు. ఈ భయంలోంచి ద్వేషం, అసహ్యం, చిన్నచూపూ అన్నీ పుట్టుకొస్తాయి.

మీడియా చేతుల్లో ఇంత పవర్ అవసరమా ? ఒకవేళ అవసరమేననుకుంటే ఆ పవర్ కి పగ్గాలొద్దా ? మనకి తెలిసి, పవర్ ఉన్నవాళ్ళందరికీ కొన్ని బాధ్యతలున్నాయి. వాళ్ళు ఆ పవర్ ని దుర్వినియోగం చేయకుండా చూడ్డానికి లోకాయుక్త, లోక్ పాల్ లాంటి వ్యవస్థలున్నాయి. డాక్టర్లకి మెడికల్ కౌన్సిల్ ఉంది. లాయర్లకి బార్ కౌన్సిళ్ళున్నాయి. ఏ నియంత్రణా, అడ్డూ, అదుపూ, క్రమశిక్షణా లేనిది మీడియాకే.

"ప్రజల కోసమే మా స్వేచ్ఛ" అని మీడియా మనుషులు వాదించవచ్చు. మరి ఆ ప్రజల పరువే తీసేస్తున్నారుగా తమ వార్తలతో, రాతలతో ? తమ మీద తప్పుడు వ్రాతలు వ్రాస్తే, తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యాసాలు అచ్చొత్తితే రామకృష్ణంరాజులాంటి పారిశ్రామికవేత్తలు కోర్టుకు వెళ్లగలరు. పరువునష్టం దావాలు వెయ్యగలరు. కానీ ఏ తప్పూ చేయకపోయినా కేవలం ఒక ఆరోపణ మీద అరెస్టయి, ఉద్యోగం పోగొట్టుకున్న మధ్యయతరగతి అభాగ్యద్డి మీద పత్రికలు వార్తలు ప్రచురిస్తే ఆ తరవాత ఈ సమాజంలో అతనెలా బతకాలి ? అది చాలదన్నట్లు ప్రతి కోర్టువాయిదాకీ విలేకర్లని పంపించి, అందరూ మర్చిపోతున్న కేసులో పురోగతి గురించి తాజా వార్తలు వేయడంలాంటి పనులు చేస్తూంటే అతని కుటుంబం ఎంత కుమిలిపోతారు ? దీని పర్యవసానాల్ని గ్రహించే సెన్సిబిలిటీ ఏమైనా మన మీడియాకి ఉందా ? ఇలా ప్రతివాళ్ళ పరువూ తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న మీడియాని తమ ప్రతినిధిగా ప్రజలెలా భావిస్తారు ? ఎందుకు భావించాలి ? ఈరోజు కేసీయార్, రేపింకో నాయకుడు. ఎవరు మీడియా మీద విరుచుకు పడ్దా ఇహముందు ప్రజలు ఏమీ అనరు. ఎందుకంటే నానారకాల అకృత్యాలతో తన ఇమేజిని తానే కొడిగట్టించేసుకుంది మీడియా.

Dr. TALATHOTI PRITHVI RAJ said...

పాపం కె సి ఆర్ గాని తెలంగాణా వారుగాని సీమాంధ్ర వారిపై ఎప్పుడైనా నోరుపారేసుకున్నారా ... బూతులంటే అస్సలు తెలవనోళ్ళు . వెటకారపు మాటలు ఎరగనోళ్ళు. సంస్కారం గూర్చి మీదగ్గర నేర్చుకోవాల్సిన దుస్థితి సీమాంధ్రులకు లేదు. ఇక్కడివారికి కూడా కె సి ఆర్ కంటే తిట్లు బాగానే వచ్చు .

SRI said...

KCR is 100% correct..
Some body has to stop the dirty language of media

Unknown said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

Admin. how can u accept that fellow who called rowdi mukyamantri....how dare he is..shall I call broker mukyamantri for one community cm...don't approve this type...or else approve broker mukyamantri who r ready to do anything for power

Sitaram said...

Please maintain restraint. Don't cast aspersions on others.
TMK team

Unknown said...

sitaram garu...but dont approve for remarks such as rowdi mukyamantri(one fellow above called)...for him he is rowdi..but for us he is greatleader...if he like vennupotu cm he can praise him..i can also Criticize his favourate cm with indecent language..is it correct???ru supporting or favour to one party??whats the topic and what he is saying???

And media have to respect peoples not community biased...wht tv9 said in that programe is nt good..if kcr take action then media will be careful in future to telecast such programmes..so dont encourage any indecent language in ur blog also..

Unknown said...

మీడియా ప్రజల కోసం పని చేయాలి ,అలాగే నిజాలు ఉన్నదీ ఉన్నట్టు చూపించాలి అంతే గాని కొంత మంది చేతులో కీలు బొమ్మ కాకూడదు మీడియా .గత కొంత కాలంగా చూస్తునం ఈ TV9,ABN ఆంధ్ర జ్యోతి తీరు నిజంగా చాల అసహ్యంగా ఉంటుంది .మరి చంద్ర బాబు భజన చేస్తూ ఉంటాయ్ ,ఎలక్షన్ టైం లో అయితే చంద్ర బాబు ప్రచార సాధనాలు గా పని చేసాయి ఈ రెండు ఛానల్ లు .అది మరి దారుణం .మీడియా విలువలు మరి దిగజారి పోయేలా ఉన్నాయ్ వీళ్ళ తీరు .మిగిలిన ఛానల్ ఏం తీసి పోరు కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం వాళ్ళ మిగిలినవారి కైనా బుద్ది వస్తుంది అని నేను అనుకుంటున్నా .ఈ విషయం లో తెలంగాణా CM గారి నిర్ణయాన్ని నేను సమరిస్తున్న .

hari.S.babu said...

మీడియా ఇప్పటికే కొరలూ, గోళ్ళూ పెంచుకుని నరమాంసం రుచి మరిగిన పులి లాగా తయారయింది.టీ ఆర్ పీ రేటింగుల కోసమే తప్ప ప్రజలకి సమాచారాన్ని అందించటం అనే లక్ష్యాన్ని మర్చిపోయి చాలా కాల మయింది.తెలంగాణా ముఖ్యమంత్రి చేసింది చాలా కరెక్ట్.యెందుకంటే ప్రమాణ స్వీకారం సమయంలో తదబడటం అనేది ఆంధ్రాలోనూ జరిగింది, అన్ని చోట్లా జరుగుతూనే వుంటుంది.అది చాలా చిన్న విషయం.ప్రమాదో ధీమతా మపి అని సరిపెట్టుకోదగిన వాట్ని కూడా భీబత్సాలుగా వర్ణించటం చాలా తప్పు.వారిని యెన్నుకున్న ప్రజల్ని అవహేళన చెయ్యటం.

hari.S.babu said...

ముందుగా వ్యంగ్య కార్యక్రమం ప్రసారం చేసింది.....వీ 6 ఛానెల్
>>
పొరపాటు.నేను మొదట సరిగ్గా పట్టించుకోలేదు.మిగతా చోట్ల కూడా చదివి నిక్కచ్చిగా తెలుసుకున్నాక మళ్ళీ రాస్తున్నాను.అసలు ఆ పని చేసిన చానెల్స్ ని వదిలి తనకి కచ్చగా ఉన్న చానల్స్ ని వేధిస్తున్నట్టుగా ఉంది కదా?
>>
అంటే అప్పుడే అధికారం మత్తు తల కెక్కిందన్న మాట!ఇక తెలంగాణా ముఖ్యమంత్రి గారి పతనం మొదలైనట్టే, ఆకాశంబు నందుండి పద్యం కాస్త గుర్తు తెచ్చుకుని రెడీ చేసుకోండి పతనానంతరం యెలిజీలు రాసుకోవటానికి:-)

ANANDA BABU said...

ప్రతి చోట తప్పులని విమర్శించడానికి అప్పోజిషన్ అంటూ ఒకటి ఉండాలి, ఒకవేల ఆ అప్పోజిషనే తప్పుగ మాట్లాడితే వ్యతిరేకించాలి, అంతే కాని ఆ అప్పోజిషన్ ని చంపాలనుకోకూడదు,

Saahitya Abhimaani said...

@Varidi V

ఒక ముఖ్య మంత్రిని నలుగురూ అనే మాట అనంగానే కులగజ్జి అంటిస్తే ఎలా. ఆ ముఖ్యమంత్రి మీద మీకున్న దురభిమానం కులగజ్జితో ఉండి ఉండవచ్చు. అలా అని అందరూ మీలాగా కులగజ్జితో తీసుకుంటున్నారనుకోవటం మీ అహంకార ప్రదర్శనమే. మీరనుకుంటున్నట్టుగా నాకెవరూ ఫేవరేట్ ముఖ్యమంత్రి లేరు. నా విమర్శలకు కులంతో సంబంధం లేదు. మీలాగా నేనేమీ కులగజ్జితో బాధపడటం లేదు. కామెర్లవాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టుగా మీకున్న కుల గజ్జితో ప్రపంచం అంతా మీకు అలానే కనిపిస్తే ఎవ్వరూ చెయ్యగలిగినది లేదు.

అసలు పాయింటు, ఘొప్ప నాయకుడుట, ముఖ్యమంత్రి అయ్యిపోవాలని తెగ తిరిగి నానా ఆర్భాటం చేస్తూ, చివరకు తన సభలో, తన వాళ్ళు, జాతీయ గీతం మొదలు పెడితే అందులో ఎవ్వరికీ జాతీయ గీతమే రాక ఎలాగోలా అయిందనిపించిన వాళ్ళు నాయకులా, మనకు ముఖ్యమంత్రులు, మంత్రులూ అవ్వలా! ఏమి స్థితి వచ్చించి. జాతీయ గీతం పాడలేక భంగపడిన ఒకానొక మానవుణ్ణి గురించి మీడియా వారు ఎంతవరకూ ఎద్దేవాచేసి చూపించారో తెలియదు కాని, పాపం ఒకావిడ మొదటి సారి మంత్రి అయ్యి ప్రమాణ స్వీకారంలో తడబాటుపడితే అదేదో పెద్ద వింత అయినట్టుగా పదే పదే చూపించటం మీడియా మూర్ఖత్వం. అది అసలు నా పాయింటు. అది వదిలేసి ఎక్కడెక్కడికో అనవసరపు విషయాల్లోకి లాగుతున్నారు మీరు.

రామూ గారూ, మీరు మోడరేషన్ పెట్టుకుని ఉపయోగం ఏమున్నది. ఏ కామెంటు పడితే అది పబ్లిష్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది, ఒక బాకా పత్రికాయన వచ్చి యాగీ చేశాడు మీ బ్లాగులోనే. కాస్త కామెంట్లు ఏవి వెయ్యాలో ఏవి వెయ్యకూడదో చూసి వెయ్యండి మరి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి