మీడియా అంటే స్టూడియోలో కూర్చొని నోటికొచ్చింది వాగడం అనుకునే అర్ణబ్ గోస్వామి అరిచి గీపెడుతున్నారని, ప్రతి దానికీ ప్రత్రికా స్వేచ్చకీ ముడిపెట్టే వేమూరి రాధాకృష్ణ గొంతు చించుకుంటున్నారని కాదుగానీ, టీవీ 9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్స్ మీద ఇకనైనా నిషేధం ఎత్తివేయడం తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి మంచిది. తెగేదాకా లాగడం సభ్యత కాదని తెలుగు మీడియా కబుర్లు భావిస్తోంది.
ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం. ఆ మాటకొస్తే...ఏ ఛానెల్ ను, పత్రికను మూసినా జనంలో విప్లవం వస్తుందని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, జనం జర్నలిజాన్ని అసహ్యించుకుంటున్నారు. జనమే కాదు... నికార్సైన జర్నలిస్టులూ ఛీ కొడుతున్నారు. ఏ సామాజిక వర్గమైతే.... తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి, మీడియా పవర్ ను జనాలకు రుచి చూపిందో... అదే సామాజిక వర్గం కుల-రాజకీయ-వ్యాపార విస్తరణ కోసం మరీ హద్దుమీరి బరితెగించి విష సంస్కృతిని (ఒక ఫ్రెండ్ అన్నట్లు డిజిటల్ టెర్రరిజాన్ని) ప్రేరేపించి... జర్నలిజం అంటే జనాల్లో అసహ్య భావన కలిగేలా చేసింది. జర్నలిస్టులను రాళ్ళతో కొట్టే రోజు వచ్చింది.... ఈ మహానుభావుల పుణ్యాన. నిర్దయతో యాజమాన్యాలు జర్నలిస్టుల ఉద్యోగాలు పీకుతుంటే... పట్టని గోస్వాములు, వేరాలకు పత్రికా స్వేఛ్చ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? పత్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు సార్. ఇవి ఇప్పుడు ఎవ్వడికీ పట్టని అంశాలు.
తెలంగాణా ఉద్యమం స్వరూప స్వభావాలు, కష్టనష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు... మీడియా నిర్వర్తించిన భూమిక ఏమిటో.
రెండు ఛానెల్స్ మీద కేబుల్ ఆపరేటర్ల సహాయంతో నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదు. ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగింది. ఈ నిషేధం తర్వాత న్యూస్ రూం లలో తెపరితనం గణనీయంగా తగ్గింది. సెటైర్ పేరు మీద చౌకబారు చెత్త ప్రోగ్రాంలు చేసే జర్నలిస్టులు పదాలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొన్ని ఛానెల్స్ వాళ్ళు (అప)హాస్యపు ప్రోగ్రాం లకు బ్రేక్ ఇచ్చారు. తెలుగు ఛానెల్స్ వాళ్లకి ఇలా ముకుతాడు పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామం.
ముఖ్యమంత్రి గారూ...ఇక ఇది చాలు. వందల మంది జర్నలిస్టుల జీవితాలతో ముడి పడి ఉన్న సమస్య ఇది. ఇంకా కొనసాగించడం భావ్యం కాదు. ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. పోయిపోయి రొచ్చులో దూకినట్లుంది. కచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు.
తెలంగాణలో పుట్టిన పాపానికి అనేక మంది ప్రతిభావంతులైన జర్నలిస్టుల జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళను ఎదగనివ్వలేదు. ఆ లెక్కకొస్తే... ఇప్పుడు వీధిన పడిన జర్నలిస్టులలో అధిక శాతం ఈ ప్రాంతం వాళ్ళే. మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు. సాల్యూట్ కొట్టాలని అనడం అభ్యంతరకరంగా ఉంది. ఇక్కడి జర్నలిస్టుల కోసమైనా....ఇక నిషేధాలు ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛకు తాను ఏకైక పెద్ద ప్రతినిధినని చేరా విశ్వవ్యాప్తంగా చాటుకోవడాన్ని అర్జెంటుగా అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి అవసరం.
కేబుల్ ఆపరేటర్లతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి... తమ నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా ఉంది కాబట్టి ఈ ఛానెల్స్ కార్యక్రమాలు పునరుద్ధరిస్తున్నామని ప్రకటింపజేయాలి. అదే సమయంలో ఒక నిపుణుల కమిటీ (మళ్ళీ అదే అన్ ప్రొఫెషనల్ గ్యాంగ్ కాకుండా) వేసి..... మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలి. జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి.
నోట్: నోట్: ముందుగా పెట్టిన "సీఎం కే సీ ఆర్ గారూ.... ఇంక చాలు నిషేధం ఎత్తేయరూ..." అన్న నాసిరకం శీర్షికను మిత్రుల అమూల్య అభిప్రాయం మేరకు మార్చాం. వారి సూచనే కరెక్టు. వారికి థాంక్స్.
నోట్: నోట్: ముందుగా పెట్టిన "సీఎం కే సీ ఆర్ గారూ.... ఇంక చాలు నిషేధం ఎత్తేయరూ..." అన్న నాసిరకం శీర్షికను మిత్రుల అమూల్య అభిప్రాయం మేరకు మార్చాం. వారి సూచనే కరెక్టు. వారికి థాంక్స్.
19 comments:
పై పేరాలో ఒక సామాజిక వర్గం అంటూ ఎత్తి చూపిన మీరు క్రింది పేరాలో మన ప్రాంతం అని మీకు అనుకూలంగా ఎ్రాంతీయ వాదం ను ఆసరాగా చేసుకున్నారు. దయ చేసి మారండి చేప్పేదొకటి చేసేది మరొకటి కాకుండా చూడండి.
అవును! నిషేధం ఎత్తివేతకు ఇదే సరైన సమయం . కేబుల్ ఆపరేటర్లు మీటింగ్ పెట్టి ఓసారి హెచ్చరించి నిషేధం ఎత్తేయవచ్చు .
మీ టపాలో నిషేధం ఎత్తివేయాలన్న విషయంపై వ్రాసిన కొన్న సంగతులను గూర్చి నేను వ్యాఖ్యానించాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. దీని అర్థం మీ వ్యాసాన్ని ఖండిస్తున్నానని కానేకాదు.
నా స్పందన మరీ దీర్ఘంగా ఉండబట్టి విద్గా ఒక టపాగా ప్రకటించాను, పరిశీలించగలరు.
mee prathi post lo inline ga kamma valla meedha/eenadu meedha hatred chupistu untaaru enduku ?
any special reason ?
Please please ....kastha rendu rojulu aagandi....
javadekarbpettededo ruchi choosi aa tharavatha evarevaru ennesi kilometarlu lopalike velathaaro teliyali kadaa.....
aa chance pogottukokandi please ....
Syaamaleeyam garu: Some of your points are really good. We should have given a different headline. It should have been "Ippudainaa...nishedam yetteyaali."
We are not changing the headline. If we do so, people can't understand your argument.
we have been seriously feeling that somebody should rein in the Telugu media. KCR did it. We still feel that this media needs a jolt, sir.
Yes, we have taken Telangana stand. I don't know whether you are a journalist but we can tell you the humiliation the journalists of this region underwent.
We condemn the language used by the Chief Minister though we still feel that the protests at Delhi and Warangal were meant to provoke KCR. He was straight into the trap.
All said and done, we feel that the indirect ban should be lifted and everyone should behave with some sense of response.
We appreciate your argument.
Team TMK
ఆహా, వందలూ వేల సంవత్సరాలుగా భారత జాతిలో వేళ్ళూనికిపోయున్న బానిస మనస్తత్వాన్ని ఎంత చక్కగా కళ్ళకు కట్టిందో మీ హెడ్డింగు!
ఇక చాలు ప్రభో అని యజమాని పట్ల భయంతో వచ్చిన భక్తితో కూడిన వినయంతో ప్రాధేయపడి వేడుకుంటున్న ఒక బానిస దైన్య స్థితిని చూసి నా కళ్ళు చెమర్చాయి… హృదయం ద్రవించింది. మరిక, ఆ దొర వెన్న లాంటి మనసెప్పుడు కరుగుతుందో?
nice ramu
మీ టపాలొ చాలా మందిని తిట్టారు. కానీ, మీ టపా చదివితే, మీకు, మీరు తిట్టిన వాళ్ళకు పెద్ద తేడా ఎమీ కనబడటం లేదు.
బహుశా మీకు ఎవో కారణాలు వుండి వుంటయీ. ఆలాగే వాళ్ళకి కూడా !!!
Edge garu,
You are partially right. we should have given a different heading. It is our mistake. Praasa kosam choodadam oka kaaranam kaavachhu.
good day
"ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం." మీ ఈ వాక్యంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను - అది పూర్తిగా సత్యం. ఈ రోజు వార్తలు చూడటానికి బోలెడు చానెల్స్ ఉన్నాయి. ఒక వార్తా చానెల్ ప్రసారం కాకపోతే ఏదో మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఎవరికీ లేదు. తెలంగాణ ప్రేక్షకుడు ఆంధ్రా వార్తలు చూడాలనుకుంటే బోలెడు ఆంధ్రా చానెల్స్ తెలంగాణలో శుబ్బరంగా ప్రసారమవుతున్నాయి, కొన్ని చానెల్స్ ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి కూడా. నిజానికి వార్తా చానెల్ అంటేనే భయపడే పరితిస్థితిలో ఉన్నారు జనాలు. ఒక్కో చానెల్ ఒక్కో పార్టీకో, ప్రాంతానికో వంతపాడటం, ఏ మాత్రం ప్రయోజనంలేని, పనికిమాలిన విషయాలను బ్రేకింగ్ వార్తలంటూ పదే పదే వేసి విసిగించటం. చర్చా కార్యక్రమాలంటూ పెట్టి చానెల్ ఏమి చెప్పలనుకుంటుందో అది ఏదో శోధించి వెలికితీసినట్టు చెప్పెయ్యటం. హాస్యం కాక అసహ్యం తెప్పించే హాస్యపు వార్తలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వార్తా చానెల్స్ ని ఏదో ముఖ్యవార్తలు తెలుసుకోవటానికి తప్ప అభిమానించి వార్తా చానెల్ ని చూసే స్థితిలో లేడు తెలుగు ప్రేక్షకుడు.
ఇక హెడ్డింగ్ మార్చటం సబబే, నాకు కూడా సరైన హెడ్డింగ్ గా అనిపించలేదు - ఎందుకంటే ముఖ్యమంత్రి ద్వారా అవి బాన్ చేయబడలేవు. చానెల్స్ బాన్ చేసింది కేబుల్ ఆపరేటర్లు - హైకోర్టులో వారిద్దరిమద్యే కేసు నడచింది, కేబుల్ ఆపరేటర్స్ కి అనుకూలంగానే చివరికి తీర్పు వచ్చింది. ఇక ఆ చానెల్స్ తిరిగి తెలంగాణలో ఎక్కడైనా ప్రసారమైనా తిరిగి ప్రేక్షకాదరణ పొందటానికి తంటాలు పడక తప్పదు.
మీరన్నట్టు ఈ నిషేధం చానెల్స్ ప్రసారాల తీరుని మార్చింది అన్నది అక్షర సత్యం - అది శుభ పరిణామం కూడా.
వ్యతిరేఖత ఎలా కనిపిస్తుంది .
చానెల్ కావాలని అడిగితె వాడు ఆంధ్రోడు అయిపోతాడు కదా
ఇందు మూలము గా యావన్మ్ందికీ తెలియజేయబడుతున్నదేమనగా.., కెసీయార్ లాగా జర్నలిస్టులందరూ మరుగుజ్జు వ్యక్తిత్వం కలవారనీ (ఈ వ్యాసకర్త తో సహా) వారికి స్వీయనియంత్రణ అనేది "కనకపు సింహాసనముపై శునకము ను కూర్చొండబెట్టిన.." ఏమి జరుగునో అదే జరుగుతున్నదనియున్నూ...!!
వెర్రితలలు వేస్తోన్న మీడియాను నిషేధించొద్దా? ఎవరు నిషేధించాలి? ప్రజల పక్షాన నిలువక పోతే నమస్తే తెలంగాణా కూడా నిషేధించాలి.కానీ ఎవరు నిషేధించాలి? ప్రజలా? పాలకులా?
ఏ వార్తకైనా,వ్యాసానికైనా,కథకైనా కంటెంట్ బట్టే శీర్షిక పెట్టడం ఆనవాయితీ.దీని ప్రకారం చూస్తే ఆ యొక్క పుచ్చురకం వ్యాసానికి ఈ యొక్క `నాసిరకం`(ఇది మీ మాటే) హెడ్డింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా సరిగ్గా సరిపోయింది.మరేం పర్వాలేదు.ఎంచక్కా అడుక్కుంటున్న టైపులో ఉన్నపాత హెడ్డింగ్ కంటిన్యూ చేయండి.ప్లీజ్...
anyway TV9 found a solution and changed their TV1 name to Jai telangana TV. ABN Andhrajyothi should also walk the same way.
The TV9 program is a satirical program. It's intention is not really to criticize seriously but in a humorous way. And we see that it often goes beyond the line many times.
Whatever the reason may it be, since it hurted the people, TV9 apologized many times. What else they can do once it's telecasted?
Don't you know the sort of filthy language that KCR used many times which is INTENTIONAL. Did he ever apologize ever?
You know that the real reason for banning is not this. But since they are against KCR and family. KCR just took off his revenge in the name of telangana.
You proved that you are also the bird of same feather(ఆ తాను ముక్కే)
తెలుగు మీడియా కబుర్లు కాదు కాదు తెలంగాణ మీడియా కబుర్లు వారి జ్ఞాన సున్యానినికి ఈ బ్లోగుపోస్ట్ పరాకాష్ట , ఈ బ్లాగును నడుపుతున్న మేతావులకు నా మాట. మన దేశం లో ఆతంకవాదులు జరిపిన దాడి ని కొన్ని జాతీయ టి.వి. చానళ్ళు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపి పరోక్షంగా ఆతంకవాదులకు సహాయపడిన ఘటన దెశ ద్రోహానికి సమానం. అయిన మన భారత ప్రభుత్వం సదరు చానాల్లను నిషేదించలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం కాబట్టి, వారిని మందలించి మరో మారు ఇలాంటి పొరపాట్లు జరగ కుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాని ఈ మద్య న కొత్తగా కొలువు దీరిన శాసన సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రంలో కొన్నింటి మీద ఒక చానల్ అత్యుక్షహంగా వేసిన చవకబారు కార్యక్రమాన్ని అందరూ ఖండించాల్సిందే కాని నిషేదించడం దుర్మార్గం, దురహంకారం. అంతకంటే దుర్మార్గం మీడియా బాగు కొరకే బ్లూగులు నడుపుతున్న అని ప్రచారం చేసుకొంటున్న కొంతమది అతిమేదావులు ఈ చానళ్ళ నిషేదాన్ని ఖండించక పోవడం దురద్రుష్టకరం. ఒక వేల రాజ్యాంగాన్నే గౌరవించని ముఖ్యమంత్రికి మన ఖండన ఏ మూలకు అనుకోన్నారో ఏమో ఈ మీడియా కబురులు మేతావులు చెప్పాలి. సమర్దించక పోతే పోతారూ వీరి భయాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజాదరణ పొందిన చాన్నల్లనే నిషేదించిన మహానుభావులకు వీరి బ్లాగును నిషేదించడం ఎంత పని. అందుకే ఈ బ్లాగు నిర్వాహకులు మొన్న ఓరుగల్లు లో జారీచేసిన ముక్యమంత్రి "సలాం" హుకం ప్రకారం ఈ బ్లాగు వారు నడుచుకొంటున్నారు. మన దేశానికి ఒక రాజ్యంగం ఉంది దాని ప్రకారం హక్కులున్నాయి అలాగే విధులు కూడా వీటిని ఎవరైనా తప్పుగా పాటిస్తే లేదా పొరపాట్లు చేస్తే ఎటువంటి శిక్షలు వేయాలో కూడా మనం చట్టాలు తయారు చేసుకొన్నాం అన్న విషయం తెలియలేదో లేదా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ నిషేధం పై ఏదో ఒకటి వ్రాస్తే పోలా అనుకోని ఈ పోస్టు వ్రాసారో ఏమో. మన దేశం లో నరమేధం జరిపిన కసబ్ ను కూడా మన చట్టం ప్రకారం వాదనలు ప్రతివాదనలు కు అవకాసం ఇచ్చి జైలులో ఉన్నంత కాలం బద్రత కోసం కోట్లు ఖర్చు పెట్టి చివరకి న్యాయవాది ఇచ్చిన తీర్పు ప్రకారమే ఉరితీసారు అలాంటి భారత దేశం లో చట్టం ఏమిచెప్పిన మాక్కరలేదు మేము ఎవరిని నిషెదించాలి, ఎవరికీ స్వేచ్చ ఇవ్వాలి అన్నది మేమే నిర్ణయించుకొంటాం అంటూ చాన్నాళ్ళ నిషేధం కొనసాగుతుంటే. ఈ బ్లాగర్లు చాన్నాళ్ళకు జలక్ అవసరం అయిన సమయంలో చట్టాల ప్రకారం సదరు చాన్నాళ్ళ పై చర్య కోసం డిమాండు చేయకపోగా నిషేదాన్ని సమర్దిస్తూ వింత వాదనులు వ్రాయడం మరీ విడ్డూరం.
చివరగ మరోమారు బ్లాగు మేధావులకు నా మాట మనకు రాజ్యంగం ఉంది చట్టాలు ఉన్నాయి అది మరిచి పోకండి.
రెండు చానెళ్ల ప్రసారాలు తెలంగాణలో ఎలా ఆగిపోయాయో, ప్రభుత్వం ఎలా కారణమో అందరికీ అర్థం అయ్యేట్లు ఒక ఆర్టికిల్ రాయండి.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి