ఫిబ్రవరి 20, 1992
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
రామచంద్రా డిగ్రీ కాలేజ్ (సైన్స్), రామవరం
సరిగ్గా ఈ పోస్టు రాస్తున్న సమయానికి ఒక మూడేళ్ళ మూగ ప్రేమ ఒక ఫేర్ వెల్ పార్టీలో సమాధి అయ్యింది. కారణం: మతం. వాడు ముస్లిం.
ఎందుకు కలిసామో, ఎలా కలిసామో కానీ... మేము బీ ఎస్సీ (బీ జెడ్ సీ) లో చేరి ఒక అద్భుతమైన గ్రూపుగా తయారయ్యాం. ఆ రోజుకు ఒక పది రోజుల కిందనే ఆ ప్రేమ వ్యవహారం మాకు తెలిసింది. ఇదే సమయానికి ఫేర్ వెల్ పార్టీ లో.... "నిన్ను తలచీ... మైమరచా చిత్రమే అది చిత్రమే..." అని పాట (1989 లో వచ్చిన 'విచిత్ర సోదరులు' లోది) వాడుపాడుతున్నాడు. అది అక్కడి ప్రేక్షకులకు... బైటివాళ్లకు మిత్రులు విడిపోయే రోజున ఒక మజా పెంచే సూపర్ హిట్ పాట. కానీ వాళ్ళిద్దరితో పాటు మాలో కొందరికి తెలుసు... అందులో ప్రతి పదం వాడి ప్రేమ జీవితానికి సంబంధించిందే. హీ మెంట్ ఎవ్రీ వర్డ్.
సినిమా లో కమల్ హాసన్ పడ్డ గుండె వేదనే వాడూ పడుతున్నాడు. ఒక పెను విషాదాన్ని ఆపలేక పోతున్నానన్న కసి, ఓడిపోతున్నానన్న ఆక్రోశం.. అన్నిటికీ మించి మంచి ప్రేమికురాలిని కోల్పోతున్నానన్న దుఃఖం. అయినా... సింగర్ గా తననుంచి మంచి పాట కోసం తోటి విద్యార్థులు చేస్తున్న డిమాండ్ తీర్చాలన్న తపనతో...ప్రాణం పెట్టి పాడుతుంటే...డొక్కలో నొప్పి. తెల్లటి జేబురుమాల పొట్ట చుట్టూ కట్టుకుని తీవ్రంగా లీనమై పాడాడు. ఆ పాట ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతోంది.
అప్పటికే మా మనసులు అన్నీ ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాయి. ఇక అదే చివరి కలయిక అని అర్థమై ఆమె కళ్ళ నిండా నీళ్ళు సుళ్ళు తిరిగాయి.
తెలిసీ తెలియని వయసు. అంతా అయోమయం. అది నికార్సైన నిండు ప్రేమ. నిజానికి నేను అనుకుంటే...ఎవరు అడ్డువచ్చినా వాళ్ళను కలిపే వాళ్ళం. కానీ... ఈ ప్రేమకు మనం సహకరిస్తే... ఆమె కుటుంబం ఆత్మహత్య తథ్యమని ఆమె స్నేహితురాళ్ళు చెప్పారు. 'పైగా వాడిది.. చంచల స్వభావం. ఉద్యోగం సాధించి... ఈమెను పోషించి జీవితాంతం పోషిస్తాడన్న నమ్మకం నీకుందా...?" అని వాళ్ళు నన్ను అడిగారు. అవునని నేను చెప్పలేక పోయాను. దానికి కారణాలు ఉన్నాయి.
వేరే జిల్లా నుంచి వచ్చి... పాలిటెక్నిక్ మధ్యలో ఆపి, డిగ్రీ లో చేరి... సరిగా చదవకుండా... ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తూనో, తనకు ఇష్టమైన పాటలు పాడుతూనో ఊరిబైట ఒక పూరింట్లో గడిపేవాడు. 'వీడు డిగ్రీ పాసై... ఉద్యోగం తెచ్చుకుని... సెటిల్ అయ్యేది ఎన్నడు? ప్రేమే పరమావధి... దానికి పెళ్ళే పర్ఫెక్ట్ ముగింపు అనుకుని కలిపితే... ఒకరిద్దరు పిల్లలు పుట్టాక.... తన్ని తగలేస్తే...? అంతకన్నా ముందు.. నీళ్ళను కూడా నిప్పులతో కడిగి శుభ్రం చేసుకున్నాకే తాకాలనుకునే ఆమె ఇంట్లో పరిస్థితి ఏమిటి?"--ఇలాంటి ప్రశ్నలు నా చిన్న బుర్రను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 'నో... నువ్వు ఎంకరేజ్ చేయకు. ఈ రోజుతో వదిలేద్దాం," అని అంతా నాకు చెప్పారు. నేనూ విత్ డ్రా అయ్యాను. మనో వేదనతో మతి కోల్పోయి శూన్యంలోకి చూస్తున్న ఒక మంచి మిత్రుడ్ని ఎండ మావైనా లేని ఎడారిలో ఒంటరిగా ఒదిలి వెళ్ళాం. ఆమె ఎంతగా బాధపడిందో!
"ఏమీ అనుకోకు.. నీ చంచల స్వభావంపై నాకు నమ్మకం లేదు. ముందు... పాలిటెక్నిక్ పూర్తి చేయి. తర్వాత చూద్దాం..." అని చెప్పి ఒక మిత్రుడి రూం కు తెచ్చి పెట్టాం. ఒక భయంకరమైన తప్పు చేసిన భావన లోలోపల వెంటాడింది... ఆ హామీ ఇస్తున్నప్పుడు. నాది ఒట్టి సాంత్వన వచనం. అట్లా చెబితే ప్రస్తుతానికి ఒక గండాన్ని గట్టు ఎక్కించవచ్చన్న ఒక పథకం. ఒక మిత్రద్రోహం.
ఆ మాటను సీరియస్ గా తీసుకుని... ప్రేమ నెగ్గించుకునేందుకు ఒక రెండు మూడు నెలల్లో వాడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. 'ఉద్యోగం దొరకడం పెద్ద కష్టం కాదు.. నీ మాట నిలుపుకో...,' అని వాడు అన్నప్పటికే నాకు తెలుసు... ఆక్కడ ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారని. అదే సంగతి వివరించి చెప్పి... ఈ విషయం మరిచిపొమ్మని సలహా ఇచ్చాను... తీవ్రమైన పశ్చాతాపం తో. ఇంత పెద్ద మాట తప్పడం జీవితంలో అదే మొదలు.
కాలక్రమేణా... అందరం ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాం. నేను వాడిని కలిసాను, ఆమెనూ కలిసాను.... విడివిడిగా. ఒకరి సమాచారం ఒకరికి పెద్దగా తెలియనివ్వలేదు... కావాలనే. జీవిత భాగస్వామితో, పిల్లలతో... సెటిల్ అయిన వారిని గతం గాయపరచకూడదన్న ఒకే ఒక్క ఆలోచన నాది. "ఆమె ఎలా ఉంది?" అని వాడు... "ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు?" అని ఆమె అడుగుతున్నప్పుడు ఆ గొంతుల్లో తప్పే శృతి నాకు తెలుసు. అదే ఊర్లో పరిచయం అయిన కాలేజ్ జూనియర్ అయిన అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా మనసును వారి ఆర్ధ్రత చేసే గాయం, ఆ చిన్న ప్రశ్న నన్ను దోషిగా నిలబెట్టడం... భరింపశక్యం కానివి.
ఈ రోజు మధ్యాహ్నం అనుకోకుండా... అప్రయత్నంగా నేను వాడికి ఫోన్ చేశాను. "ఈ రోజుకో ప్రాముఖ్యత ఉంది... తెలుసా?" అని అడిగాడు.
నేను: ఏమిటా ప్రాముఖ్యత?
వాడు: 1992 ఫిబ్రవరి 20 న మన ఫేర్ వెల్ పార్టీ, నేను పాడిన పాట, మేము విడిపోయిన ఆఖరి రోజు...
నేను: ఓహ్ గాడ్... నీకు ఇంకా గుర్తుందా?
వాడు: ఈ ఏడాది ఆ స్పాట్ (రామవరం లోని కాలేజ్) కు వెళ్ళడం కుదరలేదు. ఇదే రోజు అక్కడికి వెళ్లి వస్తాను
నేను: నిజంగా ఆమెను అంత ఇదిగా ప్రేమించావా?
వాడు: అంత అన్నదానికి కొలమానం ఉంటుందా? సముద్రమంత అంటే ఎంతో చెప్పగలమా?
నేను: బాధగా ఉందా?
వాడు: నొప్పితో బాధపడుతున్న ఒక హార్ట్ పేషంట్ దగ్గరకు వెళ్లి నొప్పిగా ఉందా? అని అడిగినట్లు ఉంది.
నేను: ఇప్పటికీ మరిచిపోలేదా?
వాడు: అది కుదరనిది. మొదటి పదేళ్ళు అనుక్షణం గుర్తుకు వచ్చేది. జీవితం హడావుడిలో పడినా... అది మరిచిపోలేని విషయం. కొన్ని అంశాలు మరణించేవరకూ మధుర జ్ఞాపకాలుగానే ఉంటాయి.
నేను: మూడేళ్ళ డిగ్రీ కాలం మొత్తం సాగిందా ప్రేమ?
వాడు: ఫిబ్రవరి 10 న తను ప్రపోజ్ చేసింది. 20 న ముగిసింది. అంతకు ముందే... మా ఇద్దరి మధ్యా ఒక బాండ్ ఉండేది. అంతే
నేను: పది రోజుల ప్రేమ ఇన్ని రోజులు...?
వాడు: ప్రేమను రోజుల్లో కొలవడం సాధ్యమా?
నేను: ఈ విషయంలో నన్ను అపరాధిగా భావిస్తున్నావా?
వాడు: లేదు, నన్ను తాగుబోతునని కొందరు అనుకున్నారు. మతం పునాదుల మీద ప్రేమ బీజం నాటవచ్చా? అని ఒక రోజు అడిగింది. మతమే అడ్డమైతే... మారదామని నిర్ణయించుకున్నాను.
నేను: మరి మీ ప్రేమలో విలన్ ఎవరు?
వాడు: విధి
నేను: కారణం?
వాడు: మా మతాలు వేరు.
నేను: నీ భార్యకు చెప్పావా?
వాడు: మొత్తం చెప్పాను... పెళ్ళికి ముందే. డైరీ కూడా చూపించా.
నేను: మరి ఇప్పుడు ఏమంటావ్?
వాడు: జీవితంలో... పోయేలోపు... అవకాశం వస్తే.. ఆమెను ఒక్కసారి చూడాలని ఉంది.
సారీ మిత్రమా! అమరమైన నీ ప్రేమకు జోహార్లు.

1 comments:
really heart touching story
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి