ప్రభుత్వవార్తా ప్రచార సాధనమైన దూరదర్శన్ లో 1983 నవంబర్ 14 న సాయంత్రం ఏడు గంటలకు తెలుగులో మొట్ట మొదట వార్తా ప్రసారం ప్రారంభమయ్యింది. ఆ వార్తలు చదివే అదృష్టం, భాగ్యం, బాధ్యత దక్కిన వ్యక్తి శాంతి స్వరూప్ గారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు.
1977 అక్టోబర్ 23 లోనే లాంఛనప్రాయంగా హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది. చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన. శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే కాలం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.
"వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి....,"అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు. తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు. మేము తెలుగులో అద్భుతమైన యాంకర్ గా భావించే... రచ్చ రాములమ్మ.... 6 టీవీ లో శాంతి స్వరూప్ గారిని ఇంటర్వ్యూ చేశారు ఈ ఆదివారం నాడు. అది బాగుంది. ఆ ఫోటో ఇక్కడ ఉంది.

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి