భారత దళాలపై పుల్వామా లో ముష్కరుడి దాడి నేపథ్యంలో మీడియా, ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్, జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి యుద్ధోన్మాదాన్ని ఎగదోస్తున్నాయి. ఈ మీడియా ఉన్మాదానికి తిరుగులేని లీడర్ గా అర్ణబ్ గోస్వామి వర్థిల్లుతుంటే... మిగిలిన ఛానెల్స్ వాళ్ళూ రేటింగ్స్ రేసులో వెనుకపడతామన్న భయంతో ఎక్కడలేని వేషాలు వేస్తున్నాయి.
తమ చెర లో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ ను రేపు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం ఎంతో ఆనందం కలిగిస్తే, దీని మీద ఛానెల్స్ అవాకులు చెవాకులు జుగుప్స కలిగిస్తున్నాయి. పాక్ తలవంచింది అన్నట్లు వీళ్ళు మాట్లాడుతుంటే.. ఇది చూసి ఒళ్ళు మండిన పాక్ సైన్యం అభినందన్ కు ఏమైనా కీడు చేస్తే ఎట్లారా నాయనా? అన్న భయం మమ్మల్ను పీడిస్తోంది.
దీని మీద వివిధ వెబ్ సైట్స్ ఏమి రాసాయో చూద్దామని ఈ సాయంత్రం నెట్ లో వెతుకుతుంటే... thewire.in లో ఈ కింది ఫోటో ప్రచురించారు. మన టీవీ -9 వాళ్ళు ఏకంగా యాంకర్ కు సైనికుడి వేషం వేసి... బొమ్మ తుపాకీ ఇచ్చి చెలరేగి పొమ్మన్నట్లు సిద్దార్థ్ భాటియా గారు రాసిన ఈ కథనం చెప్పింది. వార్ రూమ్ అనే శీర్షికతో యాంకర్ తుపాకీ చేబూని తన విధిని నిర్వర్తించారు. ఇది చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. ఇదేమి సృజనాత్మకత రా నాయనలారా?
మిగిలిన ఛానెల్స్ చేస్తున్న రణ నినాదం గురించి కూడా ఈ వ్యాసం విపులీకరించింది... శృతిమించిన జాతీయవాదానికి భారతీయ టీవీ ఛానెల్స్ వత్తాసుపలకడం సిగ్గుచేటుగా ఉందన్న శీర్షికలో. ఈ వర్తమాన కాలం గురించి చివరకు చరిత్ర రాయాల్సివస్తే...పగా ద్వేషాలను పెంచే వాతావరణం సృష్టిస్తున్న ఈ మీడియా పెనుపోకడల గురించి ప్రత్యేక ప్రస్థావన చేయక తప్పదని ఇందులో రాశారు. ఇది నిజమే కదా!

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి