తెలుగు జర్నలిజంలో దౌర్భాగ్యం ఏమిటంటే...బుర్రతక్కువ, వెర్రి ఎక్కువ బాపతు జనం జర్నలిస్టులుగా చలామణి కావటం. కొంతమంది మంచి రిపోర్టర్లు, సబ్ లు సి.ఈ.ఓ.లుగా కాగానే గంగవెర్రులెత్తి ప్రవర్తిస్తున్నారు. టి.ఆర్.పి.రేటింగ్స్ పిచ్చలో పడి ఒళ్ళు మరిచి...వినూత్నత్వం పేరిట చెలరేగి పోతున్నారన్న అభియోగం వుంది. టీవీ ఛానళ్ళు క్షేత్ర స్థాయిలో ఎంత పేట్రేగిపోతున్నాయో ఒక సుశిక్షుతుడైన సీనియర్ రిపోర్టర్ కామెంట్ గా రాసి పంపారు. చదవండి.
-----------------------------------------------------------------
I know that the TV channels had deployed all their forces to cover the floods. But, after watching all the channels for about five days i failed to understand what they were trying to cover. There was no homework done by the reporters nor by the presenters. I presume that they were considering it as a cyclonic flood. In the case of a cyclonic flood, the situation would be completely different.
This flood is mainly due to increased inflows to Srisailam with heavy rains lashing the neighbouring state. The overflowing reservoirs have caused the damage. So, a reporter with good knowledge of the flows would be able to easily assess the damage and also decide how to cover it. In a way the coverage was pretty amusing. There is no doubt in saying that the damage caused due to the floods is significant. I have been touring some of the affected areas in the last five days and the last point i toured is Alampur on Wednesday.
I think the damage caused by bad reporting is more than the damage caused by the floods itself. Interestingly, all the channels kept the official machinery busy preventing them from focusing on the rescue and relief operations. Unable to shut the doors on the media, the officials too had spent more time on briefing the media than reviewing the situation. We can talk about the language part later. but, I will i will leave you with a thought. On Thursday, a TV reporter was asking a district official to explain the 'measurements' being taken by the government to handle a particular situation. Now, what does that mean?
Ramana
Friday, October 9, 2009
Thursday, October 8, 2009
"బ్రేకింగ్ న్యూస్"తో జనం బేజార్...
"కర్నూలు జల సమాధి" అని టి.వి.లో బ్రేకింగ్ న్యూస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కర్నూలు పట్టణమంతా పూర్తిగా జలమయం అయ్యిందని అనిపించక మానదు. "సమాధి" వంటి పదం వాడారు కాబట్టి...అక్కడ మృత్యువు కరాళ నృత్యం చేస్తున్నది కాబోలు అని కూడా అనిపిస్తుంది--సగటు మనుషులకు.
అదే కర్నూలులో మన కుటుంబమో, స్నేహితులో వుంటే..పెద్ద అక్షరాలతో స్పెషల్ ఎఫెక్ట్ తో క్షణ క్షణానికి వస్తున్న ఆ బ్రేకింగ్ న్యూస్ గుండె దడ పుట్టిస్తుంది. పనులన్నీ మానుకుని మన వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పడరాని పాట్లు పడతాం. పొరపాటున టెలిఫోన్ లైన్లు కలవకపోతే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. వారి గురించి తెలుసుకునే దాక అన్నం సహించదు, నిద్ర పట్టదు. ఈ పరిస్థితి నిజంగా నరకప్రాయం.
ఈ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే మహానుభావులు కర్నూలులో ఏయే ప్రాంతాలు జలమయం అయ్యాయో నిర్దిష్టంగా చెప్పాలి. "బాధితులు మాకు ఫోన్ చేయండి మొర్రో," అని మొత్తుకునే కన్నా.. వరద పరిస్థితిని మరింత కూలంకషంగా పూస గుచ్చినట్లు వీక్షకులకు అందించాల్సిన అవసరం వుంది. ఉదాహరణకు..."వరద కౌగిట్లో ఆంధ్ర," అని ఒక దరిద్రపు బ్రేకింగ్ న్యూస్ ఏ బుద్దితక్కువ చానెలో ఇస్తే...ప్రవాసాంధ్రులు ఏమనుకుంటారు? ఆంధ్ర మొత్తం గల్లంతు అవుతుందేమో అని బెంగ పడతారు. మీ స్క్రీన్లో ఎక్కువ అక్షరాలు పట్టవు కాబట్టి...సూక్ష్మం లో మోక్షం చూపిద్దామనుకుని వాస్తవాన్ని వక్రీకరిస్తే ఎలా సారూ?
వరద సమయంలో ప్రత్యక్షంగా ఇబ్బంది పడే వారితో పాటు బాధితుల గురించి పరోక్షంగా బాధ పడే బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల మానసిక స్థితి గురించి కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ప్రకృతి విలయ తాండవం ప్రకోపాల సమయంలో మీడియా మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి.
కానీ, ఇటీవలి వరదల సందర్భంగా మీడియా, ముఖ్యంగా టి.వి. ఛానెల్స్, మరీ ఓవర్ యాక్షన్ చేశాయని చెప్పక తప్పదు. ఒక ఛానల్ వారు..మొత్తంగా ప్రభుత్వం విఫలం అయ్యిందని..తమ రిపోర్టర్లు మాత్రమే నడుం లోతు నీళ్ళలో బాధితులకు సహాయం చేస్తున్నారని ప్రసారం (ప్రసారం) చేసుకున్నది. ఇప్పుడు బాధితులంతా ఈ ఛానల్ రిపోర్టర్ల కోసం ఎదురు చూడాలా? లేక..అధికార యంత్రాంగం కోసం ఎదురు చూడాలా? వ్యవస్థ పై నమ్మకం పోయేలా వ్యవహరించకూడదు..ఆపత్కర పరిస్థితుల్లో.
కుక్క పని కుక్క...గాడిద పని గాడిద చేస్తే బాగుంటుంది. మీడియా...వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపించవచ్చు, పరిస్ధితులు మెరుగు పడే పని చేయవచ్చు. "కానీ, యిలా..చౌక బారు ప్రచారం చేసుకోవాల్సిన పనిలేదు.." అని గత పాతికేళ్ళుగా మీడియాను నిశితంగా పరిశీలిస్తున్న ఎం. శ్రీనివాస ప్రసాద్ అన్నారు. "బ్రేకింగ్ న్యూస్ కు ఒక అడ్డు అదుపు లేకుండా పోయింది. ఛానెల్స్ కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి," అని ఆయన అభిప్రాయ పడ్డారు.
శ్రీనివాస ప్రసాద్ కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ బాధితుడే. ఒక వీర ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ విని ఈయన హడావుడిగా..కర్నూలు లోని తన ఫ్రెండ్ కు ఫోన్ చేసారు. కర్నూలులో కొన్ని ప్రాంతాలలో మాత్రమే వరద నీరు నిలిచిందని..చాలా వరకు సురక్షితంగానే వున్నారని తెలుసుకొని ఆయన కుదుట పడ్డారు.
మీడియా ఓవర్ యాక్షన్ గురించి ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యునికేషన్ అండ్ జర్నలిజం విభాగానికి చెందిన డాక్టర్ పద్మజా షా "ది హూట్" వెబ్ సైట్ లో ఒక మంచి వ్యాసం రాసారు. దాన్ని మీరు కూడా చదవండి. ఆ సైట్ యు. ఆర్. ఎల్...
thehoot.org
లంచం ఇవ్వకుండా బతకలేమా?
ఈ జీవితంలో లంచం ఇవ్వకుండా బతకలేని పరిస్థితి దాపురించింది. లంచం ఇవ్వకపోతే పనులు సాగవు. మన అవసరం...లంచావతారం గాడికి పంట పండిస్తుంది. అర్జెంటుగా పని కావాలనుకుని మనం కోరుకుంటాం. ఈ పాయింట్ నే వాడు కాష్ చేసుకుంటాడు. మనం రాజీ పడం. వాడూ రాజీ పడదు. ఇలా..లంచం మధ్యనే సాగుతుంది జీవితం.
ఒక అసాధారణ క్లిష్ట పరిస్థితిలో అర్జంటుగా నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. ఒక సారి రిజర్వేషన్ చేయించుకుంటే ట్రైన్ కాన్సిల్ అయ్యింది. కాబట్టి మరో సారి రిజర్వేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సి కోట (ఈ.క్యు.) కింద చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ కాలేదు.
నాతో పాటు పది మంది స్కూల్ పిల్లలు వున్నారు. వారంతా ఒక టేబుల్ టెన్నిస్ పోటీలో పాల్గొనాల్సివుంది. వారికి బెర్తులు పొందేందుకు నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక గుజరాతి స్టూడెంట్ తండ్రి తెలివిగా టికెట్ కలెక్టర్ గారి చేతిలో ఒక వెయ్యి రూపాయలు పెడితే పని వెంటనే అయిపోయింది.
"సార్...మీతో పాటు నేను రావటంలేదు. టీసి ట్రైన్లో మళ్ళీ మరో ఫైవ్ హండ్రెడ్ అడిగితె ఇవ్వండి," అని పిల్ల వాడ్ని నాతో పంపిస్తున్న ఆ గుజరాతి అన్నారు. అక్కడే సమస్య వచ్చింది. నేను ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వలేదు. మరి కొంత సొమ్ము రాబట్టేందుకు ట్రైన్లో టీ.సి. చేసిన ప్రయత్నాలు, వాడిని తప్పించుకుని నేను ఆడిన నిద్ర డ్రామా మరిచిపోలేనివి. వాడు నా బెర్తు దగ్గరకు కనీసం పది సార్లు వచ్చాడు. నేను పది సార్లు నిద్ర నటించాను. చివరకు నా చేతుల మీదుగా లంచం ఇవ్వలేదన్న తృప్తితో రైలు దిగాను.

Sunday, October 4, 2009
P.Bhaskar's health shows signs of improvement
Here is a piece of good news on Pensangi Bhaskar’s health. It is showing signs of steady improvement. He is able to pronounce small words but is unable to complete sentences.
On Saturday, I visited Bhaskar’s home to update you. The Eenadu Journalism School principal M.Nageswar Rao and his wife Sreedevi called on Bhaskar at his house in Panduranga Nagar, opposite lane to ESI Hospital in Yerragadda. MNR and PB had lived in a same colony when they worked together in Karimnagar. Physiotherapist is making PB to walk and talk.
Some journalists wrote me seeking P.Bhaskar’s phone number to call on him. Here it is: 9701033307.
He lives in fourth floor of “Richie Enclave” in Panduranga Nagar. Pay a visit and share some words of encouragement with him.
Saturday, October 3, 2009
'ఈనాడు' గూటికి జి.ఎస్.ఆర్--'ఇక్రిసాట్'కు ఉమానాథ్
రెండేళ్ళ క్రితం 'ఈనాడు'ను వదిలి తెలుగు మీడియాలో రకరకాల ప్రయోగాలు చేసిన జి.శ్రీనివాస రావు మళ్ళీ 'ఈనాడు' గూటికి చేరుకున్నాడు. నవ్వుతూ చలాకీగా, చురుగ్గా పనిచేసే జి.ఎస్.ఆర్. మెడికల్ రెపోర్టింగ్ లో చేయి తిరిగిన జర్నలిస్టు. కష్టపడి ఎదిగిన వ్యక్తి.
'ఈనాడు'ను వీడి ఏదో లోకల్ మెడికల్ అండ్ సైన్సు మ్యాగజిన్ లో పనిచేసిన ఆయన దృష్టి ఎలక్ట్రానిక్ మీడియా మీదకు మళ్ళింది. చూడ చక్కని వాడు...కాస్త డొక్క సుద్ధి వున్న వాడు కావటంతో తేలిగ్గానే అవకాశం దొరికింది.
టీవీ-నైనులో ఒక వెలుగు వెలిగి ఒక చేదు అనుభవాన్ని చవిచూసి కసితో రగిలిపోతున్న రాజశేఖర్ ఐ- న్యూస్ లో జి.ఎస్.ఆర్.కు 'అవుట్ పుట్ ఎడిటర్' అవకాశం ఇచ్చాడు. ఇంత సాత్వికుడు వెళ్లి ఆ టీంలో పడ్డాడు..నెగ్గుకు వస్తాడా?
అని అప్పుడే చాల మంది అనుకున్నారు. రాజశేఖర్ దూకుడు పోకడలకు, ఎత్తులు పై ఎత్తులకు...జి.ఎస్.ఆర్.సంప్రదాయ జర్నలిజం విలువలకు పొసిగినట్టు లేదు. అక్కడి నుంచి బైటకు వచ్చి 'మహా టీవీ'లో చేరాడు జి.ఎస్.ఆర్.. అక్కడ 'ఫీచెర్స్ ఎడిటర్'గా చాల కొద్ది కాలం పనిచేసాడు. అక్కడ నుంచి బైటకు వచ్చి 'ఈనాడు' జనరల్ డెస్క్ లో చేరాడు. "పద్ధతులు పాడూ లేకుండా వ్యక్తుల చుట్టూ తిరిగే వ్యవస్థను చూస్తున్నాను. ఈనాడే చాల బెటర్ బాసూ,' అని 'ఈనాడు'లో చేరటానికి చాల ముందు జి.ఎస్.ఆర్. అన్నాడు. ఇంగ్లీష్ లో ప్రవేశం వున్న ఈ యువ జర్నలిస్టు జనరల్ డెస్క్ లో రాణించాలని కోరుకుందాం.
అలాగే..'సాక్షి' ఛానల్ లో కీలక పదవిలో వున్న సీనియర్ జర్నలిస్టు ఉమానాథ్ గారు ఈ మధ్యనే 'ఇక్రిసాట్'లో సీనియర్ మీడియా ఆఫీసర్ గా చేరారు. తెలుగు, ఇంగ్లీష్ జర్నలిజాల్లో (ప్రింట్, ఎలెక్ట్రానిక్ రెంటిలో) దిట్ట గా చెప్పుకోదగిన ఉమానాథ్ గారు దీన్ని మంచి బ్రేక్ గానే భావిస్తున్నారు. అంతకు ముందు ఆయన 'ఈ-టీవీ', 'ది హిందూ'లలో పనిచేసారు. 'ది హిందూ'కు మెదక్ జిల్లా రిపోర్టర్ గా వుండీ కేవలం హైదరాబాద్ బదిలీ కాకపోవటంతో ఆ వుద్యోగం వదులుకున్నారు. వివాదాలకు బహు దూరంగా వుండే ఉమానాథ్ కొత్త ఎసైన్మెంట్ను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోగల రంటంలో సందేహం అవసరం లేదు.
మరో పరిణామం ఏమిటంటే...జీ-న్యూస్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న బి.టి.గోవింద రెడ్డి గారు మంచి పదవిలో 'సాక్షి' ఛానల్ లో చేరారు. చాల వుత్సాహవంతుడైన గోవింద్ రెడ్డి కూడా 'ఈనాడు' ప్రొడక్టే. జీ-న్యూస్ హెడ్ శైలేష్ రెడ్డి గారికి కుడి భుజం లాంటి గోవింద రెడ్డి జీ ని వదలటం మీడియా వర్గాలకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆల్ ది బెస్ట్ గోవింద్ జి.
డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన యాంకరమ్మ !?
"జంధ్యాల గారు నవ్వించడంలో దిట్ట. ఆయన ఎన్నో హాస్యాస్పద సినిమాలు తీసారు," అని యాంకరమ్మ చదివింది ఒక టీవీ ఛానెల్లో. ఏ తెలుగుతక్కువ జర్నలిస్ట్ రాసి ఇస్తే ఈ అమ్మడు చదివిందో..లేక సొంత బుర్ర పెట్టిందో తెలియదు. "హాస్య రస ప్రధాన" లేదా "హాస్య పూరిత " లేదా "నవ్వులు పండించే"..వంటి మాటలు వాడితే సరిపోయేది. ఇలాంటి తప్పులు రోజూ దొర్లుతున్నాయి టీవీ లలో. మీరు అలాంటి తప్పులు గమనించి వుంటే ఈ బ్లాగ్ కు పంపండి. ఓ యాంకరమ్మ విచిత్ర భాషా విన్యాసంపై మన "అర్భకుడు" చేసిన కామెంట్ చూడండి.
----------------------------------------------------------------------------------------------------------
వినేవాడు అమాయకుడు అయితే, చెప్పేవాడు వేదాంతి అని సామెత. ఇది మన తెలుగు టీ వీ చానల్స్ కి అతికినట్టు సరిపోతుంది..కాపోతే, కాసిన్ని సవరణలతో..వినే వాడితో పాటు, చూసే వాడు కూడా అమాయకుడనిన్నీ, ఇంకా అవసరమైతే వెర్రి వాజమ్మ అనిన్నీ మన తెలుగు న్యూస్ చానల్స్ కి బోల్డంత నమ్మకం..దాంతో పాటే..తాము చూపించి, వినిపించేదే తెలుగు భాష అని కూడా గొప్ప నమ్మకం..అందులో భాగంగానే..తమ సొగసరి యాంకర్ లతో ఇష్టమొచ్చిన తెలుగు (?) ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు..అది వారి బాధ్యతగా కూడా భావిస్తుంటారు.
మన ఖర్మానికి సరిగ్గా ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, మన శాయశక్తులా టీ వీ తెలుగు న్యూస్ చూద్దామని ప్రయత్నం చేశామా...మన చెప్పుతో మనల్నేకొట్టుకునే ఒక భయానక అనుభూతికి లోనవుతాం.
ఇటీవల మెరుగైన సమాజం పేరిట నడుస్తున్న ఒక ప్రక్రియ లో భాగంగా ...అక్షరాలూ గుర్తు పట్టలేని కొందరు యాంకర్లను మన మీద వదిలిన ఒక ఛానల్--ఒక వార్తా ప్రసారం చేసింది..`డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన వైనం' అని ఆ యాంకరమ్మ చదువుతుంటే...భోజనం చేస్తూ వార్తలు చూద్దామనే ఒక చిన్న పాటి తాపత్రయానికి లోనైన ప్రేక్షకులకు పొల మారి, గొంతులో మెతుకులు, ముక్కులోకి వచ్చి పడ్డాయి.
ఇంతకీ ఆ యాంకరమ్మ చెప్పదలుచుకుంది ఏమిటంటే...డెడ్ బాడీ నుంచి కళ్లు తీసిన వైనం అని అన్న మాట. ఆమె నేర్చుకున్న తెలుగులో లేదా..ఆమెకు తెలిసిన తెలుగులో `ళ` అనే అక్షరం లేదన్న మాట.. ఆ విషయం మన మెడుల్లా అబ్లాన్ గేటా..అంటే మన చిన్న మెదడుకి తెలియదు కాబట్టి..సాధారణ ప్రేక్షకులైన మనం ఆ విషయాన్ని అవగతం చేసుకోలేక పోయాం. ఆ చనిపోయిన వ్యక్తి నేత్ర దానం చేశాడు కాబట్టి..ఆయన డెడ్ బాడీ నుంచి శస్త్ర చికిత్స ద్వారా కళ్ళను వేరు చేస్తున్నరనిన్నీ, అందువల్ల ఆ నేత్ర దాత శ్లాఘనీయుడనిన్నీఆ యాంకర్ తాలూకు భావనగా మనం అర్ధం చేసుకోవలసి ఉంటుంది. కాస్త శ్రమ పడక పోతే విషయాలు ఎలా అర్థం అవుతాయి చెప్పండి?
అయితే, సదరు చిన్న వార్త వెనుక ఇంత టీకా తాత్పర్య సహిత టిప్పణి ఉంటుందనే ఇంగితం మన బోటి సాధారణ ప్రేక్షకులకు ఉండదు కాబట్టి...మనం ఇంకా అంతటి తెలుగు భాష ఉచ్చారణ స్థాయికి చేరుకోలేదు (?) కాబట్టి..మనమే సర్దుకు పోవాలన్నది ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం అన్న మాట!
ఇది ఒక తరహా భాషా పరమైన హింస అయితే, మరో బాపతు వ్యవహారం కూడా మనకు తరచూ అనుభవం లోకి వస్తూ ఉంటుంది.
మంగళ వారం నిందితులను పోలిసులు అరెస్టు చేసి --బుధవారం కోర్టులో హాజరు పర్చారనే తరహాలో తరచూ తెలుగు పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. వారాల ప్రకారం నిందితులు కానీ, కోర్టులు కానీ ఉండరని మన చిట్టి బుర్రలకు తటాలున తట్టదు కాబట్టి, మనం సాధారణం గానే కొంత గందరగోళానికి లోనవుతాం. అయితే..ఇక్కడ మన సంయమనాన్ని టెస్ట్ చేయటానికే ఈ బోటి తిక్క భాషా వినియోగం వల్ల--అసలు వాక్య నిర్మాణం తన సహజ సిద్దమైన అందాన్ని పోగొట్టుకుంటోంది అనే స్పృహ మనకి కలుగుతుంది కానీ...సదరుపత్రిక లేదా ఛానల్ నిర్వాహకులకు కలగదు. వాళ్ళు అనే పదానికి `వాల్లు' అనటం లేదా అలా పలికించటం గొప్ప అనుకుంటారో లేక, యాంకర్ల డొక్కా శుద్ధి అంట మేరకే ఉంటుందో మనకి ఎప్పటికీ బోధపడని ఒక గొప్ప రహస్యం!
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి..హిందీ, ఇంగ్లీషులతో పాటు, కొన్నిప్రాంతీయ భాషా చానెళ్ళు ..ఎంత పద్దతిగా తమ భాష పట్ల అనురక్తిని ప్రకటిస్తాయో గమనిస్తే..మన తెలుగు చానెళ్ళు ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది.. మెరుగైన సమాజాలను నిర్మించే ముందుగా.. మెరుగైన భాష మాట్లాడగల రీతిలో తమ యాంకర్లకు తర్ఫీదు ఇప్పిస్తే..తెలుగు వీక్షక లోకం, కాస్తంత హాయిగా వార్తలు చూసే సౌభాగ్యం కలుగుతుంది...ఇట్లు..
అర్భకుడు..
Friday, October 2, 2009
సత్యమే ఆయుధంగా...నిజమైన జర్నలిస్టు గాంధీజీ
(ఈ ప్రత్యేక వ్యాసం గాంధీ జయంతి సందర్భంగా)
అసాధారణమైన విధానాలతో స్వాతంత్ర్యోద్యమానికి వూపిరి పోసిన మహా నాయకుడు మహాత్మా గాంధీ జర్నలిజానికి చేసిన సేవ మహా గొప్పది. ప్రజల భాషలో సరళంగా సమాచారాన్ని అందించడం, నిర్భయంగా వున్నది వున్నట్టు రాయడం, కేవలం సత్య వ్యాప్తి కోసమె పత్రికలకు నడపడం ఎలానో ఆయన మనకు చూపించారు.
స్వాతంత్ర్య సమరం కన్నా దాదాపు రెండు దశాబ్దాలకు ముందే గాంధీజీ జర్నలిజాన్ని ఆచరించారు. "In less than a few months' stay in South Africa, Gandhi realized the need to become a journalist to fight for the rights of the Indian community. And he brought the highest qualities the profession could boast of-courage in the face of adversity, unswerving adherence to truth, pursuit of public causes, and objectivity in presentation," అని వి.ఎన్.నారాయణ్ ఒక వ్యాసంలో రాసారు.
గాంధీ గారి జర్నలిస్టు జీవితం నలభై సంవత్సరాల పాటు సాగింది. ఆయన ఆరు జర్నళ్ళను ఎడిట్ చేసారు. అంతకు ముందు దక్షిణాఫ్రికాలో వివక్షపై గుండె మండిన ఆయన అక్కడి దిన పత్రికలకు "లెటర్స్ టు ద ఎడిటర్" కాలమ్ కు లేఖలు రాసేవారు. తర్వాత 1903 లో "ఇండియన్ ఒపీనియన్"ను ప్రారంభించారు. డబ్బు ధ్యాస లేదు కాబట్టి అందులో ఆయన ప్రకటనలు ప్రచురించలేదు.
"ఇండియన్ ఒపీనియన్" కోసం ఒక వ్యాసం రాస్తున్నప్పుడే ఆయనకు సత్యాగ్రహం అనే ఆలోచన వచ్చిందట. "నీను రాసే వ్యాసాల్లో నా ప్రాణం పెట్టేవాడిని. మనసా వాచా నమ్మింది రాస్తేనే అది ప్రజల మనసులపై ప్రభావం చూపుతుంది," అని గాంధీజీ చాలా సందర్భాలలో చెప్పారు.
ఇండియన్ ఒపీనియన్ను ఆయన పదకొండు సంవత్సరాలు నడిపారు. గమ్మత్తైన శీర్షికలు పెట్టి సాధారణ ప్రజలను ఆకట్టుకొనే వారు. అలాంటి హెడ్డింగ్ లలో ఒకటి: "The white barber refused to cut my black hair."
తమకు జరుగుతున్న అన్యాయంపై చంపారన్ లోని రైతులు పంపిన ఒక సమాచారాన్ని లోతుగా అధ్యనం చేయడానికి ఆయన బీహార్ వెళ్లి ఒక అత్యద్భుతమైన పరిశోధనాత్మక యాసాన్ని రాసారు.
ఆ తర్వాత 'యంగ్ ఇండియా', 'నవ జీవన్'ల కోసం రాసారు ఆయన. 1910 నాటి 'ప్రెస్ యాక్ట్' రద్దు కోసం ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. 1932 లో సుదీర్ఘ కాలం జైలులో వుండాల్సి రావడం వల్ల ఆయన "యంగ్ ఇండియా", "నవ జీవన్" లను మూసివేసారు. 1933 నుంచి 1940 మధ్య కాలంలో "హరిజన్" (ఇంగ్లీష్), "హరిజన్ బంధు" (గుజరాతి), "హరిజన్ సేవక్" (హిందీ) పత్రికలూ ఆయనకు గొంతుకలయ్యాయి.
ఇప్పటి మన పత్రికలూ కుల సంఘాలకు వేదికలయి జర్నలిజాన్ని పరిహసిస్తున్నాయి కానీ గాంధీ గారి ప్రధాన సమరం కుల వివక్షపైననే. తర్వాతి కాలంలో పత్రికల ధోరణి ఆయన్ను కలతపరిచింది. ఢిల్లీలో జూన్ 19, 1946 న భారతీయ న్యూస్ పేపర్లపై ఆయన చేసిన వ్యాఖ్య అందుకు దర్పణం పడుతుంది.
"నన్నే గనక వైస్రాయ్ స్థానంలో నియంతగా ఒక్క రోజు నియమిస్తే, దేశంలోని అన్ని వార్త పత్రికలను మూసి పారేయిస్తాను," అని ఆయన విసుగ్గా అన్నారట.
గాంధీ గారి లాంటి సత్తె కాలపు మనుషులు నిజంగానే ఈ స్వార్థ పూరిత పత్రికలూ, చానల్స్ తో విసిగి పోతున్నారు. కాదంటారా?

Subscribe to:
Posts (Atom)