Wednesday, September 5, 2012

తప్పులో కాలేసిన 'వాషింగ్టన్ పోస్ట్'

ఎవరి గురించైనా వ్యాసం రాయాల్సి వస్తే...మనం రాసేది రాస్తూనే...ఎవరి గురించి రాస్తున్నామో వారి వివరణ తీసుకోవాలనేది జర్నలిజం లో మౌలిక సూత్రం. చివరకు ఈ బ్లాగులో పోస్టు రాస్తున్నా...ఇలా వివరణ తీసుకోవాలని నియమం పెట్టుకున్నాను నేను. అయితే...ఆ ప్రయత్నాలకు సరైన స్పందన రాకపోగా...దురహంకారులైన జర్నలిస్టుల/సంపాదకుల/ యజమానుల తలబిరుసు కారణంగా ఆ నియమానికి స్వస్తి పలికాను. నిజానికి అది మంచి జర్నలిస్టు లక్షణం కాదు. ఈ విషయంలో నేను చేసేదీ తప్పే అని నేను అపుడప్పుడూ వగస్తుంటే...అలాంటి తప్పునే ఘనత వహించిన వాషింగ్టన్ పోస్ట్ కూడా చేసింది.
మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మీద ఒక వ్యాసం ప్రచురిస్తూ....ఆయన అసమర్ధతను ఎత్తి చూపుతూ ఆయన్ను ఒక 'tragic figure' అని వర్ణించింది. 'silent' PM.....the shy, soft-spoken 79-year-old is in danger of going down in history as a failure  అని కూడా అది పేర్కొంది. deeply corrupt government, కు మన్మోహన్ నాయకత్వం వహిస్తున్నారని స్పష్టం చేస్తూ...."But the image of the scrupulously honorable, humble and intellectual technocrat has slowly given way to a completely different one: a dithering, ineffectual bureaucrat presiding over a deeply corrupt government." అని కూడా రాసింది. 
 భారత ప్రభుత్వం ఈ ధోరణిని ఖండించింది. ఇది 'ఎల్లో జర్నలిజం' అని పేర్కొంది. ఒక దేశ ప్రధానినే ఇలా అంటారా అని గర్జించింది. దాంతో...వాషింగ్టన్ పోస్ట్ సారీ చెప్పినట్లు సమాచారం. 'ఆయన వివరణ కూడా తీసుకుని వుంటే బాగుండేది. మేము రేపు ఒక ఖండన ప్రచురిస్తాం,' అని ఆ పత్రిక తెలిపినట్లు వార్తలు వచ్చాయి. 
ఎన్నో పులిజర్ అవార్డులు గెలిచిన పత్రిక ఇంత తప్పు చేయడం విస్మయం కలిగిస్తున్నది   

Tuesday, September 4, 2012

10 టీవీ, TV 99...వగైరా...వగైరా....

ఎన్నికల సీజన్ వస్తే...మన ఆంధ్రప్రదేశ్ లో మీడియాకు పండగే. తద్వారా జర్నలిస్టులకూ పండగే. చాలా చానల్స్ ఎన్నికల దాకా జర్నలిస్టులను వాడుకుని...కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జర్నలిస్టుల ఉద్యోగాలు పీకి...దిక్కున్న చోట చెప్పుకోమంటాయి. తెలుగు నేల మీద జర్నలిస్టులకు ఏ దిక్కూ లేకపోవడం యాజమాన్యాలకు ఒక గొప్ప వరం. తమిళనాడు, బెంగాల్ తరహాలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చానెల్స్ పెట్టడం ఊపందుకుంది. ఇది జర్నలిస్టులకు మంచిదే.

మంచి క్యాడర్ బేస్ ఉన్న సీ పీ ఎం  సోదరులు ప్రజల భాగస్వామ్యం తో త్వరలో ఒక చానెల్ పెట్టబోతున్నారు. దాని పేరు 10 టీవీ. ఉస్మానియా యూనివెర్సిటీ జర్నలిజం విభాగంలో బోధకుడిగా పనిచేసి...తన అద్భుతమైన విశ్లేషణలతో టీవీ వీక్షకులకు సుపరిచితుడైన డాక్టర్.నాగేశ్వర్ దీనికి చైర్మన్. ఆయన ఎం.ఎల్.సీ. గా పనిచేస్తూ ప్రజల సమస్యలను పెద్దల సభలో ఎలుగెత్తి చాటడం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన http://indiacurrentaffairs.org/ అనే వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. 

టీవీ నైన్  లో పనిచేసిన అరుణ్ సాగర్ కూడా చేరారు. కమ్యూనిజం నేపథ్యం గల పలువురు మేథావులు కూడా ఇందులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.. దీనికి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నేతలు, ముఖ్యంగా తమ్మినేని వీరభద్రం గారు, భారీ స్థాయిలో ప్రజల నుంచి "భాగస్వామ్యాన్ని" ప్రోది చేస్తున్నట్లు సమాచారం.  సీ పీ ఎం కు ఇప్పటికే 'ప్రజాశక్తి' అనే పత్రిక, దానికి నిబద్ధత గల జర్నలిస్టు యంత్రాంగం వున్నది.


సీ పీ ఎం వారే కాకుండా...ఏ రాజకీయ భావనలు కలవారైనా ఈ చానెల్ లో పెట్టుబడి పెట్టవచ్చని డా.నాగేశ్వర్ చెబుతున్నారు. ప్రజల భాగస్వామ్యంలో ఒక చానెల్ కు ఉన్న అవకాశాలను ఆయన ఒక నాలుగు నెలల కిందట నాతొ ప్రస్తావించారు. "The 4th Estate with a 6th Sense" అనే స్లోగన్ తో ఈ చానెల్ రాబోతున్నది. అందుకోసం ఉద్యోగార్ధుల కోసం ఒక ప్రకటన కూడా చేసింది గత నెలలో. ఆ చానెల్ perfect-10 పేరిట ప్రచురించిన సూత్రాలు (దాని అజెండా) ఇలా వున్నాయి.
1.  Safe guard national Integrity
2.  Work for peoples Democracy
3.  Fight Corruption
4.  Voice social Justice
5.  Invoke Secular ideology
6.  Promote Scientific outlook
7.  Protect telugu Culture
8.  Stand for Women liberation
9.  Spread Environmental, Medical and Literal awareness
10.  Struggle for Rights of all the people



 10 టీవీ సంకల్పం 
10tv emerges on the horizon as an alternative. An alternative for those who look out for serious journalism. An alternative for those who want to see the real picture, the unmasked, the original and the scene behind the scene and deed behind the words.

At a time when news channels in Andhra Pradesh became desperate and air even adult content in the race of television rating points 10tv is here to show what a news channel ought to be.
10tv rises to the occasion at a time where all other news channels are promoted with a mere intention of making profit.  

A team of progressive ideologists who care for people, who care for society, who care for democracy and social equality came together to form Sphoorthi communications and joined hands with Pragathi Broadcasting  and Abhuyadaya Broadcasting which promote 10tv.

Here all that matters is reaching out to masses with truth, voicing the peoples’ issues with commitment, focusing on the other, in fact real, side of life.
10tv aims at a clean broadcast, responsible transmission and news that matters. Here everything is TOLD BOLD!

ఇకపోతే...సీ  పీ  ఐ వారు కూడా TV 99 పేరిట ఒక చానెల్ తెబోతున్నారని, భారతీయ జనతా పార్టీ కూడా సొంత చానెల్ ఆలోచనలో ఉన్నదని  'ఈనాడు' పత్రిక నిన్న ఒక వ్యాసంలో తెలిపింది. "ఈ చానెల్ లో వెళ్దాం" అనే వ్యాసంలో....తెలుగు దేశం పార్టీ కి ఏ చానెల్ లేదని తెలిపింది!? 

Sunday, September 2, 2012

జయహో...నరేంద్రనాథ్ చౌదరి గారి దేశభక్తి-దైవభక్తి

రామోజీ రావు గారి పూర్తి ఆధీనంలో ఉన్నప్పుడు జాతక ఫలితాలు ప్రచురించడానికి కూడా 'ఈనాడు' ఆసక్తి చూపలేదు. శాస్త్రీయ దృక్కోణం తప్ప...దైవభక్తి లేని పరమ కమ్యూనిస్టు లాగా అనిపించేవారు ఆయన.ఎం.బీ.ఏ.చదువుకుని వచ్చిన ఆయన కుమారుడు కిరణ్ పగ్గాలు అందుకున్నాక...పరిస్థితి మారిపోయింది. కిరణ్ తిరుమల వేంకటేశుని భక్తుడు. ఆయన తరచూ గుండుతో కనిపించడాన్ని బట్టి తరచూ తిరుమలేశునికి నీలాలు సమర్పించుకునే అలవాటు ఉన్న వారిగా అనిపించే వారు. కిరణ్ ఎం.డీ.అయిన కొత్తల్లో...ఆ పత్రిక లో తిరుమల వార్తలు పెరిగాయన్నది ఒక పరిశీలన.
జనాల నాడి ఇట్టే పట్టేసే రామోజీ రావు గారు ఇలా జాతక ఫలితాలైనా ప్రచురించకూడదని చాదస్తంతో శాస్త్రీయ మడి కట్టుకు కూర్చుని...కృష్ణా రామా అనుకోవాల్సిన దశలో రామోజీ ఫిలిం సిటీలో కూర్చొని టీ వీ నైన్  ను ఎదుర్కోవడం ఎలా? అని జుట్టు పీక్కుంటున్న దశలో...నరేంద్ర నాథ్ చౌదరి (కింది ఫోటో) అనే రియల్టర్ దూసుకొచ్చారు....మీడియా రంగం లోకి. వచ్చీ రాగానే భక్తుల కోసం ఒక చానెల్ పెట్టారు...అదే "భక్తి  టీవీ." నారీలోక ఉద్ధరణ కోసం ఆయన 'వనిత' అనే చానెల్ ను కూడా ఆరంభించినా పెద్దగా లాభం లేకపోయింది. కాని భక్తి  అద్భుతంగా క్లిక్ అయ్యింది. నరేన్ జన్మ చరితార్థం అయ్యింది. 

రామోజీ గారికి తలలో పెద్ద మస్తిష్కం  లా పనిచేసిన వ్యక్తులను సలహాదార్లుగా పెట్టుకుని నరేంద్ర చౌదరి ఇప్పుడు మీడియా రంగంలో దూసుకుపోతున్నారు. ఆరంభంలో అంతు  చిక్కని రీతిలో టీవీ ఫైవ్ టీ  ఆర్ పీ రేటింగ్స్ లో ముందు ఉండేది. మరి ఏమయ్యిందో ఏమో కానీ..ఇప్పుడు ఎన్  టీవీ కి రేటింగ్స్ బాగా వస్తున్నాయి. దీన్ని బట్టి కేబుల్ ఆపరేటర్ల రూపంలో దేముడు నరేన్ ను కరుణించినట్లే మరి. భూములు-చానెల్స్-భక్తి -భగవత్ కటాక్షం-లాభాలు-మేళ్ళు. ఇదనుకుంటా ఫార్ములా. 

హే  భగవాన్....నేనెందుకు భక్తి  చానెల్ పెట్టలేదు? అని రామోజీ ఒక్క సారైనా బాధపడి ఉంటారని నా అంచనా. ఈ విషయంలో రామోజీ కన్నా నరేన్ జీ ఒక పది ఆకులు ఎక్కువ చదివినట్లే. భక్తి  టీవీ ఆదాయం అన్ని చానెల్స్ కన్నా మిన్నగా వున్నదని అక్కడి అంతర్గత సోర్సులు ఇచ్చిన సమాచారం. ఇప్పుడా చానెల్ ఆ గ్రూప్ నకు చెందిన ఇతర చానెల్స్ ను పోషించే పరిస్థితి కి వచ్చినట్లు చెబుతున్నారు. గరికపాటి నరసింహా రావు గారి వంటి వారి అద్భుత ప్రవచనాలు, కావ్య విశ్లేషణలతో ఈ చానెల్ జనరంజకంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి చానెల్ తో పోటీ పడి...ఒకొక్క సారి అంతకన్నా మెరుగైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది భక్తి  చానెల్.

నా వరకు నేనైతే...నాసిరకం వార్తా కథనాలు చూడలేక కాలక్షేపానికి అటు టీ  టీ డీ వారి ఎస్.వీ.బీ.ఛానలో, భక్తి   ఛానలో చూస్తూ గడుపుతున్నాను. అది నా తల్లి దండ్రులకు కూడా ఎంతో  సంతోషం కలిగించే పని. ఎందుకంటె...ఆ చానల్సే వారూ ఆస్వాదిస్తారు. తెలుగు నేల  మీద పుట్టిన ప్రతి ఒక్కరూ....రోజుకు ఒక గంట పాటైనా ఈ రెండు చానెల్స్ చూడాలని నేను సిఫార్సు చేస్తాను. 

జీవిత పరమార్థాలను, ఆంధ్ర  సాహితీ మాధుర్యాన్ని తెలిపే ఎన్నో కార్యక్రమాలు వీటిలో వస్తున్నాయి. చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగాలు వింటే మనసు తేలిక పడుతుంది. అటు గరికపాటి, ఇటు చాగంటి వార్లు సరస్వతీ పుత్రులు. ఆ ధారణా శక్తి, భక్తి  భావావేశం, భాషా చతురత, ఆంధ్ర సంస్కృతి పట్ల వారి అనురక్తి అనుపమానమైనవి. భక్తి  చానెల్ విజయం ఇచ్చిన కిక్కుతో ఆ మధ్యన నరేన్ చౌదరి గారు సాధు  సమ్మేళనం కూడా ఏర్పాటు చేసారు. ఇతర మతాలను కించ పరచకుండా...అన్ని మతాలనూ గౌరవిస్తూ...హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం...కులం మతం జన జీవితాలను శాసిస్తున్న ఈ లోకంలో అన్ని ప్రసార మాధ్యమాలు చేయాల్సిన పని. అదొక సత్కార్యం, తక్షణావసరం. కసి, కార్పణ్యం, చులకన భావం, ఈర్ష్య వంటి చెత్తను వదిలి మతాల మధ్య సయోధ్య సాధించడం అందరం చేయాల్సిన పని. 

అటు దైవ సేవలో తరిస్తున్న నరేన్ గారు ఇప్పుడు దేశభక్తి మీద పడ్డారు. అది కూడా శుభపరిణామమని అనుకోవడంలో తప్పులేదు.  జాతీయ గీతం పాడాలహో....అని ఊరూ వాడా ప్రచారం చేసే పనిలో పడ్డారు ఆయన. ఇది కచ్చితంగా...మా చావు తెలివితేటల రాజశేఖర్ ప్లాన్ అని నా గట్టి నమ్మకం. అన్నీ అబద్ధాలే చెబుతారు...జర్నలిజాన్ని బ్రష్టు  పట్టిస్తున్నారు...అన్న అపవాదులు ఎదుర్కుంటున్న వారంతా భక్తి  ప్రభావంతో మంచి మనుషులుగా (జర్నలిస్టులుగా) మారితే యెంత బాగుండు! Oh God, please bless them and bless their families.       

అంతా బాగానే ఉంది గానీ.... నరేన్ గారి దేశభక్తి రిపోర్టర్ల చావుకు వచ్చిందట. అయ్యా...ఈ దేశభక్తి ప్రచారం కోసం మీరు నిర్వహించే కార్యక్రమాల ఆర్ధిక భారాన్ని మీరు మీ రిపోర్టర్ల నెత్తిన పెడుతున్నట్లు  నాకు వచ్చిన సమాచారం. ఇలాంటి పాపపు పనులు మాని....చక్కగా భగవత్ సేవలో, దేశం సేవలో మీరు తరించి చరితార్ధులు కండి. పుణ్యాన్ని మూట కట్టుకోండి. దేవుడి దీవెనలతో ఒక పార్లమెంటు సీటు పొందండి, తప్పేమీ లేదు. విజయోస్తు.         

Friday, August 31, 2012

జీ-24 గంటలు పై బిజినెస్ స్టాండర్డ్ కథనం

జీ-24 గంటలు ను మూసేయటం దాదాపు ఖాయమన్నట్లు సూచించే వార్తను బిజినెస్ స్టాండర్డ్  పత్రిక ప్రచురించింది. సెప్టెంబర్ 20 వ తేదీ రాత్రితో దాని ప్రసారాలు ముగుస్తునట్లు అధికారికంగా పేర్కొంది.
చానెల్ హెడ్ గా ఉన్న  శైలేష్ రెడ్డి (ఫోటో) ఆ చానెల్ ను కొనడమో, భాగస్వాములను వెతకడమో  చేస్తారన్న నమ్మకం ఇంకా తమకు ఉందని అక్కడి ఉద్యోగులు ఒక మూడు రోజుల కిందట నాతో  అన్నారు.   


కుప్పలు తెప్పలుగా వచ్చిన /వస్తున్న తెలుగు చానెళ్ల  ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ వార్త బాగా ఉపకరిస్తుంది. ఈ వ్యాసంలో హెచ్.ఎం. టీవీ చీఫ్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి వ్యాఖ్యను ఇచ్చారు. ఆ కథనం మీ కోసం.
Zee group to shut Telugu news channel
B Dasarath Reddy / Chennai/ Hyderabad Aug 29, 2012, 00:30 IST
Zee News Limited-owned Telugu news channel, Zee 24 Gantalu, has become the first casualty of the overcrowded regional news channel space in Andhra Pradesh. The 24/7 news channel from next month will cease to exist. It was launched just three years ago in the early 2009.
The company’s joint venture entity, Media Pro Enterprize Private Limited, which owns the satellite rights of the channel, on Tuesday issued a public notice stating it would not telecast from the midnight of September 20. The company, however, did not give any reason behind its decision.

Sources said financial losses, coupled with bleak prospects, had made it an unviable proposition. Ranked sixth in viewership among the 15 satellite news channels currently on air, Zee 24 Gantalu was making just about Rs 5 crore in revenues as against an expenditure of Rs 18 crore a year, according to sources in the company.
The closure would affect about 180 journalist and non-journalist staff .
However, the entertainment sibling of the news channel, Zee Telugu, run by Zee Entertainment Limited, continues to make profits.
“It is not possible to sustain the loss-making channel with the profits earned by the entertainment channel as they belong to two separate entities,” the sources pointed out. This clear demarcation has something to do with the division of businesses among the promoter family, they said.
The Zee media house had entered the south Indian market with 'alpha Telugu', an entertainment-cum-news channel, in 2004 and rebranded it as Zee Telugu the following year. After attaining financial break-even in 2007, the company had planned an exclusive news channel and launched the same during the election time in 2009.
The Zee management’s decision comes at a time when the local players have been undercutting each other to grab the limited revenue pie. The adspend too is shrinking partly due to dwindling viewership across the news channels, according to people in the media.
“A tariff of Rs 1,000 to Rs 1,200 per 10 seconds is required for the news channel like ours to achieve the break-even. As the top Telugu news channels themselves are settling for these rates others have to offer steep discounts to attract revenues,” a senior official of the company said on condition of anonymity. Many Telugu news channels were offering a 10-second slot for as little as Rs 400-500, sources said.
About 65 per cent of the current ad spend of Rs 800-850 crore, which forms the revenue base for the state's electronic media, goes to the Telugu entertainment channels while the remaining is enjoyed by the top 2-3 news channels only, according to KRP Reddy, a media marketing veteran and director - marketing of Sakshi media group. “On average, a news channel needs to generate Rs 20-23 crore revenues to achieve break-even. They are in a comfortable zone if their revenues are at the Rs 25-30 crore level,” he said.
According to industry estimates, the top Telugu news channel, TV9, alone garners almost 50 per cent of the ad spend followed by Gemini TV of Sun Network with 22-25 per cent share, leaving a very small portion for the other 10-odd ones.
Besides, the viewership has come down by almost half compared with last year as people now prefer entertainment channels, according to them.
News channels are doing well in major cities and towns but in small towns and rural areas they have to face intense competition from entertainment channels because of the political alienation set in among the people, according to Reddy.
Most Telugu news channels are now operating without any meaningful returns while some are finding it tough to pay even salaries to the staff.
“It is difficult to survive because there is a mismatch between the expenditure and revenues. In spite of the current difficulties, many continue to operate only in the hope of better prospects. In the end, you need a lot of determination to stay the course and serve people through a news channel,” said K Ramachandra Murthy, chief editor of HMTV, a Telugu television news channel, and Hans India English daily.
Courtesy: Business Standard

Thursday, August 30, 2012

"రమ్మనే" బాసుల తిక్క కుదరడానికి 18 చిట్కాలు

అబ్రకదబ్ర అభిప్రాయాలు, సూచనలు

సాధారణంగా....మీడియా లో జరిగే పరిణామాలు తెలుసుకోవడానికి నేను సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడతాను. ఇలాంటి సంభాషణలలోమూడు ముఖ్య విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి) అహంకారంతో ఉండే బాసుల వికృత ప్రవర్తన. రెండు) మీడియాలో అక్రమ సంబంధాలు. మూడు) అమ్మాయిలను బాసులు ట్రాప్ చేయడం. 

నిజానికి ఇవి...అనాది నుంచీ ఉన్న వ్యవహారాలే. అయితే...మూడోది మాత్రం  వివిధ కారణాల వల్ల ఈ మధ్యకాలంలో శృతి మించి పోయింది. ఏదో విద్యుత్ శాఖలోనో, పరిశ్రమల శాఖ లోనో, లేదా అలాంటి వృత్తులలోనో  ఈ పరిస్థితులు ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు. మీడియా విషయానికి వచ్చే సరికి...శర్మ లాంటి అమానుష బాసుల బీభత్సకాండ చాలా జీవితాలను నాశనం చేసేది అయినా దాన్ని మాటి మాటికీ మాట్లాడుకోలేము. బాధితులే తిరగబడి తోలు తీస్తారు. రెండు, మూడు పాయింట్ల తోనే పెద్ద సమస్య.

సినిమా ఫీల్డు లో మాదిరిగా...ఒక క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, యజమాని లేదా బాసు ఇచ్చే అవకాశాల మీద ఆధారపడి కెరీర్ ఉండే వృత్తి కావడం వల్ల జర్నలిజంలో తిమ్మిరి బాసుల ఆటలు సాగుతున్నాయి. కెరీర్ పిచ్చిలో పడి ఇలాంటి వెధవలను బుట్టలో వేసుకుని పబ్బం గడుపుకునే గడుసు అమ్మాయిలూ (చాలా తక్కువ సంఖ్యలో) ఈ ఫెల్డులో ఉన్నారనేది కాదనలేని వాస్తవం. 
ఒక చోట పనిచేసే వారిలో... ఓటు హక్కు వచ్చిన ఆడా మగా మనుషులు ఒక అంగీకారానికి వచ్చి శారీరక సంబంధాలు కొనసాగిస్తే నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంట్లో భార్యనో, భర్తనో పెట్టుకుని వర్కు ప్లేసులలో ఇలాంటి పిచ్చి పని చేయడం వారి సంస్కారానికి సంబంధించిన అంశం. కానీ జర్నలిజం వృత్తిలో వున్నవారు ఆ లాంటి పని చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే. దానికి కారణం లేకపోలేదు.

పొద్దున్న నిద్ర లేచిన దగ్గరి నుంచి జనానికి సుద్దులు చెప్పే జర్నలిస్టులు నిజ జీవితంలో కూడా స్వచ్ఛత పాటించకపోతే సత్యం పలచనైపోతుంది. అంతకన్నా ముఖ్యంగా...అక్రమ సంబంధాలు సక్రమమే అని భావిస్తే...జర్నలిస్టులు ఆడ వారిని చూసే ధోరణిలో మార్పు వస్తుంది. ఒక ఈవ్ టీజింగ్ కేసునో, రేప్ కేసునొ, వ్యభిచార వృత్తికి సంబంధించిన కేసునో డీల్ చేస్తున్నప్పుడు....పెద్ద సీరియస్ గా ఇలాంటి జర్నలిస్టు పరిగణించలేకపోవచ్చు. అది చాలా మందికి నష్టం కలిగిస్తుంది. సంఘం, కట్టుబాటు, సంస్కారం వంటి అంశాలను గాలికి వదిలేస్తే...వృత్తి నిబద్ధత దెబ్బ తినే అవకాశం ఉంది. నమ్మకం మీద ఆధారపడి నడుస్తున్న ప్రపంచంలో వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య ఈ నమ్మకం దెబ్బతినే ఏ పనినీ జర్నలిస్టు చేయకూడదు, అలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. అందుకే...Journalism is a sacred mission అంటారు. 

ఏంటీ చాదస్తం....జర్నలిస్టులు మనుషులు కాదా...వారు ఉప్పు, కారం, పచ్చి పులుసు సేవించరా ..కాబట్టి ఇతర కామాంధుల్లాగా  వర్కు ప్లేసులలో అమ్మాయిలను ఆకర్షించే పనిచేయడం, అధికారాన్ని అడ్డంపెట్టుకొని పడక గదికి రమ్మని బలవంతం చేయడం, ఎలాగోలా బోల్తాకొట్టించి సెక్సు సుఖం పొందడం తప్పేలా అవుతుందన్న ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదు. ఇతర వృత్తుల వారికన్నా భిన్నంగా...ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ని పనిచేసే మహనీయులు అని భావించబట్టే ప్రభుత్వం బస్సు, రైలు పాసులు, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నది మన జర్నలిస్టులకు. సరే...ఇదొక పెద్ద డిబేటు. అందులో అందరి వాదనా కరక్టే అనిపిస్తుంది. సెక్స్ కోసం బలవంతం చేసే బాసుల తిక్క కుదర్చడానికి నాకు తోచిన సలహాలు. ఇలాంటి వారిని పద సౌ లభ్యం కోసం "క.కు." ....అంటే ....కక్కుర్తి కుక్కలు అని సంబోధిస్తాను. 

1) క.కు.ల చరిత్ర ముందుగానే తెలుస్తుంది కాబట్టి వారితో ఆరంభం నుంచీ జాగ్రత్తగా ఉండాలి. వృత్తికి సంబంధించిన అంశాలు 'టూ ది పాయింట్' మాట్లాడడం ఉత్తమం.

2) క.కు.లతో ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. అతిగా మాట్లాడడం, అతి చొరవ తీసుకోవడం, ద్వందార్ధాలు వచ్చే మాటలు దొర్లకుండా చూడాలి. 

3) క.కు.చేసే మొదటి పని మిమ్మల్ని పొగడడం. డ్రస్సు గురించో, బ్యాగు గురించో పొగిడితే...పొంగి పోకూడదు. అదో ప్రాముఖ్యమైన పొగడ్త కానట్టు ఉండాలి. మీ ప్రమేయం లేకుండా క.కు.ముందుకు పోలేడు.

4) సాధ్యమైనంత వరకు ఏకాంత సంభాషణను నివారించాలి. వాడి గదిలోకి వెళ్ళేప్పుడు నమ్మదగ్గ కలీగ్ ను మీతో పాటు తీసుకు పోవడం మంచిది.  

5) క.కు.లు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. కాబట్టి, మన వ్యక్తి గత విషయాలు అన్నీ...వారికి విడమరిచి చెప్పడం శ్రేయస్కరం కాదు. వాటిని అడ్డం పెట్టుకుని క.కు.లు మిమ్మల్నిట్రాప్ చేసే అవకాశం ఉంది.

6) మరీ ఇబ్బంది ఎందుకు అనుకుంటే...మీ భర్త పిల్ల గురించి, వాడి భార్య పిల్లల గురించి యోగ క్షేమాల గురించి అడగడం తప్పేమీ కాదట. దీని ఉద్దేశం...మీరు సంసార పక్షమని తెలియజేయడం. 

7) పోలీసు శాఖలో వున్న మీ బంధువుల గురించి, మహిళా సంఘాల నేతలతో మీకున్న ఫ్రెండ్ షిప్ గురించి అపుడప్పుడూ క.కు.లతో మాట్లాడాలి.

8) కాలేజిలో మీతో పిచ్చి వేషాలు వేయబోయిన జులాయిని చెప్పుతో కొట్టిన సందర్భాలు ఉంటే (లేకపోయినా పర్వాలేదు) ఆ సమాచారాన్ని వాడికి సందర్భానుసారం, సూచన ప్రాయంగా చెప్పడం తప్పు కాదు. 
 
9) క.కు.తో రహస్యం మెయింటైన్ చేయాలని చూడకండి. వాడితో సంభాషణను భర్త లేదా నమ్మదగ్గ కలీగ్ లేదా ఫ్రెండ్స్ తో పంచుకోండి. క.కు.ఫోన్ రాగానే...చటక్కున ఇంట్లో నుంచి బైటికి వెళ్లి మాట్లాడడం ఏ మాత్రం మంచిది కాదు.
 
10) ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ టెక్స్ట్ మేస్సేజులు, మెయిల్స్ ఇవ్వకండి. వాడు పంపుతున్నా...వృత్తికి మాత్రం పరిమితంకండి. ఫోన్లు, మెసేజులు వాడికి ప్రధాన మార్గాలని గుర్తించండి. 

11 పరిస్థితి విషమిస్తుంటే...కొన్ని ఆధారాలు సేకరించి పెట్టుకోవడం మంచిది. ఫోన్ సంభాషణ రికార్డు చేయడం. స్టింగ్ ఆపరేషన్ చేయడం తప్పు కాదు గానీ...ఈ పని గుట్టు చప్పుడు కాకుండా చేయండి. 

12)  క.కు.లపై కేసు పెట్టడానికి జంక వద్దు. ఆ పని చేయకపోతే జర్నలిస్టుగా మీరు పనికి రానట్టు లెక్క. మీకు కొన్ని హక్కులు ఉన్నాయని మరిచి పోవద్దు.

13) వర్కు ప్లేసులలో స్త్రీ ల రక్షణకు సబంధించి సుప్రీం కోర్టు మార్గ దర్శక సూత్రాలు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా చదివి ఒక కాపీ దగ్గర పెట్టుకోండి.

14)  అవకాశాలకు కొదవ లేని విధంగా ప్రతిభను పెంచుకోండి. వున్న ఉద్యోగంతో, క.కు.లతో రాజీ పడడం కన్నా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం ఉత్తమం. సాధారణంగా క.కు.లు పెద్దగా చదువుకున్న వారి వుండరు. వారికన్నా మీకు భాషా ప్రావీణ్యం, విద్యార్హతలు ఉన్నాయంటే...వారు సాధారణంగా మీ జోలికి రారు. 

15) మహిళా సంఘాల నేతల ఫోన్ నంబర్లు దగ్గర పెట్టుకోండి. ఈ నాయకురాళ్ళు మీ మీడియా యజమానులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, జాగ్రత్త. 

16) జర్నలిస్టు సంఘాల నేతలు చాలా వరకు పరమ బేవార్సు నాయాళ్ళు అనే పేరుంది. వారిని నమ్ముకోవడం శుద్ధ దండగ.  
 17) జీవితంలో ఒక్క సరైనా ఒక్క క.కు.కైనా చెప్పుతో బుద్ధి చెప్పండి. వాడి పరువు పంచనామా అయ్యేట్లు చూడండి. దాన్ని గర్వంగా మీ భావి తరాలు చెప్పుకునేలా, ఆ చర్య వారికి ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. 

18) మీకు ఇబ్బందులు ఉంటే...ఈ బ్లాగుకు ఒక మెయిల్ (srsethicalmedia@gmail.com) రాయండి.  ఇంతవరకూ మాకు వచ్చిన ఫిర్యాదులను మాకే పరిమితం చేసాం, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సాధ్యమైనంత వరకూ మీకు సహాయం చేస్తాం.

Wednesday, August 29, 2012

ఘన "గా.న." గారికి ఒక విన్నపం....(withdrawn)


My beloved readers,
మీకొక మనవి. 

గా.న. గారికి లేఖ పేరిట నేను ప్రచురించిన పోస్టును ఈ రోజు తీసేస్తున్నాను. దీనికి కారణం నాకు వచ్చిన ఒక రెండు మెయిల్స్. అందులో ఒకటి ఆ సీనియర్ జర్నలిస్టు కూతురు నాకు ఆవేదనతో రాసారు. పోస్టులో రాసిన అంశాలతో నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నప్పటికీ...ఆమె రాసిన మెయిల్ చదివాక...ఒక ఆడ కూతురు ఆవేదనకు విలువ ఇవ్వడంలో తప్పు లేదని అనిపించింది.    

గా.న.గారి సన్నిహితుడు ఒకరు కూడా అంతకు ముందు నాకు ఒక సుదీర్ఘ లేఖ రాసారు. అది చాలా అద్భుతంగా ఉంది. మితిమీరిన మద్యపానం, అసహనం, దూకుడుతనం వంటి వాటి వల్ల ఈ పెద్ద మనిషి కెరీర్ లో ఎలా ఇబ్బంది పడిందీ ఆయన రాస్తూ...పోస్టు తొలగించి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్నట్లు సూచించారు. 

"Please consider my humble request to remove the post. If it proves to be a mis-understanding, then we might not be able to correct the public image damage that happens to him with this post.
You can post it again when you have the proof that clearly indicates the wrong intentions" అని ఆయన ముగింపు పేరాలో పేర్కొన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఇంతలో వారి డాటర్ మెయిల్ వచ్చింది. 

"He has always served selfless to any organization that he has worked for. He has always safe guarded his
lady subordinated be that in print or TV media.," అని రాస్తూ..."We are
all ready to come face to face and meet with all those people who have
complained to you (I wonder if they had guts to publish it in front of
world, then why couldn’t they build their guts and raise their voice
against him in the office.) and let’s sort this out.." అని పేర్కొన్నారు. 

వీరిద్దరూ రాసిన లేఖలు చదివితే...'అయ్యో పాపం...ఆయన కొద్ది కాలం లోనే అపఖ్యాతి ఎందుకు మూట కట్టుకున్నారు?' అని అనిపించింది. 

ఈ లోపు...ఆయనతో చాలా ఏళ్ళు పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్టు నాకు ఫోన్ చేసారు. ఈ పోస్టు మీద వచ్చిన కామెంట్ల మీద స్పందించారు. ఆయనో అద్భుతమైన జర్నలిస్టు అన్న కామెంట్ తో విభేదిస్తూ...అర గంట పాటు నాతొ  మాట్లాడారు. ఆయన గురించి చాలా నెగిటివ్ విషయాలు చెప్పారు. ఆ సమాచారం కూడా ప్రచురిస్తే...మరొక మాంచి పోస్టు అవుతుంది. 

గా.న.గారి కూతురు కాక మరొక వ్యక్తికి నేను రాసిన సమాధానంతో దీన్ని ముగిస్తాను. 

dear friend,
Thanks for your detailed mail, a well-written one. 
After talking to some people, I've posted it. I know pretty well that the so called 'victims' would exaggerate things to damage the reputation of people in the authority. That is why, I didn't go overboard while writing the post. Though I collected lots of information about him, I didn't use it. 
After reading your letter, I sincerely considered your views and thought of removing the post as suggested by you. But, dear friend, people may think that I've succumbed to threat or intimidation. That too, my sources also may misunderstand me. Sorry for this. 
Let me assure you that I'll withdraw a story to-be published on the same guy with some proofs. I am not here to malign the reputation of good people. 
Keep on writing.
Your letter is really nice. If you don't mind, we'll meet up one day.
Thanks and regards
Ramu

Monday, August 27, 2012

అమ్మకానికి....జీ-24 గంటలు?


కొద్దో గొప్పో ప్రొఫెషనల్స్ పనిచేస్తున్న ఛానల్స్ లో  జీ-24 గంటలు ఒకటి. వార్తలను కొత్త కోణంలో చూపించాలన్న తపన ఉండీ నిజం నిప్పు లాంటిదని నమ్ముతున్నట్లు కనిపించే సంపాదక సిబ్బంది అందులో ఉన్నారు. వీరు చాకుల్లాంటి జర్నలిస్టులని  నేను నమ్మే మంచి మిత్రులు అక్కడ పనిచేస్తున్నారు. 

సీనియర్ జర్నలిస్టు లేష్ రెడ్డి రెక్కల కింద ఇన్నాళ్ళూ ఇబ్బంది లేకుండా ఉన్న అక్కడి జర్నలిస్టులు, టెక్నీషియన్లలో ఉద్యోగ అభద్రత పట్టుకున్నది. నెలకు కోటి రూపాయలకు పైగా నష్టాలలో వున్నట్లు చెబుతున్న ఈ చానెల్ ను జీ న్యూస్ యాజమాన్యం అమ్మకానికి పెట్టి చర్చలు జరుపుతున్నది. బేరం కుదరక పోతే...ఒకటి రెండు నెలల తర్వాత భారాన్ని భరించే పరిస్థితిలో యాజమాన్యం లేదని జీ న్యూస్ సీ ఈ ఓ బరున్ దాస్ స్పష్టం చేసినట్లు సమాచారం. 
గత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ముందుగా శైలేష్ బృందంతో, తర్వాత ఉద్యోగులతో మాట్లాడి ఈ కఠినమైన కబురును అందించినట్లు తెలిసింది. 

చానెల్ హెడ్ గా ఉన్న శైలేష్ ఒకరిద్దరు ఇన్వెస్టర్ల తో కలిసి చానెల్ ను కొంటారన్న ప్రచారం ఒక రెండు నెలల కిందట జరిగింది. తర్వాత రాంకీ సంస్థ జీ న్యూస్ తో దాదాపు ఒప్పందం ఖరారు చేసినట్లు కూడా అన్నారు. ఇంతలో బరున్ దాస్ చావు కబురు చల్లగా చెప్పడం వింతగా అనిపించింది. జీ తెలుగు చానెల్ లాభాల బాటలో వుండగా దాని కవల  లాంటి  జీ 24 గంటలు చానెల్ ను మూసేస్తున్నట్లు మాట్లాడడం కూడా బాగోలేదు. 

జీ ఆల్ఫా పేరిట జీ గ్రూప్  తెలుగు చానెల్ ను ఏర్పాటు చేసింది...దాదాపు తొమ్మిదేళ్ళ కిందట.  జీ ఆల్ఫా ను జీ తెలుగు గా మార్చారు. అందులో కొన్ని న్యూస్ బులెటిన్లు ఉండేవి. ఆ తర్వాత జీ 24 గంటలు ఏర్పడింది. 
ఎవరైనా...మంచి పెట్టుబడిదారుడు  ఈ చానెల్ ను కొనాలని...అక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఈ బ్లాగ్ మనస్పూర్తిగా కోరుకుంటున్నది. 

"ఒకటి రెండు నెలల్లో మూసేస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ఆఫీసులో అనిశ్చితి వాతావరణం ఉన్నది. ఇన్ని చానెల్స్ వున్నా ఎవరూ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పైగా మా పరిస్థితి చూసి తక్కువ జీతాలు ఇస్తామని అంటున్నారు. ఎవరైనా చానెల్ ను కొనకపోతే...పరిస్థితి కష్టమే," అని ఒక ఉద్యోగి చెప్పినప్పుడు నాకు బాధేసింది. We believe that Sailesh can do something to tide over the situation.