చేగు"వేరా"కు కోపం వచ్చింది. అందుకే పందితో మొదలు పెట్టారు...ఈ రోజు మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో. చివరకు "ప్రజలే తేల్చుకోవాలి' అని ఆయన దీన్ని ముగించారు. మీరంతా "ఆంధ్రజ్యోతి" తెప్పించుకుంటారో లేదో అన్న అనుమానంతో మీ కోసం దీన్ని ఇక్కడ ఇస్తున్నా...వేరా సౌజన్యంతో. దీని మీద నా విశ్లేషణ నేను ఇస్తాను. దీనికి ఫర్ గా గానీ అగెనెస్ట్ గా గానీ మీరు రాస్తే నేను ప్రచురిస్తాను. మన "చే" వాదన మీకు నచ్చితే నాకు రాయండి. "ఛీ ఛీ" అనిపించినా రాయండి. ఇది చూడగానే..."ఛీ..ఛీ..థూ...థూ...తూడ్త్" అని నాకు ఎందుకు అనిపించిందో పాయింట్ల వారీగా త్వరలో నేను రాస్తాను. పిచ్చివాడి చేయిలో రాయి, కోతికి కొబ్బరికాయ..ఎంత ప్రమాదమో చూద్దాం. ఈ లోపు మీ అభిప్రాయం రాయండి..మీ..రాము
------------------------------------------------------------------------
శీర్షిక: పిశాచగణం పిచ్చి వీరంగం
- వి. రాధాకృష్ణ
------------------------------------------------------------------------
శీర్షిక: పిశాచగణం పిచ్చి వీరంగం
- వి. రాధాకృష్ణ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 : పందికేం తెలుసు పన్నీరు వాసన! జర్నలిజం గురించి, దాని విలువల గురించి రాష్ట్రంలో ఇప్పుడు పిశాచగణాలు గావుకేకలు పెడుతున్నాయి. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసి, ఆ ధన మదంతో అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీద పడ్డ జగన్ పార్టీకి చెందిన రాంబాబు అండ్ కో... నా మీద, ఏబీఎన్ చానెల్పైనా వేసిన, వేస్తున్న రంకెలపై స్పందించవలసిన అవసరం లేదు. అయితే, సభ్య సమాజం తలదించుకునే రీతిలో రాంబాబు అండ్ కో చేసిన కొన్ని ఆరోపణలపై వారి కోసం కాకపోయినా ప్రజల కోసం స్పందించాల్సి వస్తున్నది.
రాంబాబు రాసలీలలపై ఏబీఎన్‌లో ప్రసారమైన కథనాన్ని ఎవరు రూపొందించినా, దాన్ని ప్రసారం చేసినందుకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఆ కథనంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పవలసింది పోయి, తాను బురదలో పొర్లుతూ, నన్ను అందులోకి లాగడానికి రాంబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నది. నాపై వ్యక్తిగతంగా ఈ పిశాచగణం చేసిన వ్యాఖ్యలను ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి వారికి వత్తాసు పలుకుతున్న రోత పత్రిక, రోత చానెల్ కూడా సిద్ధపడలేదంటే... ఆ నోటి నీచత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాంబాబు అండ్ కో ఈ దిగజారుడు ఆరోపణలు చేశారని తెలుసుకోలేనంత అమాయకుడిని కాను. ఇలాంటి కారుకూతలు, నా మనోస్థైర్యాన్ని ఇసుమంతైనా సడలించలేవని వారు తెలుసుకోవాలి. రాసలీలల కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత, రాంబాబు మద్దతుదారులమని చెప్పుకొన్న వారు నాకు ఫోన్ చేసి దూషించడమే కాకుండా, చంపుతామని కూడా బెదిరించారు.
'వేమూరి రాధాకృష్ణకు ఏదైనా జరిగితే మా బాధ్యత లేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ కూడా విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ముందు ముందు భౌతిక దాడులకు కూడా తాము సిద్ధమని, ఫ్యాక్షన్ నీడలో ఎదిగిన తమ నైజాన్ని చాటుకున్నారు. అయితే, నీతి బాహ్యమైన ఈ ముఠా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది! నేను దాడులకు భయపడను. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ తమ దమ్మున్న పంథా నుంచి వెనుదిరిగే ప్రసక్తేలేదు. ఏనాడైతే ఆంధ్రజ్యోతి బాధ్యతలు చేపట్టానో, ఆనాడే అన్నింటికీ సిద్ధపడ్డాను. ఇలాంటి చిల్లర మనుషుల బెదిరింపులకు బెదిరిపోయేంత బలహీనుడిని కాను.
వాస్తవానికి అంబటి అండ్ కో ఆరోపణలపై స్పందించకూడదనే అనుకున్నాం. అయితే, 'మేం ఏం చేశామని అంబటి మమ్మల్ని బజారులోకి లాగాడు?' అని మా సంస్థల్లో పని చేస్తున్న మహిళా సిబ్బంది ఆవేదనతో అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. రాంబాబు అండ్ కో నీచ ఆరోపణలు ముందు ముందు ఇతర చానళ్లు, పత్రికలకూ విస్తరించవచ్చు. ఇవాళ మా సిబ్బంది అడిగిన ప్రశ్నే రేపు ఇతర చానెళ్లు, ఇతర పత్రికల సిబ్బంది కూడా తమ యాజమాన్యాలను అడగొచ్చు. అప్పుడు వారు మాత్రం ఏం సమాధానం చెబుతారు? ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సాగిస్తున్న అక్షర సమరంలో సిబ్బంది సమిధలు కాకూడదన్నదే నా పాలసీ.
ఒక నీచ సంప్రదాయానికి తెర తీసిన రాంబాబు అండ్ కో ఒక్క విషయం మర్చిపోయారు. వారి నాయకుడు జగన్ కూడా ఒక పత్రిక, ఒక చానెల్ నడుపుతున్నారు. భవిష్యత్తులో ఆయనపై ప్రత్యర్థులు ఇలాంటి కువిమర్శలు చేయరన్న గ్యారంటీ ఏముంది? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని ఎవరైనా అంటే అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ నేనో విషయం స్పష్టం చేయదలచుకున్నాను. మీకు నాపై కక్ష ఉంటే మీ శక్తిమేరకు ఆరోపణలు చేయండి.
ఇంకా కోపం తగ్గకపోతే, నన్ను భౌతికంగా దెబ్బతీయడానికైనా ప్రయత్నించండి. అంతేకానీ, పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిలను మీ రొచ్చులోకి లాగకండి. నన్ను మానసికంగా, శారీరకంగా దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. కనీస విలువలకైనా కట్టుబడి ఉండకుండా... మా పార్టీ తీరే ఇంత! మా పార్టీలో ఉండేవాళ్లంతా ఇలాగే ఉంటారు, ఉండాలి అని జగన్‌గానీ, ఆ పార్టీకి చెందిన మహిళా నేతలుగానీ భావిస్తే వారి ఇష్టం! అచ్చోసిన ఆంబోతులతో కూడిన జగన్ పార్టీ నైజం గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరడం మినహా, ఇలాంటి సందర్భంలో చేయగలిగిందేమీ లేదు.
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో... నీతి, నిజాయితీలతో మెలగడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో మనోనిబ్బరం కావాలి. అది నాకు పుష్కలంగా ఉంది. ఉన్నది పోతుందన్న భయం కానీ, లేనిది కావాలన్న పేరాశ కానీ నాకు లేవు. అందుకే ఇలా ఉండగలుగుతున్నాను. ఉంటాను కూడా. అయితే, కనీస విలువలు లేనివాళ్లు రాజకీయ నాయకులుగా చలామణి కావడమే అన్నింటికంటే విషాదం. ఈ విషాదాన్ని మౌనంగా భరిస్తారా? లేక, ప్రతిఘటించి తరిమి కొడతారా? అన్నది ప్రజలే తేల్చుకోవాలి.

17 comments:
RK had not replied to many allegations against him on blackmail and extortion.Unless he comes out with white paper on the allegations no one believes him and his stand.It is true that office sexual activities are routine in our society and the journalists are no exception as the stories on TV channels staff and CEO and others reveal.The journalista are real mafia gang led by RK and others.No one has got god opinion on RK thar'swhy he had to explain the recent events as a defence.
JP.
There was a story of a girl being beaten mercilessly by her parents for wearing a shirt and jean pant in Karimnagar dist today in the channels.The behaviour of TV reporters is horrible and highly. objectionable.As the injuries of the girl are being sutured by the hospital staff the reporters arranged mikes infront of the girl's head to talk to media.Is it the time for the media to get information from the girl?Can't they wait till the suturing of injuries was finished?Why this uncivilised behaviour by the media?
JP.
Sir, waiting for your review on this
వేమూరి రాధాకృష్ణకి ఏదైనా జరిగితే మా బాధ్యత లేదు అని జగన్ పార్టీ నాయకులు అనడం నేనూ టీవీలో చూశాను. ఇది రాధాకృష్ణ చేతికి ఒక రాయిని ఇచ్చినట్లే. ఏదేమైనా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు బండ గొంతులు ఒక దానితో ఒకటి తలపడుతున్నాయి. ఎవరయినా సాహసం చేసి ఇద్దరినీ ఒక చోట చేర్చి చర్చ పెట్టగలిగితే అబ్బో!
andhra jyoti patrika memu vepinchukonanduku nenu santhoshapaduthunnanu.
రెండు విడిచేసిన రకాలే
ఇంతకంటే గొప్పమాటలేమొస్తాయి . కాకుంటే విడిచేసింది వీధికి పెద్ద అన్న సామెతలాగా .ఇద్దరూ రాజకీయాల్లొ,పత్రికల్లో ఉండటం వలన ఈచెత్తంతా మనం కూడా చదువవలసి వస్తుంది
Ramu garu, Please come out soon with a regular column on the dark lives of the journalists who are posing as so called intellectuals in the society enjoying good company with politicians,officials etc as if hey are extra constitutional authorities.These journalists never care any one as their heads are filled idiotic egoism.Ofcourse there are many sincere dedicated and humanitarian journalists.But who cares them?They are living in poverty struggling to meet both the ends.
JP.
nice post
డబ్బులున్నాయి కదా అని వ్యాపారులంతా మీడియా లోకి వచ్చేస్తే జరిగే అనర్ధాల్ని మనం చూస్తున్నాం. మీడియా నైతికత గురుంచి చరిత్ర పాఠాల్లో చదువుకోవల్సిన రోజులు ఇంకెంతో దూరంలో లేవు. కోపమొచ్చినోడల్లా ఓ పేపరో, చానెలో పెట్టేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీద కథనాలు ప్రసరం చేయడము, ప్రచురించడము జర్నలిజం అనిపించుకోదు. బూతు జర్నలిజం అనిపించుకుంటుంది. దురద తీర్చుకోవటానికి సుందరి నవ్వింది, వయసు పిలిచింది, చిలక గోరింకా, పాపకు వయసొచ్చింది, లాంటి పత్రికనో లేదా సొంతంగా పార్వతి పద్మావతి లాంటి ఏ సినిమా హాలో పెట్టుకుంటే సరి. ఇలా మీడియా ముసుగులో ఆంధ్ర జ్యోతి, ఏబిఎన్ చేస్తున్న పని నీచాతి నీచం. ఛుడాల్సి రావడం మన దౌర్భాగ్యమునూ.
నోట్ : రాజమండ్రి లోని పార్వతి పద్మావతి సినిమాహాలు లో రక్తిరసమైన చవకబారు సినిమాలు మాత్రమే ఆడుతాయి.
రాము సార్,
మీ చర్చ చూస్తుంటే రాధాకృష్ణ మనసు మార్చుకొని ఇలాంటి ఘాటైన కార్యక్రమాలు ఇక ప్రసారం చేయకుండా చేసినట్టున్నారు. మా ఊళ్ళో ఫ్యాషన్ టీవి కూడా రాదు. పోని ఎదో శలవళ్ళో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాంటివి గుట్టుగా చూసుకుంటున్నాము. మా సుఖం కొట్టకండి. నాకు వింత కలిగించే విషయం ఏంటంటే మీరు కూడా ఆ దమ్మున్న చానల్ ని వార్తా చానల్ అని భావించి దానిపై ఒక చర్చ పెట్టటం, దానికి నా లాంటి పనిలేనివాళ్ళు రియాక్ట్ అవ్వటం.
Durga Prasad.Ch
ప్రస్తుతం జరుగుతున్నవి ఖచ్చితంగా దొంగ వచ్చి "దొంగ దొంగ" అని అరిచినట్టే వుంది. నేను చాలా రోజులుగా వింటున్న, మీడియా లో చాలా మంది న్యూస్ ని ఒకటి రెండు రోజులు ప్రసారం చేసి మరల డబ్బులకి అమ్ముకుంటారని. ఒక మిత్రుడు వారి దగ్గర బంధువులకి జరిగిన ఇటువంటి incident గురించి చెప్పినప్పటినుంచి ఏ న్యూస్ నిజమో, ఏది అబద్దమో, ఏది ఎందుకు చూపిస్తున్నారో అర్ధం కాని పరిస్తితిలో వున్నా. నాకు తెలిసి దాదాపు అందరికి తెలుసు ఎవరి agenda ఏమిటో. ఏదైనా channel పేరు చెబితే అది ఎవరికి సపోర్ట్ గా పని చేస్తుందో సులభంగా చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు రసికుడే అయినా ABN న్యూస్ తో అంబటి చాలా ఇన్నోస్సెంట్ అని prove చేసినట్టుంది. ఈ "వేరా" background ఏమిటో చాలా రోజులనుంచి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నా కాని వీడు ఎలా పెద్దవాడయ్యాడు అన్న ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు. వీడు చేసే ఇంటర్వ్యూలు, వీడి ప్రశ్నలు చూస్తే చాలా irritation వస్తుంది. AndhraJyothy పేపర్ చదవాలంటే చిరాకు. చాలా విషయాలు రాస్తాడు. ఒక source వుండదు, follow-up వుండదు. ఇంక వీడి మాటలకి ఏం క్రెడిబిలిటీ వుంటుంది. రామూ గారు మీ తరువాత పోస్ట్ కోసం చూస్తున్నాం. media గురించి మీ విశ్లేషణ బాగుంటుంది.
ధన్యవాదములు
edi emina rambabu ni venukesuku ravadam jagan ki aadavallalo lo chedda peru kontha thechindi anedi vasthaavam
Ee vishyam ni intatitho vadileyyi kundaa inka saakshi lo official gaa daanini suporrt cheyyadam pedda thappu.
This is Very bad situation
As per RAMU Sir...
Oka Gajadonga vachchi...NENU ajaonga ni ani public ga announce chesi...dongathanam chesthe...dani gurinchi discuss cheyakudadu...
kaani oka pickpocket donga gadu vachchi...NENU NITHIMANTHUDINI and HONEST person ni ani cheppukoni, pockets kottesthe..vadi gurinchi discuss cheyali...
Wah...Wah...kya logic hain miya!!!
(first case -> Sakshi
second case -> ABN)
ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్‌లో రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే తీరు, యంగిస్తాన్ కార్యక్రమంలో విద్యార్ధులతో
మాట్లాడేతీరు సమర్ధనీయంకానప్పటికీ, తివారి, విశాఖ స్వామీజి, విజయవాడ ఎస్పీలపై
ఏబీఎన్ ప్రసారంచేసిన కథనాలు బూటకమైతే కాదన్న విషయం మనం మరిచిపోకూడదు.
అంబటిపై కథనానికి సంబంధించి...మీరన్నట్లు అతని వెర్షన్ తీసుకోకపోవడం తప్పే అయినప్పటికీ, రాంబాబు విషయం
తెలిసినవారు, ఈ విషయంలో ఏబీఎన్‌ను సమర్ధిస్తారు. అతనిది మా జిల్లాయే. 1989లో ఇతను రాజకీయాలలోకి వచ్చినపుడు
ఇతని నియోజకవర్గం(రేపల్లె) ప్రజలు, యువకుడు, విద్యావంతుడని మంచి మెజారిటీతో గెలిపించారు.
అయితే తర్వాత అవినీతి సంపాదన మరిగి తమను పట్టించుకోకపోవడంతో తదుపరి ఎన్నికలలో భారీ
మెజారిటీతో ఓడించారు. కానీ, ఇతను వైఎస్ దగ్గర మంచి ప్రాపకం సంపాదించాడు. దరిమిలా 2004 ఎన్నికలలో
గెలిచిన వైఎస్, అభయశంకరుడిలా ఆశ్రితులందరికీ వరాలిచ్చినట్లే, ఇతనికీ ఏపీఐఐసీ ఛైర్మన్ గిరీ కట్టబెట్టాడు.
దాని సాయంతో అంబటి కోట్లకు కోట్లు కుమ్మేశాడు. జూదం, అమ్మాయిల పిచ్చి బాగా ఉందని గుంటూరుజిల్లాలో
ఇతనికి పేరు.
ఏబీఎన్, తనపై ఆరోపణలు చేసిందని, మహిళా ఉద్యోగినులపై బురద జల్లడంలోనే ఇతని క్యారెక్టర్‌ను మీరు అర్ధం
చేసుకోవచ్చు.
కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం వేరాని పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదని నేననుకుంటున్నాను.
వేరా కధనాలు నిజమే కావొచ్చు. కాకపోతే తివారి విషయం కాని మిగతా విషయాలు కాని చివరకు ఏమయ్యాయి. తివారి విషయం లో పదవి పోవటానికి ఇది ఒకకారణం కావొచ్చు కాని ఇదే కారణం కాదు. అయినా గాని ఒక బాధ్యతాయుతమైన పదవిలో వుంది అలాచేస్తే Criminal investigation ఎందుకు జరగలేదు? వీల్లదగ్గర వున్న videos పోలిసులకి ఇచ్చి కేసు ఎందుకు పెట్టలేదు. అదేవిదంగా మిగతా విషయాలలో కూడా ఏవిధమైన cases పెట్టినట్టు లేదు. అంటే వేరా చేసేది కేవలం వ్యాపారమే. మిగతావాళ్ళు ఇలానే చెయ్యటం లేదా అంటే చేస్తున్నారు. అందుకే వాడికంటే వీడు గొప్ప అనేది ఏమి లేదు. వీళ్ళంతా దొంగలే. వాటినుంచి అందరి ద్రుష్టి మరల్చటానికి వింత వింత programs చేస్తుంటారు. కాబట్టి వాడిని ఏ విషయం లోను మిగాతావాళ్ళకంటే పరవాలేదనుకోడానికి లేదు. మిగాతావాల్లెంత వెధవలో వీడు అంతే.
veeda vemura meeku andagadula kanbaduthunnadu tejswigaru,vvedini blufil radhakrishna naikooda antaur ,veedi programs choosthene arthamavuthundi channello panichesthunna mahiludyogalumeeda eedikientha gowravamo,thana sabhalaku velli veedu chesina janakjanak payalbhaje america antha thelusu ,badugunethalu antu dalithulanu neechamga choose veddu deliberatega oka partyki voteyyakandi maa kamma kula gajjivunna tdpke veyyandi anicheputhunnadante emanali,antha neechatineechamina character vunna veedu baseless allegations cheyyadamlosiddahasthud,monnakumonna cinemaindutrylo vunna vallanu blackmail chesthe policlu veedi employeesni arrest cheyyaleda anduku veedu kiran reddyni kalavaleda andrajyoti ante entha chandalmindao andariki thelusu veedu prsaram chese program standard batte arthamavuthundi veedi character emito oka ammayina charatcer ni panam ga petti rajakeeyam chesthunnadante pachi vyabhicharikanna daridrudu veedu veedi channelku ratinge ledu achosina mabothunate veedu,veedi babu koduku,panimanishi cheyipattukonnadi evaro,thappathagi channel women workerstho miss behave chesedi evaro,cyclethokkutho e programs chesi etuvanti bluefilm rajakeeyaltho veedu edigado andariki thelusu
అబ్బా.. మీరంతా ఒక్క విషయం మరిచారు.. ఆ మద్య విజయ విహారం అని ఒక మాస పత్రిక వచ్చేది.. యువత చేతిలో జ్ఞాన ఖడ్గం అని తెగ ఊదరగొట్టేది.. ఆ రమణమూర్తి కూడా ఎన్కౌంటర్ దశరధ్ రామ్ లా బిల్డప్ ఇచ్చేవాడు. అవే రాతలను అనుసరించే వాడు.. పాపం చాన్నాళ్లకు రాధాకృష్ణ కూడా మూడు దశాబ్దాల ముందుకు వెళ్లాడు..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి