పొద్దున్నే మెహిదీపట్నం రైతు బజార్ నుంచి తెచ్చిన చింతకాయలతో పప్పు, కొత్తిమీరతో పచ్చడి, అరటిపండుతో పెరుగన్నం తింటూ...తెలంగాణా అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసాను...డైనింగ్ టేబుల్ చుట్టూ ఉన్న ఐదుగురితో.
స్కూలు లేదని, హిందీ పరీక్ష పోస్ట్ పోన్ అయ్యిందని నా ఫోన్ కు స్కూలు నుంచి వచ్చిన ఎస్.ఎం.ఎస్.తో వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ల మాదిరి ఆనంద తాండవం చేసిన నా కుమారుడు ఫిదేల్ తో ఈ కసరత్తు ప్రారంభమయ్యింది. "తెలంగాణా వస్తే కష్టం...బందులు వుండవు...స్కూలు ఉంటుంది..." అని మా వాబందులతో జనం చస్తున్నారు, రాష్ట్రానికి నష్టమని చెప్పి...నా కూతురు మైత్రేయి అభిప్రాయం అడిగాను.
అంతకు కొద్ది సేపటి కిందటే...కాలేజీకి సెలవలు ఇచ్చారని వెలిగే మొహంతో చెప్పిన ఆమెమాత్రం "తెలంగాణా కావాలి....బందులు కావాలి..." అని చెప్పింది. తెలంగాణా ఎందుకంటే...ఉద్యోగాలు వస్తాయట, నీళ్ళు వస్తాయట.
ఇక...ఖమ్మం లో ఇంజినీరింగ్ చేసి...ఉద్యోగ వేటలో ఒక మూడు నెలలుగా మాతో ఉంటున్న హేమ అక్క కొడుకుని ఇదే ప్రశ్న వేశాను. "తెలంగాణా వద్దు...బందులు వద్దు" అని మనవాడు చెప్పాడు. మరి నీకు వుద్యోగం వస్తుందట...అని అంటే..."చాలా లేట్ అవుతోంది..." అని తను అన్నాడు.
ఇక తెలంగాణా అవసరం ఉందని హేమ స్పష్టం చేసింది. నల్గొండలో రిపోర్టర్ గా పనిచేసినప్పుడు ఆమె కన్వీన్స్ అయ్యింది. తెలంగాణా ఇవ్వకపోవడం ఇక దారుణమని నా అభిప్రాయం కూడా. పోయిన వై.ఎస్.ను ఏమీ చేయలేము గనక అంత ప్రకటన చేసి మోసం చేసి జనాల మధ్య అభిప్రాయ బేధాలు మరీ ఎక్కువ చేసిన చిదంబరం, మన్మోహన్, సోనియాలను చింత బరికలతో పీకాలని నాకుంది.
మరి నీ సంగతేంటి...అని (కర్నాటక నుంచి వచ్చి) ఇళ్ళల్లో పనిచేసుకు బతుకుతున్న మా మెయిడ్ ను అడిగాను. "ఆ విషయాలు నాకేమి తెలుస్తాయి అయ్యా..." అని ఆమె అన్నది. ఫేసు బుక్ లో "Now it is our turn to put our status as Jai Telangana" అని తన కాలేజ్ మేట్స్ అంటున్నారని నా కూతురు చెప్పింది.
మొత్తంమీద నాకు అర్థం మయ్యింది ఏమిటంటే...పిల్లలకు చదువులంటే ప్రేమ ఏ మాత్రం లేదని. చదువును వీరు కష్టంగా భావిస్తున్నారని. నాకు తెలిసిన చాలా మంది పిల్లలు బందులు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. మా వాళ్ళు మాత్రమే ఇలానా? మీ జనాలూ అంతేనా? నేను...ఈ లోపు తిరుపతిలో దక్షిణ భారత స్థాయి సెమినార్ లో పాల్గొని వస్తాను. ఈ లోపు మీ పిల్లల స్పందన ఏమిటో తెలియజేయండి.
6 comments:
మొదట్లో మా పిల్లలూ బందు అంటే ఎగిరి గంతేసారు. వారం రోజులు ఇంట్లో బోర్ కొట్టిన తర్వాత స్కూలే బెటరని నిర్ణయానికి వచ్చారు. బండెడు పుస్తకాలతో బండబారిన మన బట్టీ విద్యావిధానం, బందులపై వారికి గల ఇష్టానికి ముఖ్యకారణం.
మన దేశంలో చదువు అనేది ఎంత కష్టమో మీకు తెలిసినట్టు లేదు. మేము కరీంనగర్లో చదువుకునే రోజుల్లో మా తెలుగు టీచర్ మేము 'వాయిదా' అనే పదానికి అర్థం చెప్పలేకపోయామనే మమ్మల్ని తెలుగు రానోళ్ళని తిట్టినట్టు తిట్టారు. నిజానికి తెలుగు నేర్పించడానికే కదా ఆవిడకి ఉద్యోగం ఇచ్చింది. పిల్లలకి అన్నీ తెలిస్తే పంతుళ్ళూ, పంతులమ్మలూ నేర్పించడం ఎందుకు? 'మనకి చదువు అబ్బదురా, బండగా బట్టీ పట్టేసి వ్రాసి పాసైపోదాం' అనుకునే విద్యార్థులకి సెలవులు వరాలుగానే కనిపిస్తాయి.
సార్,
ఇంకా నయం మా వాడు మనం తెలంగాణాలో ఉన్నా బాగున్ను డాడీ అంటున్నాడు. వాడికి ఈ రోజు నుంచే హాఫ్ ఇయర్లీ పరీక్షలు.
దుర్గాప్రసాద్
శ్రీకాకుళం
We have to pity the children for their mindset.They donot know perfectly the issue of Telangana.Even adults feel that we get more jobs and more irrigation water.Recently KCR said that 73 percentage. of total state revenue is from Telangana.But it looks unconvincing.But whatever it may be it is the common man who has been the victim of struggle for seperate state since six decades and the politicians whether the agitation succeeds or not they get their own benefits as the past experience reveal. People sacrifice politicians enjoy; we struggle they decide.
JP.
What happened to Ambati Ram Babu's complaint against RK and ABN? No further news!Any compromise between them?
JP
రాము గారు నేను మా పక్కింటి పిల్లలను తెలంగాణ ఉద్యమం గురించి మీ అభిప్రాయం చెప్పండని అడిగాను. తీరా వారు చెప్పిన తరువాత వాళ్ళ వయసుకు మించిన తెలివికు ఆశ్చర్యమేసింది. వారు చెప్పింది " అక్కడ ఉద్యమం వల్ల ప్రభుత్వం పై ఒతిడి కన్నా ఆర్థికంగా తెలంగాణ దేబ్బతింతోందట. అంతేకాక అక్కడ నాయకులకు నిజంగా చితసుద్ధిలేదట. ఉద్యమం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందిట". చివరగా మీకు రాష్త్రం సమైఖ్యంగా ఉంచాలా లేక విడదీయాలా అని అడిగా. అందుకు వారి సమాధానం వారికి రాయలసీమను విడి రాష్త్రంగా చేసి తిరుపతిని రాజధానిగా చెయ్యాలట...( నేను చిత్తూరు జిల్లా వాణ్ణి లెండి...)
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి