Friday, February 3, 2012

హమ్మయ్య...ఎట్టకేలకు విజయ దాహం తీరింది ...

ఓడిపోయి...దారుణంగా ఓడిపోయి..ఘోరంగా ఓడిపోయి...భారతీయ క్రీడాభిమానులను అవమాన భారంతో ముంచెత్తిన భారత క్రికెటర్లు ఎట్టకేలకు విజయం రుచి చూశారు. రెండో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆటలో అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరిచి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచారు. ఇవ్వాళ భారత్ గెలిచి ఉండకపోతే....క్రికెట్ పిచ్చోళ్లు నిజంగా పిచ్చోళ్లయిపోయేవారే. చివరి ఓవర్లో జనాల నరాలు తెగే పరిస్థితి దాపురించింది.
ఈ ఆట ద్వారా భారత్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఉంది. బ్యాట్ తో బండకొట్టుడు కొట్టడం వల్ల గెలుస్తామనుకుంటే కష్టం. ఇవ్వాళ గెలిచింది...కేవలం అద్భుత ఫీల్డింగ్ వల్ల. విమర్శల జడివానలో తడిసి జడిసుకున్న కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మ్యాన్ గా రాణించడం వల్ల.
ఈ దూరదర్శన్ లైవ్ గొడవేంట్రా బాబూ...

అయితే...ఇవ్వాళ్టి మ్యాచ్ ను దూరదర్శన్ లో చూసిన వారికి చీరాకెత్తి ఉంటుంది. దృశ్యం కన్నా ముందు శ్రవణం వినిపించి విసిగించింది. బౌలర్ బాల్ వేయకముందే బ్యాట్స్ మ్యాన్ ఏమి చేశాడో కామెంటేటర్ చెబుతున్నాడు. అక్కడేదో టెక్నికల్ సమస్య ఉన్నట్టుంది. స్టూడియోలో చర్చలో కూడా తేడా ఉంది. అన్ని ఛానళ్లు...టెక్నికల్ గా అద్భుతమైన నాణ్యమైన ప్రసారాలు అందిస్తుంటే మన డీడీ వ్యవహారం ఇట్టా ఏడ్చింది. మొత్తం మీద ఈ విజయంతో క్రీడాభిమానుల కన్నీటి సంద్రానికి అడ్డుకట్ట పడింది. ఏమంటారు?
***********************************

Phone numbers please...

‍నోట్...మొబైల్ ఫోన్ పోవడం వల్ల నా దగ్గరున్న నంబర్లన్నీ పోయాయి. నాకు సన్నిహితులైన, హితులైన బ్లాగర్లు మీ ఫోన్ నెంబర్లు నాకు మెయిల్ చేయండి, ప్లీజ్. మా సంస్థ వారు నా పాత నెంబర్ ను పునరుద్ధరించారు కాబట్టి మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినా బాగానే ఉంటుంది.

..రాము

3 comments:

evadaite enti said...

so you are a die hard follower of cricket..

ddtv said...

సార్ దాహం తీరడం అంటే వరస పెట్టి గెలవడమేమో ?

SJ said...

gelavalani tapana,pattudala undali gani tappaka gelichi teerutaru...tema effort undali...udharna rendo match

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి