Wednesday, February 15, 2012

బంగ్లాదేశ్ లో జర్నలిస్టు దంపతుల హత్య

ఒక రెండు రోజలు నెట్ లో ప్రపంచాన్ని జల్లెడ పట్టకపోతే చాలా ముఖ్యమైన వార్తలు మిస్ అవుతాం. బంగ్లాదేశ్ రాజధానిలో ఇద్దరు ప్రముఖ జర్నలిస్టు దంపతులు దారుణ హత్యకు గురవడం నాకు ఆలస్యంగా తెలిసింది.సాగొర్ సర్వార్ (న్యూస్ ఎడిటర్, మాస్ రంగా టీవీ), ఆయన భార్య మెహరున్ రునీ (సీనియర్ రిపోర్టర్, ఏటీఎన్ బంగ్లా) వారి నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. సర్వార్ ఒక జర్ననీ మీడియా సంస్థకు ఢాకా ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. ఇద్దరి వయస్సూ నలభై ఏళ్ల లోపేననీ, ఉదయం వారి ఐదేళ్ల కుమారుడు మేష్ మృతదేహాలను చూసి పొరుగింటి వారిని అప్రమత్తం చేసే వరకూ ఈ ఘోర హత్యల గురించి ఎవ్వరికీ తెలియలేదని సమాచారం. 


ఈ హత్యల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజలు కూడా జర్నలిస్టుల హత్యను ఖండిస్తూ, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్లకెక్కారు. దీన్ని ప్రతీకార హత్యగా లేదా దోపిడి దొంగల అఘాయిత్యంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగొర్ దేహం మీద మొత్తం 22 కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హంతకులు అతని కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి పదునైన ఆయుధంతో పొడిచి చంపారట. వీరి అపార్ట్ మెంట్ లో ఆ రాత్రి వీరితో కలిసి భోజనం చేసిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అంటున్నారు. http://www.nl-aid.org కథనం ప్రకారం....
Bangladesh is among the worst nations in the world in combating deadly anti-press violence. Bangladesh ranks 11th on New York based Committee to Protect Journalists (CPJ) Impunity Index, which calculates unsolved journalist murders as a percentage of each country’s population. Twelve journalists have been murdered in reprisal for their work in Bangladesh since 1992.

First Photo courtesy: BBC
Second Photo courtesy: http://www.nl-aid.org

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి