1967 నుంచి....జర్నలిస్టుల వేతనాలకు సంబంధించిన వేజ్ బోర్డుల సిఫార్సులను అమలుచేయడంలో ముందున్న అతికొద్ది పత్రికలలో ఈశాన్య భారతం నుంచి వస్తున్న "ద అస్సాం ట్రిబ్యూన్: ఒకటి. జస్టిస్ మజీతియా నేతృత్వంలోని వేజ్ బోర్డు ఇచ్చిన సిఫార్సులు అమలుచేయకుండా ఉండటానికి పత్రికల యాజమాన్యాలు నానా యాగీ చేస్తూ...ఎక్కడ లేని లా పాయింట్లు పీకుతుంటే అస్సాం ట్రిబ్యూన్ మాత్రం ఆ సిఫార్సులను అమలుచేయాలని నిర్ణయించింది.
జనవరి నుంచి కొత్త వేతనాలను యాజమాన్యం అమలుచేసింది. దాంతో కనీసం పదిహేను వేల రూపాయల అదనపు జీతాన్ని జర్నలిస్టులు పొందారు. ఇది నిజంగా హ్యాపీ న్యూ ఇయరే మన మిత్రులకు. అస్సాం ట్రిబ్యూన్ ఎడిటర్ కం మేనేజింగ్ డైరెక్టర్ అయిన పి.సి.బారువా దీనిమీద అన్న మాట ఏమిటంటే..."We have done our duty and given the employees their due. We don't want to speak for ourselves. Let others talk about our gesture."
1939 ఆగస్టు నాలుగో తేదీన ఏర్పడిన ఈ పత్రిక ఈశాన్య భారతంలో అత్యధిక సర్క్యులేషన్ తో వర్ధిల్లుతున్నది. ఇందులో దాదాపు నాలుగొందల మంది పనిచేస్తున్నారు. అందులో వంద మంది జర్నలిస్టులున్నారు. ఈ గ్రూప్ వారికే అస్సమీ లో దైనిక్ అసోమ్, అసోమ్ బని, గరియోషి అనే పత్రికలున్నాయని ది హూట్ వెబ్ సైట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ పేర్కొంది.
జర్నలిస్టుల రక్తమాంసాలు పిండి మీడియా సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ తరతరాలకు తరబడ సంపాదిస్తున్న తెలుగు పత్రికా యాజమాన్యాలు అస్సాం ట్రిబ్యూన్ నుంచి ప్రేరణ పొందాలి. ప్రతికలను అడ్డంపెట్టుకుని చేస్తున్న వ్యాపారాలలో భారీగా ఆర్జిస్తూ, పత్రికా నిర్వహణలో నష్టాలు చూపించి జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల పొట్టకొట్టడాన్ని ఇప్పటికైనా ఆపాలి. చేవలేని జర్నలిస్టు సంఘాలు మొద్దు నిద్ర వదిలేలా జర్నలిస్టులు కూడా పూనుకోకపోతే మీకు చట్టబద్ధంగా పెరగాల్సిన జీతాలు పెరగవని గమనించాలి.

5 comments:
రాష్ట్రం లో నీతుల గురించి ఎక్కువగా మాట్లాడే పత్రికలు వెజ్ బోర్డు అమలు చేయవు . కాలేజిలు తిరుగుతూ యన్గిస్తాన్ అంటూ నీతులు చెప్పే వాళ్ళను ఈ విషయం పై అడగరా? జగన్ చట్ట విరుద్దంగా ఏం చేశాడో పేజిలకు పేజీలు రాస్తున్న వాళ్ళు చట్ట ప్రకారం వెజ్ బోర్డు అమలు చేయరా ? మన రాష్ట్రం లో వెజ్ బోర్డు అమలు చేయని పత్రికల గురించి, నాటకాలు ఆడుతున్న యాజమాన్యాల గురించి చర్చ జరగాలి. ఉద్యోగ బయటో పేర్లు రాయక పోయినా విషయాలు రాస్తారు కదా ?
వినోద్ గారూ,
విషయాలను అర్ధం చేసుకోవడంలో మీకు ఒక సమస్య ఉన్నట్టుంది. నేను హెచ్ ఎం టీవీ మంచిదని రాస్తే...అది ఎందుకు మంచిది కాదో మీరు స్పష్టంగా రాస్తే బాగుంటుంది. దాన్ని నేను స్వాగతిస్తాను. నేను ఈ ఛానల్ కొమ్ముకాసే, వేరే వారికి భజన చేసే పనిలో లేను. మీ వాదనను నేను పోస్టు చేస్తాను. వాదన వేరు, నేను రాసిన దాన్ని...నన్ను విమర్శించడం వేరు. నన్ను నిష్కారణంగా అంటే మాత్రం నేనూరుకోను సార్.
నన్ను సమర్ధించమని నేను ఎన్నడూ కోరడం లేదు. బ్లాగు ఉద్దేశం... చర్చ జరపడం. అలాకాకుండా నా మీద అడ్డగోలు మాటలు రాస్తేనే...సమస్య. నా అభిప్రాయం ఎందుకు తప్పో మీ కారణాలతో మీరు రాస్తే నేను హర్షిస్తాను. దయచేసి స్వీపింగ్ కామెంట్లతో వ్యాఖ్యలు రాయకండి. అది మనిద్దరి టైం వేస్ట్ కార్యక్రమం. ప్లీజ్ అర్ధం చేసుకోరూ...
రాము
రాము గారూ, అస్సాం ట్రిబ్యూన్ యాజమాన్యాన్ని అభినందిద్దాం. మీ పోస్టులోని మూడో పేరాలోని మీ ఆక్రోశాన్ని కేవలం తెలుగు పత్రికలకే పరిమితం చేస్తున్నారా? లేక మీరు పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన ఆంగ్ల పత్రికకూ, వారి టీవీ చానల్ కూ కూడా వర్తింపజేస్తారా?
ఏమండీ...
నేను రాసింది అందరికీ వర్తిస్తుంది. ది హిందూ కు గానీ మరేవరికే కానీ మినహాయింపు లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. దాన్ని ఖండించడం లో వెనుకాడేది లేదు.
రాము
దీంట్లో కూడా లైకులు ఉంటె బావుణ్ణు. లేదా మీరే ఫేస్ బుక్ లోకి వస్తే బెట్టర్.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి