హైదరాబాద్ మీడియా హౌస్ బాస్ రాజశేఖర్
తెలుగు జర్నలిజంలో హైదరాబాద్ మీడియా హౌజ్ కు ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటుచేసిన కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు అక్కడి నుంచి నిష్క్రమించి అప్పుడే పక్షం కావస్తోంది. ఆయన స్థానంలో నియమితుడైన రాజశేఖర్ రెండు లేదా ఐదో తేదీన అధికారికంగా పగ్గాలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే హెచ్ ఎం టీవీ ఛానెల్ లో పెద్ద తలకాయలు, ది హన్స్ ఇండియా ఎడిటర్ లతో టచ్ లో ఉన్న రాజశేఖర్ సంస్థ ఆపరేషన్స్ మొదలు పెట్టినట్లు సమాచారం.
సంస్కరణలలో భాగంగా... మూర్తిగారి మనుషులని అనుకున్నవాళ్ళను పక్కన పెట్టడమో, ఇంటికి పంపడమో చేసే పనిని చురుగ్గా చేపట్టినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ది హన్స్ ఇండియా బ్యూరో చీఫ్ గా ఉన్న చంద్రభాస్కర్ (ఒకప్పటి ఖమ్మం 'ది హిందూ' రిపోర్టర్) ను కాదని, మాజీ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ రామూ శర్మ గారికి ఆ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. ది హన్స్ కో-ఆర్డినేషన్ కోసమని మూర్తి గారు ఛానెల్ నుంచి పట్టుకొచ్చి పెట్టిన ఇద్దరు జర్నలిస్టులతో పటు ఆయన సమీప బంధువు ఒకరి మీద పగ పట్టినట్లు చెబుతున్నారు. ఓరి నాయనలారా... జర్నలిస్టుల పొట్టలు కొట్టకండి!
ఇకపోతే... ఇప్పుడు మీడియా ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషకం పొందుతున్న జర్నలిస్టు గా రాజశేఖర్ చరిత్ర సృష్టిస్తున్నారు. "మా యజమాని వామన రావు గారు మీడియా హౌస్ లో రాజశేఖర్ కు వాటా ఇచ్చారని అనడం తప్పు. కానీ, కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని నెలకో పది, పదకొండు లక్షల జీతం ఇస్తున్నట్లు చెబుతున్నారు," అని ఒక ఉద్యోగి చెప్పారు.
ఈ-టీవీ చర్చల్లో పసునూరి శ్రీధర్ బాబు
'ఇండియా టుడే' ద్వారా తెలుగు రీడర్స్, హెచ్ ఎం టీవీ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన పసునూరి శ్రీధర్ బాబు ఇప్పుడు ఈ-టీవీ ఆంధ్రప్రదేశ్ చర్చల్లో కనిపిస్తున్నారు. మూర్తి గారి ప్రోత్సాహంతో హంస టీవీ కి వచ్చి... వద్దయ్యా బాబూ... అన్నా వినకుండా పోయి వీ6 లో చేరి భంగపడిన శ్రీధర్ మళ్ళా హెచ్ ఎం టీవీ లో చేరారు.
తదనంతర పరిణామాల మధ్య అక్కడి నుంచి బైట పడి... కొద్దికాలం ఉద్యోగాన్వేషణ చేసి, కొద్దికాలం రెస్టు తీసుకున్న శ్రీధర్ ఈ-టీవీ చర్చల్లో కనిపించడం అయన మిత్రులకు ఆనందం కలిగించడం... ఆయన పట్ల అనవసర ద్వేషం పెంచుకున్న వారికి చెంపపెట్టులా అనిపించడం మామూలే.
10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా వడ్డే వెంకటేశ్వర రావు
ఖమ్మం జిల్లా కారేపల్లి లో 'ఈనాడు' కంట్రీ బ్యూటర్' గా జర్నలిజం జీవితం ఆరంభించిన వడ్డే వెంకటేశ్వర రావు గారు ఇప్పుడు 10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా నియమితులయ్యారు. జీ టీవీ లో పనిచేసిన సతీష్ కమల్ (అసలు పేరు సత్యనారాయణ అట) స్థానంలో వడ్డే నియమితులయ్యారు. ఇప్పుడు సతీష్ ఏమి చేస్తారో తెలియదు.
తిరుపతి లో ఉండగా 'ఈనాడు' వదిలి టెలివిజన్ రంగ ప్రవేశం చేసిన వడ్డే తుమ్మల నరేంద్ర నాథ్ చౌదరి గారి ఎన్-టీవీ లో పనిచేసారు.
సీ పీ ఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం గారి ఆహ్వానం మేరకు ఎన్నికలకు ముందు 10 టీవీ లో చేరి పరిస్థితులు అవగతం చేసుకున్న వడ్డే ఎన్నికలు కాగానే పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసారు. ఈ పరిణామం కన్నా ముందు 10 టీవీ లో చేరిన మాజీ టీవీ 9 జర్నలిస్టులు మళ్ళీ ఆ ఛానెల్ కు వెళ్ళిపోవడం, డైనమిజం లోపించడం తో 10 టీవీ అనుకున్న మేర రాణించలేక పోతున్నది. ఇది...యాజమాన్యంలో కీలక భూమిక పోషిస్తున్న కామ్రేడ్ల కన్నెర్ర కు కారణమయ్యింది.
జనం డబ్బుతో మొదలైన 10 టీవీ ఇలా వెలాతెలా పోవడానికి కారణాలపై ఫీడ్ బ్యాక్ ను, దానికి సంబంధించి సన్నిహితులు ఇచ్చిన నివేదికను పరిశీలించి తమ్మినేని బృందం ఛానెల్ లో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు చానెళ్ళలో రోజూ చర్చల్లో పాల్గొంటున్న ఈ చానెల్ చైర్మన్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్, సీ ఈ ఓ అరుణ్ సాగర్, ఇన్ పుట్ ఎడిటర్ వీ వీ రావ్ అలియాస్ వడ్డేల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
'ఈనాడు' ఉద్యోగుల ఆశపై ఐసు నీళ్ళు!
సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చినందున వేతన సంఘం సిఫార్సు మేరకు ఈ నెలలో పెరిగిన జీతాలు అందుకోవచ్చని అనుకున్న 'ఈనాడు' ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ను కూడా సవాలు చేసేందుకు చట్టంలో ఉన్న వెసులుబాటు ను యాజమాన్యం ఉపయోగించుకోవడం తో ప్రస్తుతానికి జీతాలు పెరగవని జర్నలిస్టులు ఒక నిర్ధారణకు వచ్చి మానసికంగా కుంగిపోతున్నారు. "వాస్తవానికి గత నెలలోనే జీతాలు పెంచి....పెంచి పంచిన విషయాన్ని ఈ నెల ఏడులోగా సుప్రీం కోర్టుకు తెలియజేయాల్సి ఉంది. అయినా... అలాంటిది జరపకుండా... క్యురేటివ్ పిటిషన్ వేశారని చెబుతున్నారు.," అని సంస్థ సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు.
కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం రావడం, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి రావడం, మోడీ ప్రభుత్వం తో చంద్రబాబు దోస్తానా.. ఇవన్నీ 'ఈనాడు' ఉద్యోగులకు భయం కలిగిస్తున్నాయి. "మా సుడి బాగోలేక ఉన్నట్టుండి ఈ రాజకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ద్వారా మా యజమాని... మోడీ మీద ఒత్తిడి తెచ్చి వేతన సంఘం సిఫార్సులను తుంగలోకి తొక్కే అవకాశం లేకపోలేదు," అని ఒక 'ఈనాడు' మిత్రుడు ఆవేదనతో చెప్పారు.
ఇప్పటికే... పీ టీ ఐ వంటి వార్తా సంస్థలు, 'ది హిందూ' లాంటి పత్రికలు సుప్రీం కోర్టు ఆర్డర్ కు అనుగుణంగా జీతాలు పెంచాయి, బకాయిలు (లక్షల్లో ఉన్నాయి) చెల్లించే పనిలో ఉన్నాయి.
సీ ఎల్ రాజం ఇచ్చారా? కే సీ ఆర్ గుంజుకున్నారా??
"నమస్తే తెలంగాణా" పత్రిక ను టీ ఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీసుకున్న వార్త నిజమేనని పత్రిక పెద్ద తలకాయలు దృవీకరించాయి. అయితే... ఈ టేక్ ఓవర్ "నమస్తే తెలంగాణా" అధిపతి సీ ఎల్ రాజం అభీష్టానికి వ్యతిరేకంగా జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక రాజ్యసభ సీటిచ్చి... ఇంత పెట్టుబడి పెట్టిన పత్రికను తీసుకోవడం పట్ల ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వెలిబుచ్చినట్లు చెబుతున్నారు.
ఆ సంస్థ లో పనిచేసే ఒక సీనియర్ నుంచి మాకు వచ్చిన ఈ సందేశం చూడండి.
"FYI. KCR forcibly acquired NT, much against Rajam sir wishes."

1 comments:
Dear Ramu,
Let me set the record straight. I was appointed as Bureau Chief cum Political Editor when The Hans India was launched. In between in view of the fast paced political developments I was asked to focus only on political development.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి