రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నట్లు ఈ ఎన్నికల్లో తెలుగు నెల మీద ఏ పవనలూ, పవన్ కళ్యాణ్ లో లేవు. ఈ ఫలితాలు... స్పష్టంగా నిరూపించింది ఒక్కటే: తెలుగు ఓటరు బుర్రున్నోడు. అలోచించి తీర్పు ఇచ్చాడు. హాట్సాఫ్.
తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం నిజానికి తమ జీవితాలు భయంకరంగా మార్చే విషయం కాదని నిరూపిస్తూ.... ఆ వాదాన్ని సమర్ధించిన తెలుగు దేశానికి పట్టం కట్టడమే కాకుండా, ప్రత్యేక రాష్ట్రం విషయంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలతో తమ ఆత్మాభిమానాన్ని కించపరిచిన కాంగ్రెస్ నేతలకు కొర్రు కాల్చి వాతపెట్టి తగిన గుణపాఠం చెప్పారు ఆంద్ర ప్రదేశ్ ఓటర్లు. జనం గొర్రెలని అనుకున్న మహామహులైన నేతలంతా మట్టి కరిచి కాంగ్రెస్ మట్టి కొట్టుకు పోయింది అటు పక్కన.
చచ్చిపోయిన పాము... తెలుగు దేశం... అని అంతా అనుకున్నా... అంధ్ర ప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు కు పట్టంకట్టడం, అంతగా మోడీ ప్రభంజనం ఉన్నా... తెలంగాణా రాష్ట్ర సమితి ని ఆదరించి తెలంగాణా లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పెద్ద పీట వేయడం... దేనికి సూచిక? తమ తమ రాష్ట్రాల పునర్నిర్మాణానికి ఎవరు అవసరమో జనం స్పష్టంగా చూజ్ చేసుకున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అటుపక్కన ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించడం నిజంగా కనిపించని ఒక పెద్ద సవాలు. ఈ విషయంలో జనం చంద్ర బాబు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయనైతే... సమర్ధంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని నమ్మినట్లున్నారు ఓటర్లు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా... బటన్ ఒత్తే సమయానికి తమ జీవితాల గురించి, రాష్ట్ర భవిత గురించి ఆలోచించినట్లున్నారు. లేకపోతే... తెలంగాణా రావడానికి సహకరించి.... 'రెండు కళ్ళు' అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబును జనం నమ్మడమేంటి? సమైక్య నినాదంతో భయంకరమైన హడావుడి చేసిన జగన్ పార్టీ నడ్డి మీద వెనక నుంచి లాగిపెట్టి తన్నడమేంటి? డబ్బులు తీసుకున్నా... అమాయకంగా నటించినా... ఓటరు విజ్ఞత కనబరిచాడు.
మరొక పక్కన... తెలంగాణా ఓటరు ప్రదర్శించిన పరిణతి ఇంకా అద్భుతమైనది. తెలంగాణా తెచ్చింది.. తామేనని ఒక పక్కన కాంగ్రెస్ లీడర్లు ఘాటుగా ప్రచారం చేసుకున్నా... ఓటర్లు వారిని కాదు పొమ్మన్నారు. మోడీ ప్రభంజనం వీచినా... ఒక క్షణం ఆలోచించి... తమకు సుపరిపాలన ఇచ్చే సామర్ధ్యం కే సీ ఆర్ కు ఉందని గట్టిగా నమ్మినట్లున్నారు. ఆయన మీద, ఆయన కుటుంబం పోటుగాళ్ళు ఎన్ని సినిమా డైలాగులు వేసినా...తెలంగాణా ఉద్యమ నేతనే కాకుండా... అయన కుటుంబ సభ్యులను ఘనంగా గెలిపించారు. ఆయనను గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభ సీట్లలో, కొడుకు, మేనల్లుడును అసెంబ్లీ సీట్లలో, కూతురు కవితను నిజామాబాద్ పార్లమెంటు సీటులో గెలిపించారు. ఇదంతా ముక్కు పంతులు గారి మీద తెలంగాణా ఓటర్లకు ఉన్న నమ్మకం. ఉద్యమ వీరుడు ఆయనేనని జనం నమ్మిన ఫలితం.
తెలంగాణా తెచ్చింది.. మేమే కాబట్టి..ఇక విజయం తమదేనని విర్రవీగిన కాంగ్రెస్ నేతల నెత్తిన తెలంగాణా ఓటర్లు తెల్లగుడ్డ పరిచారు. మాట్లాడితే...ప్రత్యేక తెలంగాణా అని నినదించిన.. మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, వీ హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజ నరసింహ తో పాటు గోడ మీద పిల్లి వాటం మేధావులు జైపాల్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, జనం గొర్రెలని, దాదాగిరీ తో అనుకున్నది చేయవచ్చని అనుకున్న దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, జగ్గారెడ్డి లాంటి వాళ్ళ కథ కంచికి చేరింది. వేళ్ళలో చాలా మందికి రాజకీయాల మీద విరక్తి రావడం ఖాయం.
ఇప్పుడు ముఖ్యమంత్రులు కాబోతున్న ఇద్దరూ, వారితో పాటు పవన్ కళ్యాణ్ కీలక సమయంలో తీసుకున్న క్లిష్ట నిర్ణయాల గురించి చెప్పుకోక తప్పదు. తెలంగాణా రాగానే టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి, ప్రచారం చేసిన కే సీ ఆర్ ఆ పనిచేయకపోవడం మంచిదయ్యింది. అలాగే...కే సీ ఆర్ తో బీజేపీ కలవకుండా చేసి, చివరి క్షణంలో తను వెళ్లి మోడీ సరసన చేరడం చంద్రబాబు రాజకీయ పరిణతి కి నిదర్శనం. బాబు కన్నా పార్టీ కాడర్ ఉంది. ఆయన లాగానే సందట్లో సడే మియాలాగా...ఒక పెద్ద పార్టీ పెడుతున్నట్లు పోజు కొట్టి... అదే ఊపుతో మోడీ ని కలిసి ఆయన మన్ననలు పొంది ఆయనతో, బాబుతో వేదికలు పంచుకుని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా మంచి మూవ్ వేసారు.
అంత పెద్ద పార్టీ పెట్టిన అన్న చిరంజీవి కుదేలై కాంగ్రెస్ లో చేరి... మంత్రై కూడా నానా తంటాలు పడుతున్నప్పుడు... అన్న చాటు తమ్ముడు కమలనాథుల పంచన చేరి రెచ్చిపోవడం... అయన కాలిక్యులేషన్ వంద శాతం నిజమై అటు పక్క తెలుగు దేశం-బీ జే పీ అధికారం లోకి రావడం నిజంగా సినిమాలో లాగా హీరో కు కలిసివచ్చే మంచి విషయం. అలాగే మొత్తం మీద... ఈ ఫలితాలను ముందుగానే పసిగట్టిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా అభినందనీయుడే కదా! ఏది ఏమైనా... మన తెలుగోళ్ళు సూపర్ బ్రదర్!
ఇక... బాధ కలిగించే విషయం ఏమిటంటే... ఇద్దరు మేధావులు--లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్, ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్ కే. నాగేశ్వర్--అనవసరంగా మల్కాజ్ గిరిలో ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇద్దరూ ఓడిపోవడం. ఆంధ్రా కుమారుడు అయిన జే పీ సీమాంధ్రలో, తెలంగాణా బిడ్డ నాగేశ్వర్ తెలంగాణా వాదంతో మొఖమాటం లేకుండా పోటీ చేసినా గెలిచే వాళ్ళు. పాపం. రాష్ట్ర విభజన ఆగదని స్పష్టమైన...ఒక్క సీటైనా రాదని తెలిసినా...పోరాడి పోరాడి ఓడిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సందర్భంగా స్మరణీయుడే కదా!
8 comments:
1. i feel, for the last 10 years babu is not in power. so he might not have much investments left in hyderabad. he could leave hyderabad quickly to get some profits in new capital.
2. for telangana, KCR is good for andhra people living there. As in govt they would behave well to maintain good atmosphere there compared to out of power. business people dont need to pay govt party and T-party in two ways ;-). And by the end of 5 years i dont think T-People will still have issues with A-People. Everybody realises that even after a million years, telangana & andhra will be next to each other, you cant move telangana near himachal... this 5 years of TRS is good for bother the parties. And with TRS in hyderabad it automatically pushes andhra govt to leave hyderabad ASAP making new Andhra capital. i feel its WIN-WIN.
Good analysis.I am sure Babu will definetely try his best to make AP swarnandhra making people to forgetHyderabad and build good future for them as he is wel experienced,talented with political will and Modi's help is an additional factor for his plans.
JP.
Ramu garu, Have you gone through Open letter to Modi by Gopala Krishna Gandhi in The Hindu 19/5? If so your comments please.
తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా... ///
This is ur agenda...
so please don't say you are a ethical journalist..
In AP YSR is dearer CM for only YSR party & Cong party ppl.. not all
and all ur blogs will have favorism towards YSR and hatred towards CBN
///
తెలంగాణా రావడానికి సహకరించి.... 'రెండు కళ్ళు' అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబును జనం నమ్మడమేంటి?
//////
gelichindhi voteru,mari odipoyindhi ee blog writeru.Counting ki mundhu YSR party ki picha biased gaa articles raasi ippudu jump jilaani ayyadu!
ఒప్పుకున్నాం కదా సార్... ఓడిపోయామని. ఫీడ్ బాక్ గాడి తప్పింది అంతే!!!
తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా
This is what you wished but people tought a lesson people like you. you have one agenda like sakshi ప్రియతమ nayakudi photo kudaa pettukomdi memu ika meedata coments pettamu.
This Blog seems to be like a GreatAndhra.com. No Ethicks, No Vlaues..! OH..God, Please save Telugu People.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి