1889 నుంచి దినపత్రికగా వస్తూ... నైతిక జర్నలిజానికి ప్రతినిధిగా జనం నమ్మే స్థాయికి ఎదిగిన 'ది హిందూ' పత్రికలో పరిణామాలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, అహం పోరాటాల మధ్యన పత్రిక, అందులో పనిచేసే జర్నలిస్టులు నలిగిపోతున్నారు.
'ది హిందూ' మొదటి మహిళా సంపాదకురాలిగా.. ఫిబ్రవరి 1, 2015 న బాధ్యతలు స్వీకరించిన మాలినీ పార్థసారధి ఏడాది తిరగకుండానే...కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలో రాజీనామా చేసారు. తన పదవీ కాలంలో.. సీనియర్ఎడిటర్లు, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకుండా దడదడలాడించిన మాలిని గారి రాజీనామా కు కారణం కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్ధలని చెబుతున్నారు. ఆమె రాజీనామా గురించి జనవరి 5 వ కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ బోర్డు చైర్మన్ ఎన్. రామ్ చేసిన ప్రకటన ఇది:
Malini Parthasarathy has resigned as Editor of The Hindu with immediate effect.
Suresh Nambath, National Editor, The Hindu, has been entrusted with the responsibility of managing the news and editorial operations of The Hindu until a new Editor is appointed.
The KSL Board has placed on record its appreciation of the contribution of Malini Parthasarathy as Editor of The Hindu. She will continue as a Wholetime Director of Kasturi & Sons Ltd.
N. Ram
Chairman of Kasturi & Sons Limited & Publisher of The Hindu
ముకుంద్ పద్మనాభన్ లేదా వేణు లేదా నిర్మలా లక్ష్మణ్ తదుపరి ఎడిటర్ కావచ్చని అంటున్నారు. అయితే, కారణాలు ఏవైనా... మాలిని ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ పత్రిక ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె హయాం లో ముంబాయి ఎడిషన్ ఆరంభం కావడం ఒక్కటి మినహా మిగిలినవన్నీ బాధాకరమైన నిర్ణయాలే అని చెన్నై ఆఫీసు లో అనుకుంటున్నారు. ఎడాపెడా బదిలీలు చేసి ఉద్యోగ అభద్రత సృష్టించడాన్ని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సీనియర్ ఎడిటర్లు సైతం మేడం ఎప్పడు సైతాను నిర్ణయం తీసుకుని ఇంటికి వెళ్ళిపొమ్మని అంటారేమో అని భయపడిన వారు ఇప్పుడు కొద్దిగైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు.
ముంబాయి ఎడిషన్ తేవడంలో ఎంతో కృషి చేసిన తెలుగు బిడ్డ శ్రీనివాస రెడ్డి గారిని వదులుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటి. ఆమె బాదితుడైన మరొక సీనియర్ జర్నలిస్టు మురళీధర్ రెడ్డి గారు మాత్రం ఇంకా హైదరాబాద్ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నారని భోగట్టా. సాధారణ ప్రజానీకం గురించి ఇప్పటికీ పట్టించుకుంటూ... రూరల్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్న 'ది హిందూ' కు మంచి రోజులు రావాలని ఆశిద్దాం.
1 comments:
మేనేజ్మేంటు మార్పే కాదు, హిందూ లో వస్తున్న వార్తలలో కూడా నాణ్యత తగ్గింది, ఎంతసేపూ కమ్యూనిజపు భావాలను రుద్దటం, ప్రభుత్వాన్ని నిరుత్సాహ పరచడం తప్ప వేరే యే ఇతర గొప్ప పనులనూ చేయలేక పోయింది, నిక్ఖచ్చి గా చెప్పాల్సిన వార్తలకు సొంత అభిప్రయపు రంగు పులిమి పాఠకులను మభ్యపెట్టడానికి శథ విధాలా ప్రయత్నిస్తూ వస్తున్నది, ఈ పత్రిక కమ్యూనిజపు భావాల కరపత్రిక అని తెలిసినా, ఎన్ రాం గారి హయాం లొ వార్తలు కొంచెం వార్తల్లాగానె వచ్చేవి, ఈమధ్య కాలంలో వార్తలు పోయి వార్తల ముసుగులోని అభిప్రాయాలను మాత్రమే చదవాల్సి వస్తోంది. గత పదహారు సంవత్సరాల పఠనం లో హిందూ పత్రిక గురించి నేను గమనించిన విషయం ఇదే.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి