Saturday, September 24, 2011

విఘ్నాలు, చిరాకుల మధ్య తిరుపతి టూరు...

'ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ' వారు పంపిన థర్డ్ క్లాస్ ఏ.సీ. టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడడంతో మన ప్రయాణం ప్రారభంయ్యింది. నారాయణాద్రిలో B-2 లో కంఫర్మ్ అయిన నా 16 నంబెర్ సీటులో కూర్చోగానే ఒక మహిళ వచ్చి సీటు తనదని, తన పేరు రైలుకు అంటించిన లిస్టులో కూడా వుందని వాదించింది. నేను బైటికి వెళ్లి లిస్టు చూస్తే గానీ తెలియలేదు....నన్ను HA-1 కు బదలాయించినట్లు. మళ్ళీ బోగీలోకి ఆదరాబాదరా వచ్చి బ్యాగు తీసుకుని HA-1 కు వెళ్లి నా సీట్లో సెటిల్ అయ్యాను. 

దక్షిణ భారత దేశ స్థాయి మహిళా జర్నలిస్టుల సెమినార్ అది. వారి సమస్యల మీద మాట్లాడడానికి చాలా ఉన్నాయి. దక్షిణాదిన అంతా అహో ఓహో అనుకునే ఆంగ్ల పత్రికలో ఒక పురుషాధముడి వల్ల ఒక మహిళా జర్నలిస్టు పడిన ఇబ్బందులు, బ్లాగులో తన అభిప్రాయలు నిర్మొహమాటంగా రాసుకుని ఉద్యోగం పోగొట్టుకుని ఇబ్బంది పడి భావ ప్రకటన స్వేచ్ఛకే పెద్దపీట వేసిన   ఒక టీ.వీ.యాంకర్ ను కేస్ స్టడీ గా తీసుకుని సీనియర్ జర్నలిస్టు అఖిలేశ్వరి గారు చేసిన పరిశోధనలో వెలికిచూసిన వాస్తవాలను వివరిస్తే సముచితంగా ఉంటుందని అనుకుని బెర్తు ఎక్కగానే ప్రేపరేషన్ మొదలుపెట్టాను. 

అక్కడ ఒకటే బొద్దింకలు, గబ్బు వాసన. అపరిచితుడు రామం గుర్తుకు వచ్చాడు. ఇంతలో...కింది బెర్తులో ఒక అపరిచితుడు ఫోన్ లో సీరియస్ గా ఎవరినో ఆదేశిస్తున్నాడు..."నువ్వు నెట్ లో చేస్తావో...ఎలా చేస్తావో తెలియదు. నాకు ఐదు కావాలి. పిల్లలు అడిగారు..." అని చెప్పాడు. ఆయన మాటలను బట్టి, వేషాన్ని బట్టి....మనోడొక క్యాష్ పార్టీ అనీ, ఎవడ్నో సినిమా టికెట్ల కోసం వేధిస్తున్నట్లు అర్థమయ్యింది. కాసేపట్లో నా ప్రిపరేషన్ పూర్తయ్యింది... బొద్దింకల వాసన మధ్య, కింది అపరిచితుడి ఎడతెగని ఫోన్ సంభాషణల శబ్ద కాలుష్యం మధ్య. చెపాతీ వద్దని... కావాలని కలిపించుకుని తీసుకుపోయిన కొత్తిమీర పచ్చడి అన్నం తిని నిద్రకు ఉపక్రమించాను. 

తిరుపతిలో దిగాను. ప్రెస్ అకాడమీ వారు పంపిన ఒక ఉద్యోగి రైలు దగ్గర ఎదురుచూడడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కారు సిద్ధంగా ఉందని చెప్పాడాయన. ఒక టీ తాగి కారు ఎక్కుదామని స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ లో ఆగాము. ఆ ఉద్యోగి నన్ను బిల్లు కట్టనివ్వలేదు. కారు కోసం వెతికి ఫోన్ చేస్తే తెలిసింది ఏమిటంటే...రాంగ్ పార్కింగ్ లో పెట్టినందుకు అప్పుడే పోలీసు వారు గాలి తీసేస్తే...మళ్ళీ గాలి నింపించుకోవడానికి కారు వెళ్లిందని. ఆ ఎదురు చూపుకన్నా నయమని ఆటో మాట్లాడుకుని శ్రీనివాసం గెస్టు హౌస్ కు వెళ్ళాం. ఇచ్చిన రూం ఓపెన్ చేస్తే...ఒకటే దోమలు. పక్క మీద చీమలు. వాటితో మనకేమి పని అని...స్నానం చేసి..మళ్ళీ స్పీచ్ ను పునశ్చరణ చేసి అధికారులతో కలిసి వేదిక దగ్గరకు వెళ్లాను. ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేందర్ గారిని కలిసాను. రోశయ్య గారు ఏరికోరి నియమించిన జర్నలిస్టు. 

ఇన్విటేషన్ లో నా కోసం కేటాయించిన గంట స్పీచ్ కాస్తా...పావుగంటకు కుదించారు. కనుమూరి బాపిరాజు గారి ప్రసంగానికి అనువుగా కార్యక్రమాలు సవరించాల్సి వచ్చింది పాపం. ఆంధ్రాలో మీడియా ఎలా బ్రష్టు పట్టిందీ.. ఎలాంటి మహానుభావులు మీడియా అధిపతులు అవుతున్నదీ...నా సహధర్మచారిణి సాంగత్యం వల్ల నేను నేర్చుకుని ఆచరిస్తున్న నైతిక సూత్రాలు...వగైరా విషయాలు క్లుప్తంగా మాట్లాడి...అఖిలేశ్వరి గారి సర్వే ఫలితాలను చదివి అనుకున్న సమయంకన్నా ఐదు నిమిషాలు తీసుకుని ముగించాను. 

ఇంతలో...దర్శనానికి కారు సిద్ధమని ఒక అధికారి వేదిక మీదకు వచ్చి చెవులో చెప్పారు...ముందుగా అనుకున్న ప్రకారం. పైరవీ చేసి దర్శనం చేసుకోవడం మనకు నచ్చని వ్యవహారం కాబట్టి...300 పెట్టి శీఘ్ర దర్శనం కోసం వెళ్తానని చెప్పి కారు డోర్ వేసేలోపు కడప జిల్లా డివిజినల్ పీ.ఆర్.ఓ.ను నా వెంబడి పంపారు...తోడు ఉంటాడని. అక్కడ మొదలయ్యింది అసలు అంకం.

ఈ డివిజినల్ పీ.ఆర్.ఓ. కనిపించిన ప్రతి ఒక్కడికీ..."హైదరాబాద్ ప్రెస్ వాళ్ళ"ని నన్ను, నాతో వచ్చిన మిత్రుడ్ని చూపించడం...నాకు ఇబ్బంది కలిగించింది. దర్శనం మొదలయ్యే చోట ఒక పోలీసోడికి మన వాడు మమ్మల్ని చూపిన తీరు...'పాపం కుష్టు వాళ్లండీ..కాస్త దయచూపండి..." అన్నట్లు అనిపించింది. నిజానికి ఆ పోలీసోడు మాకు చేసే సహాయం ఏమీ లేదు.  డబ్బులు పెట్టి కొన్న టికెట్లు. క్యూలో నిల్చొని ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా వెళ్దామని చెప్పాను. ఇంకాసేపట్లో దర్శనం అవుతుందనగా...డివిజినల్ పీ.ఆర్.ఓ. గారు పైరవీ చేసి కొద్ది దగ్గరి దారిలో తీసుకుపోతుంటే...మనసుకు ఇబ్బంది కలిగినా...కుక్కలా తనతో పాటు ఉరకక తప్పలేదు. మిగిలిన వారు లైన్లో వస్తుండగా...మేమలా షార్ట్ కట్ తీసుకోవడం తలనరికేసినట్లు అయ్యింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న మనసు కలతపడింది.   

వెంకన్న ఎదురుగా దర్శనం దగ్గర జనాలను లాగి అవతల పారేసే వారికి కూడా...ఏదో చెప్పినట్లు వున్నాడు...డివిజినల్ పీ.ఆర్.ఓ. గారు. మమల్ని మరీ నెట్టి పారేయలేదు. అది అయ్యాక...అక్కడ తీర్థం ఇస్తుంటే...కూడా...ఎక్కువ నీళ్ళ కోసం పైరవీ చేయబోతే...నేను 'ఆగండి సార్..' అని వారించాను. బైట ఉచిత ప్రసాదం నిజానికి నాకు చాల ఇష్టమైన ప్రదేశం. అక్కడ వేడివేడిగా చిన్న ఇస్తరాకు గిన్నెల్లో మంచి ఫుడ్డు ఇస్తారు. అక్కడా ...."నేను పీ.ఆర్.డిపార్టుమెంటు"...అని మన సారు నిస్సిగ్గుగా..అదనపు ఫుడ్డు కొట్టేస్తే నాకు పరమ ఎబ్బెట్టుగా అనిపించింది. దాన్ని తీసుకొచ్చి..."మీ కోసమే సార్..." అని నా చేతిలో పెట్టాడు...వద్దన్నా వినకుండా. హతవిధీ.

ఇలా స్వకార్యం స్వామి కార్యం ముగించుకొని...సాయంత్రానికి తిరుగు ప్రయాణం ఆరంభించాను. అప్పుడు చెప్పారు...'మీ పేరు మీద టికెట్ లేదు...వేరే వారి పేరు మీద నారాయణాద్రిలో 3 AC లో ప్రయాణించాలని.' నా గుండె జారింది. ఇలాంటి పని చేసి...అడ్రస్ ప్రూఫ్ ఇవ్వలేక దొరికిపోతే పరువు పంచనామా అవుతుంది. ఇదే  సంశయం వెలిబుచ్చితే...ప్రెస్ వాళ్ళమని చెప్పండని...అంతకూ కాకపొతే...ఆ పక్కన ఇదే సెమినార్ కు వచ్చిన జర్నలిస్టుల సహాయం తీసుకోండని....నవ్వుతూ తుళ్ళుతూ ఆనందిస్తున్న ఒక అమ్మాయిల గుంపును చూపారు...ప్రెస్ అకాడమీ సిబ్బంది. ఆ టికెట్ లో ఉన్న ప్రకారం నా పేరు...సూరి బాబు...వయస్సు యాభై ఏళ్ళు. :)

ఇక టీ.సీ.గారి కోసం...గుండెలు అరచేతిలో పట్టుకుని కూర్చున్నాను. ఆయన రాకపోయే సరికి ఒక నిద్ర పోయాను. తొమ్మిది ప్రాంతంలో అనుకుంటా....టీ.సీ.గారు రానే వచ్చారు. టికెట్ చూస్తూనే...'ఐ.డీ. ఇవ్వండి' అన్నాడు. ఖతం రా బాబూ...అని ఇదేమి ఖర్మ పట్టిందిరా...రోజూ బ్లాగులో సుద్దులు చెపుతూ ఇలా దొరికిపోతున్నామా...నా అవస్థ చూసి ఈ ఆడ పిల్లలు ఏమి అనుకుంటారో కదా...అనుకుంటూ...అవమాన భారం ఆవరించగా అతికష్టం మీద మిడిల్ బెర్తు నుంచి దిగేందుకు ఉపక్రమించాను. తదుపరి...కార్యాచరణ ఏమిటా..అనుకుంటూ ఉండగానే...'ఐ.డీ.ఉందిగా....' అన్నాడు టీ.సీ.. "వా ఎస్..." అన్నట్లు ఒక సారి బర్రె లాగా తల ఆడించా నున్నటి గుండుతో. 'సరే..పడుకోండి' అన్నాడు. అబద్ధం ఫలించింది. గండం గడిచినా...అవమానంతో నిద్రపట్టి చావలేదు. ఈ సారి సైడు బెర్తులో ఒకతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు. "నువ్వు ఏమిచేస్తావో నాకు తెలియదని చెప్పా కదా...ఒక్క ఐదు చాలు.." అన్న సుపరిచిత కంఠం వినిపించింది. తెర తొలగించి చూస్తే...నాకు నిన్న కనిపించిన  అపరిచితుడే. అదే ట్రైన్ లో వస్తున్నాడు. టీ.సి., ఐ.డీ.టెన్షన్ లో ఉండడం వల్ల వాడ్ని పలకరించకుండా నిద్రకు ఉపక్రమించాను.  

టీ.సీ.వెళ్ళాడని నిర్ధరించుకుని మొహం కడిగేందుకు టాయ్లెట్ దగ్గరకు వెళితే అక్కడ సఫారీ వాళ్ళను, కుక్కలను చూస్తె తెలిసింది...చంద్రబాబు గారు నెల్లూరు లో అదే ట్రైన్ ఎక్కబోతున్నారని. తర్వాత కాసేపటికి రైలు వెంకటాచలం దగ్గర ఆగితే...తెలిసింది...అపుడే వెళ్ళిన గూడ్సు నుంచి  ఏవో ఇనుప వస్తువులు ట్రాక్ మీద పడి రైళ్ళ రాకపోకలకు  ఆలస్యమవుతుందని. లాభం లేదని చంద్రబాబు రోడ్డు మార్గం గుండా తిరుపతి వెళ్ళారని. ఇంతలో ఎంతో ఉత్సాహవంతుడైన హెచ్.ఎం.టీ.వీ.తిరుపతి రిపోర్టర్ విశ్వనాథ్ ఫోన్ చేసారు. రైలు ఆలస్యానికి కారణం చెబుతూ...డిన్నర్ అయిందా అంటే...లేదని చెప్పాను. అదేంటని...మనవాడు నెల్లూరు లో ఉన్న ఒక రిపోర్టర్ ద్వారా పెరుగన్నం పంపుతానన్నాడు. డబ్బులు తీసుకునేట్లయితేనే పంపమన్నాను. సరే...అన్నాడు. 

పాపం...చెమటలు కక్కుతూ...పదకొండు ప్రాంతంలో నన్ను వెతుకుతూ ఒకబ్బాయి నెల్లూరు స్టేషన్లో నా బోగీ లోకి వచ్చాడు. నా చేతిలో ఫుడ్డు ప్యాక్, అరటిపండ్లు, నీళ్ళ బాటిల్ పెట్టాడు. చేబులో డబ్బులు కుక్కినా...తిరిగి ఇచ్చి..ప్లీజ్ సార్...అంటూ వెళ్ళిపోయాడు...కదులుతున్న రైలు దూకి. ఈ ఫ్రీ వ్యవహారం నాకు సహించదు. అనవసరంగా తినలేదని చెప్పానే... అని అనుకున్నాను. అయినా లాభం లేదు. ఇష్టం లేని వ్యవహారాలూ చాలా చేస్తున్నానీ టూర్లో. 

శుక్రవారం (September 23) తెల్లవారింది. ఏడయ్యింది. మన అపరిచితుడు టాయ్లెట్ ఏరియాలో తారసపడ్డాడు. 'పిల్లలు అక్కడ దొరకక పొతే...ఇంకొక థియేటర్ కు వెళ్లారట...' అని చెబుతున్నాడు ఫోన్ లో ఎవరితోనో. దొంగ టికెట్లు అమ్మటానికో, సంతానానికి సినిమాలు చూపించాదానికో ఈ వెధవ పుట్టినట్లు ఉన్నాడని అనిపించింది.  ఇక ఆగలేక..."హలో సార్...కలిసి నిన్న ప్రయాణం చేసాం...ఈ రోజూ చేస్తున్నాం.." అన్నాను. వాడేదో జాతరకు వెళ్లి వస్తున్నాడట.  ఇక ఆగడం నా వల్ల కాక..."ఏమిటి సార్....ఏదో సినెమా టికెట్ల కోసం బాగా ట్రై చేస్తున్నట్లు వున్నారు..." అని అడిగా...ఏదైతే ఆదవుతుందని. "దూకుడు సినెమా టికెట్ల కోసం. బాబు, ఫ్రెండ్స్ వెళ్తానంటే..." అని గార పళ్ళతో నవ్వాడు.  "మరి పాపో..." అని అడిగా ఒట్టిగా...."ఇక్కడ లేదు. మణిపాల్ యూనివెర్సిటీ లో జర్నలిజం కోర్సు జేస్తంది..." అని చెప్పాడు...నా అపరిచితుడు. ఈ సిన్మాలు, ఈ జర్నలిజం వర్ధిల్లుగాక. 

ఇలాంటి అనుభవాలను మిగిల్చి....మొత్తం మీద మూడు గంటలు ఆలస్యంగా ఆగుతూ....నడుస్తూ...నారాయణాద్రి సికిందరాబాదు చేరుకుంది. ఈ ఒక రోజు టూరు సందర్భంగా నా నున్నటి గుండు సాక్షిగా ఒక తీర్మానం చేసుకున్నా...కంఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణాలు చెయ్యకూడదని, ఉచిత సేవలు చచ్చినా స్వీకరించకూడదని. ఈ కథంతా ఈ రోజు లంచ్ చేస్తూ...ఇదే కథాక్రమంలో చెబితే...భార్యా పిల్లలు పగలపడి నవ్వారు. చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయంటారు కదా!

Friday, September 23, 2011

International Media Ethics Day Today (Sep 23)

Following is the story I submitted to The Hans India's editorial section. An abridged version of this appeared in today's issue. This full version is for you. 
Ramu
---------------------------------------- 
Groping for Ethics in Telugu media
By Ramu S
‘International Media Ethics Day’ today (September 23)
------------------------------------------------------
“Yours was not, in the beginning, a criminal nature, but circumstances changed it. At the age of nine, you stole sugar. At the age of fifteen you stole money. At twenty you stole horses. At twenty-five you committed arson. At thirty, hardened in crime, you became an editor. You are now a public lecturer. Worse things are in store for you. You will be sent to Congress.”
A celebrated fortune-teller thus reveals the past of a man in Mark Twain’s short story “Lionizing Murderers.” One of the finest rural reporters of our times and a fabulous public speaker Palagummi Sainath, Everybody Loves a Good Drought-fame, would quote this in his lectures on media. Alas, the dialogue would always meet with a thunderous applause from the audience. The reverberating sound is the reflection of the public frustration against the media, once the messianic institution in this great country.

I always feel that the fortune-teller mistook the “owner” of a newspaper to an “an editor.” Starting from Rupert Murdoch, to Alexander Lebedev to many media owners in Andhra Pradesh, we have umpteen number of live examples to refer to when we talk about “media ethics.” And, ‘the International Media Ethics Day’ being observed by the Centre for International Media Ethics (CIME), a non-profit organisation that strives for media ethics, today provides us a perfect setting to talk about the most pertinent issue related to the fourth estate and obviously Andhra Pradesh indeed is the perfect case study for the subject thanks to the ever-expanding media industry and the kind of people (businessmen, politicians, film personalities, realtors, criminals, crooks and their ilk) it has been attracting. Barring one or two well-behaved ethical media houses, the ‘agendas’ of other newspapers and news channels are clear, much to the dismay of poor readers/ viewers, who are forced to buy or view more than two papers/two channels to get the first hand information on any given issue.
The aim of the ‘Media Ethics Day’, according to the CIME, is to mobilize the journalism community and provide journalists around the world with an opportunity to discuss media ethics issues, examine case studies, and participate in role-plays and debates related to the various ethical dilemmas they might expect to face on the job.
Besides several on-site events around the world, additional activities will be available online for journalists whose limited resources prevent them from participating in person, says the CIME website (http://www.cimethics.org/).
Ethics and Journalists
Press Commissions and United Nations, MacBride report (Many Voices and One World) and other agencies time and again stress the need of a free press in creating public opinion, a key component for a sound democracy. Hence the “messengers” in the cycle of communication are expected to be ethical lest the ‘public opinion’ would go for a toss. Truth, nothing but truth, should be their mission but in this market-driven economy truth is distorted and consent is manufactured to suit to the needs of companies or individuals. Consequently, most of the media houses lost credibility and journalists lost the confidence of public.   
David Randall (The Universal Journalist, second edition, Pluto Press, 2000) says: “To the outsider, journalism and ethics are about as incongruous a mixture as you can get. Even to put the two words in the same sentence is to risk reducing the listener to helpless laughter. To the insider on a mass-market tabloid, ethics are largely an irrelevance… Lecturing these journalists about ethics is as pointless as advocating celibacy to sailors arriving in port after six months at sea.”
Indians can’t stomach bad journalism. They keep a tab on the unsavory trends in media, quickly pinpoint the chinks and lament over them despite the nonchalant attitude of the media houses. In the wake of the patriotic role played by the media during the freedom struggle as well as its watchdog role during the emergency, Indians see a great institution in the media irrespective of the mega transformation that took place in political, social, financial and ethical spheres. That’s why ethical behavior of the media is under constant scrutiny both within and outside of the media industry.
When H.Eugene Goodwin, the former reporter and columnist for The Washington Star and night editor for Associated Press and a professor of Journalism at Pennsylvania University, told his pals that he was doing a book on journalism ethics, he got some interesting reactions like this:
 “What ethics?”
 “Will it be a comic book?”
 “Will the right people read it?”
Later he says in the preface of his book (Groping for Ethics in Journalism, IOWA State University Press, 1983): “I do not agree with the attitude toward journalism expressed in those only half-kidding reactions, but I understand it. Journalism is not held in high esteem by many people in this country, some of whom are journalists. Many see journalism as a tawdry calling, practiced often by unprincipled boors.”
What Mr.Lebedev, owner of two British newspapers Independent and Evening Standard and co-owner of the Russian newspaper Novaya Gazeta, did to a fellow guest in a television studio during a debate gives credence to the observations of Mark Twain and Eugene Goodwin. The intolerant oligarch hit a former real estate businessman Sergei Polonsky with two right hooks, sending him off the back of the studio platform. The closest ally of the erstwhile USSR president Mikhail Gorbachev and the largest private shareholder in Aeroflot, later claimed that “I neutralized him.”
‘Critical Situation’ for all

“In a critical situation, there is no choice. I see no reason to be hit with the first shot. I neutralized him,” Lebedev justified his act in his blog forcing me recollect the media mogul Cherukuri Ramoji Rao’s justification to support the ouster of the then Chief Minister Nandamuri Taraka Rama Rao and anointment of the latter’s son-in-law N.Chandrababu Naidu during the“August crisis” of 1995. The Telugus, who had witnessed the successful joint operation of N.T.Rama Rao and Ch.Ramoji Rao and Telugu Desam Party and Eenadu newspaper to dump the Congress to “save our self-respect” in 1982-83, were in for a shock with the way N.Chandrababu Naidu was made the Chief Minister in a modern day coup. The colossal politician by that time, NTR, who had won 226 of 294 Assembly seats hands down in 1994, was dumped unceremoniously because the conspirators, with active involvement of the press, also saw “a critical situation let them with no choice” like Lebedev.
War among Newspapers
The then Chief Minister Y.S.Rajasekhara Reddy later felt the need of owning a media empire to face Eenadu in “critical situation” and launched Saakshi newspaper and a television channel. YS Jaganmohan Reddy, the owner of Jagathi publications, which owns Saakshi, is under scanner for the flow of investments he received during his dad’s regime. The Central Bureau of Investigation (CBI) is after him and his cronies to find the path of the mind-boggling flow of funds to Saakshi. An entrepreneur Nookarapu Suryaprakasha Rao found that in the “critical” caste conundrum of AP politics, backward castes should have a voice and he gave birth to Surya, a Telugu daily. But he was arrested by CBI sleuths in a land grabbing case recently. At a “critical juncture” where the separate Telangana movement reached its zenith, its supporters launched Namaste Telangana along with a T-channel to air their views as well as to “checkmate the dominance of Andhra media.”
With a very few exceptions, the media in Andhra Pradesh has divided on political lines. Negative trends such as trivialization of news, dumbing down, editorliasation of news, sensationalisation of stories, planting of stories, over emphasis on crime & film, vulgarity, page-3 stuff and allegations and counter allegations among the rival newspapers have become the hallmark of the industry now. ‘Paid news’ is the deadliest among all ailments and it has left ethics to the winds.  One may get surprised to know that no newspaper in Andhra Pradesh prepared a set of guidelines or a code of conduct for its journalists.
At a time “media ethics” is taking a severe beating across the globe, a crucial meet of the Liberal Democrats in UK proposed heavy fines for newspapers that break the code of conduct. The party believes the fine would act as a real deterrent, and change the culture of newspapers in the wake of the phone-hacking scandal at News International. In this “very critical” media environment in India in general and Andhra Pradesh in particular, this proposal may not sound like a bad idea for manys.
For sure there would be a hue and cry over this proposal. Before this idea gets a shape in all democracies, journalists and media houses should be constantly reminded of the following ten “absolutes” suggested by the Thomson Reuters Foundation Ethics Handbook:
1. Always hold accuracy sacrosanct
2. Always correct an error openly
3. Always strive for balance and freedom from bias
4. Always reveal a conflict of interest to a manager/senior editor
5. Always respect privileged information
6. Always protect their sources from the authorities
7. Always guard against putting their opinion in a story or editorialising
8. Never fabricate or plagiarise
9. Never alter a still or moving image beyond the requirements of normal image enhancement
10. Never pay a source for a story and never accept a bribe.

(Note: The author is the Dean of Indian School of Journalism and visiting professor at University of Hyderabad. He worked with Mail Today, The Hindu and Eenadu, all put together for two decades.)
eom

Wednesday, September 21, 2011

స్కూలు పిల్లలకు పండగ కాలం...జై తెలంగాణా

పొద్దున్నే మెహిదీపట్నం రైతు బజార్ నుంచి తెచ్చిన చింతకాయలతో పప్పు, కొత్తిమీరతో పచ్చడి, అరటిపండుతో పెరుగన్నం తింటూ...తెలంగాణా అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసాను...డైనింగ్ టేబుల్ చుట్టూ ఉన్న ఐదుగురితో. 

స్కూలు లేదని, హిందీ పరీక్ష పోస్ట్ పోన్ అయ్యిందని నా ఫోన్ కు స్కూలు నుంచి వచ్చిన ఎస్.ఎం.ఎస్.తో వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ల మాదిరి ఆనంద తాండవం చేసిన నా కుమారుడు ఫిదేల్  తో ఈ కసరత్తు ప్రారంభమయ్యింది. "తెలంగాణా వస్తే కష్టం...బందులు వుండవు...స్కూలు ఉంటుంది..." అని  మా వాబందులతో   జనం చస్తున్నారు, రాష్ట్రానికి నష్టమని చెప్పి...నా కూతురు మైత్రేయి అభిప్రాయం అడిగాను. 

అంతకు కొద్ది సేపటి కిందటే...కాలేజీకి సెలవలు ఇచ్చారని వెలిగే మొహంతో చెప్పిన ఆమెమాత్రం "తెలంగాణా కావాలి....బందులు కావాలి..." అని చెప్పింది. తెలంగాణా ఎందుకంటే...ఉద్యోగాలు వస్తాయట, నీళ్ళు వస్తాయట. 

ఇక...ఖమ్మం లో ఇంజినీరింగ్ చేసి...ఉద్యోగ వేటలో ఒక మూడు నెలలుగా మాతో ఉంటున్న హేమ అక్క కొడుకుని ఇదే ప్రశ్న వేశాను. "తెలంగాణా వద్దు...బందులు వద్దు" అని మనవాడు చెప్పాడు. మరి నీకు వుద్యోగం వస్తుందట...అని అంటే..."చాలా లేట్ అవుతోంది..." అని తను అన్నాడు. 

ఇక తెలంగాణా అవసరం ఉందని హేమ స్పష్టం చేసింది. నల్గొండలో రిపోర్టర్ గా పనిచేసినప్పుడు ఆమె కన్వీన్స్ అయ్యింది. తెలంగాణా ఇవ్వకపోవడం ఇక దారుణమని నా అభిప్రాయం కూడా. పోయిన వై.ఎస్.ను ఏమీ చేయలేము గనక అంత ప్రకటన చేసి మోసం చేసి జనాల మధ్య అభిప్రాయ బేధాలు మరీ ఎక్కువ చేసిన చిదంబరం, మన్మోహన్, సోనియాలను చింత బరికలతో పీకాలని నాకుంది. 

మరి నీ సంగతేంటి...అని (కర్నాటక నుంచి వచ్చి) ఇళ్ళల్లో పనిచేసుకు బతుకుతున్న మా మెయిడ్ ను అడిగాను. "ఆ విషయాలు నాకేమి తెలుస్తాయి అయ్యా..." అని ఆమె అన్నది. ఫేసు బుక్ లో "Now it is our turn to put our status as Jai Telangana" అని తన కాలేజ్ మేట్స్ అంటున్నారని నా కూతురు చెప్పింది. 

మొత్తంమీద నాకు అర్థం మయ్యింది ఏమిటంటే...పిల్లలకు చదువులంటే ప్రేమ ఏ మాత్రం లేదని. చదువును వీరు కష్టంగా భావిస్తున్నారని. నాకు తెలిసిన చాలా మంది పిల్లలు బందులు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. మా వాళ్ళు మాత్రమే ఇలానా? మీ జనాలూ అంతేనా? నేను...ఈ లోపు తిరుపతిలో దక్షిణ భారత స్థాయి సెమినార్ లో పాల్గొని వస్తాను. ఈ లోపు మీ పిల్లల స్పందన ఏమిటో తెలియజేయండి.   

Monday, September 19, 2011

"పిశాచగణం పిచ్చి వీరంగం": చేగు"వేరా" చిందులు

చేగు"వేరా"కు కోపం వచ్చింది. అందుకే పందితో మొదలు పెట్టారు...ఈ రోజు మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో. చివరకు "ప్రజలే తేల్చుకోవాలి' అని ఆయన దీన్ని ముగించారు. మీరంతా "ఆంధ్రజ్యోతి" తెప్పించుకుంటారో లేదో అన్న అనుమానంతో మీ కోసం దీన్ని ఇక్కడ ఇస్తున్నా...వేరా సౌజన్యంతో. దీని మీద నా విశ్లేషణ నేను ఇస్తాను. దీనికి ఫర్ గా గానీ అగెనెస్ట్ గా గానీ మీరు రాస్తే నేను ప్రచురిస్తాను. మన "చే" వాదన మీకు నచ్చితే నాకు రాయండి. "ఛీ ఛీ" అనిపించినా రాయండి. ఇది చూడగానే..."ఛీ..ఛీ..థూ...థూ...తూడ్త్" అని నాకు ఎందుకు అనిపించిందో పాయింట్ల వారీగా త్వరలో నేను రాస్తాను. పిచ్చివాడి చేయిలో రాయి, కోతికి కొబ్బరికాయ..ఎంత ప్రమాదమో చూద్దాం. ఈ లోపు మీ అభిప్రాయం రాయండి..మీ..రాము
------------------------------------------------------------------------ 
శీర్షిక: పిశాచగణం పిచ్చి వీరంగం
- వి. రాధాకృష్ణ

హైదరాబాద్, సెప్టెంబర్ 18 : పందికేం తెలుసు పన్నీరు వాసన! జర్నలిజం గురించి, దాని విలువల గురించి రాష్ట్రంలో ఇప్పుడు పిశాచగణాలు గావుకేకలు పెడుతున్నాయి. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసి, ఆ ధన మదంతో అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీద పడ్డ జగన్ పార్టీకి చెందిన రాంబాబు అండ్ కో... నా మీద, ఏబీఎన్ చానెల్‌పైనా వేసిన, వేస్తున్న రంకెలపై స్పందించవలసిన అవసరం లేదు. అయితే, సభ్య సమాజం తలదించుకునే రీతిలో రాంబాబు అండ్ కో చేసిన కొన్ని ఆరోపణలపై వారి కోసం కాకపోయినా ప్రజల కోసం స్పందించాల్సి వస్తున్నది.

రాంబాబు రాసలీలలపై ఏబీఎన్‌లో ప్రసారమైన కథనాన్ని ఎవరు రూపొందించినా, దాన్ని ప్రసారం చేసినందుకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఆ కథనంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పవలసింది పోయి, తాను బురదలో పొర్లుతూ, నన్ను అందులోకి లాగడానికి రాంబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నది. నాపై వ్యక్తిగతంగా ఈ పిశాచగణం చేసిన వ్యాఖ్యలను ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి వారికి వత్తాసు పలుకుతున్న రోత పత్రిక, రోత చానెల్ కూడా సిద్ధపడలేదంటే... ఆ నోటి నీచత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాంబాబు అండ్ కో ఈ దిగజారుడు ఆరోపణలు చేశారని తెలుసుకోలేనంత అమాయకుడిని కాను. ఇలాంటి కారుకూతలు, నా మనోస్థైర్యాన్ని ఇసుమంతైనా సడలించలేవని వారు తెలుసుకోవాలి. రాసలీలల కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత, రాంబాబు మద్దతుదారులమని చెప్పుకొన్న వారు నాకు ఫోన్ చేసి దూషించడమే కాకుండా, చంపుతామని కూడా బెదిరించారు.

'వేమూరి రాధాకృష్ణకు ఏదైనా జరిగితే మా బాధ్యత లేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ కూడా విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ముందు ముందు భౌతిక దాడులకు కూడా తాము సిద్ధమని, ఫ్యాక్షన్ నీడలో ఎదిగిన తమ నైజాన్ని చాటుకున్నారు. అయితే, నీతి బాహ్యమైన ఈ ముఠా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది! నేను దాడులకు భయపడను. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ తమ దమ్మున్న పంథా నుంచి వెనుదిరిగే ప్రసక్తేలేదు. ఏనాడైతే ఆంధ్రజ్యోతి బాధ్యతలు చేపట్టానో, ఆనాడే అన్నింటికీ సిద్ధపడ్డాను. ఇలాంటి చిల్లర మనుషుల బెదిరింపులకు బెదిరిపోయేంత బలహీనుడిని కాను.

వాస్తవానికి అంబటి అండ్ కో ఆరోపణలపై స్పందించకూడదనే అనుకున్నాం. అయితే, 'మేం ఏం చేశామని అంబటి మమ్మల్ని బజారులోకి లాగాడు?' అని మా సంస్థల్లో పని చేస్తున్న మహిళా సిబ్బంది ఆవేదనతో అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. రాంబాబు అండ్ కో నీచ ఆరోపణలు ముందు ముందు ఇతర చానళ్లు, పత్రికలకూ విస్తరించవచ్చు. ఇవాళ మా సిబ్బంది అడిగిన ప్రశ్నే రేపు ఇతర చానెళ్లు, ఇతర పత్రికల సిబ్బంది కూడా తమ యాజమాన్యాలను అడగొచ్చు. అప్పుడు వారు మాత్రం ఏం సమాధానం చెబుతారు? ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సాగిస్తున్న అక్షర సమరంలో సిబ్బంది సమిధలు కాకూడదన్నదే నా పాలసీ.

ఒక నీచ సంప్రదాయానికి తెర తీసిన రాంబాబు అండ్ కో ఒక్క విషయం మర్చిపోయారు. వారి నాయకుడు జగన్ కూడా ఒక పత్రిక, ఒక చానెల్ నడుపుతున్నారు. భవిష్యత్తులో ఆయనపై ప్రత్యర్థులు ఇలాంటి కువిమర్శలు చేయరన్న గ్యారంటీ ఏముంది? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని ఎవరైనా అంటే అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ నేనో విషయం స్పష్టం చేయదలచుకున్నాను. మీకు నాపై కక్ష ఉంటే మీ శక్తిమేరకు ఆరోపణలు చేయండి.

ఇంకా కోపం తగ్గకపోతే, నన్ను భౌతికంగా దెబ్బతీయడానికైనా ప్రయత్నించండి. అంతేకానీ, పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిలను మీ రొచ్చులోకి లాగకండి. నన్ను మానసికంగా, శారీరకంగా దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. కనీస విలువలకైనా కట్టుబడి ఉండకుండా... మా పార్టీ తీరే ఇంత! మా పార్టీలో ఉండేవాళ్లంతా ఇలాగే ఉంటారు, ఉండాలి అని జగన్‌గానీ, ఆ పార్టీకి చెందిన మహిళా నేతలుగానీ భావిస్తే వారి ఇష్టం! అచ్చోసిన ఆంబోతులతో కూడిన జగన్ పార్టీ నైజం గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరడం మినహా, ఇలాంటి సందర్భంలో చేయగలిగిందేమీ లేదు.

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో... నీతి, నిజాయితీలతో మెలగడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో మనోనిబ్బరం కావాలి. అది నాకు పుష్కలంగా ఉంది. ఉన్నది పోతుందన్న భయం కానీ, లేనిది కావాలన్న పేరాశ కానీ నాకు లేవు. అందుకే ఇలా ఉండగలుగుతున్నాను. ఉంటాను కూడా. అయితే, కనీస విలువలు లేనివాళ్లు రాజకీయ నాయకులుగా చలామణి కావడమే అన్నింటికంటే విషాదం. ఈ విషాదాన్ని మౌనంగా భరిస్తారా? లేక, ప్రతిఘటించి తరిమి కొడతారా? అన్నది ప్రజలే తేల్చుకోవాలి.

Sunday, September 18, 2011

అంబటి రాంబాబు "రాసలీల": దమ్మున్న చేగు"వేరా" వీర పోరాటం

పుట్టపర్తి సత్యసాయి బాబా గారు పరమపదించాక....ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని నేను ఎదురు చూస్తుంటే...చివరకు ఒకడు దొరికాడు. ఇప్పుడాయన...యువత ఎలా ఉండాలో ఉద్భోదిస్తున్నారు, అవినీతిని ఎలా నిర్మూలించాలో చెబుతున్నారు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఎలా మెలగాలో స్పష్టం చేస్తున్నారు. ఆయనే...మన వేమూరి రాధాకృష్ణ అలియాస్ వేరా. మన తెలుగు జనం పాలిటి పోరాట యోధుడు లాంటి చేగువేరా.

కాలేజీలకు వెళ్లి పిల్లలకు ఉద్భోదలు చేసే చేగువేరా...సంస్కృతి పరిరక్షణలో వీరత్వాన్ని చూపుకోవడానికి ఒక మంచి మసాలా దొరికింది. అదే...జగన్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒకమ్మాయితో ఫోన్ లో చెబుతున్నట్లు ABJ- Andhra Jyothi ఛానల్ ప్రసారం చేసిన కథనం. ఒక గవర్నర్ రాసలీలలు బైట పెట్టిన దమ్మున్న ఛానల్ ఇప్పుడు రాంబాబు మీద పడింది. 

రాంబాబు ఏమైనా రాముడా? ఈ తొక్కలో రాజకీయ నేతలంతా దాదాపుగా దగుల్బాజీ గాళ్ళే. అమ్మాయిల పిచ్చి లేనోళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసిన నేతలు చిత్తకార్తే కుక్కలు. ఈ కుక్కల ఆగడాల వల్లనే చాలా మంది మహిళలు రాజకీయాలలోకి రాలేకపోతున్నారు. వీళ్ళే కాదు...ఫోన్లు టాప్ చేస్తే...పొద్దున్న లేచిన దగ్గరి నుంచి జనాలకు సుద్దులు చెప్పే జర్నలిస్టులు చాలా మంది కూడా మద పిచ్చిగాళ్ళేనని ఇట్టే తెలుస్తుంది. ఛానళ్ళల్ లో పనిచేసే సూపర్ సూపర్ జర్నలిస్టుల కథలు, యజమానుల రాసలీలలు రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది. నా పీహెచ్డీ అయ్యాక ఆ పని చేస్తే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నా. ఈ చెత్తగాళ్ళ కథలను మనమెందుకు మార్కెట్ చేసుకోకూడదు?  ఈ వెధవులు చాలా మంది కొంపలో పెళ్ళాం బిడ్డలను ఉంచుకుని...ఫీల్డులో చెత్త పనులు చేస్తూ సంసారాలు కూలుస్తున్నారు. ప్రతి ఛానల్ లో ఈ బ్యాచ్ పాతుకు పోయి ఉందన్నది బహిరంగ రహస్యం. 

ఈ సన్నాసుల టెలిఫోన్ల మీద ఆధారపడి కథనాలు ప్రసారం చేయడం ఒట్టి వేస్టు. సరే...అర్జెంటుగా జగన్ పార్టీ ని సన్మార్గంలో పెట్టాలని అనుకున్నా, అక్కడి మహిళలకు నిజంగానే రక్షణ కల్పించాలని అనుకున్నా...పధ్ధతి ఇది కాదు....పచ్చి రొడ్డ జర్నలిస్టు వేరా.

ఒకమ్మాయి వచ్చి నాతొ వేరా ఫోనులో చెత్త వాగుతున్నాడు. రికార్డు చేసాను...వేసుకుంటారా అంటే...ఎస్ అని సొంగ కార్చుకుంటూ దాన్ని ప్రసారం చేసే వాడిని జర్నలిస్టు అనరు. బేవార్స్ అంటారు. అది ప్రసారం చేసే ముందు...కనీసం రాంబాబు ను..."ఏం బాబూ..." అని అడగాల్సిన బాధ్యత వేరా బృందానికి లేదా? ప్రత్యర్ధిని భ్రష్టు పట్టించాలన్న తీట ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ .రాంబాబును వెర్షన్ కోసం పలకరిస్తే...తను ఏమైనా ఇవ్వజూపితే....తీసుకోక తప్పి చావదు కాబట్టి...మాట్లాడక పోవడమే ఉత్తమమని అనుకున్నట్లు వున్నారు...అక్కడి జర్నలిస్టులు. వీళ్ళు చేస్తున్నది జర్నలిజం కాదు...పచ్చి చీప్ మార్కెటింగ్ టెక్నిక్. 

సరే...వెర్షన్ లేకుండానే ఆ అమ్మాయి కథనాన్ని నమ్మి దాన్ని ప్రసారం చేసారు అనుకుందాం. ఆ కాపీ రాసే విధానం ఏమిటి? అందులో వాడే పదజాలం ఏమిటి? ఆర్కే పేరిట వచ్చిన ఒక వ్యాఖ్యాత్మక కథనంలో వాడిన పదజాలం...వీధి రౌడీలు తొడకొట్టి సవాల్ అన్నట్లు ఉంది. పైగా...ఈ స్టోరీ లు వాడినప్పుడు యాంకర్లు గా, వాయిస్ ఓవర్ కూ అమ్మాయిలను వాడారు...బహుశా కావాలనే. అంత చెత్త పదాలు, అసభ్యపు మాటలు ఆ అమ్మాయిలతో చెప్పించడం మరీ బాగోలేదు. తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చే దాకా వేరా ఆగేట్టు లేడు. అప్పటి దాక మరిలాంటి కథనాలు మనం ఎన్ని చూడాల్సి వస్తుందో?

డియర్ చేగు'వేరా'...ఇప్పటికే...నీ 'ఓపెన్ హార్టు', 'ఓపెన్ డిబేటు' లతో జనాలకు జర్నలిస్టుల పట్ల ఏహ్యభావం మరింత పెరిగింది. ఎందుకయ్యా...ఇలాంటి చెత్త కథనాలతో జనాలను విసిగిస్తావ్? ఫోన్ లో మాటలు...తాటికాయంత అక్షరాలతో టీ.వీ.స్క్రీన్ మీద వేస్తున్నావ్. ఎందుకయ్యా...మమ్మల్ని ఇలా చంపుతావ్. రాంబాబులకు, రాధాకృష్ణ లకు సంస్కారం...సిగ్గూ ఎగ్గూ ఉండకపోవచ్చు....తెలుగు జనాలకు అవి వున్నాయి బాబు. కాస్త మా గురించీ ఆలోచించి పుణ్యం కట్టుకో.   

Friday, September 16, 2011

పద్మనాభాయనమః...జనార్దనాయనమః : రామ్ బాణం

Tuesday, September 6, 2011

మా మంచి గురువర్యా...ఓ బూద..."రాజా..."


September 5, 2011
సోమవారం
డియర్ సర్...నమస్తే...  
అంతా టీచర్స్ డే జరుపుకుంటుంటే...మీరు గుర్తుకు వస్తున్నారు...పొద్దటి నుంచీ. సొర్గంలో ఒక చీమచెట్టు కింద ఒక బల్ల ముందు కుర్చీ వేసుకుని...భూతద్దాల కళ్ళజోడు సాయంతో ఏదో పదకోశమో, మీ సమకాలీనులు ఎవ్వరూ సాహసం చేయని ఏదో ప్రాజెక్టుతో బిజీ గా వున్నారని భావిస్తున్నాను. లేకపోతె అక్కడ శాసనాల పరిశీలన విశ్లేషణ హడావుడిలో ఉండి వుంటారు. మధ్య మధ్యలో మీకు నచ్చని ఏదో విషయంలో ఎవడ్నో బూతులు దోకుతున్నా...అక్కడ మీకు ఏర్పడిన శిష్యులతో చర్చలో ఉన్నా ఆపి ఇది కాస్త చదవండి సార్. ఇంకా పొద్దు పోలేదు  కాబట్టి, నేను పెద్ద పండితుణ్ణి గానీ, భాషా సామర్ధ్యం ఉన్నవాడిని గానీ కాదు కాబట్టి పోనీలే  వెధవ అని వదిలేస్తారని అనుకుని తెలిసిన తెలుగులో నాలుగు ముక్కలు రాస్తున్నా. బుర్ర తక్కువ 'కంత్రిబ్యూటార్ గాళ్ళ'లో నేనూ ఒకడ్ని. తప్పులుంటే క్షమించండి. 

  ఒక తొమ్మిది నెలల పాటు మీ శిష్యరికం చేసినందుకు...కాస్త లోకజ్ఞానం అబ్బడం సంగతి అలా ఉంచితే...మీ దగ్గర చదువుకున్నందుకు...' మీరు అదృష్టవంతులు' అని నేను మంచి ఎథికల్ ఎడిటర్ గా మొన్నీ మధ్య దాకా అనుకున్న ఒకాయన అంటే...మనసు ఉప్పొంగింది. అబద్ధాల ఇటుకలు పేర్చి, కుళ్ళు-రాజకీయం రంగరించి కెరీర్ బిల్డింగులు కట్టుకుంటున్న తుక్కు జర్నలిస్టులు కూడా మీ పేరు చెప్పగానీ...కొద్దిగా భక్తి తో మాట్లాడతారు. అది మరి మీ స్పెషాలిటీ. గురూజీ...మీరు దాన్ని ఒక సిలబస్ గా పెట్టలేదు కానీ....ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మా అందరికీ నేర్పారు. శిష్యుల దగ్గర ఏదీ దాయకుండా...జీవితపు సారాన్ని రంగరించి భలే చెప్పేవారు. మీ మాటల విరుపులు, కళ్ళల్లో ఆ మెరుపులు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తాయి. దగ్గరుండి మీరు చెప్పిన అనువాదపు పాఠాలు...మధ్యాన్నపు అన్నపు బడలికను భలే పారదోలేవి. 

రామోజీకి కుల పిచ్చి వుందని ఎవడో అంటే...మీరు చెప్పిన మాట విని మీ కొత్త స్టూడెంట్ అయిన నాకు ఏమనాలో తెలియలేదు. "అదొట్టి పిచ్చి మాట. వాడికి (రామోజీకి) ఎవరు వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు," అని జర్నలిజం స్కూలు ఆవరణలో సిగరెట్ కాలుస్తూ మీరు ఆలవోకగా అన్నమాట మాకు షాకిచ్చింది. మీరు ఏ మాటకు ఆ మాటే.    సినారె ను తిట్టకుండా మీకు రోజు వెళ్ళేది కాదు గదా. తర్కం అనే కత్తితో, వ్యంగ్యం అనే రంపంతో ఆయన్ను మీరు ఛీల్చినా అది మాకు తిట్టినట్లు మొట్టినట్లు అనిపించేది కాదు.  నోటి దురుసుతనం వల్ల మీకు అవార్డులు, పెద్ద పదవులు రాలేదని అంటున్నారు. బైటికి మంచిగా కనిపిస్తూ...లోకానికి నీతిమంతులని కలరిస్తూ...లోపల విషపు కుట్రలు చేసే సంపాదకుల కన్నా...ఏ అవార్డు రాకపోయినా మీరే బంగారం.
ఉద్యోగంలో చేరిన తర్వాత...కొందరు సీనియర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు డెస్క్ కు వచ్చి...పక్కకు తీసుకుపోయి మీరు నాకు చెప్పిన జాగ్రత్తలు ఇప్పటికీ గుర్తే సార్. మీ సహృదయత నాకు నేర్పిన పాఠం ఇప్పుడు సెంట్రల్ యూనివెర్సిటీ లో ఎందరో నా శిష్యులకు మేలు చేస్తోంది. ఈ విషయంలో మీ నుంచి నేర్చుకున్న లక్షణం వల్ల ఇప్పుడు నా స్టూడెంట్స్ సెటిల్ అయ్యే దాకా నేను సహకరించకుండా ఉండలేక పోతున్నా. నా శిక్షణలో రాటు దేలి ఉద్యోగం పొందాక...వారు చేసే మొదటి ఫోను అందుకున్నప్పుడు మీరు అప్రయత్నంగా నాకు గుర్తుకు వస్తారు.

కంట్రిబ్యూటర్లు అంటే మీకున్న కోపం వల్ల నేను మిగిలిన కొందరిలా మీకు దగ్గర కాలేక పోయాను. మూడు నెల్ల పరీక్షలో నా ఆన్సర్ షీట్ మీద 'ప్రాణం లేచి వచ్చింది...తెలుగంటే ఇలా ఉండాలి...' అని మీరు చేసిన రిమార్కు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ వ్యాఖ్య ఇచ్చిన కిక్కు అలాంటి ఇలాంటిది కాదు సార్. మీరు నేర్పిన ముక్కుసూటి తనం వల్ల కావచ్చు సార్...మిత్రులు చాలా మంది పెద్దగా ఎదగలేక పోయారు. మీ శిష్యులని ముద్ర పడిన పాపానికి కొదరికి శిక్ష పడింది. ఏంటో సార్...ఏవేవో గుర్తుకు వస్తున్నాయ్. 

పట్టాల ప్రధానోత్సవం రోజు..."నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొక తరి తలవండి ' అని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నుంచి గురజాడ ను ఉటంకించి ప్రసంగం ముగించారు. మీ పేరు తలవకుండా మేము ఎప్పుడూ ఉండలేము సార్..ఇక ఉంటా... మీకు టీచర్స్ డే గ్రీటింగ్స్. 

అన్నట్టు మరిచి పోయాను సార్. మీరు క్షమించాలి. మీ గుర్తుగా యేవో ప్రోగ్రామ్స్ చేయాలని మీ శిష్యులందరం చాలా సార్లు అనుకున్నాం. నేనూ చాలా అనుకున్నా. మీటింగ్ లో చాలా కోతలు కోసాం. మీ చితి సాక్షిగా మేము వాయు వేగంతో ఒక పత్రిక తెచ్చాం. అది చూసి మేము మీ కోసం ఇంకా ఏదో అద్భుతం చేస్తామని పిచ్చి జనం భావించారు. సారీ సార్...మేము వృత్తిలో బిజీ. సంసార సాగరంలో, డబ్బు సంపాదనలో చాలాబిజీగా వున్నాం...మాకు తీరిక దొరికినప్పుడు...అవి చేస్తే చేస్తాం. మీరు మాత్రం మరోలా అనుకోకండి. 

మీ శిష్య పరమాణువు
రాము

Monday, September 5, 2011

మా మంచి గురువర్యా...అయ్యా బూద...రాజా...

September 5, 2011
సోమవారం
డియర్ సర్...నమస్తే...  
అంతా టీచర్స్ డే జరుపుకుంటుంటే...మీరు గుర్తుకు వస్తున్నారు...పొద్దటి నుంచీ. సొర్గంలో ఒక చీమచెట్టు కింద ఒక బల్ల ముందు కుర్చీ వేసుకుని...భూతద్దాల కళ్ళజోడు సాయంతో ఏదో పదకోశమో, మీ సమకాలీనులు ఎవ్వరూ సాహసం చేయని ఏదో ప్రాజెక్టుతో బిజీ గా వున్నారని భావిస్తున్నాను. మధ్య మధ్యలో ఎవడ్నో బూతులు దోకుతున్నా...ఆపి ఇది కాస్త చదవండి సార్. ఇంకా పొద్దు పోలేదు కాదు కాబట్టి, నేను పెద్ద పండితుణ్ణి గానీ, భాషా సామర్ధ్యం ఉన్నవాడిని గానీ కాదు కాబట్టి పోనీలే  వెధవ అని వదిలేస్తారని అనుకుని తెలిసిన తెలుగులో నాలుగు ముక్కలు రాస్తున్నా. బుర్ర తక్కువ 'కంత్రిబ్యూటార్ గాళ్ళ'లో నేనూ ఒకడ్ని. తప్పులుంటే క్షమించండి. 

  ఒక తొమ్మిది నెలల పాటు మీ శిష్యరికం చేసినందుకు...కాస్త లోకజ్ఞానం అబ్బడం సంగతి అలా ఉంచితే...మీ దగ్గర చదువుకున్నందుకు...' మీరు అదృష్టవంతులు' అని నేను మంచి ఎథికల్ ఎడిటర్ గా మొన్నీ మధ్య దాకా అనుకున్న ఒకాయన అంటే...మనసు ఉప్పొంగింది. అబద్ధాల ఇటుకలు పేర్చి, కుళ్ళు-రాజకీయం రంగరించి కెరీర్ బిల్డింగులు కట్టుకుంటున్న తుక్కు జర్నలిస్టులు కూడా మీ పేరు చెప్పగానీ...కొద్దిగా భక్తి తో మాట్లాడతారు. అది మరి మీ స్పెషాలిటీ. గురూజీ...మీరు దాన్ని ఒక సిలబస్ గా పెట్టలేదు కానీ....ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మా అందరికీ నేర్పారు. శిష్యుల దగ్గర ఏదీ దాయకుండా...జీవితపు సారాన్ని రంగరించి భలే చెప్పేవారు. మీ మాటల విరుపులు, కళ్ళల్లో ఆ మెరుపులు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తాయి. దగ్గరుండి మీరు చెప్పిన అనువాదపు పాఠాలు...మధ్యాన్నపు అన్నపు బడలికను భలే పారదోలేవి. 

రామోజీకి కుల పిచ్చి వుందని ఎవడో అంటే...మీరు చెప్పిన మాట విని మీ కొత్త స్టూడెంట్ అయిన నాకు ఏమనాలో తెలియలేదు. "అదొట్టి పిచ్చి మాట. వాడికి (రామోజీకి) ఎవరు వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు," అని జర్నలిజం స్కూలు ఆవరణలో సిగరెట్ కాలుస్తూ మీరు ఆలవోకగా అన్నమాట మాకు షాకిచ్చింది. మీరు ఏ మాటకు ఆ మాటే.    సినారె ను తిట్టకుండా మీకు రోజు వెళ్ళేది కాదు గదా. తర్కం అనే కత్తితో, వ్యంగ్యం అనే రంపంతో ఆయన్ను మీరు ఛీల్చినా అది మాకు తిట్టినట్లు మొట్టినట్లు అనిపించేది కాదు.  నోటి దురుసుతనం వల్ల మీకు అవార్డులు, పెద్ద పదవులు రాలేదని అంటున్నారు. బైటికి మంచిగా కనిపిస్తూ...లోకానికి నీతిమంతులని కలరిస్తూ...లోపల విషపు కుట్రలు చేసే సంపాదకుల కన్నా...ఏ అవార్డు రాకపోయినా మీరే బంగారం.
ఉద్యోగంలో చేరిన తర్వాత...కొందరు సీనియర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు డెస్క్ కు వచ్చి...పక్కకు తీసుకుపోయి మీరు నాకు చెప్పిన జాగ్రత్తలు ఇప్పటికీ గుర్తే సార్. మీ సహృదయత నాకు నేర్పిన పాఠం ఇప్పుడు సెంట్రల్ యూనివెర్సిటీ లో ఎందరో నా శిష్యులకు మేలు చేస్తోంది. ఈ విషయంలో మీ నుంచి నేర్చుకున్న లక్షణం వల్ల ఇప్పుడు నా స్టూడెంట్స్ సెటిల్ అయ్యే దాకా నేను సహకరించకుండా ఉండలేక పోతున్నా. నా శిక్షణలో రాటు దేలి ఉద్యోగం పొందాక...వారు చేసే మొదటి ఫోను అందుకున్నప్పుడు మీరు అప్రయత్నంగా నాకు గుర్తుకు వస్తారు.

కంట్రిబ్యూటర్లు అంటే మీకున్న కోపం వల్ల నేను మిగిలిన కొందరిలా మీకు దగ్గర కాలేక పోయాను. మూడు నెల్ల పరీక్షలో నా ఆన్సర్ షీట్ మీద 'ప్రాణం లేచి వచ్చింది...తెలుగంటే ఇలా ఉండాలి...' అని మీరు చేసిన రిమార్కు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ వ్యాఖ్య ఇచ్చిన కిక్కు అలాంటి ఇలాంటిది కాదు సార్. మీరు నేర్పిన ముక్కుసూటి తనం వల్ల కావచ్చు సార్...మిత్రులు చాలా మంది పెద్దగా ఎదగలేక పోయారు. మీ శిష్యులని ముద్ర పడిన పాపానికి కొదరికి శిక్ష పడింది. ఏంటో సార్...ఏవేవో గుర్తుకు వస్తున్నాయ్. 

పట్టాల ప్రధానోత్సవం రోజు..."నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొక తరి తలవండి ' అని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నుంచి గురజాడ ను ఉటంకించి ప్రసంగం ముగించారు. మీ పేరు తలవకుండా మేము ఎప్పుడూ ఉండలేము సార్..ఇక ఉంటా... మీకు టీచర్స్ డే గ్రీటింగ్స్. 

అన్నట్టు మరిచి పోయాను సార్. మీరు క్షమించాలి. మీ గుర్తుగా యేవో ప్రోగ్రామ్స్ చేయాలని మీ శిష్యులందరం చాలా సార్లు అనుకున్నాం. నేనూ చాలా అనుకున్నా. మీటింగ్ లో చాలా కోతలు కోసాం. మీ చితి సాక్షిగా మేము వాయు వేగంతో ఒక పత్రిక తెచ్చాం. అది చూసి మేము మీ కోసం ఇంకా ఏదో అద్భుతం చేస్తామని పిచ్చి జనం భావించారు. సారీ సార్...మేము వృత్తిలో బిజీ. సంసార సాగరంలో, డబ్బు సంపాదనలో చాలాబిజీగా వున్నాం...మాకు తీరిక దొరికినప్పుడు...అవి చేస్తే చేస్తాం. మీరు మాత్రం మరోలా అనుకోకండి. 

మీ శిష్య పరమాణువు
రాము

Saturday, September 3, 2011

దూసుకుపోతున్న N-TV, వెనుక పడుతున్న TV-9

టెలివిజన్ ఛానళ్ళ 'ప్రతిభకు' గీటురాయిగా చెప్పుకునే Television Audience Measurement (TAM) రేటింగ్ లో నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV అగ్రస్థానంలో దూసుకుపోతున్నది...బై వీక్లీ (హైదరాబాద్) లెక్క ప్రకారం.  ఏకఛత్రాధిపత్యం పొంది మెరుగైన సమాజం కోసం అహరహం పాటుపడుతున్న చానల్ TV-9 అనూహ్యంగా మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. రెండో స్థానాన్ని చెరుకూరి రామోజీ రావు గారి ఈ-టీ వీ ఆక్రమించగా, చాలా కాలంగా ఎవ్వరికీ అర్థంకాకుండా రెండో స్థానంలో ఉన్న TV-5 ఐదో స్థానానికి దిగజారిపోయింది. 

జగన్ భజన, కాంగ్రెస్ వ్యతిరేకత మినహా మరేదీ జర్నలిజం కాదని నమ్ముతున్న సాక్షి ఛానల్ TV-5, T-News, Zee, I-News, HM TV లను తలదన్నడం విశేషం. వేమూరి రాధాకృష్ణ గారి ABN-Andhra Jyothi పదో స్థానాన్ని ఆక్రమించగా, రామచంద్ర మూర్తి గారి సారధ్యంలోని HM TV తొమ్మిదో రాంకు పొందింది. 

ఈ లెక్కలు నిజంకాదు....టాం ఒక కాకి లెక్కల వ్యవహారం....ఈ తెగ బలిసిన యజమానులు రేటింగ్స్ ను టాంపర్ చేస్తారు...వంటి విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. ఈ రేటింగ్స్ ను బట్టి చానెల్ వాళ్లకు యాడ్స్ వస్తున్నాయా...అని నేను అడిగితె ఎవ్వరూ సరిగా సమాధానం ఇవ్వడంలేదు. TV-9  ను తెలంగాణలో కొన్ని చోట్ల రానివ్వకపోవడం వల్ల లెక్కలు మారాయేమో కూడా తెలియదు. 
మొత్తానికి ఇక ఆ లెక్కలు ఇలా వున్నాయి.
N-TV: 4.82
E-TV2: 4.15
TV-9: 3.11
Saakshi: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42