Sunday, December 30, 2012

మన పిల్లలకు మనమేమి నేర్పాలి?

నా కూతురును ఢిల్లీ లోని లేడి శ్రీరాం కాలేజిలో చదివించాలని అనుకునేవాడిని. ఏదో మాటల సందర్భంలో ఇదే మాటను యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక స్టూడెంట్ తో అన్నాను. "సార్...ఆ పని మాత్రం చేయకండి. ఢిల్లీ ఆడ పిల్లలకు అన్సేఫ్. అక్కడ జరిగే అఘాయిత్యాలు బైట పడేవి కొన్ని మాత్రమే...," అని ఆ అమ్మాయి నాతో చెప్పింది....దాదాపు ఆరు నెలల కిందట. మొన్నటి గ్యాంగ్ రేప్ గురించి వినగానే...ఈ సంభాషణ గుర్తుకు వచ్చింది. అంటే...చాలా రోజులుగా అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న వార్తలు నిజమే అని రూఢి అయ్యింది. 

ఇప్పుడు మనం పూర్తిగా మార్కెట్ గుప్పిట్లో ఉన్నాం. ఇక్కడ వ్యాపారాభివృద్ధి, లాభం మాత్రమే పరిగణన లోకి తీసుకో బడతాయి. సమ భావన, సంస్కృతీ, నీతి వంటి మాటలు బూతులై పోయాయి. వాణిజ్య ప్రకటనలు, సినిమాలు, పత్రికలూ...ఏవి తీసుకున్నా...అమ్మాయిలు కేంద్రంగా, అందాల ఆరబోత ధ్యేయంగా  ఉంటున్నాయి. వీటి ప్రభావం వల్ల ఆడ పిల్లల పట్ల చిన్న చూపు ఒక వైపు, వారొక సెక్స్ వస్తువులన్న భావన మరొకవైపు పెచ్చరిల్లుతున్నాయి...ఈ ఆధునిక సమాజం లోనూ. వీటి వల్లనే ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. 

ఈ చవట ప్రభుత్వాలు, నింపాది చట్టాలు, స్వార్ధపూరిత ప్రజా సంఘాలు, కుళ్ళు మెదళ్ల మేధావులు ఏమీ చేయలేరు..ఈ భయంకరమైన సమస్య పరిష్కారానికి. ఎన్నికలలో లబ్ధికి, కాంట్రాక్టుల ఖరారుకు, ఆర్ధిక ప్రయోజనాలు కలిగే పనులకు అమ్మాయిలను వాడుకోవడం సర్వ సాధారణం అయ్యింది. వర్క్ ప్లేసులలో బాసుల కిరాతకానికి బలవుతున్న మహిళలు ఎందరో!

ఢిల్లీ రేప్ ఘటన పట్ల గొంతు చించుకుంటున్న ఒక ప్రముఖ పార్టీ అధినేత రాజకీయ ప్రయోజనం కోసం ఒక ఉన్నత స్థాయి జడ్జి దగ్గరకు అప్పటి హీరోయిన్, ఇప్పటి పొలిటీషియన్ ఒకరిని సెక్స్ సుఖం కోసం పంపి పనిచేయించుకున్నట్లు మీడియాలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇప్పుడున్న మీడియా ప్రభువులలో పలు దరిద్రులు...వ్యాపార విస్తరణ కోసం...అమ్మాయిలను, ముఖ్యంగా తమ దగ్గర పనిచేసే యాంకర్లను పావులుగా వాడుకుంటున్న సంగతి బహిరంగ రహస్యం. అప్పనంగా అందలం, ఆర్ధిక హోదా లభిస్తుండే సరికి కొందరు ఆడ పిల్లలు రాజీ పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. 

పోలీసులు, మీడియా, న్యాయ వ్యవస్థ ప్రతికూలంగా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితుల్లో సాధారణ పౌరులే నడుం బిగించాలి. సమాజ శ్రేయస్సు ధ్యేయంగా కుటుంబ విలువలు పెంపొందించాలి. పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా...పిల్లలకు విలువలు బోధించాలి. ఈ నేపథ్యoలో...అబ్రకదబ్ర పెద్దలకు, స్కూల్-కాలేజ్ పిన్నలకు విడివిడిగా రూపొందించిన ప్రవర్తనా నియమావళి మీ కోసం.  

పెద్దల ప్రవర్తన

>బాలికలు, మహిళల పట్ల చిన్న చూపు ఇంటి నుంచే ఆరంభం అవుతుంది. దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి. 
>మనుషులం అందరం సమానమే...అన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు నూరిపోయాలి. అది నిరూపించి చూపాలి. 
>జీవిత భాగస్వామిని, భార్యను, చులకనగా చూడడం, చీటికీ మాటికీ తిట్టడం, సూటిపోటి మాటలతో చులకన చేయడం ఆపాలి.
>ఇంట్లో పనికి కుదిరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణం. 
>ఇంటికి వచ్చే ఆడ పిల్లలు, మహిళలను అదోలా చూడడం, వారితో వెకిలి చేష్టలకు ఒడిగట్టడం చేటుచేస్తాయి.    

మగ పిల్లలకు నేర్పాల్సినవి 

>తోటి బాలికలతో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే బోధించాలి.
>సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. ముఖ్యంగా ప్రేమ సెంట్రిక్ గా ఉండే తెలుగు, హిందీ సినిమాలను నివారించాలి.   
>సినిమాలు అడపా దడపా చూసినా అందులో వెకిలితనాన్ని అనుకరించవద్దని చెప్పాలి.
>సినిమాలలో అశ్లీలత, అసభ్యతలను పెద్దలే  అక్కడికక్కడ తిట్టి పోయాలి. ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలు పశువులతో సమానమని, దేశభక్తి లేని కుక్కలని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి.
>బాలికలపై దాడిని బహిరంగంగా ఖండించాలి. ఆ తాలూకు నిరసన ప్రదర్శనలలో పాలు పంచుకోవాలి. 
>స్కూలు స్థాయి నుంచే చట్టాల గురించి పిల్లలకు ప్రాథమిక అవగాహన వచ్చే చర్యలు చేపట్టాలి.
>పిచ్చి పనులు చేస్తే...పడే శిక్షల తీవ్రతను తెలియపరిచాలి.
>జులాయి స్నేహితులతో తిరగకుండా చూసుకోవాలి. 
>విలాసాల పట్ల మక్కువ చూపే కొడుకు ఎన్నడో ఒక నాడు ప్రమాదం కొని తెస్తాడని గుర్తించాలి. 
>స్కూలు బస్సులోనో, దారి వెంటనో...ఈవ్ టీజింగ్ వంటివి జరుగుతున్నాయేమో అడిగి తెలుసుకోవాలి. 
>ఈవ్ టీజింగ్ బాధితుల పట్ల సానుభూతితో ఎలా వ్యవహరించాలో తెలియజేయండి. 
>ఈవ్ టీజింగ్ ను నిరోధించడం...ఎందుకు, ఎలా సోషల్ రెస్పాన్సిబిలిటి అవుతుందో పిల్లవాడికి తెలియజేయాలి.
>పిల్లవాడితో మిత్రుడిలా వ్యవహరిస్తే స్కూల్, కాలేజ్ లలో పరిణామాలు తెలుసుకోవచ్చు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు.
>లవ్వు, పార్టీలు, సోషల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలను సున్నితంగా డీల్ చేయాలి.
>మన పిల్లవాడి మానసిక పరివర్తనలో తేడా కనిపిస్తే...కుటుంబ సభ్యుల లేదా వైద్యుల సహకారం తీసుకోవడానికి వెనకాడవద్దు.   

ఆడ పిల్లలకు నేర్పాల్సినవి 

>మగవాళ్ళను పూర్తిగా నమ్మవద్దని, వారి మాటలను, చేష్టలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని నూరిపోయాలి.
>తోటి బాలురతో ఎలా ప్రవర్తించాలో, వారిలో ఓవర్ యాక్షన్ గాళ్ళను ఎలా డీల్ చేయాలో చిన్నప్పటి నుంచే బోధించాలి.
>సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. సినిమాటిక్ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయాలి.
>మగ పిల్లల పొగడ్తలు నిజమని నమ్మవద్దని, పొగిడిన వాళ్ళు నమ్మకస్తులని, దగ్గరివారని నమ్మవద్దని స్పష్టం చేయాలి.
>స్కూలు, కాలేజి స్థాయిలో సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. 
>విలాసవంతమైన జీవితం పట్ల మోజు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తుందో చర్చించాలి. 
>మరీ జుగుప్సాకరమైన డ్రస్సులను ధరించనివ్వవద్దు.  
>మోతాదు మించిన టెక్స్ట్ మెసేజులు, మెయిల్స్ ప్రమాదకరమని తెలియజెప్పాలి. 
>ఒంటరిగా ఇతరుల ఇళ్ళకు, రహస్య ప్రాంతాలకు  వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలి.
>అమ్మాయి స్నేహితులను నమ్మి...సినిమాలకు, షికార్లకు, పార్కులకు, పార్టీలకు పంపడం ప్రమాదం.
>స్కూల్ భరోసా లేనిది బైటి ప్రాంతాలకు ఎక్స్ కర్షన్ లకు పంపడం శ్రేయస్కరం కాదు.
>ఇతరులతో సంబంధాల విషయంలో గోప్యత (సీక్రసీ) ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియజెప్పాలి.
>అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ తో తరచూ మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం   మంచిది.
ఏతా వాతా...అద్భుతమైన ఈ కుటుంబం ఆవశ్యకత, మనుషుల మధ్య నమ్మకాల అవసరం, అబద్ధాలు తెచ్చి పెట్టే ప్రమాదాలు, ఎయిడ్స్ వంటి రోగాల తీవ్రత ..తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు ఇళ్ళలో చర్చించాలి. 

కాలేజ్ రోజుల్లో పిల్లలు (మగైనా...ఆడైనా) ఏదో ఒక రిలేషన్ లోకి వెళ్ళడం దాదాపు ఖాయమని పెద్దలు సిద్ధపడాలి. అందులో కొన్ని రిలేషన్స్ అద్భుతమైనవి కావచ్చు...పెళ్ళికి దారి తీయవచ్చు. మరీ సంపాదనే లక్ష్యం కాకుండా...పిల్లల కోసం రోజూ కొంత సమయం కేటాయిస్తే...వారికి ఒక సన్నిహిత మిత్రుడిగా వ్యవహరిస్తే...చాలా సమస్యలను మొగ్గలోనే పరిష్కరించవచ్చు. 

Tail piece
Delhi rape victim was sent to Singapore by Govt of INDIA.... for better treatment.

Why not it send those 7  rapists to Saudi Arabia ....for '' better justice..''

Saturday, December 29, 2012

దర్శక నిర్మాతలూ...దయచేసి మారండి....

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చీర్ లీడర్ గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా యువతి Gabriella Pasqualotto తన బ్లాగులో...అమ్మాయిలతో దారుణంగా వ్యవహరించే క్రికెటర్ల గురించి రాసుకుని వివాదాస్పద యువతిగా ముద్ర పడి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బ్లాగులోనే సగటు భారతీయ పౌరుడి గురించి కూడా చక్కగా రాసింది. 

"To the citizens, we are practically like walking porn! All eyes are on you all the time; it is complete voyeurism." (Voyeurism  అంటే  the practice of obtaining sexual gratification by looking at sexual objects or acts, especially secretively.) 

దేశ రాజధానిలో రాత్రి వేళ మిత్రుడితో కలిసి బస్సు ఎక్కి మగ మృగాల దాడిలో తనవు పచ్చిపుండై...బతుకు ఛిద్రమై...మృత్యుపోరాటం చేసి తరలి రాని తీరాలకు తరలిపోయిన చిట్టితల్లికి అశ్రునివాళి, భాష్పాంజలి అర్పిస్తున్నప్పుడు గాబ్రియేల మాటలు గుర్తుకు వస్తున్నాయి. మగ మృగాల అఘాయిత్యానికి బలైన విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె తల్లి దండ్రులకు కుటుంబ సభ్యులకు ఆ దారుణాన్ని తట్టుకునే శక్తి లభించాలని ప్రార్దిస్తున్నాం. అమ్మా...మమ్మల్ని క్షమించు. ఈ పవిత్ర భారతావని, ఈ మట్టిలో పుట్టిన మేము, ఈ ప్రజల డబ్బుతో చదువుకున్న విద్యావంతులమని అనుకుంటున్న మేము, మా మీడియా....కోటి ఆశల అద్భుతమైన నీ జీవితాన్ని మొగ్గలోనే తుంచడాన్ని నిలువరించలేక పోయాం. సమష్టిగా మేము విఫలమయ్యాం. ఆ అపరాధ భావనతో మేము   కుమిలిపోతున్నాo.  

అర్థరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు నిజమైన స్వాత్రంత్ర్యం వచ్చినట్లని పెద్దాయన అన్న మాట ఎప్పటికి నిజమవుతుందో ఎవ్వరం చెప్పలేం. మహిళను అంగడి వస్తువుగా చూసే సంస్కృతి నరనరాన జీర్ణించుకున్న ఈ జాతిని బాగు చేయడం ఎవరి వల్ల అవుతుందో! అనుక్షణం వెకిలి చూపుల దాడికి గురవుతూ...మహిళకు రక్షణ లేని దుస్థితి దాపురించింది. 

ఈ సంఘటనకు పోలీసులది బాధ్యత అన్నట్లు టీ వీ స్టూడియోలలో చెలరేగిపోతున్నారు. దానికన్నా ఎక్కువగా తప్పు పట్టాల్సింది....సృజనాత్మకత, కళారాధన పేరిట పచ్చి బూతును చూపిస్తున్న సినిమా రంగపు పెద్దలను. తప్పు....ఆడ పిల్లలను సెక్స్ వస్తువుగా చూపిస్తున్న నిర్మాతలది.  కురచ దుస్తుల హీరోయిన్ బొడ్డు మీద పళ్ళూ పూలు పెట్టి చూపించి జనాలలో కైపు ఎక్కించే బడ్డు దర్శకులది. అంగాంగ వర్ణనతో సాహిత్యం సృష్టిస్తున్న రచయితలది, పాటల  రచయితలది. పది ఎర్ర నోట్ల కోసం...శరీరాన్ని తాకట్టు పెట్టె బాధ్యతారహిత నటీమణులది. సమాజంపై పెను ప్రభావం చూపే శక్తిమంతమైన టీ వీ, సినిమాలలో అశ్లీలాన్ని ఆపలేకపోయిన సెన్సార్ బోర్డుది. అఘాయిత్యాలు జరిగాక ఆవేశంతో ఊగిపోతూ...చేష్టలుడిగి చూసే మహిళా సంఘాలది. సమాజం చంకనాకి పోతున్నా...పట్టించుకోకుండా..."లోకం తీరిది..." అనుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్న మేధావులది, సదాలోచన పరులది. అందరం సమష్టిగా సిగ్గు పడాల్సిన రోజిది. 

క్షుద్ర వినోదం అందిస్తూ...దేశవనరులైన పౌరుల మెదళ్ళు చెడగొడుతూ...ఆడపిల్లల కుటుంబాలలో విషాదం నిపుతున్న... చచ్చు సినిమాలు తీస్తున్న సన్నాసులను రోడ్డు మీద బహిరంగంగా ఉరి తీస్తే....భవిష్యత్తులో అయినా రేపులను నిరోధించవచ్చని మా అబ్రకదబ్ర మాటలలో తప్పుందంటారా? 

"జనం చూస్తున్నారు...మీము తెస్తున్నాం...." అన్న పిచ్చి వాదన ఇప్పటికైనా ఆపండ్రా నాయనా. ఇవ్వాళ చనిపోతూ మనల్ని సిగ్గుపడేలా చేసిన యువతి శవం సాక్షిగా దేశ నిర్మాణంలో, సంస్కృతి పరి రక్షణలో  మీ పాత్ర ఒక్క సారి అవలోకిన్చుకోండి. ప్లీజ్.

Tuesday, December 25, 2012

శాంతిని పెంచండి...దైవచింతన చేయండి: పోప్

ఎక్కడలేని హడావుడి, సాంకేతికత నిండిపోయిన ఈ జీవితంలో మనిషికి  భగవత్ చింతన అవసరం ఎంతైనా ఉందని, శాంతిని పెంచాలని క్రైస్తవ మతావలంభకులకు పోప్ పిలుపునిచ్చారు.

రోమ్ లోని సెయింట్ పీటర్స్ బసిలికా లో క్రిస్మస్ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మంగళవారం నాడు ప్రసంగిస్తూ..."మనకు సంతోషం కావాలి. మన పథకాలు విజయవంతం కావాలి. మనం పూర్తిగా మన గురించే ఆలోచిస్తున్నాం. మన దగ్గర ఇక భగవంతుడికి స్థానం లేదు," అని ఆయన అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పెచ్చరిల్లుతున్న రక్తపాతం, విద్వేషపూరిత పోరాటాల పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు.

85 వసంతాల పోప్ మాటలు న్యూ యార్క్ టైమ్స్ నుంచి....

“The great moral question of our attitude toward the homeless, towards refugees and migrants, takes on a deeper dimension: Do we really have room for God when he seeks to enter under our roof? Do we have time and space for him?” Benedict said.

“The faster we can move, the more efficient our timesaving appliances become, the less time we have. And God? The question of God never seems urgent. Our time is already completely full.” “There is no room for him,” he added. “Not even in our feelings and desires is there any room for him. 

We want ourselves. We want what we can seize hold of, we want happiness that is within our reach, we want our plans and purposes to succeed. We are so ‘full’ of ourselves that there is no room left for God. And that means there is no room for others either, for children, for the poor, for the stranger.”

The pope also prayed for “all those who live and suffer” in the Middle East today, calling for an end to the Israeli-Palestinian conflict and the end of violence “in Lebanon, Iraq, Syria and their neighbors.”
Photo and text courtesy: The New York Times 


  

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.....

ప్రియమైన మిత్రులారా....
మీ అందరికీ ఇవే మా శుభాకాం
క్షలు....రాము, హేమ 


   Blessed is the Season,
  that Engages the Whole World 
  in the Spirit of Love and Celebration!

                      
      May Your World be Filled With.. 
    WarmthCheer, LovePeace and Prosperity
 During X-Mas and The New Year 2013!!

Sunday, December 23, 2012

వరల్డ్ జూనియర్ టీ టీ పోటీలు- నా అనుభవాలు

యుగాంతం అయిపోయి ఛస్తామేమో చూద్దాం...రాయడం ఎందుకు దండగ? అనుకుని ఈ రోజు దాకా ఆగాను. హమ్మయ్య...బతికిపోయాం. మళ్ళీ ఏ తలమాసిన సన్నాసో బ్రహ్మాండం బద్దలై పోతుందని పిచ్చి లెక్కలతో ముందుకొస్తాడు. సంచలనం మాత్రమే ఊపిరిగా బతికే టీ  వీ చానెల్స్ వాళ్ళకు మసాలా దొరుకుతుంది. మనకు సస్పెన్స్ తో కూడిన కాలక్షేపం లభిస్తుంది. అప్పటి దాకా వేచిచూస్తూ...మన పని మనం చేసుకోవడం ఉత్తమం.

'ఈనాడు' యాజమాన్యం జిల్లా పేజీలు  (మినీలు) ఆరంభించడానికి రెండు నెలల ముందు...బహుశా 1989 అనుకుంటా...నేను ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో స్పోర్ట్స్ కంట్రీబ్యూటర్ గా జర్నలిజం జీవితం ఆరంభించాను. లెక్కలేనన్ని ఆటల పోటీలు కవర్ చేసేవాడిని. దాంతో పాటు ఆలిండియా రేడియో ఎఫ్.ఎం. స్టేషన్ వారికీ స్పోర్ట్స్ కవర్ చేస్తూ ఆనందించేవాడిని. అప్పట్లో జనాలకు స్పోర్ట్స్ జర్నలిజం కొత్త. సాయంత్రం కాలేజీ కాగానే నేను క్రీడా మైదానాలలో తిరుగుతూ...ఆటగాళ్ళతో కలివిడిగా ఉంటూ వినూత్న స్టోరీలతో రెచ్చిపోయేవాడిని. అదృష్టవశాత్తూ 'ఈనాడు' లో అప్పటి స్టాఫర్ సూర్యదేవర శ్రీకాంత్, డెస్క్ లో వుండే రమేష్, కృష్ణయ్య గార్లు నాకు బాగా సహకరించి ప్రోత్సహించే వారు. జిల్లాలో ఎక్కడ పెద్ద స్థాయి పోటీలు జరిగినా నన్ను పంపేవారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుల గురించి బాగా రాసేవాడిని. అదొక అందమైన అనుభవం. క్రీడా నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిపోర్టింగ్ చేసే వాడిని. మరీ అవసరం అనుకుంటే మాత్రం నెగిటివ్ స్టోరీ రాసేవాడిని..ఆచి తూచి. పోటీలు విజయవంతం కావడం రిపోర్టర్ గా నా విధి అని భావించేవాడిని. 

ఆ తర్వాత 'ఈనాడు', 'ది హిందూ', 'మెయిల్ టుడే' లలో శాశ్వత ఉద్యోగిగా పనిచేసినా...అప్పటి ఆనందం పొందలేకపోయాను స్పోర్ట్స్ జర్నలిజంలో. ఈనాడు లో ఉండగా స్పోర్ట్స్ రిపోర్టర్ కావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత పొలిటికల్, క్రైమ్, అగ్రికల్చర్ వంటి రంగాలపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయినా...స్పోర్ట్స్ గురించి వీలున్నప్పుడల్లా రాసాను ది  హిందూ లో. ఇప్పుడు టీచింగ్ లో పడినా...స్పోర్ట్స్ రిపోర్టింగ్ మీద చింత చావలేదు. 

అలాంటి నేను డిసెంబర్ 9 నుంచి 16 వరకు గచిబౌలి ఇండోర్ స్టేడియం లో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలలో మీడియా కమిటిలో పనిచేసాను. నవంబర్ 19 న నా పీ.హెచ్ డీ పూర్తయ్యింది. ఆ మర్నాడు...టోర్నమెంట్ డైరెక్టర్ వి.భాస్కర్ రామ్ గారికిచ్చిన మాట ప్రకారం...టోర్నమెంట్ సన్నాహక ఏర్పాట్లలో పనిచేసాను. అక్కడ ఆరంభమై...కొన్ని సమీకరణాల నేపథ్యంలో నేను మీడియా కమిటీ చైర్మన్ అయ్యాను. అక్కడ ఆరంభమయ్యింది మన పోరాటం. ఒక పిల్లకాకి కావాలని నాతో గొడవ పెట్టుకోవడంతో అవమానాలు ఆరంభమయ్యాయి. అక్కడ పలు సందర్భాలలో పలువురి సర్కస్ చూసి నవ్వుకోవడం మినహా ఏమీ చేయదలుచుకోలేదు.

యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని నా స్టూడెంట్స్ సహకారంతో...ఎనిమిది రోజులలో 'టాప్ స్పిన్ టైమ్స్' పేరిట నాలుగు న్యూస్ బులిటిన్స్ తెచ్చి అంతర్జాతీయ క్రీడాకారులు, కోచ్ లకు, అధికారులకు పంచడం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఈ ప్రచురుణకు భాస్కర్ రామ్ గారి నుంచి పూర్తి సహకారం లభించింది, ఇంటర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారుల నుంచి, జర్నలిస్టు మిత్రుల నుంచి ప్రసంశలు లభించాయి. 
The ITTF chief Adham Sharara's comment on 'Topspin Times'.

"One of the great features of the Championships was the "Topspin Times" periodical bulletin that came out 4 times during the Championships. This glossy colour publication was chockfull of news, features and photos that brought us a special insight in the event and the participants. Personally, I learnt facts about some of the young players that I did not know before. The journalistic quality of this publication was excellent and kudos to the enthusiastic team of journalists that put it together and produced it at the highest standards."

మా బృందమే...భాస్కర్ రామ్ గారి ఆధ్వర్యంలో సూవనీర్ కూడా తెచ్చింది. అయ్యా...మీ సందేశం కూడా అందులో ఉంటే బాగుంటుందని...ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినలేదు. అది తెలియక...దాన్ని ఒక ఇష్యూ చేసి కసి తీర్చుకోవాలనే ఒక వర్గం సిద్ధమయ్యింది. ఏదో మంచి చేద్దామని ముందుకు పోతే...ఇలాంటి సమస్యలు సృష్టించే మహానుభావులు చాలామంది ఉంటారని, దాన్ని సీరియస్ గా తీసుకోవడం టైం వేస్ట్ అని మిన్నకున్నాను. అలాకాకుండా...మన నిజమైన టెంపర్ మెంట్ ప్రకారం వ్యవహరిస్తే...కొంప కొల్లేరు అయ్యేది. ఒక ముగ్గురు మూర్ఖుల విషయంలో నా ఓపికకు నాకే ఆశ్చర్యం అనిపించింది. తొమ్మిది పది రోజుల పాటు నాకు వెన్నంటి ఉండి...అసలు మీడియా వాళ్ళు, నకిలీ మీడియా గాళ్ళు పెట్టిన హింసలు, చిత్ర హింసల నుంచి కాపాడిన నా మంచి మిత్రుడు శివ శంకర్ కు ప్రత్యేక అభినందనలు, కృతఙ్ఞతలు. ఆయన దివ్య బోధ చేసి ఉండకపోతే...అక్కడ ఒక నకిలీ జర్నలిస్టు యూనియన్ లీడర్ బజ్జీలు బద్దలయ్యేవే. 

ఈ టోర్నమెంట్ ను ఇంగ్లిష్ జర్నలిస్టులు కవర్ చేసిన విధానం నిజంగా నన్ను ఆకట్టుకుంది. వాళ్ళు అన్ని మ్యాచులు చూసి రిపోర్ట్ చేసే వారు. తెలుగు మిత్రులలో కొందరు రిజల్ట్ కు మాత్రం పరిమితమయ్యారు. వాళ్లకు స్పేస్ ప్రాబ్లం. ఎలక్ట్రానిక్ మీడియా బాధ ఎలక్ట్రానిక్ మీడియాది. ఈ చాంపియన్ షిప్ లో వివిధ చానల్స్ రిపోర్టర్స్ తో మాట్లాడాక....నాకు చాలా విషయాలు బోధ పడ్డాయి. మేము నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు రావద్దని ప్రచారం చేసిన వైనం, డబ్బు వ్యవహారం, ఒక కుళ్ళు గురవయ్య నా మీద వారి ముందు చేసిన కామెంట్స్ నోట్ చేసాను. ఈ బ్లాగు చదవడం ద్వారా పరిచయం అయిన మిత్రులు నాకు ఫీల్డులో కొందరు దళార్ల తెంపరితనం గురించి చెప్పిన విషయాలు రికార్డ్ చేసాను. The Hans India, HM TV ఎడిటర్ ఇన్ చీఫ్ కె.రామచంద్ర మూర్తి గారు ఒక రోజు ప్రత్యేకంగా వచ్చి ITTF చీఫ్ Adham Sharara ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఆనందం కలిగించింది. ఆయన లాంటి ఎడిటర్ నుంచి ఈ తరం జర్నలిస్టులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
  
ఇదిలా వుండగా...ఒక ప్రముఖ పత్రిక..."ప్రచారం లేక" జనం చూడ్డానికి రావడం లేదని రాసింది. "బాబూ...టోర్నమెంట్ కు సంబంధించి ఒక్క కర్టెన్ రైజర్ అయినా మీరు రాయలేదు కదా. మీరు ప్రచారం కలిగించకపోతే...ఎవరు కల్పిస్తారు? ఒక్క సారి ఆలోచించండి" అని నేను నా ధర్మంగా అది రాసిన రిపోర్టర్ గారితో చెప్పాను. తను దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఉంటారని భావిస్తాను. 

క్రీడల పట్ల జనంలో ఆసక్తి కలిగించాలంటే...నిర్వాహకులు, మీడియా కలిసి పనిచేయాలి. ఇక్కడ లాభాపేక్ష చూసుకో కూడదు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కేవలం ఆటల పట్ల ఆసక్తి తో ప్రపంచ స్థాయి పోటీలు నిర్వహిస్తే...మీడియా నిర్వహించాల్సిన పాత్ర ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు తలచుకుంటే...జనాలలో కూడా ఆసక్తి కలిగించేలా కథనాలు రాయవచ్చు. అయితే....విధి నిర్వహణలో ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. అభిరుచి, వృత్తి నిబద్ధత, స్వప్రయోజన కాంక్ష, అజ్ఞానం, అపోహలు వంటి అంశాలు ఎవరి పని తీరు మీదనైనా ప్రభావం చూపుతాయి. రిపోర్టర్లు కాస్త పెద్ద మనసుతో వ్యవహరిస్తే...అందరం కలిసి ప్రజల్లో క్రీడాభిలాషను పెంచవచ్చు, క్రీడానందాన్ని పంచవచ్చు.  

మొత్తం మీద ఇంట పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన APTTA సారధులు భాస్కర్ రామ్, ఎస్.ఎం.సుల్తాన్, నరసింహారావు, ప్రకాష్ రాజు గార్లకు వారి బృందానికి, ఈ టోర్నమెంట్  విజయం కోసం రాజమండ్రి నుంచి వచ్చి పది రోజులు ఇక్కడే ఉండి సహకరించిన వారికి తదితరులకు అభినందనలు. ఈ పోటీలు ప్రపంచ స్థాయిలోనే ఉండాలని అణువణువునా తపించి, డబ్బు విషయంలో రాజీ పడకుండా నిద్రాహారాలు మాని పనిచేసిన భాస్కర్ రామ్ గారి క్రీడాభిమానానికి మరొక సారి జేజేలు.   

Photo caption: I, as the Editor of 'Topspin Times', was discussing point with Mr.Bhaskar Ram V, Editor-in-Chief, in Room No-53 (the office of our newsletter team) in Gachobowli stadium on December 13, 2012. 

Tuesday, December 18, 2012

గందరగోళంలో జీ 24 గంటలు--రాజకీయాల్లోకి శైలేష్ రెడ్డి!

మునిగిపోతున్న నావలాంటి జీ 24 గంటలు చానెల్ లో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం  వాటా తీసుకున్న నాటి నుంచి అక్కడ విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ జకీర్, శివ ప్రసాద్ లు చేరిన తర్వాత ఈ గందరగోళం మరింత ఎక్కువై జర్నలిస్టుల వలసకు కారణమైనట్లు సమాచారం. 

గత రెండేళ్లుగా...రాజకీయ ప్రస్థానం గురించి ఆలోచనలు చేస్తున్న జీ 24 గంటలు హెడ్ శైలేష్ రెడ్డి కి ఆ చానెల్ కు సంబంధాలు దాదాపు తెగిపోయినట్లు తెలుస్తున్నది. మరో పది పదిహేను రోజుల్లో శైలేష్ రాజకీయ భవిత విషయంలో ఒక స్పష్టత రావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా లో ఒక నియోజకవర్గం నుంచి ఆయన తన రాజకీయ భవితను పరీక్షించుకోవచ్చని భోగట్టా. 

52:48 నిష్పత్తి వాటాతో జీ గ్రూపు, బొత్స కుటుంబం ఈ చానెల్ ను నడుపుతున్నాయి. ఒక ఏడాదిన్నర పాటు  ఒక్క పైసా అడగకుండా చానెల్ నడపాలని, తర్వాత సమీక్ష చేసుకుని ఒక అవగాహన కు రావాలని జీ షరతు విధించిందని, దానికి ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో...అస్మదీయులైన జర్నలిస్టులకు పెద్దపీట  వేయాలని, శైలేష్ మనుషులైన తెలంగాణా తమ్ముళ్ళ ను సాగనంపాలని యాజమాన్యం అనుకుంటున్నట్లు...బాధిత జర్నలిస్టు ఒకరు చెప్పారు. 

"ఇక్కడ విలువలు లేవి, మర్యాద లేదు. పిచ్చి సమీకరణాల ను బట్టి వ్యవహరిస్తున్నారు," అని ఆ జర్నలిస్టు అన్నారు. ఈ పరిస్థితి ని జీర్ణించుకోలేని ఒక వర్గం జర్నలిస్టులు వేరే చానెల్స్ లో ఉద్యోగాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు కూడా తెలిసింది. యాజమాన్యం పొగ పెట్టడానికన్నా ముందే వేరే దారి చూసుకోవడం ఉత్తమమని జర్నలిస్టులు, టెక్నీషియన్లు భావిస్తున్నారు. 

అయితే...సంక్షోభ సమయంలో శైలేష్ పక్కకు తప్పుకోవడం ఒక వర్గానికి విచారం కలిగిస్తున్నది. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన జర్నలిస్టులకు మాత్రమే అవకాశాలు కల్పించారన్న మాటను శైలేష్ తెచ్చుకున్నారు. అందులో ఎంతో  కొంత నిజమున్నా....ప్రతిభను వదులుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. "పాలిటిక్స్ లోకి వెళ్లాలని ఆయన ఎప్పటి నుంచో  అనుకుంటున్నారు. వచ్చే ఆసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇదే సరైన సమయం," అని మరొకరు అన్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు శైలేష్ ఒక ఏడాది కిందటే ఈ బ్లాగుకు తెలిపారు. 

Thursday, December 13, 2012

జీ 24 గంటల్లోకి జాకీర్, శివ ప్రసాద్

ఏదో ఊడపొడుస్తుందని అనుకున్న సీ  వీ ఆర్ ఛానల్ నుంచి రెండు పెద్ద తలకాయలు వేరే ఛానెల్ కు ఉడాయించాయి. ఆ ఛానెల్ లో చేరి బీభత్సం సృష్టిస్తారని అనుకున్న స్వప్న సాక్షి లోనే ఉండిపోయి...ఆ పని జగన్ ఛానెల్  లో చేస్తున్నారు. ఆమె చేసిన కొన్ని ఇంటర్వ్యూలు, స్టోరీలు చూస్తే 'you to...' అని అనిపించకమానదనేది వేరే విషయం. 

కొంత అజ్ఞాతవాసం తర్వాత సీ వీ ఆర్ ఛానెల్  లో చేరిన మూర్తి కొన్నాళ్ళకు...పాత గూడైన  ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి లో చేరారు.  ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన శివ ప్రసాద్ అనే ఇన్ పుట్ ఎడిటర్ పొడ గిట్టకనే మూర్తి వెళ్లిపోయారని అప్పట్లో పునకార్లు షికార్లు చేసాయి. ఆ టైం లోనే... అవకాశం  దొరికిన ప్రతి ఛానెల్  లో పనిచేసి చూద్దామన్న అలవాటు ఉన్నట్లు కనిపించే తెలంగాణా ఆణిముత్యం జకీర్ కూడా సీ వీ ఆర్ లో చేరారు.  

అలాంటి శివ ప్రసాద్, జకీర్ లు మొన్నీ మధ్యన జీ 24 గంటలు ఛానెల్  లో చేరారు. కాంగ్రెస్ లీడర్ బొత్స గారు  తన ఛానెల్ ను ఎన్నికల నాటికి బలీయమైన శక్తి గా మార్చే క్రమంలో ఈ నియామకాలు చేసారని అనుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ బీట్ చూసిన జర్నలిస్టులకు పెద్దపీట దొరుకుతున్నట్లు చెబుతున్నారు. 

జీ 24 గంటలు లో శైలేష్ రెడ్డి పరిస్థితి ఏమిటి? శివ ప్రసాద్ వెళ్ళిపోయిన దరిమిలా మూర్తిని సీ వీ ఆర్ వాళ్ళు మళ్ళీ పిలుస్తారా? అన్నవి తెలియాల్సి ఉంది. జంపింగ్ విషయంలో ఈ జర్నలిస్టుల కన్నా ఆ డాక్టర్లే నయమని సీ వీ ఆర్ యాజమాన్యం అనుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.  

10 టీ వీ లోగో ఆవిష్కరణ రేపు 

By the people, for the people, to the people...New is People...అని భావిస్తున్న 10 టీ వీ లోగో ఆవిష్కరణ శుక్రవారం (14) న జరుగుతున్నది. బాగ్ లింగం పల్లి లోని ఆర్ టీ సీ కళ్యాణ మంటపం లో సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పని చేస్తారని, 10 టీ వీ చైర్మన్ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని హేమ చెప్పింది. తను ఈ మధ్యనే ఆ ఛానెల్ లో చేరింది. ఈ సారి స్పోర్ట్స్, ఫీచర్స్ చేయాలని అని భావిస్తున్న ఆమెకు, 10 టీ వీ సిబ్బందికి అభినందనలు, శుభాకాంక్షలు. 

Sunday, November 25, 2012

సెంట్రల్ లండన్ లో నగ్నావతారం

రోడ్లకు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ వాడివీ వీడివీ  విగ్రహాలు ప్రతిష్టించడం ఇప్పుడు రివాజుగా మారింది. ఈ క్రమంలో గల్లీ లీడర్లు, ఖూనీకోర్లు, బడాచోర్లు కూడా చచ్చీ చావగానే విగ్రహాలై కూర్చుంటున్నారు. మరి విగ్రహాల మీద మంటనో, మతి స్థిమితం లేకనో నిన్న లండన్ నడిబొడ్డున ఒక మధ్య వయస్కుడు బట్టలు తీసేసి ఒక ముప్పై అడుగుల విగ్రహం మీదకు ఎక్కి కూర్చోవడం, రకరకాల ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం సంచలనం కలిగించింది. 

సెంట్రల్ లండన్ లో బిజీగా ఉండే కూడలిలో కేంబ్రిడ్జ్ యువ రాజు జార్జ్ విగ్రహాన్ని నగ్నంగా దర్జాగా ఎక్కాడు. చరిత్రాత్మకమైన ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్ళే మధ్యలో ఉండే  ఈ ప్రాంతం చుట్టూ చాలా ప్రభుత్వ భవనాలు వుంటాయి. బట్టలతో విగ్రహాన్ని ఎక్కి....తర్వాత ఒకొక్కటి పీకి పారేసి అంత చలిలోనూ దాదాపు మూడు గంటల పాటు అక్కడ ఉన్నాడని పోలీసులు చెప్పారు. 'మెంటల్ యాక్ట్' కింద అరెస్టు అయిన ఆయన అసలు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో తెలియరాలేదు. చెట్లు నరకొద్దని చిప్కో ఉద్యమంలో కార్యకర్తలు చెట్లను కౌగలించుకుని నిలబడేవారట. రోడ్ల మీద ప్రతి అమాంబాపతు గాడి విగ్రహాలు పెట్టకండ్రా...అని ఏలికలకు సిగ్గు వచ్చేలా ఎలుగెత్తి చాటేందుకు మన నగ్న బాబు చేసినట్లు చేస్తే! అన్న మా అబ్రకదబ్ర ఆలోచన గురించి ఆదివారం పూట ఒకసారి ఆలోచించండి. 
Photo courtesy: 
http://www.huffingtonpost.co.uk

Thursday, November 22, 2012

yokibu.com లో ఫిదెల్ టీ టీ విజయాలపై వచ్చిన స్టోరీ


Sne‘hit’ in table tennis
Posted on: November 21, 2012.

Like it?Share with a friend
S. Fidel Rafeeque Snehit, a 12-year-old-boy of class VII of Bharatiya Vidya Bhavan, Jubilee hills, Hyderabad, has proved to be a constant performer in the game of Table Tennis. He won four national level medals in the last two years. The latest is the Silver medal in individual category of under-14 in CBSE nationals held in Solan, Himachal Pradesh, from October 28 to November 2. Last year his school team won silver medal in CBSE nationals held in Varanasi, UP. Besides, he won two bronze medals in open nationals last year.
India No-4 in cadet category last year, Snehit is No-1 in sub-junior category in Andhra Pradesh and he became the state champion by winning the title in AP 36th district & 48th championship held from November 9 to 12. The Hyderabad team captained by Snehit is runner up in Junior team championship.
Snehit is the winner of individual (Under-14) category at CBSE cluster level tournament held in Aakash International school, Bangalore, from September 13-17. He represented cluster-VII at a national level meet held in Solan and remained runner up. For the first time a boy from Andhra Pradesh could achieve the fete in recent years.
A team captained by Snehit is runner-up in U-14 team event at the same tournament. Snehit won the title in U-14 category in School Games selections held in Lal Bahadur Stadium on September 21.
In addition to this, Snehit’s team won three inter-school titles for BVBPS in a span of two months. With an excellent support from his teammate Jishnu Vakaria, he won St.Paul Stag Table Tennis Academy tournament, St Paul annual AP state ranking & school tournament and Rukminibai Memorial inter-school tournament. Thanks to Snehit’s superb performance, BVBPS scored a hat-trick, a rare achievement.
Snehit is trained at Global Table Tennis Academy (GTTA) in Naveen Nagar by AP men’s no-1 Somnath Ghosh, who produced two national ranking players. “Snehit works hard. He is able to achieve good results because of the constant support he gets from his parents, Hema and Ramu. The BVBPS also plays a vital role in his success. We thank the principal Rama Devi ma’am, and the PET Lakshmi Reddy for their support,” Mr.Somnath says with pride.
Snehit also thanked the principal Rama Devi ma’am for giving him a seat in the school on the basis of his performance in sports. “I joined in BVBPS in my third standard and my teachers, especially class teacher Kameshwari ma’am, are very supportive. Had they not blessed me, I wouldn’t have achieved these victories. I believe that they would support me to make it to the national team in coming years,” Snehit observes.
Snehit remains an example for sports-academics combination. Though he travels a lot to take part in national and state ranking and school tournaments, he does well in academics too. “With the help of teachers, we can manage sports and academics. We need school support in the next couple of years, which are very very crucial for my son,” Ramu, the paddler’s father and GTTA secretary, says.

Monday, November 19, 2012

జగన్ పార్టీలో చేరిన న్యూస్ రీడర్ రాణి రుద్రమ

ప్రముఖ న్యూస్ రీడర్ బొద్దిరెడ్డి రాణీ రుద్రమ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో చేరారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణా గుండె చప్పుడు టీ న్యూస్ చానెల్ లో వీర తెలంగాణా భావజాలం తో వార్తలు చదివి, చర్చలు జరిపిన ఆమె కొండా సురేఖ దంపతుల ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి తల్లి సమక్షంలో పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గం నుంచి రాజకీయ జీవితం ఆరంభించాలని రాణి రుద్రమ భావిస్తున్నట్లున్నారు.

ఈ టీ వీ తో 2003 లో కెరీర్ ప్రారంభించిన ఆమె ఏ.బీ.ఎన్, సాక్షి, టీ వీ నైన్  లలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 2009 లో ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. http://ranirudrama.blogspot.in/ అనే బ్లాగ్ ఆమెదే. రాణి రుద్రమ కు సంబంధించిన వీడియో ఇక్కడ చూడవచ్చు.

 http://www.youtube.com/watch?feature=player_embedded&v=T7uq3zKt0Ro 

Friday, November 16, 2012

ఆత్మ వంచన జర్నలిజం....(నేషనల్ ప్రెస్ డే స్పెషల్)

స్వతహాగా సాహిత్య అభిమాని, కథా రచయిత్రి అయిన మా అమ్మ 'రచ్చబండ' అనే పత్రికకు కొన్ని నెలలపాటు విలేకరిగా పనిచేసినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. కోస్తాలో తుపాను బాధితులకు సహాయం చేయడానికి పత్రిక తరఫున సత్తుపల్లి లో అనుకుంటా...కొందరు ఆర్ధిక స్థోమత ఉన్న వారిని సంప్రదిస్తే...వాళ్ళు ఆమెను ఆఫీసు బైట వెయిట్ చేయించారు. సహాయం చేయకుండానే పంపారు. ఆ రోజు ఆమె బాధపడడం సంగతి అలా ఉంచితే...సమాజానికి సహాయం చేయడానికి జర్నలిజం ఉపకరిస్తుందని నాకు అర్థమయ్యింది అప్పుడే. చిన్న పత్రికలో పనిచేసింది కాబట్టి అమ్మకు సహకారం అందలేదని...అదే పెద్ద పత్రిక అయితే...జనాలకు సహాయం చేయవచ్చని నేను అనుకున్నాను. 

అలా...జర్నలిజం పట్ల కొద్దిగా మమకారం పెరిగి...ఈనాడు లో 1989 లో కంట్రిబ్యూటర్ గా చేరానుకొత్తగూడెంలో. పొద్దున్న కాలేజీకి పోవడం, సాయంత్రం క్రీడలు కవర్ చేయడం, రాత్రికి షటిల్ ఆడడం...ఇలా సాగింది మూడేళ్ళు. ఈ లోగా...డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఒక రోజు ఇంటి పక్క వాళ్లకు 'ఈనాడు' 'ది హిందూ' పత్రికలూ వచ్చాయి. నేను హిందూ పత్రిక తీసుకోబోయాను. తనకు ఇంగ్లిష్ బాగా వచ్చని ఫీలయ్యే వారి అబ్బాయి వచ్చి....విసురుగా 'హిందూ' గుంజుకుని...నువ్వు చదవదగిన పత్రిక ఇదంటూ...'ఈనాడు' చేతిలో పెట్టాడు. 'నీ యబ్బ...ఈ జీవితంలో కొన్ని రోజులైనా...హిందూ లో పనిచేస్తా....చూస్తుండు,' అని అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. 

జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వుండడం లేదని  ప్రధానమంత్రి 'నేషనల్ ప్రెస్ డే' సందర్భంగా ఈ రోజు మొత్తు కుంటే...మన జర్నలిజం నేపథ్యం గుర్తుకు వచ్చాయి. అందుకే ఈ పోస్టు. 1989 నాటికే....జర్నలిస్ట్ లు అంటే...సమాజంలో భలే గౌరవం ఉండేది. ప్రజలు ఇస్తున్న గౌరవం చూసి...మరింత బాధ్యతాయుతంగా ఉండాలని అనిపించేది. అదేదో మిషన్ అన్నట్లు పనిచేసేవాళ్ళం. ఈనాడు డెస్క్ లో పనిచేసినప్పుడు కూడా...అదే భావం వుండేది. మన టార్గెట్ లో భాగంగా...ది హిందూ లో రిపోర్టర్ గా 2001 లో చేరిన నాటికే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. "ఈ రోజు నుంచి నువ్వు ఒక సమాజ సేవకుడివి," అని అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ అప్పటి బ్యూరో చీఫ్ దాసు కేశవరావు గారు చెప్పడం రోజూ స్మరించుకునే వాడిని.

రాను రానూ జర్నలిజం ఒక వ్యాపారంగా మారింది. యాజమాన్యాలు పచ్చి లాభదాయక పరిశ్రమగా మార్చాయి. రాజకీయ లాభం పరమావధి అయ్యింది. ఈ పరిస్థితిలో చాలా మంది జర్నలిస్టులు ఆత్మ వంచన చేసుకుని వృత్తిలో ఉండాల్సి వస్తున్నది. వారిని తప్పు పట్టడం తప్పు. అన్ని రంగాలలో మాదిరిగా నీతి నియమాలు నానాటికీ దిగజారుతున్నా...పవిత్ర వృత్తిగా పేరున్న జర్నలిజం లో ఆ ధోరణి మరీ వెర్రి తలలు వేయడం బాధ కలిగిస్తుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం...20 ఏళ్ళు జర్నలిజం లో ఉండి, మచ్చ లేకుండా పనిచేసి ...సమాంతరంగా డిగ్రీలు సాధించి టీచింగ్ లోకి వచ్చి మంచి పని చేసామని అనిపిస్తుంది. వృత్తిలో ఉన్న రమేష్ లు, శర్మలు, నగేష్ లను చూసాక....వేగంగా వదిలేయాల్సిన వృత్తి ఇదని నాకు స్పష్ట మయ్యేది ఎప్పటికప్పుడు. సరే...ప్రస్తుతం జర్నలిజం లో ఉన్న మిత్రులకు మేలు జరగాలని కోరుకుంటూ ప్రెస్ డే శుభాకాంక్షలు. 

రామోజీ రావు గారు మినీలు పెట్టకుండా ఉంటే...జర్నలిస్టులకు విద్యార్హతలు ఉండాలన్న నిబంధన వుంటే...ఇన్ని టీ  వీ చానెల్స్ రాకుండా వుంటే....పరిస్థితి మరీ ఇంతగా దిగాజారేది కాదేమో!
నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం ఇలా ఉంది. 


"A free and fair media has been an essential pillar of our democracy. Since our struggle for freedom, media has been guiding social change, informing readers of their rights and contributing to the nation-building process by spreading awareness.
As a country, we believe in complete independence of the media from external control. It is true that sometimes irresponsible journalism can have serious consequences for social harmony and public order, which the public authorities have an obligation to maintain, but censorship is no answer. It is for the members of the Fourth Estate themselves to collectively ensure that objectivity is promoted and sensationalism is curbed. It is for them to introspect how best they can serve our country and society and advance their well being."

Thursday, November 1, 2012

ఫిదేల్ కు టీ టీ లో మరొక జాతీయ స్థాయి టైటిల్

ఏవేవో ఆరోపణలు ఎదుర్కొంటూ  "టైమ్స్ ఆఫ్ ఇండియా"లో ఐదు నెలలుగా పని చేయకుండా జీతం తీసుకుంటున్న ఒక సీనియర్ జర్నలిస్టు గురించి, "ది హిందూ" లో ప్రమోషన్ల వ్యవహారం గురించి, కొన్ని చానళ్ళ విలేకరులపై ప్రభుత్వం తెలంగాణా ముద్ర వేయడం గురించి, "ది సండే ఇండియన్"ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రపంచానికి మాత్రం ప్రవచనాలు వల్లిస్తున్న ఆరిందం చౌదరి గురించి, హెచ్ ఎం టీ వీ నుంచి కోటి ఆశలతో వీ సిక్స్ చానెల్ కు వెళ్లి అక్కడి బాసు మూలంగా ఏడాదిలోనే ఒక చేదు 'అంకం' ముగించుకుని మళ్ళీ పాత చానెల్ కు వెళ్ళిన నా మిత్రుడి గురించి, అవినీతి జర్నలిస్టుల గురించి...సమాచారం పుష్కలంగా ఉన్నా...రాయబుద్ధి కాక రాయలేదు. ఈ మీడియా గురించి, భారత రాజకీయాల గురించి, కుక్క తోక గురించి రాయడం ఒక్కటే అని స్పష్టం కావడం ఒక్కటే ఈ నైరాస్యానికి కారణం కాకపోయినా....ఎందుకో మనసు పోలేదు. 

ఈ రోజు మాత్రం...వ్యక్తిగతమైన ఒక విషయాన్ని రాయడానికి బ్లాగు ఓపెన్ చేసాను...చాలా రోజుల తర్వాత. మా పుత్రుడు ఫిదేల్ గత ఆరు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ అనే చోట వున్నాడు. సీ బీ ఎస్ ఈ జాతీయ స్థాయి పోటీలలో అండర్ 14 వ్యక్తిగత విభాగంలో పాల్గొనేందుకు వెళ్ళాడు. మొన్న క్వార్టర్ ఫైనల్లో సుమిత్ గోగోయ్ అనే ఒక అస్సాం క్రీడాకారుడిని ఓడించిన ఫిదేల్ ఈ రోజు ఉదయం డిల్లీ కి చెందిన యుగమ్ గులాటి మీద సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేను ప్లాన్ చేసినట్లు మనవాడు ముందుకు వెళ్ళుతున్నాడని,  గోల్డ్ మెడల్ వస్తుందని అనుకున్నాము నేను, హేమ. కానీ ఫైనల్స్ లో బెంగాల్ కు చెందిన శివాజీ రాయ్ అనే ఆటగాడి చేతిలో ఈ మధ్యాన్నం ఓడిపోయాడు. పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అండర్ 14 విభాగంలో ఆ లెవెల్ కు పోవడమే గొప్ప. పైగా సిల్వర్ మెడల్ తెచ్చాడు. మాకు చాలా ఆనందం అనిపించింది. అది పంచుకోవడానికే ఈ పోస్టు. మరేదో రాస్తానని పోస్టు చివరి దాకా చదివి...'సొంత డబ్బా'తో చంపేస్తున్నాడు...' అని అనుకున్న వారికి సారీ. ఈ ఫోటోలో ఉన్నది మా వాడే. 

Tuesday, October 16, 2012

మా డాక్టర్ రెంటాల జయదేవకు నంది అవార్డు

జర్నలిజంలోకి ఇష్టపూర్వకంగా వచ్చి కష్టాలూ నష్టాలూ ఎన్ని ఎదురైనా...తట్టుకుని ఈ వృత్తినే అంటిపెట్టుకుని ఉండే  వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఇది ఉత్తమమైన మొదటి కోవ. ఈ వృత్తిలోకి వచ్చాక...దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని అనుకుని నైతికతతో రాజీపడి కులం ప్రాంతాలను అడ్డం పెట్టుకుని విలువలను గాలికొదిలే సార్లకు, తోటి జర్నలిస్టులను వుజ్జోగాల నుంచి తప్పించడానికి ఏ మాత్రం వెనుకాడని మూర్ఖులకు, యజమాని చెప్పిందే వేదమని నమ్మి ప్రచారం చేసే బ్యాచులకు ఖైరతాబాద్, జూబిలీహిల్స్ లలో కొదవే లేదు. ఇందులో మొదటి కోవకు చెందిన జర్నలిస్టు రెంటాల జయదేవ. ఉత్తమ సినీ విమర్శకు గానూ జయదేవ కు నంది అవార్డు వచ్చింది. 

నాకు సన్నిహిత మిత్రుడు అని చెప్పడం కాదు కానీ...జయదేవలో పాతతరం జర్నలిస్టులకు ఉండాల్సిన సద్గుణాలు చాలా ఉన్నాయి. "ఎందుకులే బాబూ...మమ్మల్ని ఇలా బతకనివ్వండి.." అనుకుంటూ తన పని తాను  చేసుకుపోయేగడసరి. ఇచ్చిన పనికి పూర్తి న్యాయం చేయాలని తపిస్తూ...నాణ్యతకు పెద్దపీట వేసే మనిషి. తాను దగ్గరి మనుషులు అనుకుంటే తప్ప మనసులో భావాలను, గుండెలో చిందులు వేసే చిలిపి తనాన్ని వెలికి తీయని మంచి మిత్రుడు. తనకు జరిగినా, ఇతరులకు జరిగినా అన్యాయాలను నిశితంగా విమర్శించే స్వభావం ఉన్నవాడు. అందుకే తానంటే...మా బ్యాచులో దాదాపు అందరికీ చాలా ఇష్టం. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో మేమంతా కలసి చదువుకున్నాం 1992 లో. ఈనాడు కు గుండెకాయ లాంటి జనరల్ డెస్క్ లో కలిసి పనిచేశాం. "ఈ అబ్బాయి గ్రాంథీక భాష రాస్తున్నాడండీ..." అని అప్పట్లో ఈనాడు జనరల్ డెస్క్ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఒక మానసిక వికలాంగుడు రామోజీ రావు గారికి తప్పుడు రిపోర్ట్ ఇస్తే...జయదేవ ఎంతగానో నొచ్చుకుని 'ఈనాడు' నుంచి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు ఒక పత్రికకు 'ఎడిటర్' గా ఉండి...అక్కడి జర్నలిస్టులను నంజుకు తింటున్న  ఆ 'మా.వి.' గాడిని ఒక రోజు కోపంతో పక్కకు తీసుకు వెళ్లి అడిగాను...."గుండె మీద చేయి వేసుకుని చెప్పండి....మీరు జయదేవ మీద చేసిన ఫిర్యాదులో నిజమెంత..." అని. అప్పట్లో న్యూస్ టుడే ఏం.డీ.గా ఉండి (ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న) ఒకడి వల్ల, మరొక ఇన్ చార్జ్ ప్రోద్బలం తో తానూ అలా తప్పుడు నివేదిక ఇచ్చానని 'మా.వి.' ఒప్పుకున్నాడు. మా ప్రిన్సిపాల్ బూదరాజు రాధాకృష్ణ గారి మీద కోపం తో వీళ్ళు  జయదేవను టార్గెట్ చేసారు. ఇలా....అర్థంతరంగా ఈనాడు నుంచి వెళ్ళిన జయదేవ 'ఇండియా టుడే' లో చేరి ఇప్పుడు అసోసియేట్ కాపీ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. తెలుగు నేలకు దూరంగా...వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. స్వర్గస్థులైన వారి నాన్న గారు, బహు గ్రంథకర్త రెంటాల గోపాల కృష్ణ గారు ఎంతో  సంతోషించే మంచి వార్త ఇది. 

నేను తర్వాత ఐదేళ్లకు 'ఈనాడు' వదిలి చెన్నై లోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చేరినప్పుడు జయదేవను కలిసేవాడిని. నవ్వుతూ...తుళ్ళుతూ మాట్లాడే జయదేవ నాకు మంచి స్నేహశీలి గా అనిపించేవాడు. మంచి ఆలోచనలను ప్రోత్సహించేవాడు. తరచి తరచి అడిగితె తప్ప సలహాలు ఇవ్వడు. మా బ్యాచులో మొదటి పీ.హెచ్ డీ అతనిదే. తెలుగులో చేసాడు. జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. తాను ప్రమాదకరం అనుకున్న వ్యక్తులతో ఆచితూచి మాట్లాడడం, అంటీ ముట్టనట్లు ఉండడం వల్ల  తనను అపార్థం చేసుకునే వారూ కొందరు నాకు తారస పడ్డారు. అది ఆయా వ్యక్తులకు సంబంధించిన విషయం. జయదేవకు నంది అవార్డు రావడం మాత్రం నాకు నా మిత్ర బృందానికి ఎంతో  ఆనందం కలిగించింది. 

మా వాడు ఎంతటి...మొహమాటస్తుడో తెలుసా మీకు? తాను రెండేళ్లుగా నడుపుతున్న బ్లాగు "ఇష్టపది"  గురించి కనీసం మాట మాత్రమైనా నా లాంటి మిత్రుడికైనా చెప్పలేదు. నాకిది ఈ పోస్టు రాసే ముందు తారసపడింది. ఇదేం  పోయే కాలం అంటే...."ఎందుకులే బాబు...మా బాధ మమ్మల్ని పడనివ్వండి..." అని ఒక నవ్వు నవ్వుతాడు. "జగమంత  కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది" అని బ్లాగు స్క్రోల్ లో ప్రకటించిన జయదేవ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.  

Sunday, October 14, 2012

మలాలా!...నువ్వు నిండు నూరేళ్ళు బతకాల

చిట్టితల్లీ...మలాలా...

స్కూలు నుంచి వస్తున్న నీ తలపై మనసు చచ్చిన తాలిబాన్ పంది గత మంగళవారం (అక్టోబర్ 9) పేల్చిన తూటా  మా అందరి గుండెలను గాయపరిచింది. అచేతన స్థితిలో రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నువ్వు తప్పక కోలుకోవాలని మేమంతా రోజూ ప్రార్ధనలు చేస్తున్నాం. నీపై దాడి గురించి తెలిసి దుఃఖం ఆపుకోవడం నా వల్ల  కాలేదు.  నీకు ఎలాంటి అపాయం కలగకూడదని శుక్రవారం నేనూ ఉపవాసం ఉన్నాను. అల్లాను 
ప్రార్ధించాను.  నీకేమీ కాదు. నువ్వు పువ్వులా నవ్వుతూ బైటికి వస్తావు. మా ప్రార్ధనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు, దీవెనలు వృధా పోవు. నీ పోరాటం వ్యర్ధం కాదు.  

ఈ రోజు 'డాన్' పత్రికలో వచ్చిన చిన్న వార్త నన్ను ఎంతగానో ఆనంద పరిచింది. మొట్టమొదటి సారి ఒక కాలు, చేయి కదిలించావని డాక్టర్ చెప్పారు. జర్మనీ లో వున్న ఒక అమెరికన్ ఆసుపత్రికి నిన్ను తరలించి మెరుగైన వైద్యం చేస్తారని అంటున్నారు. అంతా  సవ్యంగా జరిగి నువ్వు తొందరగా కోలుకుంటావు.

తల్లీ...మతం, కులం బురదలలో పొర్లుతున్న మా అందరికీ నిజానికి నువ్వు  ఒక గుణపాఠం. తాలిబాన్లు చెప్పిచేస్తున్నారు. ఆడపిల్లలను వద్దనుకోవడం, స్త్రీలను రకరకాలుగా కించపరచడం అన్ని మతాలలో ఉన్న తాలిబన్లు నిత్యం చేస్తున్న పనే. మంచి మాట చెబితే, మంచిని మానవత్వాన్ని గౌరవిద్దామని అడిగితే ....నీ కులాన్ని, మతాన్ని, అభిమతాన్ని ఎత్తిచూపి నోరు మూయడం ఇక్కడ మామూలయ్యింది. మతం, కులం వ్యక్తిగత లబ్ది కోసంవీరికి అద్భుత సాధనాలు. మనిషిని మనిషిగా చూస్తూ...లౌకిక భావనలతో బతకడం ఇక్కడ చేతకాదు.    

తాలిబాన్లను ఘాటుగా విమర్శిస్తున్నావని తెలిసి తెలిసీ ఈ న్యూ యార్క్ టైమ్స్, బీ.బీ.సీ. నీ కథనాలు ఎందుకు ప్రసారం చేసాయో తెలియడం లేదు. నీ ముఖాన్నైనా కవర్ చేయకుండా...ముష్కర మూకలపై నీ మాటల అస్త్రాలను ఆ జర్నలిస్టులు ఎలా ప్రసారం చేస్తారు? అలా చేయడానికి ఒక వేళ కుటుంబం అనుమతించినా...జర్నలిస్టుల నీతి నియమాలు ఏమయ్యాయి? నీ ఇంటర్వ్యూ చూసిన నాకు అప్పుడే అనిపించింది...మతిలేని తాలిబాన్ నీకేమైనా హాని చేస్తుందేమో అని.  నిజంగా అదే జరిగే సరికి తట్టుకోవడం కష్టంగా ఉంది. బాలికల విద్య కోసం, హాయిగా బతికే హక్కు కోసం నువ్వు చేస్తున్న పోరాటం, ఒక రాజకీయవేత్త గా దేశానికి సేవ చేయాలన్న నీ సంకల్పం ఎంతో గొప్పవి. పద్నాలుగేళ్ళ చిన్న వయస్సులోనే నీకున్న అభ్యుదయ భావాలు ఎంతో అబ్బురపరుస్తున్నాయి. 

ఏది ఏమైనా మలాలా...నువ్వు కోలుకుని...నిండు నూరేళ్ళు బతికి ఈ జనాల్లో ఉన్న మత పిచ్చిని, కుల గజ్జిని చెరిపివేసే శాంతి దూతవు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మలాలా...మంచి మనసులకు అవాంతరాలు ఎదురవుతాయి తప్ప అపజయం ఎదురు కాదు. అంతిమ విజయం నీదే.

photo courtesy: The Guardian (T.Mughal/EPA) 

Saturday, October 13, 2012

ABC ఛానల్ పరిస్థితి ఏమిటి?

 సీనియర్ ఎడిటర్ భావ నారాయణ గారి ఆధ్వర్యంలో ABC అనే ఛానల్ వస్తుందని తెలియగానే...దానికి పెట్టుబడి ఎవరు పెడుతున్నారో కనుక్కోమని ఒకరిద్దరు మిత్రులు అర్థించారు. పనుల ఒత్తిడి వల్ల నేను ఆ ప్రయత్నం చేయలేదు. అప్పటికే కొందరు జర్నలిస్టులను భావనారాయణ గారు నియమించారని కూడా సమాచారం. ఈ లోపు...CID పోలీసులు మైనార్టీ కార్పోరేషన్ లో కుభాకోణాన్ని బైట పెట్టారు. దర్యాప్తు తర్వాత సీ ఐ డి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్.వీ.రమణ మూర్తి విడుదల చేసిన ప్రకటనలో ఈ పేరాగ్రాఫ్ ABC లో చేరిన, చేరాలనుకున్న జర్నలిస్టులను అగాథం లోకి నెట్టింది.
"  It was confessed by Sai Kumar that an amount of Rs. 8 crores was paid to launch a new TV Channel in the name of ABC TV towards which he had entered into a MoU with one Bhava Narayana and others who were earlier working with various channels. " అని అందులో పేర్కొన్నారు. 
భావ నారాయణ బృందం కేవలం ఈ దొంగ బ్యాచ్ మీద ఆధారపడి  ఛానల్ ఆలోచన చేసిందా...వీళ్ళు జైలుకు వెళ్ళినా వేరే వాళ్ళ సహకారంతో చానెల్ వస్తుందా అన్నవి తేలాల్సిన అంశాలు. 
సీ ఐ డీ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి వాళ్ళు (పోలీసోళ్ళు) భావనారాయణ గారితో ఇప్పటికే మాట్లాడి ఉండాలి. లేకపోతె...త్వరలో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గానీ తెరవెనుక విషయాలు బైటికి రావు. 

పెట్టుబడులు పెట్టే వారి గురించి తెల్సుకోకుండా...డబ్బులు వస్తున్నాయి కదా...అని రెచ్చిపోతే...జర్నలిస్టులు తర్వాత ఇరుక్కుంటారు. ఈ విషయంలో నాకు ఒక వింత అనుభవం ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సలహా వల్ల  బైట పడ్డాను. లేకపోతె....గాలి జనార్ధన రెడ్డి గారి మాదిరిగా జైల్లో వుండే వాడినేమో!

ఈనాడు జర్నలిజం స్కూల్లో నాతొ పాటు చదువుకున్న ఒక సీమ పుత్రుడు చాలా రోజుల తర్వాత అప్పట్లో నాకు ఫోన్ చేసాడు. ఇప్పుడు జైల్లో ఉన్న ఒక ప్రముఖుడి దగ్గర ఆయన పనిచేసారు. నా బ్లాగు బాగుంటుందని...చాలా మంది చదువుతారని...తను కూడా ఇలాంటి మెటీరియల్ తో ఒక పత్రిక తెచ్చి మూసేసానని...ఆ పత్రికను మళ్ళీ  తేవడానికి పెట్టుబడి పెట్టడానికి తానూ సిద్ధంగా ఉన్నానని...చెప్పాడు. అది విని నాకు యమా ఊపు వచ్చింది. 
మీడియా మీద సీరియస్ గా పత్రిక తెచ్చి సమాజాన్ని అర్జెంటుగా ఉద్ధరించాలని నేను సీరియస్ గా ఆలోచిస్తున్న రోజులవి. వెంటనే...ఒక పత్రికలో పనిచేసి ఖాళీ గా ఉన్న ఒక మిత్రుడిని సంప్రదించి...ఆయనతో ఒక ప్రపోజల్ తయారు చేయించా. అప్పట్లో ఎన్  టీ  వీ నుంచి బైటికి వచ్చి ఖాళీగా ఉన్న హేమను కూడా అందులో ఇంవాల్వ్  చేయాలన్నది ప్లాన్. మొత్తం మీద....పెట్టుబడి పెడతానన్న మిత్రుడి గురించి ఆరా తీస్తే....ఆయన దగ్గర ఉన్నది క్లీన్ మనీ కాదని అర్థమయ్యింది. ఒక రెండు రోజులు నిద్ర మానేసి...ఏమిటి చేయడమని ఆలోచించాను. నీ పిచ్చి కాకపొతే...ఈ రోజుల్లో ఏ పెట్టుబడి దారుడి దగ్గరైనా...క్లీన్ మనీ ఉంటుందా? అన్న ఒక సన్నిహిత మిత్రుడి ప్రశ్న  నన్ను కన్వీన్స్ చేసింది. ఆఫీసు కోసం ఇల్లు కూడా వెతికాను. అడ్వాన్స్ ఇద్దామని, ఫర్నిచర్ సిద్ధంగా ఉందని మా పెట్టుబడి దారుడు చెబితే నమ్మాను. 

అయినా....మనసులో సందేహం వుండి ...నేను అభిమానించే ఒక పెద్ద మనిషి (సీనియర్ జర్నలిస్టు) దగ్గరకు వెళ్ళాను. పరిస్థితి వివరించాను. ఏమి చేయమంటారని అడిగాను. "అతన్ని నమ్మడానికి వీల్లేదు. అలాగని ఈ అవకాశం వదులుకోవడం కూడా చేయవద్దు. కొద్దిగా పెద్ద మొత్తాన్ని జాయింట్ అకౌంట్ లో వేయమను. అప్పుడు తేడా వస్తే....తర్వాత సంగతి తర్వాత చూడవచ్చు...," అని మా సారు అన్నారు. తనతో గొడవ వస్తే...ఏమిటన్న సందేహం వచ్చింది. సరే...దానికి సంబంధించి కూడా మనల్ను ఆరాధించే కండపుష్టి  వీరులు కొందరిని అలెర్ట్ చేసాను. 

ఇక్కడే నా అదృష్టం బాగుంది. నేను ఎప్పుడైతే...జాయింట్ అకౌంట్ అన్నానో...ఆ రోజు నుంచి మన పెట్టుబడిదారుడు నా ఫోన్ తీయడం మానేసాడు. ఒక పది సార్లు ప్రయత్నం చేసి...ఛీ...తనతో మనకు అనవసరమని వదిలేసాను. తర్వాత గాలి కుంభకోణం బైట పడడం...మన మిత్రుడి ఆచూకి తెలియకుండా పోవడం జరిగాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు.   

ఇలా...ఒక వారం పది రోజుల నా సమయాన్ని, నిద్రను, కలలను  ఖతం చేసింది...ఈ వ్యవహారం. అప్పుడు మళ్ళీ మా నాన్న చెప్పిన మాట గుర్తుకు వచ్చింది....పరిగెత్తి పాలు తాగడం కన్నా....హాయిగా నిలబడి నీళ్ళు తాగడం...ఉసేన్ బోల్టు లా పెరిగెత్తుతూ పాలు కిందా  మీదా పోసుకునే వారిని చూస్తూ...వీలయితే వద్దురా నాయనా...అని సూచిస్తూ  గడపడం అంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదని. 

భావ నారాయణ గారు కూడా ఈ సమస్య నుంచి బైటపడి...ఒక లక్షకో, లక్షన్నరకో ఏదో చానెల్ లో చేరి ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అది కష్టమైనా..జర్నలిస్టులు పెట్టుబడి గురించి కాస్త వాకబు చేసుకుని, డబ్బు కక్కుర్తికి పోకుండా కాస్త సురక్షిత చానెల్ లో పని చేయడం ఉత్తమం. 

Friday, October 5, 2012

V 6 కు పసునూరి శ్రీధర్ బాబు గుడ్ బై...

తెలుగు జర్నలిజం రంగంలో నాణ్యమైన జర్నలిస్టులలో ఒకరైన పసునూరి శ్రీధర్ బాబు వీ సిక్స్ ఛానెల్ కు రాజీనామా చేశారు. అక్కడ ఆయన ఎగ్సిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆ ఛానెల్ కు కొద్ది కాలంలోనే గుర్తింపు రావడంలో శ్రీధర్ పాత్ర ఎంతో ఉంది. ఈ పరిణామానికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ....సీ.ఈ.ఓ. అంకం రవికి శ్రీధర్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మంచి కవి కూడా అయిన శ్రీధర్ మానవ సంబంధాలకు గౌరవం ఇచ్చే జర్నలిస్టు గా పేరుంది. 

ఇదే ఛానెల్ లో ఫీచర్స్ ఎడిటర్ గా వున్న చల్లా శ్రీనివాస్ కూడా మూడు రోజుల కిందట వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. చల్లా శ్రీనివాస్, అంకం రవి ఐ-న్యూస్ లో కలిసి పనిచేసారు. శ్రీనివాస్ ను రవి ఏరికోరి వీ-సిక్స్ కు తీసుకువచ్చారు. 


శ్రీధర్ బాబు చెన్నై లో ఇండియా టుడే లో చాలా కాలం పాటు పనిచేసారు. హెచ్. ఎం. టీ వీ ఆరంభంలో ఆ ఛానెల్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మీద ఎంతో నమ్మకంతో ఆ ఛానెల్ లో చేరారు. అక్కడ కోర్ కమిటీ లో ఆయన ఒక సభ్యుడిగా ఉండేవారు. అంకం రవి చొరవతో...మూర్తి గారి బృందం నుంచి శ్రీధర్ వెళ్ళిపోయి వీ సిక్స్ లో చేరారు.

"ప్రాంతం, కులం వంటి అంశాలకు ప్రాముఖ్యమిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఆ రెండు అంశాలకన్నా బలమైన వ్యక్తిగత అహంకారాల వల్ల శ్రీధర్ ఇబ్బంది పడ్డారు," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.     

రవి, శ్రీధర్ ల గురించి కిందటేడాది ఆగస్టులో నేను రాసిన పోస్టు చూడండి.

Sunday, September 30, 2012

ఆటల్లోనూ స్త్రీల పట్ల చిన్న చూపు....

నిన్న U-TV మూవీస్  లో 'బాగ్బన్' అనే హిందీ సినిమా చూసాను. ఆఖరి సన్నివేశంలో అమితాబ్ డైలాగ్, నటన చతురత చూసి గుండె ఉప్పొంగింది. ఏమి నటన, ఏమి డైలాగ్ డెలివరీ? 
ఇదే సినిమాలో..అర్థరాత్రి బాయ్ ఫ్రెండ్ కారులో దింపగా ఇంట్లోకి వచ్చిన మనుమరాలికి సుద్దులు బోధించబోతుంది హేమమాలిని. అప్పుడు ఆమె కోడలు...రోజులు మారాయి అని అన్నప్పుడు...హేమమాలిని ఇలా అంటుంది. "అమ్మా...రోజులు మారినా...ఆడదాని పరిస్థితి మారలేదు." ఈ మాట యెంత సత్యం?

గత వారంగా ఒక విషయంలో నా గుండె మండి పోతున్నది.  మహిళల పట్ల సామూహికంగా ప్రపంచానికి ఉన్న చిన్న చూపునకు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అందరం కలిసి దర్జాగా చేస్తున్న ఒక మహా పాపం. 

శ్రీలంకలో ఇప్పుడు ప్రపంచ కప్ టీ  ట్వంటీ టోర్నమెంట్ జరుగుతున్నది కదా. జనమంతా వెర్రెక్కినట్లు  దాని గురించి మాట్లాడుకుంటున్నారు. చర్చలతో కాలక్షేపం చేస్తున్నారు. మీడియా అదే పనిగా దాని తాలూకు వార్తలు చూపుతున్నది, రాస్తున్నది. కొన్ని చానెల్స్ ప్రతి మ్యాచ్ నూ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. కానీ..అదే శ్రీలంక లో జరుగుతున్నా మహిళల ప్రపంచ కప్ క్రికెట్ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మ్యాచ్ రిపోర్టులు కూడా మీడియా లో రావడం లేదు. వచ్చినా...స్పోర్ట్స్ పేజీలో చిన్న ముక్కలుగా వస్తున్నాయి. ఇది దారుణం, అందరం ఖండించాల్సిన విషయం. 

అంతే  కాదు....స్కూల్ స్థాయి నుంచి...ప్రపంచ స్థాయి వరకూ ప్రైజ్ మనీ లో తేడా ఉంటుంది. మహిళల విభాగంలో విన్నర్ కు, పురుషుల విభాగంలో విన్నర్ కన్నా తక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది. ఇది ఎంత  అమర్యాద? ఇంత  జరుగుతున్నా....మన మేథావులు గానీ...మహిళా సంఘాలు గానీ గళం విప్పకపోవడం వింతగా ఉంది. ఇది రాస్తుంటే....'యెంత కాదన్నా...మహిళలను మనం నీగ్రోలుగా చూస్తాం....'అన్న జాన్ లెనిన్ లిరిక్ గుర్తుకు వస్తున్నది. 

Woman is the nigger of
the world
Yes she is...think about it
Woman is the nigger of
the world
Think about it...do
something about it

We make her paint her
face and dance
If she won't be slave ,we
say that she don't love us
If she's real, we say she's
trying to be a man
While putting her down we
pretend that she is above us

Woman is the nigger of
the world...yes she is
If you don't belive me take a
look to the one you're with
Woman is the slaves of
the slaves
Ah yeah...better screem
about it
We make her bear and raise
our children
And then we leave her flat for
being a fat old mother hen
We tell her home is the only
place she would be
Then we complain that she's
too unworldly to be our friend
Woman is the nigger of
the world...yes she is
If you don't belive me take a
look to the one you're with
Woman is the slaves of
the slaves
Yeah (think about it)

We insult her everyday on TV
And wonder why she has no
guts or confidence
When she's young we kill her
will to be free
While telling her not to be so
smart we put her down for being so dumb
Woman is the nigger of
the world...yes she is
If you don't belive me take a
look to the one you're with
Woman is the slaves of
the slaves
Yes she is...if you belive me,
you better screem about it.

Repeat:
We make her paint her
face and dance
We make her paint her
face and dance We make her paint her
face and dance
  

Wednesday, September 26, 2012

సత్తిబాబు చేతికి జీ..24 గంటలు?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ జీ 24 గంటలు చానెల్ ను కొన్నట్లు సమాచారం. 75:25 లెక్కన చానెల్ కార్యక్రమాలను ప్రసారం చేయాలని బొత్స, జీ గ్రూప్ నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే....ఆ చానెల్ కార్యక్రమాలు మూతపడకుండా కొనసాగుతున్నట్లు అక్కడి ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికే...జీ గ్రూప్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టుల నుంచి రాజీనామా పత్రాలు స్వీకరించి అకౌంట్లు సెటిల్ చేసే పనిలో వున్నది.  శైలేష్ రెడ్డి వర్గీయులుగా ముద్ర పడిన సీనియర్లు కొందరు మినహా చాలా మంది జర్నలిస్టులు వేరే చానెల్స్ కు వెళ్ళిపోయారు. పూర్తి  వివరాలు అందాల్సి వుంది.

Thursday, September 6, 2012

ప్రధాని కార్యాలయం vs 'వాషింగ్టన్ పోస్ట్' రిపోర్టర్

 భారత ప్రధాన మంత్రి పని తీరు ను విశ్లే షిస్తూ నిన్న టి సం చికలో  'వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించిన వ్యాసం మీద ఆసక్తి కరమైన చర్చ జరుగుతున్నది. మన్మోహన్ వెర్షన్ లేకుండా వ్యాసం రాసారని, అది ఎల్లో జర్నలిజం అని ప్రధాని కార్యాలయం పేర్కొనగా...తాను ఎన్ని సార్లు అడిగినా ఇంటర్వ్యూ  ఇవ్వలేదని, అధికారులూ స్పందించలేదని పోస్ట్ ఇండియా బ్యూరో చీఫ్ Simon Denyer (పై ఫోటో) స్పష్టం చేసారు.  

"The Underachiever" అనే కవర్ స్టోరీతో టైమ్స్ మాగజీన్ మన్మోహన్ ను దూదేకిన కొన్ని రోజులకే అమెరికన్ దిన పత్రిక ఒకటి ఇలా విరుచుకు పడడడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు.   

బాధ్యతాయుతమైన విలేకరులు వివరణల కోసం ప్రయత్నిస్తే....అటు పక్క ఉన్న వారు సరిగా స్పందించకపోతే...పరిస్థితి ఇలానే వుంటుంది మరి. 'పైన పేర్కొన్న వ్యాసానికి సంబంధించి వివరణ కోసం ఇంటర్వ్యూ అడిగినా ఇప్పుడు కుదరదని అన్నారు ప్రధాని. అందుకే ఆయన వివరణ ఇవ్వలేక పోతున్నాం...," అని Simon Denyer తన వ్యాసంలో పేర్కొని వుంటే బాగుండేదేమో.

వాషింగ్టన్ పోస్ట్ వ్యాసం మీద ప్రధాన మంత్రి కార్యాలయం చేసిన ఫిర్యాదు, దానికి ఆ పత్రిక ఇండియా బ్యూరో చీఫ్ Simon Denyer వివరణ ఇలా వున్నాయి. 


The following is a letter from the Prime Minister’s office:
Dear Simon,
We do not complain about criticism of the government which is a journalist’s right. But I am writing this letter for pointing out unethical and unprofessional conduct at your part.
I would like to put on record my complaint about your article which was published today on many counts:
— Despite all lines of conversations open, you never got in touch with us for our side of the story though you regularly talk to me about information from the PMO. This story thus becomes totally one sided.
— You have been telling the media here in India that your request for an interview was declined though the mail below says clearly that the interview was declined “till the Monsoon Session” of the Parliament which gets over in two days.
— When I rang you up to point this out, you said sorry twice though you tell the media here that you never apologised.
— Your website where we could have posted a reply is still not working, 11 hours after you said sorry the third time for its inaccessibility.
— The former Media Adviser to the PM Dr Sanjaya Baru has complained that you “rehashed and used” an 8 month old quote from an Indian Magazine.
We expected better from the correspondent of the Washington Post for fair and unbiased reporting.
Without going into your one sided assessment of the Prime Minister’s performance, as comment is free in journalism, I hope you will carry this communication in full in your paper and your website so your readers can judge for themselves what is the truth.
Sincerely
Pankaj Pachauri
Communications Adviser to the Prime Minister’s Office
New Delhi - India

ఈ లేఖకు రిపోర్టర్ రాసిన సమాధానం ఇలా వుంది. 


Thanks for your comments. I wanted to respond point-by-point:
— I requested an interview with the PM on three occasions, and also with T.K.A Nair, Advisor to the Prime Minister, and with Pulok Chatterji, Principal Secretary in the Prime Minister’s Office. Those requests were either ignored or declined.
— When I made my final request for an interview with the PM in July, I was told on July 30 “The PM has declined all interview requests till the Monsoon session is over.” At that stage the current session of parliament (known as the Monsoon session) of parliament had not even begun. There was no mention of the possibility of an interview afterwards. In any case my story touches on the fact that parliament has been adjourned every day throughout the current session by opposition calls for the PM to resign, which is a story I felt should be told, interview or not.
Indeed, we remain extremely interested in speaking to the prime minister.
— My apology was for the fact that the website was down and the PM’s office could not post a reply directly. As soon as the problem was fixed, I informed them. I stand by the story.
— I spoke to Dr Baru personally on the telephone during the reporting for the story. He confirmed that these sentiments were accurate.
Regards,
Simon Denyer

వ్యాసం మీద సవరణ ప్రచురించిన వాషింగ్టన్ పోస్ట్ 

అయితే...నిన్నటి వ్యాసం (India's 'silent' prime minster becomes a tragic figure) మీద వాషింగ్టన్ పోస్ట్ ఒక సవరణ ప్రచురించింది ఈ రోజున.

ఆ వ్యాసంలో వాడుకున్న రెండు ముఖ్యమైన వ్యాఖ్యలను ఎక్కడి నుంచి తీసుకున్నదీ చెప్పకపోవడం తప్పే అని ఒప్పుకున్నది. ఆ సవరణ ఇలా వుంది.


Correction: 
An earlier version of this article failed to 
credit the Caravan, an Indian magazine, for two statements that it originally published in 2011. The assertion by Sanjaya Baru, a former media adviser, that Singh had become an object of ridicule and endured the worst period in his life first appeared in the Caravan, as did an assertion by Ramachandra Guha, a political historian, that Singh was handicapped by his “timidity, complacency and intellectual dishonesty.” While both men told The Post that the assertions could accurately be attributed to them, the article should have credited the Caravan when it used or paraphrased the remarks. 
The article has been updated.