Saturday, February 26, 2011

రాంగోపాల్ వర్మపై TV-9 తీరు అభ్యంతరకరం

ప్రేక్షకులు దేవుళ్ళని అన్న ఎన్టీర్ అనుకుంటే...ప్రేక్షకులు వెర్రి వెధవలు, దద్దమ్మలు, చవటలని రాంగోపాల్ వర్మ భావిస్తున్నారన్న ఓపెనింగ్ వ్యాఖ్యలతో చెత్త కథనాన్ని బుధవారం ప్రసారం చేసిన TV-9 ఆ దర్శకుడిని స్టూడియోలో మరింతగా అవమానించింది శుక్రవారం. దర్శకుడిగా కాకపోయినా...ఒక వ్యక్తిగా అయినా వర్మకు విలువ ఇవ్వకుండా...నోటికొచ్చిన ప్రశ్నలు అడిగి యాంకర్ రజనీకాంత్ ఆయనను అవమానించారు. ఇదొక వైపరీత్యం, అన్యాయం, ఆటవిక జర్నలిజం. 

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు...పైత్యం ముదిరి రాంగోపాల్ వర్మ అయ్యారనీ, వర్మ తీసిన సినిమా చూడడం ఏ జన్మలోనో చేసుకున్న పాపమనీ, వర్మకు ఇప్పుడు వాయిస్ ఓవర్ల పిచ్చి పట్టిందని, ఆయన డ్రాం గోపాల్ వర్మ అనీ ....విపరీత వ్యాఖ్యలు చేసిన ఆ చానెల్ పిలిస్తే...స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు చెత్త ప్రశ్నలు ఎదుర్కోవడం వర్మ చేసిన పెద్ద తప్పు. కామ్ గా కేసువేసి మంచి లాయర్ను పెట్టుకోక...వర్మ ఆ స్టూడియోకి వెళ్ళారు. హద్దులు మీరి అతితెలివి ప్రశ్నలు వేయబోయిన రజనీకాంత్ ను ఆడుకొని రాంగోపాల్ వర్మ ప్రేక్షకులకు కనువిందు కలిగించడం బాగుంది కానీ...టీ.ఆర్.పీ.రేటింగ్ కోసం TV-9 ఇలా వివాదం సృష్టించి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం బాగోలేదు. ఇది జర్నలిజం ఏ మాత్రం కాదు. తన తీరును అటు రవి, ఇటు రజని పునఃసమీక్షించుకోవాలి.    

ఏ దర్శకుడి కెరీర్లోనైనా...ఏ మనిషి జీవితంలోనైనా ఎగుడు దిగుళ్ళు సాధారణమే. వరస ఫ్లాప్స్ అనేది ఒక మహా పాపమయినట్లు, ఒక నెగిటివ్ స్టొరీ ప్రసారం చేసి సుద్దులు చెబితే...ఆయన ఆస్కార్ కొట్టేంత ఎదిగిపోతారనట్లు బిల్డప్ ఇవ్వడం బుల్లి తెర వీక్షకులను వెర్రి వెధవలను, దద్దమ్మలను, చవటలను చేసే ఒక విన్యాసం మాత్రమే!

Friday, February 25, 2011

'రామ్ ఢమాల్ వర్మ' పై కథనం: TV-9 కు లీగల్ నోటీస్!

ఎవరిమీదనైనా...ఎలాంటి కార్యక్రమమైనా... ప్రసారం చేస్తానని విర్రవీగుతున్న TV-9 ఛానల్ తిక్కకుదిర్చే పని ఎట్టకేలకు ఒక వ్యక్తి  చేసాడు.  ఆయన...ఎప్పుడేమి చేస్తాడో, ఎప్పుడేమి చెబుతాడో తెలీని వ్యక్తే అయినా...ఆయన చర్య ఈ తలతిక్కల చానెల్స్ కు ఒక గుణపాఠం అవుతుందన్న ఆశాభావం నాకుంది. ఆ వ్యక్తే...స్టార్ దర్శకుడు....రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసినట్లు చెబుతున్న ప్రకటన ఇలా ఉంది.
"With regard to an extremely derogatory programme done by TV9 on me titled 'Ram Dhamaal Varma' where they have attributed many false quotes to me of which one example is 'Prekshakullu Verri Vedhavulu'. I am here by informing that I am initiating criminal action against TV9 for defamation with a criminal intent"

ఈ గొడవకు కారణమైన కార్యక్రమం "రామ్ ఢమాల్ వర్మ" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని TV-9 ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం ప్రసారం చేసింది. జర్నలిజం ప్రమాణాల పరంగా చూస్తే ఈ కార్యక్రమం నిజంగా ఒక చెత్త. వర్మపై వ్యక్తిగతంగా కసితో చేసిన పరుషమైన మాటల దాడి. శాస్త్రీయ విశ్లేషణలేని  ఎల్లో జర్నలిజం. వర్మే కాక ఎవరిపైనైనా ఇంత దారుణమైన దాడి చేయడం తగని పని. 

I-News లో కనిపించిన చల్లా శ్రీనివాస్, HM-TV లో పనిచేసిన ప్రభు అనే 'సినీ విశ్లేషకులను' స్టూడియోలో కూర్చోబెట్టి భద్రి అనే యాంకర్ యమ కసితో ఈ ప్రోగ్రాం చేసారు. వర్మ కెరీర్ గ్రాఫ్ అథఃపాతాళానికి పడిపోయింది...ఆయన తీసిన లేటెస్ట్ సినిమా అప్పలరాజ్ ది మోస్ట్ వరస్ట్ ఫిలిం అనుకుంటున్నారు...వంటి కామెంట్స్ భద్రి చేసారు. 
ఆ చల్లా శ్రీనివాస్ అయితే వర్మ..."ఇష్టమొచ్చిన సొల్లు వాగుతున్నాడు...", "గారడీ చేస్తున్నాడు", "చేతగాని...చేవలేని డైరెక్టర్", "ఇంట్రావర్ట్" వంటి కామెంట్స్ తేలిగ్గా చేసారు. "ఆయన క్రియేటివిటీని రీ చార్జ్ చేసుకోవాలి," అని కూడా అయన సలహా ఇచ్చారు. "రామ్ గోపాల్ వర్మ అంటే భయపడే స్థితిలో జనం వున్నారు," అని ప్రభు చెప్పారు. మధ్యలో...యండమూరి కూడా ఏదో మాట్లాడినట్లు వున్నారు...నేను అది మిస్ అయ్యాను. 

ఇక ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నప్పుడు ఆ చానెల్ తెర మీద కనిపించిన వాక్యాలు ఇవి: 
--వర్మకు మతి భ్రమించిందని కామెంట్లు
--రోజు రోజుకీ పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయి
--అతని సినిమాలు చూస్తే ప్రేక్షకులకు తిప్పలే
--ఇప్పుడు తీస్తున్నవన్నీ పరమసోది సినిమాలే
--సినిమా మేకింగ్ పై వర్మ శ్రద్ధ తగ్గింది

ఇలా సాగిన ప్రోగ్రాం ఎవరోచెప్పి చేయిస్తే...ఈ చానెల్ చేసిందన్న అనుమానం కలగకమానదు. 'వర్మ కెరీర్ గ్రాఫ్' అంటూ ఒక ప్రోగ్రాం ను కూడా ఇందులో ప్రసారం చేసారు. అందులో...చానెల్ కున్న కక్కుర్తి రోగం ప్రకారం నడుము తిప్పే భామల, సొగసులు చూపే సుందరాంగుల ఫిలిం క్లిప్స్ చూపించి కుతి తీర్చుకున్నారు. 

ఈ ప్రోగ్రాంతో వర్మకు మండిందట. అలా మండడం నిజానికి మంచి పరిణామం. ఇది కోర్టులో నలిగి...ఈ ప్రోగ్రాం చేసిన వారి నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయడమో, వ్యక్తిగత దాడి చేసినందుకు సంబంధీకులకు అరదండాలు వేయడమో చేస్తే బాగుంటుంది. మిగిలిన చానెల్ ఎజమానులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 

వర్మ ఒక ఐదు కోట్లు ఇస్తే....రవి ప్రకాష్ నుంచి ఈ కార్యక్రమం ఆధారంగా ఒక యాభై కోట్లు నష్టపరిహారం పొందే మార్గం చెప్పడానికి మా అబ్రకదబ్ర సిద్ధంగా ఉన్నాడు. వర్మా....ఆర్ యూ రెడీ?

'ది హిందూ' విజయవాడ బ్యూరో చీఫ్ గా సుసర్ల రమేష్

'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక విజయవాడ బ్యూరో చీఫ్ గా సీనియర్ జర్నలిస్టు, ఆ పత్రికలో ఇప్పటికే అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న సుసర్ల రమేష్  నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్న కె.శ్రీమాలికి  అమెరికన్ కాన్సులేట్ లో ఉన్నత పదవిలో చేరడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. 
ఈ మధ్య కాలం వరకూ గుంటూరులో పనిచేసిన రమేష్ గారు ఇటీవలనే విశాఖపట్నం బదిలీ అయ్యారు. ఆయన మార్చ్ 24 న ఆ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. "ఫ్రెండ్స్ టు సపోర్ట్" అనే సంస్థ నిర్వహించిన రక్త సేకరణ, రక్తదాతల సమాచార సేకరణలో సుసర్ల రమేష్ కీలక భూమిక పోషించారు. 
మాజీ బ్యూరో చీఫ్ శ్రీమాలి సొంత అన్నయ్య చక్రపాణి HM-TV లో అసిస్టెంట్ ఎడిటర్ కాగా, సుసర్ల రమేష్ కజిన్ సుసర్ల నగేష్ కుమార్ 'ది హిందూ' ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో చీఫ్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సంబంధాలతో సంబంధంలేకుండా...అటు శ్రీమాలి, ఇటు రమేష్ ఎంతో కష్టపడి జర్నలిజం లో కెరీర్ ఏర్పరుచుకున్నారు. శ్రీమాలి 'టైమ్స్ అఫ్ ఇండియా' నుంచి, రమేష్ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' నుంచి 'ది హిందూ' లో చేరి ఉన్నత పదవులను అందుకున్నారు. ఈ పై ఫోటోలో ఉన్నది సుసర్ల రమేష్ గారు...అయన ఒక సెమినార్ లో పాల్గొన్నప్పటి దృశ్యం.
అంతకుముందు అదే గుంటూరులో పనిచేసిన సాయ శేఖర్ గారు కూడా ఆనతికాలంలోనే విజయవాడ బ్యూరో చీఫ్ గా పదోన్నతి పొందారు.  

Tuesday, February 22, 2011

'కాకి లెక్కలు' సామెత-'ఈనాడు' లో శ్రీధర్ గారి కార్టూన్

'ఈనాడు' లో ఇవ్వాళ ఈ పక్కన ఉన్న కార్టూన్ ప్రచురితమయ్యింది. "కావ్...కావ్...నేను బడ్జెట్ తయారీకి వెళుతున్నా...రెండు రోజుల్లో తిరిగి వస్తాలే. బై బై.." అని ఒక కాకి... తొర్రలో ఉన్న ఇంకొక కాకితో అంటున్నది ఇక్కడ. 
శ్రీధర్ గారు వేసే ఈ కార్టూన్ (పాకెట్ కార్టూన్ అంటారు) పైన ఒక లుక్ వేయకుండా ఉండడం తెలుగు రీడర్స్ కు చాలా కష్టం. పొద్దున్నే దీన్ని చూసి...'ఇందేంటిరా...కాకి బడ్జెట్ తయారీకి వెళతా అంటోది....మన మట్టి బుర్రకు ఇది అర్థం కాలేదేమోలే. తర్వాత తీరిగ్గా చూద్దాం...' అని వదిలేసాను. ఆఫీసుకు వచ్చాక ఒక 'ఈనాడు' సోదరుడు ఫోన్ చేసి...కోపంగా 'కార్టూన్ చూసావా?' అని అడిగితే...మరొక లుక్ వేస్తేగానీ అర్థం కాలేదు....'కాకిలెక్కలు' అనే సామెత ఆధారంగా శ్రీధర్ ఆ కార్టూన్ వేసారని. అంటే...బడ్జెట్ లెక్కలు కాకి లెక్కల్లా వుంటాయనే అర్థంలో ...సింబాలిక్ గా ఆ కార్టూన్ వేసి ఉంటారు ఆయన. 
'కాకిలెక్కలు' అనే సామెతకు అసలు అర్థం గురువు గారు బూదరాజు గారు ఒకసారి చెప్పిన విషయాన్ని మన సోదరుడు గుర్తుచేసాడు. కాకులు ఒక చోట గుంపుగా వాలాయనుకోండి. వాటిని లెక్కించమని ఎవరైనా చెబితే...మనం ఆ పనిచేయలేము. ఎందుకంటే...కాకులు ఒకేచోట ఉండకుండా....అటూ ఇటూ పోతుంటాయి. ఇలా లెక్కతేలని వ్యవహారాన్ని చెప్పుకోడానికి పుట్టుకొచ్చిందట ఆ సామెత. 'తప్పుడు లెక్కలకు' కాకి లెక్కలు అనే అర్థంలో మనం వాడుతున్నాం. ఈ విషయం తెలీకుండా కార్టూన్ వేసే కార్టూనిస్టు కాదు...శ్రీధర్ గారు. 
(Cartoon courtesy: Eenadu Telugu Daily)

యాంకర్ కిరణ్ పై లైవ్ షోలో జర్నలిస్టు పాశం యాదగిరి ఆగ్రహం

ఆంధ్రా ప్రాంతానికి చెందిన యాంకర్లపై ఉన్న కోపాన్ని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణా ఉద్యమ నేత పాశం యాదగిరి గారు నిన్న రాత్రి HM-TV లైవ్ షో లో సీనియర్ యాంకర్ కిరణ్ పైన వెళ్ళగక్కారు. "తెలంగాణాకు వ్యతిరేకంగా పనిగట్టుకుని పనిజేస్తున్న చానెల్స్" ను బహిష్కరించాలని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించడంపై 'కేబుల్ ట్రబుల్' పేరిట  హెచ్-ఎం.టీవీ చర్చ నిర్వహించింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటి నంది అవార్డును గెలుచుకున్న కిరణ్ దీనికి యాంకర్ గా వ్యవహరించారు. 

ఇద్దరు తెలంగాణా కేబుల్ ఆపరేటర్స్, యాదగిరి గారు సహా ఆరుగురు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో తన అభిప్రాయాలు వెల్లడించడానికి సరైన అవకాశం ఇవ్వలేదని యాదగిరి గారికి ఆగ్రహం వచ్చింది. చర్చ చివర్లో...చర్చ నుంచి వైదొలగబోయిన యాదగిరి గారికి కిరణ్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. అప్పుడు...కిరణ్ ఆంధ్రా ప్రాంత యాంకర్ కాబట్టే తనకు అవకాశం ఇవ్వలేదని, అన్ని చానెల్స్ లో ఇదే పరిస్థితి వుందని యాదగిరి గారు ఆగ్రహంగా విమర్శలు చేసారు. తనకు గానీ, చానెల్ కు గానీ అలాంటి ఉద్దేశం లేదని కిరణ్ చెప్పినా యాదగిరి గారి కోపం చల్లారలేదు. ఆంధ్రా యాంకర్లు తెలంగాణా గళం వినిపించకుండా చేస్తున్నారని, ఇలాంటి వాళ్ళను నియమించుకోకూడదని తర్వాత కూడా ఆ ఛానల్ చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తితో కూడా అన్నారని సమాచారం.

చురుకైన భావాలు, మంచి రచనా శక్తి, అద్భుతమైన అవగాహనా శక్తి ఉన్న యాదగిరి అన్న కిరణ్ ను అలా అనకుండా వుండాల్సిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కిరణ్ పై ఆగ్రహంతో ఊగిపోవడాన్ని, లైవ్ లో రూడ్ గా వ్యవహరిస్తూ అలాంటి మాటలు అనడాన్ని నేను ఖండిస్తున్నాను. యాదగిరి అన్నది ధర్మాగ్రహమే అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కొన్ని చానెల్స్ లో ఉన్న (ఉదాహరణకు....TV-9 యాంకర్  రజనీకాంత్)  యాంకర్స్, మోడరేటర్స్ పక్షపాతంతో చర్చలు జరుపుతారని ససాక్ష్యంగా ఇదే బ్లాగ్ లో నేనూ పోస్టులు రాసాను. అంటే...అలాంటి వాళ్ళను అనాలి గానీ...కిరణ్ ను అవమానించాలని చూడడం ఏ మాత్రం పధ్ధతి కాదు. 

కిరణ్ ఏదో HM-TV లో చేస్తున్నారు కాబట్టి నేను ఇది రాయడం లేదు. తనను నేను 'ఈ-టీవీ' రోజుల నుంచీ చూస్తున్నాను. తను నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. నెల్లూరులోనో, ఏలూరులోనో సిటీ కేబుల్ లో న్యూస్ రీడర్ గా చేరి...తన ప్రతిభకు మెరుగుపెట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన యాంకర్ కిరణ్. ఈనాడు మీడియాను శాసిస్తున్న ఏ అగ్రకులానికీ చెందకపోయినా, గాడ్ ఫాదర్స్ లేకపోయినా....కేవలం స్వయంకృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపనతో యాంకరింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కిరణ్ ను నొప్పించడం దారుణం. 

యాదగిరన్నా...HM-TV అన్ని జిల్లాల నుంచి లైవ్ ద్వారా ప్రసారం చేసిన...'దశ-దిశ' కు ప్రధాన యాంకర్ కిరణ్. ఏనాడూ...తొణక్కుండా బెణక్కుండా కేవలం యాంకర్ గా తన విధి తాను నిర్వర్తించిన ప్రొఫెషనల్ కిరణ్ అని మీకు బహుశా ఎవరూ చెప్పి వుండరు. మీరు ఈ పోస్ట్ చదివితే....ఒక్కసారి కిరణ్ తో మాట్లాడి సారీ చెబితే బాగుంటుంది.

Sunday, February 20, 2011

ఆంధ్రా బిర్యానీ--పెండ--కేసీఆర్: రామ్ బాణం-4

లోక్ సత్తా అధినేత జే.పీ.గారి మీద అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద భౌతిక దాడి జరగడం నాకు తీవ్ర ఆవేదన కలిగించింది. అవినీతిరహిత సమాజం, ప్రజాస్వామ్య విలువలు... వంటి వాటి కోసం బాధపడుతూ,  ఆ దిశగా ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసేవారు కరువైన ఈ రోజుల్లో జే.పీ.గారు చేపట్టిన ఉద్యమానికి సాల్యూట్ చేసే వారిలో నేనూ ఒకడ్ని. 'ఈనాడు'లో సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డ్ లో ఉన్నప్పుడు ఆయన కాలమ్ 'భవిష్యత్ భారతం' కాపీలను చాలా సార్లు ఎడిట్ చేసి ఆయనకు ఫ్యాన్ గా మారాను. లోక్ సత్తాలో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయాలనుకున్నా....'ది హిందూ' ఉద్యోగం వదులుకోవడం ఇష్టంలేక ఆ పని చేయలేదు. కూకట్ పల్లిలో జే.పీ.గారిని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన అవసరాన్ని విశ్లేషిస్తూ 'ఈనాడు' ఎన్నికల పేజీకి ఒక వ్యాసం కూడా పంపాను-అప్పట్లో. 'ఈనాడు' నుంచి బైటికి వెళ్ళిన వాడిని దేశద్రోహిగా చూసే 'ఈనాడు' వారు అది ప్రచురించలేదనేది వేరే విషయం.  ఆ తర్వాత సునిశితంగా పరిశీలిస్తే....జే.పీ. గారికి కొన్ని పక్షపాతాలు వున్నాయేమో అన్న అభిప్రాయం నాకూ కలిగింది. తెలంగాణా ప్రజల మనోభావాలను, విద్యార్థుల పోరాటాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లు నాకు అనిపించలేదు. ఇక్కడి నాయకులను చూసి జనం మనోభావాలను తప్పుగా అర్థంచేసుకుంటే ఎలా? కులాలకు, ప్రాంతాలకు అతీతంగా తమ నిర్ణయాలు ఉంటాయని ఇలాంటి దేశభక్తులు నిరూపించుకోవాలి కదా!. ఒక వర్గానికి దగ్గరై , ఒక ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం జనంలో కలగకుండా జాగ్రత్త వహించాలి.

సరే...ఇతరులను ఇబ్బందిపెట్టనంత వరకు ఎవడి ఏడుపు వాడు ఏడవవచ్చు. కానీ ఇతరులపై మాటల, చేతల (భౌతిక) దాడి చేయడం మంచిది కాదని నా అభిప్రాయం.  ఆ పని జే.పీ. చేసినా, కే.సీ.ఆర్. చేసినా మంచిది కాదు. ఈ మధ్యన కే.సీ.ఆర్. గారు ఆంధ్రా ప్రాంత ప్రజలను, అక్కడి బిర్యానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు శృతిమించినట్లు నాకు అనిపించింది. మనవాడు చేసినా, ఎదుటివాడు చేసినా తప్పు తప్పే, అది ఎత్తిచూపడం జర్నలిస్టు విధి అని నమ్మి ఈ సారి 'రామ్ బాణం' ఈ వ్యాఖ్యల మీద రాసాను. ఇందులో చివర్లో 'ఆక్షేపణీయం' స్పెలింగ్ దోషం వుంది. థాంక్స్. 

Tuesday, February 15, 2011

విజయవాడ కేంద్రం గా కొత్త న్యూస్ ఛానల్!

ఏ టెలివిజన్ ఛానెల్ అయినా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. మాజీ జర్నలిస్టు అంకబాబు అనే ఆయన చొరవ తీసుకుని, డబ్బు పోగేసి విజయవాడ కేంద్రంగా త్వరలో ఒక కొత్త న్యూస్ ఛానెల్ తేవాలని భాస్తున్నట్లు సమాచారం. 
సీనియర్ జర్నలిస్టు అయిన అంకబాబు 'ఈనాడు' 'ఉదయం' లలో పనిచేసారు. ఆ తర్వాత మాగుంట సుబ్బిరామి రెడ్డి దగ్గర ప్రజా సంబంధాల వ్యవహారాలు చూసారు. ఆ సమయంలో జీవన సత్యాలు తెలుసుకుని ఆయన జీవితంలో పైకి ఎదిగారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఎనభై నుంచి వంద కోట్ల వ్యయమయ్యే...ఈ ఛానెల్ లాంచింగ్ కోసం ఆయన సీనియర్ జర్నలిస్టులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఛానెల్ పేరు ఇంకా ఖరారు కాలేదు. 
----------------------------------------------
ఈ పై పోస్టుకు అంకబాబు గారు బుధవారం నాడు స్పందించారు. ఆయన పంపిన మెయిల్లో నాకు సంబంధించి ఉన్న ఒకటి రెండు లైన్స్ తొలగించి   ఇక్కడ ఇస్తున్నాను. థాంక్స్ అంకబాబు గారు. విష్ యు గుడ్ లక్.
ramu garu,
thank you for your posting.
I want to clarify few things to my journalist brothers.
the channel which is proposed to start Vijayawada is only an idea. it didn't take a shape so far.
As for funds to start the proposed channel are not procured from any body.

A friend who has faith in me has requested me whether i can start a channel with his funds.
I have no capacity to invest.but has inclination and zeal.
I was never a PRO to late sri.magunta subbaramireddy.
when he was running Udayam daily; i was closely associated with him and his family until his death and after that also.
I never took any kind of help from him or from his family except when he has forcefully given me 2000 dollars when I was invited by us information service to participate in American presidential inauguration in 1993 in Washington.

Mr.Ramu, you  might have forgotten that I am presently working with HM-TV as its resident editor from Vijayawada for which I have submitted my resignation from 1st march; as I am leaving to USA to join my family there.

It is my intention to have a channel from Vijayawada to encourage local talent; and encourage others to start channels fro vizag; warangal and thirupathi also.
I didn't start my work so far; and I will definitely share my feelings with you when something takes place.
thanking you;

ankababu kollu

HM-TV నుంచి AVNR, సాగర్ నిష్క్రమణ

ఈ నెల పన్నెండో తేదీన రెండో వార్షికోత్సవం పూర్తిచేసుకున్న హెచ్.ఎం.-టీ.వీ.నుంచి ఇద్దరు సీనియర్లు వెళ్ళిపోతున్నారు. ఇన్ పుట్ ఎడిటర్ గా వున్న ఏ.వీ.నరసింహ రావు (AVNR), ఎక్సిక్యూటివ్ ఎడిటర్ ఏ.కే.సాగర్ లు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.
ఈనాడు, ఈ-టీ.వీ.లలో పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సేవలు అందించిన నరసింహ రావు గారు త్వరలో మరొక ఛానెల్ లో చేరబోతున్నారని సమాచారం. హెచ్.ఎం.-టీ.వీ. చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారికి దగ్గరి బంధువైన సాగర్ ఈ-టీ.వీ., డెక్కన్ క్రానికల్ లలో పనిచేసారు. తిరుపతి కేంద్రంగా వివిధ జాతీయ ఛానెల్స్ కు రిపోర్టర్ గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. సొంతగా ప్రోగ్రామ్స్ చేయాలని సాగర్ భావిస్తున్నారు. 

రెండో వార్షికోత్సవం సందర్భంగా సంస్థ యజమాని, కపిల్ చిట్స్ అధిపతి వామనరావు గారి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది. 'టీ.ఆర్.పీ.రేటింగ్ గురించి పెద్దగా పట్టించుకోకండి. అధికార ఫలాలు అందక ఇబ్బందులు పడుతున్న సైలెంట్ మెజారిటీ గుండెల్లో మన రేటింగ్ ఉంది. అది కనిపించదు. ఆ సైలెంట్ మెజారిటీ కోసం పాటుపడుతూ దాని అభిమానాన్ని పొందే ప్రయత్నం చేయండి," అని ఆయన ఉద్యోగులకు పిలుపు ఇచ్చారు.

Friday, February 11, 2011

వణికిస్తున్న 'ఫోర్త్ ఎస్టేట్': తెలుగు మీడియా ధ్వంసరచన


Monday, February 7, 2011

ఇది వెబ్బు ప్రపంచమా? గబ్బు ప్రపంచమా??

నోట్ on Feb 8,2011: ఈ వ్యాసానికి విశేషంగా స్పందించిన అందరికీ థాంక్స్. కొందరు ఈ అభిప్రాయాలు కరక్టే.. ఏదో ఒకటి చేయాలని రాయగా, ఇంకొందరు...పాడిందే పాడరా...అని...నువ్వు తిట్టలేదా? ఆ పోస్టులో వాళ్ళను అనలేదా? అని చర్చకు పనికిరాని చెత్త పోగేసి రాసారు. కొందరు నన్ను ఓదార్చారు, బలపరిచారు. ఇంతా జేస్తే...నేను తిట్టింది ఆరేడు బూతులే కాబట్టి...ఇంకా తిట్టాలి అలాంటి చెత్త వెధవలను అంటూ...మరి కొందరు కొన్ని బూతులు అందించారు. వీరందరికీ స్పెషల్ థాంక్స్. అయితే...వచ్చిన సూచనలు constructive గా లేనందున అవి ఇక్కడ పెట్టడం లేదు. పైగా...ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పని వల్ల క్షణం తీరిక లేకుండా పోయింది. మళ్ళీ తీరిక దొరికనప్పుడు...ఆ కామెంట్స్ సారాంశం...బ్లాగర్స్ కోసం ఒక 'కోడ్ ఆఫ్ కండక్ట్' వంటి సూచనలతో మళ్ళీ కలుద్దాం. కామెంట్స్ పోస్ట్ చేయలేదని మరోలా అనుకోకండి. బ్లాగుకు ఇదొక స్వల్ప విరామం అనుకోండి. మళ్ళీ కలిసే వరకూ సెలవ్...నమస్కారం....రాము
-----------------------------------------------------

కాకులు కోయిలల్లా పోజుకోట్టడం...
దొంగే కొత్వాల్ను చూసి 'దొంగా...దొంగా' అని యాగీచేయడం... హంతకుడే...జడ్జిలా నటించడం....
--ఇవన్నీ ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటాయి. ఈ మధ్యన తెలుగు బ్లాగు ప్రపంచంలో నాకు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. "ఆ....మనదేమి పోయింది...ఆ కోయిలను, దొంగోడ్ని, హంతకుడిని...మనమెందుకు పట్టించుకోవాలి..." అని అనుకోవడం నికార్సైన జర్నలిస్టులకు సాధ్యం కాదు.
 
కలేజా, దమ్ము, గుండె ధైర్యం లేని ఒక అజ్ఞాత బ్లాగర్....నేను ఈ పక్కన భారతీయ మీడియాకు సూచించిన పాయింట్లను వక్రీకరిస్తూ నన్ను కించపరుస్తూ...అవాకులు చెవాకులు పేలాడు. నా రాతలను విమర్శిస్తే సరే గానీ...నిష్కారణంగా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహజంగా నేను ఎవరినీ స్పేర్ చేయను. రూల్స్ పట్టించుకోకుండా నన్ను కావాలని బాధిస్తే, వేధిస్తే...అప్పుడు కాకపోయినా ఐదు పదేళ్ళలో ఏదోరకంగా సదరు వ్యక్తి కి రూల్స్ అతిక్రమించి అయినా నేను బుద్ధి చెబుతాను. అందుకు కొన్ని సాక్ష్యాలు అబ్రకదబ్రను అడిగితే తెలుస్తాయి. రూల్స్ పరిధిలో నేను ఓపిగ్గా, పొందికగా ఆపరేట్ చేసేదానికి, 'వీడి విషయంలో రూల్స్ లేవు గీల్స్ లేవు...' అని ఆవలి వైపు నుంచి నేను ఆపరేట్ చేసే దానికి చాలా తేడా ఉంటుంది. అది వేరే విషయం.

సరే...ఈ బ్లాగర్ కు 'ఇది అన్ ఫెయిర్' అని కామెంట్ పంపాను. వాడు స్పందించలేదు. దాంతో వాడిని చిన్నప్పుడు నేర్చుకున్న బండ బూతులు తిడుతూ కామెంట్స్ పెట్టాను. సిగ్గూ, ఎగ్గూ లేనివాడు అవన్నీ బ్లాగులో పెట్టాడు. అయితే....ఈ బూతులతో ఒక సమస్య ఉంది. దురదృష్టవశాత్తూ...ఇవన్నీ స్త్రీలను కించపరిచేవిగా ఉంటాయి. మన ఉద్దేశం అది కాకపోయినా...ఆ బూతులు వాడాక....అదే బూతులను చూపి మనల్ని దుర్మార్గులుగా చిత్రీకరించడం చాలా తేలిక. మహిళలను కించపరచడం మహా పాపమని...కాస్త ఆగాను లేకపోతే...వాడిని ఇంకా ఇంకా పరుషాతి పరుషంగా దూషించాలని ఉంది. ఆ దూషణ వెనుక నిజానికి ఒక ప్రయోజనం ఉంది. ఆ పర్పస్ ను ఆశించే నేను అక్కడ బూతు పురాణం ఆవిష్కరించాను. ఇక్కడే అసలు కథ ఉంది.

వాడు నన్ను కించపరిస్తే పట్టించుకోని..."సాంస్కృతికవాదులు" ఉత్తరాంధ్ర నుంచి అమెరికా దాకా స్పందించారు...సహృదయంతో. "ఇది రాము రాసారంటే నమ్మలేక పోతున్నాని..." ఒకాయన, "ఛీ..ఇంత దారుణమా..." అని ఇంకొకాయన ఇలా చాలా బాధపడి పోయి..సందులో సందుగా నా మీద ఇంకొన్ని బండలు వేశారు. మన మహిళా బ్లాగర్లను ఫేక్ బ్లాగులతో దారుణంగా మోసం చేసిన ఒక బ్లాగర్ గురించి నేను రాసిన కొన్ని రోజులకే...నా మీద ఆ బ్లాగులో దాడి చేయడం...."తిట్టింది నిన్ను కాదు...మైండ్ యువర్ బిజినెస్" అని అన్నా ఒక మహాజనుడు వినకుండా...నా ఫోన్ కోసం ఆడియో, వీడియో రికార్డర్స్ తో సిద్ధంగా ఉండడం...ఈ తతంగాన్ని సమర్ధిస్తూ కొందరు విశిష్ట బ్లాగర్లు వాదనలు చేయడం....వెనుక ఏదో ఒక పాట్రన్ నాకు కనిపిస్తున్నది. దీన్ని శోధించే పనిని...ఒక పక్క ప్రభుత్వ సహకారంతో సాగిస్తూనే....నేను గౌరవనీయులుగా భావించే ఇద్దరు సీనియర్ బ్లాగర్లు, మా కో-ఎడిటర్ హితబోధతో నేను ఆ బ్లాగర్ గాడి మీద బూతు దాడి ఆపేశాను....ఇష్టం లేకపోయినా. ఇపుడు గాంధేయ పోరాటం ప్రారంభించాను. ఇదీ అబ్రకదబ్ర గారికి నచ్చడం లేదు. 


"గజ్జికుక్క మీదకు ఎగబడితే ఎమిచేస్తావ్?" అని మా వాడు అడిగితే...అది మనకూ, సమాజానికి చేటు కాబట్టి, మునిసిపాలిటి వాళ్లకు ఫిర్యాదు ఇచ్చే టైం, ఇచ్చినా లాభం లేదు కాబట్టి.... రాళ్ళు పెట్టి కొట్టి చంపుతా...అని చెప్పా. "చేస్తే...ఆ పని చెయ్యి...అంతే తప్ప...ఈ గాంధీ...గీంధీ అనకు," అని మిత్రుడు సలహా ఇచ్చాడు. సలహా బాగుంది గానీ....ఇది కనిపించీ కనిపించని గజ్జి కుక్క....ఏమి చేస్తాం? పుట్టలోకి పొగ పంపితేనే కదా...పాము బైటికి వచ్చేది. పొగ పెట్టవద్దని హితైషులు చెబుతున్నారు. అందుకే...మన గజ్జి కుక్క, దాని పక్కన తోక ఊపుతున్న ఉప్పు చేపల కోసం పదేళ్ళైనా వేచి చూడాలి తప్పదు. ఈ లోపు ఒక మిత్రుడు సలహా ఇచ్చినట్లు వ్యక్తిత్వ వికాసం పుస్తకం కొనుక్కుని చదువుతా. 

ఇక్కడ నాకొక సందేహం ఉందండీ. వాడు నా మీద బురద చల్లాడు. వాడెవడో తెలుసుకుని నా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. కుదరక...నేను ఇంకాస్త చిక్కని బురద విసిరాను. మధ్యలో...దూరిన సోదరులు గుండెలు బాదుకుంటూ 'మరీ ఇంత చిక్కని బురద వాడడం దారుణం' అంటున్నారు తప్ప....'ముందుగా బురద చల్లిన వాడిది తప్పు...ఇది పధ్ధతి కాదు'...అని వీరు చెప్పరేం? వాడు చల్లిన బురద సువాసన వెదజల్లింది, అది వారికి ఫన్. నా బురద గబ్బు లేపింది, ఇది సివిలైజేడ్ పని కాదు. ఇదేమి న్యాయం? ఇది ద్వంద్వనీతి కాదా? నన్ను అంటూనే...వాడినీ అంటే బాగుంటుంది కానీ....'తను రాసింది అంత ఘాటుగా లేదు...మీరు రాసింది ఘాటుగా, దారుణంగా ఉంది' అని సెలవిస్తున్నారు.

పైగా...ఇలా బ్లాగులలో ఎవరు మన మీద బురదచల్లినా పెద్దగా పట్టించుకోకూడదని, చూసీ చూడనట్లు పోవాలని ఒక సలహా వచ్చింది. ఆటవిక, అనాగరిక సమాజానికి ఆ రూలు వర్తిస్తుంది కానీ....పౌర సమాజానికి అది వర్తిస్తుందా? పక్కవాడి మీద అనవసరంగా బండ వేస్తే మనం ఊరుకుంటామా? ఎదుటివాడికి ఏమి జరిగినా...కామ్ గా మన పని మనం చేయాలనే ఆలోచన వల్లనే కదా...మన సమాజం ఇలా ఏడ్చింది! నా మటుకు నేను...ఏ బ్లాగర్ మీద దాడి జరుగుతున్నట్లు చూసినా...'సర్...ఇది తప్పు. ప్లీస్ అలా చేయకండి...' అని చాలా సార్లు వ్యాఖ్యలు రాసి ఉంటాను.

'ఇలా బ్లాగులో తిట్టడం, తిట్టించుకోవడం, గెలకడం....మాకు ఫన్. చూసీ చూడనట్లు పోవడాన్ని మనం అలవాటు చేసుకోవడానికి ఇది బెస్ట్ వేదిక, మన పిల్లలకు కూడా ఇది నేర్పాలి,' అని ఒక బ్లాగరు అభిప్రాయపడ్డారు. నాకెందుకో ఇది నచ్చలేదు. ఇది ప్రమాదకరమైన ధోరణి. బ్లాగు ఒక అద్భుతమైన సమాచార సాధనం. ఎక్కడెక్కడో వున్న వారిని, వారి అభిప్రాయాలను దగ్గరకు తెచ్చే మంచి వారధి. కాస్త చదువుకున్నవారు ఉపయోగించే మాధ్యమం. ఇంత మంచి ఈ వేదిక మీద ఇలాంటి పెడ ధోరణులను కలిసికట్టుగా అరికడదాం. నెట్ ప్రపంచంలో ముఖం దాచుకుని దాడి చేయడం కామన్...అని నాకు తెలుసు. కానీ...వెర్రి తలలు వేస్తున్న ఈ సంస్కృతిని, సైబర్ టెర్రరిజాన్ని మనం మార్చలేమా? ఒక్క సారి ఆలోచించండి. ఈ విషయం మీద నేను మీడియా మిత్రులతో ఒక చిన్న మీటింగ్ పెట్టాను.

కెలకడం, కెలికించుకోవడం అలవాటై, నేను బ్లాగులను ఇందుకే వాడుకుంటా...అనే వాళ్ళు ఏమిచేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. వారికి అది నష్టం కలిగించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి...కొంత రిస్క్ తో నడుపుతున్న బ్లాగ్ నాది. జర్నలిస్టులకు వేదిక కల్పించడం, మీడియా తీరుతెన్నులు ఎండకట్టడం, నీతివంతమైన జర్నలిజం కోసం పోరాడడం దీని ప్రధాన ఉద్దేశం. నా పర్సనల్ విషయాలు కూడా ఇందులో ఎందుకు రాస్తున్నానంటే...కొనసాగింపు కోసం. అందరికీ ఉపకరించే సందేశం ఉన్న అంశాలనే ఎంచుకునే ప్రయత్నం చేస్తాను. సార్...మీడియా మీద రాయడానికి రోజూ ఏమీ ఉండవు, నిర్ధారించుకోకుండా రాయడం చాలా సార్లు కుదరదు. రికార్డు అయి ఉండాలని నా కుమారుడి ఆటల గురించి, అందులో రాజకీయాల నుంచి రాస్తాను. పైగా ఈ టాపిక్స్ నాకు ఇష్టం. 


ఇక్కడ....ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికి కుమ్మక్కు అయినట్లు కనిపించే బ్లాగర్లకు నేనొక సవాల్ విసరదలిచాను. అయ్యలారా...అక్కలారా...మీరు మీ పేరుతో, ఫోటో పెట్టి...అడ్రెస్, ఫోన్ నంబెర్ ఇచ్చి తెలుగు మీడియా మీద ఒక పది పోస్టులు రాయండి, చూద్దాం. అది మీ జీవితాలను ఎంత దుర్భరం చేస్తుందో, ఎన్ని నిద్రలేని రాత్రులను ఇస్తుందో చూడండి. అది అంత వీజీ కాదు బ్రదర్స్/ సిస్టర్స్. ఇక్కడ నేను డీల్ చేస్తున్నది...ఒక ప్రమాదకరమైన మాఫియా గురించి. దయచేసి నా పని నన్ను చేయనివ్వండి. నా మీద బండలు వేసే... గజ్జి కుక్కలను మీరు రాళ్ళతో చంపనక్కర్లేదు, 'ఛీ...ఛీ...' అని అదిల్చండి. అది చాలు...ఆ చిన్న చర్య నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. Conspiracy of silence నిజంగా ప్రమాదకరం. 


(నోట్: ఈ విషయంలో నాకు  ఫోన్ కాల్స్ చేసి, మెయిల్స్ పంపిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. కుమార్ గారి సుదీర్ఘ మెయిల్ చాలా సూతింగ్ గా అనిపించింది. అయితే...ఈ వ్యాసంలో  కొందరు బ్లాగర్స్ అభిప్రాయాలు ప్రస్తావించాను. దాని అర్థం...వారిని కించపరచడం ఏ మాత్రం కాదు. అందుకే వారి పేర్లు రాయలేదు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని ప్రత్యేక మనవి. నా మీద వ్యక్తిగతంగా కాకుండా...నా అభిప్రాయాల మీద తీవ్ర దాడి చేసి...ఈ     విషయంలో నాకు ఒక క్లారిటీ వచ్చేలా చేయండని మిత్రులకు మనవి.)

Saturday, February 5, 2011

'బనానా రిపబ్లిక్'లో మీడియా తెరుతెన్నులు (ది హూట్)

'ది హూట్' లో ప్రచురితమైన డాక్టర్.పద్మజా షా గారి వ్యాసమిది. హూట్ వారికి కృతఙ్ఞతలు.--రాము 
------------------------------------------------------------------------------

Media in a banana republic

Why are news channels so diligently following the guidelines of the NBA and the Cable Regulation Act on the Telangana issue alone?  Why does a democratically elected government want to prevent media from covering a major political issue festering in the state for the last 60 years, asks PADMAJA SHAW
 
 
Nearly a year ago, on 3 January 2010, under the directions of the Andhra Pradesh High Court, Osmania University witnessed one of the biggest pro-Telangana student rallies.  Some 150,000 students with identity cards arrived from colleges all over Telangana and dispersed without incident at the appointed time after the rally. Given that this came after weeks of siege of the campus by security forces, it was a heartening exercise in democratic politics. 
December 2010. In the weeks before the announcement of Srikrishna Committee report, the campus was once again locked down by special police, rapid action force and other security personnel at all access points. The neighbouring localities were put under close watch. The campus road was reminiscent of the Wagah border! But it was not the Wagah border. The FORCE was deployed to battle a bunch of impassioned young students from the Telangana districts. In the name of preventing outsiders from entering the campus, no buses, media vehicles or cars were allowed to enter the campus. The university was compelled to close the campus messes. The students still on campus had no access to food and basic necessities. Politicians and rights activists were arrested if they attempted to enter the campus.
After the Committee report was made public, the state government has invoked the Cable Regulation Act and News Broadcasters Association guidelines and warned the electronic media against covering the activities on Osmania campus. The diktat was to avoid telecast of live/repeat footage of violent incidents and provocative speeches. But the result has been to black out more or less all coverage of the ground level response to the Srikrishna Committee report by the Telugu News TV channels for a few days. According to news reports, Raj TV channel, which is being run by Telengana Rashtra Samiti leader K Chandrashekhar Rao’s family on lease, was warned several times by the government through the license holder to refrain from showing visuals of the agitation. They have taken to flashing breaking news in large font without visuals.
It is interesting that the state government has been issuing statements that there is no police on the campus. The political leaders and the representatives of AP Civil Liberties Committee have been prevented from entering the campus (by who one wonders). Because there was little visual coverage of the events, the truth about the events is not coming out in public domain.
This raises the question: Why are the 16 or so news channels so diligently following the guidelines of the NBA and the Cable Regulation Act in the Telangana issue alone? Couple of days after Srikrishna Committee report was made public, there was a mafia style killing of Maddelacheruvu Suryanarayana in the heart of Hyderabad. The Telugu news channels went to town giving saturation coverage, repeatedly showing the bullet-ridden body and the lolling head of the dead man, violating the NBA guidelines and the Cable Regulation Act provisions for moderation.
Of the 14 or so Telugu news channels only 5 are members of the News Broadcasters Association. The remaining 9 are not. The big ones have more or less been back-peddling on the Telangana issue as the owners of the media houses are from Andhra essentially backing integrationist politicians. The Hyderabad Police Commissioner, Mr. A.K. Khan, asserts that he merely wants the channels to adhere to the provisions of Cable Act. The response of the channels has been to go for an all or none reading of the statement. They prefer to see coverage as live uplinks from the OB vans, unfiltered and un-moderated or unrelenting studio discussions with rabble-rousers. It would have been both a challenge and an education for the channels to finally find the middle path of well-informed and fair reporting of a problematic issue. Two very senior journalists have expressed the feeling that the channel heads are exploiting the statements of the Commissioner to scuttle coverage.
The channels and the government seem to have come to an understanding that by bottling the campus activity and by news black out they can effectively remove Telangana from public agenda. The state administration seems to have come to the conclusion that there is no Telangana movement without media coverage! The only reports that have surfaced on the media are those that show the agitators and students as hooligans, thereby discrediting the movement and the University. It is not yet clear if the hooliganism shown is by hired political goons or by students. No political party including TRS has taken the trouble of calling for peaceful protests that refrain from attacking innocent bystanders and business establishments. Focusing on violence and ignoring the issues raised has been a tried and tested technique used against the CPI (ML) groups for decades. Media effectively deflect the issue into a law and order problem by adopting this strategy and provide a justification for the use of force by the state.
One might add, after several rounds of recent High Court judgments, there is no attempt to implement the Cable Regulation Act by constituting advisory committees at the local and state level to monitor media and deal with complaints arising from the telecast of objectionable matter.  The Act does not empower the Commissioner to unilaterally decide on which content to regulate. The Act prescribes a process through which this is to be done. But the Police Commissioner found instant success in controlling the coverage of the Telangana issue just by holding a press conference and a few strategic phone calls! If media houses accept this for short-term gain, the spectre of this will haunt them in days to come.
Thanks to Ratan Tata, today we have a re-popularised phrase to describe what’s happening not only in our polity but also in our media – Banana Republic! As in a typical banana republic, the media in our democracy are ‘allowed’ by the state to show lumpen entertainment, crime, gore and sex bordering on pornography. When it comes to important political issues like the securitization of large parts of the country in the name of maintaining law and order, corporate-politician nexus that brutally suppresses people’s protests, the state plays a highly proactive role in ensuring that no civil rights groups or media are around to bring alternative perspectives into public view.  Denial of the existence of an issue by insulating it from public gaze can only result in bringing untold misery to the people, and escalating it to unmanageable proportions.
For about a week, by turning the Osmania University campus into an open-air prison, and by disallowing any information to come out of the campus, by repeatedly invoking the Cable Regulation Act for this, the state has once again proved itself to be a banana republic and not a mature democracy. The media houses, in their self-interest, do not seem to recognize that it is a banana republic they are helping build and profiting from. 
Subsequent to this, partly inspired by the protests of rights groups and senior journalists, the channels have formed a Telugu News Broadcasters’ Association. This was followed a day or two later by the formation of Cable Operators Association. Both the associations have vowed to provide the best possible coverage of the Telangana movement. It would be a great step forward for the Telugu news media if these new initiatives pave the way for independence and self-regulation, Cable Regulation Act or not.  Given their entrenched economic and political interests, it is to be seen if media houses can transcend the urges of self-interest to self-regulate and stop playing footsie with the స్టేట్.

Friday, February 4, 2011

సమస్యల మీద సమస్యలు...ఇదేంట్రా నాయనోయ్....

సమస్యలు అన్నీ ఒక్కసారిగా మూట కట్టుకుని వచ్చిపడతాయి... కుంగ తీస్తాయి. ఒక్కటంటే ఒక్కటీ వర్కవుట్ కాదు. తాడును పట్టుకుంటే పామై కూర్చుంటుంది. గత రెండు రోజులుగా నేను పరిస్థితినే ఎదుర్కుంటూ...నన్ను నేనుపరీక్షించుకుంటున్నాను. ఒక పక్క పరిశోధన, మరోపక్క టీచింగ్, కొత్త కోర్సుల రూపకల్పన, అనారోగ్యం....ఇల్లుమారాలనే ఆలోచన...ఓనర్లతో చీకాకులు. సమస్యల మధ్య ఆటవిడుపుగా ఉంటుందని పోస్టు రాస్తున్నాను. సమస్యల క్రమం ఇలా ఉంది.

ఇల్లు మారడం: మనకున్న జాగాలో ఇల్లు కట్టుకునే దాకా ఇల్లు మారకూడదనుకుని హైదరాబాద్ వచ్చిన కొత్తల్లోఅనుకున్నా. కానీ...ఇల్లు ఆధునీకరిస్తానని ప్రస్తుత ఓనర్ చెప్పడంతో ఐదు నెలల నుంచి వెతుకుతున్నా. ఒక ఇల్లు పక్కకాలనీలోనే దొరికింది. అక్కడ అడ్వాన్స్ ఇచ్చే ముందు...ప్రస్తుత ఓనర్ గారికి విధిగా తెలియజేశాను. 'సర్..మీరు ఆధునికీకరిన్చుకుంటా అంటే...నేను వుండడం బాగోలేదు. ఇప్పుడు ఒక ఇల్లు దొరికింది...మీకు చెప్పి అడ్వాన్స్ ఇద్దామనివచ్చాను' అని ఒక పదిహేను రోజుల కిందట చెప్పాను. సరే...అన్న పెద్దమినిషి... తీరా ఖాళీ చేద్దామని తట్టాబుట్టాసర్దుకునే సమయానికి....'రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి నీకు రావలసిన అడ్వాన్స్ రాదు' అని చెప్పాడు.

ఇది ఒక బుర్ర తిరిగే వ్యవహారం. మరొకటి ...కొత్త ఓనర్ తో. ఆయన కథనం ప్రకారం...హైదరాబాద్ లో ఆయనకు ఒక ఎనభై ఇళ్ళు ఉన్నాయి. అద్దెల మీద బాగా సంపాదిస్తున్నాడు. చేరబోయే ఇంట్లో వంటింట్లో డెస్కుల చానెల్స్ తుప్పు పట్టి....లాగితే రావడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికితెస్తే..."వచ్చే మూడేళ్ళు వుండేది నువ్వు కాబట్టి...సొంత ఖర్చుతో మార్చుకో.." అన్నాడు. ఆ బిల్లు నేను భరించేది లేదంటే..."అయితే..నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో" అని ఒక హోటల్ లో పూరీ తింటూ అంటే...నాకు కాలిపోయింది. చివరకు తొంభై శాతం ఆయన, పది శాతం నేను భరించేలా ఒప్పందం కుదిరాక....'వెళ్లి ఎగ్రిమెంట్ కోసం స్టాంప్ పేపర్ తే..' అని సెలవిచ్చాడు. నేను బ్యాంక్ చెక్ ఇచ్చి...సరే అని హడావుడిగా పాఠం చెబుదామని వస్తుంటే....'మీ బాబు హెల్త్ బాగోలేదు..' వచ్చి తీసుకువెళ్ళండి అని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వెడితే...వాడికి జ్వరం, వాంతులు. పులి మీద పుట్రలా మీద పడి విసిగించిన మరి కొన్ని అంశాలు ఈ క్రమంలో లేకపోలేదు.

వెర్రి ఎక్కించిన బ్లాగు: ఈ వివాదాలు ఇలా వుండగా...నిన్న రాత్రి ఎవడో పంపిన లింక్ ఓపెన్ చేసి అవాక్కయ్యాను. వాడెవడో నా మీద, బ్లాగు మీద విషం కక్కుతూ...పచ్చి అబద్ధాలతో ఒక పోస్ట్ పెట్టాడు. నేను సాధారణంగా విమర్శలను ఆహ్వానిస్తా కానీ....వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసిన వాడిని వదల దలుచుకోలేదు. నేను ఏ అంశం మీదనైనా ఐదు నిమిషాలైనా మాట్లాడలేనని అంటే పరవాలేదులే అనుకున్నా. పలు అభియోగాలు చేస్తూ....బూతులు బాగా మాట్లాడతానని వాడు ఇష్టం వచ్చినట్లు రాసాడు. ఇది నాకు చాలా బాధకలిగించింది. 'థిస్ ఈస్ అన్ ఫెయిర్" అని మెయిల్ ఇస్తే వాడు స్పందించలేదు. అందుకే....వాడిని అమ్మనా బూతులు తిట్టడం మొదలెట్టా. ఆ పనిని సమర్ధంగా చేయగల అబ్రకదబ్రకు పూర్తి అధికారాలు అప్పగించా. మనవాడు రెచ్చిపోతున్నాడు. దయచేసి కామెంట్స్ చదవవద్దని సభ్య సమాజానికి విజ్ఞప్తి. దూర ప్రాంతంలో ఉన్నా కదా అని ఇష్టమొచ్చినట్లు చెలరేగే దొంగ నాయాళ్ళకు చిత్ర హింస ఎలా వుంటుందో చూపించే ప్రయత్నమే తప్ప ఇది మరొకటి కాదు. బూతులలో వ్యుత్పత్తిని చూసి మహిళలను కించపరుస్తున్నారని అనుకోవద్దని విన్నపం. ఆ భాష వాడడం దారుణమని...తెలిసినా నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నాను. ఆ దారుణాన్ని స్పేర్ చేసే స్థితిలో ఇప్పుడు నేను లేను. హేమ, వేణు లాంటి వాళ్ళు 'నువ్వు ఆ తప్పు చేయవద్దు...' అని హితోక్తులు చెప్పారు. అయినా...ఈ బూతు పర్వాన్ని ఇంకొన్ని రోజులు సాగించే బాధ్యతను అబ్రకదబ్రక (మన ఆల్టర్ ఈగో) గాడికి అప్పగించాను.

మధ్యలో వచ్చి చరసాల ప్రవీణ్ శర్మ కూడా నన్ను విసిగించాడు. నన్ను దుర్మార్గుడిగా చూపే ప్రయత్నం చేసాడు. ఆయనకు నా శీలం మీద ముందు నుంచే అనుమానం ఉందని ఒక చెత్త ఉదాహరణ ఇచ్చాడు. ఆయనకు...మెయిల్ చేశా, ఫోన్ లో మాట్లాడా. ఫోన్ మధ్యలో...'నేను కంప్యూటర్ స్పెషలిస్టును....రికార్డ్ చేస్తున్నా...' అంటున్నాడు. నా గురించి రాసిన వాడిని నేను తిడితే.... "నన్ను తిట్టావ్" అని అంటాడు ఈ మనిషి.
మనలను విలన్ చేసిన వాడు అమెరికాలో ఒక చోట నుంచి పోస్ట్ చేస్తున్నాడని ఒక మిత్రుడు చెప్పాడు. వాడి కత తెల్చేపని కొందరికి అప్పగించాను. పేరు పెట్టుకోకుండా...రాసే వెధవల గురించి ఇంతగా స్పందించడం ఎందుకని మిత్రమండలి చెబుతున్నది కానీ....వాడి కాలో చెయ్యో విరిచే ఏర్పాటు చేయడం మంచిదని నాకుంది. అయ్యా...చరసాల శర్మ గారూ...సంభాషణను బట్టి చూస్తే...మీరు నన్ను అపార్థం చేసుకున్నట్లు ఉంది. నేను బండబూతులు తిట్టింది వాడిని, మిమ్మల్ని కాదు. మీరు నా మీద పిచ్చి కామెంట్స్ పెడితే మాత్రం మిమ్మల్నీ అంతకన్నా ఘోరంగా తిడతాననీ, చట్టపరంగా చర్య తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా...ఎవరైనా...నా చేతలు, రాతల పట్ల అభ్యంతరాలు వుంటే....ఎత్తిచూపే హక్కు మీకు ఉంది. అలాగని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే...సహించాను. ఐ.పీ.అడ్రసులు, ఇంటి అడ్రసులు కనుక్కోవడం కష్టం కాదు, కసి తీర్చుకోవడానికి చాలా మార్గాలు వున్నాయి. మనకు ఆ గొడవ వద్దు. ప్రజాస్వామ్యయుతంగా బతుకుదాం. ఎవడి గోల వాడు రాసుకోక...వ్యక్తిగత దాడులు మనకు వద్దు.

ఇదిలావుండగా...ఒక మహిళా బ్లాగరు 'రాముతో కన్వర్సేషన్ ' అని ఒక పోస్టు పెట్టారు. అది చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అదొక గమ్మత్తైన గొడవ. తనకు రావలసిన అవార్డు...నేను ఎత్తుకుపోయానని ఆమె నన్ను తప్పు పడుతున్నారు. అదొక అవార్డు! దాని మీద వివాదం!!
తన మెయిల్ కు స్పందిస్తూ నేను పంపిన జవాబులను ఆమె నా అనుమతి లేకుండా...పోస్ట్ చేసారు. అది నాకు నచ్చలేదు. ఆమెకు నేను మెయిల్ పంపి చాలా సేపు అయినా...స్పందించలేదు కాబట్టి...మాత్రు సమానురాలైన ఆమెకు నేను పంపిన లేఖను దిగువ ఇస్తున్నాను...మీ కోసం.

గౌరవనీయులు, తల్లి సమానురాలైన -----...
నమస్కారం.
మీకు నాకు మధ్య జరిగిన సంభాషణను మీరు పోస్టు చేసారని తెలిసి చూశాను. మీరు చేసిన పని నాకు అభ్యంతరకరంగా ఉంది. నేను మిమ్మల్ని వేధిస్తేనో, మీకు అసభ్యపు మెయిల్స్ పంపితెనో, ఇతరత్రా ఇబ్బంది పెడితేనో మీరు అది పోస్ట్ చేయవచ్చు కానీ...సాధారణ సంభాషణను ఇలా బహిరంగ పరచడం (నాకు తెలియజేయకుండా) బాగో లేదు.
మీరు ఏ కాంటెక్స్ట్ లో అది పోస్టు చేసారో కూడా నాకు తెలియలేదు.
మీకు అవార్డు కమిటీ నిర్ణయం పట్ల అభ్యంతరం ఉంటే...వారికి నేరుగా మీ నిరసనను తెలియజేయండి. అంతేకాని నన్ను ఇందులోకి లాగడం బాగోలేదు. అవార్డు పట్ల నాకున్న అభిప్రాయాన్ని నేను ఒక పోస్టులో తెలియజేశాను.
మీరు నాకు అడ్రస్ తెలియజేస్తే....ఆ అవార్డు మీకు పంపిస్తాను. మీకు అది అవసరం లేకపోతే....ఆ పక్కన వున్న మురికి కాలవలో పడెయ్యండి. దయచేసి నాకు అడ్రస్ పంపండి. నన్ను బద్నాం చేయాలని ప్రయతిస్తే మాత్రం బాగుండదు. నా అనుమతి లేకుండా మెయిల్స్ బహిరంగ పరచడం సంస్కారం కాదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను....
నమస్కారాలతో
రాము

Thursday, February 3, 2011

'సాక్షి'ని వీడి 'జెమిని' ఇన్ పుట్ ఎడిటర్ గా చేరిన వాసుదేవన్

గత రెండేళ్లుగా 'సాక్షి' ఛానెల్ కు ఢిల్లీ లో బ్యూరో చీఫ్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు పి.వాసుదేవన్ ఆశ్చర్యకరమైన రీతిలో ఆ ఉద్యోగం వదులుకుని జెమిని ఛానల్ లో హైదరాబాద్లో ఇన్ పుట్ ఎడిటర్ గా చేరారు...రెండు రోజుల కిందట.
పలు తెలుగు, ఇంగ్లిష్ పత్రికలలో నాణ్యంగా పనిచేసి సుదీర్ఘ అనుభవం సంపాదించిన వాసు గారు 'సాక్షి' కి వెళ్ళడానికి ముందు....టీ.వీ.-నైన్ లో  పనిచేసారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన ఫీచర్స్ చేసారు. ఒక అసైన్ మెంట్ లో భాగంగా శ్రీ లంకలో పర్యటించి యుద్ధ వాతావరణం నుంచి తను చేసిన కథనాలు నాకు బాగా గుర్తు ఉన్నాయి.   

వృత్తిపరంగా ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ 'సాక్షి' లో కూడా వాసు మంచి స్టోరీ లు అందించారు. ఎన్నికలప్పుడు ఉత్తరాదిలో పర్యటించి చేసిన కథనాలు బాగున్నాయి. చక్కని తెలుగులో....మంచి నుడికారంతో కథనాలు రాయగలిగిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో వాసు ఒకరు. వ్యంగ్యం, సమయస్ఫూర్తి  మేళవమైన  వాసుదేవన్ విశాఖపట్నంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో పనిచేస్తున్నప్పుడు మంచి స్టోరీలు అందించారు. మాటిమాటికీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరి, దాని ఆధారంగా స్టోరీలు రాసి చాలా మందిని అక్కడ విసిగించారాయన. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేనూ 'ది హిందూ' రిపోర్టర్ గా ఆర్.టీ.ఐ.చట్టం కింద కాలుష్య నియంత్రణ మండలి నుంచి సమాచారం తీసుకున్నా కానీ....దాన్ని సరిగా వాడుకోలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతూ వుంటాను.

తెలుగు జర్నలిజాన్ని మాత్రమే నమ్ముకుంటే...ఇంతే సంగతులు...ఇంగ్లిష్ జర్నలిజంలో కూడా ప్రవేశం ఉంటే ఎలాగోలా బతికేయవచ్చు...అని నాకున్న గట్టి అభిప్రాయమే వాసు గారికి కూడా ఉంది. ఢిల్లీ నుంచి ఏదైనా ఇంగ్లిష్ ఛానెల్ రిపోర్టర్ గా వస్తాడనుకున్న వాసు గారు మళ్ళీ ఒక తెలుగు ఛానెల్ కు రావడం నాకు కొద్దిగా నిరాశ కలిగించింది. కుటుంబ కారణాల వల్ల ఆయన ఇక్కడకు వచ్చినట్లు ఉన్నారు. వారి పాప అముక్తమాల్యదకు ఇప్పుడు పండగే పండగ. 

కొత్తగూడెంలో నేను 'ఈనాడు' కంట్రిబ్యూటర్ గా పనిచేసినప్పటి నుంచి ఆయనను నేను చూస్తున్నాను. రెండు భాషల్లో పట్టు ఉండి...అవకాశం ఇస్తే...అటు ప్రింట్ లో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నత స్థాయి బాధ్యతలు ఏవైనా సమర్థంగా నిర్వహించే సత్తా వున్న అతి కొద్ది మందిలో వాసు ఒకరు. ఆయనకు మేలు జరగాలని ఆశిస్తున్నాను.