Friday, February 25, 2011

'రామ్ ఢమాల్ వర్మ' పై కథనం: TV-9 కు లీగల్ నోటీస్!

ఎవరిమీదనైనా...ఎలాంటి కార్యక్రమమైనా... ప్రసారం చేస్తానని విర్రవీగుతున్న TV-9 ఛానల్ తిక్కకుదిర్చే పని ఎట్టకేలకు ఒక వ్యక్తి  చేసాడు.  ఆయన...ఎప్పుడేమి చేస్తాడో, ఎప్పుడేమి చెబుతాడో తెలీని వ్యక్తే అయినా...ఆయన చర్య ఈ తలతిక్కల చానెల్స్ కు ఒక గుణపాఠం అవుతుందన్న ఆశాభావం నాకుంది. ఆ వ్యక్తే...స్టార్ దర్శకుడు....రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసినట్లు చెబుతున్న ప్రకటన ఇలా ఉంది.
"With regard to an extremely derogatory programme done by TV9 on me titled 'Ram Dhamaal Varma' where they have attributed many false quotes to me of which one example is 'Prekshakullu Verri Vedhavulu'. I am here by informing that I am initiating criminal action against TV9 for defamation with a criminal intent"

ఈ గొడవకు కారణమైన కార్యక్రమం "రామ్ ఢమాల్ వర్మ" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని TV-9 ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం ప్రసారం చేసింది. జర్నలిజం ప్రమాణాల పరంగా చూస్తే ఈ కార్యక్రమం నిజంగా ఒక చెత్త. వర్మపై వ్యక్తిగతంగా కసితో చేసిన పరుషమైన మాటల దాడి. శాస్త్రీయ విశ్లేషణలేని  ఎల్లో జర్నలిజం. వర్మే కాక ఎవరిపైనైనా ఇంత దారుణమైన దాడి చేయడం తగని పని. 

I-News లో కనిపించిన చల్లా శ్రీనివాస్, HM-TV లో పనిచేసిన ప్రభు అనే 'సినీ విశ్లేషకులను' స్టూడియోలో కూర్చోబెట్టి భద్రి అనే యాంకర్ యమ కసితో ఈ ప్రోగ్రాం చేసారు. వర్మ కెరీర్ గ్రాఫ్ అథఃపాతాళానికి పడిపోయింది...ఆయన తీసిన లేటెస్ట్ సినిమా అప్పలరాజ్ ది మోస్ట్ వరస్ట్ ఫిలిం అనుకుంటున్నారు...వంటి కామెంట్స్ భద్రి చేసారు. 
ఆ చల్లా శ్రీనివాస్ అయితే వర్మ..."ఇష్టమొచ్చిన సొల్లు వాగుతున్నాడు...", "గారడీ చేస్తున్నాడు", "చేతగాని...చేవలేని డైరెక్టర్", "ఇంట్రావర్ట్" వంటి కామెంట్స్ తేలిగ్గా చేసారు. "ఆయన క్రియేటివిటీని రీ చార్జ్ చేసుకోవాలి," అని కూడా అయన సలహా ఇచ్చారు. "రామ్ గోపాల్ వర్మ అంటే భయపడే స్థితిలో జనం వున్నారు," అని ప్రభు చెప్పారు. మధ్యలో...యండమూరి కూడా ఏదో మాట్లాడినట్లు వున్నారు...నేను అది మిస్ అయ్యాను. 

ఇక ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నప్పుడు ఆ చానెల్ తెర మీద కనిపించిన వాక్యాలు ఇవి: 
--వర్మకు మతి భ్రమించిందని కామెంట్లు
--రోజు రోజుకీ పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయి
--అతని సినిమాలు చూస్తే ప్రేక్షకులకు తిప్పలే
--ఇప్పుడు తీస్తున్నవన్నీ పరమసోది సినిమాలే
--సినిమా మేకింగ్ పై వర్మ శ్రద్ధ తగ్గింది

ఇలా సాగిన ప్రోగ్రాం ఎవరోచెప్పి చేయిస్తే...ఈ చానెల్ చేసిందన్న అనుమానం కలగకమానదు. 'వర్మ కెరీర్ గ్రాఫ్' అంటూ ఒక ప్రోగ్రాం ను కూడా ఇందులో ప్రసారం చేసారు. అందులో...చానెల్ కున్న కక్కుర్తి రోగం ప్రకారం నడుము తిప్పే భామల, సొగసులు చూపే సుందరాంగుల ఫిలిం క్లిప్స్ చూపించి కుతి తీర్చుకున్నారు. 

ఈ ప్రోగ్రాంతో వర్మకు మండిందట. అలా మండడం నిజానికి మంచి పరిణామం. ఇది కోర్టులో నలిగి...ఈ ప్రోగ్రాం చేసిన వారి నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయడమో, వ్యక్తిగత దాడి చేసినందుకు సంబంధీకులకు అరదండాలు వేయడమో చేస్తే బాగుంటుంది. మిగిలిన చానెల్ ఎజమానులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 

వర్మ ఒక ఐదు కోట్లు ఇస్తే....రవి ప్రకాష్ నుంచి ఈ కార్యక్రమం ఆధారంగా ఒక యాభై కోట్లు నష్టపరిహారం పొందే మార్గం చెప్పడానికి మా అబ్రకదబ్ర సిద్ధంగా ఉన్నాడు. వర్మా....ఆర్ యూ రెడీ?

7 comments:

సుజాత వేల్పూరి said...

ఆ ఛానెల్ యాంకర్ల నోటి దురదకు బ్రేక్ పడాలంటే ఇలాంటివి కనీసం పదుల సంఖ్యలో జరగాలి


వర్మ మంచిపని చేసాడు

astrojoyd said...

బెంగుళూర్ బడిత పూజ సువాసనలు ఇంకా తగ్గుముఖం పట్టక ముందే పాపం రవికి ఎన్ని కస్త్తాల్లోచ్చాయో కదా?

Praveen Mandangi said...

రాం గోపాల్ వర్మ సినిమాలన్నీ నేను చూడలేదు. అనగనగా ఒక రోజు, అప్పలరాజు లాంటి కొన్ని సినిమాలే చూశాను. అప్పలరాజు సినిమా ఫ్లాప్ కాదు. రొటీన్ సినిమాలు చూసేవాళ్లకి ఆ సినిమా నచ్చదు. ఆ విషయం రాం గోపాల్ వర్మకి ముందే తెలుసు. టివి9లో రాం ఢమాల్ వర్మ అంటూ కార్యక్రమం పెట్టడం తప్పేనని అనుకుంటాను.

katta jayaprakash said...

RG Varma has done a wise thing by dragging TV9 to the court.TV9 somehow behaves erratically just to createsome idiotic ssensation.Though the mindset and attitude of Varma is not accceptable to majority of people he has got right to file a case against the channel for character assasination.Every one knows how the TV9 functions unproffessionally and unethically in some cases and situations.

JP.

Thirmal Reddy said...

Sir jee,
మీ పోస్ట్ తో పూర్తిగా ఏకీభవిస్తున్న. అదే ఎపిసోడ్ని ఇవాళ (శనివారం) ఉదయం మళ్లీ ప్రసారం చేసారు. ఈసారి రజని కాంత్ ఏకంగా వర్మ ను స్టుడియోలో కూర్చోబెట్టి "కేసు ఎందుకు పెట్టారో" వివరించమన్నాడు. రజని కాంత్ వేసిన చాల ప్రశ్నల్లో మచ్చుకు ఒక ఆణిముత్యం ఇలా ఉంది. "వర్మ గారు మీరు తీసిన రక్త చరిత్ర సినిమా వల్ల పాత కక్షలు మళ్లీ గుర్తొచ్చాయి కాబట్టే పరిటాల మనుషులు సూరిని చంపి ఉండొచ్చు కదా?" ఈ ప్రశ్న విని నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Anonymous said...

@JP
*Though the mindset and attitude of Varma is not accceptable to majority of people*

ఆయన ఆటిట్యుడ్ నాకు బాగా నచ్చు తుంది. తెలివి టాలేంట్ ఉన్న వ్యక్తులు ఎవరికి వర్మ ఆటిట్యుడ్ తో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇటువంటి వారు సమాజం లో ఎంతో కొంత తమ జీవితకాలంలో మార్పు తేవాలను కొంటారు. అటువంటి కొంతమంది తెలివిగల వారు ఎదైనా కొత్తది చేయాలంటె చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. దీనిని మీడీయా వారు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందువలన మీడియా వారే ఇతని గురించి తప్పుగా ప్రచారం చేయటం మొదలుపేట్టారు. ఇటువంటి వారి మీద అయాన్ రాండ్ ఫౌంటైన్ హేడ్ నవలలో బాగా చర్చిస్తారు. ముఖ్యంగా మీడీయా పాత్రని ఆ రోజుల్లోనే ఆ నవలలో చర్చించినట్లు ఎక్కడా చర్చించలేదు. ఇక విషయానికి వస్తే ఆయనకు ఎంత మంది ప్రజలకి వ్యక్తిగత సంబంధాలు ఉనంటాయి? మాహా ఐతే సినేమారంగం లొ ఉండే కొంతమంది అతనిని వ్యక్తిగతం గా కలుస్తరేమో అంతే. మిగతావారికి ఆయాన సినేమాల ద్వారా మాత్రమే పరిచయం. సినేమా నచ్చితే చూస్తారు లేక పోతే లేదు. ఇందులో ఆయన మైండ్ సెట్ మేజారిటి ప్రజలని ఇబ్బంది పెట్టే అంశం ఏముంది? జీవితంలో కాంఫిడెన్స్ గా ఎవరి సహాయం లేకుండా పేరు తెచ్చుకొనే వారంటె మీడీయా వారి కి చాలా చికాకు. వారికి ఎప్పుడు వీడు వాడిని వేన్ను పోటు పొడిచి పైకి వచ్చాడనొ లేక కుల,ధన బలం వలన పైకి వచ్చాడనో అని ప్రచారం చేసి వీడీ గొప్పతనం ఎమీలేదని ఇతరుల సక్సేస్ ని తీసి పారేయాలను కొంటారు. రాము గారి గురించి అలా రాయటానికి ఎమీ లేదు కనుక ఆయన ఆట్టిట్యుడ్ మీద ఫోకస్ పెట్టారు. ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైందని వర్మ గారు గుర్తించాలి.ఈ సువర్ణావకాశాన్ని వర్మ గారు ప్పొర్తిగా ఉపయోగించుకోవాలి.
-----------------------------------
సినేమా తీయలేని వారు విమర్శకులుగా తయారై సినేమా మొదటి ఆటచూసి బ్లాగుల్లో, వెబ్ సైట్లో రివ్యులు రాయటం ఎక్కువైంది. వారిని ఒక సినేమా తీసి చూపించూ అంటె ఇక సినేమా తీయటం వేరు రివ్యూలు రాయటం వేరు అని వాదనకి దిగుతారు. రివ్యూ రాయటం ఒక గొప్ప ఆర్ట్ లాగా మొండి వాదన చేస్తారు.ఇటువంటి ఊరు, పేరు, వ్యక్తిత్వం లేని వారు టి వి షోలకి హాజరై వర్మ గారి మీద నోరు పారేసుకునంట్లున్నారు.

Prashant said...

Varma has done a commendable job by dragging the channel to the court.Whether Varma makes sensational duds because of his eccentric character should not be a bothersome issue for anyone as you have an option to execute not to watch the movie if you don't like his genre.
The channel has right to criticize his movies but it seems the they have resorted to character assassination of the director by denigrating him as insane,maverick or eccentric.
As far Iam concerned I admire Varma for being to his ownself and struck to his guns.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి