Sunday, February 20, 2011

ఆంధ్రా బిర్యానీ--పెండ--కేసీఆర్: రామ్ బాణం-4

లోక్ సత్తా అధినేత జే.పీ.గారి మీద అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద భౌతిక దాడి జరగడం నాకు తీవ్ర ఆవేదన కలిగించింది. అవినీతిరహిత సమాజం, ప్రజాస్వామ్య విలువలు... వంటి వాటి కోసం బాధపడుతూ,  ఆ దిశగా ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసేవారు కరువైన ఈ రోజుల్లో జే.పీ.గారు చేపట్టిన ఉద్యమానికి సాల్యూట్ చేసే వారిలో నేనూ ఒకడ్ని. 'ఈనాడు'లో సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డ్ లో ఉన్నప్పుడు ఆయన కాలమ్ 'భవిష్యత్ భారతం' కాపీలను చాలా సార్లు ఎడిట్ చేసి ఆయనకు ఫ్యాన్ గా మారాను. లోక్ సత్తాలో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేయాలనుకున్నా....'ది హిందూ' ఉద్యోగం వదులుకోవడం ఇష్టంలేక ఆ పని చేయలేదు. కూకట్ పల్లిలో జే.పీ.గారిని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన అవసరాన్ని విశ్లేషిస్తూ 'ఈనాడు' ఎన్నికల పేజీకి ఒక వ్యాసం కూడా పంపాను-అప్పట్లో. 'ఈనాడు' నుంచి బైటికి వెళ్ళిన వాడిని దేశద్రోహిగా చూసే 'ఈనాడు' వారు అది ప్రచురించలేదనేది వేరే విషయం.  ఆ తర్వాత సునిశితంగా పరిశీలిస్తే....జే.పీ. గారికి కొన్ని పక్షపాతాలు వున్నాయేమో అన్న అభిప్రాయం నాకూ కలిగింది. తెలంగాణా ప్రజల మనోభావాలను, విద్యార్థుల పోరాటాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లు నాకు అనిపించలేదు. ఇక్కడి నాయకులను చూసి జనం మనోభావాలను తప్పుగా అర్థంచేసుకుంటే ఎలా? కులాలకు, ప్రాంతాలకు అతీతంగా తమ నిర్ణయాలు ఉంటాయని ఇలాంటి దేశభక్తులు నిరూపించుకోవాలి కదా!. ఒక వర్గానికి దగ్గరై , ఒక ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం జనంలో కలగకుండా జాగ్రత్త వహించాలి.

సరే...ఇతరులను ఇబ్బందిపెట్టనంత వరకు ఎవడి ఏడుపు వాడు ఏడవవచ్చు. కానీ ఇతరులపై మాటల, చేతల (భౌతిక) దాడి చేయడం మంచిది కాదని నా అభిప్రాయం.  ఆ పని జే.పీ. చేసినా, కే.సీ.ఆర్. చేసినా మంచిది కాదు. ఈ మధ్యన కే.సీ.ఆర్. గారు ఆంధ్రా ప్రాంత ప్రజలను, అక్కడి బిర్యానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు శృతిమించినట్లు నాకు అనిపించింది. మనవాడు చేసినా, ఎదుటివాడు చేసినా తప్పు తప్పే, అది ఎత్తిచూపడం జర్నలిస్టు విధి అని నమ్మి ఈ సారి 'రామ్ బాణం' ఈ వ్యాఖ్యల మీద రాసాను. ఇందులో చివర్లో 'ఆక్షేపణీయం' స్పెలింగ్ దోషం వుంది. థాంక్స్. 

16 comments:

Anonymous said...

గురూజీ!
నేనుకూడా మీలాగే ఒకప్పుడు జేపీగారి వీరాభిమానిని. నిజం చెప్పాలంటే ఇప్పటికీ చాలా విషయాలలో ఆయనపై అభిమానం అలానే ఉంది. ఆ ఒక్క విషయంలో తప్ప:) అందుకే అంటారేమో ఎంత పెద్ద మేధావికైనా ఏదో ఒక పిచ్ఛ/ ఎర్రి ఉంటుందని. కానీ వాటన్నిటినీ అధిగమించి ప్రాంత/ కుల/ మత/రాగధ్వేషాలకతీతంగా ఉండగలిగేవాడే నిజమైన మేధావి అనీ, ఈ విషయంలో ఈయనగారిని కూడా వివేకానందుల వారంతటి స్థిత ప్రజ్ఞుడని భావించడం నేను చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటని గత ఏడాదిన్నర కాలంలో తెలిసొచ్చింది. కాకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణపైన, అవినీతి రహిత సమాజ నిర్మాణనికై ఆయన పడుతున్న తపన ఇవన్నీ మెచ్చుకోకుండామాత్రం ఉండలేం.
అయితే మొన్నటి దాడిని ఎవరమూ హర్షించకూడనిదయినప్పటికీ నా దృష్టిలో అది ఆయన స్వయంకృతమే అనక తప్పదు:) ఆయన మాట్లాడిన ప్రదేశం, సంధర్భం రెండూ సరియైనవి కావనికాదుగానీ కంటెంట్ మాత్రం(రాష్ట్రపతి పాలన)అసందర్భమే. ఎందుకంటే ఆమాత్రం దానికే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులొచ్చినట్లైతే ఇప్పటికి చాలా రాష్ట్రాల్లో జరిగియుండాల్సింది. ఇక కేంద్రం విషయంలో ఐతే (మహిలా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నప్పుడు యాదవ ద్వయాల మూకలు చేసిన రగడకు) రాష్ట్రపతిని కాదని పాకిస్తాన్లో లాగానో మరో నియంతృత్వ దేశంలో లాగానో డైరెక్ట్ గా మిలట్రీ పాలనే రావాలనొచ్చేమో? పైగా సర్కారీ కమీషన్ సిఫారసుల గురించీ, ఫెడరల్ వ్యవస్థ బలోపేతం గురించీ తెగమాట్లాడే జేపీ గారు ఈమాత్రం దానికే రాష్ట్రపతి పాలన రావాలనడం ఆయనలోని మేధావితత్వానికి మచ్చే కాగలదు.
తెరాస వారు "ఈయనగారు సూటూ బూటూ వేసుకునెళ్ళి అమ్మను దర్శించుకొనొచ్చినప్పుడు ఆమె చెవిలో ఇదే వేసి వచ్చుంటారేమో" అని చేసిన ఆరోపణలు నిజమైనా కావచ్చేమో అనే అనుమానం కలగకమానదు.

Anonymous said...

ఇదే విషయంపై నేను ఒక టపా -http://dare2questionnow.blogspot.com/2011/02/blog-post.html వ్రాసిన తర్వాత స్పందించిన కొందరు మిత్రులు నాకు ప్రత్యేకవాదం పై ఉన్న ప్రేమతోనే అలా వ్రాసాననీ, అసెంబ్లీ అనువుగాని చోటెలా అవుతుందనీ, జేపీ నేను అధికుడనని ఎక్కడన్నాడనీ ఇలా రకరకాల ప్రశ్నలు వేసారు.
"అంత జరిగినా ఇంకా నేను ఏదైనా మాట్లాడితే మరింత రెచ్చగొట్టినవాణ్ణవుతానని, గొడవ మరింత పెద్దదయ్యేదని అందుకే మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయానని" స్వయంగా జేపీ గారే తమ కార్యాలయంలో సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో అన్న మాటలను ఆధారంగా చేసుకునే నేనా టపా వ్రాసాను. ఆపనేదో ముందే చేసి, తను మాట్లాడదలుచుకున్నది ప్రశాంతత ఏర్పడ్డాక మాట్లాడితే బాగుండేది కదా? దీనికీ వ్యక్తి వాక్స్వాతంత్ర్యాన్ని హరించడానికీ లింక్ పెట్టనవసరం లేదు. అడుసు తొక్కనేల...కాలు కడగనేల aneadi సామెత కdaa? కానీ, నాకాలు నా ఇష్టం, ఎక్కడైనా వేసుకునే స్వేచ్ఛ నాకులేదా అని ఎవరైనా అంటే అది అమాయకత్వమే అవదా??
ప్రపంచంలోకెళ్ళా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలుపోతున్న మనం అదే ప్రజాస్వామ్యంలో 56 యేళ్ళుగా నానుతున్న ఒక సమస్యను (అది న్యాయమైనదా, కాదా అనేదానితో సంబంధం లేకుండా) తేల్చకపోవడాన్నీ, తేల్చేందుకే కృష్ణ కమిటీ వేసినట్లు గొప్పలుచెప్పుకుని, తీరా రిపోర్ట్ వచ్చి నెలలు గడుస్తున్నా తమ అభిప్రాయం చెప్పకపోవడాన్నీ, మాత్రం ఖండించలేకపోతున్నాం. డిసెంబర్ 7 నాడు అఖిలపక్షం లో ఒప్పుకుని తర్వాత 9 ప్రకటన తర్వాత రాజీనామా డ్రామాలతో ప్రజలను తప్పుదారి పట్టించిన, దేశ ప్రయోజనాలకు ఏమాత్రం భంగకరం కానిదైన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కాశ్మీర్, పంజాబ్ తీవ్రవాదాలతో పోల్చి హేళనచేస్తున్న కుహనా సమైఖ్యవాదుల దుర్నీతిని నిలదీయలేకపోవడం... ఇవన్నీ ప్రజాస్వామ్యం, వాక్స్వాతంత్ర్యఒ అంటూ ఇంతలా బాధపడుతున్న సో కాల్డ్ మేధావుల ద్వంద ప్రమాణాలు కావంటారా?

సుజాత వేల్పూరి said...

సగటు మనిషి అంతరంగాన్ని మీ కలం చక్కగా ఆవిష్కరించింది. కే సీ ఆర్ వ్యాఖ్యల పట్ల ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ పెద్దగా (బ్లాగర్లు తప్ప) స్పందించకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. లేక ఇహ అతడి మాటలకు పెద్దవా విలువ ఇవ్వక్కర్లేదని వదిలేశారో మరి!

katta jayaprakash said...

One fails to understand why KCR is loosing balance of his mind while speaking for Telangana.So far he has not commented on the attack on Dr.JP Narayana.Almost all the TRS leaders justified the attack FOR THE REASONS BEST KNOWN TO THEM.Inact JP had given his personal opinion on the obstruction to the governor's address without any reference to Telangana agitation as it was a generalised comment on the incidents in the legislature.Physical anywher on any one against the comments is always be condemnable by every civilised society.It is still astonishing how and why the intellectuals in JAC are keeping quiet and became just spectators at the attitude of some leaders who are leading the agitation through a wrong,unethical route which definetely damages the image of Telangana as even people like me supporting the agitation never support the bad mindset of these leaders as it dents the image of the culture of the region.Let us hope the intelligentia in the JAC will rise to the ocassion and prescribe some rules and regulations for the leaders about their behaviour during the agitation so that they can get suppoprt from every one without any venoms outbursts and physical attacks.


JP.

బొందలపాటి said...

జనాల మనోభావాలు సరిగా లేవని తాను నమ్మినప్పుడు దానిని సజావు గా వ్యక్త పరిచే హక్కు అందరికీ ఉంటుంది. జనాల మనోభావాలు సరిగా లేవు అని తాను నమ్మినా, వాటి వెంట పరుగులు తీసే వాడు నాయకుడు ఎట్లా అవుతాడు? తను సరైనదని నమ్మిన దారి లో జనాలను నడిపించే వాడే నిజమైన నాయకుడు.
జనాలలో అస్థిత్వపరమైన భావోద్వేగాలు, బలహీనతలు రెచ్చగొట్టి తమ పబ్బం గడిపే వారిని నాయకులంటే ఏమి చేయగలం? చివరికి దీర్ఘ కాలికం గా తమ బలహీనతలకు జనమే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

kiran said...

neenu kooda amayakapu college rojullo jayaprakash,ex bureaucrat(chalasarlu ex bureuacrat anukovala leka bureaucrat anukovala ani doubt vastundi)abhimaanini.aa amayakapu rojulalo evaraina aavesanga adarsalu vallisthe nijamani nammevallamu.bavisyat bharatam regularga follow ayyanu.ayana meeda unde abhimanam to chala rojulu chadivinappatiki konni rojulake bore kottindi.aa vyasallo ekkuvaga emergency prastavana matreme undedi.aayana college rojullo policelu okasaari valla meeda daadi chesina prastavana kooda undedi.(okka saarena?)
aayana college jeevitham antha chappaga unnanduku koncham nirutsaham kaligina dantlo aayana tappemundani sardi cheppukonevaadini.maa college lo chaala mandi poragallu average 30 saarlu police chetilo tannulu thini untaru.bochedu saarlu dharnalu niraharadeekshalu chesi untaaru.atla ani memu "asangika shaktulam" emi kaaledu.andaru veterinary doctorlayyaru.nenu ias kooda ayyanu.memu chintapalli aprjc lo chadivetappude amarananirahaara deeksha chesaamu.
vaaramlo rendusaarlakante ekkuva idli pettina prati saari chintapalli aprjc lo strike chesamu.sare ivanni ikkada aprastutam ainappatiki jayaprakash ki poratam jeevitha nepadhyam kaka povatam aayana athi pedda balaheenatha."poratam" aaina vishayam lo aruvu techukonna (prapncha bank aruvu ichindaina ayyi undochu)padikattu padam ayyindi.memu singareni"boggu badi"lo chaduvukonnam.maalo ekkuva mandimi karmikula pillalam.maa kothagudem lo st.joseph school kooda undi.akkada ekkuva doctorla officer la pillalu unde vallu.aa school lo chaala mandi manchi vallainappatiki koddi mandi baaga dabulunnaini,valla tandrulu pedda officerlani vallaku koncham manchi english vachu kabatti chaala ahankaranga pravarthinche vaaru.nakenduko jayaprakash ni chusina , vinna pratisaari aa durahankaari convent pillau gurthuki vastharu.chala sarlu nenu porapatu padutunnanemonani,aayinni sarigga artham chesukovalani prayatninchaanu.kaani naaku malli,malli jayaprakash,ias aa convent pillalane gurthuki testunnadu.

SHAM... The Inspiration said...

రాము గారు! నేటి తెలంగాణా ఉద్యమంలో ఆత్మవిమర్శ కూడా ద్రోహమే అంటున్నారు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అన్నట్టుగా.. ఎప్పుడూ మన తోటి, సాటి తెలుగువాడిని తప్పుబడుతూ మన తప్పులు, లోపాలు గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు KCR వీరాభిమానుల దృష్టిలో మీరు, నేను కూడా తెలంగాణా ద్రోహులమే అవుతాం. నా దృష్టిలో తెలంగాణావాదం వేరు. కేసీఆర్ చేస్తున్న విద్రోహకర, విధ్వంసకర, విచ్ఛిన్నకర వేర్పాటువాదం వేరు. తెలంగాణా అభివృద్ధి, ఆత్మగౌరవం కోరేది తెలంగాణావాదం కానీ.. తెలంగాణా ప్రజలను తెలబాన్లుగా మార్చేది తెలంగాణావాదం ఎలా అవుతుంది? ఈ వాస్తవం ఎవరు గ్రహిస్తారు?

Anonymous said...

సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విభజన సమస్యను, కెసిఆర్ లాంటివారు తమ దిగజారుడు మాటలతో కావాలని జటిలం చేస్తున్నారేమో అనిపిస్తోంది. జె.పి తన అభిప్రాయాన్ని, ఆవేదనను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెలిబుచ్చడంలో ఏమాత్రము తప్పులేదు. ఆమాత్రానికే అంత హైరానా పడి పోయి భౌతిక దాడులకు, దూషణలకు దిగాల్సిన అవసరం లేదు. అంటే జె.పి మాటలకు వీళ్ళు బాగా జడిసినట్టే అనిపిస్తోంది. ఒక్క సీటు వున్నా లోక్‌సత్తా తన సత్తా చూపించిందనే అనుకోవాలి. :) ఒకవేళ జె.పి. ఒక్కడు అడిగారని రాష్ట్రపతి పాలన వస్తే గిస్తే, అధికారం పోయిందని కాంగ్రెస్ ఏడవాలి కాని, టిఆరెస్ ఎందుకు ఏడుస్తోందో మరి! ఇందులో ఏదో గూఢుపుఠాణి వుంది.
పోతే.. పేడబిరియాని అంత రాజకీయంగా స్పందించాల్సిన అంశం కాదు, ఏదో జోకాడనుకోవాలి. :)

premade jayam said...

మీకు అన్నం తినడం నేర్పించాం అని ఈసడించే రాయపాటిని మళ్ళీ మళ్ళీ ఎంపీగా ఎన్నుకున్న వాళ్లకు అలాంటి డోసు అవసరమే.

Raj Karsewak said...

దంచుడు కార్యక్రమం కుకటిపల్లి MLA తో శూరు కావడం మంచిదే , ఈ Pseudo-Intellect తిక్క ఇకనైనా కుదరుతుంది.
మీ ఆంధ్ర దురహంకారానికి ఈ తప నిదర్శనం.JP ఫై జరిగిన దాడి తెలంగాణా వాదుల కడుపు మంట నుండి వచ్చింది . రెండు దెబ్బలకే మేరంత ఆకాశం బద్దలై నట్టు నటిస్తున్నరేయ్ , OU విద్యార్దులను సీతారామంజనేయిలు చితకబాది నప్పుడు మీకేవరికి నోరు పెగలలేదు . JP ఆంధ్ర వాడు కాబట్టి ఇంత రంకలేస్తున్నారు , అదే నాగం జనార్ధన్ రెడ్డి ఫై జర్గినపుడు మీరంతా మౌనం వహించిన వారె . సీమంధ్ర వెబ్ సైట్స్ , చానల్స్ లో తెలంగాణా పట్ల చులకనైన రాతలు , వార్తలు చూస్తుంటే మా గుండెలు రగిలి పోతునై , ఇది తీవ్ర రూపం దాల్చే లోపే మీరు మారండి , మా హక్కులను గుర్తించండి , లేదంటే అసెంబ్లీ లో ప్రారంబమైన దంచుడు ఊరు , వాడలకు పాకుతై . ఇది బెదిరింపు కాదు , మా ఆక్రోశం .

బుక్ షెల్ఫ్ said...

రామ్ గారు! ముందు మేధస్సుకి మీరిచ్చే నిర్వచనాన్ని తెలుసుకోవాలని ఉంది .ఏ తూనికల ప్రకారం మీరు జే పీ ని మేధావిగా పరిగణిస్తారు ?ఒందల ఆత్మ బలి దానాలను కొంతలో కొంత సమయమన దృష్టితో చూడలేక పోయిన మేధస్సు ఎటువంటిది ?ఈ మేధస్సుకి చిదంబరం మేధస్సుకి తేడా ఏమిటి ?వీరిని మేధో గర్వులు అంటారు .సంయమనము, సమత్వము లేని మేధస్సు ఒక రకంగా నిరర్ధకమైనది .మీరు సహృదయులైన తెలంగాణా వాదులు, తప్పని సరిగా మీ ఈ సంయమన ధోరణిని గౌరవించాలి . కానీ ఒక్క సారి ఆంద్ర గుత్తాధిపత్య మీడియా ,నాయకులు ప్రదర్శిస్తున్న అసహన రూపాలని పరిశీలిస్తూ పొండి నిజమైన తెలంగాణా వాదులై ఉంటె ఏదో ఒక ఉద్వేగపు సందర్భంలో నోరు జారి తీరుతారు {జారాల్సిందే అని ఉద్దేశ్యం కాదు }kcr వ్యాఖ్యలకు అంతకన్నా స్పందించాల్సిన అవసరం లేదు .ఆత్మ పరిశీలన అన్ని దిక్కులనుండి జరగాలి . ఆవలి పక్షపు ఆత్మ పరిశీలన లెక్కలు మీరేమైనా చెప్పగలరా ?తమ్ముడు మన వాడైనా ధర్మం చెప్పాలన్నారు , అలా చెప్తున్న ఆంధ్రా తమ్ముళ్ళని మీరు చూపించగలరా ?జే పి క్రమంలో మళ్లీ ఒక సారి ఇవి పరిశీలించండి .

Pavani said...

పాత కథే అనుకోండి. ఒక రోజు ధ్రుతరాష్ట్రుడు ధర్మరాజుని పిలిచి ఢిల్లీలో ప్రతి గల్లీ తిరిగి ఎవెనింగ్ కల్ల ఒక చెడ్డవాణ్ణి పట్టుకోరమ్మని చెప్పాడట. అలాగే ధుర్యొధనుడిని పిలిచి ఒక మంచి వాడిని తెమ్మన్నాడట. సాయంత్రం కల్లా ఇద్దరూ ఖాళీగా వచ్చారట.

రౌడీల రాజ్యంలో జేపీ కొందరికి దుర్మార్గుడుగా కనబట్టంలో నాకేమి పెద్ద వింతగా లేదు లెండి.

Anonymous said...

ఉచితానుచితాలతో, న్యాయాన్యాలతో సంబంధం లేకుండా మనకు నచ్చినదే న్యాయసమ్మతమైనదనే ఆటవిక న్యాయానిదే రాజ్యమైన నేడు లోపల ఎన్ని దుర్మార్గపు ఆలోచనలున్నా పైకి నీతులు చెప్పగలిగితే చాలు మేధావులుగా పిలవబడొచ్చనేదే అసలు వింత:)

Unknown said...

telangana varu kuda me blog chaduvutaru maku undi atmagavuravam mamu prajalama milaga give value 2 telangana people, dont speak rubbish about kcr and telangana people u will pay the price for it

chomskyist said...

I agree with you that what KCR said was Unacceptable, but so are the comments made by Seemandhra leaders on Telangana Culture and people ( which are much bitter and frequent) , I find it funny that Your write only Footnotes Criticizing JP's attitude on Telangana and You devote a entire post Criticizing KCR (which andhra media is doing quite effectively and definitely doesnt need your assistance). I thank Raj News and Hmtv for Criticizing JP.

Iam assuming that you are from "Andhra" , SO naturally you cant maintain Neutrality like everyone else when it comes to T issue.

Iam also Surprised that you worked for LSP headed by the hypocrite JP,
JP, Ramdev Baba are all doing walks and rallies in Support of eradicating corruption in the Country, but it is only in Rhetoric, I agree that the anger of the average Indians towards Corruption Should be Channelised and people should be mobilsed, that doesnt mean you should limit yourselves to Hours long Discussion on Corruption on HMTV which acheives nothing or walking with a Bunch of Middle class people on Necklace road, Shouting NO CORRUPTION !!!

Anonymous said...

మనకు సరిపోయేటట్లు మాట్లాడినప్పుడు అభిమానించి, మన భావాన్ని వ్యతిరేకించినప్పుడు అవమానించటం అనేదే సరైన పద్ధతి కాదు. ఒకమాట అన్నందుకే అయన మీద దాడి చేస్తే; దాడి చేసిన వారి నాయకుడు కొన్నేళ్ళుగా మాట్లాడిన దానికి ఎమి చెయ్యాలి. వేరొక ప్రాంతంలో వుండి తప్పించుకొని పోయాడనుకోవాలా......తమ ప్రాంతం అనే అహంకారంతోనే దాడి చేశారా..... మిగిలిన నాయకులు, మీడీయా వారు కూడా తమ మీదకు దాడి చెయ్యకుండా వుండే విధంగా మాట్లాడినప్పుడే దాడి చేసినవారిని ఏ దృష్టితో చూస్తున్నారో అర్ధం అవుతోంది [నా అభిప్రాయం క్రింద లింక్ నొక్కి చూడండి]. ఇలాంటి దాడులు తెలుగు వారు నివశించే మరే ఇతర భాషా రాష్టాలలో కూడా జరగ లేదు కదా.... దాడుల ద్వారానే పరిష్కారం అయ్యేటట్లు వుంటే ఈ ప్రజాసామ్య ముసుగు ఎందుకు? 4వదో 5వదో మీడియా స్తంభం ఎందుకు?? మనం బ్లాగుల్లొ ఈ అభిప్రాయాలను వ్యక్త పరచటం ఎందుకు??? హాయిగా తన్నుకుని ఎవరు గెలిస్తే వారిదే న్యాయమనే ఆటవికసామ్యమే బెటర్ కదా!!! అందరూ లోపల అనుకున్నదల్లా పైకి చెప్పేసి, చేసేస్తే ఎవరికైనా మర్యాద మిగులుతుందా?? ఈ ప్రపంచం మిగులుతుందా??? దీనికి మన ఘంటసాల గారి పాట ఒకటి వున్నది.......మనిషి మనిషికి తేడావున్నది.........."మంచివాడు మనసున [లోపల] అనుకుంటాడు..,...చెడ్డవాడు చేసే చూపిస్తాడు" అని పాటలో వున్నది. ఆ పాట ఎవరు వ్రాసారో తెలియదు కాని చాలా సరిగ్గా వ్రాశారనిపిస్తోంది.

లింక్ http://saahitya-abhimaani.blogspot.com/2011/01/21-1973.html#links

రాధాకృష్ణ,
విజయవాడ

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి