Thursday, May 31, 2012

మీడియా కమిషన్ ఏర్పాటు తక్షణావసరం

ప్రస్తుత మీడియా పరిణామాలపై ఆలోచించే, ఆవేదన చెందే వారిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా గారు ఒకరు.  అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె ప్రొఫెసర్ హరగోపాల్ గారి దగ్గర పీహెచ్.డీ.చేసారు. ఆమె నా పీహెచ్.డీ.కి గైడ్ గా వ్యవహరించారు. ఆమె వల్ల నాకు మీడియా-ఎథిక్స్ విషయంలో పరిజ్ఞానం పెరిగింది. ఆమె భాషా పటిమ అద్భుతమైనది.  క్రమం తప్పకుండా మీడియా పరిణామాల మీద పద్మజా మేడం వ్యాసాలూ రాస్తుంటారు. 'ద హన్స్ ఇండియా' లో ప్రతి మంగళవారం ఆమె ఒక వ్యాసం రాస్తారు. మీడియా కమిషన్ గురించి ఆమె ఈ వారం రాసిన వ్యాసం మీ కోసం....రాము 
Needed: A media commission

In the midst of the Jagan drama in Andhra Pradesh, the report of the Jammu and Kashmir (J&K) interlocutors has been made public. In their report submitted to the government of India, the interlocutors had much to comment on media and journalists in J&K for pursuing journalism as a political game rather than as a pursuit of fact.

The report also is quoted as saying: "Publishers have alleged that newspapers that do not toe the line are denied government advertisements. On the other hand, the government alleges that certain newspapers publish unsubstantiated stories and engage in a vilification campaign. Both these matters need to be investigated by a body like the Press Council of India or the Editors Guild of India."

The interlocutors are also quoted as saying that the source of funding of newspapers is also a matter of unhealthy speculation and the Press Council of India “alone can settle the issue.”

This list of comments can well apply to the media in Andhra Pradesh today, and, for that matter, much of the media elsewhere in the country. AP is not a border State. It is not troubled by cross-border terrorism. Article 370 does not apply to it. But, still, the media scene is riddled with similar problems. The roots of the problem obviously are elsewhere.

Anyone watching Telugu television news channels or reading ‘rival’ Telugu newspapers cannot but notice that the coverage is partisan and polarised on the channels and the papers with political affiliations. 
The lack of balance comes from the desire to fight to finish the adversaries. The unsubstantiated stories and the vilification campaigns are a part of the routine strategy in the turf wars; as in our great Mahabharata, all the contenders to power are essentially illegitimate but see themselves as the sole title-holders.

This apparently is the state of affairs in Tamil Nadu and other States as well, wherever rival political, business or caste lobbies have entered the media market. Most of the establishments ironically run training schools for young recruits and teach them high principles of journalistic practice. But the reality of their media product often falls far short of all tenets of journalism and completely lacks accuracy, balance and professionalism. 

One wonders what this does to the general ecology of the newsrooms and to the young men and women who work in them. A senior journalist in a private conversation recently confessed that the work environment is completely vitiated but one continues because of family and personal commitments. Journalists are thinking beings and the manner in which they are forced to be megaphones pushing their managements’ cause for a salary is intensely dehumanising. 

Some of them may be sold out, but the majority prefer to work under fairer conditions. And this is not just about compensation.
The tragedy is that regulators, like the Press Council of India or the Editors’ Guild, have been able to intervene effectively. The governments of the day have not conducted themselves with any degree of probity, either, when dealing with the media houses that play an adversarial role. 

Most have used advertising as a means to control media and showered out-of-turn favours on friends, be they individual journalists or media houses. Unless the media is subjected to standards of accountability by a strong ethics body, there is little hope for journalism in India. The Leveson inquiry underway in the UK, which is probing into the media-government-society relationships in the context of the phone-hacking scandal by Murdoch’s media empire, is one such exemplary exercise.

In the UK too it was found that the industry controlled Press Complaints Commission, which had no punitive powers, remained a mute spectator to gross violations of all journalistic ethics and sometimes criminal conduct of the media persons and corporations. 
In any such Leveson-like inquiry in India, one is sure some of the biggest political/corporate fish will stand exposed. 

Change in the role of the press from mission to business, vilification of rivals, scurrilous writing about castes and communities, indecency and vulgarity, even the declining importance of editors, are major problems that have been repeatedly identified since the First Press Commission (1954). 

The First Press Commission acknowledged that, by and large, the established newspapers maintained a fairly high standard of journalism. If there is any difference from that time to now, it is in the behaviour of the established players. Any inquiry into the media today will find it hard to make such a generalization as the ‘established’ players are in the forefront of violators. 

Those who maintain high standards of journalism are a dwindling minority caught in the dilemma of having to succeed in a highly unethical environment without losing one’s core values. It is high time that there is a thorough inquiry into the many skeletons in the cupboards of the media industry, covering a broad spectrum of issues from the unethical nexus between corporate houses, governments and the bureaucracy; dubious sources of financing of media enterprises; other business interests of the media houses and the need for answerability when there is a conflict of interest in coverage; extent and nature of advertising and so on.

It is clear, as it is in the UK, that neither the Press Council of India nor a body like the Editors’ Guild is able or willing to set the house in order. It takes a comprehensive inquiry, perhaps another Media Commission, to review the entire media business and to evolve a binding regulatory and ethical framework that meets the needs of the contemporary media scene. It is touching to see the faith the interlocutors placed on the Press Council and the Editors’ Guild. 

It is also revealing to see that whether it is J&K or any other part of India, the issues in media industry appear to be similar. The corporate media that are fattened on the spoils of a liberalised economy need to be re-educated to focus on the rights of the ordinary people instead of concentrating on installing friendly governments.
(Courtesy: The Hans India) 

Wednesday, May 30, 2012

కాంట్రాక్ట్ జర్నలిస్టులారా...ఇదొక సారి చదవండి..

జర్నలిస్టుల శ్రమను దోచుకోవడానికి యాజమాన్యాలు పలు మార్గాలు అనుసరిస్తున్నాయి. కాంట్రాక్ట్ జర్నలిస్టుల పేరిట, కంట్రిబ్యూటర్ల పేరిట డబ్బులు తక్కువ ఇచ్చి పని ఎక్కువ చేయించుకుంటున్నాయి. అన్ని మీడియా సంస్థలు ఇదే పని  చేస్తున్నాయి. జర్నలిస్టులకు న్యాయబద్ధంగా ఉండాల్సిన ఎలాంటి సౌకర్యాలూ వీరికి ఉండవు. ఈ పరిస్థితిలో కేరళలో ఇండియన్ ఎక్ష్ ప్రెస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జర్నలిస్టులు పోరాడి పీ.ఎఫ్.సౌకర్యం పొందారు.

డబ్బుకు అమ్ముడుపోయే.... జర్నలిస్టులు కాని జర్నలిస్టు నేతలను కాకుండా నిబద్ధత ఉన్న వారి సహకారంతో హక్కుల కోసం పోరాడి విజయం సాధించవచ్చని ఇది నిరూపిస్తుంది. ఈ బిట్ ను నాకు పంపిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు కు థాంక్స్. 

NEW DELHI: In a significant development that can have ripple effects in the media industry, contract journalists working for the New Indian Express in Kerala will become eligible to provident fund, unlike their counterparts in the rest of the country.
Regional PF Commissioner, Kochi, N.Gopalakrishnan has ordered that the journalists and non-journalist employees working on contract basis in Kochi unit of the New Indian Express are eligible for Provident Fund benefits.
In a 64-page verdict given after an enquiry undertaken as per the Provident Fund Act 1952, the PF Commissioner rejected the NIE management's claim that the journalist and non-journalist's of the NIE, Kochi are not employees and, hence, they are not entitled to EPF benefit.

The Commissioner found that they are very much employees of the NIE establishment and ordered the immediate assessment of EPF amount eligible for each and every employees working on contract at the NIE, Kochi.
This is a landmark victory for the New Indian Express Employees Association (Kerala), employees organisation of the New Indian Express in Kerala. The verdict would have far reaching consequences in the media industry in particular and trade union movement in general at a time when more and more people have been employed on contract basis by companies.
The New Indian Express Employees Association (Kerala), according to its President N Padmanabhan and GS Radhakrishnan, fought the case relentlessly for the last three years against heavy odds.

Tuesday, May 29, 2012

తాజా పరిణామాలపై మృత్యుంజయ్ కార్టూన్

ప్రస్తుత  పరిణామాలపై నమస్తే తెలంగాణలో మృత్యుంజయ్ వేసిన కార్టూన్ ఇది. 'ఈనాడు' శ్రీధర్ గారు ఇలాంటివి వేయలేరని కాదు గానీ...


Monday, May 28, 2012

అదృశ్య 'హస్తం' పై పద్మజా షా గారి వ్యాఖ్య

అప్పుడు 'ఈనాడు' కష్టాలకు గానీ ఇప్పుడు 'సాక్షి' పరిణామాలకు గానీ బాధ్యత కాంగ్రెస్ పార్టీదీ, దాని రాజకీయ సమీకరణాలది అంటున్నారు...ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా. 'ది  హోట్' బ్లాగ్ లో ఆమె చేసిన వ్యాఖ్య ఇది.     

The Eenadu-Sakshi war has a central player which we have not paid much attention to – THE CONGRESS PARTY. On the first round, the party through YSR has crippled Eenadu and drove it into proxy control of Reliance. This time, Sakshi is being crippled because Congress at the center and the state does not want YS Jagan to challenge its politics in AP. In both the cases CBI and other regulators, are the main weapons.
Both the papers, along with others in either lobby, have behaved abysmally as media organizations and have lost sight of the role of the press completely to fight turf wars for families and friends in AP politics. It is time there is a nation-wide debate on whether such entities are ‘fit cases’ to own media houses in public interest.
But it is the Congress party that is trying to cash in politically by killing both the enemies. Eenadu and Sakshi journalists together should turn against this trend of using CBI to harass media in the longer interest of free speech. This fate can visit any paper at any time if journalists do not show solidarity. Of course, journalists must also educate their bosses that just because they are able to mobilize investments from friends and relatives, it does not mean that the newspaper or TV station can be turned in to a megaphone for promoting personal interest.
(Courtesy: The Hoot) 

Sunday, May 27, 2012

'ఈనాడు' పైశాచిక జర్నలిజం...


మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న నేపథ్యంలో 'ఈనాడు' కవరేజ్ గతి తప్పుతున్నది. జర్నలిజం మౌలిక సూత్రమైన నిష్పాక్షికత గాల్లో కలిసింది. వార్తలు వ్యాఖ్యల మాయమై పోతున్నాయి. యజమాని ఇష్టపడే కార్టూన్లు వేయడమే పరమావధిగా ఉజ్జోగం చేసే శ్రీధర్ కార్టూన్లు శృతి మించుతున్నాయి. వెరసి 'ఈనాడు' లో పైశాచిక ఆనందపు జర్నలిజం వర్ధిల్లుతున్నది. గత మూడు రోజుల 'ఈనాడు' కవరేజి చూస్తే ఇది తెలుస్తుంది. 

శుక్రవారం కవరేజి
"ఓదార్పు కరవు" అనే శీర్షికతో బ్యానర్ ప్రచురించారు. ఆ 'ఓదార్పు' అక్షరాలకు ఎర్రరంగు వేశారు. ఓదార్పు పేరుతో జగన్ యాత్ర చేపట్టడానికి, జగన్ మధ్యంతర ముదస్తు బెయిల్ పిటిషన్ ను ఒక కోర్టు తిరస్కరించడానికి లింక్ ఏమిటి? ఇదేమి సృజనాత్మకత? 

ఆ వార్త కింద చుక్కలు కనిపిస్తూ చెమటలు పట్టిన జగన్ ను సీ.బీ.ఐ. అనే తాడు బందించినట్లు, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు పెద్ద కార్టూన్ వేశారు శ్రీధర్. ఇది నీతిమాలిన, మతితప్పిన, అమర్యాదకరమైన జర్నలిజం. దర్యాప్తు సంస్థలను, కోర్టుల మాటలకు వక్రభాష్యం చెప్పడమిది. 

ఈ మొదటి పేజీలో  శ్రీధర్ గారి మార్కు 'ఇదీ సంగతి' లో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారా....అన్న కార్టూనిస్టు ఆతృత కనిపిస్తుంది. జగన్ ఒక పక్క మైకులో '...త్వరలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి..' అని అంటుండగానే....బేడీలు పట్టుకుని ఒక ఇన్స్పెక్టర్ '...వచ్చేసాయి సార్...' అంతో పరిగెత్తుకుంటూ జగన్ వాహనం వైపు వస్తుంటాడు. జగన్ ను చెండాడుతూ పలు కథనాలు ఉన్నాయి ఈ రోజు పత్రికలో. 

'చేసుకున్నవారికి చేసుకున్నంత' అన్న శీర్షికతో వచ్చిన ఎడిటోరియల్ లో ప్రతి అక్షరం వై.ఎస్.పై, ఆయన సన్ పై విషం చిమ్మింది. ఇదేమీ తప్పు కాదు. సంపాదకీయంలో ఇలా పత్రిక అభిప్రాయాన్ని రాయడాన్ని తప్పు పట్టరు. సంపాదకీయంలో పాటించాల్సిన కనీస మర్యాదలు బోధించే జర్నలిజం కోర్సులు చదవని వారు రాసిన సంపాదకీయం అది. అయినా నో ప్రాబ్లం. 

శనివారం కవరేజి
'నేడు మరో ? రౌండు' అన్న శీర్షికతో బ్యానర్ స్టోరీ వేశారు. అందులో సీ.బీ.ఐ.అధికారి లక్ష్మినారాయణ, జగన్ ల బొమ్మలు వేసిన దాన్ని బట్టి చూస్తే...అదేదో వారిద్దరి మధ్య పోటీ అన్నట్లు ఉంది. దర్యాప్తు సంస్థల అధికారుల, న్యాయమూర్తుల ఫోటోలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది థంబ్ రూల్. జర్నలిజం కోర్సులు, ప్రపంచ మీడియా సంప్రదాయాలు తెలియని ఒక మందమతి నిర్ణయం కాక ఇదేమిటి? రామోజీ రావును సీ.బీ.ఐ. రమ్మంటే....ఇదే తరహా కవరేజ్ ఇస్తారా? 

ఆ స్టోరీ లోనే విద్వాన్ శ్రీధర్ గారి కార్టూన్ పెద్దది ఒకటుంది. సీ.బీ.ఐ.ఆఫీసు నుంచి జగన్ వస్తుంటే...బైట ఆయన అభిమానులు 'సార్ ని అరెస్టు చేయలేదు. తిరిగోచ్చాడోచ్..." అని సంబరం చేసుకునే దృశ్యమిది. అలాగీ...'ఇదీ సంగతి' ఏడ్చింది. జగన్ పారీ అభ్యర్ధి తన భార్యతో చెబుతాడు...."అరెస్టు కాలేదట. అవుతాడేమో ఆ పేరున మరో నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని ఆశ పడ్డాను డియర్.' ఇదే పేపర్ లో వడ దెబ్బకు ఇరవై మంది చనిపోయిన వార్త ఒక ఎనిమిది లైన్లు ఉంది. 'మైసూరాస్త్రం' తుస్..అన్న మరొక తిక్క వార్త కూడా ఉంది.

ఆదివారం కవరేజ్ 
ఎప్పటి లాగానే ఫస్టు పీజీ సింహభాగాన్ని జగన్ కు కేటాయించారు. 'ఉ.10  గం - సాయంత్రం 6 గం. c/0 దిల్ కుషా' అన్న వ్యంగ్య కాప్షన్ను జగన్ ఫోటో కింద పెట్టారు. లోపలి పేజీలో శ్రీధర్ కార్టూన్లు ఇవి. 


"నిన్న వర్జ్యం ఉందట. మొన్న చవితి కదాని చర్య తీసుకోలేదట సార్...సీ.బీ.ఐ." అనే ఈ కింది చిన్న కార్టూన్...ఒక ఇమ్మెచ్చూర్ కార్టూనిస్టు ప్రయత్నం. మూడో రోజు జగన్ మునగాలన్న కుత్సితం ఇందులో లేదా? కార్తూనిస్తుకు ఇంట ఆరాటం ఎందుకు? జగన్ అరెస్టయితే...న్యాయం బతికిందని లోపల సంతోషించే 'సాక్షి' జర్నలిస్టులూ వుండకపోరు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలని జర్నలిస్టులు కోరుకోవాలి.జర్నలిజాన్ని జర్నలిజంగా బతకనిస్తే ప్రజాస్వామ్యానికి మేలు చేసిన వారవుతారు. 

సారా ఉద్యమం అప్పుడు సారా నిషేధించాలన్న రామోజీ డిమాండ్ మేరకు నెలకు పైగా సారాపై తప్ప వేరే కార్టూన్లు వేయని శ్రీధర్ నిషేధం ఎత్తేసాక ఆ విషయం గురించి పట్టించుకోలేదు. యజమాని అడుగులకు మడుగులొత్తవచ్చు కానీ...మరీ ఇంత దారుణంగా వ్యవహరించకూడదు. 'ది హిందూ' లో సురేంద్ర వేస్తున్న కార్టూన్లు చూసి శ్రీధర్ నేర్చుకోవాల్సింది ఎంతైనా వుందని నా  వ్యక్తిగత అభిప్రాయం. అర్థ రూపాయికి పడి రూపాయల యాక్షన్ చేస్తూ....ఆత్మలను అమ్ముకునే...ఇలాంటి కార్టూనిస్టులు, జర్నలిస్టుల వల్లనే తెలుగు నెల మీద జర్నలిజం వన్నె తగ్గింది. జనం జర్నలిస్టుల నోట్లో ఉమ్ముతున్నారు. బరితెగింపు జర్నలిజం ఆపండి బ్రదర్స్. 

(నోట్: జగన్ కు అన్యాయం జరుగుతున్నదని ఈ రచయిత భావించడం లేదు. తన తప్పులకు శిక్ష పడాల్సిందే కానీ...మరీ మీడియా రూల్స్ మార్చి పైశాచిక పోకడలు జర్నలిజం లో చొప్పించడం అన్యాయమని, అది దీర్ఘ కాలం లో ఫోర్త్ ఎస్టేట్ కు మంచిది కాదని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం.)
Cartoons courtesy: Eenadu, Sreedhar     

Saturday, May 26, 2012

సత్యమేవజయతే... సత్యమేవజయతే...


మీడియాలో పెట్టుబడులు స్వచ్ఛంగా ఉండాలని సాధారణ జనం భావిస్తున్నారు, అమాయకంగా. అలాగే...మీడియా యజమానులు, ఎడిటర్లు, జర్నలిస్టులు స్వచ్ఛంగా పులుకడిగిన ముత్యాల్ల ఉండాలని కోరుకుంటారు. అలా ఆశించడం లో తప్పు లేదు కానీ వాస్తవాలు ఎప్పుడూ భిన్నంగా, భయంకరంగా ఉంటాయి. 

స్వాతంత్ర్యం రావడానికి ఏడాది ముందు...తెగబలిసిన పారిశ్రామికవేత్త రామ్ కిషన్ దాల్మియా తాను ఛైర్మన్ గా వున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ నిధులు బెనేట్ అండ్ కోల్మన్ (టైమ్స్ అఫ్ ఇండియా) స్వాధీనానికి మళ్ళించాడు. దాని వల్ల ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీసింది. ఆడిటర్స్ అభ్యంతరాలు పెడచెవిన పెట్టారు. ఇది పసిగట్టిన ఫిరోజ్ గాంధీ 1955 డిసెంబర్ లో పార్లమెంట్ లో లేవనెత్తారు. ఫిరోజ్ గాంధీ ఈ లావాదేవీలకు సంబంధించిన డాకుమెంట్స్ సేకరించి జనం ముందు ఉంచారు. ప్రభుత్వం వివియన్ బోస్ కమిషన్ ను వేసింది. డబ్బు తిరిగి చెల్లించడానికి దాల్మియా ఆ పేపర్ ను అల్లుడికి కుదవపెట్టక తప్పింది కాదు. నేరం నిరూపణ కావడం  తో దాల్మియాను తీహార్ జైలుకు పంపారు. వైద్యుడికి కారు బహుమతిని ఎరగా చూపి దాల్మియా బైటపడ్డాడు. తొందరలోనే జైలు నుంచి బైటపడి ఆరో భార్య సరసన చేరాడట. అయినా...అంత సుఖమైన జీవితాన్ని అనుభవించలేక పోయాడట. అలాంటి చరిత్ర కలిగిన టైమ్స్ ఇప్పుడు భారత దేశం లో ఒక ప్రముఖ పత్రికగా నడుస్తున్నది. 

ఇదీ...పాత కథ. రోజులు మారాయి కాబట్టి పద్ధతులు మారాయి. 'సాక్షి' లో ప్రవాహంలా వచ్చి చేరిన పెట్టుబడులు ఒక అద్భుతమైన కొత్త తరీఖా. ఇలాంటివి మనం ఆపలేము.  ఇంతకన్నా ఘోరమైనవి చూడబోతున్నాం. 'ఈనాడు' పెట్టుబడులు ఒక రకంగా మంచివి కావచ్చు గానీ...దాన్ని అడ్డంపెట్టుకుని ఇతర వ్యాపారాలు పెంచుకున్న వైనం అంత గొప్పగా చెప్పుకునేది కాదు. కొందరు జర్నలిస్టులను, కంట్రిబ్యూటర్లను అడ్డం పెట్టుకుని పత్రికలు దండుకుంటున్నాయి. పెయిడ్ న్యూస్ వంటి అరాచకాలు మీడియా లో చాలా ఉన్నాయి. పైకి మాత్రం అంతా నీతి సూత్రాలు వల్లిస్తారు. ఏమైనా అంతే....పత్రికా స్వేచ్ఛ అనే సొల్లు స్లోగన్తో వీధికెక్కుతారు. రూలు అందరికే ఒకటే అన్న సిద్ధాంతం మరుగున పడింది. పేపర్లలో కాలమ్స్ రాయనివ్వరని, ఛానెల్స్ లో చర్చలకు పిలవరన్న భయం తో మేథావులు సత్యం మాట్లాడరు. యథార్థ వాది...లోక విరోధి అవుతున్నాడు. సత్యం సమాధి అవుతున్నది.      

టీ.వీ.ఛానెల్స్ పచ్చి వ్యాపారం చేస్తున్నాయి. తెర మీద బొమ్మ కనిపించాలంటే అక్రమాలకు పాల్పడక తప్పదని యజమానులు వాదిస్తున్నారు. ఇప్పుడున్న ఛానెల్స్ దాదాపు అన్నీ అవినీతి, అక్రమాల పునాదుల మీద నడుస్తున్నాయన్న ఆరోపణ ఉంది. కొన్ని ఛానెల్స్ లో సీ.ఈ.ఓ.లు జర్నలిజం చేయడం లేదు. పచ్చి వ్యాపారం చేస్తున్నారు. కొందరు...యజమానుల కోసం బ్రోకర్ పనులు చేసి నెలకొక లక్షో రెండు లక్షలో సంపాదిస్తున్నారు. విధి లేక పొట్ట కూటి కోసం వస్తున్న ఆడ పిల్లలను చేరుస్తున్న, వాడుకుంటున్న చిత్తకార్తె కుక్కలు, మేక వన్నె పులులు.... ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళదే రాజ్యం. ఇలా...జర్నలిజం ఏనాడో కుల హీన మయ్యింది. కాగా ఇప్పుడు నీతి, గీతి, రీతి అన్న వ్యర్ధ ప్రసంగాలు ఎందులకు? 

అయితే...మరి పరిష్కారం ఏమిటి అన్న సందేహం తలెత్తక మానదు. సత్యమేవజయతే...ఒక్కటే నాకు కనిపిస్తున్నది. సత్యం దాని పని తాను చేసుకు పోతుంది. నీతి మాలిన జర్నలిజం చేసే వారు తప్పక శిక్షింపబడతారు. ప్రతి జర్నలిస్టు కళ్ళ ఎదుట ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. వేల కోట్లు ఉండి...ఒక కొడుకు కాన్సర్ నయం చేయించుకోలేని ఒక తండ్రి, వందల కోట్లు ఉండి...బీ.పీ., షుగర్ లతో చస్తున్న యజమానులు, మనశ్శాంతి లేక నిత్యం చచ్చి బతుకుతున్న ఎడిటర్ ఇన్ చీఫ్ లు మనకు సాక్షి. సత్యం నిజంగా ప్రమాదకరమైనది, బ్రదర్స్. బీ కేర్ ఫుల్.    

Wednesday, May 23, 2012

'ఈనాడు' ఉద్యోగులకు 20 శాతం పెరిగిన జీతాలు


'ఈనాడు' చరిత్రలో ఇవ్వాళ మరొక శుభదినం. కారణాలు చెప్పకుండానే....యాజమాన్యం సిబ్బందికి ఇరవై శాతం జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది ఉద్యోగులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

'ఎందుకు పెంచారో మాకూ అర్థం కావడం లేదు. మా ఆఫీసులో మాత్రం పండగ వాతావరణం ఉంది,' అని ఒక జర్నలిస్టు చెప్పారు.
జగన్  అరెస్టు కు రంగం సిద్ధమైన నేపథ్యంలో 'ఈనాడు' ఇలా జీతాలు పెంచిందని ఒకప్పుడు 'ఈనాడు' లో పనిచేసిన  సీనియర్ జర్నలిస్టు ఒకరు  అభిప్రాయ పడ్డారు. 'ఇదొక పైశాచిక ఆనందం,' అన్నది ఆయన వ్యాఖ్య. ఇదిలా వుండగా...కొత్త వేజ్ బోర్డు సిఫార్సుల ప్రకారం జర్నలిస్టులకు భారీగా జీతాలు పెరగాల్సి ఉంది. 

అతి త్వరలో మరొక వినోదాత్మక ఛానల్ "చిత్రసీమ"?


జనాలకున్న సినిమా పిచ్చను మరింత పకడ్బందీగా క్యాష్ చేసుకొనేందుకు త్వరలో "చిత్రసీమ" పేరిట ఒక ఛానల్ రాబోతున్నదట. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం...తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల్లో ఆసక్తిగలవారు పది, ఇరవై లక్షల చొప్పున వేసుకుని నరేంద్రనాథ్ చౌదరి నేతృత్వంలోని ఎన్..టీవీ సాంకేతిక సహకారంతో ఈ ఛానల్ ను తీసుకొస్తున్నారు. తెలుగు చలనచిత్ర సీమ లో ఒక బలమైన సామాజిక వర్గం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును చేపడుతున్నది.
ఇప్పటిదాకా ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ సినిమాల క్లిప్పింగ్ లు, కథనాలు కుమ్మిపారేస్తూ జనం మదిని దోచుకుంటున్న విషయం తెలిసిందే.  బీచ్ లను, బికినీలను, చిచ్ లను వివిధ కోణాలలో చూపించడం...సినిమాతో సంబంధంలేని వార్తలకూ సినిమా క్లిప్పులను జోడించి ప్రసారం చేయడం కూడా పెరిగిపోయింది. వార్తా ఛానళ్లలో వార్తల కన్నా సినిమా క్లిప్పులు చూపిస్తున్న ఛానల్స్ సంఖ్య అంతకంతకూ పెరిగింది. సినిమాల ప్రమోషన్ కోసం దాదాపు అన్ని సినిమాల వారూ బుల్లితెర ను బాగా వాడుకుంటున్నారు. షూటింగ్ ఆరంభమయిన నాటి నుంచీ సినిమా హీరో, హీరోయిన్, ఇతర నటీనటులతో విభిన్నమైన ప్ర్రోగ్రాంలు, ఇంటర్వ్యూలు గుప్పించి ప్రేక్షకుడిని సినిమా హాలు వైపు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ ఛానళ్లకు ప్రమోషన్ లో భాగంగా లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు కుమ్మరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ప్లస్ కళామతల్లికి సేవ చేసుకోవడానికి తమకంటూ ఒక ఛానల్ ఉండాలన్నది ఈ వర్గం  ప్లాన్.

చిత్రసీమ ప్రాణం పోసుకుంటే...ఆ ఛానలే సినిమాలకు రేటింగ్ ఇవ్వాలనీ, రేటింగ్ ను బట్టి రేటు చెల్లించి ప్రత్యేకంగా తమ ఛానల్ లో మాత్రమే ఆ సినిమా తాలుకు మాల్ మసాలా వచ్చేలా చేయాలని భావిస్తున్నారు. అప్పుడు నటీ నటులు టీవీ స్టూడియోలలో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడానికి వీలుండదు. ఈ ఛానల్ కే వారి ప్రమోషన్ రైట్స్ వస్తాయట. జూబ్లీహిల్స్ లో నరేంద్రనాథ్ చౌదరి గారికున్న అనేకానేక బిల్డింగ్ లలో ఒక దానిలో ఛానల్ పనులు ప్రారంభమయినట్లు కూడా చెబుతున్నారు. గతంలో "మా" ఛానల్ లో పనిచేసిన శరత్ మరార్ ను ఇందులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇమేజ్ హాస్పిటల్ వారు ఐదు ఛానళ్లు ప్లాన్ చేశారు. న్యూస్, ఇంగ్లిష్ న్యూస్, మ్యూజిక్, హెల్త్, డివోషనల్ ఛానల్ లను సాధ్యమైనంత త్వరగా తేవాలని ప్రయత్నిస్తున్నది. మరొక పక్క తులసి సీడ్స్ వారి నేతృత్వంలోని ఛానల్ ను తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు ఊపందుకున్నాయని సమాచారం.

Monday, May 21, 2012

కట్నం తీసుకున్నవాడొక కుక్క!

టీచర్ గా పనిచేస్తూ...నా దగ్గర జర్నలిజం చదువుకున్న యువతి నాకు నిన్న ఉదయం ఫోన్ చేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కు వెళుతూ...నా శుభాశీస్సు కోసం చేసింది. కలక్టర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్న తనను ఈ కోర్సు అయిన తర్వాత జర్నలిజం లో చేరవద్దని, సివిల్స్ కు సిద్ధంకమ్మని నేను గట్టిగా చెప్పాను ఒక ఏడాది క్రితం. అందుకే మళ్ళీ వెళ్లి టీచర్ ఉద్యోగం లో చేరి బాగా చదువుకుంది. ఈ ఏడాది కాకపోయినా, వచ్చే ఏడాది అయినా సివిల్స్ కు ఎంపిక అవుతుందన్న గట్టి నమ్మకం నాకుంది.  తన ఫోన్ అందుకున్నాక....ఆమె జీవితం నా కళ్ళ ముందు కదలాడింది. 

ఒక మారుమూల పల్లెలో పుట్టి స్వయంకృషితో ఎదిగిన దళిత యువతి...ప్రేమించి అగ్ర కులానికి చెందిన ఒక అబ్బాయిని చేసుకుంది. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగే తను డబ్బు కోసం ఈ అమ్మాయిని వేధించే వాడు. తాగుడుకు బానిసయ్యాడు. ఒక బాబు పుట్టిన తర్వాత నరకం చూపించ సాగాడు. కులం పేరుతో కూడా దూషించేవాడట. తన చెల్లెలు ఫీజు కూడా తనే చెల్లించింది. తన బాంక్ సేవింగ్స్ లో డబ్బు విత్ డ్రా చేయడం వల్ల తాను మా సంస్థలో ఫీజు కట్టలేక పోయింది. వారి దీన గాధ విని నేను ఫీజులో సగానికి సగం రాయితీ ఇచ్చాను. ఫీజు కట్టమని ఒత్తిడి చేయలేకపోయాను. డబ్బుకు బానిసలైన వాడిని నమ్మబట్టి అమ్మాయి జీవితం ఇలా అయ్యిందని, ఎంతో తెలివిగల తాను ఒక మనిషిని ఎందుకు అర్థం చేసుకోలేక పోయిందో కదా అని నాకు అనిపిస్తుంటుంది. ఫోన్ లో విషెస్ చెప్పాక...నేను ఆఫీసుకు వచ్చాక...స్టార్ లో అమీర్ ఖాన్ అద్భుతంగా నిర్వహిస్తున్న 'సత్యమేవజయతే' తారస పడింది. అందులో  అంశమైన...వరకట్న దురాచారం కథనం నన్ను కాసేపు ఏడిపించింది. అదే సమయంలో నా ఆలోచనలను ఒక పద్దెనిమిదేళ్ళ వెనక్కు తీసుకువెళ్ళింది.  

జన్యురీత్యానో, పెంపకం వల్లనో, స్టూడెంట్ యూనియన్లో తిరగడం వల్లనో డబ్బు మీద, కట్నం మీద స్కూలు దశలోనే నాకు ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది. డబ్బు మనిషిని శాసించకూడదని, కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నవాడంటే...చేతగాని చవట అనే అభిప్రాయం నాలో ఎందుకో నాటుకుపోయింది. అదృష్టవశాత్తూ 1988 వేసవిలో ఒక మల్లెచెట్టు నీడన ఆమె (మా ఇంటి ఓనర్ గారమ్మాయి) కనిపించింది. అదిగో...ఆమే జీవిత భాగస్వామి అని మనసు స్పష్టంగా చెప్పింది. ఇంట్లో చేరిన శుభ ముహుర్తాన కొట్టిన కొబ్బరికాయ ముక్కను ఇచ్చే మిషతో తనతో మాట్టాడదామనుకుంటే...వాళ్ల ఢాఢీ వచ్చి...'బాబూ...ఆ ముక్క ఆ గోడ మీద పెట్టు....ఇంట్లో వాళ్లు తర్వాత తీసుకుంటారు...' అని అడ్డుపడ్డారు. 

ఇంటర్మీడియెట్ చదివే పోరగాడు...ఈ విషయం ఎవడికైనా చెబితే ఏమైనా ఉందా? డిగ్రీ ఫస్టియర్ చివర్లో పథకం ప్రకారం...ఐ లవ్ యూ చెప్పడం...ఇది సాధ్యమయ్యే పనికాదని మేడం గారు అనడం...నీవు లేని జీవితం వ్యర్ధమని సినిమా లెవల్లో మనం స్పష్టం చేయడం...సరే...దోస్తానా సాగిద్దామని ఒక ఒప్పందానికి రావడం చకచకా జరిగిపోయాయి. ఎలాగైనా ఆమెతోనే జీవితం పంచుకోవాలన్న పిచ్చి తపనతో డిగ్రీ సతుకుతూ 'ఈనాడు' లో కంట్రిబ్యూటర్ గా, ఆకాశవాణిలో క్యాజువల్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించడం మొదలైంది. ఇద్దరం ఒకే కాలేజీ నుంచి మొదటి ఏ.ఐ.ఆర్. ప్రోగ్రాం ఇవ్వడం ఇప్పటికీ గుర్తు. 

డిగ్రీ పూర్తయ్యేసరికి ఒక నాలుగైదు వేల లవ్ లెటర్ల మార్పిడి పూర్తయింది. ఆమెతో కూర్చొని హాయిగా చెస్ ఆడుతున్నప్పుడు మన బండారాన్ని నాన్న పసిగట్టడం కూడా జరిగిపోయింది. ఆ రోజున మా నాన్న వేసిన డైలాగ్ నాకు బాగా గుర్తు. ''పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని...ప్రపంచం నన్ను చూడట్లేదనుకుంటుంది...'' అని అన్నారు. అప్పుడు ధైర్యంగా నాన్నను డాబా మీదకు తీసుకుపోయాను. ఆ అమ్మాయి ఎంతో మంచిదని, ఆమెతో జీవితం పంచుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నదని చెప్పాను. ఎంతో ఉదార మనస్సు వున్న మా నాన్న వెంటనే ఇల్లు ఖాళీ చేయించారు తప్ప...మరేమీ అనలేదు. 'ముందు డిగ్రీ పాస్ కా...ఆ తర్వాత జీవితంలో సెటిల్ అయ్యాక చూద్దాం' అన్నారాయన. 

విశ్వవిద్యాలయ స్థాయిలో నేను డిగ్రీ ఇరగదీయడం...వెంటనే 'ఈనాడు జర్నలిజం స్కూల్'లో సీటు పొంది ఉద్యోగం సాధించడం...  మా అన్నయ్య సహకారంతో వాళ్ళ నాన్న గారికి మా ప్రేమ గురించిన పిడుగు లాంటి వార్త చేరవేయడం...కూడా చకచకా జరిగిపోయాయి. 

ఈ దశలో మాకు ఇక్కడ కట్నం చిక్కు వచ్చింది. మాట్లాడుకునే మిషతో పెద్దలు కలిసి నా ఖరీదు ఒక 30 వేలు లేదా 40 వేలుగా నిర్ణయించారు. ఇద్దరం ఫీల్ అయ్యాము. నా అభిమతానికి భిన్నంగా జరిగిన ఈ విషయంతో నేను తల్లడిల్లి పోయి వెంటనే సెలవు తీసుకుని హైదరాబాద్ నుంచి ఇంటికి పోయాను. కట్నం గురించి తెలిసిన నాటి నుంచీ దయ్యాలూ...భూతాలూ కలలోకి వస్తున్నాయని తిక్క తిక్కగా ఉండని అబద్ధం చెప్పాను అమ్మా నాన్నలకు. ఏ మాత్రం డబ్బు మనుషులు కాని అమ్మానాన్న ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించారు. పెళ్ళికి అయ్యే ఖర్చులు చెరి సగం భరించేలా...నాకూ నాన్నకు ఒప్పందం కుదిరింది. పెళ్లి మా ఊళ్ళో జరగాలని నాన్న షరతు పెట్టారు. దానికి వాళ్ళ (అమ్మాయి) నాన్న గారిని ఒప్పించాను. 

మొత్తం మీద నయా పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇది మా ఇద్దరి జీవితంలో ఒక పెద్ద లక్ష్యం. పెళ్లి రోజున మామ గారు పెట్టిన డ్రస్సు ఒక్కటే నేను వాళ్ళ నుంచి తీసుకున్నది. 'ఈనాడు' లో శర్మ అనే నరరూప రాక్షసుడు నంజుకు తింటుంటే...ఎందుకైనా మంచిదని తుర్క్ ఎమ్జాల్ లో ఒక స్థలం కొన్నప్పుడు మామ గారు కొంత అప్పు ఇచ్చారు. దాన్ని ప్రాంప్ట్ గా తిరిగి చెల్లించాను. ఆయన మంచాలూ, కంచాలూ కొని ఇచ్చినా మేము తీసుకోలేదు. మా నాన్న గారికి పెళ్లి ఖర్చుల కింద ఒక చిట్టీ పాడి నేను ఇచ్చిన 25,000 ఇంస్టాల్మెంట్ కట్టడం పూర్తికావడానికి నాకు నాలుగేళ్ళు పట్టిందనేది వేరే విషయం. బ్యాంకు బాలెన్సులు పెద్దగా లేకపోయినా...హాయిగా బతుకుతున్నాం. మా ఇద్దరి మధ్యా డబ్బు ఒక అంశంగా ఎప్పుడూ ప్రస్తావనకు రాదు. ఎందుకంటే...'డబ్బును మనం శాసించాలి  తప్ప మనల్ను డబ్బు శాసించ కూడదని' ఇద్దరం గట్టిగా నమ్ముతాం కాబట్టి. ఆ నాడు కాసులకు కక్కుర్తి పడితే ఇప్పటికీ కుమిలి పోవాల్సివచ్చేది. సరే...ఇదీ ఒకసొంత సోదే.    

ఇదెందుకు చెబుతున్నానంటే...మగ పిల్లలు కట్నం తీసుకోవడం దారుణమని చెప్పడానికే. ఏదో ఒక శూలం అదనంగా ఉందని....జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవడమా? పాపిష్టి డబ్బు ప్రమేయం వున్న ఏ సంబంధమైనా నిలకడగా ఉంటుందా? నిలుస్తుందా? అమీర్ ఖాన్ షో లో ఒకరు అన్నట్లు....డబ్బు ప్రమేయం లేని వివాహాల కోసం అందరం ప్రయత్నిద్దాం. డబ్బు మదంతో ఖర్చులు చేసే పెళ్ళిళ్ళను బాయ్ కాట్ చేద్దాం. మనిషిని మనిషిగా గౌరవిస్తూ హాయిగా బతికే సమాజం కోసం పాటు పడదాం. మా అబ్రకదబ్ర అన్నట్లు...కట్నం తీసుకున్నవాడొక కుక్క! కాదంటారా?             

Saturday, May 19, 2012

ఇండియా టుడే-ఆదిత్య బిర్లా ఒప్పందం
THE $ 35- billion Indian multinational, Aditya Birla Group ( ABG) and India’s most respected and diversified media corporation, the India Today Group ( ITG) came to an agreement on Friday for a 27.5% financial investment by a private investment company of the Aditya Birla Group in ITG’s holding company, Living Media India Ltd.
Commenting on the investment, Kumar Mangalam Birla, chairman, Aditya Birla Group, said, “ The Indian media sector is a sunrise sector from our investment point of view. I believe that The India Today Group offers one of the best opportunities of growth and value creation. ITG’s management ethos, values, brands, product portfolio and future plans offer one of the best opportunities for growth and value creation.” Aroon Purie, chairman of the India Today Group, said, “ I am delighted to partner with the Aditya Birla Group to aggressively address the current and future potential of the Indian media business which is at a tipping point.
The Aditya Birla Group with its strong leadership, global footprint, diversified business interests and its shared values of integrity, commitment and social responsibility make it a perfect fit with the India Today Group”. The transaction is subject to the customary approvals.
(Courtesy: Mailtoday)

Friday, May 18, 2012

'సాక్షి' మూతపడాలని అనుకోవడం ప్రమాదకరం


తెలుగు జర్నలిజం మున్నెన్నడూ లేని అవమానకరమైన ఫేజ్ లో ఉన్నది. వ్యాపార వృద్ధికో, రాజకీయ లబ్దికో వార్తా పత్రికలు, ఛానెల్స్ నిర్వహిస్తున్నారు. క్రాస్ కమర్షియలైజేషన్ అనేది భారత జర్నలిజానికి కొత్త కాకపోయినా, తెలుగు నాట మీడియా యజమానుల ధోరణి వెర్రితలలు వేస్తున్నది. పలు వ్యాపారాలతో పాటు ఒక పేపరో, చానలో ఉంటే....బాగుంటుందన్న ధోరణి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలలో పెరిగి జర్నలిజం పరమార్థం నీరుగారుతున్నది. ఈ క్రమం లో జర్నలిస్టుల పని విధానం.. జర్నలిస్టు ప్రొఫైల్ మారిపోయింది. 

ప్రకటనలకోసం పరితపించే యజమానిని సంతృప్తి పరిచే వారు...వృత్తి పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి లేకపోయినా అద్భుతమైన జర్నలిస్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు. జనాలకు ఎలాంటి బూతు, ఎలా చూపించాలో అధ్యయనం చేసి టీ.ఆర్.పీ.రేటింగ్స్ పెంచే వారు మంచి సీ.ఈ.ఓ.లుగా వెలిగి పోతున్నారు. ఉన్నట్టుండి వివాదాన్ని సృష్టించి దాన్ని రోజంతా వివిధ కోణాలలో చూపించే జర్నలిస్టులకు గిరాకీ పెరిగింది. జర్నలిస్టులు-సామాజిక బాధ్యత...అంటూ సత్తెకాలపు మాటలు మాట్లాడే జర్నలిస్టులు వృత్తిలో నలిగిపోతున్నారు. బాసులను తృప్తి పరచలేక, చావు తెలివితేటలతో ఎదిగిన జూనియర్ గాడి కింద పనిచేయలేక తమను తాము నిందించుకుంటూ అనారోగ్యంతో వీరు చీకిపోతున్నారు. 

దళిత ఉద్ధరణ, నైతిక జర్నలిజం కోసం పనిచేస్తున్నట్లు ఫోజుకొట్టే పండు ముసలి జర్నలిస్టులు ఇద్దరు ముగ్గురు తమ కుటుంబీకులకు, భజనపరులకు, అంతే వాసులైన సన్నాసులకు పెద్ద పీట వేస్తూ నికార్సైన జర్నలిస్టులను కించపరుస్తున్నారు. జర్నలిజం లో మంచి పేరున్న ఈ బాపతుగాళ్ళు యాజమాని తర్వాత యజమాని స్థాయికి వచ్చే సరికి రంగు, వాసన కోల్పోయి...తల పొగరు పెరిగి జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించడం మొదలుపెట్టారు.     కనీసం నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఆనక తాము పొందాలని అనుకునే....ప్రెస్ అకాడమీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యత్వం దిశగా పావులు కదుపుతూ జర్నలిజం ఆచరిస్తున్నారు. చావు తెలివితేటలు ఉన్న వారు దర్జాగా బతికే జర్నలిజం ఇప్పుడున్నది.

కుళ్ళిపోతున్న జర్నలిజం లో ఇవన్నీ ఒక పార్శ్వమైతే...ఇంకొక పెద్ద పార్శ్వం కులం. నిన్న మొన్నటి దాకా...తమ ఆధిపత్యంలో ఉన్న తెలుగు జర్నలిజం లోకి రెడ్డి రాజులు దూసుకు రావడాన్ని కమ్మ ఎడిటర్లు, యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా...ఆ వచ్చిన రెడ్డి రాజులు...కత్తులూ కటార్లతో వచ్చి...తమ దగ్గరి జర్నలిస్టులకు డబ్బు ఎరవేసి ఎగేసుకుపోయి తామూ జీతాలు పెంచి చావక తప్పని పరిస్థితి కల్పించారని కమ్మ యజమానులు నమ్ముతున్నారు. అది వారి కడుపు మంట. అప్పటిదాకా...'ఈనాడు' చెప్పింది వేదం గా వుండేది. 'సాక్షి' రాకతో తీరు మారింది. 'ఈనాడు' లో కథనాలను ఖండిస్తూ...వాటిలో కుతంత్రాన్ని దునుమాడుతూ 'సాక్షి' విరుచుకుపడడంతో తెలుగు జర్నలిజం స్వరూప స్వభావాలు మారిపోయాయి. అందుకే... నీతిని నిలబెట్టడమే  తమ విహిత కర్త్యవ్యమన్నట్లు రామోజీ, రాధాకృష్ణ ఇపుడు ఫోజు కొడుతున్నారు. 'ఈనాడు' విస్తరణకు కృషి చేసిన జర్నలిస్టులు దుర్భర జీవితాలు అనుభవించారు. స్వేదం, రక్తం...ఇత్యాదులన్నీ దానికోసం ధారపోసారు. అయినా వారికిచ్చిన జీతభత్యాలు స్వల్పం. 'ఈనాడు' ను అడ్డంపెట్టుకుని యాజమాన్యం వ్యాపార విస్తరణ చేసుకున్నది అనంతం. కమ్మ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని భూములు కారుచౌకగా కొట్టివేసిన సంగతి నిన్న మొన్నటిదే. 

రామోజీ గారు పెట్టిన జర్నలిజం పొగలో మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరై మరింత దాష్టీకంతో పుట్టుకొచ్చినది సాక్షి. అంత వరకూ సరైన ఫోరం లేక ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు అది వరప్రసాదం అయ్యింది. రామోజీ సూత్రాన్ని భిన్నంగా మరింత దారుణంగా అనుసరించారు వై.ఎస్.రాజశేఖర రెడ్డి. పెట్టుబడులు సందేహాస్పదం, అభ్యంతరకరం అయితే కావచ్చు గానీ....'సాక్షి' పుట్టుక నీడ్ ఆఫ్ ది అవర్. అది తక్షణావసరం. లేకపోతే...అధికారం పోయిందని కుళ్ళిపోతున్న కమ్మ సంఘం మరిన్ని అసత్యాలు పంచేది, జర్నలిజాన్ని మరింత పలుచన చేసేది. సాక్షి రాకతో అది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్రమత్తంగా ఉంది. ఇది ముమ్మాటికీ మంచిది. కాబట్టి సాక్షి మూతపడాలని కోరుకోవడం పిచ్చితనం. అంతా దొంగలే. వాళ్ళ మధ్య పంచాయితీ...మనలాంటి సామాన్యులకు మంచిదే. కాదంటారా?
(నోట్: ఈ వ్యాసంలో కులాల గురించి ప్రస్తావన తేక తప్పింది కాదు. దానికి క్షంతవ్యులం. ఈ రెండు కులాల మధ్య నలుగుతున్న ఇతర కులాల గురించి త్వరలో ఒక పోస్ట్ ఉంటుంది.)    

Wednesday, May 16, 2012

మళ్ళీ 'సాక్షి' ఛానెల్ లో చేరిన స్వప్న


'సాక్షి' ఛానెల్ నుంచి రెండు సార్లు వెళ్ళిపోయి ఫ్రీ లాన్సింగ్ చేస్తున్న ప్రముఖ టీ.వీ.యాంకర్, గాయకురాలు స్వప్న తిరిగి ఆ ఛానెల్ లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. 

సాక్షి అధినేత జగన్ భార్య భారతి చొరవ మేరకు ఉన్నపళంగా ఈ నియామకం జరిగింది. నిజానికి...త్వరలో రాబోయే ఇమేజ్ హాస్పిటల్ వారి ఛానల్ లో ఎడిటర్ (ప్రోగ్రామ్స్) గా స్వప్న జాయిన్ అయినట్లు ప్రచారం జరిగింది. చర్చలు ముగిసి...పని ఆరంభించే లోపే సాక్షి యాజమాన్యం స్పందించి ఆమెను తిరిగి తీసుకుంది. స్వప్న ను తమ ఛానెల్ లోకి తేవడానికి HM TV చానల్ వారు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. 

సాక్షికి ఇది సంక్షోభ సమయమైనా స్వప్న వెళ్లి చేరడం చర్చ నియాంశం అయ్యింది. ఈ పరిణామాన్ని ఇమేజ్ యాజమాన్యం ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి. 

Tuesday, May 15, 2012

హమ్మా...అమర్, శ్రీనివాస రెడ్డి లపైనే ఆరోపణలా?Sunday, May 13, 2012

నిజ్జంగా వేమూరి రాధాకృష్ణ పత్తిత్తా?


'ఏది పత్రిక...ఏది స్వేచ్ఛ?' అన్న శీర్షికన వేమూరి రాధాకృష్ణ గారు నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక సంతకంతో కూడిన ఎడిటోరియల్ రాసారు. అందులో కొన్ని పాయింట్లు నాకు బాగా నచ్చాయి. స్వకులానికి చెందిన పార్టీ, నాయకుడు అర్జెంటుగా అధికారం లోకి రావాలని మరో కమ్మ ఎడిటర్ ఇన్ చీఫ్ తో పాటు కలలుకంటున్నవాడిగా రా.కృ.కు ముద్ర వున్నది కాబట్టి ఆయన చిత్తశుద్ధిని శంకించే అవకాశం ఉంది కానీ...సో కాల్డ్ జర్నలిస్టు నేతలు శ్రీనివాస రెడ్డి, దేవులపల్లి అమర్ ల మీద నిర్భయంగా రాసే దమ్మున్న వ్యక్తి రా.కృ. వారిద్దరిని కొట్టిన కొట్టుడుకు ప్రెస్ క్లబ్బుల్లో మందు బాటిళ్ళు చాలా ఎగిరిపోయి ఉంటాయి. 

నీతి పట్ల మనకు ఉన్న అభిప్రాయాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, మన రాజకీయ నేపథ్యాన్ని బట్టి ఈ ఎడిటోరియల్ మీద అభిప్రాయాలు ఉంటాయని నాకు బోధపడింది. రా.కృ. ఎడిటోరియల్ చదివిన మూడు విభిన్న కులాలకు చెందిన జర్నలిస్టులు నాతో ఫోన్లో మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. 
కమ్మ  జర్నలిస్టు: రామూ...రాధాకృష్ణ ఎడిటోరియల్ చదివావా? అదిరిపోయింది. శ్రీనివాస రెడ్డి, అమర్ లను కడిగి పారేశాడు. తప్పకుండా చదువు.
రెడ్డి  జర్నలిస్టు: రాధాకృష్ణ బతుకు ఎవరికి తెలియదు. చంద్రబాబు అండతో ఆయన ఏమి చేసిందీ అందరికీ తెలుసు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండానే ఆయన ఈ స్థాయికి ఎదిగాడా?
బ్రాహ్మణ జర్నలిస్టు: నీతి గురించి మాట్ల్డాలంటే కొంత అర్హత ఉండాలి. నీతి గురించి ఏ అర్హతతో రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు? వాడి బొంద. 
సెక్యులర్ జర్నలిస్టు: ఇదొక కుల పోరాటం. వై.ఎస్.ఆర్. హయాం లో పడిన ఇబ్బందుల తాలూకు కసిని రా.కృ.ఇలా తీర్చుకుంటున్నాడు. కాకపోతే....ఈ ఇద్దరు యూనియన్ నేతలను ఎదకట్టడం అభినందించాల్సిన విషయం. మీడియాను భ్రష్టు పట్టిస్తున్న కమ్మ కుల నేతల గురించి కూడా ఆయన రాస్తారేమో చూద్దాం.

అదీ సంగతి...ఈ నేపథ్యంలో అన్ని పత్రికలు, ఛానెల్స్ తమ పెట్టుబడులు, లాభ నష్టాల జాబితాలను స్వచ్ఛందంగా ప్రకటిస్తే బాగుంటుందేమో? మీరేమంటారు? 

Saturday, May 12, 2012

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడా?


మన సమాజంలో నీతి, అవినీతి పై చర్చ పెడదోవ పట్టింది. ఈ చర్చను తెలివిగా గందరగోళ పరిచే మేధావులు, జర్నలిస్టులు ఎక్కువై పోయారు. 'సాక్షి'ది అవినీతి సొమ్ము...అని ఎవరైనా వాదిస్తే...మరి 'ఈనాడు' ది కాదా? అంటారు తప్ప...తప్పును తప్పుగా వాదించే వివేచన మంటలో కలిసి పోయింది. Absolute ethics అనే విషయాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. 

మార్గదర్శి మీద దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తే అది పత్రికా స్వేచ్ఛ మీద దాడి. 'సాక్షి' బ్యాకు ఖాతాలు నిలిపివేస్తే...అదీ పత్రికా స్వేచ్ఛ మీద దాడే. గడిచిన రెండేళ్లలో దాదాపు 1500 జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పోయాయి. అది ఏ కోవలోకీ రాని విషయం అయిపోయింది. ఈ రోజు 'సాక్షి' కి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న పైరవీకార్ జర్నలిస్టు నేతలు ఒక్క రోజైనా ఈ ఉద్యోగుల కోసం ధర్నా చేయలేదు కానీ ఇప్పుడు ప్రపంచం బద్దలవుతున్నట్లు హంగామా చేస్తున్నారు. పచ్చిగా చెప్పుకోవాలంటే....రెడ్డి జర్నలిస్టులు, కమ్మ జర్నలిస్టులు విడివిడిగా నడిపిస్తున్న వింత నాటకంలో పత్రికా స్వేచ్ఛ ముమ్మాటికీ ఒక సాకు మాత్రమే. అబద్ధాన్ని నిజమని నమ్మించే చానల్స్ రాజ్యమేలుతున్నంత కాలం, ఒక నలుగురు జర్నలిస్టు సంఘాల నేతలకు ఈ భూమి మీద నూకలు ఉన్నంత కాలం..... సత్యం సజీవ సమాధిలోనే ఉంటుంది. దీనిపై మన చర్చ ఒక వ్యర్ద వ్యవహారంగానే ఉంటుంది.  ప్రస్తుత విషయానికి వస్తే...

జగన్ మోహన్ రెడ్డిది వాపో, బలుపో తెలియక జుట్టుపీక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను నియంత్రించలేక తప్పుల మీద తప్పులు చేస్తున్నది. A-1 గా ఉన్న జగన్ను అరెస్టు చేయకుండా...ఏవేవో తిక్కపనులు చేస్తూ పోతున్నది. అకౌంట్ల స్థంభన అనేది కచ్చితంగా రాజకీయ కోణంలో జరిగిందే.  వై.ఎస్.ఆర్. నుంచి లబ్ది పొందిన పారిశ్రామికవేత్తలు ఆయన ఆదేశం మేరకో, ఆయన్ను ప్లీజ్ చేయడం కోసమో 'సాక్షి' లో పెట్టుబడులు పెట్టారనేది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. దాన్ని నిర్ధరించి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటే పర్వాలేదు గానీ కావాలని కంపు చేయాలని చూడడం పధ్ధతి కాదు. తదనంతరం....పత్రికా ప్రకటనలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఒక ఆర్డర్ వేయడం మాత్రం తెలివితక్కువ విషయం. 

'ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ'పై చర్చ అంటూ కొందరు జర్నలిస్టులను పిలిచి జూబ్లీహాల్ లో రౌండ్ టేబుల్ చర్చ జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడం వల్ల లక్డీకాపూల్ లో ని స్పియర్ మింట్ సంధ్య హోటల్ లో ఒక చర్చ నిర్వహించారు. దానికి సీనియర్ ఎడిటర్ ఎ.బి.కె.ప్రసాద్, మరొకాయన సమన్వయకర్తగా వ్యవహరించారు. అందులో జర్నలిజాన్ని నమ్ముకున్న వారికన్నా అమ్ముకుంటున్న వారూ కొందరు ఉన్నారు. అవినీతి వ్యవస్థీకృతమైనది కాబట్టి...ఇక దాని గురించి మాట్టాడవద్దని నిస్సిగ్గుగా స్టూడియో చర్చల్లో వాదిస్తున్న ఒక దళారీ గొంతు బాగా వినిపించింది. ఆయనా ఆయన తాబేదార్లు ఎక్కడ చూసినా స్టూడియోల్లో దర్శనమిస్తూ ఇది కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడే నంటూ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఇందులో నా మాజీ సహచరుడు, ఇప్పుడు సాక్షిలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న జీవీడీ కృష్ణమోహన్ చక్కగా ప్రసంగించారు. మాది క్లీన్ మనీ అని ఏ ఛానలైనా చెప్పగలదా? అని ఆయన ప్రశ్నించారు. అది చాలా వాలిడ్ పాయింట్. విచిత్రమేమిటంటే...సీనియర్ మోస్ట్ జర్నలిస్టు వరదాచారి గారిని ఈ చర్చకు ఆహ్వానించకపోవడం.ఒక్క విషయాన్ని మాత్రం జర్నలిస్టులు గమనించాలి. జగన్ నాన్న ఈనాడు ను, జ్యోతి ని ఇబ్బంది పెట్టినప్పుడు లేని 'పత్రికా స్వేచ్ఛ' ఇప్పుడు ఎలా చర్చకు వస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. జర్నలిస్టులు రాజకీయానికి, వృత్తికి తేడా గమనించకుండా....ప్రతి దాన్నీ పత్రికా స్వేచ్ఛ కిందకు లాక్కుంటే....'నాన్నా...పులి' వ్యవహారమై మన పవిత్రమైన వృత్తి మరింత నగుబాటు అవుతుంది. 

Thursday, May 10, 2012

కలవరపరుస్తున్న 'సాక్షి' పరిణామాలు


సీ.బీ.ఐ. ఉన్నట్టుండి జగన్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంతో 'సాక్షి' పేపర్, ఛానెల్ లలో పనిచేస్తున్న జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఒక్కసారిగా బెంబేలెత్తారు. ఈ పరిణామంతో భయ పడాల్సిన పనిలేదని యాజమాన్య ప్రతినిధులు హామీ ఇస్తున్నా....గత మూడు రోజులుగా ఈ విషయం గురించే చర్చ జరుతున్నది. 'సాక్షి' లో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఎందుకైనా మంచిదని ఇతర ఛానెల్స్ వైపు చూస్తున్నారు. తమ గాడ్ ఫాదర్స్, వెల్ విషర్స్ సహాయంతో.... కొత్తగా వస్తున్న ఛానెల్స్ లో అవకాశాల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇమేజ్  ఛానెల్ కు రద్దీ పెరిగింది. 'మీ బ్లాగులో మా ఛానెల్ గురించి రావడం, ఇంతలోనే సాక్షి లో పరిణామాలతో మాకు దరఖాస్తులు, విన్నపాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు సప్లయ్ పెరగడంతో డిమాండ్ తగ్గింది. జర్నలిస్టుల జీతాలు పడిపోయే అవకాశం వున్నది," ఇని ఇమేజ్ తో సంబంధాలు వున్న ఒక మిత్రుడు చెప్పారు. 
అయితే...సాక్షి కి జరిగింది..నిజంగానే ప్రెస్ పై దాడిగా పరిగణించాలా? అన్న చర్చ జరుగుతున్నది. దీని మీద మీ అభిప్రాయాలు రాయండి.     

Friday, May 4, 2012

'ఇమేజ్' వారి ఛానెల్ లో స్వప్న, మూర్తి, వాసుదేవన్

'ఇమేజ్' హాస్పిటల్స్ వారు త్వరలో తేబోతున్న న్యూస్ ఛానెల్ బాగుండే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇండస్ట్రీ లో ఉత్తమమైన జర్నలిస్టులను వెతికి ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు టెలివిజన్ జర్నలిజం లో తనదైన ముద్ర వేసుకున్న స్వప్న ఇందులో చేరారు. ఈ-టీవీ, ఎన్ టీవీ, ఏ.బీ.ఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్స్ లో బ్యూరో చీఫ్ గా పనిచేసిన మూర్తి, టీ.వీ.నైన్ లో వార్ కథనాలు అందించడంలో దిట్టగా పేరుపొందిన పత్రి వాసుదేవన్ ఇందులో పెద్ద పదవుల్లో చేరారు. ఇంకా పేరు పెట్టని ఈ ఛానెల్ రెండు మూడు నెలల్లో రాబోతున్నట్లు సమాచారం.టీ.వీ.నైన్ తర్వాత సాక్షిలో పనిచేసిన స్వప్న ఇప్పుడు ది హన్స్ ఇండియా కు ఒక కాలం రాస్తున్నారు. మూర్తి ఒక నెల కిందట ఏ.బీ.ఎన్-ఆంధ్రజ్యోతిని వీడారు. టీ.వీ.నైన్ వదిలిన తర్వాత సాక్షి ఢిల్లీ బ్యూరో చీఫ్ గా, తర్వాత  జెమిని ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేసారు వాసుదేవన్. స్వప్న రాకతో గ్లామర్ సంతరించుకున్న ఈ ఛానెల్ ఈ మధ్యన వచ్చిన ఛానెల్స్ కన్నా భిన్నంగా ఉంటూ ఇప్పటికే స్థిరపడిన ఛానెల్స్ ను ఎదుర్కొనడానికి సన్నద్ధమవుతున్నది. ఆయా టీ.వీ.ఛానెల్స్ లో బాసుల తీరుతో, యాజమాన్యాల విధానాలతో విసిగిన పలువురు జర్నలిస్టులను ఈ ఛానెల్ వారు తీసుకుంటున్నట్లు సమాచారం


Thursday, May 3, 2012

ఘనంగా బూదరాజు గారి జయంతి సభ

జర్నలిజంలో ఎందరికో ఆరాధ్య గురువైన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి ఎనభయ్యో జయంతి సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఈ ఉదయం ఘనంగా జరిగింది.  ఆయన శిష్యులుగా గర్వంగా చెప్పుకునే దాదాపు ముప్ఫై మంది ఇందులో పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల రాలేకపోతున్నామని చెప్పి కార్యక్రమం మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని చెప్పిన వారు ఒక పది మంది ఉండగా, మమ్మల్ని మంగళ వాయిద్యాలతో ఆహ్వానించలేదని అలిగి ఊళ్ళో ఉండి కూడా సభకు రాని సోదర సోదరీ మణులు కూడా ఉన్నారు. ఎవ్వరూ పిలవక పోయినా విషయం తెలిసి వచ్చిన వారి ఒక పది మంది ఉండడం విశేషం. ఎవరి చాయిస్ వారిది, ఎవరి బాధలు వారివి కాబట్టి మనం చెప్పేది ఏమీ లేదు. 
కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మా బ్యాచుకు చెందిన విజయ్ కుమార్ (న్యూస్ ఎడిటర్- హెచ్.ఎం.టీ.వీ.) వ్యవహరించారు. ఆ ప్రోగ్రాం ఘనంగా జరగడానికి మిత్రుడు పీ.మధు, ఆయనకు చెందిన ధాత్రి కమ్యూనికేషన్ సిబ్బంది పడిన శ్రమ మరువలేనిది. ఈ కార్యక్రమంలో ఎన్నో విలువైన సూచనలు చేసిన మిత్రులకు అభినందనలు. 
సారు కు సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేయాలని గట్టిగా సంకల్పించి గతంలో ఒక కమిటీ కూడా వేసిన సంగతి మీకు తెలిసిందే.  మొత్తానికి ఒక ప్రోగ్రాం చేయడం ఆనందం కలిగించింది. ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను. 


Wednesday, May 2, 2012

బూదరాజు గారి జయంతి రేపు


తెలుగు జర్నలిజానికి ఆణిముత్యాల లాంటి జర్నలిస్టులను అందించిన బహు భాషావేత్త, శాసనాలను అధ్యయనం చేసిన దిట్ట, సాహితీ విమర్శకుడు, 'ఈనాడు జర్నలిజం స్కూలు' మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి ఎనభయ్యో జయంతిని ఆయన శిష్యులం రేపు (మూడో తేదీన) హైదరాబాద్ లోని సోమాజిగూడ లో 'ఈనాడు' పత్రిక ఆఫీసు ఎదుట ఉన్న ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నాము. పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. బూదరాజు గారి శిష్యులు, అభిమానులు, సాహితీ వేత్తలు ఈ కార్యక్రమం లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. 


గురువు గారి జయంతి రోజునే Press Freedom Day కావడం విశేషం. ఈ సంస్మరణ సభకు వక్తలుగా అప్పటి 'ఈనాడు జర్నలిజం స్కూలు' బోధకులు డాక్టర్ డీ.చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ కాకాని చక్రపాణి, 'సాక్షి జర్నలిజం స్కూల్' మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గోవింద రాజు చక్రధర్, 'ఈనాడు జర్నలిజం స్కూలు' ప్రిన్సిపాల్ మానుకొండ నాగేశ్వర రావు గార్లను ఆహ్వానించాము. దయచేసి ఈ సమాచారాన్ని నలుగురికి పంచాల్సిందిగా కోరుతున్నాము. ఈనాడు నుంచి ఒకరు వస్తే బాగుంటుందని నాగేశ్వర రావు గారిని పిలిచాము. ఒక కార్యక్రమం వల్ల రాలేనని ఆయన చెప్పారు. కేతు విశ్వనాథ రెడ్డి గారిని ఇతరులను పిలుద్దామని కొందరు చెప్పారు. బూదరాజు గారికి పరిచయం ఉన్న అందరినీ పిలుద్దాం. ఇందులో మనకు అజెండాలు ఏమీ లేవు.  

బూదరాజు సారుకు సంబంధించి ఒక కార్యక్రమం చేసి తీరాల్సిందే అని నేను పట్టిపట్టి అనుకున్నదే తడవుగా తన సమయాన్ని వెచ్చించిన మా బ్యాచ్ మేట్లు పీ.మధుసూదన్ (CEO, ధాత్రి కమ్యూనికేషన్), విజయ్ కుమార్ (News Editor, HM TV) లకు ప్రత్యక కృతఙ్ఞతలు. అహం గిహం విడిచి అన్ని పనులు పక్కన పెట్టి ఈ ప్రోగ్రాం మనది అనుకుని పాల్గొనాల్సిందిగా బూదరాజు గారి శిష్యులను, అభిమానులను, జర్నలిస్టు మిత్రులను కోరుతున్నాం. 


నోట్: ఇప్పటిదాకా చలనం లేకుండా ఉన్న  కొందరు తమ అభిప్రాయాలను పంచుకోవడం మొదలుపెట్టారు బూదరాజు గారి విషయంలో. ఇది మంచి పరిణామం. మనం అందరం కలిసి ఇంకా ఏమి చేయవచ్చో రేపు కలసి మాట్లాడుకుందాం. దయచేసి ప్రోగ్రాం చెడగొట్టాలని మాత్రం చూడవద్దని మనవి.  

Tuesday, May 1, 2012

బూదరాజు గారి జయంతి సభ మే మూడో తేదీన

తెలుగు జర్నలిజానికి ఆణిముత్యాల లాంటి జర్నలిస్టులను అందించిన బహు భాషావేత్త, శాసనాలను అధ్యయనం చేసిన దిట్ట, సాహితీ విమర్శకుడు, 'ఈనాడు జర్నలిజం స్కూలు' మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి ఎనభయ్యో జయంతిని ఆయన శిష్యులం ఈ నెల మూడో తేదీన హైదరాబాద్ లోని సోమాజిగూడ లో 'ఈనాడు' పత్రిక ఆఫీసు ఎదుట ఉన్న ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నాము. పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. బూదరాజు గారి శిష్యులు, అభిమానులు, సాహితీ వేత్తలు ఈ కార్యక్రమం లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. 

గురువు గారి జయంతి రోజునే Press Freedom Day కావడం విశేషం. ఈ సంస్మరణ సభకు వక్తలుగా అప్పటి 'ఈనాడు జర్నలిజం స్కూలు' బోధకులు డాక్టర్ డీ.చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ కాకాని చక్రపాణి, 'సాక్షి జర్నలిజం స్కూల్' మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గోవింద రాజు చక్రధర్, 'ఈనాడు జర్నలిజం స్కూలు' ప్రిన్సిపాల్ మానుకొండ నాగేశ్వర రావు గార్లను ఆహ్వానించాము. దయచేసి ఈ సమాచారాన్ని నలుగురికి పంచాల్సిందిగా కోరుతున్నాము. 

బూదరాజు సారుకు సంబంధించి ఒక కార్యక్రమం చేసి తీరాల్సిందే అని నేను పట్టిపట్టి అనుకున్నదే తడవుగా తన సమయాన్ని వెచ్చించిన మా బ్యాచ్ మేట్లు పీ.మధుసూదన్ (CEO, ధాత్రి కమ్యూనికేషన్), విజయ్ కుమార్ (News Editor, HM TV) లకు ప్రత్యక కృతఙ్ఞతలు. అహం గిహం విడిచి అన్ని పనులు పక్కన పెట్టి ఈ ప్రోగ్రాం మనది అనుకుని పాల్గొనాల్సిందిగా బూదరాజు గారి శిష్యులను, అభిమానులను, జర్నలిస్టు మిత్రులను కోరుతున్నాం.