Thursday, April 21, 2016

టీవీ-5 ఛానల్ ఎడిటర్ గా దినేష్ ఆకుల

సీనియర్ జర్నలిస్టు దినేష్ ఆకుల గారు.. ఇప్పుడు టీవీ-5 ఛానల్ ఎడిటర్ గా చేరారు. ఇప్పటి వరకూ ఎక్స్ ప్రెస్ టీవీ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కం ఛానెల్ హెడ్ గా ఆయన ఉన్నారు. 
ఈ మధ్యన మరణించిన అరుణ్ సాగర్ గారి స్థానాన్ని దినేష్ గారు భర్తీ చేసినట్లు చెబుతున్నారు.  ఎక్స్ ప్రెస్ టీవీ లో జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి దాపురించిన నేపథ్యంలో.. దినేష్ గారి కి వచ్చిన మంచి అవకాశం ఇదని అనుకోవచ్చు.  
దినేష్ గారు ఎక్స్ ప్రెస్ టీవీ లో చేరినప్పుడు మేము రాసిన పోస్టు కూడా మీరు ఇక్కడ చదవవచ్చు. 

ఇదిలా వుండగా ఎక్స్ ప్రెస్ టీవీ నుంచి ఒక పాతిక మంది జర్నలిస్టులతో కలిసి ఉన్నపళంగా వెళ్ళిపోయి మీడియా 24 అనే ఛానెల్ పెట్టడంలో కీలక పాత్ర వహించిన నేమాని భాస్కర్ గారు మళ్ళీ ఎన్-టీవీ లో చేరిపోయారు.  మీడియా 24 పరిస్థితి ఏమిటా? అని అనుకుంటున్న సమయంలోనే... తనను వీడి వెళ్ళిన వాళ్ళను మళ్ళీ తీసుకునే మంచి అలవాటు ఉన్న నరేంద్ర చౌదరి గారి తో మాట్లాడుకుని సొంత గూటికి చేరిపోయారు.. నేమాని. తనను నమ్ముకున్న జర్నలిస్టులు చాలా మందికి అందులో ఉద్యోగాలు వచ్చాయి.. ఒక మహిళా జర్నలిస్టు తప్ప. 
ఒకప్పుడు నరేంద్ర చౌదరి గారు అభిమానించిన ఆ జర్నలిస్టు విషయంలో ఎందుకు ఇప్పుడు ఇంత నికచ్చిగా ఉన్నారో అర్థం కావడం లేదు. 
నేమాని గారు ఎక్స్ ప్రెస్ ఛానెల్ వీడినపుడు మేము రాసిన పోస్టు ఇక్కడ చదవవచ్చు.