Monday, December 21, 2015

'తెలంగాణా టుడే' ఎడిటర్ గా శ్రీ శ్రీనివాస రెడ్డి

'నమస్తే తెలంగాణా' పత్రిక ఆధ్వర్యంలో రాబోయే ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ గా 'ది హిందూ' లో సుదీర్ఘ కాలం పనిచేసిన శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారమ్.  ఆ పత్రిక పేరు 'తెలంగాణా టుడే' అంటున్నారు కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. 

'ది హిందూ' లో ఒక వెలుగు వెలిగిన  శ్రీనివాస రెడ్డి గారు అనూహ్య పరిణామాల మధ్య సెప్టెంబర్ లో ఆ పత్రికకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. రాజీనామా నోటీసుకు ముందు నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు పనిచేసి డిసెంబర్ 15 న ఆయన ది హిందూ నుంచి మర్యాదగా రిలేవ్ అయ్యారు. దానికి సంబంధించి మేము ప్రచురించిన పోస్టు చదవండి. 

ఈ కథనం రాస్తున్న సమయానికి శ్రీనివాస రెడ్డి 'నమస్తే తెలంగాణా' బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్ లో బోకే లు, అభినందనలు అందుకుంటున్నారు. సోషల్ నెట్ వర్క్ లు బాగా వాడతారని పేరున్న శ్రీనివాస రెడ్డి గారు ట్వి ట్టర్ లో కొత్త  నియామకం గురించి ఇంకా ఏమీ రాయలేదు. 
మేము అభిమానించే జర్నలిస్టులలో ఒకరైన శ్రీనివాస రెడ్డి గారు ఒక అద్భుతమైన పత్రికకు జన్మనివ్వాలని... దీనివల్ల పదిమంది మంచి జర్నలిస్టులకు ఉద్యోగాలు దొరకాలని ఆకాంక్షిస్తున్నాం. ఆల్ ద బెస్ట్.. సర్. 

Tuesday, December 15, 2015

మళ్ళీ ఇవ్వాల్టి నుంచే తెరుచుకున్న 'మెట్రో ఇండియా'

కొన్ని విషయాలు చెబితే నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి దాపురిస్తుంది మనకు. దాదాపు అలాంటిదే ఇవ్వాళ జరిగింది. ఇది బహుశా జర్నలిజం చరిత్రలో జరిగి ఉండదు లేదా అరుదుగా జరిగి వుంటుంది. 'నేను పేపర్ మూసేస్తున్నా. మీ లెక్కలు సెటిల్ చేస్తా,' అని శనివారం నాడు ప్రకటించిన 'మెట్రో ఇండియా'ఆంగ్ల పత్రిక ఓనర్ సీ ఎల్ రాజం గారు మంగళవారం (ఈ రోజు) సాయంత్రం మనసు మార్చుకున్నారు. 
'పేపర్ మూయడం లేదు, పనిచేసుకోండి...' అని రాజం గారు చెప్పిన దరిమలా... ఇవ్వాల్టి వరకూ ఉద్యోగాల అన్వేషణలో ఉన్నజర్నలిస్టులు రేపు పొద్దున్న 'మెట్రో ఇండియా' తెచ్చేందుకు పని ఆరంభించారు. ఈ కథనం రాస్తున్న సమయానికి పలువురు జర్నలిస్టులు... ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు తమ ఉద్యోగం ప్రస్తుతానికి పదిలంగానే ఉందనీ, ఆందోళన అనవసరమని చెబుతున్నారు...పాపమ్. 
 'మా సారు సాయంత్రం వచ్చారు, మీటింగ్ పెట్టారు, పేపర్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి హాపీ," అని ఒక ఉద్యోగి చెప్పారు. ఎడిటర్ ఏ శ్రీనివాస రావు గారు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. 
ఒక 45 రోజుల్లో పత్రిక ఆఫీసు ను ఇప్పుడున్న 'నమస్తే తెలంగాణా' బిల్డింగ్ నుంచి వేరే చోటికి మారుస్తానని చెప్పిన రాజం గారు... 'మళ్ళీ మూయరని గ్యారంటీ ఏమిటి?' అన్న ఉద్యోగుల ప్రశ్నకు తాత్విక, ఆథ్యాత్మిక,ఆది భౌతిక సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అవును కదా... మనం రేపటి దాకా బతికి ఉంటామన్న గ్యారంటీ నే ఇవ్వలేం. పేపర్ వస్తుందని ఏమి గ్యారంటీ ఇస్తాం?  
ఈ లోపు... మళ్ళీ మూడు రోజుల తర్వాత రాజం గారి మూడు మారకుండా ఉండాలని ఆ దేవుళ్ళను కోరుకుందాం. ఈ ఫోటోలో ఉన్నది ఆయనే.    
సాంకేతిక కారణాల వల్ల ప్రచురుణ ఆగిపోయి మళ్ళీ ఆరంభమయినట్లు 'మెట్రో ఇండియా' ఎడిటర్ శ్రీనివాస రావు గారు చెప్పారు. ఆయన కథనం ఇలా వుంది: 
"Metro India English daily will be back on stands from December 16 (Wednesday). The reasons cited for the closure of the daily in the last three days are technical. Mr.C L Rajam, who returned from a two-day tour on Tuesday morning, had a lengthy chat with senior editorial staff and decided to revive the daily."

Saturday, December 12, 2015

ఆగిపోయిన 'మెట్రో ఇండియా' ప్రచురుణ

ఆగస్టు 31, 2013 న హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక ప్రచురుణ ఈ రోజు (డిసెంబర్ 13, 2015) నుంచి ఆగిపోయింది. 
శనివారం నాడు ఒక కీలకమైన మీటింగ్ లో పాల్గొన్న పత్రిక అధిపతి రాజం గారు బైటికి వచ్చి 'ఇక పత్రిక రాదు... నేను ఊరు వెళ్లి వచ్చాక మీ జీతాలు సెటిల్ చేస్తా..." అని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. 
ఈ నిర్ణయం జర్నలిస్టులకు (ఎడిటర్ శ్రీ ఏ శ్రీనివాస రావు సహా) షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. 'నమస్తే తెలంగాణా' తెలుగు పత్రిక ప్రాంగణం లో నడుస్తున్న ఈ పత్రిక ఇలా అర్ధంతరంగా మూత పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస రావు, ఎస్ రామకృష్ణ, భాస్కర్ త్రయం నాయకత్వంలో వచ్చిన 'మెట్రో ఇండియా' ఇప్పుడిప్పుడే ఒక రూపు దిద్దుకుంటున్న దశలో ఈ పరిణామం జరిగింది. పత్రికను వదిలిన ఎస్ ఆర్కే గారు సొంత పత్రిక పెట్టుకున్నారు, భాస్కర్ గారు 'ది హన్స్ ఇండియా'అనే ఆంగ్ల పత్రికలో చేరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
'మెట్రో ఇండియా' ను కొన్ని రోజులు మూసేసి, నమస్తే తెలంగాణా మాదిరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త హంగుతో తెస్తారని చెబుతున్నారు. ఆ రాబోయే కొత్త పత్రికకు 'ది హిందూ' మాజీ సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస రెడ్డి గారు నాయకత్వం వహిస్తారని కూడా అంటున్నారు. ఇవన్నీ ధృవ పడని విషయాలు. 
జూన్ 2014 లో నాటకీయ పరిణామాల మధ్యన నమస్తే తెలంగాణా ను రాజంగారు వదులుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం 'నెగ్గిన కే సీ ఆర్ పంతం... పత్రికను వదులుకున్న రాజం" అనే పోస్టు ను చదవండి. 

1989 లో జర్నలిస్టు జీవితం ఆరంభించిన ఈ బ్లాగు స్థాపకుల్లో ఒకరైన రాము మెట్రో ఇండియా వ్యవస్థాపక స్పోర్ట్స్ ఎడిటర్ గా ఆరేడు నెలలు పనిచేసారు. పత్రిక మొదలు పెట్టిన రోజు తీసిన ఫోటో లు ఇక్కడ ఇస్తున్నాం. ఎర్ర చొక్కాతో ఉన్నజర్నలిస్టు... రావు గారు.  ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్న జర్నలిస్టుల భవిష్యత్తు ఏమిటా? అన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం. 

Thursday, December 3, 2015

ABN-ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునఃప్రారంభం

మొండివాడు రాజుకన్నా బలవంతుడని అంటారు. ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ ముఖ్యమంత్రి కే సీ ఆర్ కన్నా బలవంతుడని ఇప్పుడు నిరూపితమయ్యింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన భయంకరమైన ఊపు మీద ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం... శాసన సభ్యుల మీద యెకసెక్కపు కథనం ప్రసారం చేసిన టీవీ-నైన్ మీద, మరేదో మిషతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీద నిషేధపు వేటు వేసింది.

మాదేమి లేదు... అంతా కేబుల్ ఆపరేటర్ల నిర్ణయం అని ప్రభుత్వం చెప్పింది. కళ్ళు ఉరమగానే... తమ ఆధీనం లోని టీవీ-1 ఛానెల్ ను 'జై తెలంగాణా'గా మార్చి బతక నేర్చిన రవి ప్రకాష్ సర్కార్ కు జీ హుజూర్ అన్నారు. దానికి భిన్నంగా... తాడో పేడో తేల్చుకుందామని వేమూరి రాధాకృష్ణ అరిచి గీ పెట్టి హడావుడి చేసి అసహ్యించుకుని... దీని సంగతి చూడాలని సుదీర్ఘ పోరాటం చేసారు. 
'చేసింది చాలు- నిషేధం ఎత్తేస్తే మేలు' అని ఈ బ్లాగు బృందం కూడా రాసింది. వేమూరి రాధాకృష్ణ ఒక గొప్ప జర్నలిస్టు అన్న దురభిప్రాయం తో కాకుండా, ప్రభుత్వం ఒకటి రెండు ఛానెల్స్ ను లక్ష్యంగా చేసుకోకూడని మాకు అనిపించింది. అయినా... గులాబీ ప్రభుత్వం అనుకున్నట్లు చేసింది. వేమూరి కాబట్టి... అటు పక్క ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది కాబట్టి... పోరాటం సాగింది, ఫలించింది.
ఒక ఐదారు రోజుల నుంచి ఈ ఛానెల్ ప్రసారాలు పునః ప్రారంభం అయినట్లు చెబుతున్నారు. మళ్ళీ 'ఓపెన్ హార్ట్'లో పిచ్చి ప్రశ్నల ఆర్కే ను చూడాల్సి రావడం ఖర్మే అయినా... ఆయనలో చేగు'వేరా' ను చూసుకుని మురవడం తప్ప చేసేదేమీ లేదు.
సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన రోజు కేకు కట్ చేసి హడావుడి చేసిన వేమూరి ప్రసారాలు ప్రారంభమయ్యాక (ప్రారంభింపచేసుకున్నాక) మాత్రం కామ్ గా ఉన్నారు. అదీ మంచిదే. ప్రస్తుతానికి గెలిచింది... ఆర్కే నా? కే సీ ఆరా? మీరు ఏమనుకుంటున్నారు? మాకు రాయండి. ముఖ్యమంత్రి గారి కూతురు, ఎం పీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కలిసి పాల్గొన్న  కార్యక్రమంలో తీసిన ఫోటో ఇక్కడ ఇచ్చాం. ఇది జనవరి 5, 2015 న తీసిన ఫోటో. ఈ ఛానెల్ ప్రసారాలు పునఃప్రారంభం కావాలని నవంబర్ 3, 2015 న సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు డెక్కన్ క్రానికల్ ప్రచురించిన వార్త ఇది: 
The Supreme Court on Tuesday directed the Telangana state government and the Centre to take steps to restore broadcasting of ABN Andhra Jyothi channel through Multi System Operators (MSOs) in the state with immediate effect.
MSOs in Telangana had been banning telecast of ABN Andhra Jyothi for the last 502 days. “Though justice was delayed, ultimately justice was not denied to us, it is nothing but a victory of dharma,” said Mr Vemuri Radhakrishna, managing director of the channel and the Telugu daily Andhra Jyothi.
Member of the Press Council of India and Journalists’ Union leader Kosuru Amarnath had demanded that the state government and MSOs restore telecast of the channel which was subjected to an undemocratic and illegal ban all these months.
MSOs in TS had stopped telecast of TV9 and ABN Andhra Jyothi, run by Amoda Broadcasting Company Private Limited, in TS allegedly due to deliberate denigration and mockery of TS legislators in its programmes.
The Telecom Settlement Dispute Settlement and Appellate Tribunal in October 2014 had granted an order in favour of TV9 to restore its telecast over cable TV networks.

Thursday, October 22, 2015

తెలుగు మీడియా కబుర్లు జన్మదినం నేడు

డియర్ ఫ్రెండ్స్,నమస్తే... 
మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 
ఈ బ్లాగు మొదటి పోస్టు రాసింది సరిగ్గా ఆరేళ్ళ కిందట. ఇన్ని రోజులు బ్లాగుని ఆదరించిన మీకు ధన్యవాదాలు. మీడియా పరిణామాలను అక్షరబద్ధం చేయడంలో, వృత్తిగత విషయాలు అందరికీ పంచడంలో మేము కొంత మేర కృతకృత్యులం అయ్యామనే అనుకుంటున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటీవలి కాలంలో ఇందులో మీడియా పరిణామాల మీద పోస్టులు పెట్టలేకపోతున్నాం. త్వరలో ఈ స్తబ్ధత వీడి పోయి... యథాప్రకారం బ్లాగుకు ఉత్తేజం కలిగించాలని భావిస్తున్నాం. 
మీకు మరొక సారి దసరా గ్రీటింగ్స్. 
మొదటి పోస్టు ఇక్కడ చదవండి: 'విజయదశమి నాడు శుభారంభం'
---తెలుగు మీడియా కబుర్లు టీం 

Thursday, September 10, 2015

'ది హిందూ' కు శ్రీ కె. శ్రీనివాస రెడ్డి గుడ్ బై!?

మొన్నీ మధ్యన మేము చెన్నై వెళ్ళినప్పుడు 'ది హిందూ' సీనియర్ జర్నలిస్టు ఒకరు ఒక మాట అన్నారు: "మా ఈ ఎడిటర్ (మాలినీ పార్థసారధి) ఎప్పుడు ఎవర్ని ఆకాశానికి ఎత్తుతుందో, ఎప్పుడు ఎవర్ని సాగనంపుతుందో చెప్పలేం. అందరం భయపడి చస్తున్నాం... " 
అప్పుడు వెంటనే మేము అన్నాం... "మరి ఈ విషయం తెలిసి తెలిసి ఈ శ్రీనివాస రెడ్డి గారు చెన్నై  ఎందుకు చేరారు? పులి నోట్లో తలపెట్టడం ఎందుకు?" అని. ఇప్పుడు అనుకున్నంతా అయ్యింది. 

యాజమాన్యం (అంటే మేడం నోటి దురుసు) ధోరణి కి విసిగి శ్రీనివాస రెడ్డి గారు నిన్న (సెప్టెంబర్ 9, 2015)  రాజీనామా చేసినట్లు అధికారిక సమాచారం. ఈ విషయాన్ని చెన్నై వర్గాలు దృవీకరించాయి. మాలిని గారి ధోరణి (తిట్టడం, నసగడం) నచ్చక శ్రీనివాస రెడ్డి రాజీనామా చేసారని కొందరు అంటుంటే... ఆయన 'నమస్తే తెలంగాణా'  ఇంగ్లిష్ పత్రిక చీఫ్ ఎడిటర్ పదవికి వెళుతున్నారని తెలిసి మాలినే రాజీనామా చేయడంగానీ, సెలవు మీద వెళ్ళడం గానీ చేయమని కటువుగా ఆదేశించినట్లు  మరొక వర్గం సమాచారం. మొత్తం మీద జనవరి లో 'ది హిందూ' కో-ఆర్డినేటింగ్ ఎడిటర్ గా చెన్నై వెళ్ళిన శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ రాబోతున్నట్లు స్పష్టమయింది. 

ఆయన నియామకం గురించి "బోనస్ రాకపాయే... ధోతులు ఆగిపోయే' అన్న శీర్షికతో మేము ఈ బ్లాగులో జనవరిలో రాసిన పోస్టు చదవండి. 

శ్రీనివాస రెడ్డి గారు అద్భుతమైన జర్నలిస్టు అని నమ్మే వాళ్ళలో ఈ బ్లాగ్ బృందం ఒకటి. 'ఇది నిజంగా దుర్వార్త. శ్రీనివాస రెడ్డి గారు అద్భుతమైన ప్రొఫెషనల్. అంతకన్నా మంచి మనిషి. నేను ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన తో కాస్త సాన్నిహిత్యం ఉండేది. ఆయన పూర్తి స్వేచ్చగా పనిచేసే మరొక అసైన్మెంట్ దొరక్కపోదు," అని ఈ బ్లాగు స్థాపకుల్లో ఒకరైన ఎస్. రాము మా బృందంతో వ్యాఖ్యానించారు. All the best, Sir!
(Note: Photo has been taken from Mr.Srinivasa Reddy's twitter handle.) 

Sunday, May 17, 2015

'ది హిందూ'లో చేరిన రామ్ కరణ్ గారు

మేము గతంలో ఒక పోస్టులో చెప్పినట్లు--హైదరాబాద్ కేంద్రంగా ఇంగ్లిష్ లో పక్కా ఎడిటర్ లక్షణాలు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు. ముక్కు మీద కోపం జాస్తి అన్న అపవాదు ఉన్నా... అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ గారు. ప్రతిభను, నాణ్యతను, ముక్కుసూటితనాన్ని గౌరవించాలంటే రామ్ కరణ్ సార్ కు సాల్యూట్ చేస్తే చాలు. ఈ ఫోటోలో ఉన్నది ఆయనే. 

ఉస్మానియా లో జర్నలిజం విద్య అభ్యసించిన ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ స్థాయికి రావడంలో కీలక పాత్ర పోషించారు. టైమ్స్ వదిలాక టీ వీ నైన్ గ్రూప్ లో, తర్వాత 'ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' లలో పనిచేసారు. తన సహాధ్యాయి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు రామ్ కరణ్ గారు ఐ న్యూస్ లో పెద్ద హోదాలో చేరారు. కొన్నాళ్ళ తర్వాత అది వదిలేసారు. ఆయన 'ది హిందూ'లో చేరితే బాగుండేదని అనిపించేది. 

'ది హిందూ'ను బలపరచడం లో భాగంగా.... ఇప్పుడు చెన్నైలో మంచి స్థాయిలో ఉన్న శ్రీనివాస రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారిని రెసిడెంట్ ఎడిటర్ గా తేవడంలో కీలక భూమిక పోషించారు. అదే అభిప్రాయంతో రామ్ కరణ్ రెడ్డి గారిని విజయవాడ రెసిడెంట్ ఎడిటర్ గా నియమించారు. దాంతో పాటు, మాజీ 'ది హిందూ' సీనియర్ చింతల ప్రశాంత్ రెడ్డి (ప్రస్తుతం బిజినెస్ స్టాండర్డ్ బ్యూరో చీఫ్) గారిని మురళీధర్ రెడ్డి గారి డిప్యుటీ గా నియమించారు. రవి రెడ్డి గారు బ్యూరో చీఫ్ గా ఉన్న 'ది హిందూ' ఈ సీనియర్ల చేరికతో మరింత బలోపేతమై శ్రీనివాస రెడ్డిగారి నేతృత్వంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశించడం తప్పు కాదు. 

అన్నీ కులం కోణం నుంచి చూడడం అలవాటైన వాళ్ళు... 'ది హిందూ'లో రెడ్డి రాజ్య స్థాపన యత్నాలు అని మాకు రాసారు కానీ నీ... పై పేరాలో పేర్కొన్న మిత్రులంతా కులానికి, మతానికి అతీతమైన మంచి జర్నలిస్టులని గుర్తెరగాలి. 
అల్ ది బెస్ట్ 'ది హిందూ.'

Thursday, April 30, 2015

10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!

తెలుగు టెలివిజన్ రంగంలో ఉన్న అతి కొద్ది మంది నాణ్యమైన ఎడిటర్లలో ఒకరైన పసునూరి శ్రీధర్ బాబు... ప్రజల డబ్బుతో ఆరంభమైన 10 టీవీ  అసోసియేట్ ఎడిటర్ గా నియమితులయినట్లు తెలిసింది. ఈ మేరకు... ఛానెల్ యాజమాన్య బాధ్యతలు చూస్తున్న తమ్మినేని వీరభద్రం గారికి, శ్రీధర్ గారికి మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 
అరుణ్ సాగర్ గారు, ఆయన బృందం వెళ్ళిపోయాక తమ్మినేని బృందం ఒక సమర్ధమైన ఎడిటర్ కోసం వెతుకుతున్న క్రమంలో శ్రీధర్ దొరికినట్లు చెబుతున్నారు. సహజంగా కవి అయిన శ్రీధర్ గారు చెన్నైలో "ఇండియా టుడే" లో సుదీర్ఘకాలం పనిచేసి కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి హెచ్ ఎం టీవీ బృందంలో కీలక సభ్యుడిగా అద్భుత సేవలు అందించారు. తర్వాత అంకం రవి గారి నేతృత్వం లోని V-6 టీవీ లో ముందుగానే చేరి ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. పరిణామ క్రమంలో మళ్ళీ హెచ్ ఎం టీవీ లో చేరిన శ్రీధర్ గారు అక్కడి నుంచి బైటికి రావాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక అద్భుత అవకాశం కోసం వేచి చూస్తూ ఈ-టీవీ లో చర్చల్లో పాల్గొంటూ పుడమి పబ్లికేషన్ వారి కోసం యువతరాన్ని ఉద్దేశించి 'యంగ్ జోన్' పేరిట ఒక మంచి ఆంగ్ల పత్రిక తెస్తున్నారు. ఈ లోపు ఆయనకు 10 టీవీ లో అవకాశం లభించింది.  
కవితలు, నిశిత భావాల ప్రకటనకు అనేక వచనం పేరిట శ్రీధర్ బాబు ఒక బ్లాగు నిర్వహిస్తున్నారు.  

వేజ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం

వేతన సంఘం సిఫార్సులు అమలు చేయకుండా జర్నలిస్టులను, పత్రికా రంగంలోని ఇతర ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలకు వ్యతిరేఖంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు కోసం జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల అమలు ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకునేందుకు కోర్టు ఓకే బృందాన్ని నియమించినట్లు, మూడు నెలల్లో అది నివేదిక ఇస్తుందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐ ఎఫ్ డబ్ల్యు జె) తెలిపింది. ఫెడరేషన్ బాధ్యుల్లో ఒకరు సంస్థ ఫేస్ బుక్ పేజీలో ప్రచురించిన లేఖ ఇది. 


Dear Comrades,

The Supreme Court has virtually set-up a SIT (Special Investigative Team) to find out the status of the implementation of the Majithia Wage Awards by the newspaper proprietors and send it within three months to the court.

Contempt petitions filed by the employees of many newspapers came up for hearing yesterday in the Supreme Court before the bench of Justice Ranjan Gogoi and N.V. Ramana. Judges took strong objection at the callous attitude of the contemnors/ respondents of the newspapers for not filing the counter-affidavit to the contempt petitions. 

Displeasure of Justice Gogoi was visible on his face and he said no counter affidavits would henceforth be accepted. In fact, the contemnors/respondents have been under illusion that by engaging the expensive lawyers of the country they can get skewed the scale of justice in their favour. This is was the reason that more than one hundred lawyers led by Shri Kapil Sibbal, Shri Salman Khurseed, Shri Abhishek Manu Singhvi, Shri Dushyant Dabey and Shri Shyam Diwan, who were fielded by the contemnors/respondents, packed the courtroom. They wanted to buy the time but the court refused to grant any further time.

 IFWJ's Secretary General and Supreme Court advocate Parmanand Pandey was then asked by the court to initiate the argument in the lead contempt petition no. 411/2014 titled 'Avishek Raja and others vs. Sanjay Gupta'. In this case, the CEO of Jagran Prakashan Ltd. Shri Sanjay Gupta has been made the contemnor/respondent.

Shri Pandey started his argument by drawing the attention of two glaring facts. One; that after the filing of the contempt petitions the proprietors of the newspapers have started the chain of repression against workers. Employees are being arbitrarily transferred, suspended and terminated, without observing the basic principles of natural justice.  No show-cause notice is given, no domestic inquiry is conducted nor any charge sheet is served to them. He appealed to the Hon'ble Court that the directions should be issued to the newspaper barons and the state governments to stop the harassment and victimization of employees.

Two; the Jagran management is a habitual offender of labour laws.  What to say of the implementation of the Wage Boards Awards this newspaper has been violating all labour laws related to employees.

Shri Pandey thereafter forcefully argued that even after more than four years of the notification of the Award in 2010, the contemnor has failed to provide wages, allowances and arrears to the newspaper employees as per Wage Boards recommendations. Shri Pandey furnished the salary slips of the petitioners, which conclusively prove that the Management was guilty of the contempt of court as there was no difference in the wages and allowances, which were paid before the judgment of the hon'ble Supreme Court and after the judgment.

At this point Justice Ramana wanted to know whether it is the case only with petitioner or with all other employees. Advocate Parmanand Pandey told the hon'ble court that this is not the isolated case but it has happened with all employees of the newspaper. Shri  Pandey further said that even the contemnor  Sanjay Gupta has accepted in his counter affidavit that 738 employees of the company have given it in writing that 'they are satisfied with the present wage structure of Jagran Prakashan Ltd. They, therefore, do not want the wages and allowances as per the recommendations of the Wage Boards'.  The hon'ble bench expressed surprise over it. The bench went into huddle for a minute and Justice Gogoi asked Shri Pandey whether this condition was prevailing in other states and other newspapers; Mr. Pandey replied in affirmative.

The bench was shocked to know that why the governments  were sleeping over the judgment of the Supreme Court, when they knew it well that the newspaper establishments had not implemented the Wage Board Awards. The bench then decided to give directions to the state governments for ensuring the implementation of the Awards. At this point, the senior advocate of another contempt petition Shri Colin Gonsolvise told the court that Delhi Government was willing to do something in this regard. He also mentioned about provision of 17B of the Working Journalists Act, which empowers the Government to take necessary steps in this regards.

Shri Pandey pointed out in his argument that instead of implementing the Wage Boards Awards most of the managements including the contemnor/management of Jagran Prakashan Ltd., in the petition for which he is arguing the case, are hiding behind section 20J of the Wage Boards recommendations. Shri Pandey pointed out that section 20J is actually meant for those employees, who are already getting more than what the Wage Board has recommended but not for those who are getting far less than the recommendations. At this point Shri Kapil Sibbal, senior advocate of Jagran management said that section 20J was fully valid, as it had been provided in the Wage Board recommendations itself.

The bench again went into brief confabulation and said that we would direct the state government to appoint special officers to investigate into the state of affairs with regard to the implementations of the Wage Board recommendations. At this point senior advocates of the newspaper owners like; Shri Kapil Sibbal, Shri Abhishek Manu Singhvi, Shri Shyam Diwan sprang up on their feet and pleaded the bench that it would amount to returning to the 'inspector raj'. However, the bench refused to listen to their requests and dictated the order for appointment of the special officers by the state governments, which will prepare the report and send it directly to Supreme Court. Thus, the order of the Supreme Court is similar to the setting up of the Special Investigation Team (SIT) for the benefit of the newspaper employees.

Shri Kapil Sibbal also ridiculed the efforts being made by the Government of Delhi, which is under the rule of AAP and then one advocate retorted to him that the AAP Government would certainly do better than the Congress Government. It may be mentioned here that when the Wage Board  report was notified, Shri Sibbal and Shri Salman Khursheed were cabinet ministers in the Manmohan Singh headed Central Government.  It can be anybody's guess by watching the battery of lawyers belonging to the Congress party standing by the side of newspaper owners that whose side their sympathies lay. It is again very interesting to know that while Shri Kapil Sibbal was batting for Dainik Jagran his son Amit Sibbal, who is also a senior advocate, was to protect Dainik Bhaskar.
 
Ram P Yadav
Secretary, IFWJ

Thursday, April 23, 2015

ఉత్తమ ప్రజా సంబంధాల మ్యానేజర్-2015 అవార్డు

దాదాపుగా 20 ఏళ్ళు జర్నలిస్టుగా, ఐదేళ్ళు యూనివెర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా పనిచేసి ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో ఎడిటర్ అండ్ పీ ఆర్ ఓ గా పనిచేస్తున్న ఈ బ్లాగు వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఎస్. రాము కు 'ఉత్తమ ప్రజా సంబంధాల మ్యానేజర్-2015' అవార్డు లభించింది. 

జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21 సాయంత్రం తెలుగు యూనివెర్సిటీ లో పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ)  నిర్వహించిన  ఒక కార్యక్రమం లో తెలంగాణా శాసన మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ఈ అవార్డు ప్రదానం చేసారు. 
"This Award is presented to Dr Ramu in recognition of his outstanding performance in the practice of public relations and for having exhibited professional qualities that served in promoting the vision, mission, goals and services of ASCI," అని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం లో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, అమర్ రాజా గ్రూపు సీ ఈ ఓ సముద్రాల విజయానంద్, పీ ఆర్ గురు డాక్టర్ సీ వీ నరసింహారెడ్డి, పీ ఆర్ ఎస్ ఐ ప్రధాన సలహాదారు ఎం ఎల్ నరసింహా రావు, ఛైర్మన్ డాక్టర్ జుర్రు చెన్నయ్య, కార్యదర్శి మోహన్ రావు 
పలు జర్నలిజం పుస్తకాలను తెలుగు లోకి అనువదించి, ప్రచురించిన గోవిందరాజు చక్రధర్ గారిని కూడా ఘనంగా సన్మానించారు. 

Wednesday, April 22, 2015

వ్యవస్థతో అడుగడుగున పోరాడిన కలం: కొప్పుల నాగరాజు

మిత్రులారా... ఈ మధ్యన కాన్సర్  వల్ల కన్నుమూసిన జర్నలిస్టు మిత్రుడు కొప్పుల నాగరాజు గారు వృత్తిలో పడిన కష్టనష్టాలు వింటే గుండెతరుక్కుపోతుంది. కులగజ్జి బాగా ఉన్న ఈ పవిత్ర వృత్తిలో నాగరాజు గారు నవ్వుతూ చేసిన అలుపెరుగని పోరాటం గరించి కవి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ గారు రాసిన వ్యాసం ఇది. ఫోటోలు కూడా ఆయనే పంపారు. వారికి థాంక్స్. నాగరాజు గారి గురించి గతంలో ఒక్క ముక్కైనా రాయలేకపోయినందుకు క్షంతవ్యులం. ఈ కథనాన్ని మిస్ అయినందుకు విచారిస్తున్నాం. A tale of a dalit journalist శీర్షికతో "ది హూట్" లో పరంజోయ్ గుహ టాకుర్తా రాసిన వ్యాసం కూడా తర్వాత చదవండి.   
-------------------------------------------------------------------

ఆధునిక సమాజంలో దళితులకు ప్రవేశంలేని రంగాలు అనేకం ఉన్నాయి. ఐఐటీల నుండి మొదలు సినిమా, మీడియా రంగాల వరకు దళితుల సంఖ్య వేళ్ల మీదికే పరిమితం. కొన్నిరంగాల్లోకి దళితులు రావొద్దని ప్రత్యేకంగా బోర్డులేమి పెట్టరు. కానీ, వాళ్లు రాకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థను తయారు చేసి పెడతారు. అలాంటి రంగాల్లోకి దళితులు ప్రవేశించడం సాహసమే. అలాంటి సాహసమే చేశాడు కొప్పుల నాగరాజు.

తెలుగు మీడియాలో దళిత జర్నలిస్టులు వేళ్ల మీదికే పరిమితం. ఇక ఇంగ్లీషు మీడియాలో అంజనమేసి వెతికినా దేశం మొత్తం కేవలం పిడికెడు మందే కనిపిస్తారు. మనువాద కుల వ్యవస్థను పెంచి పోషిస్తోంది ఇంగ్లీషు మీడియా. దళితులకు ప్రభుత్వ పాఠశాల విద్యను మాత్రను అందుబాటులో ఉంచాయి ప్రభుత్వాలు. ఇలాంటి విద్యను అభ్యసించిన దళితుల్లో క్షలాది మంది విద్యార్థులు కేవలం పదవతరగతి వరకే రాగలరు. అంతకుమించి మరో అడుగు ముందుకు వేయకుండా సవాలక్ష అడ్డంకులను సమస్యల రూపంలో ఏర్పాటు చేసింది వ్యవస్థ. అందుకే ప్రతీ దళిత విద్యార్థి ప్రయోజకుడు కావాలంటే కొప్పుల నాగరాజులాగే ప్రాణాల్ని ఫణంగా పెట్టకతప్పదు.

కొప్పుల నాగరాజు చనిపోతాడని అతని మిత్రులకు, జర్నలిస్టులకు తెలుసు. క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉండగా నాగరాజు చేసిన రాజీలేని పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు నాగరాజు మూడేళ్లుగా క్యాన్సర్ మీద చేసిన పోరాటం మరిచిపోలేనిది. చనిపోతానని తెలిసినా, నాగరాజు ఏనాడు నిరుత్సాహపడలేదు. ప్రతీ పూట చావుతో సహవాసం చేస్తూనే చిరునవ్వులు చిందించాడు. చావును సెలబ్రేట్ చేసుకోవడం కేవలం నాగరాజుకే సాధ్యమైందేమో. ఈ తెగింపు ఎక్కడి నుండి వచ్చి ఉంటుందనేది తాత్విక ప్రశ్నే.
నాగరాజుకు బతుకంటే పోరాటమని బాల్యంలోనే అర్థమైంది. ఇక్కడ తమలాంటి వలసకూలీ కుటుంబాలకు బతుకులేదనే చేదునిజమే, తనను బాలకార్మికునిగా మార్చింది. అలా చిన్నాచితక పనులు చేసుకుంటూ తన కాళ్లమీద తాను నిలబడి, దిక్కులేని ఇంటికి ఓ ఆసరా అయ్యాడు. అలా దళితునిగా అనేక అవమానాలు భరిస్తూనే, వ్యవస్థకు ఎదురీదాడు. బతకాలంటే ఏదో ఒక నైపుణ్యం ఉంటే తప్ప మరో మార్గం లేదని గుర్తించాడు. అలా అనివార్యంగా చదువు నుండి ఆర్ట్ మీదికి మనసు మార్చుకున్నాడు. కుంచె పట్టింది అభిరుచి కోసమో, అభినందనల కోసమో కాదు. ఆకలి తీరడం కోసం. భద్రాచలం పరిసరాల్లో కూలీలుగా బతుకీడుస్తున్న తన కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టడానికి గీతలే ఆధారమయ్యాయి.

విచిత్రంగా ఆర్టిస్టుల్లో కూడా ఎక్కువ మంది కిందికులాల వాళ్లే ఉంటారు. ఇది కూడా ఈ వ్యవస్థ ఫిక్స్ చేసిన ఒక కుట్ర. చివరి బేంచీలకు పరిమితం చేసి, చదువు అబ్బకుండా చేస్తే, పదవతరగతి అయిపోయేవరకు విధిలేని పరిస్థితిల్లో కిందికులాల పిల్లలు ఆర్టిస్టులుగా మారుతారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లో చదువు ముందుకు సాగదు. అలా ఆర్టిస్టులుగా మారినవాళ్లు ఎందరో. ఈ విషయాన్ని గమనించిన నాగరాజు ఆర్టిస్టుగానే ఆగిపోకుండా చదువుకోని తన కుటుంబానికి మరింత ఆధారం కావాలనుకున్నాడు. మరింత పట్టుదలగా చదువును కొనసాగించాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన అగ్రవర్ణ స్థావరమైన సెంట్రల్ యూనివర్సిటీకి చేరాడు. పలు రాష్ట్రాల విద్యార్థుల నడుమ పీజీ పూర్తి చేశాడు. పదవక్లాసులోనే ఆగిపోవాల్సిన చదువు పీజీకి చేరేదాకా కొనసాగించాడు. కానీ, పీజీ చేయగానే ఉద్యోగం రాదు కాదా. మళ్లీ ఒక బతుకుపోరాటం నాగరాజును జర్నలిజం వైపుకు నెట్టింది. బతకాలంటే తనకో ఉద్యోగం కావాలి. అందుకు తన దగ్గర ఉన్నది ఇంగ్లీషు పరిజ్ఞానం. ఆస్తులు లేనివాళ్లకు అక్షరాలే ఆధారం.
+++
జర్నలిస్టుగా నాగరాజు రాసిన స్టోరీలన్నీ ఢిఫరెంట్ స్టోరీలే. ఎక్కువగా వైల్డ్ లైఫ్, ఆర్ఫాన్స్, సర్కార్ సవతి తల్లి ప్రేమకు నిర్వీర్యమైపోతున్న సర్కార్ దవాఖానల గురించే రాశాడు. తాను తక్కువ కులపోడని తెలిసి యాజమాన్యం రాచి రంపాన పెట్టినా, ఎక్కడ రాజీ పడలేదు. టైం టు టైం డ్యూటీ చేస్తూ తనను తాను నిరూపించుకునేందుకు ఆకలిని, అవమానాలను కూడా లెక్కపెట్టలేదు. ఇంగ్లీషు భాష మీదున్న పట్టు ఒక్కటే జర్నలిజానికి సరిపోదని నాగరాజుకు తొందరలోనే తెలిసొచ్చింది. ఇంగ్లీషు మీడియా అంటే పండిత వంశస్తుల అబ్బసొత్తు. ఇంకా చెప్పాలంటే మనువు మనవళ్ల వారసత్వపు ఆస్తి. ఇలాంటి విష కౌగిలిలోకి ఒక మాదిగోడు అడుగుపెడితే ఎలా అంగీకరిస్తారు వాళ్లు. నాగరాజు ఎంత ట్రెయిన్డ్ జర్నలిస్టు అయినా సరే, నాగరాజుకు కుల అర్హత లేదనే విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకుంది యాజమాన్యం. అక్కడి నుండి నాగరాజును తక్కువగా చూడడం. అదనపు అసైన్మెంట్ల పేరుతో తిండికి, నిద్రకు దూరం చేసి కాలుష్య కాసారాల్లోకి పంపింది. ఇదేం అర్థం కానోడు కాదు నాగరాజు.


 అయినా తన కుటుంబానికి బుక్కెడు మెతుకులు పెట్టాలంటే తాను, ఇదంతా భరించాల్సిందేననుకున్నాడు. పంటి బిగువన అగ్రకుల ఆధిపత్యాలపై ఉన్న ఆగ్రహాన్ని అనుచుకున్నాడు. కులం లేనోడికి ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ అనుకున్నది యాజమాన్యం. ఇక ఆరోగ్యం పాడైందంటే సెలవులు ఎక్కడిస్తది? దళితులు చదుకోవద్దని పాలకులు సమస్యల బహుమానం ఇచ్చినా, నిరుద్యోగిగా బతకమని యూనివర్సిటీలు పట్టాలిచ్చినా వాటిని దాటుకొని వస్తే మేము వదిలిపెడతామా అన్నట్టు వ్యవహరించింది. నాగరాజు పేరు చివరన ఏ తోక లేనందుకు శిక్షగా నరకం చూపెట్టింది. హాస్పటల్కు వెళతాను సార్, పాణం బాగలేదని మొత్తుకున్నా సరే కరుణించలేదు. 

లీవు ఇవ్వడం కుదరదు అన్నది సదరు ఇంగ్లీషు పత్రికాయాజమాన్యం. ఇక చేసిది లేక నాగరాజు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక పనిచేస్తూనే పోయాడు. సిగరేట్, మందు వంటి ఏ ఒక్క దురలవాటు లేనివాడు నాగరాజు. అయినా లోలోపల కులక్యాన్సర్ నాగరాజు శరీరాన్ని గుల్ల చేస్తూనే ఉంది. బతుకుపోరాటంలో పడి ఈ విషయం గుర్తించలేదు నాగరాజు. నాగరాజే కాదు, వైద్యులు కూడా ఆలస్యంగా గుర్తించారు. 2013 ఏప్రిల్ 1న, నాగరాజుకు కాన్సర్ అని తెలిసింది. 

ఇక అప్పటి నుండి నాగరాజు అసలు పోరాటం మొదలైంది. అప్పటి దాకా వ్యవస్థ మీద తన గీతలతో, రాతలతో మొదలుపెట్టిన పోరాటం, తనను తాను కాపాడుకునే ప్రత్యక్షయుద్ధానికి చేరింది.
దళితులకు ప్రవేశం లేని రంగంలోకి అడుగుపెట్టిన ఫలితంగా కులక్యాన్సర్ తనను ఎలా వాయిదాల పద్ధతిలో చంపడానికి సిద్ధమైందో నాగరాజుకు తెలిసివచ్చింది.

 అయినా సరే ఏనాడు కలత చెందింది లేదు. తనను నమ్ముకున్న పేదతల్లికి, కుటుంబసభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పి ఏడ్వొద్ధన్నాడు. క్యాన్సర్ను నయం చేసుకునేందుకు పైసల్ లేవని ఆందోళన చెందొద్దన్నాడు. స్వాతి వడ్లమూడి, పడవల చిట్టిబాబు వంటి మిత్రల సహకారంతో చావును ఏ పూటకు ఆ పూట వాయిదా వేస్తూ వచ్చాడు. చనిపోతానని తెలిసిన ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు వదులుకోలేదు. హైదరాబాద్ కేంద్రంగా జరిగే అన్ని దళిత, బహుజన మీటింగ్లకు హాజరవుతూనే ఉన్నాడు. అన్నీ జాగ్రత్తగా గమనించాడు. తనకు మరణశాసనం విధించిన ఇంగ్లీషు మీడియా మీద కాండ్రించి ఉమ్మేయాలనుకున్నాడు. 

జ్వరమొస్తే ప్యారసెటామోల్ గోలి కొనుక్కోలేక అకాలమరణాల బాటపట్టే మాదిగకులంలో పుట్టిన నాగరాజుకు దేశవ్యాప్తంగా స్నేహితులు అండగా నిలిచారు. ముఖ్యంగా ఉస్మానియా, ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీల దళిత బహుజన విద్యార్థులు, జర్నలిస్టులు, సాహిత్యకారులు, ఉద్యమకారులెందరో అండగానిలిచారు. నాగరాజును బతికించడం కోసం దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా, వాట్సప్లను ఉపయోగించి, ఎప్పటికప్పుడు నాగరాజుకు సంబంధించిన వార్తలను షేర్ చేశారు. ప్రతీ ఒక్కరిలో ఒక కదలికను తీసుకొచ్చారు. వందలాది మందిని ఒక్కటి చేసిన ఘనత కూడా నాగరాజుదే. ఈ వ్యవస్థలో మనలాంటివాళ్లు బతకాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం నాగరాజు చెప్పకనే చెప్పాడు. అడుగడుగునా ఈ వ్యవస్థతో ఎలా కొట్లాడాలో ఆచరించి చూపెట్టాడు. దళితులపై ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రవేశపెట్టిన అగ్రవర్ణ మనువాదుల ఉనికిని మరోసారి బట్టబయలు చేశాడు. యావత్ ఎస్సీఎస్టీబీసీమైనారిటీ విద్యార్థులంతా ఏ లక్ష్యంతో పనిచేయాలో తెలియజేసింది నాగరాజు జీవితం.
+++
గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో నాగరాజు ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, విద్యార్థులకు కూడలిగా మారాడు. తనకు జరిగిన అన్యాయం ఆధారంగా వర్తమాన వ్యవస్థపై ఒక చర్చకు తెరలేపాడు. ఏ ఇద్దరు నాగరాజు మిత్రులు కలిసినా, నాగరాజుకు జరిగిన అన్యాయం గురించే చర్చ జరిగింది. ముఖ్యంగా మీడియాలో దళితులపై కొనసాగుతున్న వివక్ష చర్చకు వచ్చింది. మీడియాలో దళితుల పట్ల ఎంతటి చిన్నచూపు ఉంటుందో నాగరాజు ఉదంతం వెలుగులోకి తెచ్చింది. యుద్ధనౌక గద్ధర్ వంటి వారి చేత దళిత జర్నలిస్టులను కాపాడుకుంటాం అని నినదింపజేసింది. తెలంగాణ సర్కార్ వరకు నాగరాజుకు జరిగిన అన్యాయాన్ని మోసుకెళ్లిన క్రాంతి లాంటి జర్నలిస్టుల కృషి, నాగరాజు కుటుంబానికి కొంత చేయూతనిచ్చింది. 

మంత్రి పద్మారావు చేత ఎనిమిది లక్షల చెక్కును ఇప్పించగలిగిన ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ వంటి వారు నాగరాజులో విశ్వాసాన్ని నింపారు. జస్టిస్ ఫర్ నాగరాజు పేరిట హైదరాబాద్ నుండి దేశరాజధాని ఢిల్లీ వరకు జరిగిన సంప్రదింపులు, చర్చలు ఒక ఉద్యమాన్ని తలపించాయంటే అతిశయోక్తికాదు. నాగరాజు మరణం మనువాద క్యాన్సర్ కులవ్యవస్థకు ఒక మచ్చుతునక. 

దళిత, బహుజనులను మే్కలుపుతున్న పొలికేక. అగ్రవర్ణ అంటరాని కులజాఢ్యాల మీద నాగరాజు చేసిన పోరాటం ఒక మేలుకొలుపు. పోరాడి పోరాడి నేలరాలిన తీరు, మిగిలిన దళిత బహుజనులంతా ఇంకా కొనసాగించవలసిన పోరాట బాధ్యతను గుర్తుచేస్తున్నది. నో ఎంట్రన్స్ ఫర్ దళిత్స్ అనే కనిపించని బోర్డులను ధ్వంసం చేయమంటోంది. దళితులు తలెత్తుకొని జీవించేందుకు రాజీలేని పోరాటం చేయమంటోంది.
+++
ప్రయివేట్ సెక్టార్లో మీడియా వంటి రంగాల్లో కొరవడుతున్న దళిత, బహుజన ఉనికిని కాపాడమంటోంది. నాగరాజుకు జరిగిన అన్యాయం మరో దళిత జర్నలిస్టుకు జరుగకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తోంది. అలాగే నాగరాజును చంపిన మనువాద అగ్రకుల ఆధిపత్య అంటరానితనాన్ని ఇంకెంతకాలం ఈ వివక్షలంటు నిలదీస్తూనే ఉంటుంది. రేపటి చరిత్రకు నాగరాజు త్యాగం చెరగని జ్ఞాపకమై వెంటాడుతూనే ఉంటుంది.

(రెండేళ్లపాటు ప్రతీక్షణం చావును నీడలా వెంటబెట్టుకొని పోరాడి, అసువులు బాసిన దళితజర్నలిస్టు 
కొప్పుల నాగరాజుకు కన్నీటినివాళి)

Sunday, April 19, 2015

తొలి తరం యాంకర్ శాంతి స్వరూప్ తో... రచ్చ రాములమ్మ

ప్రభుత్వవార్తా ప్రచార సాధనమైన దూరదర్శన్ లో 1983 నవంబర్ 14 న సాయంత్రం ఏడు గంటలకు తెలుగులో మొట్ట మొదట వార్తా ప్రసారం ప్రారంభమయ్యింది. ఆ వార్తలు చదివే అదృష్టం, భాగ్యం, బాధ్యత దక్కిన వ్యక్తి శాంతి స్వరూప్  గారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు.  2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు.

1977 అక్టోబర్ 23 లోనే లాంఛనప్రాయంగా హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది. చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన.  శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే కాలం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. 
"వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి....,"అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు. తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు. మేము తెలుగులో అద్భుతమైన యాంకర్ గా భావించే... రచ్చ రాములమ్మ.... 6 టీవీ లో శాంతి స్వరూప్ గారిని ఇంటర్వ్యూ చేశారు ఈ ఆదివారం నాడు.  అది బాగుంది. ఆ ఫోటో ఇక్కడ ఉంది.

Tuesday, March 17, 2015

హతవిధీ... వీ ఆర్ ఎస్ ప్రకటించిన 'ది హిందూ'

136 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో నాణ్యమైన జర్నలిజానికి నికార్సైన పేరని అనుకునే 'ది హిందూ' పత్రిక యాజమాన్యం (కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్-కె. ఎస్. ఎల్. ) మొట్టమొదటి సారిగా ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. జర్నలిస్టుల వేతన సంఘం సిఫార్సులు, తమిళ భాషలో ఎడిషన్ పెట్టిన దరిమిలా వచ్చిన నష్టాల నేపథ్యంలో యాజమాన్యం ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. 
నలభై సంవత్సరాలకు పై బడిన వయస్సు ఉండి, పత్రికలో పదేళ్లకు మించిన అనుభవం ఉన్నవారిని ఉద్దేశించి ఈ పథకం ప్రకటించినట్లు 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ఈ రోజు ఒక వ్యాసం ప్రచురించింది. అయితే తమకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ఈ బ్లాగ్ బృందానికి చెప్పారు. ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు చాలా ఉదారంగా ప్యాకేజ్ ఉంటుందని, ఇండస్ట్రీ లో అత్యుత్తమంగా ఉండేలా చూసామని యాజమాన్యం ప్రకటించింది. అయితే... ఎంత మొత్తం ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు.
2008 లో 230 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించిన కె ఎస్ ఎల్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడం మొదలు పెట్టడంతో లాభాల్లో ఏడాదికి నలభై కోట్ల మేర కోత పడింది. ఈ లోపు 2013 లో తమిళంలో పత్రికను ఆరంభించి చేతులు కాల్చుకుంది. 2013-14 లో దాదాపు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చినా... నష్టం 64 కోట్లుగా చూపిందని  'బిజినెస్ స్టాండర్డ్' కథనం. 

'ఆంధ్రప్రదేశ్' ఎడిటర్ గా కందుల రమేష్!

అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణాలలో మూడు మీడియాల్లో (ప్రింట్, టీవీ, ఆన్ లైన్) సమర్ధంగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక జర్నలిస్టు కందుల రమేష్. చాలా మంది తెలుగు జర్నలిస్టులు అంతర్జాలంలో తమ మెయిల్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందే రమేష్ బెంగళూరులో ఒక ఆన్ లైన్ మీడియా హౌజ్ లో పనిచేసారు. సీ వీ ఆర్ న్యూస్ లో కన్సల్టింగ్ ఎడిటర్ హోదాలో మూడు కీలక బాధ్యతలు (తెలుగు, ఇంగ్లిష్ ఛానెల్స్, హెల్త్ మాగజీన్) నిర్వహిస్తున్న ఆయన ఐ-న్యూస్, టీవీ 5 ఛానెల్స్ లో పనిచేసారు. అంతకన్నా ముందు "ది ట్రిబ్యూన్'' కు రిపోర్టర్ గా పనిచేసారు. సుప్రభాతం అనే తెలుగు మాగజీన్ లో కూడా ఆయన పనిచేసినట్లు గుర్తు. తను "సెంట్రల్ యూనివెర్సిటీ" ప్రొడక్ట్ అని చెబుతారు.
ఇప్పుడు కందుల రమేష్ చంద్రబాబు ప్రభుత్వ పత్రిక "ఆంధ్రప్రదేశ్" కు ఎడిటర్ గా నియమితులయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని దృవీకరణకు ఆయనకు ఒక మెయిల్ ఇచ్చాం... కానీ స్పందన రాలేదు. (ఆరంభంలో బాగా స్పందించే జర్నలిస్టులు ఒకటి రెండు ఛానెల్స్ లో చేరాక, కాస్త సంపాదించాక మెయిల్స్ కు, ఫోన్ కాల్స్ కు స్పందించారు మరి!).

"సొంతగా ఒక ఛానెల్ పెట్టాలని తను అనుకున్నాడు. మరి ఈ పత్రిక బాధ్యతలు ఎందుకు తెసుకున్నారో అర్థం కాలేదు," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నిజానికి కందుల మూవ్ పెర్ఫెక్ట్. ఎందకంటే... ఇప్పుడు "ఆంధ్రప్రదేశ్" ఎడిటర్ గా మూడేళ్ళు పనిచేసి వచ్చే ఎన్నికలకు ముందు ఛానల్ ప్లాన్ చేస్తే అన్నిరకాలుగా బాగుంటుంది.   

Saturday, March 14, 2015

మీడియాలో అత్యంత కీలక పరిణామాలు

'ది హిందూ' రెసిడెంట్ ఎడిటర్ గా మురళీధర్ రెడ్డి 
ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ది హిందూ' హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ గా సీనియర్ జర్నలిస్టు, దక్షిణాసియా జర్నలిజంలో అగ్రశ్రేణి రిపోర్టర్ బి. మురళీధర్ రెడ్డి ఈ వారం నియమితులయ్యారు. ఆయన విధుల్లో చేరడం, ఉద్యోగులతో కాంటాక్ట్ లోకి వెళ్ళడం కూడా అయ్యింది.  సౌమ్యుడిగా, మృదు స్వభావిగా ఆయనకు పేరుంది. 
శ్రీలంక జాతుల పోరాట పరిణామక్రమాన్ని దగ్గరి నుంచి చూసిన, ఎల్ టీ టీ ఈ-లంక సైన్యం యుద్ధాన్ని ప్రత్యక్షంగా ది హిందూ, ఫ్రంట్ లైన్ పత్రికలకు విస్తృత స్థాయిలో రిపోర్ట్ చేసిన అత్యంత అనుభవజ్ఞుడు మురళీధర్ రెడ్డి గారు. ముందు సుసర్ల నగేష్ కుమార్, ఆయన అర్థంతరంగా పదవి నుంచి వైదొలిగాక బెంగుళూరు నుంచి బదిలీ మీద వచ్చిన కె. శ్రీనివాస రెడ్డి ఇదే పదవిలో పనిచేసారు. శ్రీనివాస రెడ్డి గారు కీలకమైన బాధ్యతల నిర్వహణకు చెన్నై వెళ్ళాల్సివచ్చాక... కొన్ని రోజులు జల్లెడపట్టి మరీ మురళీధర్ రెడ్డి గారిని ఈ పదవిలో నియమించారు. గతంగా ఆయన పాకిస్థాన్ లో, దేశ రాజధానికి కూడా పనిచేసినట్లు 'ది హిందూ' వర్గాలు చెప్పాయి. మురళీధర్ రెడ్డి గారి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అట. వుయ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. 
(Photo courtesy: www.onlanka.com)

ఏలూరు 'ది హిందూ' రిపోర్టర్ రాజీనామా?
ఇది మునుపటి 'ది హిందూ' కాదన్న వాదన మరీ ఎక్కువగా వినిపిస్తున్నది ఈ మధ్యన. మజిథియ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసినట్లేచేసి...ఉద్యోగులను నయానా భయానా కాంట్రాక్ట్ సిస్టంలోకి తీసుకువచ్చి, ప్రతిభతో కూడిన ప్రమోషన్లు ఇస్తున్న ఈ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులు అభద్రతాభావంతో ఉన్నారనడంలో సందేహం లేదు. ఏలూరు లో దాదాపు 15 ఏళ్ళుగా 'ది హిందూ' స్పెషల్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న సిన్సియర్ జర్నలిస్టు జి.నాగరాజు రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 
ఆయన 'టైమ్స్ ఆఫ్ ఇండియా' విజయవాడ బ్యూరో చీఫ్ గా వెళుతున్నట్లు చెబుతున్నారు. 'ది హిందూ' వీడి ఒక సీనియర్ జర్నలిస్టు 'టైమ్స్' లో చేరడం ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం. అప్పట్లో 'ది హిందూ' లో పనిచేసిన విక్రం శర్మ ఇప్పుడు 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. 
"కాంట్రాక్ట్ సిస్టం లోకి మారడం తో జర్నలిస్టులలో బాగా అభద్రతా భావం పెరిగింది. అక్కడా (టైమ్స్) కాంట్రాక్ట్ సిస్టమే అయినా... పదవి, దాంతో పాటు నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి... మిత్రుడు నాగరాజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు," అని 'ది హిందూ' లో సీనియర్ జర్నలిస్టు ఒకరు ఈ బ్లాగు బృందంతో చెప్పారు. 
'ది హిందూ' యాజమాన్యం కోరినా... కాంట్రాక్ట్ పద్ధతిలోకి పోయే పత్రాల మీద సంతకాలు చేయని అతి కొద్ది మంది జర్నలిస్టులలో నాగరాజు గారు ఒకరని సమాచారం. కులం, ప్రాంతం, గాడ్ ఫాదర్లను బట్టి కాకుండా...సొంత ప్రతిభతో ఒక పధ్ధతి ప్రకారం మూడు దశాబ్దాలుగా జర్నలిజానికి సేవలు అందిస్తున్న జర్నలిస్టు నాగరాజు గారు. వారికి అంతా మేలు జరగాలని కోరుకుంటున్నాం. 
'నమస్తే తెలంగాణా' వారి ఇంగ్లిష్ పత్రిక? 
 'నమస్తే తెలంగాణా' యాజమాన్యం అతి త్వరలో 'తెలంగాణా టుడే' పేరిట ఒక ఆంగ్ల పత్రికను తీసుకురాబోతున్నట్లు సమాచారం. డెక్కన్ క్రానికల్ లో రిపోర్టింగ్ లో పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్టు ఆధ్వర్యంలో ఇది రాబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 'మెట్రో ఇండియా' పనిచేస్తున్న చోటనే కొత్త పత్రిక ఆపరేషన్స్ ఉంటాయి. 'నమస్తే తెలంగాణా' ఆఫీసు కిందనే ఉన్న మెట్రో ఆఫీసు ను ఇందుకోసం సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. ఈ మేరకు... అప్పరసు శ్రీనివాస రావు గారి నేతృత్వంలోని 'మెట్రో ఇండియా' ఆఫీసును వేరే చోటికి మార్చే ప్రక్రియకు పత్రిక అధిపతి సీ ఎల్ రాజం శ్రీకారం చుట్టారు. సీనియర్ స్టాఫ్ కోసం ఆయన చేయని ప్రయత్నాలు లేవు. 

ఊళ్ళోకి రాబోతున్న 'హన్స్ ఇండియా' 
ఎడిటర్ నాయర్ గారు వెళ్ళాక, డాక్టర్ కే నాగేశ్వర్ పగ్గాలు స్వీకరించాక 'ది హన్స్ ఇండియా' రూపు రేఖా విలాసాలు గణనీయంగా మారాయి. ముఖ్యంగా లుక్ పూర్తిగా మారి ఇప్పుడు పత్రిక కాస్త సంసార పక్షంగా ఉన్నది. మొదట్లో హన్స్ లో ఉండి... తర్వాత మెట్రో లో చేరి మళ్ళీ ఈ మధ్యన పాత గూటికి చేరిన తాటికొండ భాస్కర్ రావు గారు ఈ లుక్ మార్పులో కీలక పాత్ర పోషించారనడం లో అనుమానం లేదు. 
మరొక పక్కన... నాగేశ్వర్ సార్ ప్లానింగ్, సూపర్బ్ ఎడిటర్ పెన్నా శ్రీధర్, రామూ శర్మ తదితరులు కంటెంట్లో తెస్తున్న  మార్పిడితో ఇది సాధ్యమయినట్లు చెప్పుకోవచ్చు. 
ఈ పత్రికను, దాంతో పాటు హెచ్ ఎం టీవీ కార్యకలాపాలను...వేరే ఖండంలో ఉన్నట్లు అనిపించే ఏ ఎస్ రావు నగర్ నుంచి హైదరాబాద్ సిటీ మధ్యకు తెస్తున్నారు. ఈ ఆఫీసులు ఎల్ బీ స్టేడియం చుట్టుపక్కలకు మారుస్తున్నట్లు అధికారిక సమాచారం.

Friday, March 13, 2015

నేడు వరల్డ్ స్లీప్ డే: సుఖంగా నిద్రించండి


(వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మార్చి 19, 2010 లో ప్రచురించిన వ్యాసమిది)
నేను ఏ బస్సు ఎక్కుతున్నా...మా అమ్మ...'జాగ్రత్త నాన్నా. స్టేజీ చూసుకో..." అని నవ్వుతుంది. ఆ జాగ్రత్త ఎందుకంటే...మన నిద్ర గురించి. ఏ బస్సు ఎక్కినా...పదకొండో నిమిషంలో నిద్రాదేవత ఒడిలోకి జారిపోవడం...మా నాన్నకు, నాకు అలవాటు. చిన్నప్పుడు ఒకసారి బస్సులో నిద్రపోయి పక్క స్టేజిలో దిగా కాబట్టి...అమ్మ ఆందోళనతో ఆ హెచ్చరిక చేస్తుంది. 

ఎందుకో గానీ....ఇప్పటికీ నాకు...ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ అంటే అక్కడ నిద్ర వస్తుంది... పెద్దగా పనిలేకపోతే. దూర ప్రయాణాలలో రోడ్డు పక్క చెట్టుకింద...కారు ఆపి పదంటే పది నిమిషాలే సుఖంగా నిద్రపోయి లేచి మళ్ళీ డ్రైవింగ్ ఆరంభిస్తే....'బాబూ...నువ్వు  మనిషివి కాదు...' అని ఇంట్లో రెండు జీవులు దెప్పుతుంటాయి నన్ను. తమకు నిద్రపట్టడం లేదని ఎవరైనా అంటే...నాకు భలే జాలి వేస్తుంది. 

 స్కూలు రోజుల్లో...అంతా నైట్ అవుట్లు చేస్తుంటే...గంట కొట్టినట్లు తొమ్మిది గంటలకు మనం బెడ్ హిట్టింగ్ చేయడం వల్ల ఇంట్లో అందరికీ మండేది. ఇప్పటికీ...నా అంత్యంత స్నేహితులు నన్ను రాత్రి పూట పార్టీలకు రమ్మనరు. కారణం...అక్కడే ఒక టైం అయ్యాక ఒక మూల మనం చేసే పవళింపు. 

నేను నిద్రను ఎంజాయ్ చేసినట్లు ఎవ్వరూ చెయ్యరని...ఈ బ్లాగ్ పెట్టక మునుపు దాకా అనుకునే వాడిని. ఈ బ్లాగ్ మూలంగా యేవో ఆలోచనలు...ఏదో రాయాలని, ఉద్ధరించాలని తలంపు. మెదడులో ఆలోచనా క్రమం, ధార దెబ్బతినకముందే కంపోజ్ చేయాలన్న పిచ్చి భావన వల్ల నిద్ర కొద్దిగా దూరమయ్యింది. ఈ వరల్డ్ స్లీప్ డే సందర్భంగా దీన్ని సవరించుకోవాలి. 

రాత్రి నిద్ర చేడిందా...చాలా మంది మర్నాడు ఉదయం కొంత బీభత్సం సృష్టిస్తారు. నిద్ర సరిగా లేని బాస్ లే ఉద్యోగులపై అకారణంగా విరుచుకుపడతారు. నిద్ర లేని వాళ్ళే ఇతరులపై చిర్రుబుర్రులాడుతుంటారు. నిద్రలేకపోతే...నరాల వ్యవస్థ సహకరించదు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. 

కాలం గాయాన్ని మాన్పుతుందని అంటారు కానీ...ఏ గాయాన్నైనా...జోకొట్టి నిద్రపుచ్చి మాయం చేసేది నిద్రే. ఇంత మంచి నిద్ర కోసం...ఒక దినోత్సవం ఉండడం సంతోషకరం.ఈ ఒక్క రోజైనా ఆలోచనలు, ఒత్తిళ్ళు పక్కన దిండు కింద పెట్టి...హాయిగా గుర్రుపెట్టి నిద్రపోండి. నిద్రపొయ్యేవారిని నిద్రలేపకండి. 

మిత్రులకు నేను ఒక సలహా ఇస్తుంటాను....మంచి సీరియస్ నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటే...నిద్రపొయ్యే ముందు దాని గురించి ఆలోచించి...నిద్ర లేచాక డెసిషన్ తీసుకోండి. నిద్ర చాలా విషయాలను తేలిక పరుస్తుంది. 
ఇక ఈ పై ఫోటో గురించి ఒక ముక్క. ఇది కాకినాడలో ఒక టేబుల్ టెన్నిస్ పోటీలకు నా కొడుకు ఫిదెల్తో వెంటవెళ్లి...మధ్యాన్నం కొద్దిగా తిన్నాక ఎర్రటి ఎండలో చెట్టునీడన కుర్చీలో కూర్చుని హాయిగా ఒక కునుకు తీస్తుండగా...మా వాడి ఫ్రెండ్ తండ్రి శ్రీధర్ గారు నాకు తెలీకుండా తీసి నాకు పంపిన ఫోటో. ఒక మధుర ఘడియను చిత్రీకరించిన శ్రీధర్ గారికి థాంక్స్.  


ఈ సందర్భంగా...http://worldsleepday.wasmonline.org/ నుంచి కాపీ చేసిన ఈ తీర్మానాలు మీ కోసం...

The World Sleep Day declaration is as follows:
  • Whereas, sleepiness and sleeplessness constitute a global epidemic that threatens health and quality of life,

  • Whereas, much can be done to prevent and treat sleepiness and sleeplessness,

  • Whereas, professional and public awareness are the firsts steps to action,

  • We hereby DECLARE that the disorders of sleep are preventable and treatable medical conditions in every country of the world.

Thursday, March 12, 2015

న్యూయార్క్ యూనివర్సిటీ జర్నలిజం బోధకుడిగా సల్మాన్ రష్దీ

ప్రసిద్ధ, వివాదాస్పద భారత రచయిత సర్ అహ్మద్ సల్మాన్ రష్దీ  న్యూయార్క్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 'ఆర్థర్ ఎల్ కార్టర్ జర్నలిజం ఇన్ స్టిట్యూట్' లో జర్నలిజం బోధకుడిగా నియమితులయ్యారు. 1981 లో 'మిడ్ నైట్స్ చిల్డ్రన్' అనే నవలకు బూకర్ ప్రైజ్ పొందిన రష్దీ 'Distinguished Writer in Residence' హోదాలో అక్కడ ఐదేళ్ళ పాటు జర్నలిజం విభాగానికి సేవలు అందిస్తారు. జర్నలిజం విద్యార్థులకు బోధించడం, సలహాలివ్వడం ఆయన విధులు. 
రష్దీ నియామకాన్ని ఎన్ వై యూ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ సుకేతు మెహతా తన ట్విట్టర్ పోస్టులో ప్రకటించారు. 

"Mr. Rushdie exemplifies the mission of the Journalism Institute - a centre for research and teaching in the cultural hub and media capital that is New York City - and he will join our ranks of incredibly talented writers, reporters, producers, and critics, to engage and inform our local community in journalism and beyond," అని ఆ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.  రష్దీ ఘనతలు  ఇలా ఉన్నాయి: 
A Fellow of the British Royal Society of Literature and the American Academy of Arts and Letters, Salman Rushdie has received, among other honours, the Crossword Book Award in India, the Whitbread Prize for Best Novel (twice), the Writers' Guild Award, the James Tait Black Prize and the European Union's Aristeion Prize for Literature.
He was knighted by Queen Elizabeth II in 1997 for "services to literature".
In addition to his many essays and four non-fiction books (essays, memoir, and reportage), Rushdie is the author of a book of stories and 11 novels, including Midnight's Children, which was awarded the Booker Prize in 1981.
He also holds honorary doctorates and fellowships at six European and six American universities, is an Honorary Professor in the Humanities at MIT, and University Distinguished Professor at Emory University.

Wednesday, March 11, 2015

పోరాట యోధులకు సుప్రీం కోర్టు బాసట

మజిథియ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల విషయంలో మొండి మీడియా యాజమాన్యాలు సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుండడంపై జర్నలిస్టుల వీరోచిత పోరాటం సాగుతోంది. విచారణ ను ఏప్రిల్ 28 కి వాయిదా వేస్తూ కోర్టు... వేతనాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులపై కక్ష సాధింపు వద్దని చెప్పింది. ముఖ్యంగా... ధిక్కార పిటిషన్ వేసిన జర్నలిస్టులను వేధిస్తే ఊరుకోబోమని కోర్టు చెప్పిందని, యాజమాన్యాల దాష్టీకాలకు బలయ్యే సిబ్బంది తమను సంప్రదించి సమాచారం అందించాలని  'ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్' కోరింది. మరిన్ని వివరాల కోసం ఫెడరేషన్ ఫేస్ బుక్ పేజీ (Indian Federation of Working Journalist - IFWJ) కి వెళ్ళండి. తాజా పరిణామాలపై ఫెడరేషన్ సోషల్ మీడియా సెల్ ఇన్ చార్జ్ అందిస్తున్న సమాచారం ఇది: 
Hon’ble ‪#‎SupremeCourt‬ warns ‪#‎DainikJagran‬, ‪#‎RajasthanPartika‬,‪#‎DBCorpLtd‬ & ‪#‎UshodayaPublications‬ for delay in replying to contempt notices in regard to ‪#‎MajithiaWageBoard‬
Dear Comrade,
A Bunch of contempt petitions were taken up by the Hon'ble Supreme Court of India as item no. 1 before the bench Comprising Hon'ble Justice Ranjan Gogoi and Justice N.V. Ramana. The proprietors of the newspapers who have proved to be niggardly and miserly in paying the wages and allowances as per the Majithia Wage Boards recommendations even after the clear direction of the Supreme Court fielded top notched lawyers of the country like; ‪#‎KapilSibbal‬‪#‎AnilDiwan‬,‪#‎AbishekManuSighvi‬ and ‪#‎GopalJain‬ etc.
It may be noted here, that in spite of the clear direction given by the Hon'ble Court to the Contemnor-proprietors they have failed to file their counter affidavit to the contempt petitions.
The Hon'ble Supreme Court today sternly warned the defaulters like the Rajasthan Patrika, D.B. Corp Ltd, Ushodaya Publications, that if they fail to file their reply with in fifteen days from hence, heavy cost will be imposed on them.
The petitioner's Advocate and Secretary General IFWJ‪#‎ParmanandPandey‬ has been granted two weeks time to file the Rejoinder after the received of the Counter Affidavit.
The court also made it clear that the pleadings of all cases should be completed at least a week before the next date of hearing. The court proposed before the advocates to suggest a mutually agreed upon the date so that there should not be any scope for further adjournment.
The advocate for the workers of the Jagran Prakashan Ltd., Rajasthan Patrika Ltd., Ushodaya Publication attracted the attention of the Hon'ble Court that the large scale harassment and victimization of employees is going on in these newspapers, particularly against those employees who have filed the contempt petitions. The Hon'ble Court was pleased to hear cases on the next date of hearing (28.04.2015).
Therefore, if any newspaper proprietor is indulging into malafide transfer, harassment or any other type of victimization please bring it to our notice so that we can incorporate in our Rejoinder to the Counter Affidavit.
The Hon'ble Court also consented to put all the Impalement Applications on Board.
Vishwadev Rao,
In-charge Social Media Cell
IFWJ

Sunday, March 8, 2015

సూపర్ ఎడిటర్ వినోద్ మెహతా మృతి


భారతీయ జర్నలిజం లో కురువృద్ధుడి లాంటి సీనియర్ ఎడిటర్, 40 ఏళ్ళ పాటు ఈ వృత్తిలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, తన పెంపుడు కుక్కకు 'ఎడిటర్' అని పేరు పెట్టుకున్న వినోద్ మెహతా ఈ రోజు దీర్ఘ కాలిక అనారోగ్యంతో దేశ రాజధానిలో కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య (సుమితా) ఉన్నారు, పిల్లలు లేరు.
భారత దేశంలో అత్యంత స్వతంత్రంగా, నిర్మొహమాటంగా పనిచేసిన జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన డెబోనైర్, ది సండే అబ్సర్వర్, ది ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయోనీర్ లలో పనిచేసారు. జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకున్నా... భాషా పటిమ, విశ్లేషణా సామర్థ్యం, తెగింపు లతో అవుట్ లుక్ అనే పత్రికు వ్యవస్థాపక ఎడిటర్.

పత్రికలు మూతపడుతూ... ప్రింట్ జర్నలిజం శకం ముగిసిందని అనుకుంటున్న సమయంలో మాగజీన్ జర్నలిజాన్ని నిబద్ధతతో నిర్వహించి... కొత్తపుంతలు తొక్కించిన కలం యోధుడు వినోద్ మెహతా.  రహేజా గ్రూప్ తరఫున వినోద్ మెహతా 1995 అక్టోబర్ లో అవుట్ లుక్ ను ఆరంభించి అద్భుతమైన వ్యాసాలు అందించారు. అనారోగ్యం తో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని 2012 నుంచి అవుట్ లుక్ కు ఎడిటోరియల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న రావుల్పిండి లో 1942 లో జన్మించిన ఆయన ఎడిటర్ గా జర్నలిజం ఆరంభించడం చెప్పుకోదగ్గ విశేషం. బీ ఏ థర్డ్ క్లాస్ లో పాసయినట్లు చెప్పుకునే వినోద్ మూడు పుస్తకాలు రాసారు. అందులో మూడు జీవిత చరిత్రలు (ముంబాయి, సంజయ్ గాంధీ, మీనా కుమారి), రెండు తన అనుభవాల సారం (లక్నో బాయ్, ఎడిటర్ అన్ ప్లగ్డ్), ఒకటి సంకలనం (మిస్టర్ ఎడిటర్, హౌ క్లోస్ అర్ యు టు ది పీఎం?).

టెలివిజన్ జర్నలిజాన్ని అరుపులు, కేకలు, గాండ్రింపులు, గద్దింపులతో కొత్త పుంతలు తొక్కిస్తున్న అర్నబ్ గోస్వామి లాంటి ఎడిటర్లు సైతం.. వినోద్ ను 'జర్నలిజం దేవుడి' గా భావిస్తారు, ఆరాధిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు పలువురు సీనియర్ ఎడిటర్లు ఆయన మృతికి సంతాపం వ్యక్తంచేసారు.

2009 జనవరిలో ఉస్మానియా యూనివర్సిటీ, ప్రెస్ అకాడమీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వినోద్ మెహతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఆయనతో పిచ్చాపాటా మాట్లాడే అవకాశం లభించింది. ఆ వివరాలు సందర్భానుసారం తర్వాత...

Tuesday, February 24, 2015

'ది న్యూస్ అవర్' లో బీజేపీ కి ఖాళీ కుర్చీ వేసిన అర్ణబ్

గోల గోల గందరగోళపు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోయి తన గద్దరితనంతో 'ది న్యూస్ అవర్' అనే కార్యక్రమంతో గగ్గోలు పుట్టించే 'టైమ్స్ నౌ' ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి ఒక దుర్లక్షణం ఉంది. తన వాదనతో ఏకీభవించని వారిని పరుష పదజాలంతో నోటికొచ్చింది తిట్టి.. నిప్పులు చెరిగి అవమాన పరిచి పరిశుద్ధ జర్నలిజానికి తానే ఏకైక ప్రతినిధినని మనసా వాచా కర్మణా నమ్మే అర్ణబ్ తన షో కు రానివారిని భయకరంగా ఎద్దేవా చేస్తారు. ఈ క్రమంలో తక్కువలో తక్కువ ఐదారుగురితో ఆయన చేసే రోజూ రాత్రి పూట చేసే న్యూస్ అవర్ కు భయకరమైన జనాదరణ ఉందట. 'టు నైట్ ది నేషన్ వాంట్ టు నో... యూ మస్ట్ అపాలజైజ్..." అని గద్దించి అడిగే అర్ణబ్ ను చూస్తే... ఒకోసారి భయమేస్తుంది.   

అదలా ఉండగా... ఈ రోజు (ఫిబ్రవరి 24, మంగళవారం) రాత్రి షో లో అర్ణబ్ ఒక ఖాళీ కుర్చీ వేసి ఇది బీజేపీ కి ఉద్దేశించిందని ప్రకటించి తన షో ఆరంభించారు. కరుణామయి మదర్ థెరిస్సా ఉద్దేశం మత మార్పిడని ఆర్ ఎస్ ఎస్ అధినేత భగవత్ చేసిన ప్రకటనను ఖండిస్తూ ఈ ప్రోగ్రాం ఆరంభమయ్యింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... తన షో కు రాని బీజేపీ కి దమ్ములు లేవని...ఆర్ ఎస్ ఎస్ ఆదేశాలు లేకుండా పనిచేసే బీజేపీ నేత ఎవ్వరైనా వస్తే లైవ్ లోకి తీసుకుంటానని అర్ణబ్ ప్రకటించారు. 

మదర్ థెరిస్సా అన్నట్లు చెబుతున్న రెండు కోట్స్ తో అర్ణబ్ తన వాదన ఆరంభించారు. తర్వాత... భగవత్ వాదన సమర్ధించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు దుమ్ము దులుపుకున్నారు. గందరగోళం మధ్యన అపుడప్పుడూ అర్ణబ్ ఆజ్యం పోస్తూ మంటలు సృష్టిస్తూ కార్యక్రమం నడిపారు. "మాట్లాడే అవకాశం ఇవ్వవయ్యా.... మహా ప్రభో..." అని గెస్టులు ప్రాధేయపడడం, ఆవేశపడడంతో చాల సమయం ఆవిరయ్యింది. ఒక షో లో ఏడు, ఎనిమిది మందితో అర్ణబ్ సృష్టించే బీభత్స కాండకు మంచి టీ ఆర్ పీ రేటింగ్, ప్రకటనలు రావడం విశేషం. ఆర్ ఎస్ ఎస్ ప్రకటన కరెక్టని చెప్పడం మా ఉద్దేశం కాదు గానీ, ఈ గందరగోళపు చర్చల వల్ల ఫలితం ఏమి ఉంటున్నదన్నదే అనుమానం.  

మీడియా నియంత్రణ మంచికా?...చెడుకా...?

పెన్ను/మైకు చేతిలో ఉన్నదని మీడియా, అధికారంలో ఉన్నామని ప్రభుత్వం మిడిసిపడడం మంచిది కాదు. ప్రభుత్వం అంతుచూస్తామని జర్నలిస్టులు, మీడియా సంగతి చూస్తానని ప్రభుత్వం అనుకోవడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. కష్టపడి, త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణా నవ నిర్మాణం జరగాలంటే ఈ రెండు వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయాలి.  బాధ్యతాయుతంగా పనిచేయడం అంటే... ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు కప్పిపుచ్చి జనాలను మోసం చేయమని కాదు, ఎవరి విధిని వారు సమర్థంగా నిర్వర్తించే వాతావరణానికి సహకరించడం. ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న బ్లాక్ లోకి విలేకరులు రావడానికి వీల్లేదని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చి... పోలీసులతో ఖాళీ చేయించడం... దాన్ని మొన్నటి దాకా తెలంగాణా జర్నలిస్టుల సంఘం నేత... ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు... మధ్యేమార్గమైన వివరణ ఇవ్వడం... మీడియాలో బాగా చర్చనియాంశం అయ్యింది. ఇప్పటికే రెండు ఛానెల్స్ ను పరోక్షంగా నిషేధించినట్లు విమర్శ ఎదుర్కుంటున్న ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని సరిగా డీల్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.... నిజానికి తన అభిప్రాయంలో పస ఉన్నా. 

ఇప్పుడు పాతిక దాకా ఛానెల్స్ తెలుగులో ఉన్నాయి. ఒక కెమెరా మ్యాన్, రిపోర్టర్ వీటికోసం సచివాలయంలో కాచుకుని ఉంటారు. చిన్నా పెద్దా పేపర్లు, ఫ్రీ లాన్సర్లు అంతా కలిపి...భారీగానే జర్నలిస్టులు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా మకాం వేస్తారు. ఇదికాక, జర్నలిజం కార్డు అడ్డం పెట్టుకుని నాయకులు-అధికార్ల బూట్లు నాకుతూ పైరవీలు చేసుకుని బతికే పిశాచ వర్గం, వ్యాపార వృద్ధి ధ్యేయంగా ఉన్న ఛానెల్స్ కొమ్ముకాసే ప్రతినిధులు, తెలంగాణా ప్రభుత్వం మీద డేగకన్ను వేసే వైరి ప్రభుత్వ తాబేదార్లు... సరే సరి. మీడియా హౌజ్  ల మధ్య పోటీ దారుణంగా ఉంది కాబట్టి...'ఈ రోజు స్పెషల్ ఏమిటి?' అని బాసులు వేధిస్తారు కాబట్టి... ఈ జర్నలిస్టులు ఏదో ఒకటి వండివార్చాలి. అందుకోసం ఎవరినో ఒకరిని గెలకాలి, లేనిది ఉన్నట్లు సృష్టించాలి.  ఒక పక్క తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న ఉద్యోగాలను రక్షించుకునేందుకు ఈ క్రమంలో నిజమైన జర్నలిస్టులు నానా అవస్థలు పడాల్సివస్తుంది.  ఇది ఒక కోణం. 

ఇప్పుడు తెలుగు నేల మీద గొట్టాలు (ఛానెల్స్) ఎక్కువయ్యాక...ప్రభుత్వానికి తలనొప్పి పెరిగిందనేది వాస్తవం. కనిపించిన ప్రతి అధికారిని, నేతను కలిసిన చోటల్లా ఈ జర్నలిస్టులు (అందులో తాలు సరుకే ఎక్కువని సీనియర్లే గొణుగుతున్నారు) విసిగిస్తున్నారు. అడిగేవాడికి చెప్పే వాడు లోకువ. నోటి దగ్గర గొట్టం పెట్టడం... వివరణ ఇవ్వమనడం... సహజమయ్యింది. అది టెలికాస్ట్ అవుతుందా... కాదా... అన్నది వేరే విషయం. లేనిది సృష్టించి అభూతకల్పనలు ప్రసారం చేయడం కూడా జరుగుతున్నదన్నది ప్రభుత్వం వాదన. "నిజమే... మీడియా లొల్లి... ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యింది. ఎలక ఇంట్లో ఉందని కొంప అంతా తగలపెడ్డడం భావ్యమా?" అని సచివాలయం వ్యవహారాలు చూస్తున్న ఒక జర్నలిస్టు అన్నారు. 

ముందుగా, ప్రభుత్వం ఒక కమిటీ (ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో కానీ, ఆస్కీ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలతో గానీ) వేసి... ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. బీట్ జర్నలిస్టులను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. అటు సర్కార్ కు, ఇటు మీడియాకు ఇబ్బంది కలగని పధ్ధతి కోసం ప్రయత్నం జరగాలి. 

అట్లా కాకుండా... మీడియా ప్రతినిధులను బలవంతంగా అక్కడి నుంచి పంపడం సరైనది కాదు. మీడియాను సవరించాలని సీ పీ ఆర్ ఓ ఆఫీసునే వివాదానికి కేంద్రం చేయడం విచారకరం. ఈ విషయంలో... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆచితూచి వ్యవహరించకపోతే... మీడియా వ్యతిరేకి అన్న విమర్శకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. 

ఉద్యోగాలు పోతున్న 'ఈనాడు' ఉద్యోగులను ఆదుకోకపోవడం, రామోజీ ఫిల్మ్ సిటీ ని-రామోజీ నిఆకాశానికి ఎత్తడం, ఆంధ్రజ్యోతి ఛానెల్ మీద ఇంకా నిషేధం కొనసాగించడం...తో ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ తాజా చర్యతో... చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం మీద చాపకింద నీరులా విష ప్రచారం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వం తమదని అనుకున్న తెలంగాణా జర్నలిస్టులు కూడా ఇప్పుడు భ్రమలు తొలిగిన ఫీలింగ్ లో ఉన్నారు. 'గిసంటివి యెన్నో జూసినం... గిదో లెక్కా? బాజాప్త... మా ఇష్టమొచ్చినట్లు జేస్తం...' అని అనుకోవడం కచ్చితంగా చేటు కలిగిస్తుంది. తెలంగాణా పునర్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఈ సమయంలో... ప్రభుత్వం మీడియా తో పెట్టుకుని బద్నాం కావడం అనవసరం. 

Friday, February 20, 2015

ఆ పవిత్ర ప్రేమకు....ఈ నాటికి 23 ఏళ్ళు

ఫిబ్రవరి 20, 1992 
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
రామచంద్రా డిగ్రీ కాలేజ్ (సైన్స్), రామవరం
సరిగ్గా ఈ పోస్టు రాస్తున్న సమయానికి ఒక మూడేళ్ళ మూగ ప్రేమ ఒక ఫేర్ వెల్ పార్టీలో సమాధి అయ్యింది. కారణం: మతం. వాడు ముస్లిం. 

ఎందుకు కలిసామో, ఎలా కలిసామో కానీ... మేము బీ ఎస్సీ (బీ జెడ్ సీ) లో చేరి ఒక అద్భుతమైన గ్రూపుగా తయారయ్యాం.  ఆ రోజుకు ఒక పది రోజుల కిందనే ఆ ప్రేమ వ్యవహారం మాకు తెలిసింది. ఇదే సమయానికి ఫేర్ వెల్ పార్టీ లో.... "నిన్ను తలచీ... మైమరచా చిత్రమే అది చిత్రమే..." అని పాట (1989 లో వచ్చిన 'విచిత్ర సోదరులు' లోది) వాడుపాడుతున్నాడు. అది అక్కడి ప్రేక్షకులకు... బైటివాళ్లకు మిత్రులు విడిపోయే రోజున ఒక మజా పెంచే సూపర్ హిట్ పాట. కానీ వాళ్ళిద్దరితో పాటు మాలో కొందరికి తెలుసు... అందులో ప్రతి పదం వాడి ప్రేమ జీవితానికి సంబంధించిందే. హీ మెంట్ ఎవ్రీ వర్డ్.  
సినిమా లో కమల్ హాసన్ పడ్డ గుండె వేదనే వాడూ పడుతున్నాడు. ఒక పెను విషాదాన్ని ఆపలేక పోతున్నానన్న కసి, ఓడిపోతున్నానన్న ఆక్రోశం.. అన్నిటికీ మించి మంచి ప్రేమికురాలిని కోల్పోతున్నానన్న దుఃఖం. అయినా... సింగర్ గా తననుంచి మంచి పాట కోసం తోటి విద్యార్థులు చేస్తున్న డిమాండ్ తీర్చాలన్న తపనతో...ప్రాణం పెట్టి పాడుతుంటే...డొక్కలో నొప్పి. తెల్లటి జేబురుమాల పొట్ట చుట్టూ కట్టుకుని తీవ్రంగా లీనమై పాడాడు. ఆ పాట ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతోంది.  
అప్పటికే మా మనసులు అన్నీ ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాయి. ఇక అదే చివరి కలయిక అని అర్థమై ఆమె కళ్ళ నిండా నీళ్ళు సుళ్ళు తిరిగాయి. 
తెలిసీ తెలియని వయసు. అంతా అయోమయం. అది నికార్సైన నిండు ప్రేమ. నిజానికి నేను అనుకుంటే...ఎవరు అడ్డువచ్చినా వాళ్ళను కలిపే వాళ్ళం. కానీ... ఈ ప్రేమకు మనం సహకరిస్తే... ఆమె కుటుంబం ఆత్మహత్య తథ్యమని ఆమె స్నేహితురాళ్ళు చెప్పారు. 'పైగా వాడిది.. చంచల స్వభావం. ఉద్యోగం సాధించి... ఈమెను పోషించి జీవితాంతం పోషిస్తాడన్న నమ్మకం నీకుందా...?" అని వాళ్ళు నన్ను అడిగారు. అవునని నేను చెప్పలేక పోయాను. దానికి కారణాలు ఉన్నాయి. 

వేరే జిల్లా నుంచి వచ్చి... పాలిటెక్నిక్ మధ్యలో ఆపి, డిగ్రీ లో చేరి... సరిగా చదవకుండా... ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తూనో, తనకు ఇష్టమైన పాటలు పాడుతూనో ఊరిబైట ఒక పూరింట్లో గడిపేవాడు. 'వీడు డిగ్రీ పాసై... ఉద్యోగం తెచ్చుకుని... సెటిల్ అయ్యేది ఎన్నడు? ప్రేమే పరమావధి... దానికి పెళ్ళే పర్ఫెక్ట్ ముగింపు అనుకుని కలిపితే... ఒకరిద్దరు పిల్లలు పుట్టాక.... తన్ని తగలేస్తే...? అంతకన్నా ముందు.. నీళ్ళను కూడా నిప్పులతో కడిగి శుభ్రం చేసుకున్నాకే తాకాలనుకునే ఆమె ఇంట్లో పరిస్థితి ఏమిటి?"--ఇలాంటి ప్రశ్నలు నా చిన్న బుర్రను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 'నో... నువ్వు ఎంకరేజ్ చేయకు. ఈ రోజుతో వదిలేద్దాం," అని అంతా నాకు చెప్పారు. నేనూ విత్ డ్రా అయ్యాను. మనో వేదనతో మతి కోల్పోయి శూన్యంలోకి చూస్తున్న ఒక మంచి మిత్రుడ్ని ఎండ మావైనా లేని ఎడారిలో ఒంటరిగా ఒదిలి వెళ్ళాం. ఆమె ఎంతగా బాధపడిందో!
"ఏమీ అనుకోకు.. నీ చంచల స్వభావంపై నాకు నమ్మకం లేదు. ముందు... పాలిటెక్నిక్ పూర్తి చేయి. తర్వాత చూద్దాం..." అని చెప్పి ఒక మిత్రుడి రూం కు తెచ్చి పెట్టాం. ఒక భయంకరమైన తప్పు చేసిన భావన లోలోపల వెంటాడింది... ఆ హామీ ఇస్తున్నప్పుడు. నాది ఒట్టి సాంత్వన వచనం. అట్లా చెబితే ప్రస్తుతానికి ఒక గండాన్ని గట్టు ఎక్కించవచ్చన్న ఒక పథకం. ఒక మిత్రద్రోహం. 

ఆ మాటను సీరియస్ గా తీసుకుని... ప్రేమ నెగ్గించుకునేందుకు ఒక  రెండు మూడు నెలల్లో వాడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. 'ఉద్యోగం దొరకడం పెద్ద కష్టం కాదు.. నీ మాట నిలుపుకో...,' అని వాడు అన్నప్పటికే నాకు తెలుసు... ఆక్కడ ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారని. అదే సంగతి వివరించి చెప్పి... ఈ విషయం మరిచిపొమ్మని సలహా ఇచ్చాను... తీవ్రమైన పశ్చాతాపం తో. ఇంత పెద్ద మాట తప్పడం జీవితంలో అదే మొదలు. 

కాలక్రమేణా...  అందరం ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాం. నేను వాడిని కలిసాను, ఆమెనూ కలిసాను.... విడివిడిగా. ఒకరి సమాచారం ఒకరికి పెద్దగా తెలియనివ్వలేదు... కావాలనే. జీవిత భాగస్వామితో, పిల్లలతో... సెటిల్ అయిన వారిని గతం గాయపరచకూడదన్న ఒకే ఒక్క ఆలోచన నాది. "ఆమె ఎలా ఉంది?" అని వాడు... "ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు?" అని ఆమె అడుగుతున్నప్పుడు ఆ గొంతుల్లో తప్పే శృతి నాకు తెలుసు. అదే ఊర్లో పరిచయం అయిన కాలేజ్ జూనియర్ అయిన అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా మనసును వారి ఆర్ధ్రత చేసే గాయం, ఆ చిన్న ప్రశ్న నన్ను దోషిగా నిలబెట్టడం... భరింపశక్యం కానివి. 

ఈ రోజు మధ్యాహ్నం అనుకోకుండా... అప్రయత్నంగా నేను వాడికి ఫోన్ చేశాను. "ఈ రోజుకో ప్రాముఖ్యత ఉంది... తెలుసా?" అని అడిగాడు. 
నేను: ఏమిటా ప్రాముఖ్యత?
వాడు: 1992 ఫిబ్రవరి 20 న మన ఫేర్ వెల్ పార్టీ, నేను పాడిన పాట, మేము విడిపోయిన ఆఖరి రోజు... 

నేను: ఓహ్ గాడ్... నీకు ఇంకా గుర్తుందా?
వాడు: ఈ ఏడాది ఆ స్పాట్ (రామవరం లోని కాలేజ్) కు వెళ్ళడం కుదరలేదు. ఇదే రోజు అక్కడికి వెళ్లి వస్తాను
నేను: నిజంగా ఆమెను అంత ఇదిగా ప్రేమించావా? 
వాడు: అంత అన్నదానికి కొలమానం ఉంటుందా? సముద్రమంత అంటే ఎంతో చెప్పగలమా?
నేను: బాధగా ఉందా?
వాడు: నొప్పితో బాధపడుతున్న ఒక హార్ట్ పేషంట్ దగ్గరకు వెళ్లి నొప్పిగా ఉందా? అని అడిగినట్లు ఉంది.  
నేను: ఇప్పటికీ మరిచిపోలేదా?   
వాడు: అది కుదరనిది. మొదటి పదేళ్ళు అనుక్షణం గుర్తుకు వచ్చేది. జీవితం హడావుడిలో పడినా... అది మరిచిపోలేని విషయం. కొన్ని అంశాలు మరణించేవరకూ మధుర జ్ఞాపకాలుగానే ఉంటాయి. 
నేను: మూడేళ్ళ డిగ్రీ కాలం మొత్తం సాగిందా ప్రేమ?
వాడు: ఫిబ్రవరి 10 న తను ప్రపోజ్ చేసింది. 20 న ముగిసింది. అంతకు ముందే... మా ఇద్దరి మధ్యా ఒక బాండ్ ఉండేది. అంతే 
నేను: పది రోజుల ప్రేమ ఇన్ని రోజులు...?
వాడు: ప్రేమను రోజుల్లో కొలవడం సాధ్యమా?
నేను: ఈ విషయంలో నన్ను అపరాధిగా భావిస్తున్నావా? 
వాడు: లేదు, నన్ను తాగుబోతునని కొందరు అనుకున్నారు. మతం పునాదుల మీద ప్రేమ బీజం నాటవచ్చా? అని ఒక రోజు అడిగింది. మతమే అడ్డమైతే... మారదామని నిర్ణయించుకున్నాను. 
నేను: మరి మీ ప్రేమలో విలన్ ఎవరు?
వాడు: విధి
నేను: కారణం?
వాడు: మా మతాలు వేరు.  
నేను: నీ భార్యకు చెప్పావా?
వాడు: మొత్తం చెప్పాను... పెళ్ళికి ముందే. డైరీ కూడా చూపించా. 
నేను: మరి ఇప్పుడు ఏమంటావ్?
వాడు: జీవితంలో... పోయేలోపు... అవకాశం వస్తే.. ఆమెను ఒక్కసారి చూడాలని ఉంది. 
సారీ మిత్రమా! అమరమైన నీ ప్రేమకు జోహార్లు.