Wednesday, December 20, 2017

2017లో 67మంది జర్నలిస్టుల హత్య

సమాచార సేకరణ, వ్యాప్తి కోసం అహరహం శ్రమించే జర్నలిస్టులు అప్రజాస్వామిక శక్తుల చేతిలో బలవుతున్నారు. వ్యక్తిగత పగ, ఇతరత్రా ద్వేషాలతో 2017లో 67 మంది జర్నలిస్టులను అత్యంత క్రూరంగా అంతమొందించారని 'రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌' సంస్థ ప్రకటించింది. 
మొత్తం హతుల్లో 60 శాతం మందిని వ్యక్తిగత కక్షతోనే హతమార్చినట్లు నివేదిక తెలిపింది. మరో 202 మంది జర్నలిస్టులను బెదిరించడం, నిర్భంధించడం జరిగాయని తన వార్షిక నివేదికలో తెలిపింది. మరో 54 మంది పత్రికా విలేకరులను ఉగ్రవాదులు నిర్భంధించారని సంస్థ పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. విధుల్లో ఉన్న 26 మంది జర్నలిస్టులు హత్య చేశారు. బాంబుదాడులు, వైమానికదాడుల్లో పదుల సంఖ్యలో జర్నలిస్టులు మృత్యువాత పడ్డారని తెలిపింది. సిరియా, మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, ఫిలిప్పీన్స్‌ వంటి అత్యంత ప్రమాదకర దేశాల్లో జర్నలిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి.. వార్తలను ప్రపంచానికి అందిస్తున్నారు. నివేదిక కథనం ప్రకారం...  చైనా, వియాత్నం, సిరియా, ఇరాన్‌లలో జర్నలిస్టులపై విపరీత ఆంక్షలు ఉన్నాయి. ఈ దేశాల్లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమేనని సంస్థ పేర్కొంది. 

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వారు 2017 సంవత్సరంలో జరిగిన హత్యలపై పేర్కొన్న గణాంకాలు ఇలా ఉన్నాయి:   

  • 52
    journalists killed
  • 7
    citizens journalists killed
  • 8
    media assistants killed
    • 178
      journalists imprisoned
    • 122
      citizens journalists imprisoned
    • 16
      media assistants imprisoned

Saturday, December 16, 2017

కంగ్రాట్స్... తెలంగాణా టుడే!

తెలంగాణా పబ్లికేషన్స్ లిమిటెడ్ వారి ఆంగ్ల పత్రిక 'తెలంగాణా టుడే' ఈ రోజుతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్ శ్రీనివాస రెడ్డిగారి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందానికి, పత్రిక వివిధ విభాగాలలో పనిచేస్తున్న అందరికీ ఈ బ్లాగ్ శుభాభినందనలు తెలుపుతోంది. ఆల్ ద బెస్ట్!

పక్కా లోకల్ ఇంగ్లిష్ పత్రికగా పేరు తెచ్చుకున్న 'తెలంగాణా టుడే' కు మంచి భవిషత్తు ఉందని చెప్పడంలో సందేహం లేదు. పబ్లికేషన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. దామోదర్ రావు గారు 'వుయ్ హావ్ టర్నెడ్ వన్' శీర్షికతో రాసిన మొదటి పేజీ బిట్ లో చెప్పినట్లు... అన్ని వర్గాలను చేరే 'గ్లోకల్' పేపర్ గా తెలంగాణా టుడే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

ఫస్ట్ బర్త్ డే ను పురస్కరించుకుని పత్రిక యాజమాన్యం చేసిన కేక్ కటింగ్ కు సంబంధించిన వార్తను ఇక్కడ మీ కోసం ఇస్తున్నాం.