Monday, February 7, 2011

ఇది వెబ్బు ప్రపంచమా? గబ్బు ప్రపంచమా??

నోట్ on Feb 8,2011: ఈ వ్యాసానికి విశేషంగా స్పందించిన అందరికీ థాంక్స్. కొందరు ఈ అభిప్రాయాలు కరక్టే.. ఏదో ఒకటి చేయాలని రాయగా, ఇంకొందరు...పాడిందే పాడరా...అని...నువ్వు తిట్టలేదా? ఆ పోస్టులో వాళ్ళను అనలేదా? అని చర్చకు పనికిరాని చెత్త పోగేసి రాసారు. కొందరు నన్ను ఓదార్చారు, బలపరిచారు. ఇంతా జేస్తే...నేను తిట్టింది ఆరేడు బూతులే కాబట్టి...ఇంకా తిట్టాలి అలాంటి చెత్త వెధవలను అంటూ...మరి కొందరు కొన్ని బూతులు అందించారు. వీరందరికీ స్పెషల్ థాంక్స్. అయితే...వచ్చిన సూచనలు constructive గా లేనందున అవి ఇక్కడ పెట్టడం లేదు. పైగా...ఒక ముఖ్యమైన ప్రాజెక్టు పని వల్ల క్షణం తీరిక లేకుండా పోయింది. మళ్ళీ తీరిక దొరికనప్పుడు...ఆ కామెంట్స్ సారాంశం...బ్లాగర్స్ కోసం ఒక 'కోడ్ ఆఫ్ కండక్ట్' వంటి సూచనలతో మళ్ళీ కలుద్దాం. కామెంట్స్ పోస్ట్ చేయలేదని మరోలా అనుకోకండి. బ్లాగుకు ఇదొక స్వల్ప విరామం అనుకోండి. మళ్ళీ కలిసే వరకూ సెలవ్...నమస్కారం....రాము
-----------------------------------------------------

కాకులు కోయిలల్లా పోజుకోట్టడం...
దొంగే కొత్వాల్ను చూసి 'దొంగా...దొంగా' అని యాగీచేయడం... హంతకుడే...జడ్జిలా నటించడం....
--ఇవన్నీ ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటాయి. ఈ మధ్యన తెలుగు బ్లాగు ప్రపంచంలో నాకు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. "ఆ....మనదేమి పోయింది...ఆ కోయిలను, దొంగోడ్ని, హంతకుడిని...మనమెందుకు పట్టించుకోవాలి..." అని అనుకోవడం నికార్సైన జర్నలిస్టులకు సాధ్యం కాదు.
 
కలేజా, దమ్ము, గుండె ధైర్యం లేని ఒక అజ్ఞాత బ్లాగర్....నేను ఈ పక్కన భారతీయ మీడియాకు సూచించిన పాయింట్లను వక్రీకరిస్తూ నన్ను కించపరుస్తూ...అవాకులు చెవాకులు పేలాడు. నా రాతలను విమర్శిస్తే సరే గానీ...నిష్కారణంగా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహజంగా నేను ఎవరినీ స్పేర్ చేయను. రూల్స్ పట్టించుకోకుండా నన్ను కావాలని బాధిస్తే, వేధిస్తే...అప్పుడు కాకపోయినా ఐదు పదేళ్ళలో ఏదోరకంగా సదరు వ్యక్తి కి రూల్స్ అతిక్రమించి అయినా నేను బుద్ధి చెబుతాను. అందుకు కొన్ని సాక్ష్యాలు అబ్రకదబ్రను అడిగితే తెలుస్తాయి. రూల్స్ పరిధిలో నేను ఓపిగ్గా, పొందికగా ఆపరేట్ చేసేదానికి, 'వీడి విషయంలో రూల్స్ లేవు గీల్స్ లేవు...' అని ఆవలి వైపు నుంచి నేను ఆపరేట్ చేసే దానికి చాలా తేడా ఉంటుంది. అది వేరే విషయం.

సరే...ఈ బ్లాగర్ కు 'ఇది అన్ ఫెయిర్' అని కామెంట్ పంపాను. వాడు స్పందించలేదు. దాంతో వాడిని చిన్నప్పుడు నేర్చుకున్న బండ బూతులు తిడుతూ కామెంట్స్ పెట్టాను. సిగ్గూ, ఎగ్గూ లేనివాడు అవన్నీ బ్లాగులో పెట్టాడు. అయితే....ఈ బూతులతో ఒక సమస్య ఉంది. దురదృష్టవశాత్తూ...ఇవన్నీ స్త్రీలను కించపరిచేవిగా ఉంటాయి. మన ఉద్దేశం అది కాకపోయినా...ఆ బూతులు వాడాక....అదే బూతులను చూపి మనల్ని దుర్మార్గులుగా చిత్రీకరించడం చాలా తేలిక. మహిళలను కించపరచడం మహా పాపమని...కాస్త ఆగాను లేకపోతే...వాడిని ఇంకా ఇంకా పరుషాతి పరుషంగా దూషించాలని ఉంది. ఆ దూషణ వెనుక నిజానికి ఒక ప్రయోజనం ఉంది. ఆ పర్పస్ ను ఆశించే నేను అక్కడ బూతు పురాణం ఆవిష్కరించాను. ఇక్కడే అసలు కథ ఉంది.

వాడు నన్ను కించపరిస్తే పట్టించుకోని..."సాంస్కృతికవాదులు" ఉత్తరాంధ్ర నుంచి అమెరికా దాకా స్పందించారు...సహృదయంతో. "ఇది రాము రాసారంటే నమ్మలేక పోతున్నాని..." ఒకాయన, "ఛీ..ఇంత దారుణమా..." అని ఇంకొకాయన ఇలా చాలా బాధపడి పోయి..సందులో సందుగా నా మీద ఇంకొన్ని బండలు వేశారు. మన మహిళా బ్లాగర్లను ఫేక్ బ్లాగులతో దారుణంగా మోసం చేసిన ఒక బ్లాగర్ గురించి నేను రాసిన కొన్ని రోజులకే...నా మీద ఆ బ్లాగులో దాడి చేయడం...."తిట్టింది నిన్ను కాదు...మైండ్ యువర్ బిజినెస్" అని అన్నా ఒక మహాజనుడు వినకుండా...నా ఫోన్ కోసం ఆడియో, వీడియో రికార్డర్స్ తో సిద్ధంగా ఉండడం...ఈ తతంగాన్ని సమర్ధిస్తూ కొందరు విశిష్ట బ్లాగర్లు వాదనలు చేయడం....వెనుక ఏదో ఒక పాట్రన్ నాకు కనిపిస్తున్నది. దీన్ని శోధించే పనిని...ఒక పక్క ప్రభుత్వ సహకారంతో సాగిస్తూనే....నేను గౌరవనీయులుగా భావించే ఇద్దరు సీనియర్ బ్లాగర్లు, మా కో-ఎడిటర్ హితబోధతో నేను ఆ బ్లాగర్ గాడి మీద బూతు దాడి ఆపేశాను....ఇష్టం లేకపోయినా. ఇపుడు గాంధేయ పోరాటం ప్రారంభించాను. ఇదీ అబ్రకదబ్ర గారికి నచ్చడం లేదు. 


"గజ్జికుక్క మీదకు ఎగబడితే ఎమిచేస్తావ్?" అని మా వాడు అడిగితే...అది మనకూ, సమాజానికి చేటు కాబట్టి, మునిసిపాలిటి వాళ్లకు ఫిర్యాదు ఇచ్చే టైం, ఇచ్చినా లాభం లేదు కాబట్టి.... రాళ్ళు పెట్టి కొట్టి చంపుతా...అని చెప్పా. "చేస్తే...ఆ పని చెయ్యి...అంతే తప్ప...ఈ గాంధీ...గీంధీ అనకు," అని మిత్రుడు సలహా ఇచ్చాడు. సలహా బాగుంది గానీ....ఇది కనిపించీ కనిపించని గజ్జి కుక్క....ఏమి చేస్తాం? పుట్టలోకి పొగ పంపితేనే కదా...పాము బైటికి వచ్చేది. పొగ పెట్టవద్దని హితైషులు చెబుతున్నారు. అందుకే...మన గజ్జి కుక్క, దాని పక్కన తోక ఊపుతున్న ఉప్పు చేపల కోసం పదేళ్ళైనా వేచి చూడాలి తప్పదు. ఈ లోపు ఒక మిత్రుడు సలహా ఇచ్చినట్లు వ్యక్తిత్వ వికాసం పుస్తకం కొనుక్కుని చదువుతా. 

ఇక్కడ నాకొక సందేహం ఉందండీ. వాడు నా మీద బురద చల్లాడు. వాడెవడో తెలుసుకుని నా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. కుదరక...నేను ఇంకాస్త చిక్కని బురద విసిరాను. మధ్యలో...దూరిన సోదరులు గుండెలు బాదుకుంటూ 'మరీ ఇంత చిక్కని బురద వాడడం దారుణం' అంటున్నారు తప్ప....'ముందుగా బురద చల్లిన వాడిది తప్పు...ఇది పధ్ధతి కాదు'...అని వీరు చెప్పరేం? వాడు చల్లిన బురద సువాసన వెదజల్లింది, అది వారికి ఫన్. నా బురద గబ్బు లేపింది, ఇది సివిలైజేడ్ పని కాదు. ఇదేమి న్యాయం? ఇది ద్వంద్వనీతి కాదా? నన్ను అంటూనే...వాడినీ అంటే బాగుంటుంది కానీ....'తను రాసింది అంత ఘాటుగా లేదు...మీరు రాసింది ఘాటుగా, దారుణంగా ఉంది' అని సెలవిస్తున్నారు.

పైగా...ఇలా బ్లాగులలో ఎవరు మన మీద బురదచల్లినా పెద్దగా పట్టించుకోకూడదని, చూసీ చూడనట్లు పోవాలని ఒక సలహా వచ్చింది. ఆటవిక, అనాగరిక సమాజానికి ఆ రూలు వర్తిస్తుంది కానీ....పౌర సమాజానికి అది వర్తిస్తుందా? పక్కవాడి మీద అనవసరంగా బండ వేస్తే మనం ఊరుకుంటామా? ఎదుటివాడికి ఏమి జరిగినా...కామ్ గా మన పని మనం చేయాలనే ఆలోచన వల్లనే కదా...మన సమాజం ఇలా ఏడ్చింది! నా మటుకు నేను...ఏ బ్లాగర్ మీద దాడి జరుగుతున్నట్లు చూసినా...'సర్...ఇది తప్పు. ప్లీస్ అలా చేయకండి...' అని చాలా సార్లు వ్యాఖ్యలు రాసి ఉంటాను.

'ఇలా బ్లాగులో తిట్టడం, తిట్టించుకోవడం, గెలకడం....మాకు ఫన్. చూసీ చూడనట్లు పోవడాన్ని మనం అలవాటు చేసుకోవడానికి ఇది బెస్ట్ వేదిక, మన పిల్లలకు కూడా ఇది నేర్పాలి,' అని ఒక బ్లాగరు అభిప్రాయపడ్డారు. నాకెందుకో ఇది నచ్చలేదు. ఇది ప్రమాదకరమైన ధోరణి. బ్లాగు ఒక అద్భుతమైన సమాచార సాధనం. ఎక్కడెక్కడో వున్న వారిని, వారి అభిప్రాయాలను దగ్గరకు తెచ్చే మంచి వారధి. కాస్త చదువుకున్నవారు ఉపయోగించే మాధ్యమం. ఇంత మంచి ఈ వేదిక మీద ఇలాంటి పెడ ధోరణులను కలిసికట్టుగా అరికడదాం. నెట్ ప్రపంచంలో ముఖం దాచుకుని దాడి చేయడం కామన్...అని నాకు తెలుసు. కానీ...వెర్రి తలలు వేస్తున్న ఈ సంస్కృతిని, సైబర్ టెర్రరిజాన్ని మనం మార్చలేమా? ఒక్క సారి ఆలోచించండి. ఈ విషయం మీద నేను మీడియా మిత్రులతో ఒక చిన్న మీటింగ్ పెట్టాను.

కెలకడం, కెలికించుకోవడం అలవాటై, నేను బ్లాగులను ఇందుకే వాడుకుంటా...అనే వాళ్ళు ఏమిచేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. వారికి అది నష్టం కలిగించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి...కొంత రిస్క్ తో నడుపుతున్న బ్లాగ్ నాది. జర్నలిస్టులకు వేదిక కల్పించడం, మీడియా తీరుతెన్నులు ఎండకట్టడం, నీతివంతమైన జర్నలిజం కోసం పోరాడడం దీని ప్రధాన ఉద్దేశం. నా పర్సనల్ విషయాలు కూడా ఇందులో ఎందుకు రాస్తున్నానంటే...కొనసాగింపు కోసం. అందరికీ ఉపకరించే సందేశం ఉన్న అంశాలనే ఎంచుకునే ప్రయత్నం చేస్తాను. సార్...మీడియా మీద రాయడానికి రోజూ ఏమీ ఉండవు, నిర్ధారించుకోకుండా రాయడం చాలా సార్లు కుదరదు. రికార్డు అయి ఉండాలని నా కుమారుడి ఆటల గురించి, అందులో రాజకీయాల నుంచి రాస్తాను. పైగా ఈ టాపిక్స్ నాకు ఇష్టం. 


ఇక్కడ....ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికి కుమ్మక్కు అయినట్లు కనిపించే బ్లాగర్లకు నేనొక సవాల్ విసరదలిచాను. అయ్యలారా...అక్కలారా...మీరు మీ పేరుతో, ఫోటో పెట్టి...అడ్రెస్, ఫోన్ నంబెర్ ఇచ్చి తెలుగు మీడియా మీద ఒక పది పోస్టులు రాయండి, చూద్దాం. అది మీ జీవితాలను ఎంత దుర్భరం చేస్తుందో, ఎన్ని నిద్రలేని రాత్రులను ఇస్తుందో చూడండి. అది అంత వీజీ కాదు బ్రదర్స్/ సిస్టర్స్. ఇక్కడ నేను డీల్ చేస్తున్నది...ఒక ప్రమాదకరమైన మాఫియా గురించి. దయచేసి నా పని నన్ను చేయనివ్వండి. నా మీద బండలు వేసే... గజ్జి కుక్కలను మీరు రాళ్ళతో చంపనక్కర్లేదు, 'ఛీ...ఛీ...' అని అదిల్చండి. అది చాలు...ఆ చిన్న చర్య నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. Conspiracy of silence నిజంగా ప్రమాదకరం. 


(నోట్: ఈ విషయంలో నాకు  ఫోన్ కాల్స్ చేసి, మెయిల్స్ పంపిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. కుమార్ గారి సుదీర్ఘ మెయిల్ చాలా సూతింగ్ గా అనిపించింది. అయితే...ఈ వ్యాసంలో  కొందరు బ్లాగర్స్ అభిప్రాయాలు ప్రస్తావించాను. దాని అర్థం...వారిని కించపరచడం ఏ మాత్రం కాదు. అందుకే వారి పేర్లు రాయలేదు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని ప్రత్యేక మనవి. నా మీద వ్యక్తిగతంగా కాకుండా...నా అభిప్రాయాల మీద తీవ్ర దాడి చేసి...ఈ     విషయంలో నాకు ఒక క్లారిటీ వచ్చేలా చేయండని మిత్రులకు మనవి.)

2 comments:

Saahitya Abhimaani said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

@అయ్యలారా...అక్కలారా...మీరు మీ పేరుతో, ఫోటో పెట్టి...అడ్రెస్, ఫోన్ నంబెర్ ఇచ్చి తెలుగు మీడియా మీద ఒక పది పోస్టులు రాయండి, చూద్దాం. అది మీ జీవితాలను ఎంత దుర్భరం చేస్తుందో, ఎన్ని నిద్రలేని రాత్రులను ఇస్తుందో చూడండి. అది అంత వీజీ కాదు..
yes we know..ardam cheskogalam...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి