Tuesday, October 19, 2010

హమ్మయ్య...ఎట్లయితేనేం....ఏడాది పూర్తయ్యింది....

సెప్టెంబర్ 28, 2009 న...అంటే... గత విజయదశమి నాడు శుభారంభం చేసుకున్న ఈ బ్లాగు మొన్న విజయదశమి (అక్టోబర్ 17, 2010) కి ఏడాది పూర్తి చేసుకుంది. ఆ రోజు ప్రశాంత వాతావరణంలో పుట్టపర్తిలో ఉన్న మేము ఎలాగైనా వార్షికోత్సవ పోస్టు ఒకటి రాయాలని తపన పడినా...ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల కుదరలేదు. 

ఒక వ్యక్తి జీవితంలో ఏడాది అంటే...చాలా స్వల్పమైన విషయం...కానీ...బ్లాగు కు ఏడాది అంటే కనీసం ఐదేళ్ళ పెట్టు. ఈ ప్రయాణంలో ఎన్నో వింత, విచిత్ర అనుభవాలు. ఎవ్వరికీ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయే విషయాలు పది మందికి పంచామన్న గర్వం...మంచి విషయాలపై చర్చ జరిపామన్న ఆనందం...ఇతరులకు సహాయం చేసామన్న తృప్తి...అకారణంగా బండలు వేస్తున్నారే అన్న బాధ...ఈ మిత్రులు సహకరించి చావరేం? అన్న అసంతృప్తి--ఇలా ఉగాది పచ్చడిలా సాగిపోయింది ఇన్నాళ్ళు. 

ముళ్ళు, పూలు కలిసిపోయి ఉన్న ఈ రహదారిపై ఏడాది ప్రయాణంలో మంచి మిత్రులు దొరికారు, శత్రువులు పోగయ్యారు. మంచి రాసినా...చెడు రాసినా ఏడ్చి పరోక్షంలో చెత్త కామెంట్స్ చేసే వారి నిజస్వరూపాలు కూడా మరింత ప్రస్ఫుటం అయ్యాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు మాలో ఉన్న లోపాలు కూడా బోధపడ్డాయి, వాటిని సవరించుకుని జర్నలిజానికి మేలు చేసేందుకు ప్రయత్నించాం. రాఖీ పండగ రోజు రాసిన పోస్టుకు స్పందించి చెన్నై నుంచి రాఖీ+పెన్ను పంపిన చెల్లెలు మాధురి, బోసినవ్వుల పూణే బాబాయి ఫణి బాబు గారు తదితరులు ఎప్పుడూ గుర్తువుండి పోతారు.

బ్లాగు ఆరంభించిన మొదట్లో...మనం సంఘాన్ని ఉద్ధరిస్తున్నామన్న ఒక రకమైన వీర ఫీలింగ్ ఉండేది. కామెంట్స్ కిక్ ఇచ్చేవి. ఎందువల్లనో గానీ....నిజానికి మునుపటి ఉత్సాహం క్రమంగా మాయమవుతున్నది.  మంచిని ఎవడూ హర్షించని ఈ రోజుల్లో....ఉన్నమాట రాస్తే ఉలికిపడి కక్ష పెంచుకునే మతితక్కువ జనం ఎక్కువగా ఉన్నప్పుడు...ఈ బ్లాగు గోల మనకేల? అని బాగా అనిపిస్తున్నది.  అందుకే...ఈ మధ్య పరిశోధన మిషతో దాక్కున్నాను. ఇది మనసుకు హాయిగా ఉంది.

పైగా అదే చెత్త మీద...అదే దాడి మనం చేయాలి. దానికన్నా మినకుండడం మంచిది కదా! క్రమం తప్పకుండా రాయండని మిత్రులు కోరుతున్నారు కానీ...అది పెద్దగా లాభంలేని వ్యవహారం కనక ఆ పని చేయడంలేదు. అందుకే....అప్పుడప్పుడూ కలుద్దాం. 

పైగా...ఇప్పుడు కర్మ సిద్ధాంతం పై క్లారిటీ పెరిగింది. కొన్ని గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి, సత్యం బోధపడింది. క్రమంగా ఆధ్యాత్మికత వైపు మనసు పరుగులు పెడుతున్నది. ఇక్కడ వాడిని, వీడిని అని లాభం కనిపించడం లేదు. అందుకే.....ఇకపై ఎప్పుడైనా అప్పుడప్పుడు మంచి నిర్మాణాత్మకమైన అంశాలపై రాయాలని నిర్ణయించుకున్నాం. 

మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ....రాము, హేమ 

37 comments:

ఆ.సౌమ్య said...

congratulations for completing one year successfully!

కానీ మీరు మరీ అలా వేదాంతం చెబితే ఎలాగండీ, సమాజం అంటే అన్ని రాకాలూ ఉంటాయి. చెడు కి భయపడి వేదాంతం చెప్పడం ఏమీ బాలేదు. మీ పోస్టులని చదివి ఆనందించేవాళ్ళు, మీతో మాట కలిపేవారు చాలామంది ఉన్నారు. మాకోసమైనా మీరు రాస్తూ ఉండండి.

Chandra sekhar said...

Puttina roju subhakanshalu....

జర్నో ముచ్చట్లు said...

డియర్‌ రామూ..

బ్లాగ్‌ ప్రారంభించి ఏడాది పాటు దిగ్విజయంగా నడిపినందుకు అభినందనలు. ఆ సందర్భంగా, పోస్ట్‌ రాద్దామనుకుంటే, పుట్టపర్తిలో నెట్‌ లేదు అనడం పెద్ద బుకాయింపు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో జిల్లా కేంద్రం అనంతపురంలో కూడా లేనన్ని సౌకర్యాలున్నాయి. సరదాగా దసరాను గడిపేందుకు వెళ్లి, పోస్టుల గురించి మరచిపోయుంటావు. అంతే తప్ప, మరోటి అయివుండదు. కాకపోతే, నేనెప్పుడో పట్టిన ఆధ్యాత్మికత బాటలో.. ఇప్పుడు నీవూ తోడవడం నాకెంతో ఆనందంగా ఉంది. గుడ్‌.. ప్రొసీడ్‌..
విజయ్‌

jaggampeta said...

best wishes..alaage mundhuku vellandi......patrikeya viluvalu kapandandi

Anonymous said...

>>ఇక్కడ వాడిని, వీడిని అని లాభం కనిపించడం లేదు. <<

ఫైనల్ గా నిజం తెలుసుకున్నారు.

సమాజాన్ని ఉద్దరిచ్చేద్దాం అనుకుంటే మనకు మిగిలేది నిరుత్సాహమే. తనదాకా వస్తే గాని ఎవరికీ తెలియదు సార్. మన మీదకు రాకుండా చూసుకోవడమే మన బాద్యత.

Saahitya Abhimaani said...

CONGRATULATIONS ON THE EVE OF FIRST ANNIVERSARY OF (Y)OUR BLOG.

YOU DO ONE THING. NO MATTER WHAT HAPPENS, PUT A LIMIT TO WRITING LIME ONE POST A WEEK OR ONE IN A FORTNIGHT AND COVER WHATEVER YOU WHAT IN THAT ONE POST ONLY.

IT WOULD GIVE RELIEVE FROM YOUR PRESENT FATALISM.

astrojoyd said...

what u said is 100% correct on writing blogs.gd decession sir.

katta jayaprakash said...

Hearty congratulations for the first birthday of the blog.I am afraid this blog may not celebratre next birthday as the first birth is not a happy birthday.It is true you had started the blog with a good intention to set right the media which is highly polluted worse than ganga and our musi rivers!And your experience with the people and their response to your noble,voluntary service for the media reveal a vert bitter experience with depression as some of them never undrstood properly your principle and policy of the blog but started throwing stones on you some times with big stones which definetely hurt your mind and heart.
Godd,bad and ugly are seen,experienced in everty individual,proffession,society etc.Without bad and worse there is no importance to good and good is not recognised without them.It looks very nice to speak like this but in practice it is difficult to get adjusted,compromised and tolerate to these bad things.So you are the final judge of continuing this blog as it has not come upto your calculations,satisfaction and pleasure.
I am very glad that the seed of spiritualitry is slowly growing in your mind,heart and body and I congratulate you for this good transformation and pleased to know your visit to Puttaparthi where you can experience the divinity,spirituality and GOD in human form like you and me blessing and showering,spreading His love like rose spreading the fragrance.Good luck to you in this transformation and I am sure your father in law and Hema garu will definetely assist,coperate with you for total transformation to become an embodiment of love and divinity so that you canspread love every where as love is God and God is love so let us live in love which is a pathway to divinioty. SAIRAM,

JP.

Unknown said...

రాము గారు పోనీ మీ కెదురైన ఆద్యాత్మిక అనుభవాలే రాయొచ్చు గా ?
అయినా నా'' బ్లాగ్ వైరాగ్యం '' పోస్ట్ లో ఈ పరిణామం ఎప్పుడో రాసాను .
దానికి మీరు స్పందిస్తూ నాతొ ఎకిభావించారు . ఎటొచ్చి తత్త్వం యిప్పుడు భోధ పడింది .
సిన్సియర్ గా ఈ సంవత్సర కాలం లో మీ బ్లాగ్ ద్వార మీడియా యింకో కోణం చూపినందుకు మీరు
అభినందనీయులు .కీప్ రైటింగ్ .బెస్టో.

Unknown said...

thnz
prathi roju new item kosam yeduru chudalsina pani lekunda chesaru.

మాలా కుమార్ said...

మీ బ్లాగ్ ఏడాది పూర్తిచేసుకున్నందుకు అభినందనలండి .

Naresh said...

ఏడాదయ్యిందనేది గుడ్‌న్యూస్. కానీ, మీరు ఇంత వయొలెంట్ డెసిషన్ తీసుకోవడాన్ని మాత్రం నేను హర్షించను. ఇన్ని రోజులుగా మీ పోస్టు కోసం ఎదురుచూస్తూంటే మీరు ఇలాంటి బ్యాడ్ న్యూస్ పబ్లిష్ చెయ్యడం ఏమీ బాగోలేదు.

Sasidhar said...

రాము గారికి,

నమస్తే. మీ బ్లాగ్ నా లాంటి చాలా మందికి స్పూర్తినిస్తోంది. విజయవంతంగా సంవత్సరకాలం పాటు బ్లాగ్ నడిపినందుకు, మిమ్మల్ని, హేమ గారిని అభినందిస్తున్నాను. మీరు ఇలాగే పదికాలాల పాటు జర్నలిజానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను.
Keep up the Good Work and Congratulations Again.

~శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.com

PS: నేను 1995-1996 ఈనాడు జర్నలిజం స్కూల్ స్టూడెంట్ ను. మీరు మాకు ఒకటి, రెండు క్లాసులు కూడా తీసుకున్నారు. అవన్నీ, మీకు తర్వాత ఈమైయిలు చేస్తాను.

చిలమకూరు విజయమోహన్ said...

అభినందనలు.
సత్యం బోధపడింది. క్రమంగా ఆధ్యాత్మికత వైపు మనసు పరుగులు పెడుతున్నది.మంచి పరిణామం.

Saahitya Abhimaani said...

రామూ గారూ మరొకసారి మీ/మా బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, "ఇప్పటికైన తెలిసిందా" అంటూ దీర్ఘాలు తీస్తున్నాయి. మీరు మొదలు పెట్టిన పని సవ్యమైనది. మీరు చేస్తున్న పని పక్షపాతం లేకుండా చేస్తున్నారని మీకు అనిపిస్తే చాలు మరింకేవరు ఏమనుకున్నా పట్టించుకోవలిసిన విషయం కాదు, ఇంతకు ముందు చెప్పినట్టుగా నెలకు రెండు కాని నాలుగు కాని వ్యాసాలు వ్రాయుండి, మీకు టైం మానేజిమెంటుకు సరిపోతుంది. పూర్తిగా వ్రాయటం మానవద్దు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఆనందించే అవకాశం దయచేసి ఇవ్వకండి,

Ramu S said...

@జర్నో ముచ్చట్లు....
హేమ ఫాదర్ పనిచేసేది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గర. అక్కడ ఉన్నది ఒక్కటే నెట్. అక్కడికి రెండు saarlu వెళ్లాను. ఒక సారి పండగ వల్ల mootabadi వున్నది, రెండో సారి ఫార్మాటింగ్ చేయిస్తున్నాను అని చెప్పాడు. అందుకే రాయలే. నేను అబద్ధాలు, బుకాయిపులు లేని జీవితం గడుపుతున్నాన్రా అన్నయ్యా...
@జే.పీ. గారు, రవి గారు
ఈ మధ్యన (October 3, 2010, Sunday) మేము ఒక పెద్ద ప్రమాదం నుంచి బైట పడ్డాము. ఆ ప్రమాదాన్ని ముందే ఊహించడం, కలగనడం, వంటి కొన్ని అంశాల వల్ల కొంత కనువిప్పు కలిగినట్లు అయ్యింది. ఆ వివరాలు ఎందుకులే అని రాయలేదు.
@శశిధర్
మీరు గుర్తుకు రావడం లేదు సార్
Ramu

Ramu S said...

శివ gaaru,
థాంక్స్ సర్. మీ సూచన బాగున్నది, పాటిస్తాను
ramu

Sasidhar said...

రాము గారు,
ఫర్లేదు సార్. నాకు మన్మోహన్ సింగ్ తెలుసు, ఆయనకు నేను తెలుసా? ఇదీ అంతే. మీరు, జనరల్ డెస్క్ రామకృష్ణ గారితో కలసి మాకు కొన్ని క్లాసులు తీసుకున్నారు. లక్ష్మణ్ క్యాంటీన్ మీద ఒట్టు. మీరు నమ్మాలి.

~ శశిధర్

katta jayaprakash said...

I am very happy that you have come out safely in an accident.The spiritual experience that you realised through this incident/accident is a turning point in your lfe.I feel this incident happened just to transform you into a spiritual minded individual and it is only accidental without any harm as the purpose of the incident is entirely different.Spirituality is nothing but humanity minus animality and divinity is nothing but to love all and serve all to realise that God is love and love is God so live in love.
Please do contribute to the blog on good,bad and ugly of media,media personnel,media CEOs and managements and please invite good and unbiased,dignified opinions from the blogger friends without any abusive or offensive language so that you get good relief and time to spare for your proffessional work.

JP.

Thirmal Reddy said...

Sirjee,

Congrats on your blog completing a marathon one year and do accept my dissidence against your decision to slow down. I'm sure you'd rethink on your proposed metamorphosis into a spiritual personality. Ya, may be you could keep blogging albeit at greater intervals and still continue with spiritualism. I know being at the helm of ethical affairs in Telugu media is a thankless job, but you will have to hold on the fort. I'm sure you will.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Unknown said...

ANNAYYA PONEE...IKANUNCHI BLOG CHADAVALANTE MIN. CHARGES VASULU CHEY..I MEAN SUBCRIPTION...SAY..100/-MONTHLY...

APPUDU EE BLOG VALLA MEKKUDA LABHAM UNTUNDEMO..ALOCHINCHANDI..

HAPPY ANNIVERSARY

Vasuki said...

రాము గారు

మీ బ్లాగ్ ప్రధమ వార్షిక శుభాకాంక్షలు. ఆధ్యాత్మికత వైపు మనసు పరుగులు పెట్టడం మంచిదే. శుభం భూయాత్. టపాలు వ్రాయడం మానేయకండి. మాకు మీడియా గురించి చెప్పే మూడో కన్ను మీరు.

శ్రీవాసుకి

Unknown said...

yEDaadi poorti chEsukunna telugu mIDiyaa kaburlaku Subhaakaankshalu. mI dRkpatham chaalaa manchidi. andukE telugu jarnalisTanE pratIvaaDu neT mIda koorchOni laagin ayyEdi mI blaagunE. dESamantaa ippuDu telugu mIDiyaavaipu choostOndi. sO, mI baadhyata inkaa perigindi. kyaarI aan. viShes Tu hEmagaaru anD mana frenDs jEpI, tirmal... aal adars.

Sudhakar said...

బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షాలు.

ఆధ్యాత్మికత, కర్మ సిద్ధాంతాలు ఎపుడూ కళ్ళు, చెవులు మూసుకోమని చెప్పలేదండీ. అవి మన ఎమోషనల్ కంట్రోల్ కి ఉపయోగపడేవి. మీ వైరాగ్యం చూస్తే మన తెలుగు బ్లాగు లోకంలో వున్న వెధవ జనం సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. హాట్సాఫ్ టూ తెలుగు బ్లాగ్ ట్రోల్స్.

"బ్లాగు ఆరంభించిన మొదట్లో...మనం సంఘాన్ని ఉద్ధరిస్తున్నామన్న ఒక రకమైన వీర ఫీలింగ్ ఉండేది. కామెంట్స్ కిక్ ఇచ్చేవి..." -- ఏ బ్లాగు అయినా చచ్చిపోవడానికి ఇదే కారణం. బ్లాగులు దేనిని ఉద్దరించటానికి కానే కాదు...కామెంట్లు మన కిక్కు కోసం కాదూ... మన మనస్సులో వున్న లాగ్ మనం రాసుకోవాలి...ఎవరేమనుకున్న అక్కర్లేదు అనుకుంటే బ్లాగ్ ఎన్నేళ్లు అయినా వెళ్తుంది...

మీ బ్లాగు, మీ ఇష్టం..గాని...దాని మూతవేతకో, తలరాతకో మీరు చెప్పిన కారణాలు మాత్రం అంతా బాగోలేవని నేననుకుంటున్నా...

పూర్ణప్రజ్ఞాభారతి said...

ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు సంతోషం. మొదటి సంవత్సరంలో చిన్నగా కిలకిల నవ్వడం, నవ్వించడమే నేర్చుకునే పాపాయి రెండవ ఏటనే ఎన్నో విషయాలను తెలుసుకుంటుంది. ప్రగతి పథాన పడుతుంది. ఉన్నతి దిశగా సాగేందుకు కావలసిన అధ్యయనాలను ఆరంభిస్తుంది. ఈ బ్లాగు కూడ అలా అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను. మీరు 44 ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న వారైతే ఆశీర్వాదం. (నా వయస్సు 44 సం) అంతకన్నా పెద్దవారైతే అభినందనలు.

లౌకిక వ్యవహారాలతో నిత్యం తలమునకలౌతూ మనం శాశ్వత సత్యమైన భగవంతుని పెద్దగా ధ్యానించం. పండగల వేళలలో కూడా స్త్రీలు చూపినంత భక్తిని కూడా మనం చూపం. ఉద్యోగ కారణాల వల్ల మనకు నిత్యం పోగయ్యే సమాచారం, మనల్ని ప్రభావితం చేసే వ్యక్తుల ప్రభావం ఇందుకు కారణం కావచ్చు. అందుకే ఈ జీవన నాటక రచయిత కొన్ని మలుపుల్ని మన జీవితంలోకి తీసుకువచ్చి ఆధ్యాత్మికత అనే మెయిన్ రోడ్డులోకి మనల్ని మళ్లిస్తాడు. అక్కడి మనశ్శాంతికి కొదవలేదు. అన్ని వికృత స్మృతులకు, విషాద భావాలకు అక్కడ చక్కని ఉపశాంతి లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక వాతావరణంలోకి మరలుతున్నందుకు అభినందనలు

జ్యోతి said...

మీ బ్లాగ్ ప్రధమ వార్షిక శుభాకాంక్షలు.. రాముగారు మీరు బిజీగా ఉండి రాయట్లేదని అనుకున్నాను. ఒక్కటండి. బ్లాగుల్లో రాతల ద్వారా మనం ఎవ్వరిని మార్చలేము.మనకు నచ్చకుంటే మనమూ మారము కదా. బ్లాగు రాయడానికి విరక్తి ఎందుకు? మనసులో ఉన్న ఆలోచనలు పంచుకోవడం తప్పు కాదుకదా. తరచుగా కాకున్నా తీరిక వేళ టపా కట్టండి. తప్పుగా అనుకోవద్దు. రాయండి అని అర్ధం.. :))

వంశీ కృష్ణ said...

రాము గారు,
మీ బ్లాగు సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు. మీడియా మరియు గురుంచి మీకు తెలిసిన విషయాలు మాతొ పంచుకున్నందుకు ధన్యవాదాలు. ముందు ముందు ఆధ్యాత్మిక విషయాల గురుంచి కూడ మీ అభిప్రాయలు మాకు తెలియ చేస్తారనుకోంటున్నాను.

Vinay Datta said...

Ramu annayya,

Hearty congratulations! But I'm disappointed at your announcement of renouncing. Can you find anybody more spiritual than the Lord Krishna? He ruled without the throne because he maintained the purity of a dew drop on a lotus leaf. Please learn to be detatched while you continue doing your work. I agree with the bloggers who said that your decision makes the wrong doers in the media feel that they have won against you. Infact they actually are releived that there's no policing on them. As Siva garu suggested, please keep writing once a week atleast and give all the updates at a time.

Thanks for mentioning my name in your post. I'm happy that you introduced me to the readers.

Vinay Datta said...

Please think more of the people who agree with you, respect you and are ready to work with you. The different posts by others like abracadabra, Delhi journalist, Woman journo, Tirumal and others stress the need to continue a platform like this. Please encourage others to continue writing along with you so that the zeal and enthusiasm are maintained. That'll also give you a feeling of being 'among' and not away from like minded people. You should also think about the likes of me who feel they are a part of the blog.

Anonymous said...

రాము, హేమ గార్లకు (బ్లాగు) ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షాలు.
ఈ సంవత్సర కాలంగా చూస్తే మొత్తమ్మీద మీ బ్లాగు చాలా బ్లాగు బ్లాగు. ఎంతగా అంటే రోజూ మా బ్లాగుల్ని మేం చూసుకునేకన్నా ముందే మీ బ్లాగుని చూసే నాలాంటి బ్లాగు ప్రియులు ఎందరో:)
కానీ, ఇదేంటన్నయ్యా? మద్యలోనే కాడి ఎత్తేస్తానంటున్నారు?
"పైగా...ఇప్పుడు కర్మ సిద్ధాంతం పై క్లారిటీ పెరిగింది. కొన్ని గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి, సత్యం బోధపడింది. క్రమంగా ఆధ్యాత్మికత వైపు మనసు పరుగులు పెడుతున్నది" అంటూ మంచీ లేదు చెడూ లేదు - అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు అనేసి మీరు అర్ధాంతరంగా ఆధ్యాత్మికతవైపు వెళ్ళిపోతే దేవుడూ లేడు, దయ్యమూ లేదు అనే నాలాంటివాళ్ళను ఈ కర్మ సిద్ధాంతం ఏవిధంగా సమాధానపరచగలదు?
ఇక "జరిగేవి జరగక మానవు" అని మనిషి సరిపెట్టుకోవడమే కర్మ సిద్ధాంతమైతే (తన పని తాను సహజ సిద్ధాంతాలకణుగుణంగా చేసుకుంటూ పోవడమే కర్మ సిద్దాంతమని నా నమ్మకం) ఇహ దేవుళ్ళ చుట్టూ/ దయ్యాల చుట్టూ తిరగటం మాత్రం దేనికట? (నా దృష్టిలో రెండూ ఒక్కటే-ఎందుకంటే ఙాని దేవుడి చుట్టూ, లేదా దేవుడని పేరెట్టుకున్న ఒక మనిషి చుట్టూ తిరగటం కర్మ సిద్ధాంతం ప్రకారం సమర్ధనీయమైతే ఒక అఙాని దయ్యాలపేరుతో చేసేవి కూడా అదే కర్మ సిద్ధాంతం ప్రకారం సమర్ధనీయమే కాదా?)
ఏది ఏమైనా మీరు గత ఆరునెలల కిందటివరకూ (కాస్త) ఖాళీగా వుండబట్టే మీ బ్లాగులో మంచి మంచి విషయాలపై, ముఖ్యంగా మీడియాలో వుండే విభిన్న (వింత & పైత్య) కోణాలపై విశ్లేషణలు చూడగలిగామేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కెరీర్ పరంగా మళ్ళీ బిజీ అయిపోవడంకూడా మీకు "ఈ బ్లాగు గోల మనకేల?" అని ఏమైనా అనిపిస్తున్నదేమో అని నాలాంటివాళ్ళకు అనిపిస్తున్నది.
గురూజీ!మీరన్నంత పని చేసేస్తే ఎక్కడ బ్లాగులో పోస్ట్‌లు నల్లపూసలైపోతాయో అన్న బెంగతో అలా అనడంద్వారా మీపై ఒత్తిడి పెంచుదామని ఓ చిన్ని ప్రయత్నం చేసాను. పెద్ద మనసుతో స్వీకరించి, ఎంత బిజీగా వున్నా, ఓవర్ టైము చేసైనా మీ విశ్లేషణ అవసరమనిపించే సంఘఠనలు ఏమొచ్చినా మీరొక టపా ఠపీమని వ్రాసేస్తే మీ బ్లాగుని చూసే నాలాంటి ఎందరో బ్లాగు ప్రియులు సంతోషిస్తారని విన్నపం.
(నోట్: ఈ కర్మ సిద్ధాంతం, దేవుడు-దయ్యం విషయంలో నేను చేసిన కామెంట్ కొంత మందికి అసంబద్ధంగా అనిపించవచ్చు. అయితే నా వుద్దేశ్యం దేవుణ్ణి నమ్మేవాళ్ళను కించపరచడమో మరోటో కాదు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అవి నేను గౌరవిస్తాను. అయితే ఇక్కడ నా వుద్దేశ్యం మాత్రం - మన దేశంలో తాతల కాలం నుండీ కర్మ సిద్ధంతాన్ని ఆచరిస్తూ వస్తున్నవాళ్ళమే అయినా, రాను రాను దానిలోని సూక్ష్మాన్ని విస్మరిస్తూ ఎవడి సుఖం కోసం వాడు పాప పుణ్యాలను మరిచి యాంత్రికంగా, మెటీరియలిస్టిక్ గా ఎలా మారిపోయారో చూస్తూనే.... అన్నీ దేవుడే చూసుకుంటాడులే అని మనలాంటి వాళ్ళందరం వదిలేస్తే అదెలా సమర్ధనీయమౌతుంది?)

Vinay Datta said...

@ RS REDDY garu

I agree with your understanding of the law of karma.

శరత్ కాలమ్ said...

చాలామందికి లాగానే ఈ మీ పోస్టు ప్రధమ వార్షికోత్సవం అనుకొని పట్టించుకోలేదు. కామెంట్ల ద్వారా మీ నైరాశ్యం, అధ్యాత్మికత్వం తెలిసాయి. అందుకే ఇటు వచ్చా. మీరన్నట్లే బ్లాగుల్లో మంచికి పోతే వెకిలింపులే ఎదురవుతున్నాయి కానీ మరీ అంతగా విరక్తి చెందకుండా, సంఘసేవ కోసం కాకపోయినా మీకోసం, మాకోసం మీ మానాన మీరు వ్రాస్తుండటం ముదావహం కాగలదు. సంచలనాత్మకంగా వ్రాయకుండా విశ్లేషణాత్మకంగా వ్రాస్తూవుండటం మధ్యేమార్గం కాగలదు.

Sitaram said...

హలో... రామూజీ...! ముందుగా మీ బ్లాగుకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఏ కొత్త పోస్ట్ రాస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాకు పెద్ద షాకిచ్చారు. మీలాంటి పెద్దలు, నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు ఇలా మడమ తిప్పడమేలా..? మీరు కూడా పట్టించుకోకపోతే మన జర్నలిస్టుల కష్టసుఖాల గురించి నలుగురికీ చెప్పేవారెవరండీ...? తామేదైనా తప్పు చేస్తే రామూ గారి బ్లాగ్ లో వచ్చేస్తుందనే భయంతో ఈమధ్యకాలంలో చాలామంది సక్రమంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారంటే అది మీ చలవే. మీకు తెలిసో, తెలియకో మీ బ్లాగ్ వల్ల ఎంతోమందికి మేలు జరుగుతోంది. జరగబోతోంది కూడా. మీ వ్యక్తిగత పనులు మీకుంటాయి... మీ అమూల్యమైన టైమ్ అంతటినీ ఈ బ్లాగ్ కోసం కేటాయించమని మేమనట్లేదు. కానీ... ఉన్నంతలో కొంతైనా మాలాంటి బక్క జర్నలిస్టుల కోసం రాయడానికి కేటాయించమని కోరుతున్నాం. మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ లో ఎక్కువ మంది మిమ్మల్ని ముందుకు సాగమని చెప్పిన వారే. అరకొర చెత్త కామెంట్స్ గురించి పట్టించుకోవద్దు. మన జర్నలిస్టు ప్రపంచం గురించి ఇంత బాగా రాస్తున్న బ్లాగ్ మరొకటి లేదు. ఛానల్ యాజమాన్యాలను సైతం వదిలిపెట్టకుండా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు రాయడం మీకే చెల్లింది. అక్కడ అలా జరిగింది, ఇక్కడిలా జరిగిందని క్షణాల మీద వార్తలందించే మేం కాదండి జర్నలిస్టులం... మీడియాలోని పైత్యాన్ని, విపరీత ధోరణుల్ని ఎత్తి చూపుతున్న, తూర్పారబడుతున్న మీరే నిజమైన, నిఖార్సైన జర్నో. హేమగారూ..! మీరిద్దరూ కలిసి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం బాలేదు. మనలాంటి వాళ్ల కోసమైనా మనసు మార్చుకోండీ...! మహాత్మ & స్వరూప

Anonymous said...

@Sitaram
well said sir.

Saahitya Abhimaani said...

"..... తామేదైనా తప్పు చేస్తే రామూ గారి బ్లాగ్ లో వచ్చేస్తుందనే భయంతో ఈమధ్యకాలంలో చాలామంది సక్రమంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారంటే...."

@Sitaram good compliment to Ramu garu.

Ramu S said...

ఒక వివరణ: సీతారాం పేరిట కామెంట్ రాసింది ఒక జర్నలిస్టు. ఆయన దాన్ని నా మెయిల్ కు పంపితే...నేను అది ఇక్కడ పేస్ట్ చేసాను. ఆ సీతారాం గాడిని నేనే. సీతారామ శేష తల్పసాయి.
చీర్స్
రాము

Anonymous said...

Ramuji alias Sitaram!
what a surprise? I couldn't understand what necessitated u to become another ABRAKADABRA:)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి