Monday, October 4, 2010

ఇన్ని విగ్రహాలు...ఇంత హడావుడి అవసరమా?

శని, ఆదివారాలలో ఒక ముఖ్యమైన పనిమీద నల్గొండ జిల్లా మీదుగా ఖమ్మం జిల్లా వెళ్లి అక్కడ కొన్ని గ్రామాలు తిరిగాను. అప్పుడు అర్థమయ్యింది...ఈ జగన్ బాబు ప్రతి వూళ్ళో 'విగ్రహాల పోటీ' అనే 'మ్యాడ్ రేస్' మొదలు పెట్టాడని, ఇకపై అన్ని ఊళ్లలో పోయిన/ వున్న ముఖ్యమంత్రుల విగ్రహాలు వెలవవబోతున్నాయని.  ఇది ఊళ్లలో మరింత గందరగోళం సృష్టిస్తుందని, జనం ఇంకా ఎక్కువగాకొట్టుకు చస్తారని కూడా అనిపించింది.

ప్రతి వూళ్ళో వై.ఎస్. విగ్రహం వెలిసింది. ఇంకొన్ని చోట్ల మీదంతా ఒక తెల్ల బట్ట వేసి కప్పివున్న వై.ఎస్. విగ్రహాలు ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. అంతేతప్ప యుగ పురుషుడు కాదు, మహాత్ముడూ కాదు. అలాంటి ఆయన కోసం అన్ని విగ్రహాలా? 

భక్తి, అభిమానం వుంటే...కొన్ని చోట్ల విగ్రహాలు పెట్ట వచ్చుగానీ..మరీ ఇంత వేలం వెర్రిగానా? ఇప్పటికే పోటీ తత్త్వం పెరిగి ప్రశాంతత దెబ్బ తీసుకున్న గ్రామీణులు...ఇకపై తమ వారి కోసం కూడా విగ్రహాలు పెట్టేందుకు వెనుకాడరు. ఇతర ముఖ్యమంత్రుల వారసులూ/ అభిమానులూ ఆ పనిమీదనే ఉండవచ్చు. డబ్బు ఉంటే...ఏ పనైనా చేయవచ్చని ఈ కసరత్తు నిరూపిస్తున్నది. ఎవరికైనా సరే...ఇది మంచిది కాదు. 

డబ్బు వుంటే...పేపర్లు, ఛానెల్స్ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఈ విగ్రహాల పిచ్చి ఏమిటి? దీన్ని ఆపే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, రూపాయి నోటుకు... సారా పాకెట్ కు కక్కుర్తి పడి ఓటు అమ్ముకునే ఈ జనాలకు లేదు, సాయంత్రం కాగానే హాయిగా ఇంటికి చేరామా?...అంతే చాలు అనుకునే ఈ ఉద్యోగులకు లేదు. ఎవ్వడికీ ఈ గొడవ పట్టదు. అదే మన స్పెషాలిటీ. జగనైనా విసుగు పుట్టి....ఈ పని ఆపితే బాగుంటుంది. 

తండ్రి పేరు కలకాలం జనం నోళ్ళలో నానడానికి విగ్రహాలు మాత్రమే ఏకైక మార్గం అని ఆయన అనుకోవడం పొరబాటు. ఒక కోటో, రెండు కోట్లో పడేస్తే...నేనో, మా అబ్రకదబ్రో అంతకన్నా మంచి ఉపాయం చెప్తాం కదా.  

37 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

పిచ్చి.జగన్ కి పీఠం మీద పిచ్చి. మిగిలిన వాళ్ళకు అతను విదిల్చే ఎంగిలి మెతుకుల పిచ్చి.

పూర్ణప్రజ్ఞాభారతి said...

ఇకపై అన్ని ఊళ్లలో పోయిన/ వున్న ముఖ్యమంత్రుల విగ్రహాలు వెలవవబోతున్నాయని. ఇది ఊళ్లలో మరింత గందరగోళం సృష్టిస్తుందని, జనం ఇంకా ఎక్కువగాకొట్టుకు చస్తారని కూడా అనిపించింది.

ఆవునా. అన్నగారి విగ్రహలు వెలిసినప్పుడు, అంబెద్కర్ విగ్రహాలు ఓరూరా వెలిసినప్పుడు ఇలా అనిపించలెదు కాబొలు. ఉన్న లెక పొయిన ముఖ్యమంత్రుల విగ్రహాల స్థాపనకు వాళ్ళ పిల్లలు సిద్ధంగా ఉన్నట్టు మీకు అనిపిస్తున్నదా?. విగ్రహాలు పెరిగితే జనం కొట్టుకు చస్తారా? ఇది జరిగే పనేనా?

ఆయన మాజీ ముఖ్యమంత్రే కాదు.. చాల మందికి ఉపయొగపదె పనులు చెసిన రాజకీఎయ నాయకుదు కూదా. 108 ఒక్కతి చాలు ఆయన పేరు శాశ్వతం చెయదానికి. యుగపురుషులకు, మహాత్ములకు మాత్రమే విగ్రహాలు ఉందాలా? అలా అయితె చాల మంది విగ్రహాలు పెట్టనే కూడదు. కాదంటారా?

మన రాష్త్రాన్ని అస్సలు పర్యతించని, తన రచనలలో దీనీ పేరు కూదా ప్రస్తవించని అంబెద్కర్, సాహూ మహరాజ్ విగ్రహాలు మాత్రం పెట్టవచు కాని ఆరొగ్యస్రి, 108 వంటి సౌకర్యాలు కల్పించిన వ్యక్తి విగ్రహాలు పెట్టకూదదు. మేధావులు ఇలానే ఆలోచిస్తారు కాబొలు

Praveen Mandangi said...

తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో వంగవీటి రంగా విగ్రహం పెట్టారు. వీధి రౌడీ విగ్రహం ఎందుకు పెట్టారు అని ఒక గ్రామస్తుడిని అడిగాను. విగ్రహం పెట్టినవాళ్లు కులగజ్జికి పోయి అది పెట్టారని అతను సమాధానం చెప్పాడు. రాజశేఖరరెడ్డి విగ్రహాలు పెట్టినవాళ్లు జగన్ పారేసిన డబ్బుల కోసం పెట్టుంటారు. డబ్బులు పారేసి తన తండ్రికి విగ్రహాలు పెట్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం చీప్ టెక్నిక్.

katta jayaprakash said...

You are perfectly right.Jagan is just playing dirty politics on the death of his father.How many statues of Mahathma Gandhi,Subhashchandra Bose,Patel,Nehru,and other freedom fighters we come acroos in the society? Then why this madnes for the statues of YSR.YSR was a factionist transformed into a politician.It is most tragic that Jagan had played politics on the dead body of his father as he had an eye on the post of CM even before the body was cremated and this is the culture of a vulture of politics.As rightly commented, our people are members of vote bank expecting something for a vote and never bother for anything of the country.

JP.

astrojoyd said...

YUGAPURUSHUDE ANDEE..ENDUKANTE AYANANTHAGA RAASTRAANNI DOCHUKUNNA CM LU LERU MARI...ADEE KAAKA SAAMAANYUDI POTTALU OKESARI KOTTINA MAHAATMUDU KOODAANOOOO....

life is beautifull said...

రాజుల సొమ్ము రాళ్ళ పాలు..కొందరికి ఉపాధి

పక్షులకు మంచిదే...

ఊరి వాళ్ళు విగ్రహాల పక్కన చిన్న చిన్న నీటి తోట్టెల ఏర్పాటు మాత్రం చెయ్యాలి.

Ramu S said...

Pandit jee..
108 అనే పథకం వల్ల రాష్ట్రానికి లాభం తక్కువ, నష్టం ఎక్కువ. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థను కూల్చేస్తూ...ఖజానాకు చిల్లు పెట్టే కార్యక్రమం అది. అది కొందరు పేదలకు లాభం కలిగించి ఉండవచ్చు గానీ...దాని వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. 'ఆరోగ్య శ్రీ' క్రింద వెళ్ళే రోగులను పురుగులను చూసినట్లు చూస్తున్నారు. పది వేల ఆపరేషన్ కు ఇరవై నుంచి ముఫై వేలు వసూలు చేస్తూ ప్రజల డబ్బు దండుకుంటున్నారు. అంబేద్కర్ ను వై.ఎస్.ఆర్.తో పోలుస్తారా? ఇది దారుణం. కుల వ్యవస్థ వెర్రి తలకు వేస్తున్న రోజుల్లో....బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చిన అంబేద్కర్ ఎక్కడ? ఈ వై.ఎస్.ఎక్కడ?
రాము

kodali srinivas said...

అమెరిక,ఇంగ్లాండ్ వంటి దేశాలలో ఒక వ్యక్తికి విగ్రహం వేయాలంటే అతను మరణించిన తరువాత కనీసం 25 సంవత్సరాలు ఆగాలి. విగ్రహాన్ని స్థాపించటానికి అనుమతులు పొందాలి. మరి మన దేశంలో?.పదిమందిని పోగుచేసి పదివేలు ఖర్చు చేయగల చేవ వుంటే 'ఎలాంటి దగుల్బాజికి' అయినా నడి వీధిలో విగ్రహం పెట్టె వీరాభిమానులు. మార్గాలకు అడ్డంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఈ పోకడలకు అడ్డుకట్ట వేయాలి. పబ్లిక్ ప్లేసులో ప్రకటనల ఉండే హోర్డింగ్స్ కు రుసుము వసూలు చేసినట్లు, వీధుల్లోపెట్టె ప్రతి విగ్రహానికి దానిని పెట్టిన వారినుండి ప్రతి ఏడాది రుసుము వసూలు చేయాలి. వాటిని వాణిజ్య ప్రకటనలగానే పరిగణించి భారి మొత్తంలో(వీధిని బట్టి,కూడలిని బట్టి)స్థానిక సంస్థలు టాక్సు వేయాలి. ఎంతటి వ్యక్తి కి అయినా ప్రజా ధనం తో విగ్రహాలు,స్మారకాలు కట్టే వెసులు బాటు ప్రభుత్వాన్ని వేలే వారికి లేకుండా చట్టం రావాలి.

Praveen Mandangi said...

బతికుండగా వీధి రౌడీలు, ఫాక్షనిస్టులు అయిన వాళ్లు చనిపోయిన తరువాత demigods అవుతారు. వీధుళ్లో వాళ్ల విగ్రహాలు వెలుస్తాయి. మన దేశంలో వ్యక్తి పూజ ఇలా ఉంది.

deepu said...

sir nenu oka sari east godavari vellanu.akkada peru chepanu kani oka villege lo ambethkar vigrahalu galli galli ki petti vunnai.vichitram emiti ante anni vigrahalaki chupudu velu virigipoe undhi.ela undhenti ani nenu akkadi vallani adiganu.kulala godavalu, mee kulamodu ma kulapollani velu petti chupisthada ani aa chupudu veluni virichesarata...appudu chala godavalu jarigi 2 kuda chanipoyarata..mari mana divangatha cm vigrahala paristhithi ento....wait and see anukunta...

Unknown said...

Ramu gaaru

you better go and watch atleast for a day how EMRI is working. If you can find fault with 108 service only god can help you. I am sorry to make this harsh comment but seeing this post I certainly feel you deserve it. I cant understand how come 108 service is exploiting Government Hospital resources? The problem with our people is we don't see the positives.. only try to glorify the negatives. Show me a single system in the entire world which is flawless... I will accept my ignorance. Coming to the Idols part... I got a feeling that you have already decided that Jagan is throwing money and putting idols in every nook and corner which as a journalist you shouldn't do. If you got problems with this you can mention them. By making this type of comments your trying to mislead your readers.

Praveen Mandangi said...

25 సంవత్సరాల తరువాత రాజశేఖరరెడ్డి ఎవరో జనానికి గుర్తుండదు. ఒక ఫాక్షన్ లీడర్ ని జనం అంత కాలం గుర్తు పెట్టుకుంటారా?

Sudhakar said...

పండిట్ జీ, for your kind information, 108 సత్యం రాజు తాలూకా ఇన్నోవేషన్. దానికి హెల్ప్ చెయ్యమని అడిగితే వల్ల డబ్బులు, కేంద్రం నుంచి వచ్చిన యాంబులెన్సులతో తన పధకం కింద ప్రోపగాండా చేసిన ఘనత వై యస్ ఆర్ దే ! అంబేడ్కర్ తో పోలిక చాలా కామెడీ గా వుంది. ఇంకా గాంధీ ని ఎందుకు వదిలారు.?

రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమేగె
"రాజు జీవించు రాతి విగ్రహములందు"
సుకవి జీవించు ప్రజల నాల్కల యందు

అని గుర్రం జాషువా మహానుభావుడు వూరికె చెప్పలేదు. పిట్టలు రెట్టలు వెయ్యటానికి మాత్రం మంచి సదుపాయం చేస్తుండు మీ జగన్.

Sudhakar said...

మా వూళ్ళో ఏడు రోడ్లు కలిసే చోట వున్న సిగ్నల్లు అన్నీ పీకెసి ఈ స్కాము మహానుభావుడి విగ్రహం పెట్టారు. ఇప్పుడు ఆ దారంట పోయే ప్రతీ వాడు దానిని తిట్టుకోవటమే. గందరగోళంగా తయారయ్యింది బతుకు. ఆ విగ్రహం కోసం ఒక అనుమతి లేదు, పాడు లేదు.

104 సర్వీస్ లో కోట్లు కొల్లగొట్టుకుంటున్నది ప్రయివేట్ ఆసుపత్రులు. దానికి పెట్టే వార్షిక బడ్జెట్ తో, ప్రతీ సంవత్సరం ఒక ఒక జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తయారు చెయ్యొచ్చు.

దోచుకుంటున్నారు దొంగ వెధవలు...వాష్ బేసిన్ లో చేపలు పట్టుకునే వెధవలు...పోతార్రోయ్ నాశనమైపోతారు

seenu said...

షిరసు వంచి, షేతులు జొదించి,
నా అక్క చెల్లెల్లకు, అన్నదమ్ముల్లకు, నాన్నగారు పొయారన్న ధిగులుతొ ఛనిపొయిన వారిని ఓధార్పు యాత్ర చెపదితె, రాజకీయం అంతున్నారు...ఇదెక్కదయన ఉంధా అని అదుగుతున్నను. ఆయన ఛెసిన మంచి పనులు చూదమంతున్నా. నెల తిరగకుందనె రెందువందల రూపాయల పిన్షన్ చెతికి అంధగానె గుర్తుకు వచ్చేధి ఎవరు? వైస్సార్...వైస్సార్......వైస్సార్....వైస్సార్...వైస్సార్
మె గాద్ బ్లెస్స్ హిం

Anonymous said...

/పక్షులకు మంచిదే...
ఊరి వాళ్ళు విగ్రహాల పక్కన చిన్న చిన్న నీటి తోట్టెల ఏర్పాటు మాత్రం చెయ్యాలి./

haa..haa.haa good suggestion.

katta jayaprakash said...

Infact the concept of 108 and 104 is the best one and it has been serving the people very well the rural section in particular.One should not blame the concept if a few selfish personnel mismanage and misuse it.Infact it should have been in the private sector only for good peformance with the financial assistance from the state.Every concept and policy turns good,bad and ugly depending on the administration and persons involved in it and it is the duty management to rectify the defects and set right the things.There is no meaning in crying at th dark side as there is brighter side too which is set aside due to one reason or other with negative mindset.As rural medicare is the most neglected whatever is done so far is insufficient and still a lot has to be done with many schemes.

JP.

Praveen Mandangi said...

సుధాకర్ గారు. మీరు ఉండేది శ్రీకాకుళంలోనేనా? మా షాప్ కూడా ఏడు రోడ్ల జంక్షన్ కి దగ్గరలోనే ఉంది. అది రద్దీగా ఉండే జంక్షన్. పాత బస్టాండ్ నుంచి RTC కాంప్లెక్స్ కి వెళ్లే ఆటోలన్నీ ఆ రూట్లోనే వెళ్తాయి. అక్కడ ఒక ఫాక్షన్ నాయకుని విగ్రహం పెట్టడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ తొలిగించడం ఎవరికీ అర్థం కాని విషయం.

Unknown said...

if u think jagan is doing all this, no onc ecan save u , meeru ade villagers ni adagaka poyara , sontha money tho chandalu vesukoni petukuntunaru ,fact is fact

ramasai said...

YS statues pettadamlo Elanti Tappuledu.

Everybody speaking about corruption.
1000 Rs. lekunda pooling boothki rani Voterni emi anakunda only political leadears ne tappu badite Adi correct kadu
EE country lo Corruption Cheyani political leaderni Choopinchandi.

Babu gariki Bhajana Chese media friends Istamochinatlu YSR meeda Matladoddu

YS is great because:
1. he is the one and only CM that congress party ee sari gelichinaaa Voodinaa naade bhadyata ani sagarvangaaa prakatinchina hero (congress party Charitralo)

2. presently Ee rastraniki SANI laaga tayarina kontamandi verpatuvaadunalu Dheetuga Edirinchina Mahatmudu YSR
YSR is great
3. last 50 years lo gani future 50 years lo gani Antati dare fellow malli raadu

Sai Abhigna

Ram said...

Raamu garu ee post lo konni maatalu padhalu naku nacha ledu..coz im a hardcore fan of YSR.. యుగ పురుషుడు కాదు, మహాత్ముడూ కాదు. అలాంటి ఆయన కోసం అన్ని విగ్రహాలా? ani meeru antunaru kada at d same time aayana durmargudo leka inkoto inkoto kadu kada..mari meeru enduku inta thakkuva chesi matladuthunaru...oka 1year back ante YSR unnapudu ela undi AP present ela undi meeku ardam avthundi anukunta..d change only bcoz of YSR ru Agree wid me..mari alanti person ni anta teliyaga karevepakula teesipadesaru enty sir..nijam ga naku nachaledu..

Chinna said...

Is there anyone asking for NTR statue?

People loved YS.

Regarding corruption,

Our leaders Babu,Chiranjeevi,KCR,
YS had allegations.
Who is saint here?

Babu,Chiru or KCR?

premade jayam said...

వై ఎస్ విగ్రహాల జాతర కొడుకు పెట్టబోయే పార్టీ ప్రచారం కోసం. ఇప్పుడు వాళ్ళ హవా నడుస్తోంది కాబట్టి అవి వెలుస్తాయి. మరొకళ్ళ హవా నడిచినపుడు అవి మట్టి కొట్టుకు పోతాయి. విగ్రహాల గురించి ఏడవటం కాకుండా కొడుకు రాజ్యం రాకుండా చూడటానికి ఏదయినా చేయండి. కనీసం తెదేపా ప్రభుత్వం వచ్చేట్లు చూడండి.

Saahitya Abhimaani said...

Good post and varied opinions. Thats India!

In my view, if we respect any leader (not necessarily faction leader)we should not erect statues as we are insulting the people whom we are thinking that we are respecting by erecting a statue. This is because nobody cares for the statues after erection, No maintenance, no cleaning, Birds use the statues you know for what. Over a period of time, then then citizens will wonder (if the present statues survive the vagaries of weather that long, as I am sure all these statues are erected with cheap materials, corruption there too!)"ఎవడ్రా వీడు" అదే మాట రకరకాల యాసతో

It is simply cheap politics thats prompting the present statues spree. Its high time, Courts(as present Govt is incapable to take any action without high command handing down its orders) take this issue suo motto and pass strictures against the State Government for not caring to bring out suitable guidelines.

పూర్ణప్రజ్ఞాభారతి said...

నన్ను తప్పు అర్థం చేసుకున్నరు. నేను మన రాష్త్రాన్ని అస్సలు పర్యతించని, తన రచనలలో దీనీ పేరు కూదా ప్రస్తవించని అంబెద్కర్, సాహూ మహరాజ్ విగ్రహాలు మాత్రం పెట్టవచు కాని ఆరొగ్యస్రి, 108 వంటి సౌకర్యాలు కల్పించిన వ్యక్తి విగ్రహాలు పెట్టకూదదు. మేధావులు ఇలానే ఆలోచిస్తారు కాబొలు అన్నాను కాని రజసెఖర్ అంబెద్కర్ కన్నా గొప్ప అనలేడు. గమనించండి. 108, 104 ఆయన స్వంత ఐడియాలు అనలేడు. సౌకర్యాలు అని మాత్రమే అన్నాను. విగ్రహాలు పెట్టటం తప్పు కాదు అన్నదే నా భావన. ఇది కూదా గమనించండి.

ఇక ఏ మంచి పథకం వచ్చినా దాన్ని అవినీటి దారిలో మళ్ళించడం మనవాళ్ళకు అలవాటే. కాదంటారా?

పూర్ణప్రజ్ఞాభారతి said...

అమెరిక,ఇంగ్లాండ్ వంటి దేశాలలో ఒక వ్యక్తికి విగ్రహం వేయాలంటే అతను మరణించిన తరువాత కనీసం 25 సంవత్సరాలు ఆగాలి. విగ్రహాన్ని స్థాపించటానికి అనుమతులు పొందాలి. మరి మన దేశంలో?.పదిమందిని పోగుచేసి పదివేలు ఖర్చు చేయగల చేవ వుంటే 'ఎలాంటి దగుల్బాజికి' అయినా నడి వీధిలో విగ్రహం పెట్టె వీరాభిమానులు. మార్గాలకు అడ్డంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఈ పోకడలకు అడ్డుకట్ట వేయాలి. పబ్లిక్ ప్లేసులో ప్రకటనల ఉండే హోర్డింగ్స్ కు రుసుము వసూలు చేసినట్లు, వీధుల్లోపెట్టె ప్రతి విగ్రహానికి దానిని పెట్టిన వారినుండి ప్రతి ఏడాది రుసుము వసూలు చేయాలి. వాటిని వాణిజ్య ప్రకటనలగానే పరిగణించి భారి మొత్తంలో(వీధిని బట్టి,కూడలిని బట్టి)స్థానిక సంస్థలు టాక్సు వేయాలి. ఎంతటి వ్యక్తి కి అయినా ప్రజా ధనం తో విగ్రహాలు,స్మారకాలు కట్టే వెసులు బాటు ప్రభుత్వాన్ని వేలే వారికి లేకుండా చట్టం రావాలి.

ilanti nibandhanalu mana daggara koodaa pettavachu. padhati manchide.

Anonymous said...

నెత్తిమీద అర్ధ రూపాయి పెడితే పావలా విలువ చెయ్యని వాడు కూడా,ప్రజాస్వామ్యబద్దంగా రెండు సార్లు ఎన్నిక కాబడిన దివంగత ముఖ్యమంత్రి మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు.భారత దేశములో స్వేచ్చ మరీ ఎక్కువగా ఉన్నట్లుంది.ఈ ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఈ కుల,మత పిచ్చ్చి గాళ్ళు ఎక్కువ అయ్యారు.
విగ్రహాలు పెట్టుకోవడము ప్రజల ఇష్టము.ఎవడో బలవంతంగా పెడితే ఆ గ్రామస్తులు ఊరుకుంటార?అసూయ బాగా పెరిగినప్పుడు ఈ 'రా శే రా' ద్వేషులకి కడుపు మంట పెరిగి ఈ అంతర్జాలములో ద్వేషాన్ని కక్కుతున్నారు. "సత్యమేవ జయతే".

Anonymous said...

@ Srinivasa Rao
"సత్యమేవ జయతే"అంటూ మీ కామెంట్ బాగా ముగించారు. కానీ ఏ 'సత్యం'??
అసత్యాన్ని నాలుగుసార్లు నలుగురిచేత చెప్పిస్తే సత్యంగా చలామనీ అవుతున్న నేటి రోజుల్లో మీరు చెబుతున్న "ఎవడో బలవంతంగా పెడితే ఆ గ్రామస్తులు ఊరుకుంటారా?" అనేది సత్యమా? "విగ్రహాలు పెట్టుకోవడము ప్రజల ఇష్టము, అనేది సత్యమా? విగ్రహాల విషయంలో ఎంత కఠిన నిబందణలు ఉన్నాయో మీకు తెలుసా? ఇన్ని వేల విగ్రహాలలో ఎన్నింటికి నిభందణల ప్రకారం అనుమతులు తీసుకున్నారు? మీరన్నట్లు ప్రజలే స్వచ్ఛందంగా కోరుకున్నారనుకున్నా 'అనుమతులు ' అవసరం లేదంటారా?
సోదరా! మీకు వై.ఎస్ పై ఎంత స్వామి భక్తిని ఉన్నా ఆయనను ఇంకా ఎక్కువగా స్థుతించండి/ ఇవతల వాళ్ళు చేసే కామెంట్లను తగు నిజాలతో ఖండించండి. అంతేగానీ 'నెత్తిమీద అర్ధ రూపాయి పెడితే పావలా విలువ చెయ్యని వాడు కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు....' అంటూ వారిపై వ్యాఖ్యలు చెయ్యడం ఎలా సమర్ధనీయం? 'పావలా విలువ చెయ్యని వాడు' అని మీరనుకుంటున్న వారిలో ఎవరి విలువ ఎంతో నిజంగా మీకు తెలుసా? ఇది విఙతతో కూడిన వ్యాఖ్య అని మీరు భావిస్తారా?
ప్రజాస్వామ్యబద్దంగా రెండు సార్లు ఎన్నిక కాబడిన దివంగత ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చెయ్యకూడదని మీరు భావిస్తే అదేవిధంగా ఎన్నికైన 'లాలూ' గారి దాణా కుంభకోణాన్ని, అక్రమ ఆస్థుల వ్యవహారాన్నీ కూడా అలాగే ఒదిలెయ్యాలా? కోర్టుల్లో నిరూపించబడనంత మాత్రాన అసత్యాలన్నీ 'సత్యా'లైపోతాయా? మన నాయకాగ్రేసరులకు ఉన్న చావు తెలివితేటలతో 'సాక్ష్యం' దొరకకుండా అవినీతికి పాల్పడ్డా మీదృష్టిలో నీతిమంతులే అయిపోతారా?
మనలో ఎంత చదువుకున్న వాళ్ళమైనా (బహుశా నాతో,మీతో సహా) వ్యక్తి ఆరాధనా (లేదా ద్వేష) భావన ఎంతగా పాతుకుపోయిందంటే - నచ్చినవాడిలో ఏ తప్పూ కనపడదు, అదే నచ్చని వాడిలో అన్నీ తప్పులే కనిపిస్తాయి. కానీ, వాస్థవాలను వాస్థవాలుగా గుర్తించే సెన్సిటివిటీ ఎటుపోతొంది?
మన భార్యా పిల్లల్లోనే అన్నీ మనకు నచ్చవు. ఏవో లోపాలను ఎత్తి చూపుకుంటుంటాం. అలాంటిది ఎవడో ఒక నాయకుడు కోసం మాత్రం దేవుడని ఒకరంటే దయ్యమని ఒకరం అంటూ వాదులాడుకుంటున్నాం. ఇంకా ఆశ్చర్యకరం. వై.ఎస్ కోసం ఎవరైనా మరణించడం అంటూ జరిగితే అది మొదటగా విజయమ్మ గానీ, జగన్ గానీ, శర్మిళ గానీ అయ్యుండాల్సింది. ఎందుకంటే అంత దగ్గరగా ఆప్యాయతను అందుకున్న వాళ్ళు వారు. లేదూ, అలా కాదు మరణించిన వాళ్ళందర్నీ (చనిపోయిన కొందరు ప్రజల లేదా ఆయన పధకాల లబ్ధిదారుల లాగానే) ఆయన సొంత కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా చూసుకున్నారు అనే లాజిక్ ను కాసేపు నిజమనుకుందామంటే మరి 450 (అధిష్టాణం లెఖ్ఖ)నో లేక 700(జగన్ లెఖ్ఖ) మందో నే ఎందుకు చస్తారు? ఐ మీన్, ఆ 450/700 మంది పై ఇంకా ఎక్కువ ప్రేమ ఆయన ఎలా చూయించియుంటారు? అంటే అలా చెప్పబడుతున్న వాళ్ళందరూ పరిస్థితులను జీర్ణించుకోలేని బలహీణ హృదయులు గా భావించవద్దా? అందులోనూ వివిధ కారణాలవల్ల హటాణ్మరణం పాలైనవాళ్ళను కూడా వై.ఎస్ లెఖ్ఖలో జమకట్టడం వల్ల తరువాత్తరువాత ఎటువంటి విపరీతాలకు దారి తీసాయో మనకు తెలియదా? ఒక నాగరిక సమాజంలో ఒక నాయకునికోసం ఇంతమంది చనిపోయారని చెప్పుకోవడం & ముందు ముందు మరింతమంది చనిపోయేలా ప్రోత్సహించడం మనందరం సిగ్గుపడాల్సిన విషయం కాదా?
ఆయన మరణం తట్టుకోలేక చనిపోతున్నామని పబ్లిక్ గా వీధిలో కొచ్చి/ లేఖ వ్రాసి చనిపోయిన వాళ్ళను (అది సమర్ధనీయం కాదనేది వేరే విషయం) మాత్రమే పరిగణన లోకి తీసుకొంటే నిజమైన వై.ఎస్ అభిమానుల లెఖ్ఖ ఎంతో తేలుతుంది. అలాంటి వారికైనా ఓదార్పులూ, ఆర్ధిక సహాయాలూ చేయడం మాత్రం సమర్ధనీయం కాదు. ఇలాంటివన్నీ ఎక్కడికి దారితీస్తాయో, జగన్ మహబూబాబాద్ యాత్రను అడ్డుకున్నందుకు ఒకరు, మా ఊరుకు రాలేదంటూ మరొకరు, బాబును బాబ్లీ డ్రామాలో అరస్ట్ చేసినందుకు ఇంకొకరు చావడాలు లాంటివి చదువుకుని మేధావులుగ చలామణీ అవుతున్నా మీ/ మనలాంటివాళ్ళం ఎలా సమర్ధించగలం?

Anonymous said...

//అసత్యాన్ని నాలుగుసార్లు నలుగురిచేత చెప్పిస్తే సత్యంగా చలామనీ అవుతున్న నేటి రోజుల్లో//

అదేట్ట?ఈ రోజుల్లో అయిన ఏ రోజుల్లో అయిన అసత్యము ముందర ప్రచారంలోకి వస్తుంది. నిజము నిలకడ మీద తెలుస్తుంది.ఈ రామోజీ రావు ,ఈ తలకమాసిన మీడియా ఉన్నంత వరకు అసత్యాలు చాలా త్వరగా లోకాన్ని చుడతాయి.
నిజము తెలియడము కొంత ఆలస్యము జరగా వచ్చు కాని,చిట్ట చివరికి సత్యముదే విజయము.ప్రజలకు తెలుసు ఎవడికి ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్ట్టాలో.
"సత్యమేవ జయతే".

Ram said...

Wammo....108 YSR innovation ani nammesee janalu mana educated samajam lo unnarante asharyanga undi..at the same time bhayanga vesthondi...chivaraki samajam mida ashyam vesthondi...

ee kula pichchi tho factionists ni devudalani cheyadam enot...

chuss! jeevitham.

VIZBHASKAR said...

రాష్త్రాన్ని అన్నిరకాలిగానూ భ్రష్టు పట్టించిన మనిషిని మహా నాయకుడిగా కీర్తించడం మన దౌర్భాగ్యం.

మార్గం రాజేంద్ర ప్రసాద్ said...

విగ్రహాల పిచ్చి..... ముదిరితే ఏమౌతుందో మరి?

Sudhakar said...

నాయనా శ్రీనివాస ! నీ బుద్ధి చెడి పోవడానికి ఒకటి నీ కులంతో గాని, మతం తో గాని ఆ మహానుభావుడితో లింకు వుండాలి...లేదా నీకేదో లబ్ధి చేకూరి వుండాలి...దేశం ఎలా పోతే నీకేంటి నాయనా? టాక్స్ కడుతున్నావా?

Sudhakar said...

శ్రీనివాస : ఒక పక్క సత్యమేవ జయతే అనటం మరో పక్క ఈ ఇంటర్నెట్లో స్వేచ్చ ఎక్కువైపోయిందని వాపోవటము నీకే చెల్లింది...

Unknown said...

@sudhakar,

meeru annattu YSR to benifit pondina valle statues pettali ante...

state lo chala mandi ayana schemes valla direct benifit pondina valle..... with no previous govt or no other govt in the country, ppl benifited so much....

on other note, these schemes are invented by YSR or funded by his own money..... im just replying to ur comment that benificiaries alone support YSR.

ika jagan tour antara.a... its all part of politics.... there is nothing wrong or right.....

karlapalem Hanumantha Rao said...

విగ్రహాల వెనక జగన్ ఆగ్రహం వుంది. జనాల అనుగ్రహం కోసం అతను పడే తహతహ వుంది.జనాల కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులూ నిజానికి ఇప్పుడెవరూ లేరేమో !..తమ కోసం జనాల ప్రాణాలను ఫణంగా పెట్టమని అడిగేవారు తప్ప !నాలోకం బ్లాగ్ లో నేను ఈ ఓదార్పు యాత్రల మీద ఒక వ్యంగ్యం రాసుకున్నాను. ఆసక్తి వున్నవారు చూడవచ్చు

Unknown said...

I agree with you that this many statues are not needed.

The problem is limited to traffic only now, if the statue location is bad.

The real problem comes, when some one (Ex-Party) throws mud/chappal on the statue or breaks the statue.

Since there are thousands of statues, the chance is more.

police/govt or some one should think in this way as well.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి