Friday, October 22, 2010

గందరగోళంగా మారుతున్న Studio-N నిర్వహణ

కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయక ఒకదాని పని మరొకటి చేస్తే...పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో...ఎంత మంది బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు Studio-N ఛానల్ నిర్వహణను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకైనా పనికిరాకపోతుందా అని నార్నే వారు ఆ ఛానెల్ పెట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆయన తన అనుంగు మిత్రుడు అభీష్ట అనే నాన్ జర్నలిస్టుకు పగ్గాలు అప్పగించి...తెలుగు దేశాన్ని పసుపు పచ్చగా మార్చి ఆనక దున్నుకో...అని వదిలేసారు. 

అభీష్ట గారు తన మనోభీష్టానికి అనుగుణంగా  రెండు నెలలకొక పెద్ద తలకాయను మారుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాడు. వీళ్ళకు దొరికిన బకరా జర్నలిస్టు....కందుల రమేష్. ఈయన, తన మిత్రులతో కలిసి అందులోకి వెళ్ళకపోతే...ఈ ఛానల్ ఈ పాటికి కింది నుంచి పది స్థానాలు తానే ఆక్రమించేది. అనవసరంగా....దీనికి తెలుగుదేశం గజ్జి వుందని తెలిసీ రమేష్ అక్కడ చేరారు. వై.ఎస్.పోయాక చంద్రబాబు భజన ఎక్కువై...ఈ ఛానల్ యాజమాన్యం జర్నలిస్టుల మీద వేటు వేయడం ఆరంభించిందని  ఆరోపణ. 

ఈ క్రమంలో అక్టోబర్ 11 న మూకుమ్మడిగా 49 మంది ఉద్యోగులకు  (అందులో కొద్ది సంఖ్యలో జర్నలిస్టులు, పెద్ద సంఖ్యలో గ్రాఫిక్ ఆర్టిస్టులు, వీడియో ఎడిటర్లు తదితరులు ఉన్నారు) మార్చింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ జీతాలు ఎక్కువయ్యాయి...భరించలేం... అని చెప్పి వారికి పదిహేనో, నెల రోజులో జీతం ఇచ్చి వెళ్లి పొమ్మని చెప్పారని తెలిసింది. 

పదమూడో తేదీ నుంచి కందుల రమేష్ ఆఫీసుకు రావడం లేదని కూడా చెబుతున్నారు. ఈ లోపు జర్నలిస్టులు ఉద్యమం ఆరంభించారు. కార్మిక శాఖ మంత్రిని, లేబర్ కమిషనర్ ను ఇతరులను కలిసారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మనికొండ లోని ఆ ఛానెల్ ఆఫీసు దగ్గర టెంట్ కూడా వేసారట. ఎన్.టీ.ఆర్.ట్రస్ట్ భవన్ దగ్గర భిక్షాటన చేస్తామని ఒక జర్నలిస్టు ఫోన్ చేసి చెప్పారు.

ఇది పక్కా తెలుగు దేశం ఛానెల్ కాబట్టి...ప్రభుత్వం మోచేతి నీళ్ళు తాగే కొందరు నేతలు...చాన్నాళ్ళ తర్వాత జర్నలిస్టులకు అన్యాయం జరిగందహో....అని వైరి ఛానెల్స్ కు బైట్లు ఇస్తున్నారు. జర్నలిజాన్ని నమ్మి ఈ వృత్తిలో చేరిన వారు, వారి కుటుంబీకులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఇది ఈ ఒక్క ఛానల్ కు పట్టిన రోగం కాదు....దాదాపు అన్ని ఛానెల్స్ ఇలానే ఏడ్చాయి. ఉద్యోగులను ఘోరంగా తీసేస్తున్నాయి. ఈ పని ఏ ఛానల్ యజమాని లేదా సీ.ఈ.వో. చేసినా....తప్పే.
---------------------------------------------
కొసమెరుపు: ఉద్యోగులను ఎడాపెడా తీసేసే ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులకు శిక్షలు ఇక్కడే పడుతున్నాయని అబ్రకదబ్ర పరిశోధనలో తేలింది. ఒకటి, రెండు, మూడు ఛానెల్స్ పెట్టిన ఆయన ఇలా దారుణంగా ఉద్యోగాలు పీకాక...షుగర్ లెవెల్ పెరగడం, కన్న కూతురు బార్ల వెంట బాయ్ ఫ్రెండ్స్ తో చెలరేగడం...ఆనక ఆసామికి మనశాంతి పోవడం జరిగిందట. ఇంకొకరిద్దరు మహానుభావులు...వాడ్ని పీకేయండి...వీడని పీకేయండి...అని హుకుం జారీచేసి అనారోగ్యం పాలై...ఆసుపత్రి పాలయినట్లు కూడా మా వాడు గమనించాడు. ఇందుకు కనీసం ఐదు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.  ఎడిటర్లు....మన పాపాలకు "శిక్షలు" ఇక్కడనే పడుతున్నాఏమో జర భద్రం.

7 comments:

astrojoyd said...

ఎడిటర్లు....మన పాపాలకు "శిక్షలు" ఇక్కడనే పడుతున్నాఏమో జర భద్రం--well said.very xperienced editors r also doing this.Its very sad to say this sir.some ceo s r acting like robos in the hands of other channels reporters now a days.Iam one of the victim of such incidents,they have not paid my net-bills,fax bills nd 45days salary.మీరు రాసినవిధంగానే వారు ఇక్కడే తమ పాపఫల్లాలను తప్పక అనుభవిస్త్తారు.ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.

Anonymous said...

@"ఉద్యోగులను ఎడాపెడా తీసేసే ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులకు శిక్షలు ఇక్కడే పడుతున్నాయని అబ్రకదబ్ర పరిశోధనలో తేలింది"
అన్నయ్యా! ఈ అబ్రకదబ్ర పేరుమాత్రం మీకు భలేగా ఉపయోగపడుతోంది?:) అయినా మీరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆ సదరు ఆసామి ఎవరో మాకు ఇట్టే తెలిసిపోయిందిలే:) 'N' Times అబ్రకదబ్ర పేరు వాడాక ఆ 'N' లాజిక్ మాకు తెలియకుండా ఎలా వుంటుందన్నయ్యా?!

Prashant said...

write the names of those biggies...if you guts in your pants...if you piss off there is no point in declaring yourself as daring man.take care!

kvramana said...

I completely sympathise with the friends in the channel. I was also a victim longback when AP Times was abruptly shut down. But, let me caution you on a danger with this campaign against the channel. The employees will further suffer if the news about the channel being in trouble spreads out. In our case, after the AP Times closure, we could not even get hand loans from best of the friends since they were worried that we would not be able to pay back. My house owner (I was a tenant that time) asked me to assure that I will be able to pay the rent promptly. One of my friends who had given me some Rs 2,000 came to me to ask for that money the day the news about the closure was published in Indian Express. He told me upfront that there would be a solvency problem since we would not get our salaries hence wanted to get his money back. So, my advise is to restrain from attacking the channel which would be counterproductive for the employees there.
Let me also tell you that these labour courts will do nothing but to waste our time and energies. Also tell them that they should not pin hopes on the union leaders. Dont be surprised if they strike a deal and forget the victims. I suspect the same happened with us in AP Times. it will be better if they can either strike a deal with the management for some severence package or file a case in the court. What happens after a case is filed in the court is a different story and I will definitely write about it once they reach that stage.
K V Ramana

Sasidhar said...

ఇది చాలా భాధాకరమైన విషయమే అయినప్పటికీ, జర్నలిస్టు మిత్రులు కూడా ఎక్కువ జీతాలకు ఆశపడి కొత్త కొత్త కంపెనీల్లో చేరేటప్పుడు కొంత జాగరూకత వహించడం ఎంతైనా అవసరం. లోకేశ్ లాంటి ఫారెన్ ఎడ్యుకేటెడ్ అక్కడ చదువేం వెలగపెట్టాడో కానీ, ఈ హైరింగ్ , ఫైరింగ్ కాన్సెప్ట్ మాత్రం బాగా వంట పట్టించుకున్నాడన్న మాట.

~ శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.com

Saahitya Abhimaani said...

In this very channel the participants of so called political "discussion" came to fist fights and it was shown in Times Now channel.

The person you have adjudged as best anchor was just looking on while participants were fighting like hooligans in the studio before live cameras. The channel shamelessly continued to telecast the entire fight live from their studios instead of cutting it off at the very hint of physical violence.

I was just wondering when this kind of fight would take place in TV studios, with the fellows that are called Anchors egging on the participants like the lookers on in a Boxing match.

May God save Media, if these bunch of morons can be called Media.

Ravi said...

Hi Ramu Gaaru,

My Wife is working in ABN Andhra Jyothi. The Management is askig the employees(Some of) to resign their job. Nut employees are not ready, So, they have prepared some list of employee. so, that is going to come soon. the expected number would be 70-100 employees

Ravi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి