Tuesday, October 26, 2010

ఛానెల్స్ పిచ్చికుక్కల రేసు: ఇద్దరు జర్నలిస్టులు బలి

పుట్టగొడుగుల్లా  పుట్టుకొస్తున్న టీ.వీ.ఛానెల్స్ లో పరిణామాలు జుగుప్సాకరంగా మారాయి. డబ్బు కోసం కొన్ని ఛానెల్స్ జర్నలిజాన్ని ఫణంగా పెట్టి ఏ దారుణానికైనా ఒడిగడుతుంటే... మరికొన్ని ఛానెల్స్ వైరి ఛానెల్స్ ను ఇరుకున పెట్టేందుకు ఏ నీచానికైనా దిగజారుతున్నాయి. అలాంటి వ్యవహారమే విశాఖ లో ఈ మధ్య జరిగింది. దీనివల్ల ఇద్దరు విలేకరులు కటకటాలపాలయ్యారు. ఈ అంశంపై ఒక సీనియర్ జర్నలిస్టు పంపిన కథనం యథాతథంగా మీ కోసం.....
---------------------------------------------------------------------------------------
కలానికి సంకెళ్లు వేసిన ఖాకీల కథ ఇది. రేటింగ్స్ రేసులో ఆధిపత్యం కోసం రంకు భాగోతాలు చూపే ఓ ఛానల్ దుర్మార్గం ఇది. ఖాకీల కుట్రకు జైలుపాలైన ఆ బాధితులు ఈటీవీ విశాఖపట్నం రిపోర్టర్ శ్రీరాం రెడ్డి, ఎన్టీవీ సింహాచలం-పెందుర్తి కంట్రిబ్యూటర్ శ్రీధర్.

2010 ఏప్రిల్ నెల, NTV ప్రధాన కార్యాలయం నుంచి విశాఖపట్నంలో రిపోర్టర్ గా పనిచేస్తున్న శ్రీరాంరెడ్డికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. విశాఖ నగర శివార్లలో "శారదా పీఠం" పేరుతో ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకున్న ఓ కబ్జాకోరు స్వామీజీ గురించి లోతైన పరిశీలనతో ఓ కథనం కావాలని ఆ ఫోన్ కాల్ సారాంశం. స్వామీజి ఇంటర్వ్యూ తీసుకుని, ఆయనపై ఉన్న ఆరోపణలకు సమాధానాలు కూడా రాబట్టాలని సూచించారు. కొన్ని ప్రశ్నలను కూడా suggest చేశారు. Head Office ఆదేశాలకు అనుగుణంగా ఆ స్వామీజీ వెంటపడి ఇంటర్వ్యూకు appointment తీసుకున్నారు. ఇందుకోసం స్థానిక NTV కంట్రిబ్యూటర్ శ్రీధర్ చాలా ప్రయాసపడ్డాడు.

మొత్తానికి ఆ స్వామీజీ interview దొరికింది. ముందుగా అనుకున్నట్టే అన్ని ప్రశ్నలను శ్రీరాంరెడ్డి సంధించాడు. దానికి ఆయన తనను తాను సమర్థించుకుంటూ, తప్పును అంగీకరిస్తూ డొంకతిరుగుడు సమాధానాలిచ్చాడు. ఆ ఇంటర్వ్యూను యథాతథంగా హైదరాబాద్ పంపించేశాడు. ఆ మర్నాటి నుంచి రోజువారీ పనుల్లోపడి ఇద్దరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ ఇంటర్వ్యూ తమ కొంప ముంచుతుందని, కటకటాల వెనక్కి నెడుతుందని కలలో కూడా ఊహించలేకపోయారు.

శ్రీరాం కొన్ని కారణాల వల్ల 2నెలల క్రితం NTVకి resign చేసి పాతగూటికి(ETV)కి చేరుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. 22, అక్టోబర్, 2010. మధ్యాహ్నం శ్రీరాంరెడ్డి ఏదో వార్త కవరేజికి విశాఖ కలెక్టరేట్ కి వెళ్లి తిరిగొస్తున్నాడు. పోలీసులు అతన్ని ఆపి జీపెక్కమన్నారు. కారణమేంటని ప్రశ్నిస్తే.. మీమీద ఓ కేసుంది, మాట్లాడాలి పదండి అంటూ పెందుర్తి పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కొత్తగా విడుదలైన ఓ సినిమా చూసి ఇంటికి తిరిగెళ్తున్న శ్రీధర్ (కంట్రిబ్యూటర్)ను కూడా ఇదే రీతిలో స్టేషన్ కు తీసుకెళ్లారు. విషయం ఏంటి అంటే ఏమీ చెప్పకుండా కాసేపటికే జీపు ఎక్కించేశారు. జీపులో ఉండగా మీమీద శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజి కేసు పెట్టారు. IPC 385, 506 సెక్షన్ల ప్రకారం కేసుంది అని ఓ కానిస్టేబుల్ చెప్పాడు. ఆ సమాచారాన్ని శ్రీధర్ తన immediate బాస్ కు  చెప్పాడు. అప్పటికి కోర్టుకు తీసుకొచ్చే మార్గంలో ఉన్నాడు. స్వామీజీ పెట్టిన కేసేంటో, ఎందుకు అరెస్టు చేశారో తెలియదు. పాత్రికేయులంతా ప్రతిఘటించే సమయం కూడా లేదు. ముందు బెయిల్ కోసం ప్రయత్నించాలి. అప్పటికప్పుడు తెలిసిన ఓ న్యాయవాది (అతను ఈటీవీ లీగల్ కంట్రిబ్యూటర్)ని సంప్రదించి బెయిల్ కోసం అడిగారు. ఆయన వెంటనే ఆ రెండూ బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి అందుకు తగ్గట్టుగా బెయిల్ అప్లికేషన్ రెడీ చేసుకున్నాడు. ఈలోపు ఇద్దరినీ కోర్టుకు తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. remand report చూస్తే తెలిసింది అసలు విషయం. FIRలో ఈ ఇద్దరి పేర్లూ లేవని, memo ద్వారా తదుపరి దర్యాప్తు పేరుతో ఈ ఇద్దరి పేర్లను ఇరికించడమేకాదు, IPC 505 clause (2)&(3) చేర్చారని తెలిసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లున్న కేసుకు సాధారణ బెయిల్ అప్లికేషన్ సరిపోదు. APPకి నోటీసు ఇవ్వాలి. కానీ అప్పటికే పోలీసులు ఆమెను కోర్టులో లేకుండా పంపించేశారు. ఫోన్ చేసినా దొరకనంత దూరంలో ఆమె ఉన్నారు. దీంతో బెయిల్ సాధ్యపడలేదు. ఇద్దరికీ కోర్టు రిమాండ్ విధించడంతో విశాఖపట్నం Central Jailకి వెళ్లక తప్పలేదు.

అసలు ఈ కేసులు, సెక్షన్లు ఏంటా అని ఒక్కసారి ఆరా తీస్తే.. Remand Reportలో పేర్కొన్న అంశాలివి. 2010 జూన్ 1న NTV స్వామీజీని నిందిస్తూ ఓ కథనం ప్రసారం చేసిందట. ఆ కథనం కంటే ముందు NTVకి చెందిన ఇద్దరు మార్కెటింగ్ ఉద్యోగులు స్వామీజీని paid slot కోసం అడిగారట. కోటి రూపాయలు లేదా యాభై లక్షల విలువైన slot కొనుగోలు చేయాలని, లేని పక్షంలో స్వామీజీని కించపరిచేలా కథనాలు ప్రసారం చేస్తామని ఆ మార్కెటింగ్ ఉద్యోగులు బెదిరించారట. దీంతో స్వామీజీ ఓ చవకబారు ఛానెల్ ను ఆశ్రయిస్తే.. వారి సలహామేరకు స్వామీజీ మార్కెటింగ్ ఉద్యోగులకు ఫోన్ చేశారట. ఆ సంభాషణ record చేశారట. అందులోనూ మార్కెటింగ్ ఉద్యోగులు యాడ్ ఇస్తావా లేక వార్తను ప్రసారం చేయాలా అని బెదిరించారట. అందుకని వారిమీద చర్యలు తీసుకోవాలని స్వామీజీ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పెందుర్తి పోలీసుస్టేషన్ కి బదిలీ చేస్తే ఆగస్టు 1న ఇక్కడ నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు పేరుతో పోలీసులు మళ్లీ స్వామీజీ ఆశ్రమానికి వెళ్లి, కొందరు సాక్షుల statements తీసుకున్నారు. వాటి ఆధారంగా మరికొందరు నిందితులు ఇందులో ఉన్నారని, ఆ ప్రకారం ఇంటర్వ్యూ చేసిన శ్రీరాంరెడ్డిని, ఇంటర్వ్యూ కోసం వెంటపడిన శ్రీధర్, విశాఖ బ్యూరో ఇంచార్జిగా ఉన్న ప్రదీప్.. ఇలా తోచిన పేర్లను ఇరికించుకుంటూ వెళ్లారు. ఇది జరిగి కూడా చాలా రోజులైంది. అకస్మాత్తుగా ఏం జరిగిందో ఏమో.. అక్టోబర్ 22న, శుక్రవారం సాయంత్రం శ్రీరాంరెడ్డిని, శ్రీధర్ ను నాటకీయంగా అరెస్టు చేసి జైలుపాలు చేశారు. బెయిల్ దొరక్కుండా పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. శని, ఆది వారాలు సెలవులు కదా.. రెండు రోజులు కచ్చితంగా జైల్లో ఉండాల్సిందే.

ఇక్కడ శ్రీరాంరెడ్డిగానీ, శ్రీధర్-గానీ చేసిన తప్పేంటి? విధి నిర్వహణలో భాగంగా స్వామీజీని interview చేయడమా? interviewలో స్వేచ్ఛగా అతనిపై ఉన్న ఆరోపణల గురించి అడగడమా..? స్వామీజీ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావించనే లేదు. ఎవరైతే paid slot కోసం డిమాండ్ చేసారో వారి పేర్లనే పేర్కొన్నాడు. FIRలో కూడా ఆ పేర్లు మాత్రమే ఉండగా మధ్యలో ఈ పేర్లను ఎందుకు చేర్చాల్సి వచ్చింది..? వీటికి పోలీసులిచ్చే సమాధానం - రిపోర్టర్లు స్వామీజీని రిపోర్టర్లే బెదిరించారని, ఇందుకు ఫోన్-కాల్ డాటాయే ఆధారమని అంటున్నారు. విధి నిర్వహణలో ఏ రిపోర్టర్ కూడా ఇకనుంచి ఎవరికి ఫోన్ చేసినా బెదిరించినట్టేనా..? ఇదంతా పక్కనపెడదాం.. marketing ఉద్యోగులకు ఫోన్ చేసి voice record చేయడంలో దురుద్దేశం ఎవరిది? NTVతో పోటీపడి గెలవలేని ఓ ఆవారా ఛానెల్ బరితెగింపు కాదా..? సరే record చేసారు. ఇంతకీ అందులో ఏముంది..? మార్కెటింగ్ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా అడిగారే తప్ప వాస్తవానికి అందులో "యాడ్ ఇవ్వకపోతే వ్యతిరేకంగా వార్త ఇస్తాం" అని లేదు. అలా చేసే అధికారం, అవకాశం కూడా మార్కెటింగ్ ఉద్యోగులకు లేదు. కానీ అవేవీ పోలీసులకు పట్టవు కదా. పోనీ మార్కెటింగ్ ఉద్యోగులు తప్పే చేశారనుకుందాం. మరి శిక్ష శ్రీరాంరెడ్డికి, శ్రీధర్ కి ఎందుకు? స్వామీజీ ఫిర్యాదులో లేనివారిని పోలీసులు ఎందుకు మధ్యలోకి లాగారు? పోనీ శ్రీరాంరెడ్డి, శ్రీధర్ లు కూడా స్వామీజీని బెదిరించారా..? వార్తను file చేసిన తర్వాత బెదిరించే అవకాశం వారికి ఉంటుందా..? వార్తను ప్రసారం చేయకుండా ఆపడం, లేదా ప్రసారమయ్యేలా చేసే అధికారం వారిద్దరికీ ఉన్నాయా..? ఈ ఇద్దరి అక్రమ అరెస్టుపై ఆగ్రహించిన పాత్రికేయులంతా విశాఖ CPని నిలదీస్తే వచ్చిన ఏకైక సమాధానం మాది unpleasant job, that much i can say అన్న సమాధానం ఒక్కటే. అంటే ఏంటి అర్థం..? కావాలని ఇబ్బందిపెట్టాలనే దురుద్దేశంతో బక్కవాడిపై చూపిన ప్రతాపం కాదా..? కోర్టు, human rights commissionలో నిజానిజాలు తేల్చుకోవచ్చు. కానీ అంతవరకు ఈ ఇద్దరూ జైలు కూడు తినక తప్పలేదు కదా..? చివరకు ఇవాళ బెయిల్ రాకుండా చేసేందుకు CD fileను కోర్టుకు సమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. అలా మొత్తానికి మనవాళ్లు మరో రోజు జైలు జీవితాన్ని గడపక తప్పడం లేదు.

10 comments:

oremuna said...

ఇంత వ్రాసిన వారు ఆ చవకబారు చానల్ పేరు కూడా వ్రాసి ఉండాల్సింది. ఆంద్రజ్యోతి నా ?

Vinay Datta said...

the marketing people might have softly and indirectly mentioned that the swamiji would be defamed in case he didn't yield to their demand. rajasekhar had already done that.

Thirmal Reddy said...

These are the repercussions of the ugly media war between NTV and ABN Andhra Jyothi. NTV's sting operation on Swaroopananda and ABN's sting operation on NTV's sting, and each other's vengeance tactics, finally landed Sriram and Sridhar in jail. Damn with these media bas****ds. Infact, the real culprit behind this is Rajashekar. It was his mindless idea to do the sting. I wonder how channel bosses believe such crooks and let them in, who are already infamous for their antics in Inews. This was the same fellow who ditched journos and tech staff who trusted him in Inews. Now at his behest, Sriram and Sridhar filed a story and stung themselves. I'm sure there are many such untold stories.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Chittoor Murugesan said...

గురువుగారూ,
నేను మాజీనే (విలేకరి) .విలేకరులను భలి పశువు చేసే సంస్థలు ఉన్నవి.లేదనను.కాదనను.కాని అన్నం పెట్టే తల్లివంటి సంస్థలను కూల్చే విలేకరుల గురించి కూడా వ్రాస్తే మీ నిజాయితీ ఇరుముడిస్తుంది

Anonymous said...

రామూ!
నిజమే బ్రదర్. ఒక్క మీడియాలోనే కాదు ఏ రంగంలో అయినా ఇదే పరిస్థితి. తన పని తాను సిన్సియర్గా చేసుకుంటూ, తనకిచ్చే నాలుగు రాళ్ళకూ న్యాయం చేయాలనుకునేవాడే లోకువ ఈఎ వెధవ యాజమాన్యా(యా)...ళ్ళకు. అరెస్టైన మిత్రులకు మనందరి సంఘీభావం అవసరం.
ఇక, ఆ పీఠం 'శారదా పీఠం' అని ఎటూ వ్రాసేసాక, మళ్ళీ ఓ స్వామీజీ ఎందుకు? ఆయన దాని అధిపతే అవుతాడుగా?
ఇక పెయిడ్ స్లాట్ గురించి బ్లాక్‌మెయిల్ చేసింది 'ఎన్ ' టీవీ వాడనీ, దాన్ని వాయిస్ రికార్డ్ లాంటి రసవత్తర ట్విస్ట్‌లతో వాడుకోవాలని చూసింది ఓ 'దమ్మున్న్న' (ఉన్నది దమ్మా లేక ఆయాసమా అన్నది వేరే విషయం???) చానల్ అనికూడా అందరికీ తెలుసు. ఆ మధ్య ఓ మూడు రోజుల రంజీ మ్యాచ్ ఆడుకున్నరుగా వీళ్ళిద్దరూనూ:) కానీ పాపం ఈ మ్యాచ్‌లో ఇద్దట్లో ఎవరూ కాకుండా రెఫెరీ గా ఉన్న స్వామీజీ అవుటైపోయాడు/ పరువు పోగొట్టుకున్నాడు. లేకపోతే ఎంతో మందికి 'ఙాన బోధ'లు చేసే స్వామీజీ అమాయకుడిలాగా ఆ చానల్ వాడు నాకు అన్యాయం చేస్తున్నాడహో అంటూ మరో చానల్ వాడి దగ్గరకెళ్ళడమేంటీ? పళ్ళూడగొట్టిచ్చుకోడానికి ఏ రాయయితేనేం అన్నట్లు - టైర్‌కింద వేసి తొక్కడానికి ఏ ఓబీ వ్యాన్ అయితేనేం? హ హ్హ హ్హ .....

Pavani said...

Was it any time proved that Swamiji did anything wrong? I saw his interview and he sounded much sincere and candid. I can not believe jouralists view at face value. I agree they are only pawns and real culprits are at large.

katta jayaprakash said...

I agree with Madhuri garu.Most of the times the ad marketing people with the consent of the reporters play games with the customers even though they say that ads are nothing to do with the news coverage.This trend is seen in every media house there is nothing to get surprised.
The state govt has given clean chit to Chiranjeevi Blood bank but the print media has covered the news in the inside page with little space whreas when a few selfish people went to media to critcise the blood bank and it's operations the print and TV channels had given wide coverage for days together.But the news of clean chit has gone inti inside page with four or five lines except Andhra prabha which has given good coverage on the last page.This is the culture of our media!Where are you CEOs of media houses?

JP.

Placement Seekers said...

Settlementlu chese jounalistlani entha mandini choodaledu. Dorike varaku andaru dorale.. dorikaka donga lavutharu...kani media vallu dorikaka journistla union ani, apwju ani, senior journalistla peruto khali ayipoyina refill lanti vallani choopinchi..blackmail chestharu....Idi prekshakudiga naa spandhana....kadu media ante chalu ee tappu cheisnaa chellutundi anthara then no comments from me inthaka mundudantha venakki teeseskunta.....

Anonymous said...

yeah the name of that channel should've been mentioned...which channel is dat?

akula naresh said...

very much unnatural nd one sided story,journo guys are attempting to various blackmailing nd fitting response like dis is always welcome,abn is much worse,,comparison goes in a way which is more worse

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి