Thursday, September 30, 2010

నిజంగానే...బ్రహ్మాండం బద్దలు కాబోతున్నదా?

సెప్టెంబర్ 30, 2010
సమయం: 2.35-2.55 మధ్యన 

ఇంకొద్ది సేపట్లో అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో కోర్టు తీర్పు రాబోతున్నది. జనంలో ఏదో తెలియని భయం, ఉద్విగ్న పరిస్థితి. ఇది భారతావనికి పట్టిన దుస్థితి. 

అదిగొండి...TV-9 వాడు అప్పుడే చార్మినార్ నుంచి లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఢిల్లీ నుంచి వాళ్ళ ప్రతినిధి కూడా మాట్లాడుతున్నాడు. తీర్పు వస్తే ఎలా ప్రవర్తిస్తారు? అని ఆయన ఎవరినో అడుగుతున్నాడు. 'అంతా సంయమనం పాటించండి' అని అన్ని ఛానెల్స్ పదే పదే చెబుతుంటే....స్కయ్ లాబ్ పడుతున్నదేమో, కొంప కొల్లేరు కాబోతున్నదేమో...అని జనం జడుసుకు చస్తున్నారు.  
ఇంతకు ముందే...శ్రీనివాస్ అనే ఒక పీ.ఈ.టి. కి ఫోన్ చేశాను. "ఇంకా ఆఫీసులో ఉన్నారా? వచ్చేయ్యకపోయారా..." అని ఆందోళనగా అడిగారు ఆయన. పిల్లలు ఇంటికి వచ్చారో లేదో కనుక్కుందామని ఇంటికి ఫోన్ చేశాను. 
"డాడీ...ఇంకా రాలేదేమిటి? బైట అంతా బందు లాగా వున్నది," అని పదో తరగతి చదువుతున్న నా కూతురు ఫోన్ ఎత్తగానే అడిగింది. ఎవరిని కదిలించినా...తీర్పు గురించి మాట్లాడుతుంటే...నాకు ఒక రకమైన ప్రాణభయం పట్టుకుంది. రెండు దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. 
దృశ్యం-1
తీర్పు వస్తుంది, నేను సర్వీసింగ్ కు ఇచ్చిన కారు తీసుకోవడానికి ఆఫీసు నుంచి బైటికి వెళ్తాను. కారు తీసుకుని
బైటికి వెళ్తుంటే...ఒక గుంపు కారు ఆపుతుంది. (పిల్లి) గడ్డం చూసి....వేసేయ్యండ్రా...అని ఒక
కాషాయధారి అరుస్తాడు. కారు అద్దాలు పగలగొట్టేలోపు నేను నా మతాన్ని వారికి ఆవిష్కరించి...ఏదో ఫోజు కొట్టడానికి ఈ గడ్డం పెంచుతున్నానని...చెప్పాలి. రేపే గడ్డం తీసేస్తానని వారికి హామీ కూడా ఇచ్చి వేగంగా వెళ్లిపోవాలి...'జై శ్రీరాం' అనే నినాదం చేస్తూ. 

దృశ్యం - 2
కారును ఒక గుంపు ఆపుతుంది. "మారో..సాలె కొ.." అంటారు. తల్వార్ గాల్లోకి లేస్తుంది. నేను వెంటనే గడ్డం బాగా కనిపించేలా మొఖం బైటకు పెట్టి...ఉర్దూలో మాట్లాడాలి. 'మై పత్రకార్ హూ.." అని చెబితే లాభమో, నష్టమో తెలియదు. అది ఇప్పుడే చెప్పలేము. నా తీరు అనుమానం వచ్చిన వాళ్ళు నా మతం కనుక్కోవడానికి ప్రూఫ్ చూపమంటే? ఆ పని నా చేతులారా నేను చేయలేను. హే...అల్లా. బచావో. 
మొత్తానికి...తీర్పు వచ్చాక మనం బతికి బట్టకట్టగలమా? క్షేమంగా ఇంటికి చేరగలమా? రేపటి నుంచి పరిస్థితి ఏమిటి?  ఈ వెర్రి మత పిచ్చిగాళ్ళు...ఈ వాతావరణాన్ని వాడుకుంటారా? వంటి సవాలక్ష ప్రశ్నలు మదిని తొలుస్తున్నాయి. కొంత భూమి ఇంత దారుణం సృష్టిస్తున్నది?

ఎస్.ఎం.ఎస్.లను నిషేధించినట్లు ఈ ఛానెల్స్ ను (ముఖ్యంగా తెలుగు ఛానెల్స్ ను) కొన్నాళ్ళు నిషేధిస్తే బాగుంటుందని కొందరు, కోర్టులు తీర్పును పలు దఫాలు వాయిదా వేసి మీడియాకు, తద్వారా జనానికి ఆ అంశంపై ఆసక్తి చచ్చేట్లు కోర్టులు చేయాలని మరికొందరు అంటున్నారు.  మనుగడ కష్టమై, జీవనం దుర్భరమైన ఈ రోజుల్లో..ఈ అయోధ్య-మతం పెంట ఏమిటా? అని హృదయం ఘోషిస్తున్నది. అంత కష్టపడి తెల్లవాడిని పారదోలింది...ఇందుకా? అని బాధ వేస్తున్నది. మన మాట ఎవ్వడూ వినడు. 

ఈ భారత దేశాన్ని చూసి, ఈ మత పిచ్చి జనాలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.  టీ.వీ.ల వాళ్ళు అనుకుంటున్నట్లు/ కోరుకుంటున్నట్లు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకూడదని...తీర్పు తర్వాత ఒక్క ప్రాణమైన పోకూడదని కోరుకుందాం.  బతికి బాగుంటే...ఇంకో పోస్టులో కలుద్దాం. జై హింద్. జై భారత్. 

19 comments:

WitReal said...

ఈ చానెళ్ళ వల్లనైతేమి, ముందు జాగ్రత్త చర్యల వల్లనైతేమి, గత కొద్ది సేపుగా ఐదరాబాదు లో ఆటోలు కూడ దొరకట్లేదు ;(

Unknown said...

చాలా బాగా చెఫ్ఫారు.మీడియా మరియు రాజకీయనాయకుల సందేశాలు విన్టుంటే తీర్పు తరువాత తీసుకొనవలసిన ప్రతిచర్యను మరచిపోవద్దని గుర్తుచెస్తున్నట్లుగా వున్నది.

శ్రీనివాసరాజు said...

ఈ విశాల ప్రపంచంలో లేని రాముడు-అల్లా.. ఆ ఒక్క రెండెకరాలో.. మూడెకరాలలోనే వున్నాడంట, అదేంటో విచిత్రం.

ఈ విషయాన్ని గ్రహించనివారికి.. అక్కడ గుడి కట్టినా మసీధు కట్టినా అందులో ఏదేవుణ్ణి పెట్టి పూజించినా ఒకటే!

కొట్టుకోటానికి ఏదొక విషయం కావాలనుకునేవాళ్ళకు మతమే కాదు ప్రతీదీ ఒక సబ్జెక్టే. ఇక మీడియాకు సబ్జక్టుకానిదేది. కాదేదీ సబ్జక్టుకనర్హం.

శరత్ కాలమ్ said...

ఇప్పుడేమీ కాదేమో గానీ సుప్రీం కొర్టు తీర్పు వచ్చినప్పుడు మాత్రం గొడవలు జరుగుతాయేమో. సుప్రీం కోర్టుకే గనుక తెలివి వుంటే ఈ ఆంశాన్ని ఇంకో వందేళ్ళయినా నాంచాలి. అప్పటికి మనమయితే సేఫుగా ఈ లోకం నుండి బయటపడుతాము కాబట్టి మనకేమీ సమస్య వుండదు.

Saahitya Abhimaani said...

Ramu garu Welcome back. You are trying to come back with a BANG and your title for the post smacks of sensationalism only. You too are definitely a victim of media hype. Otherwise why you are coming out with those two most unlikely scenarious? Today I went to Office in my normal route, through a predominantly Muslim area and returned (after verdict)in the same route. Because of the Media hype, all roads were looking as if there was curfew and I was violating that.

"...ఎస్.ఎం.ఎస్.లను నిషేధించినట్లు ఈ ఛానెల్స్ ను (ముఖ్యంగా తెలుగు ఛానెల్స్ ను) కొన్నాళ్ళు నిషేధిస్తే బాగుంటుందని..."
This is a very good suggestion. Today afternoon, in the office when some of my subordinates were clamoring to leave early, I made a comment to quieten them that they were all victims of media hype and nothing would happen and instead of banning mass SMS, entire Media both print and electronic should have been banned from publishing and broadcasting for 3 days starting from 29th Sep to 1st October and allow them to resume their nuisance from Gandhi Jayanti. It would have saved crores of rupes spent for deploying troops across the Country and would have saved lakhs of man hours lost in the country today, as in many Offices employees were allowed go early, shops were closed, some offices even declared holiday today.

Just visualize one simple scenario. On 6th December, 1992 had BBC not given live telecast how many of us would have known about the demolition. It would have been a localized issue. With media blowing it out of proportion, a problem which has been there for decades, became a national phobia.

"....ఈ భారత దేశాన్ని చూసి, ఈ మత పిచ్చి జనాలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు...."

If not religious fervor, it would be party fervor. What is the difference between these two? In the country which started with a revolution in 1917 what happened? Instead of people being killed in the name of religion, people started to be killed in the name of Party, lakhs were killed or thousands of people were banished to Syberia to live under inhuman conditions. What was the difference? Human nature has to change. Religion or Party both are ploys by some self serving fanatics to control others and to ensure that they shall be at the top either wearing religious robes or party colors.

Unknown said...

రాముగారు ప్రజల లో లేని అయిడియాలని ప్రభుత్వమే ఇస్తునట్టు అని పిస్తోంది .ఎవడి జీవన పోరాటం లో వాడు బిజీ గా వుంటే తీర్పు వస్తోంది తన్నుకు చావకండి అంటూ మీడియా లో ఉదర గొట్టడం తో వోహో తీర్పు వొక వర్గానికి వ్యతి రేకం గా వస్తే వేరే వర్గం రెచ్చి పోవలేమో అన్న భావన నూరి పోస్తునట్టు గా వుంది . యి తీర్పు పుణ్యమా అని జీవితం లో మొదటి సారి ఆఫీసు నుంచి వస్తూ నా కార్ డ్రైవింగ్ ఎంజాయ్ చేశా రోజు హైదరాబాద్ లో ట్రాఫ్ఫిక్ యిలా గే వుంటే యెంత బావుణ్ణు .

machlipatnam said...

i pity the writer for losing hope ,which is clearly evident in the last line of the blog,"Bathiki Baguntey..... kalusukundam".I think times have changed ,even the mindsets of the population,and a positive attitude has been developed in every society,so how can there be an arrival of a negative impact.Unity is the Armour of Peace.the blogwriter is a pessimist, ,in my view,by developing imaginary negative impact into the blog readers.thank god we are optimistic.

Naresh said...

ఒకరకంగా చూస్తే మంచిదే కదా. కోర్టు చెప్పినది అందరికీ నచ్చాలని లేదు. గవర్నమెంటు ముందు జాగ్రత్త కొంత, మీడియా చేసిన అతి కొంత.. కలిపి నిప్పు రాకముందే ఆకులు పట్టుకునేలా చేసాయి.

Saahitya Abhimaani said...

Well known TV personality Shri Vinod Dua (Janavani fame of DD) quoted as saying in Pune

"...TV News Channels......low cost entertainment realty shows"

"....Some of the magazines like "Play Boy", "Debonair" never claim that they were into news. They mainly restrict themselves to producing what they are best at. That is being straightforward. But some channels despite remaining far away from news, call themselves news channels. They should skip such pretensions..."

"....the job of news should be in the hands of experts only. If Harsha Bhogle who gives brilliant commentary starts playing cricket too, then there will be a problem.

"....The way the language is spoken on national electronic media hurts badly. They areout there giving local tinge to a national language..."

Vinod Dua made the above comments while speaking on "Journalism....yesterday, today and tomorrow" in Pune on the invitation of Patrakar Sangh.

Courtesy our ever vigilent Babayigaru Phanibabugaru.

http://harephala.files.wordpress.com/2010/09/www-expressindia-com.pdf

astrojoyd said...

@sarat-too selfish yar...

katta jayaprakash said...

Media in a situation like Ayodhya verdict is mad and sadistic and always exploit the people for their selfish ends and there is no end to this malady as it is genetic and familial and none is innume to it and we have to bear it.So far many bitter criticisms,comments on media but how many got changed and transformed into ethical,moral and proffesional media persons with human touch?

JP.

deepu said...

prajalemo emi godava jaragakunda unte prashanthanga untaru...mari media(TV) godavalu eppudu jaruguthaya ani yeduru chusthuntaru.....what a media sir ji.....

seenu said...

Ramu garu,
Today a news item flashed almost all channels...idols or rama, seeta etc found in godavari river at mancherial or Adilabad...people flooding to the site and demanding a temple in the spot...almost all the media persons there, knows the secret,why those idols are there..those are a nearby village temple's old and replaced idols. infact everybody throws old pooja samagri in a river.. somebody planned well, while ayodhya issue is going on...they made a story...every tv also knows this... but why they avoiding to show tail end story? till now at 9pm there is no update shown in our tvs...think about it...

Anonymous said...

రాము గారూ!
@పాపం మీరు కాస్త కవి హృదయంతో బతికి బాగుంటే.. అని వ్రాసినందుకు మచిలీ పట్నం గారికి దొరికిపోయినట్లున్నారు. టూ పెస్సిమిస్టిక్ అంపించుకున్నారు. కానీ, తీర్పు తర్వాత ఒక్క ప్రాణమైన పోకూడదని కోరుకుందాం' లో ఆప్టిమిజం కనపడలేదా వారికి.
@శివ గారు.
మనం ఏ విషయాన్నైనా ఎప్పుడూ ఒకే కోణంలో చూస్తూ పోకూడదండీ. ఎప్పుడూ అతిచేసే మీడియా ఈసారికి మాత్రం చాలా బాధ్యతతో మసలుకుంది. ప్రజలలో వచ్చిన పరిణతికి తోడు మీడియా కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా ఇంకా రకరకాల న్యాయమార్గాలు ఉంటాయనీ, సెన్సిటివ్ ఇష్యూ అయినందున తీర్పు ఏ ఒక్కరికో అనుకూలంగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వచ్చేందుకే అవకాశం ఉందంటూ విడమరచి చెప్పడంవల్లే ఇంత ప్రశంతత వచ్చింది అనేది నా అభిప్రాయం.
డిసెంబర్6, 1992 నాడు ఏ మీడియావళ్ళనైతే గొడవలు జరిగాయని చెబుతున్నామో అదే మీడియా ఈ రోజు బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించింది. మరో విషయం - బల్క్ ఎస్.ఎం.ఎస్ లతోపాటు మీడియాను కూడా మూడు రోజులపాటు నిషేదించియుంటే.... అంటూ వ్రాసిందికూడా సబబుగా అనిపించలేదు. 21వ శతాబ్ధిలో కూడా విషయాలను దాచడం ద్వారా ఏదో సాధించాలనుకోవడం ఎలా కరక్ట్?
మీరంటున్నట్లు మీడియాను కూడా మూడు రోజులపాటు నిషేదించి.... కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని మిగిలించడానికి ట్రూప్స్ ను కూడా డెప్లాయ్ చెయ్యకుండా ఉండియుంటే....ఏమీ జరడేది కాదని ఎలా అంటారు? ఆనాడు ఒక బాధ్యతాయూత పదవిలో వున్న ముఖ్యమంత్రి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నమ్మి అచేతనంగా ఉన్నందుకు ఎంత మూళ్యం చెల్లించారు?
I say that all has gone well due to collective efforts of 'all' including media, administrators, politicians and more importantly the 'we', 'the people of India'.
@రవిగారు!
"ఎవడి జీవన పోరాటం లో వాడు బిజీ గా వుంటే".... మరి డిసెంబర్6, 1992 నాడు అలా లేరా? సెంటి'మంటలు' రాజేసే వాళ్ళున్నంతవరకూ ఏ జీవన పోరాటం లో ఎంత బిజీ గా వున్నా అమాయక జనాలు తన్నుకు ఛస్తూనే ఉంటారు. విషయం బాగా పాతబడిపోవడం, ఓ భుజానికెత్తుకుని ఊరేగినా జనాలు ఓట్లేసే పరిస్థితులు లేకపోవడం, సంకీర్ణ శకం పుణ్యమా అని కాశాయం ను 'కశాయం' గా భావించాల్సి రావడం వంటి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయిలెండి. ఏది ఏమైనా రాబోవు రోజుల్లో సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఇది శుభ సంకేతమనుకోవచ్చేమో. ఏమంటారు?

sudhakar reddy said...

mee blog lo updates yam ravadam ledu prati roju net open chesi 1st mee blog chuddam alavatu ipoindi eppudu danni taginchali.yandukante updates yam levu okavela vunna adi expire news meeru istunaru.okavela meeku blog maintain cheyadaniki time leka pote daniki maro margam alochinchali tappa meeku kaalivunte post echi lekapote maneyadam adi anta manchi paddati kaadu....edanta chadivi naa blog naa istam antara.......!appudu meeku sata koti namaskaramulu.

Saahitya Abhimaani said...

రెడ్డిగారూ మీరు "....విడమరచి చెప్పడంవల్లే ఇంత ప్రశంతత వచ్చింది అనేది నా అభిప్రాయం....." అంటూనే మనం ఒకపక్కే చూడకదండీ అంటూ నాకు సలహా దేనికి? ఏం నేను చెప్పేది అభిప్రాయం కాదా? అది నా అభిప్రాయమని మీరు ఎందుకు గౌరవించరు. ఇప్పటికీ నా అభిప్రాయం, మీడియా అతి వల్లే ఈ సమస్య ఇంతవరకూ వచ్చిందని, మీడియా అతి ప్రవర్తనవల్లే ఆ రోజున అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం వచ్చిందని. ఈ "21వ శతాబ్దంలో కూడా ఇలా విషయాలు దాచుకుని" అంటున్నారు మీరు. ఏమిటి 21వ శతాబ్దపు గొప్ప!! మానవ మనస్తత్వం అదే. అందులో మార్పెమీ లేదు. ఇంత గొప్ప మీడియాలో, మైన్ లైన్ మీడియాగా పిలవబడుతున్న కొన్ని ఆంగ్ల చానేళ్ళు, వారి చర్చలలో ఎప్పుడూ ఆ పడిపోయిన మశీదు గోపురాలనే బాక్ గ్రౌండుగా వాడుకోవటంలో వాళ్ళ విషపు ఉద్దేశ్యం ఏమిటి? మూడురోజులు నెషేధించటం కాదు అటువంటి విషాన్ని కక్కే చానేళ్ళను మీడియాగా పిలవకూడదు, మీడియాకి ఇచ్చే గౌరవం ఇవ్వనక్కర్లేదు. ప్రతిదీ లైటుగా తీసుకోవటం, పనికి రాని లిబరిలిజం వల్లే మనం ఈ నాడు ఎవరేది చేసినా పడి ఉండే దశకి చేరుకున్నాం. ఆ ఇజం, ఈ ఇజం అని మన నెత్తినేసి రుద్ది, జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసే భాగంగా మీడియాలో తాము కూడ భాగమే అనిచెప్పుకుంటూ ఫిప్త్ కాలంగా కొన్ని చానెళ్ళు పని చేస్తున్నాయి.

deepu said...

ramu sir mi dwara nenu kotha vishayalu eppatikappudu telusu kuntanu.raajakeeyalu ante yela untayo naku telidhu.meeru rase stories valla andhari gurinchi telusukoni, andhari abhiprayalu telusukuntunnanu..yeppatiki appudu kotha vishayalatho blog nu update cheyavalasindhi ga manavi...ippudu generation ki me updates avasaram.

Anonymous said...

@శివ గారు!
మీ అభిప్రాయాలను నేనెప్పుడూ గౌరవిస్తాను. కానీ ఈసారికి మాత్రం మీడియా వాళ్ళు అతిచేయలేదనే నా అభిప్రాయం. ఎక్కడైనా ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే 'వెంటనే' చూపించాలనే దరిద్రపుగొట్టు భావనను వాళ్ళు వొదులుకోనప్పటికీ జనాలకు శాంతి మంత్రం బోధించడంలో మాత్రం 'కొనియాడదగిన ' కృషి చేసారనేది కాదనలేని వాస్థవం.

Saahitya Abhimaani said...

Thank you Reddy garoo. Some English Channels tried their best to incite passions by asking all nonsense and provocative questions. But Listeners/Viewers slapped them on their faces. These shameless anchors both male and female are continuing. Most of the viewers for English Media are upper middle or middle class who are basically "why should I both" batch and so the peace is preserved.

That much for the so called main line English media, which is till trying to stoke the fires with meaningless panel discussions.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి