బీబీసీ అనగానే... సాధారణ పాఠకులకు 'నిష్పాక్షికత', 'వృత్తి నిబద్ధత' వంటివి గుర్తుకు వస్తాయి. అలాంటి బీబీసీ తెలుగు వార్తా ప్రపంచంలో కొత్త శకం ప్రారంభించింది... ఈ రోజున. అదే తెలుగు వెబ్ సైట్ ఆవిష్కరణ.
బీబీసీ కాచివడపోసిన మంచి జర్నలిస్టుల బృందం... ప్రత్యేక తర్ఫీదు పొంది... ఒక రెండు మూడు నెలలుగా దేశ రాజధానిలో ఇందుకు వేదిక సిద్ధం చేసింది. తెలుగు జర్నలిజం లో తమకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్న సీనియర్ జర్నలిస్టులు ఈ బృందంలో ఉన్నారు. దాదాపు 35 మంది వృత్తి నిపుణులతో బీబీసీ ప్రసారాలు ఆరంభించింది.
వెబ్సైట్ (పై ఫోటో హోమ్ పేజీ) మెనూ లో పెద్ద హడావుడి లేకుండా న్యూస్, స్పోర్ట్స్, వెదర్, రేడియో ఉన్నాయి. లాస్ వేగాస్ లో కాల్పులకు సంబంధించిన వార్త, దాని ఫోటోలు సింహభాగం ఆక్రమించుకున్నాయి.
భజన పత్రికలు తమ వెబ్ ఎడిషన్స్ లో కూడా ఆ కార్యక్రమాన్ని సాగిస్తూ... విసుగు పుట్టిస్తున్న ఈ తరుణంలో బిబిసి తెలుగు వెబ్ సైట్ ప్రపంచంలోని తెలుగు వార్తాప్రియుల వార్తల దాహాన్ని తీరుస్తుందని ఆశిద్దాం.
"నిఖార్సయిన వార్తలకు, విశ్లేషణాత్మక కథనాలకు నమ్మకమైన వేదిక.. బిబిసి తెలుగు. లైక్.. చేయండి.. షేర్ చేయండి... అభినందనల వర్షం కురిపించండి. విలువైన సూచనలతో బిబిసి తెలుగు జర్నలిస్ట్ మిత్రులను ముందుకు నడిపించండి," అని మిత్రుడు పసునూరి శ్రీధర్ బాబు తన పేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. ఇండియా టుడే తెలుగు మాగజీన్, హెచ్ ఎం టీవీ, వీ 6 వంటి ఛానెల్స్ లో కీలక భూమిక పోషించిన ఆయన బీబీసీ టీమ్ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరొక సీనియర్ ఎడిటర్ జీ ఎస్ రామ్ మోహన్ ఆధ్వర్యంలో ఈ బృందం కష్టపడుతున్నది.
అంతేకాకుండా... రోజూ రాత్రి పదిన్నర కు బీబీసీ బృందం రూపొందించిన బులిటిన్ "బీబీసీ ప్రపంచం" శీర్షికతో 'ఈ-టీవీ' తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో అర్థగంట పాటు ప్రసారమవుతాయట.
గాంధీ గారి జయంతి రోజు కూడా అయిన ఈ రోజు టీవీ 5 వారి కన్నడ ప్రసారాలు కూడా మొదలు కాబోతున్నాయండోయ్.
అల్ ద బెస్ట్...

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి