Saturday, October 7, 2017

'ది హిందూ' కు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా నోటీసు

దక్షిణాదిలో ప్రతి విద్యావంతుల కుటుంబం, విద్యార్థులు, ఉద్యోగార్థులు తప్పక చదివే 'ది హిందూ' దినపత్రిక రిపోర్టర్ వేదికా చౌబే  బాధ్యతారాహిత్యం వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. చివరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి షో కాజ్ నోటీస్ అందుకోవాల్సి వచ్చింది.

ముంబాయి ఎల్ఫీన్ స్టోన్ రైల్వే దగ్గర తొక్కిసలాటలో చిక్కుకున్న ఒక మహిళకు మానవత్వంతో సహాయపడుతున్న ఒక వ్యక్తి ఆమెతో  పిచ్చిగా వ్యవహరించినట్లు ఒక ఎనిమిది సెకండ్స్ నిడివి గల వీడియో ఆధారంగా ఆ జర్నలిస్టు రాసిన వార్త ( శీర్షిక: Dying woman molested, video shows) పత్రికకు చెడ్డ పేరు తెచ్చి చిక్కుల్లో పడేసింది.  దాన్ని పత్రిక ముంబయి ఎడిషన్ లో ప్రచురించింది. కొన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా దీన్ని తమ నివేదికల్లో ప్రస్తావించాయట. వార్త చదివిన వారికి జుగుప్స కలగడం, మానవత్వంపై నమ్మకం సన్నగిల్లడం కనిపించకుండా జరిగే నష్టాలు. 
నిజానికి ఆ పూర్తి నిడివి (40 సెకండ్స్) వీడియో చూస్తే ఆ యువకుడు తొక్కిసలాటలో చిక్కుకున్న మహిళను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా తేలింది. పోలీసులు కూడా ఇదే నిర్ధారించారు. ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే 'ది హిందూ' ఒక క్షమాపణ ప్రచురించింది.

ఈ తప్పుడు వార్తపై కేంద్ర సమాచార ప్రసార శాఖ సూచన మేరకు ప్రెస్ కౌన్సిల్ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

సోర్స్: http://www.opindia.com
(Note: Since this is a very good case study for journalism students and journalists, in view of public purpose we have taken the show-cause notice from opindia.com with a sincere thanks).

1 comments:

సన్నాయి said...

అత్యంత జుగుప్స ఏంటంటే , ఈ వార్త ప్రచురించిన తెలుగు పేపర్స్ , ఈ సవరణ ని నామ మాత్రంగా అయినా ప్రస్తావించకపోవడం .
అది మన తెలుగు పత్రికల నిబద్దత . ఏ రాజకీయపార్టీ సంక నాకలా అని చూసే ఈ పత్రికలు , ఇలా సవరణలు వేయాలి , తప్పు ఒప్పు లాంటివి ఎప్పుడో వదిలేసాయి

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి