Sunday, January 17, 2010

మహా న్యూస్ లో....'రాంగోపాల్ వర్మ అండ్ ఐ'

దివారం రాత్రి 'మహా న్యూస్' లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద "నేను" అనే ఒక కార్యక్రమం వచ్చింది. ఆ కథనం చాలా ఆసక్తిగా సాగింది. ఈ మనిషి నాకు ఒక పట్టాన అర్థం కాడు కాబట్టి దీన్ని చాలా ఆసక్తిగా చూసాను. 'రాంగోపాల్ వర్మ-ఐ (నేను)' అన్న థీంతో రాసిన ఆ కాపీ చాలా బాగుంది.  


నాకు ఈ సృజన శీలత పొంగిపొర్లే సినిమా/ టీవీ కళాకారులతో ఒక సమస్య ఉంది. వీళ్ళు ఏదో ఐడియా తో కథ అల్లుతారు...సృజనాత్మకత పేరుతో జనం మీదికి వదులుతారు. కథకులు, దర్శకులకు ఉన్న ఈ సృజనాత్మకత (క్రియేటివిటీ) వల్ల...ఎన్ని రకాలుగా మర్డర్లు, రేపులు చేయవచ్చు? కాలేజ్ లో ఆడపిల్లలను ఎన్నేసి రకాలుగా ఏడిపించవచ్చు? వారిని ఎలా ట్రాప్ చేయవచ్చు? అసలు ప్రేమ అనే ముగ్గులోకి దింపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? పాఠాలు చెప్పే టీచర్లను ఎలా ఫూల్ చేయవచ్చు? ముఠాలు ఎలా కట్టవచ్చు? జనాలను ఎలా దోచుకోవచ్చు?...వంటివి జనాలకు తేలిగ్గా తెలిసి పోతున్నాయి. అంటే....వారే పరిశోధన చేసి ఈ దుష్కార్యాలలో వివిధ యాంగిల్స్ ను ప్రజలకు ఖరీదుకు అందజేస్తున్నారు.


ఈ సినిమాలు, టీవీ సీరియళ్ళు...జనాలకు గైడ్ గా పనికి వస్తున్నాయి. యువతపై ఈ సినిమాల ప్రభావం చాలా ఎక్కువ వుంటుంది....కాబట్టి మన సృజనాత్మకత సమాజానికి పొరపాటున ఏమైనా హాని చేస్తుందేమో అన్న సామాజిక బాధ్యత ఈ సృజనశీలురకు ఉండి తీరాలి. అయితే...అది మా పని కాదని వర్మ తేలిగ్గా చెప్పేస్తున్నారు.


ఇలా సామాజిక బాధ్యతా...పాడూ లేకుండా...రక్తపాతం, భూతాలూ, దయ్యాలు, సెక్స్ ప్రధానంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాంగోపాల్ వర్మ  నాకు అనిపిస్తారు. నాకు అనిపించింది చూపిస్తా...చూస్తే చూడండి...అంటారాయన. అందుకేనేమో..."రాంగోపాల్ వర్మ మైనస్ 'నేను' ఈజ్ ఈక్వల్ టు నథింగ్," అని తనికెళ్ళ భరణి గారు ఈ కార్యక్రమంలో వేరే కాం టెక్స్ట్ లో చెప్పారు. 
నిజమే...భరణి గారు అన్నట్లు...."ఇలాంటి కళాకారులు తమ ఆత్మానందం కోసం సినిమా తీయడమో, బొమ్మ గీయడమో చేస్తారు. దాన్ని చూస్తే చూడండి అని జనం మీదికి వదులుతారు." మరి ఇలాంటి వారికి సమాజ హితం పట్టదా? అన్న ప్రశ్న వేధిస్తున్నది.


వర్మ గారి సినిమా..."శివ" నేను చూసాను. చాలా పవర్ఫుల్ మూవీ. అందులో నాగార్జున సైకిల్ చైన్ను ఒంటిచేత్తో తెంపి ఇతరులను కొట్టే దృశ్యం చాలా మందికి ప్రేరణను ఇచ్చింది. అప్పట్లో అన్ని చోట్లా అదే చర్చ. ఆ సినిమా చూశాక...కాలేజ్ లలో బ్యాచులు మొదలయ్యాయంటారు. 


అలానే...'రంగీలా' అనే సినిమాలో ఊర్మిళ అనే అమ్మాయిని తీవ్రంగా ఎక్స్ పోజ్ చేసి చూపారాయన. అప్పటికే సముద్రపొడ్డున తడి బట్టలతో పరిగెత్తే హీరోయిన్లు...ఆ తర్వాత గిరగిరా తమకంతో నడుము తిప్పడం ప్రారంభించారు. ఊర్మిళ తిప్పిన తిప్పుడుకు చాలా రోజులు చాలా మంది మిత్రులు కోలుకోలేదు. అలాగే...దయ్యాలు, భూతాలూ, అండర్ వరల్డ్ కథలు. "ఆయన మన అదృష్టం బాగుండి...బాలివుడ్ కు తరలిపోబట్టి సరిపోయింది లేకపోతే...ఈ క్రియేటివిటీ పేరిట...ఇంకాస్త భీభత్స కాండ జరిగిపొయ్యేది," అని ఒక మిత్రుడు అన్నాడు.


జరగని వాటిని ఊహించి....శక్తిమంతంగా సినిమాగా తీసి జనం మదిపై ప్రభావం పడేలా చేయడం దారుణం కాదా?  వారిది నిజంగా సృజనాత్మకతా? క్షుద్ర సాహిత్య సృష్టా?  వర్మ లాంటి అత్యంత తెలివిగల వారు కొన్నాళ్ళ పాటు కమర్షియల్ యాంగిల్ కు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా...పాజిటివ్ కథాంశాలను స్వీకరించి ప్రయోగాలు చేస్తే బాగుణ్ణు. ఎవడికి తెలుసు...అవి సూపర్ డూపర్ హిట్ కావచ్చు. అన్ని వృత్తులలో వారి నుంచి నైతికతను ఆశిస్తూ...ఇలాంటి శక్తిమంతమైన మాధ్యమాన్ని సృజనాత్మకత పేరిట పెద్దగా పట్టించుకోకుండా ఉండడం సమంజసం కాదు. సెన్సార్ బోర్డులు నామ్ కే వాస్తే...గా మారడం....చేటు చేసే చెత్త ఐడియా లు కళా పోషణ పేరిట...ప్రశంసలు అందుకోవడం విచిత్రం. 

6 comments:

Vasu said...

అయినా మెయిన్ స్ట్రీం సినిమా దర్శకులలో సమాజ హితం లాటి పేద్ద పేద్ద విషయాలు పట్టే వాళ్ళెక్కడ ఉన్నారు ఇంకా. ఎంత త్వరగా డబ్బు సంపాదించాలి అని తప్ప.
నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ ధోరణి మీడియా (ప్రింట్ అండ్ టీవీ) లో ఇంకా ఎక్కువ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు క్రైం వాచ్, తెలుగు సీరియల్లు లాటి వాటి కంటే ఎక్కువ నష్టం ఏం చెయ్యవు లెండి.

Anonymous said...

now sensor board got a responsible person with social awareness as its member (shireesh bharadwaj the great son in law). hats off to govt of ap.

friend said...

rojoo telugu paperlalo vache konni mukhyamyna vartalu kooda objectivega review chyadam, alage print medialo ravalisina kotta pokadalanu kooda mee bloglo charchiste baguntundi. enta sepoo vadi meeda veedu, veedi meeda vadu taraha comments enduku mitrama....................

రవిచంద్ర said...

>>మన సృజనాత్మకత సమాజానికి పొరపాటున ఏమైనా హాని చేస్తుందేమో అన్న సామాజిక బాధ్యత ఈ సృజనశీలురకు ఉండి తీరాలి.

పొరపాటున కాదు నిజంగానే కీడు చేస్తున్నాయన్నది నా అభిప్రాయం. సమాజంలో క్రమంగా పెరుగుతున్న అశాంతికి సామాజిక బాధ్యత లేని దర్శకులు కూడా కారణమే...

రవిచంద్ర said...

>>మన సృజనాత్మకత సమాజానికి పొరపాటున ఏమైనా హాని చేస్తుందేమో అన్న సామాజిక బాధ్యత ఈ సృజనశీలురకు ఉండి తీరాలి.

పొరపాటున కాదు నిజంగానే కీడు చేస్తున్నాయన్నది నా అభిప్రాయం. సమాజంలో క్రమంగా పెరుగుతున్న అశాంతికి సామాజిక బాధ్యత లేని దర్శకులు కూడా కారణమే...

Anonymous said...

కుల ప్రాతిపదికన ఉద్యోగాలు, అర్హత లేకున్నా మన కులపోడు అని పదోన్నతులు ఇచ్చే మహా టీవీ లో ఇంత కన్నా గొప్ప గా ఏమి జరుగుతుంది .
చివరికి బిజినెస్స్ డెవెలప్మెంట్ టీం లో కూడా అర్హత ఉన్న వాళ్ళని, తొక్కుతుంటే ఇంక ఏమిటి చెప్పేది. ? చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ..పెద్ద స్థాయి వరకు అందరూ కుల ప్రాతిపదికన సిండికేట్ గా ఏర్పడితే....అది సంస్థకి చాలా ప్రమాదం .

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి